Thursday, March 31, 2016

రామచంద్రునినోడించెరావణుండు

సిరులనిచ్చునుదప్పకసేవజేయ
రామచంద్రుని,నోడించెరావణుండు
భీకరరణమునందునబేరుమోయు
కపులనెందరినోవరుసవరుసగను

రామచంద్రునినోడించెరావణుండు
ఎంతచక్కటియనృతమువింతగాదె?
రావణుండయోడించెనే?రామునకట!
నమ్మువారలులేరిట వమ్ముబలుక

Wednesday, March 30, 2016

పద్య రచన -గాన కోకిల సుశీల

గాన కోకిలవు సుశీల గైకొ నుమ! న
తులను ,నీదు గానమ్ము సం తోష బరచె
మమ్ము లనునెం త  యో ,కాన మనుగడ  సుఖ
మయము గావుత !శంకరు మహిమ వలన



Tuesday, March 29, 2016

పసి బాలుని బెండ్లి యాడె బ్రౌ ఢ ముదమునన్

కసుబుసు లాడకు మామా !
పసి బాలుని ,బెండ్లి యాడె బ్రౌ ఢ ముదమున
న్నిసుకంభట్ల కులంబున
మిసమిస లాడెడు రమణుని మెచ్చుచు మదిలోన్ 

దానగుణముమిగుల హీనగుణము

అన్నిగుణములందుమిన్నయేగాదయీ
దానగుణము,మిగుల హీనగుణము
పరులబాగుజూచిపవలునురేయిని
నెంతగానొమదినినీర్ష్యబడుట

Monday, March 28, 2016

పాపపుణ్యములాయవిభరణిలేవు

పాపపుణ్యములాయవిభరణిలేవు
లేవునిజమేయవికనిపించవెవరికిని
కానివాటిఫలితములుగనబడునిల
ననుభవించితీరవలయుననుదినమ్ము

ధర్మజునకు గన్న తల్లి ద్రౌపది యందున్

నిర్మల మనస్వి కుంతియ
ధర్మజునకు గన్న తల్లి, ద్రౌపది యందున్
వర్మా !ద్రుపదుని సుతనే
ధర్మ జుని న్బెండ్లి యాడి తనయుల గనియెన్ 

విధవయనబడుభర్తజీవించియుండ

భర్తమరణించినప్పుడుభార్యభువిని
విధవయనబడు,భర్తజీవించియుండ
యన్నిశుభకార్యములకునుహాజరగుట
పాలుపంచుకొనుటలునుబడయవచ్చు

Sunday, March 27, 2016

తాటి తోపులో బాలను ద్రా గ వలెను

పొంచి యుండెను నొకపులి పూర్ణ !చూడు
,తాటి తోపులో, బాలను ద్రా గ వలెను
లేని  చోమన లను నమ లితిను నమ్మ !
వేగి రమ్ముగ ద్రాగుము విషము నీవు 

దండిగనేజలముగంటియెండినబావిన్

ఉండ్రాజవరపుమడుగున
దండిగనేజలముగంటియెండినబావి
న్నండజపుకళేబరములు
మెండుగమరియుండెజూడుమీరాబాయీ!

Saturday, March 26, 2016

కాంతుని సేవించు నాతి గయ్యాళి గదా

కాంత లలో మిన్నయె యిల
కాంతుని సేవించు నాతి ,గయ్యాళి గదా
సాంతము చిరుబురు లాడుచు
సుంతైననుశాంతి నీ ని సుదతియె  భువిలో

Friday, March 25, 2016

ఘంట సాల వారి జయంతి

ఘంట సాల పే రుగలయా యింట బుట్టి
తెలుగు సాహిత్య రంగాన దేజ రిల్లి
తలలు నూ గగ పాటలు దనివి దీర
పాడి మమ్ముల నలరించి పద్మ శ్రీని
నొందిన గురువ !వందనం బందు కొనుము

ప౦చదారను పాలలో ము ౦చి నటుల 
పాటలో నీవు లీనమై పాడు చు౦డ
తనివి తీరగ విందురవని జ నములు 
గాన గ౦ధర్వ శీల! యో  ఘ౦టసాల!


