Friday, January 29, 2016

అప్పులు


అప్పులుసేయుట సులభము
తప్పకయవితీర్చవలయు దానే యెపుడున్
అప్పుల అప్పారావుగ
నిప్పుడమిని బేరువడకుమీశ్వర! నీవున్

Sunday, January 24, 2016

పద్య రచన -భ క్తికి పరీక్ష

భక్తి మిన్న యనుట పరమస త్యమనియు 
తులసి దళపు  మొగ్గు దెలియ పరచె 
సత్య దలపు లన్ని సత్యదూ  రములని 
తెలియ జేసె గృష్ణు తెలివి గాను 

తెలుగ దేల నీకు తెలుగు బిడ్డ !

ఆంగ్ల భాష చదివి  యాం గ్ల దేశమునందు
వాసముండి  యకట  భాష ణంబు
తెలుగ దేల నీకు తెలుగు బిడ్డ !యికను
నాం గ్ల భాష పలుకు ననవ రతము


చేతులారంగ

చేతులు గల్గినన్ శివుని సేవలు సేయని వాడునున్ సదా 
భీతుడు కాక నాహరిని పేర్మిని కీర్తన చేయ కుండ గన్ 
బ్రీతిని నెప్పుడున్ దయను ప్రేమను సత్యము దాదలంపడో 
నాతని పుట్టుకే భువిని మాతల గర్భము చేటుగా దగున్ 

చేతులారంగ

కరముల్ మోడ్చి శివార్చనాది ఘన సత్కార్యావ హీనుండునున్
హరి కీర్తింపక వక్త్ర మించుక సునాయాసంబు నన్నున్నయున్
కరుణన్ సత్యదయాది సద్గుణములం గాంక్షింప నేర్వండొ యీ
ధరణిన్ వాడు జనింప నేటికి కులోద్ధారంబె తాదల్లికిన్        

దత్త పది -ఆవు -మేక -కుక్క -పిల్లి (భారతార్ధము )

తామమే కమై కౌరవుల్దండి జేయ
యావులింతలు మానుచు నన్న !భీమ !
భీతి గంపిల్లి  వారి ని భీ  తు జేసి 
 వారి వదలకు క్క  డగించు పవన  సుతుడ !

పద్య రచన -చేతు లారంగ ..............

శివ పూజ లేని కరములు 
భవు కీర్తన లేని నోరు వ్యర్ధము సుమ్మీ 
లవ మాత్ర నిజముకరుణ లు 
 నెవనికి మఱి యుండ బోవొ యెందుకు బ్రదుకన్ 

Friday, January 22, 2016

నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?

నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
మిన్నగ నుండునే గదయ  మేదిని భూజను లంద రున్సదా
మన్నన లిచ్చిరా కవిత మాన్యము పూజ్యము నంచు నెప్పుడు
న్నన్నయ  తిక్కనాదులది నాణ్యత గల్గిన దేభువిన్గదా 

పద్య రచన -ఫిల్టరు కాఫీ

కాఫీ గ్లాసుల  జూడగ
గాఫీతో బాటు నురగ గప్పున నుబికె
న్గాఫీ రుచినిo  జూడగ 
నే ఫిల్టరు కాఫియనుచు నే నను కొంటిన్ 

Thursday, January 21, 2016

పద్య రచన -సైకిలు -తాళము

చెప్పులు పోవుట వలనన
తప్పని సరి భద్ర పరచదా సైకులుకున్
గప్పయు తాళము వేసెను
తప్పదు మఱి యటుల జేయ దాపురి కము గాన్


గడ్డి పూవు విలువ కడుప్రి యమ్ము

బంతి మొదలు గాగ బరగుపూవు లులభి
యించు ,దొరకవెచట యీయ లరులు
అంద చంద ములను నందించు పూవగు
గడ్డి పూవు విలువ కడుప్రి యమ్ము

Wednesday, January 20, 2016

హృద్రోగము మేలుసేయు నెల్ల జనులకున్

భద్రత లేకను వచ్చును
హృద్రోగము, మేలుసేయు నెల్ల జనులకు
న్భ ద్రాద్రి రాము సేవలు
హృద్యముగా జేయునె డల యెప్పుడు నచట న్ 

పద్య రచన -సతి పుట్టింటికి నేగిన ...........

సతి  పుట్టింటికి నేగిన
పతియే యిక చేసికొనును వంటను దానే
నతిగా కాకను పొదుపుగ
మితముగ నే  వండుకొనును  మెచ్చిన వాటిన్ 

Tuesday, January 19, 2016

కుంభ కర్ణుండు కర్ణుండు గూ డిరొ కట

ఆట లాడగ వచ్చియే  యాప్తు లగుచు
కుంభ కర్ణుండు కర్ణుండు గూ డిరొ కట
యొకరి మించిన వారొక రుగనిరువురు
కండ బలమును జూపించి కలయ పడిరి 

పతి పరదేశంబేగిన ............

పతి పరదేశంబేగిన
సతికుండును బాట్లు  భువిని ,సంసారమును
న్నతలా కుతలమ యగునిక 
పతులే మఱి సతుల కెపుడు   ప్రాణస మానుల్ 

Monday, January 18, 2016

పద్య రచన -ఆడపిల్ల ఆటో

ఆడ పిల్లను జూడుమ యాటొ నడుపు
చుండె  నచ్చట చక్కగ చోద్య ముగను
నేటి యాడు వా  రలిక  నేర్వ నట్టి
విద్య  లేదార్య !పుడమికి  వింత యదియ

రావణు కధ లేక వ్రాసె రామాయణ మున్

ఏవిధముగ జూ చినయట
రావణు కధయే గదమరి రామాయణ ము ,
న్నీ వచన మెట్లు పొసగును
రావణు కధ లేక వ్రాసె రామాయణ మున్  

Sunday, January 17, 2016

అపరాధము కాదుతల్లి నాశ్రమ మంపన్

 తపములు సేసిన దొరకున ?
విపరీతపు బుధ్ధి కాక ,విడుతురె భార్య
న్నపమార్గము నిట్లు పలుక
న పరాధము కాదుతల్లి  నాశ్రమ మంపన్


పద్య రచన -సిరిగల వానికి .............

