Saturday, August 15, 2015

తేజ డేన్సు( ఆగస్టు 15 సందర్భముగా )

సభికు లందరు మౌనము నభినయించ
తేజ చేసెను నృత్యము దివ్యముగను 
ప్రేక్ష కజనము జేజేలు  ప్రియము తోడ 
పలికి రప్పుడు మఱి యును  బహుమ తులను 
నంద జేసిరి వారలా  నంద మొంది

చక్కని యాసభన్మిగుల సాహస మొప్పగ నృత్యముం సదా
చొక్కపు ధైర్యమున్గలిగి  జోడయి సంతస మప్పుడున్ దగ
న్నక్కున జేర్చియా నటన నచ్చెరు వందగ జేసెనో గదా
యక్కట యెంతగా నెదిగె  నమ్మరొ మీరును గంటిరే  గదా

ఆడి పాడి నంత యలసిపో తివిగద
తెచ్చి యిత్తు పాలు  తేజ ! నీకు
త్రాగి నిదుర పొమ్ము తాతమం  చముమీద
యేసి  వేసికొనుమ యిష్ట మైన

ఎంత చక్కని  నృత్యము యేమి హావ
భావములవియ బహు చిన్న వయసు లోన
వర్ణ నీయము గాద ది పరమ పురుష !
చూడ వలయును నానాటి వేడుకను


సకల శుభములు గలిగించు  శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటి కినిరెప్ప  యట్లయి కాచు గాత !
యెల్ల వేళల తేజును జల్ల గాను


No comments:

Post a Comment