Friday, September 30, 2016

రాఘవుండు మండోదరీ రమణి కి బతి

రావణా సురుజంపెను రణము నందు
రాఘవుండు ,మండోదరీ రమణి కి బతి
రాక్షసులకు బ్రభువగు నా రావణుండు
సబబె యిట్లుగ బలుకుట సాధ్వి నకట


చమత్కార పద్యాలు – వాయుదేవ స్మరణ

వాయు దేవుడ !రక్షించు భరణి నెపుడు 
నీవు లేనిచో జీవించ రెవరు భువిని 
కూడు గుడ్డల గంటెను గూడ నీవు 
ముఖ్యుడవుగాన వినుముర మొరను నాది 

Thursday, September 29, 2016

వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్

వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగ
న్నద్దిర చక్క జెప్పితిరి యార్యులుఛత్రము వద్దులే యని
న్ముద్దగ బట్టలన్నియును ముడ్చుకు బోవుట యిష్టమా మరి
న్వద్దను చుంటి రి య్యెడను వర్షము వచ్చిన గుండపోతగన్ 

చమత్కార పద్యాలు-వరుణ స్మరణ

వరుణ దేవుడ !కావుము భద్రముగను
నీదు రాకకు జూతుము నిత్య మునిట
పాడి పంటలు గరువాయె భరణి యందు
కరుణ జూపుము మాపైన కడలి రాయ !

కుండ పోతవర్షమ్మున గొడుగు లేల

గొడుగు లేకుండ గనునెట్లు వెడలుదు వుర
కుండ పోతవర్షమ్మున, గొడుగు లేల
వాన వచ్చుట లేదుగా బయట జూడ
పోయి రమ్ముర సుఖముగ భువన గిరికి 

Wednesday, September 28, 2016

వాలిని జంపె రావణుడు పార్వతి శోకము గాంచి జాలితో

ఆలిని లొంగదీయుటను నాయత తేజుడు నోర్వలేకనే
వాలిని జంపె ,రావణుడు పార్వతి శోకము గాంచి జాలితో
బాలిక !యేమియీ పలుకు  పార్వతి శోకము గాంచియా తడు
న్జా లిని గల్గియుండెనట సంభవ మేయిది చింత జేయఁగన్ 

వాలి నిభ వాని కొఱకురావణుడు చంపె

అనికి సుగ్రీవు డెన్నిక యాయె సుమ్ము
వాలి నిభ వాని కొఱకు ,రావణుడు చంపె
యుధ్ధ రంగాన నెందరో యోధ వరుల
దనదు బాహుబ లముజూపి దర్ప మలర 

చమత్కార పద్యాలు -నిరృతి స్మరణ

నీర జాంబ క భూతుడు  నిరృతి యనగ
నగ్ర గోపుడు సద్గణేశా గ్రజుండు
మర్త్య సింహుడు నిరతము మనలగావు
గాత ! నతులను నిత్తును గరుణ కలుగ 

కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్

కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచు
న్గవిగా నిట్లుగ బల్కగా సబబె యేకాలంబు నందున్ మరి
న్గవియే దెచ్చును సౌఖ్యముల్మనకు దా కావ్యంబు మూలంబుగ
న్నవమానంబుగనే దలంతురట పై యామా ట బల్కన్సుమీ

Tuesday, September 27, 2016

కవియే మఱి పతనమునకు కారణ మగురా

యువకుల దేశికు డరయఁగ
గ వియేమఱి ,పతనమునకు కారణ మగురా
కవి చెప్పిన వినకుండిన
కవికింగల గొప్పదనము గాంచుము నరుడా !

చమత్కార పద్యాలు - - యముడు

ధర్మ పాలన త త్ప ర ! ధర్మ రాజ !
దేహ మారోగ్య ముండగ దేవ ! నాది 
తీ సుకొనుమయ్య ప్రాణంబు తీసుకొనుము 
ప్రణతు లిడుదును గాలుడ ! ప్రతి దినంబు .