ధనము  గలవాని కెం దరు  దార లున్న 
నుండ వచ్చును ,శంకర ! యొండు చాలు 
గంగ మాకిచ్చి  పార్వతి గై కొనుము ర 
తిరిపె  వగుటను నిట్లంటి   దేవ !  నతులు 

Saturday, January 16, 2016

భార్యకు భాష రాదనుచు బల్కెను బ్రహ్మ సభా ముఖమ్ము నన్

భార్యకు  భాష రాదనుచు బల్కెను బ్రహ్మ సభా ముఖమ్ము న
న్నార్యులు నమ్మిరే ? యిదియ భార్యకు  భాషను రాదనంగ నా
 నార్యుడు బ్రహ్మగా రొదవ నాయనకు న్మరి పట్టెనా  దగన్
వార్యము గా నిపిచ్చి  యట ,భారత మాతకు  వందనం బు సూ 

పద్య రచన -తల్లి ప్రేమ

కోటి  రూప్యము లార్జించు కొడుకు కంటె 
తల్లి దండ్రుల సరిజూడు  తనయు  డరయ 
యుత్తము డనుచు  బొగడు దు  రోసుజాత !
తల్లి యందున జూడుము దైవ మునిల 

Friday, January 15, 2016

దైవ నింద కడుహితమ్ము గూర్చు

పాపమొద వు మనకు పనియులే కనుజేయ
దైవ నింద ,కడుహితమ్ము గూర్చు
సాటి మనుజునికిల  సంతసమును జేయ
పరుల సంత సమ్ము భవ్య ముగద 

బసవా !


పసుపున్ కు౦కుమ బొట్టు వెట్టెదము నీ ఫాలాన. | శృ౦గమ్ములన్ 
మిసిమిన్ దీరగ. జేసి వాటి నడుమన్ మేలైన పూలు౦తు | మీ
కుసుమ గ్రైవము వైతుమయ్య మెడలో కొ౦డ౦త ప్రేమాస్పదన్ |
బసవా ! ద౦డము వెట్టి కొల్తుము నినున్భ ర్గు౦డు హర్షి౦పగా

Thursday, January 14, 2016

అయ్యప్పలు -జ్యోతి దర్శనము

నలుబది దినములు  సాములు 
పలురకముల బాధలోర్చి పాయని భక్తి
న్నల యాశబరి మలేశుని 
వలయాకా రమున జూచి వలరుదు రార్యా !

పద్య రచన -గాలి పటము

బాలు రక్కడ ముద్దుగా పాణి యందు 
గాలి పటముల దారము గట్టి గాను 
బట్టు కొనుచును  నొక గాలి పటము  నెగుర 
వేయు చుండిరి చక్కగా విజయ ! చూడు 

చింత లెన్నియొ కూర్చు సంక్రాంతి మనకు

చింత లెన్నియొ కూర్చు సంక్రాంతి మనకు
ననుట కాదా ర్య ! సత్యము ,యదియ కూర్చు
 సుఖము సంతోష మాదిగ సౌఖ్యములను
నుత్తరాయణ మీరోజు నుండి మనకు 

శుభాకాంక్షలు

భువిని నిమిష కవికులమ్ము పొందె పేరు
మంచి మర్యాద లెరిగిన మాన్యులనుచు
నందు సాయినామముగల యార్యుడొకడు
జనన మొందియు విఖ్యాత చరితుడయ్యె

వాని యేకైక పుత్రుగా బడసినట్టి
సిధ్ధివిఘ్నేశునకునిక చేయదలచె
ను పనయనమును శాస్త్రమునొప్పురీతి
మంచి కార్యము జేయుము మాననీయ!

వేద మంత్రాల సాక్షిగ  వేద విదులు
చేయు చుండిరి యొడుగును  సిద్ధి  విఘ్ను
నకట వైభవో పేతము నాయ నగను
 కాణి పాకంపు విఘ్నేషు  కనుల యెదుట

మాత గాయత్రి మంత్రమ్ము మహిమ నెరిగి
దినము దినమును దప్పక మనన జేయ
శాంతి సౌఖ్యము లొ నగూరు సర్వు లకును
కాన పఠ నమ్ము జేయుము కలుగు సుఖము


ది . 17-2-2016 తేదీన సిద్ధి విఘ్నెశు ,ఉపనయనము సందర్భముగా
రచన =పోచిరాజు సుబ్బారావు 
Wednesday, January 13, 2016

భోగి పళ్ళు వోయ బోయె నుసురు

మంచి బుద్ధి గలిగి మాన్యుడ గునట గ
భోగి పళ్ళు వోయ, బోయె నుసురు
భోగి మంట బడగ భుగభుగ   మని కాలి
జాగరూకత మవ సరమ  యెపుడు

భోగి మంట

భోగి మంట జూడు భుగభుగ రవమును
జేయు చుండి యఘము జిదుము చుండె
భోగి మంట  జూచు భూజను లెల్లరు
పుణ్య వంతు లార్య! పుడమి యందు

సంక్రాంతి శుభా కాంక్షలుభోగ భాగ్యములు గలుగు  భోగి నాడు
సిరియు సంపద లువిరియు శివుని గృపను
పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
పాడి పంటల వృద్ధియు బాగు గాను
కనుము  దినమున మొదలిడు ననుట నిజము .

సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

Tuesday, January 12, 2016

కుజనులెల్ల సజ్జనులెయీకువలయమున


కుజనులెల్ల సజ్జనులెయీకువలయమున
మొదట, పరిసరములబట్టి మోడులగుట
వారిమనసులు కతమున మారిరటులు
కానిజనులెల్ల రుసుజను లేనునరయ

కలడందురు,,,,,,,,,,,,,,


కలడందురురావణుడిల
కలడందురులంకలోన కనుమరుగగుచున్
కలడా నిజముగ నార్యా?
కలగంటిన యిపుడనేను ? గలవరపాటా?

