Friday, October 21, 2016

సోదరా !

చదివితి శతకపు భాగము
చదువగ సంతసము గలిగె జక్కగ నుంటన్
చదువుల తల్లియ నిన్నిక
సదయను మఱి  జూచు గాక సహజ న్ముండా !

పాచికల నాడ యవసరం బదియ వలదు
భక్తి భావము దోడన పరమ శివుని
బూజ జేసిన నిచ్చును బుణ్య ఫలము
వేంక టేశుడు శంభుడు వేరు కాదు

భవ్యత నొందుట కొఱకు ను
నవ్యయుడగు గృష్ణు గొలువ నాతడు మనకున్
దివ్యంబగు మోక్షంబును
సవ్యంబగు రీతి నిచ్చు సహజ న్ముండా!

దేవ గురువు బృ హస్పతి తిరము గాను
శ్రవణ మందున నుండిన సర్వు లకును
నాయు రారోగ్య సంపద లన్ని గలుగు
సోమ వారపు దినమున శుభము గలుగు


వేంకటేశుని శతకము వీను లలర
చదువు చుంటిని నిత్యము, చదువు తరిని
స్వామి దర్శన మగు నట్లు భ్రాంతి గలుగ
మోకరిల్లుదు వెంటనే ముఖము దించి

సప్త గిరులను దాటుచు సంయమునన 
నిన్ను జూడగ రాగోర చిన్మయుండ !
మార్గ మధ్యము నందున మంగళమగు 
నీదు రూపము గన్ప డె  నిజము గాను 
సార్ధ కంబయ్యె నిజమునా జన్మ యికను 
నట్లె గావుము నాభాతృ హర్ష మొదవ


వినగను గాధలు నీయవి 
మనసున సంతోష మయ్యె మాన్యుడ వగుట
న్గను లార జూచు భాగ్యము 
నొనరగమఱి జేయుమార్య!యోనా సామీ !


శక్తి కొలదిని జేయంగ రక్తి తోడ 
పూజ నావేంక టేశుని మూల ప్రతిమ 
కు మరి స్వామియ యిచ్చును కువల యమున 
శాంతి ,సౌభాగ్యపు సిరులు ,సంతు వుయును 

జన్మలన్నిటికంటెనుజన్మమరయ
యిలనుమానవజన్మయేమేలుగదర
బుధ్ధితెలివియుజ్ఞానాన బూర్ణుడగుచు
మానవత్వముతోడనమసలుచుండు







No comments:

Post a Comment