ఉద్రేకము

ఉద్రేకముండ రాదుగ
యు ద్రేక మునుండు నెడల నూగును మేనున్
ఛి ద్రముగనగును గుండెలు
నుద్రేకము లేక యుంట నొప్పుగ నుండున్

మంచి చెడులను నెఱుగడు మదికి వచ్చి
నట్లు మాట్లాడు బంధు జ నముల హింస
పఱచు నొకటియ నగనేమి బహువి ధములు
గ మఱి బాధల గురి జేయు గక్ష తోడ

దరికి జేరరు బంధువుల్దాము గాను
మిత్ర వర్గము భయపడు చిత్ర ముగను
నొంటరి గను నుండ వలసి యుండు నెపుడు
కాడి మోయువా డు నుమరి కానరారు

బీపి సుగరులు రెండును బెరుగు నకట
కోప మెక్కువ గానుండి గుస్సు మనును
దీర్ఘ నిట్టూర్పు గాలుల దే లి యాడు
కనుక యుద్రేక మనునది పనికి రాదు


Monday, September 26, 2016

దత్తపది - 98 (విల్లు-అమ్ము-కత్తి-గద)భారతార్ధము

వైరి వర్గాలు కత్తిన బోరు సలుప 
యుక్తి పరిఢ విల్లు విధము ముక్తి కొరకు 
నొకరు మించి న మఱి యొక రుల్లమలర 
రాజ కీయమ్ము జేయుచు రాణకెక్క 
వీర పురుషుల కధగద భారతమ్ము 

చమత్కార పద్యము -అగ్ని దేవుడు

సర్వ భక్ష కుండు సద్గణ నాధుడు 
మహిత కరుడు మఱియు మణిక లాపు 
డైన యగ్ని దేవు డ హరహమ్ముమనల 
గాచు గాత ! తాను గాపు నగుచు 

sripaties family

నకులుని జంపె రామనరనాధుడు జానకి సంతసింపగన్

నకులుని జంపె రామనరనాధుడు జానకి సంతసింపగన్
వికటము గాను నుండె నిది బేలగమాటలు బల్కు టొప్పునే
నకులుడు భారతమ్మనగ నాబరఁగంగను రామభూపుడున్
నకులుని జంప నెట్లగు ననా దరణంబులు గా జూడుమా 

Sunday, September 25, 2016

నకులు జంపె రామ నరవి భుండు

దుష్ట బుధ్ది యుతుడు దూర్జటి భక్తుడు
రాక్ష సుండును నగు రావణుండు
సీత నపహరించు చెనటి యగుట న హీ
నకులు జంపె రామ నరవి భుండు

చమత్కార పద్యము -ఇంద్రుడు

దేవ గణముల కధిపతి చేవ యుతుడు
రత్న మణిమయ దేహుడు రమ్యు డార్య !
బ్రహ్మ పెదతండ్రి సహస్ర యం బకము లుగల
యింద్రు నకు వంద నంబులనిత్తు నిపుడు


వనమున సంచరించుటకు బధ్ధతు లుండవె యెంచి చూడగన్

వనమున సంచరించుటకు బధ్ధతు లుండవె యెంచి చూడగన్
వినుముర సంచరించుటకు వే నకువేలుగ బధ్ధతు ల్సుమా
వనమున సంచరించుటకు ,పాయుము సంశయ, మేలకో యిక
న్గనుమిక దారినిప్పుడు నెకాయెకిగా నటువైపు పోవుమా

Saturday, September 24, 2016

వనమున దిరుగుటకు లేవె పధ్ధతులు గనన్

కనగను నుండును బధములు
వనమున దిరుగుటకు ,లేవె పధ్ధతులు గనన్
వనధి ని దాటుట కొఱకును
ననువైనవి కావె మనకు నచ్చటి యో డల్ 

చమత్కార పద్యాలు-విష్ణువు

కనకగర్భుని పితరుడు కంస హరుడు 
విశ్వరూపుడు జగమున నశ్వరుండు 
శత్రు మూకను జెండాడు చక్రి కియిట 
మోకరిల్లుదు భక్తిని ముక్తి కొరకు 

Friday, September 23, 2016

చమత్కార పద్యము -బ్రహ్మ

సృజన జేసి మనల సృష్టి కర్త యగుచు 
నుదుట వ్రాయు ఫలము సదయు డగుచు 
బ్రహ్మ యనగ నతడు పరబ్రహ్మ రూపుడు 
వంద నములు సేతువంద లాది