Monday, January 11, 2016

వారువేరువీరివారు


వారువేరువీరివారువేరనుటను
సబబుకాదుమనకుసర్వులమిల
నైకమత్యతగసహగమనంబుచితమ
యదియమానవత్వమదియమేలు

చేసినవన్నితప్పులనిచింతిలనేమిప్రయోజనంబుమున్


చేసినవన్నితప్పులనిచింతిలనేమిప్రయోజనంబుమున్
జేసినవాటినిత్తరినిజేయకనుంటనుమేలుగావుతన్
చేసినతప్పులన్నికనుజేయకయుండుమునాదుసోదరా!
వాసిగమేలుసేయునికపార్వతినాధుడెయెల్లవేళలన్

వనితకామింపనొల్లనివాడుగలడె?


చెలువ గలదగు చెంగావిచీరకట్టి
బూరిబుగ్గలసొగసులుభూరిగాను
ద్యోతమగుచుండ,శిరసునద్యుమణికాంతి
వెలుగు లనలరు చుండిన లలితయనెడు
వనితకామింపనొల్లనివాడుగలడె?

అరచేత బొంగరము


చిత్రమందునబాలుడు చేతితోడ
త్రిప్పుచుండెనుబొంగరమొప్పుగాను
చిత్రమేమననరచేతచిందులాడ
గిరగిరతిరుగుచుండెనుగరముకనుము

సత్కార్యంబుల ఫలమ్ము,సంతాపంబుల్

సత్కారములొందుటభువి
సత్కార్యంబుల ఫలమ్ము,సంతాపంబుల్
తత్కార్యంబులఫలితము
సత్కులమునబుట్టునతడు సత్పురుషుడగున్

వారి జాక్షుల యందు

వారి జాక్షుల యందున ప్రాణవిత్త
మాన భంగమం దునికను మాననీయ!
గోకులాగ్రజన్మ రక్షణ కొరకుగాను
బొంకు పలుకవచ్చునుగద బుధ్ధియుతము

Saturday, January 9, 2016

హరినిహరిహ రించె హరికనంగ

మడుగునందుమిగుల మాటుగనుండ యా
హరినిహరిహ రించె హరికనంగ
వేలకొలది నతుల విడువక యిడగను
హరియె కాచిమనల నాదుకొనును

పద్య రచన -కనియెన్ రాముడు


కనియెన్ రాముడు వనమున
పనసలునిక యరటిపండ్లు బాహాటముగా
న్దినవలెనను గోరికతో
వినయముగా గాపువాని వేడెను నపుడున్ 

తాడిగడపవారు


తాడిగడపవారు ధార్మికతగలిగి
చిత్రకవితయందు చిత్తముంచి
శివుని కధను నిపుడు చిత్తమలరగను
వ్రాయదొడగెనార్య! వాసిగాను

Friday, January 8, 2016

వీడుకోలు
 లేవు లేవమ్మయి కమాకు లేవు నీవు
ఎచటి కేగితి వోయమ్మ యిపుడు  నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము 
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

 చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు 
తల్లి నీవయ, మరియును దండ్రి వీ వ 
మరువ జాలము నెన్నడు మరువ లేము 

 జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి 
ఉన్న లేకున్న నున్నట్టు లుండె మాకు 
అమ్మ  ! చూతుమ యొ కపరి  యైన రమ్ము  
పున్నె యింతి గ నీ రాక ముదము మాకు .

 ఎవరు వచ్చిన విసుగక నెందు కనక 
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు 
నాన్న కూడను  నిందుకై  నగవు తోడ 
సాయ బడుదురు  కదయమ్మ శ్రద్ద గాను 

తాత బాబయ్య మామయు దయలు లేక
విడిచి మమ్ముల నెచటికో వెళ్లిరకట
యింత వరకును రాలేదు యెచటగలరొ?
నీవు నేగితె?యచటకునిజముగాను 

బంధుమిత్రులుచుట్టాలు భవ్యముగను
వచ్చి యుంటిరి యిచటకు వత్తువనుచు
వచ్చిపోవమ్మ! యొకపరి బంధువువలె
సంతసింతుము నినుజూసి యెంతగానొ


 అమ్మ ప్రేమను బంచిన యమ్మ నీవు 
మరువ జాలము నిన్నునే మరువ నమ్మ !
మాయ రోగము వచ్చి నిన్మడియ జేసె
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

౭. ఆశ లేదమ్మ  ! నీ కిల యాశ లేదు 
ఉన్న దానితొ సంతృప్తి నొంది తీవు 
సాటి రారమ్మ యె వరును సాటి రారు 
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .


 అమర లోకము జేరితి వమ్మ నీవు 
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
ఆదు కొ నగను  నమరులు హాయి గుండు .

 చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు 
జన్మ లేకుండ జేయను సమ్మతించి 
సకల శుభములు గలిగించు శంక రుండు 
నీదు నాత్మకు శాంతిని నించు  గాక !

మగని సేవకు నంకిత మైతి వీవు 
బ్రతికి నన్నాళ్ళు , సంసార బంధ మౌర 
గుండె పీ డించి యెముకల గూడు చేసె
అందుకొనుమమ్మ !శ్రద్ధాంజ లందు కొనుము స 

(మా తల్లిగారి సం వత్సరీ కములు సందర్భముగా )
అశ్రు పూర్వక నయనాలతో ... 
 రాజా 
బిందు 
సౌజి 

Thursday, January 7, 2016

వేంకట రమణా !