రాముడు కన్నీ రు కార్చె, రావణు డ లరన్

ఏమా యెనొ నేమొ కాని
రాముడు కన్నీ రు  కార్చె, రావణు డ లర
న్నామా రీచుడు సీతను
దా మాయ న్లేడి యగుచు దరికి న్జేర్చెన్

శ్రీరామునికన్నతల్లిసీతమ్మయెగా

ఔరా!యేమీపలుకులు
శ్రీరామునికన్నతల్లిసీతమ్మయెగా
యేరా!మద్యముద్రాగితె?
యీరకపున్మాటలనగ,నేమీమాటల్


Thursday, March 24, 2016

జనకునకున్ సుతుండు పరిచర్య లొ నర్చుట పాప కృత్యమౌ

జనకునకున్ సుతుండు  పరిచర్య లొ నర్చుట పాప కృత్యమౌ 
యనుచు మదిన్  దలంచుట యనాగ రికంబగు భావననే యగున్ 
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పుణ్య కార్యమే 
యనునది నాయభీ ష్ట మ ,వినంగ దలంచితె యార్య !మంచిగా

Wednesday, March 23, 2016

యముని సావిత్రి గని పలాయన మొనర్చె

కోరె  దనభర్త ప్రాణము ల్  కోర్కె లలర
యముని సావిత్రి గని, పలాయన మొనర్చె
సత్య వంతుని బ్రాణముల్ సాదరముగ
దనర సావిత్రికి నొసగి దా యముండు 

Tuesday, March 22, 2016

వైరములను బెంచు బంతి కూడు

భోజ్య వస్తువు లవి  భుజి యించ రానిచో
వైరములను బెంచు బంతి కూడు
నుప్పు పులుపు లేని చప్పిడి యోగిర
మనుచు వెడలి పోదు రందఱపుడు

బామ్శ యాశీర్వాదము

బామ్మయచ్చటచూడుమువధువువరుని
మంచిమనసుతో నాశీర్వదించుచుండె
చూచుచుండగనింతులుచుట్టుమూగి
మంచిసంతునుగనియిమ్ముమాకుబాల!

Monday, March 21, 2016

పద్య రచనకుగణయతి ప్రాస లేల

పద్య రచనకుగణయతి ప్రాస లేల
యనుట సరిగాదు గణ యతు లవస రమ్ము
ప్రాస గూడను దప్పదు పద్య మునకు
గణయ తులప్రాస వలననే కర్ణ ములకు
వినుట కింపుగా నుండును వినుత శీల !

Sunday, March 20, 2016

వైధవ్యము ప్రాప్త మగుట వరము తరుణికిన్

రాధా !నీ దురదృష్టము
వైధవ్యము ప్రాప్త మగుట ,వరము తరుణికిన్
దా ధవునకు ముందుగనే
మాధవుని న్జేరు కొనుట, మంచిది కూడన్ 

Saturday, March 19, 2016

తులసీదళమును........

తులసీదళమునునిట్లన
తులసీదళముమనకువిషతుల్యమ్ముగదా
కలలోనైననుభావ్యమె?
తులసీదళముమనకమృతతుల్యమ్ముగాదె!

Friday, March 18, 2016

నడుము నొప్పి తెచ్చె గడుముదమ్ము

నడుము నొప్పి తెచ్చె గడుముదమ్మనుమాట
 సత్య మైన యెడల ,శంకరుండు
కలుగ జేయు గాక ! కావలసినవార్కి
నడుము నొప్పి యార్య !విడువ కుండ 

తులసిమాతనుబూజించదురితమబ్బు

ఆయురారోగ్యసంపదలధికమగును
తులసిమాతనుబూజించ,దురితమబ్బు
గోవులవధనుగావించుగ్రూరునకిల
రౌరవాదినరకములజేరుగూడ

Thursday, March 17, 2016

అరిగణమ్ములగెలిచె..........