జుట్టును లేని వాడు తన జుట్టును దువ్వెను మాటిమాటి కిన్

ఎ ట్టుల మాట లాడితివి యిప్పుడు చెప్పుమ యొక్క సారహో
జుట్టును లేని వాడు తన జుట్టును దువ్వెను మాటిమాటి కి
న్నె ట్టు గ నాప నిన్నతడు నేరుగజేయును జెప్పుమా సుధా !
పట్టున నొక్క  వెంట్రుకయు  బట్టగ లేకను సాధ్యమే యిలన్ 

జుట్టు లేని వాడు జుట్టు దువ్వె

కనులు  లేని వాడు కాంచిన జగమును
చేయి లేని వాడు చేయ పనులు
కాలు లేని వాడు గబగబ నడచిన
జుట్టు లేని వాడు జుట్టు దువ్వె 

పద్మవ్యూహమునగెల్చెఫల్గుణసుతుడే


పద్శాకారమువోలెను
ఛద్మముతోబేర్చినట్టిసాయుధసేనన్
పద్మా!చెదరంగొట్టుచు
పద్మవ్యూహమునగెల్చెఫల్గుణసుతుడే

పద్మవ్యూహమునగెల్చెఫల్గుణసుతుడే


పద్శాకారమువోలెను
ఛద్మముతోబేర్చినట్టిసాయుధసేనన్
పద్మా!చెదరంగొట్టుచు
పద్మవ్యూహమునగెల్చెఫల్గుణసుతుడే

Thursday, September 22, 2016

ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరో

అవని గిరీశ నందని సుహాసిని బేరను నొప్పి యామె తా
ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె, నతండు వింటిరో
భవహరు మీద గల్గెడు నవారిత భక్తిని నౌదలన్నిక న్
బవలును రేయియున్ననక ప్రార్ధన లెన్నియొ జక్కజేసెగా 

Wednesday, September 21, 2016

గణపతి

గణపతి ప్రార్ధన జదువగ
నణువణువును బులక రించె నార్యా !నాకున్
గణముల కధిపతి యగుటన
బ్ర ణ తుల నేనిడుదు నిపుడు భక్తిని మిగులన్ 

ధవుని పదమ్ములనుగొలిచి ధన్యత గాంచెన్

లవకుశ లిరువురు నొకపరి
యవనాశ్వము బట్ట తుదిని యదుకుల ప్రభువా
కవలల దీవించగ ,మా
ధవుని పదమ్ములనుగొలిచి ధన్యత గాంచెన్ 

చమత్కార పద్యాలుఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

మొదటి అర్థము - గణపతి స్మరణ

భూరి = పెద్దయగు
జఠర = కడుపు గలవారిలో
గురుఁడు = గొప్పవాడును,
నీరజ = నీటఁ బుట్టిన యగ్ని
అంబక = నేత్రముగాఁ గల శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అతిశయమైన
కరుఁడు = తొండము గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్ఠము
కలాపుఁడు = అలంకారముగా గలవాఁడును,
అలఘుసత్ = అధిక శ్రేష్ఠమైన
గణేశుఁడు = గణేశ నామము గలవాడును,
అగ్ర = ముఖ్యమైన
గోపుఁడు = వాక్కులు గల ప్రభువైనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్యసింహుఁడు = దేవతాశ్రేష్ఠుఁడును (అగు గణపతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

Tuesday, September 20, 2016

వడ్డీ చెల్లింప లేడు వర్షించుసిరుల్

అడ్డాల వారి యింటను
బిడ్డడు గాబు ట్టినట్టి వీరయ పంతుల్
లడ్డులన మ్మిన ధనమున
వడ్డీ చెల్లింప లేడు వర్షించుసిరుల్ 

పోకిరి కాశీపతి గారి పద్యము

భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గుణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు. 
----------
ఒక్క పద్యము నకుమరి చక్క నైన 
నర్ధ ములుముప్ప దిగలుగ నద్భు తంబు 
నట్టి పద్యమ్ము శోధించి నట్టి మీకు 
వంద నంబులు శంకర !యందు కొనుము 