వింటిని గాధలు నీయవి
వింటిని  మఱి  నీదు  కధలు వివరము  గాగన్
వింటిని  నీ సాహసములు
వింటిని  నిక నెన్నొ  యెన్నొ  వేంకట  రమణా    1

కంటిని  నీ రూప మ్మును
కంటిని  నీ భక్త కోటి   గణముల  వారిన్
కంటిని  నీ మహి    మంబులు
వింటివె   యీ నాదు  ఘోష  వేంకట  రమణా !   2

ప్రేమను నింపుము నాలో
ప్రేమను బూజింతు నిన్ను ప్రేమికుడ ననై
ప్రేమకు సాటిది లేదుగ
ప్రేమే మఱి  దరిని జేర్చు  వేంకట  రమణా !   3

సుమములు దెచ్చితి నీకై
సుమబాణు ని  యొద్ద నుండి   సౌమ్యతతోడన్
సుమములు     దాల్చియు సామీ !
విమలంబగు  మనసునిమ్ము  వేంకట  రమణా !   4

వేడెదను  సాయి  బాబును
 వేడెద నిక  సాంబ శివుని   వేడెద  హనుమాన్
వేడెదను   నాగరాజును
వేడెద మఱి  నిన్నుకూడ   వేంకట   రమణా !   5

విడుతును జెడు నలవాట్లను
విడుతును  దుర్జనుల  నెపుడు  విడుతును సామీ !
నిడుములు పెట్టెడు వారిని
విడువను నిన్నెపుడు  మదిని  వేంకట  రమణా !   6

అమ్మా నాన్నలు లేరయ
యమ్మైనా నాన్న యైన నన్నియు నీవే
యమ్మను జూతును నీలో
పేర్మిని నను జూడు సామి ! వేంకట  రమణా !   7

ఆలుం  బిడ్డల  బంధము
నేలాగున బోవునయ్య ! యిపుడున్నాకున్
మేలము లాడక జూడుము
వీలగు నుపకృతి ని నాకు  వేంకట రమణా !   8

ఘంటా పథముగ జెప్పుము
కంటిని తడి బెట్టకుండ గాచుదు ననియున్
బంటును మ్రొక్కుచు నుంటిని
వింటివ ?    మఱి లేద ? నీవు  వేంకట   రమణా !   9

గంటను గొట్టితి రయ్యా !
వంటలు  నట     పూర్తి యయ్యె భావము తోడన్
మంటలు దీరగ కడుపున
వెంటనె  నేనేగి తిందు వేంకట  రమణా !   10

అంటీ  యంటని  విధముగ
నుంటవ! మఱి   నాదు  యెడల నుండిన యడ లన్
కంటికి  నిదురే  రాదుగ
వింటివే యీ నా  దుమాట  వేంకట  రమణా !   11

పాలను గలిసిన నీటిని
నేలాగున  రాజ హంస వేరుగ  జేయు
న్నాలా గున  నాలోగల
పేలవమును బార ద్రోలు  వేంకట రమణా !   12

వేలకు వేలుగ నీయగ
జాలను మఱి నేను సామి ! చదివిం పులుగా
నాలయము జుట్టు దిరుగుదు
వీలగునని సార్లు వినుమ, వేంకట  రమణా !   13

వేంకట రమణా యనుచును
లెంకను  నేబిలువ నిన్ను లీ లగనైన
న్నంకము నిడి  లాలించవ !
బింకమ !  యదియేల నీకు  వేంకట రమణా !   14

నానుడు  బేరము  వదలుచు
నాననమున  మోదమొంది యానందము తోన్
దీనుని నను గాపాడిన
వినితిం తును  వేయి నోళ్ళ  వేంకట రమణా !   15

అనుదినమును నీ నామమె
మననము నేసే తునయ్య ! మాన్యుడ వనియు
న్విని పించ  నాదు చర్యను
వినికిడి  మఱి యాయె సామి ! వేంకట  రమణా !   16

ముదుసలి వారమ యైతిమి
యదు వంశపు రత్న పురుష !హా శ్రీ నాథా !
సదయను జూడుమ  మమ్ముల
పెదరాయుడ ,సుగుణ శీల !వేంకట రమణా !   17

వితరణ  బుద్ధిని గలిగియు
సతతము దా జేయ నీవి సద్గతు లొం దున్
శతముల  వర్షం బులు మఱి
వింటివె  యీమాట నీవు  వేంకట  రమణా !   18


వచ్చీ రానీ  మాటల
నిచ్చటనే  వ్రాయు చుంటి బేరిమి తోడన్
మచ్చున కొక్కటి జదువుచు
పిచ్చగ నది యున్నదనకు   వేంకట  రమణా !   19

భక్తుని  మాటను నిలుపగ
రక్తిని మఱి వచ్చి తీవు రావము తోడన్
యుక్తిగ గంబము జీల్చుకు
బిత్తర బోవంగ రాక ? వేంకట రమణా !   20

తేజో మూర్తులు మీరలు
జాజులు చేమంతి యాది సరముల తోడన్
పూజలు సేతును నిరతము
వేజామున లేచి మీకు  వేంకట రమణా !   21

అన్నము కొఱకై మఱి యీ
యన్నార్తుల గోడు వినుమ ,యార్యా రమణా !
మిన్నగ మది బూజింతురు
విన్నపమది యాలకించు  వేంకట రమణా !   22

అందరము కలిసి యిచ్చట
యందముగా విఘ్న నాథునా వాహనము
న్జిందిల  మంగళ వాద్యము
విందులతో జేతు మయ్య వేంకట రమణా !   23

వచ్చితి  నిన్ను  జూడగ
హెచ్చగు కష్టంబు లొంది యీ శా !మఱి నే
మచ్చునకు నైన జూడవు
బిచ్చకుడుగ దలచియేమొ ,  వేంకట రమణా !   24

అయ్యవు నీవే యనుచును
దియ్యటి యొక లడ్డు నీకు దెచ్చితి నిపుడే
యియ్యగ రానా ?యికనే
వెయ్యవ ?యా మోద ముద్ర  వేంకట రమణా !   25

అనుదినము భజన జేతును
వినయముగా నీదు గూర్చి వేవే రకము
ల్నను జూడుమ గృప తోడన
వినుచుంటివె నాదు మాట వేంకట రమణా !   26

ఎపుడో జూచితి నినునే
నిపుడా యెను జూడ బుద్ధి యెపుడె పు డనుచు
న్జెపుమా  దర్శన మిత్తువ ?
విపులముగా నడుగు చుంటి వేంకట రమణా !   27

సవినయముగ నిను దలతును
నవిరళ మగు  భక్తి తోడ నాసా యంబు
న్బవలును రే యియు సహితము
వివరముగా దెలుపు చుంటి  వేంకట రమణా !   28