ధర్మజునిదీవనమిగులదనకుగలుగ
నరిగణమ్ములగెలిచెనుత్తరుడెసంగి
పెద్దవారలదీవనల్కద్దునెడల
చేయగలరార్య!యెంతటిచేతనైన


Wednesday, March 16, 2016

హవనమ్ములుకీడుసేయు...........

అవకతవకగనుజేసిన
హవనమ్ములుకీడుసేయుననుటనిజమ్మే
పవిత్రభావముతోడన
హవనంబునుజేయవలయునార్యా!యెపుడున్

అప్పుచేసితినుము.......

పంచభక్ష్యములునుబరమాన్నముగూడ
అప్పుచేసితినుము,చిప్పకూడు
ఖైదునగలయట్టిఖైదీలుతిందురు
పరమసంతసమ్మువారికదియ

Tuesday, March 15, 2016

పేదవడినసురలలో........

ఆర్య!చక్కగబలికితిరయ్య!యిటుల
పేదవడినసురలలోకుబేరుడొకడు
తెలిసికొంటినియీరోజుతెలియరాని
నిజమునొకదానినిప్పుడునెమ్మనమున



K T R

ఒౌరాయేమనిజెప్పుదు
తారకరాముండుబుట్టెధరణినిమరియీ
తారకరామునిబేరున
నీరాష్ట్రముబాగుజేయనెంతయొవేడ్కన్

చిన్నతనమునుండిచెడునలవాట్లవి
యించుకైనలేకమంచివారి
తోడచేయికలిపితోటివారలకును
సాయమొనరజేయుసత్పురుషుడు


Monday, March 14, 2016

కంటెల్ మీ ..........

ఉంటిమిభారతభూమిని
మెంటలుమనకుండదార్య!మెదడున్నకతన్
వింటిమె?సమస్యయీయది
కంటెల్ మీగాడ్దిగుడ్డుకంకరపీచూ

ఆకాణవాణివార్తలు

ఆకాశవాణివార్తలు
మాకుంగాజెప్పుచుండెమామాతిపుడున్
చాకలిబట్టలనుతికెను
మాకుమ్మరిజేసెగుండలాహాయనగన్

Sunday, March 13, 2016


బెండచెట్టుకుకాచెను..........

బెండకాయలువిరివిగాపెరటిలోన
బెండచెట్టుకుగాచెనుబీరకాయ
శివునియాకారముధరియించియిటమాపె
రటన గాచెనుగనుటకురండిమీరు



Saturday, March 12, 2016

మధువునుగ్రోలెదరు...........

అధునాతనకాలములో
మధువునుగ్రోలెదరుదైవమందిరమందున్
మధువునుద్రాగెడువారికి
మధనంబేగలుగదెపుడుమందిరమనియున్

Friday, March 11, 2016

త్రాగుబోతుగొప్ప........

త్రాగుబోతుగొప్పతత్త్వవేత్తయెమరి
త్రాగిపలుకునిజముధరణినెపుడు
పాడుచుండునెపుడుపాటలరూపాన
తత్త్వములనునెన్నొతడుముకొనక

మాన్యుడు

సద్యపు స్ఫూర్తినిన్ వినయ సంపద లందుననుత్తముండునై
హృద్యము లైన కార్య తతు లింపుగ నేర్పున  జక్క బెట్టుచున్
వైద్యవిశారదుండు నుడువన్నిక దప్పదటంచు నించుకన్
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా  నుతింత్రు సజ్జనుల్

Thursday, March 10, 2016

చంపక మాలకు గణములు సభరన మయవల్

ఇంపుగ నజభజజజ రలు
చంపక మాలకు గణములు, సభరన మయవల్
సొంపుగ మత్తేభమునకు
చంపావతి ! తెలియు మమ్మ ,ఛందో గణముల్ 

Wednesday, March 9, 2016

చక్రాయుధము.......