సత్కవు లెల్లమూడు లయి చాలక పోయిరి పూరణమ్ములన్

  ఉత్కళ దేశ మందుగల నొక్క గృహంబున వాసముండుచున్
సత్కవి నంచు దానెపుడు చక్కగ బద్యము నొక్కటి న్మఱిన్
మత్కృత పద్యమేయనుచు  మచ్చున కైనను వ్రాయకుండగన్
సత్కవి మాటయే పలుక శ్రావ్యము కాకను నుండుటన్ భువిన్
సత్కవు లెల్లమూడు లయి చాలక పోయిరి పూరణమ్ములన్ 

Monday, September 19, 2016

సత్కవులు పూరణములకు జాలరైరి

బుధులు మెచ్చగ రచియింత్రు బోధ నాత్మ
కములు నైనట్టి సురుచిర కావ్యములను
సత్కవులు, పూరణములకు జాలరైరి
భావ సంపద లేనట్టి భవ్య కవులు 

Sunday, September 18, 2016

తన పార్టీ గెల్చి నంత దా నేడ్చె నయో

మనగను జాబుల నిచ్చెను
తన పార్టీ గెల్చి నంత ,దా నేడ్చె నయో
వినగను నోటమి కబురును
కనువెంబడి నీరు గార్చి కాలువ వోలెన్ 

పడతికి నాతి తోడనె వివాహము గావలె శాస్త్ర పధ్ధతి న్

గిడుగులయింట బుట్టిన నగేషుడు నీడగుగాదె యిప్పుడీ
పడతికి ,నాతి తోడనె వివాహము గావలె శాస్త్ర పధ్ధతి
న్నడరినరక్తి తోడన నహాయని లోకము గార వించగన్
విడివడ కుండ బంధము వివేకము తోడన జేయగా వలెన్ 

పడతి నాతి నే పెండ్లాడ వలెను వలచి

పడతి నాతి నే పెండ్లాడ వలెను వలచి
బాగు బాగుగ నున్నది వాక్య మదియ
దాని మూలాన తగ్గును ధరణి సంతు
లింగ భేదము లేకుంటయంగనలకు 

Saturday, September 17, 2016

రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్

రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడి
న్సోము డ  ! యేమి యీపలుకు శుద్ధిగ మాటలు రావవా ?యిక
న్నేమన వచ్చు నిన్నిపుడు నిట్లుగ బల్కుట కేమి త్రాగితే ?
మామను జూచితే యెటుల మాంద్యము తోడననుండెనో క టా !

రాముడురాక్షసుడుసీతరక్కసియయ్యెన్


భీముడుద్రాగినయప్పుడు
నేమేమోపలుకునెపుడునిరవగుసద్దు
న్నీమాటలుబలికెనిటుల
రాముడురాక్షసుడుసీతరక్కసియయ్యెన్

Friday, September 16, 2016

తల్లీ యని పిలుచు నంట తండ్రిని సుతుడే

అల్లదె యొకనాటకమున
దల్లిగదావే షమేయు తండ్రిని పిలువ
న్న ల్లరి పిల్లడు పలికెను
తల్లీ  యని పిలుచు నంట తండ్రిని సుతుడే 

Wednesday, September 14, 2016

బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్

ఆరయ ధర మిక్కుటముగ
వారములో బెరుఁగు కతన  వారింపంగ
న్నేరికి నేర్వక పోవుట
బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్ 

ఆహ్వానము

ప్రతిభ గలిగిన వచ్చును బ్రమద మలర 
భువిబు రస్కారములు గద పూర్ణ చంద్ర !
యర్హు డవ యీవు శంకరయ్య !నిజ  ముగను 
నాశు భసమయ ముననాదు హార్ధి కాభి 
వంద నమ్ములు దప్పక యందు  కొనుము 

Tuesday, September 13, 2016

మల్లియతీగకున్ గలిగెమామిడికాయలుమేలనన్ జనుల్

అల్లదెజూడుమాభరణి!హర్షముగల్గెనుజూడపూవులన్
మల్లియతీగకున్ గలిగెమామిడికాయలుమేలనన్ జనుల్
కల్లలుగాదునాపలుకుకాయలుజూడుడుచెట్టుపైనమీ
రెల్లరుకూడమీరిపుడునెంతగబాగుగనున్నవోకదా