ఆలుం బిడ్డల బంధము
నేలాగున బోవునయ్య !యిప్పుడు నాకు
న్మేలము లాడక జెప్పుము
వీ లగునే  బంధ మూడ వేంకట రమణా !   29

అన్నా ! వినుమా నామొఱ
యె న్నాళ్ళను  నీదు గురిచి యెదురుం జూ డ
న్నున్నావా నీ వసలు
న్విన్నావా  నాదు ప్రశ్న వేంకట రమణా !   30

కయ్యము లాడను నీతో
నయ్యవుమఱి యమ్మ గురువు  నన్నియు  నీవే
యయ్యా ! నీదరి జేరగ
వియ్యము నే గోరుకొందు  వేంకట రమణా !   31


కయ్యము జేయను నెప్పుడు
కయ్యమునకు గాలుద్రువ్వ  కలలో నైన
న్నయ్యా కనుమీ నిజమును
వియ్యమునే గోరుకొందు  వేంకట  రమణా !   32

అనగనగా నొకరాజని
వినువానికి జెప్పు కధలు వేవేలుగ గాన్
విననొల్లని నాకేలకొ ?
వినిపింతువు కధలు నాకు  వేంకట రమణా !   33

ఎన్నో రోగము లాయవి
తన్నుకు మఱి వచ్చి  నాదు తనువును డాసె
న్గన్నంతనె యా మచ్చలు
వెన్నున నిక బుట్టె వణకు వేంకట రమణా !   34

వేడుదు నిను బలుమారులు
పాడుదు నీపాట లెన్నొ పరవశ మగుచున్
వేడిన బలుకగ యుండిన
వీ డుదునా ?నిన్ను నేను వేంకట రమణా !   35

అలకా పురమున నీ గుడి
పలువురి చందాల వలన  బ్రహ్మాండ ముగన్
చలువల రాతిని దెచ్చియు
విలసిల్లం గట్ట దలతు వేంకట రమణా !   36

వడ్డాది కులము వారల
బిడ్డను గాపాడు మనుచు వేలకు వేలున్
వడ్డీ గా వారిచ్చిరి
విడ్డూర మ్మిదియ కాదె  వేంకట రమణా !   37

అక్షయమౌ సిరి యుండగ
భిక్షకుని గ మారితీ వు పెండ్లికి కొఱకై
భిక్షకులే ధన వంతులు
భిక్షాటన వారి వృత్తి వేంకట రమణా !   38

ఇంటిని నిల్లాలిని నిల
కంటికినే రెప్ప వోలె కాచుచు నటులన్
బంటును నను గాపాడుము
వింటివె  యీ నాదు మాట వేంకట రమణా !   39

పిల్లా పాపల తోడను
చల్లంగా నుండ గోరి సతతము నిన్నే
యుల్లమ్మున నే గొలుతును
పిల్లల పై దయను జూడు వేంకట రమణా !   40

పంచుము సిరి సంపదలను
పంచిన సంతసము గలిగి పరవశ మగుదున్
పెంచుము నీపై భక్తిని
పెంచిన నిక నిన్నె దలతు  వేంకట రమణా !   41

అత్తరువులు సాంబ్రాణి యు
దెత్తును మఱి యగరుబత్తి తెత్తును బూలన్
దెత్తును హారతి బిళ్ళలు
విత్తమ్మును బోగుజేసి వేంకట రమణా  !   42


ఎన్నో రాత్రులు గంటిని
కన్నుల పండువుగ నిన్ను కంస విరోధీ !
యన్నువ నను దరి జేర్చుము
విన్నాణం బిదియ నాది వేంకట రమణా !   43

అప్పా !యేమని జెప్పుదు
గొప్పలు నే జెప్పలేను గొండంతలు గాన్
తిప్పలు బెట్టక మమ్ముల
విప్పారగ జేయు కళ్ళు  వేంకట రమణా !   44

పంజరపు జిలుక వలె నా
సంజయు నా చీక టిం ట సత మత మగుచున్
రంజిల జేతువు కతనన
వింజామర వీతు నీకు  వేంకట రమణా !   45

అంబను జూడగ నేగుచు
తంబురమున్మీ టు గొనుచు దళితుం డొ కడున్
అంబా !యంబా !యనగను
వెంబడి నేనుంటినపుడు  వేంకట రమణా !   46

ఇచ్చను హద్దులు దాటను
కచ్చలు నిక బెంచు కొనను కాపురు షులతోన్
చిచ్చును నెవరికి బెట్టను
విచ్చల విడి దిరుగ నేను వేంకట రమణా !   47

కాజాలు బూత రేకులు
నాజూకుగ మెరయు నాపనస తొన లన్నిన్
రాజా నాయుడు  చేసిన
పీజా నైవేద్య మిడుదు  వేంకట రమణా !   48

తాటకి గల యడవులలో
బాటముగా బెద్ద పులులు గలవండ్రు జనుల్
వేటకు వెడుదు ను గానీ
వేటాడగ రాదునా కు  వేంకట రమణా !   49

అజ్ఞానుండను సామీ !
జిజ్ఞాసను నిన్ను దలతు జేదుకొ  నన్నున్
విజ్ఞత గలిగిన వాడవు
విజ్ఞాపన మిదియ నాది వేంకట రమణా !   50

అమలమగు మనసు లేమిని
మమకారము సుంత గూడ మదికింగరువై
సమతా భావము లేకన
విముఖుడ నేనైతినికను వేంకట రమణా !   51


విశ్వాస ముండు వానికి
నశ్వర మగు శాంతి సుఖము లా నందంబు
ల్వి శ్వ మున న్లభి యించును
విశ్వాసము గొప్పగాదె ,వేంకట రమణా !   52

మొర్రో పులియది వచ్చెను
కర్రల తోరండి యనుచు కామిని బిలువ
న్జర్రున బో లేరెవరును
వెర్రిగ నేనమ్మితదియ వేంకట రమణా    53