చక్రియయగుటనగృష్ణుడు
చక్రాయుధమున్ధరించుశంభునకునతుల్
సక్రమమగుపధ్ధతిని
న్నక్రూరునిగాచినట్టియాదేవుడెయౌ

Tuesday, March 8, 2016

పట్టు గ్రహణ మ్ము శశి నమా వాస్యనాడు

పట్టు గ్రహణ మ్ము శశి నమా వాస్యనాడు
ననుట సరి కాదు పట్టును నర్కునిగద
పూర్ణిమనుసరి గ్రహణము బూర్తి గాను
శశిని బట్టును నొకసారి సాలునకట

కిరణ్

నీవుపంపినచిత్రమునేనుగంటి
నాట్యదుస్తులయందుననర్తకిలుగ
చాలబాగుండెనచ్చటశైలుమహిలు
చెప్పుమా!యాశిసులుమావిదప్పకుండ.

Monday, March 7, 2016

శంకరార్య!

నొప్పిదగ్గుటకొరకుగాదప్పకుండ
వోవరానుయస్సనుబిళ్ళబూర్తిగాను
మూడుపూటలువాడినముఖ్యముగను
మాయమగునార్య!నొప్పులుమాయమగును

పండు వెన్నెల గురిపించు భాస్కరుండు

నిండు పూర్ణిమ దినమున నీ రజారి
పండు వెన్నెల గురిపించు, భాస్కరుండు
వేడి గాలుల మనలను వివశు జేయు
సూర్య చంద్రుల తత్త్వముల్ చోద్య ముగద 

Sunday, March 6, 2016

శివరాత్రికి జేయవలెను శ్రీ హరి పూజల్

భువి జేయును జాగారము
శివరాత్రికి, జేయవలెను శ్రీ హరి పూజల్ల
నవరత మున్బ్ర తియొక్కరు
కువలయమున మంచి బ్రదుకు గూర్చుట కొ ర కున్

శివ రాత్రి

శివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని పలుకు నంత శివ సాయుజ్యం
బవ లీలగ లభియించును 
భవ భవ యని పలుక రాదె భాగ్యము కొరకై 

శివరాత్రిపర్వదినమున
పవలంతయుబూజజేసిభర్గునిభక్తిన్
చివరనయభిషేకమ్మును
సవినయముగజేయునెడలసంతసమొందున్

గిరిజా కళ్యాణము

గిరిజా కళ్యాణము శుభ
కరముగ జరుగు చుండె గాం చిరె  యచట
న్విరి దండను నా శివునకు
కరములతో వేయుచుండె గమనీయ ముగన్ 

Saturday, March 5, 2016

మధుసూదన.!..........

మత్తేభమ్మునగృష్ణుని
మత్తుగవర్ణించితీవుమధుసూదన!నే
నిత్తునునతులనుగొనుమా
యుత్తుత్తిగబలుకలేదుయొట్టునుసుమ్మా.

మినప రొట్టె దినగ ,మేను దగ్గు

ఒంటి బరువు పెరిగి యూబ కాయము వచ్చు
మినప రొట్టె దినగ ,మేను త గ్గు
భోజ నంబు బదులు పుల్కాలు దినినచో
నమ్ము డా ర్య !మీరు నాదు మాట 

కలవారలకున్ గరళము గావలెను సుమీ

ఇల నెన్నియొ నేరములను
నలవోకగ జేయువార లాప్తులు నైన
న్గలగల లాడగ ధనములు
కలవారలకున్ గరళము గావలెను సుమీ 

నమ్ముము నా వచనమ్ముల

నమ్ముము నా వచనమ్ముల
నమ్మకమున్బెట్ట నీదు హారము నెపుడు
న్నమ్మా ! సత్యము బలికితి
దెమ్మనినన్దెత్తు నిపుడె తీసుకు రానా ?