మల్లియతీగియకు,గలిగెమామిడికాయల్

మల్లెలువిరబూసెనుగద
మల్లియతీగియకు,గలిగెమామిడికాయల్ 
ల్లల్లదెచూడుముకొమ్మల
నుల్లములేసంతసిలచునోహోయనగన్

పాలనుజూడంగపిల్లిభయపడిపారెన్

సలసలగాగుచునుబికిన
పాలనుజూడంగపిల్లిభయపడిపారెన్
బాలా!చూచితెనీవును
వాలమునున్ముడుచుకొనుచువడివడితోడన్

గరళముగ్రోలజూచెదవుకమ్మనిపాలనునేలద్రోచియున్


అరయగవెర్రియాకమలహాసన!పాలనుద్రాగకుండగన్
గరళముగ్రోలజూచెదవుకమ్మనిపాలనునేలద్రోచియున్
గరళమువోలెనుండెనె?నిగారపుపాలవిదెచ్చితిన్గదా
గరళముద్రాగుచోమరివిఘాతముగల్గునుమేనికిన్సదా

గరళముగ్రోలెదవుత్రోచికమ్మనిపాలన్

మరణముగలుగునుద్రాగిన
గరళముగ్రోలెదవుత్రోచికమ్మనిపాలన్
విరివిగనేలకొనీరము?
గరళమువలెనుండెనేమిగైకొనబాలున్

తల్లికిమీసముల్ మొలిచెదండ్రికిలేవదియేమిచిత్రమో


తల్లికిమీసముల్ మొలిచెదండ్రికిలేవదియేమిచిత్రమో
యుల్లముతల్లడిల్లెమరియూర్పులువచ్చెనుజూడగానవి
న్దల్లికిమీసముల్ మొలిచితండ్రికిలేమికిగానగాభళా
యల్లదెయెట్టులీజరుగుహాభగవంతుడ!మాకయిప్పుడున్

తల్లికిమీసములుమొలిచెదండ్రికిలేవే

అల్లాయేమీచిత్రము
తల్లికిమీసములుమొలిచెదండ్రికిలేవే
తల్లికిమీసములుండిన
దల్లులునికసాటియౌనుదండ్రులకిలలో

దత్త పది

తనరెడునసురలదండించగపియు
దానవంచియుతోకదగ్ధమొనర్చి
వానరప్రముఖుడువాయువేగమున
లంకయంతనుగూడలంకించెనపుడ


కోతికి జాబువచ్చె నని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా ?

ఈతర పట్ట భద్రులకు నెక్కడ జాబులు లేకయుండగా 
కోతికి జాబువచ్చె నని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా ?
కోతికి జాబు వచ్చుటనుగూడదు నెక్కడమిత్రమా గన
న్నత్తరి నేడ్వగా మనకు నాయది యెట్లుగ నుండునో గదా 

కోతికొక జాబువఛ్చిన గొల్లు మనెను

కోతికొక జాబువఛ్చిన గొల్లు  మనెను
జాబు వచ్చుట కోతికి జరుగు పనియ?
గొల్లు మనునది యెవ్వరు ?గురువ రేణ్య !
తెలియ జేయుడు మీరలు దెలిసి కొందు 

నిషిద్ధాక్షరి (కంది శంకరయ్య)


అంశం - సరస్వతీ స్తుతి
(కుండలీకరణాలలోనివి నిషిద్ధాక్షరాలు)
శ్రీ(క)దా ధీ(శ)దా మా(క)పై
(న)మోద(మ)ంబుల్ (గ)భా(గ)వ(మ)న లి(క)డి బ్రో(వ)చు(స)మ(త) వా(ణ)మా
(రెండు పాదాలకే నిషేధం ఇవ్వబడింది)
శ్రీదా! ధీదా! మాపై
మోదంబుల్ భావన లిడి బ్రోచుమ వామా!
నీదయ నేస్తము కవులకు
మాదగు భాగ్యమ్ము బట్టు మార్గము లిడుమా!