భస్మా సురుడను నాతడు
విస్మయమగు వరము కోరి వెనువెంటనె దా
న్భస్మం బగుటను జూడగ
విస్మయ మున్గలిగె నాకు  వేంకట రమణా !   54

ఆ ర్మీలో నుద్యోగము
కార్మికునిగ రాగ నాకు గాలుని దయచే
న్గూ ర్మిని జేతును మఱి నను
పేర్మిని నిక జూడు సామి ! వేంకట రమణా !   55

వారలు వారల నియుబలు
మారులు వారి గురిచి యిక  మాట్లా డకు డీ
వారలు సెప్పితి  రని,నను
వేరుగ నిక జూడ బోకు వేంకట రమణా !   56

అక్షయ మగు నీ కాంతిని
నక్షులతో జూడ నాకు నద్భుత మయ్యె
న్బక్షుల గమనపు హొయలను
వీక్షించగ మో దమయ్యె  వేంకట రమణా !   57

అనుదినము నిన్ను గొలుతును
నినుడవు గామదిని దలచి యీ శా  రమణా !
యనయము గాపాడుము మము
వినయముగా వేడు కొందు  వేంకట రమణా !   58

విరజాజులు సంపెంగలు
సరములు గాగ్రుచ్చి  నిన్నుసాలం కృ తిని
న్నిరవుగ జేతును సామీ !
విరజాజుల మోము వాడ ! వేంకట రమణా  !   59

పిన్నలు పెద్దలు వృ ధ్ధులు
చెన్నుగ నొక చోట చేరి శ్రీ కర ముంగా
న్నిన్ను న్గూ ర్చిన కధలను
బిన్నల కున్జె  ప్పు చుండ్రి వేంకట రమణా !   60


ఎన్నో కీర్తన లయ్యవి
యన్నువగా నన్నమయ్య హాహా యనగ
న్మిన్నగ వ్రాసెను నీపై
విన్నావా వాటి నీవు వేంకట రమణా !   61

శిక్షింతువు దుర్మార్గుల
రక్షింతువు సాధుజనుల రంజిలు గాగన్
రక్షణ శిక్షణ నీవే
వీ క్షకుడను  నేను సామి ! వేంకట రమణా !    62

ఒక్కొక యవతారంబున
నొక్కొక రాక్షసుని జంపి నుర్విని దివినిన్
మిక్కిలి సంతస బరచగ
పిక్కటి లెయా ది శలెల్ల  వేంకట రమణా     64


అవతా రంబుల యందున
నవతారము నీదె ముఖ్య మార్యా ! జగతి
న్నవనిని గల జను లందఱు
వివరముగా ననిరి యిట్లు  వేంకట రమణా !   65

కలియుగ దైవము నీవని
నిలనున్గల జనులు నిన్ను నెదలో గొలువన్
దలపున సంతస మాయెను
వెలయింతని గట్ట లేను  వేంకట రమణా !    66

విశ్వాసము మేలైనది
విశ్వాసము గలుగు నెడల విశ్వము లొంగు
న్వి శ్వాస మనగ  నదియే
విశ్వాసము నిమ్ము నాకు  ! వేంకట రమణా !    67

వీ డుదు జెడు సహవాసము
వీ డుదు నే దుష్ట జనుల వీ డుదు  భవము
న్వీ డు దు  నీ జగమును  సరి
వీ డను నీ పా దములను వేంకట రమణా !   68

ఎన్నో నిడుముల జిక్కితి
నన్నియు బోగొట్టు సామి !యాప్యాయత తోన్
సన్నుత !దేవా ! మాయీ
విన్నపముల నాలకించు వేంకట రమణా !   69

ఇంతగ బ్రార్ధించిన మఱి
సుంతైనా బలుక వీవు జోగుచు నుంటే ?
పంతము బట్టితి వేమో
వింతలలో భాగమ యిది వేంకట రమణా !     70

ద్విజులును ఋషులును నమరులు
బ్రజలును భువి జీవ కోటి పరి పరి విధము
ల్లజరా మరుడవు ననుచును
విజయము జేకూర్చు మండ్రు వేంకట రమణా !        71

ఇందుగల వందు లేవను
సందేహము నాకు లేదు సామీ నీవు
న్నిందును నందును నుందువు
బిందువులో గూడ మరిని  వేంకట రమణా !    72

అవమానమ్ము లు హా రతు
లవిరళ ముగ జేయు చుందు రవనీ  పతినిన్
భువనైక పతివి నీ యెడ
వివశత జూపించ నోర్వ వేంకట రమణా !       73

మన్నున మనుగడ లేకను
మిన్నునకే నేగ దలచి మేమంద ఱము
న్దిన్న గ  వచ్చితి మిచటకు
విన్నపమును జేయ మీకు వేంకట రమణా !        74

గాలిని నింపిన బుడగలు
దేలికగా నెగురును గద దివికి న్దలప
న్నా లాగున మా  యసువులు
వీ లగునే బైకి బోవ  వేంకట రమణా !       75

పగ్గములు లేని మనసును
దగ్గరగా లాగ మనకు  దరమే వసుధన్
దగ్గరగా వచ్చుట కును
బిగ్గరగా నరువ వలె నె ?వేంకట రమణా !       76

అనయము నిను బ్రా ర్ధిం తును
వినయముగా సామి నేను వీడని భక్తిన్
కను రెప్పలు గంటిని వలె
పెను భద్రత గావుమయ్య  వేంకట రమణా !         77

చుర్రు మని చేయి కాలగ
మొర్రో యని బాలు డేడ్వ  మోడును వలెనే
బిర్ర బిగుసుకు న్నుం టివి
వెర్రినిగా దలతు వేమి వేంకట రమణా !        78

దశరధ నందనుడై యిల
దశ కం ఠుని  సంహరించి డా లోకములన్
దశ కంఠు వలని బాధలు
వీ శము  లేకుండ జేసె  వేంకట రమణా !         79

నీరును బాలును గలువగ
వేరుగనే జేయు హంస వేటికి దానిన్
ఆరవ ప్రాణము నీవే
వేరుగ నను జూ డబో కు వేంకట రమణా         80