రావణకాష్ఠంబుమండెరగులు........

చేవగలదేహమగుటన
రావణకాష్ఠంబుమండెరగులుచువనధి
న్నేవారుదాటగలరన
నావానరుజేతనగునునార్యా!వినుమా.


అప్పులున్నవారెఘగొప్పవారు

తిప్పలెన్నొగలుగుధీమంతునకుకూడ
యప్పులున్న,వారెగొప్పవారు
కష్టసమయమందుకనికరముకలిగి
యాదుకొనగవచ్చునార్యులవని

పద్య రచన -పల్లీ ల ఉండలు

పల్లీ ల యుండ లచ్చట
ను ల్లము సంతోష బడగ నొప్పెను గనుమా 
మెల్లగ జని యచట కుమరి 
గుల్లగ నున్నట్టి యుండ గొనిరా పద్మా !

సెనగయుండలునికవేరుసెనగయుండ
లచ్చటముద్దుగానుండెనునార్య!కనిరె!
యొండుగలవటనువ్వులయుండలుమరి
యూరుచుండెనునిపుడునానోరుమిగుల

Thursday, March 3, 2016

పాపులుదుర్జను........

పాపులుదుర్జనుల్ఖలులుభ్రష్టులునీచులునీతిదూరులు
న్దాపుననుండుచున్మనకుదారనిశమ్మునుగీడొనర్చుగా
బ్రాపుగనుంటకైశివునిబ్రార్ధనజేయుటయొక్కటేమరి
న్నాపదలందుకాచెడుమహాత్ముడుశంకరుడేభువిన్గదా

పద్యరచన..తిరుగలి

గిరగిరదిరుగుచుదిరుగలి
సరసముగాబిండిజేయుచావలిమరియు
న్నిరవుగగోధుమలన్మరి
కరములతోబట్టిత్రిప్పకాంతా!యెరుకే?

వైధవ్యంబదిగలుగుట........

రాధా!తీరనిబాధయె
వైధవ్యంబదిగలుగుటవరమేజగతి
న్నాధుడుచక్కగనుండగ
దాధవునకుముందుబోవధర్మునిదరికిన్


Wednesday, March 2, 2016

పద్యరచన....పాము-గద్ద

తనదుకాళ్లతోపామునునొనరబట్టి
గద్దయక్కడతినుటకుసిధ్ధమయ్యె
బ్రహ్మసృష్టియేయదిగదబలముగలుగు
వారలుబలహీనులనిలబట్టితినుట

లచ్చిమగడువసించు.......

అరయవైకుంఠధామమునందుసుమ్ము
లచ్చిమగడువసించుగైలాసమందు
నాదిదేవుడువసియించునంబతోడ
మనలగాపాడనిరతముమాననీయ!


Tuesday, March 1, 2016

ఉడుతసాయము

ఉడుతతనవంతుసాయమునుత్సుకతన
జేయశ్రీరామచంద్రుడుచేతనిమురు
చుండెనచ్చటచక్కగజూడుడార్య,
పూర్వజన్మపుసుకృతముబొందెనుగద

పెండ్లిలోవధూవరులేల.......

పెండ్లిలోవధూవరులేలపేరిశాస్త్రి!
యెడమొకముపెడమొకముగనిప్పుడుండ్రి
కారణంబునుగనుగొనిగలుపుమయ్య!
నీవుమధ్యవర్తిగనుండినీతిగరపి

రాజరాజనరేంద్రుడు.........

కనినబిడ్డలవోలెనుకాంచెనెపుడు
రాజరాజనరేంద్రుడురాక్షసుండు
ప్రజలగోడునువినకుండప్రతిదినమును
వారకాంతలసరసనబ్రదుకునతడు