అక్కను బెండ్లి యాడె నొక డం దరు సంభ్రమ మంది చూడగన్

అక్కజ మాయె నాకది య యాయత రీతిని నొప్పు కొంటకే
చిక్కులు వెట్ట  మాకపుడు చేష్టలు లేకను మిన్న కుండగా
చక్కని రూపున్గలిగి సాధువు వోలెను నుండునట్టి మా
య క్కను బెండ్లి యాడె నొక డం దరు సంభ్రమ మంది చూడగన్ 

Monday, September 12, 2016

అక్కను బెండ్లాడె నొక్క డం దరు జూడన్

చక్కని యందము గలమా
య క్కను బెండ్లాడె నొక్క డం దరు జూడ
న్నొక్కడె కొమరుడు మామకు
మక్కువతో నొప్పుకొనెను మాబంధ మునున్ 

జనకుని దిట్టె నాత్మజుడు చయ్యన గార్చుచు మోద బా ష్పముల్

వినయ విహీనుడై యిల వివేకము లేక ను దూరు చుండెడు
న్జ నకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోద బా ష్పము
ల్ననయము దేవదేవుడు ,మహాత్ముడు శంకరుగొల్చు నెప్పుడు
న్ననుదిన మారవీంద్రుడు మమైక పు దృష్టి ని రాజితంబుగన్

భాద్రపదమ్మునశుక్లపక్షపు


భవహరుడైననీశునిలభాద్రపదమ్మునశుక్లపక్షపు
న్జవితినిజంద్రదర్శనముసర్వశుభమ్ములొసంగుమానవా!
వివరముగాగనీయదివివేకముతోడనుజెప్పితిప్పుడు
న్నవనితమోముతోడనుగణాధిపుపూజనుజేయుమాదగన్

భాద్రపద

పరగభాద్రపదపుశుక్లపక్షమందు
భక్తిశ్రధ్ధలతోడనపత్రిపూజ
నేకదంతునకిలజేయనీశుడైన
చవితిచంద్రుడుశుభములసర్వమొసగు

గురు స్మరణ


గురువులరయెడమీకుండిన
గురుతరమగుభక్తిజూడగూడినరక్తిన్
నిరతముజేతునుసామీ!
యిరవుగమరివందనమ్ములివిగోగొనుమా

కవిసమ్శేళనమనంగగడుభీతిల్లెన్కవనమునేర్చెనుగ్రొత్తగ
కవిశ్రేష్ఠులయెదుటజెప్పకవనముమిగులన్
వికలితహృదయుండగుటన
కవిసమ్శేళనమనంగగడుభీతిల్లెన్

కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే


కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే
యౌననిజెప్పగాదగునునూర్మిళ!యిప్పటిరోజులింతియే
మానుముశంకలన్నిటిని,మానసమందునసంతసంబును
న్బూనుచువడ్డికాకసలుబూర్ణముజేయుముపూర్తిగానికన్

వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్

వడ్డాదిరామచంద్రుడ!
వ డ్డీమరియెంతయగునొపట్టుకురారా
వడ్డీయిచ్చినచాలును
వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్

జనకుని దూషించె సుతుడు సజలన యనుడై

అనయము ద్రాగుట వలనన
జనకుని దూషించె సుతుడు ,సజలన యనుడై
తన దండ్రికి వినిపించెను
దన బాధను బూర్తి గాను దపనత తోడన్ 

Thursday, September 1, 2016

వారక ప్రాణముల్ గొనెడు వాడు గదా పరమాత్ము డన్నచో

వారక ప్రాణముల్ గొనెడు వాడు గదా పరమాత్ము డన్నచో
నారయ మీరు చెప్పినది యక్షర సత్యము గాదె యీభువిన్
వారక ప్రాణముల్నిడుచు ప్రాణుల నెప్పుడు రక్షజేయుచున్
మీరని ప్రేమతో వరలి ,మేదిని శాంతిని గల్గ జేయునే 

ప్రాణములను గొనెడు వాడు పరమాత్ము o డౌ

వీణా !వింటివె యియ్యది
ప్రాణములను గొనెడు వాడు పరమాత్ము o డౌ 
ప్రాణములు గొనుట మఱియును
ప్రాణముల నిచ్చునతడు పరమాత్ముo డే