తీరము వెంబడి గాలులు
జోరుగ వీ చంగ  జెట్లు శోషిలి బడగ
న్నారావము చెవి సోకగ
పేరురమున్సాగి పోయె  వేంకట రమణా !........81

కనుమా  చెడుకున్మూ లము
 ధనమే, మోక్షము గడించు దారిని జూపు
న్ననయము శంభుని ధ్యానము
విను మఱి యీ నాదు మాట  వేంకట రమణా !.......82

గంటులు బడియెను దేహము
కంటికి నిక జూపు లేదు కానగ నెటులో
నంటీ యంటక నుండకు
వింటివె  యీ నాదు మాట  వేంకట రమణా !........ 83

ఇత్తును దీపము ధూపము
నిత్తును నైవేద్య మయ్య ! యిష్టము కొలది
న్నిత్తును మంగళ హారతి
విత్తము నేగో రనిన్ను వేంకట రమణా !........... 84

అన్నలు దమ్ములు సెల్లెలు
నన్నున్నిట  నొంటి జేసి నర్మపు బుద్ధి
న్దిన్నగ బోయిరి యెటకో
విన్నప మిది యాలకించు వేంకట రమణా !.......... 85

లజ్జను విడిచియు  మఱి నీ
పజ్జనె నేనుండ గోర వాం ఛిం చితినే
సెజ్జన నుండగ నిత్తువె ?
వెజ్జవు  మఱి నీవె నాకు వేంకట రమణా !......... 86

ఉల్లము నీయది యెరు గుదు
మల్లియ వలె దెల్ల గుండు  మమతల తోడన్
జల్లగ నుండగ నుబటిక
బెల్లము నైవేద్య మిడుదు  వేంకట రమణా !......... 87

ఎట్టులొ  నిను సే వింతు ను
గట్టడి జేయంగ నీకు కనగను సబుబే
యట్టులు గాదని మొండిగ
బెట్టును జేయంగ నేల ? వేంకట రమణా !..... 88

అనుదినము నిన్ను గొలుతును
మనసంతా నీవె యుంటి మహిమల రేడా !
 కని పించుమ  యొకపరి మరి
పెను మాయలు మాని సామి ! వేంకట రమణా !  ......    89తల్లియు దండ్రియు నొజ్జవు
నెల్లరకున్నీవె  సామి !  యిజ్జగ మందున్
కల్లలు సెప్పుట లేదయ 
పిల్లల పై యొట్టు సుమ్ము  వేంకట రమణా !........ 90


 అల్లరి చేతురు పిల్లలు
కల్లలునున్ బలుకు చుండ్రు ,కధలన్ జెప్ప
న్నుల్లము లలరగ విందురు
పిల్లలె గద నీదు రూపు  వేంకట రమణా !.......... 91

ముదుసలి వాడను మరినే
పదముల లన్బలుక లేను బ్ర స్ఫు ట ముం గాన్
కదలవుపాదము లీ యవి
విదలించక నన్ను కావు వేంకట రమణా !,......... 92

పడుచుందనమును బోవగ
నొ డలంతయు  గ్రుంగి పోయి యోపిక తగ్గెన్
పడుచుచులేచుచు  బ్రదుకును
పెడమరులుగ లా గుచుంటి  వేంకట రమణా !........... 93

అరిసెలు బూరెలు గారెలు
పరమాన్నము చెక్కవడలు బజ్జీ గుల్లా
ల్లిరవుగనోగిర మిత్తును
వెరవక భోమ్జేయు మయ్య వేంకట రమణా !......... 94

ఇతరుల కష్టము తనదని
సతతముభా వించునతడు సత్పురుషుండే
 యతనికి నిమ్ముము శక్తిని
వెతలనుమరి దీ ర్చుకొరకు  వేంకట రమణా !.......... 95

అంతా మిధ్యయె గదజగ
మంతా మిధ్య యనుచు నందరు దలచన్
చింతయెమిగులును  మనసున
వింతయె గద యీబ్రదుకులు  వేంకట రమణా !....... 96

భక్తుల రక్షణ నీయది
ముక్తియును న్నీయు మయ్య ! మురహర రమణా !
రక్తిని మము గాపాడుము
విక్తాఫా గాచినటుల  వేంకట రమణా !.......... 97

వెంకట రమణా  యనుచును
లెంకను నేబిలువ నిన్ను లే చియు రావా ?
సుంకము కావలెనా మరి
బింకముగా నుంటి వేమి  వేంకట రమణా !..........    98

 అత్తరు పూయగ వత్తును
సత్తువ యున్నంత వరకు  సంతో షము గ
న్నెత్తరి యైనను ,కానీ
విత్తము నేనీ యలేను  వేంకట రమణా !......... 99


పూజ జేతును నిత్యము పూ లతోడ
ధూప దీపమ్ము నైవేద్య మొప్పుగాను 
హారతియు నిత్తు మీకు నే  ననుదినమ్ము 
విన్న పమ్ములు   వినుమఱి  వేంకటేశ  !........ 100


సకల మునిగణ సేవిత సంయ మేంద్ర !
యాది పురుషుడ వీవెగా యాదిదేవ 
యంత రాత్మయు  నీ వెయే  యఖిల మునకు 
విన్న పమ్ములు  విను మఱి  వేంక టేశ !..... 101


అఖిల  జనములు  సేవింత్రు నభవు డవని 
వారి నమ్మకముల నెప్డు  వమ్ము సేయ 
కమఱి  కాచుమా వారల  కరుణ తోడ 
విన్నపమ్ములు  విను మఱి  వేంకటేశ  .... ...  102


సుబ్బా రావను నేనిట
పబ్బముగా పద్యరచన భావించి మది
న్నిబ్బందు లెన్ని కలిగిన
బెబ్బులి యై వ్రాసియుంటి వేంకట  రమణా !...... . 103


అంకిత మిత్తును నీకే
పంకేరుహ పద్మ పాద భా సుర రేడా !
లెంకను గద మరి నేనయ
బింకమయది యే లరమ్ము  వేంకట  రమణా !....... 104

ముదుసలింగొట్టువారలే పోటుమగలు


పరమనీచులు దుష్టులు బరగు భువిని
ముదుసలింగొట్టువారలే, పోటుమగలు
దానధర్మాలుసేయుచు ధర్మవిధిని
నడచుకొనువారు నిజమది నమ్ముడార్య!

పద్య రచన -చక్కిలాలు


చక్కిలముల నేజూచితి
చక్కగనవియుండెనచట జానకి ! తెమ్శా!
మక్కువగలిగెను దినుటకు
మిక్కుటముగదేకుసుమ్ము మీకును గొన్నిన్ 


కట్నముకోరినవరుని,జగమ్శు నుతించున్


పట్నపు జనులుస హించరు
కట్నముకోరినవరుని,జగమ్శు నుతించున్
కట్నము గోరని వానిని
కట్నములవితీయుచుండె గాంతల యసువుల్

పద్య రచన -దుర్జనుని స్వభావము


ఒదిగియున్ననుసజ్జనుండొప్పుమీర
కీడుజేయంగదలచునుకిట్టకతడు
తనర దుర్మార్గుడెప్పుడుతరచిచూడ
చిమ్మటలవియ కొరుకునుచీరలన్ని
లేశమైననులాభములేక యున్న 


Tuesday, January 5, 2016

కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

మా తమ్ముడు  ,పోచిరాజు కామేశ్వర రావు  పద్యము

చందనపు బొమ్మ భంగిని
నందము కను విందు జేయ నలరించె నటన్ 
డెందమ్మున దా నితరుల 
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ 

Sunday, January 3, 2016

వివాహములో -ఏడడుగుల వివరణ

 మొదటి అడుగు ; జీవితాంతము స్నేహపుర్వకముగా నుండుట

రెండవ అడుగు ; కలిసి మెలిసి ధైర్యముగా నుండుట కొఱకు
మూడవ అడుగు ; పరస్పరాభి వృద్ది కొఱకు
నాల్గవ అడుగు ; ఎల్లప్పటికి ఒకరి కొఱకు నొకరు  జీవించుట కై
ఐదవ అడుగు ; మాన ప్రాణ ధనములను రక్షించుట కొఱకు
ఆరవ అడుగు ; మన పిల్లల భవిష్యత్తు కొఱకు
ఏడవ అడుగు ; సుఖ దుఃఖములను పంచు  కొనుట కొఱకు
---------------
వరుని జేబట్టి నడచును వధువు నిచట
యడుగు లేడును వరుసగ నరయ దాని
యర్ధ మేమన వివరింతు నార్య !నిపుడు
సావధానముగ వినుడు శ్రద్ద్ష గాను

మొదటి యడుగున కర్ధమ్ము  ముదిత ! వినుము
జివితాంతము  మెలగుము స్నేహ పూర్వ
కంబుగను మఱి  నీభర్త కనుల యెదుట
కనులు మీయవి నాలుగు  కలిసి కొనగ

రెండవ యడుగున కర్దము
మెండుగ నిక కలిసి మెలిసి మెలగుట  మేలౌ
నిండగు ధైర్యము కలిగియు
నుండంగా మేలు గలుగు నుర్వి జనులకున్

ఒకరి యభివృద్ధి కొఱకునై నొకరు పూను
ట యది మూడవ యడుగున డచుట యగును
నాలుగవదియ దెలుపును నయము గాను
నొకరి కొఱకునై మఱియొక  రుండ వలయు
జీ వితాంతము  వరకుగా జీవ నంబు

ప్రాణ మాన ధనము పరిరక్ష ణమునిక
అయిదవ యడుగున కర్ధ మబల !
ఆరవది యగు నడుగును నరయ తెలియు
సంతు భావి జీవితమును జక్క దిద్ద

సుఖము మఱియును దుఃఖము జూర గొనుట
కొఱకు గానేడ వయడుగు గూర్చు నుగద
యేడడుగుల బంధమిదియ ,యీ వ చనము
లాల కించుచు వర్తిలు డార్యు లార ! 

WEDNE

పద్య రచన -నచోర హార్యం ........


దొంగిలించగ లేరుగా దొంగలెవరు
పంచు కొనలేరు భాగమ్శు భాతృలెవరు
వశము కాదిదిరేలకు భరణి వినుము
పంచు నెడలను బెరుగును గొంచె మవదు
అన్ని ధనముల గంటెను మిన్న సుమ్ము
విద్య యనబడు ధనమని విదితమయ్యెబాట పట్టి పోవు వాడుఖలుడు


దుష్ట బుధ్ధి తోడ దురితము ల్గావించు
పురుషు బాట పట్టి పోవు వాడు
ఖలుడు,వాని తోడ మెలగకూ డదెపుడు
దూరముండ వలయు దుష్టులకును

Saturday, January 2, 2016

చైత్రమందు,వినాయకచవితివచ్చు

రమ్య ముగవచ్చు పండుగ రామనవమి
చైత్రమందు,వినాయకచవితివచ్చు
భాద్రపదశుధ్ఢచవితినిభవ్యముగను
పండుగలువచ్చుశుభములువడయు కొరకు

మదిరా పానముచౌర్యమున్ పరసతీ..........


  1. మదిరా పానముచౌర్యమున్ పరసతీమానాపహారమ్మునన్
    మదినీ లగ్నముజేతువేమి యికకామంబొప్పునేనీకిటన్
    చదువేముఖ్యము బాలకా! మరినివేసారింతువిప్పుడున్
    మదికిన్ హానినినోయవియ యే మాత్రంబురానీయకే.

ననుమించిన...........

ననుమిం చినమొన గాడును
ననుమించినమాటకారి  నా కగ పడదే
ననుగురిచిదెలుప యిటులను
ననుమించిన మూర్ఖుడుండునాలోకమునన్

పద్య రచన -వృ ద్దురాళ్ళు

చిత్ర మందున జూడుడు చిత్రముగను
వృద్ధ మరియొక వృద్ధ ను వెనుక తనకు 
నునిచి కొనుచును పోవుచుం డెనట యార్య !
కలియు గపుమార్పు లింకను గలుగుచుండు