Saturday, December 31, 2016

నూతనవత్సరమనుచువినోదములేలా

పాతదిరోతగదలచుచు
నూతనమునుగోరుకొనుచునూగుచునుండ
న్నీతరహాగాన్యాయమె
నూతనవత్సరమనుచువినోదములేలా

Friday, December 30, 2016

2017

భారతీయులనోములపంటగాను
వచ్చెరెండువేల్ పదిహేడువత్సరమ్మ
యాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కాచుగావుతమనలనుగరుణతోడ

పాడిపంటలవృధ్ధతబహుళమగుచు
కూడుగుడ్డలకెప్పుడుకొదవలేక
యైకమత్యముదోడననహరహమ్ము
పంచుకొందురుసంతోషపరిమళమును

తెలివితేటలయందునదెలివిమీరి
యేదిమంచిదియేదిచెడ్డదిపుడమిని
దాననెరుగుచుబ్రతియొక్కమానవుండు
మసలుచుండునునిరతముమాన్యువోలె

వత్సరమంతయునరయగ
మత్సరములువీడిజనులుమమతలతోడన్
నుత్సుకతలుగనబరచుచు
నుత్సవములుజేసికొండ్రునోపినగొలదిన్


అంతర్జాలమునేర్చిరి
వింతగనీతరమునాటిపిల్లలుమిగులన్
 పంతుళ్ళువారుమనకిక
సంతసమునవారియొద్దచట్టులుమనమే

సామరస్యముగలుగుచుసకలజనులు
వారువారలవృత్తులుభవ్యముగను
జేయుచుందురువిడువకన్యాయమెపుడు
సాలుమహిమయేయిట్లుండుసాంతముగను

నోట్లరద్దువలననోటమాటలులేక
నేమిచేయవలయునెందుభద్ర
పరచవలెను?మోడియెరుగలేనట్టిప్ర
దేశమనుచుజింతదీవ్రపరచె

మూఢాచారముముదితకుమురిపెమునొసగెన్

మూఢాచారములనునవి
గాఢముగాహత్తుకొనెనుకామినులకిలన్
 రూఢిగనుసంతుగలుగుత
మూఢాచారముముదితకుమురిపెమునొసగెన్

Thursday, December 29, 2016

రాధేయుడువెంబడింపరాముడుబారెన్

మేధావియనుచుబొగడగ
రాధామాధవుడుదానురయముననపుడున్
గాధలుజెప్పుచునిట్లనె
రాధేయుడువెంబడింపరాముడుబారెన్

Wednesday, December 28, 2016

శకునములకుభీతిలిరినాస్తికజనమ్ము

శకునములకుభీతిలిరినాస్తికజనమ్ము
సహజమయ్యది,యాస్తికుల్సహితమార్య!
భయము పడుదురుతప్పకవాటికిఃఃలను
శకునఫలితముమిన్నగజగతినుండు

పoటినొప్పి

పంటినొప్పినాదిమింటికెగసెనార్య!
వరుసమూడుపళ్ళుబలిమిలాగె
దినమువిడిచిదినముచనుచునుంటి నిసామి!
యెన్నిరోజులిటులనేగవలెనొ

Tuesday, December 27, 2016

అవకాశమ్ములవీడినన్నరులకాహ్లాదమ్ముసేకూరదే

అవకాశమ్ములవీడినన్నరులకాహ్లాదమ్ముసేకూరదే
యవకాశమ్ములవీడినన్నెటులనాహ్లాదమ్ముసేకూరునో
వివరంబిమ్ముమునెయ్యమాయిపుడయీవేళన్సమాచారము
న్నవగాహంబగుచొప్పునన్నిజమునాకర్ధంబునౌన్సుమాా

పార్వతీశుని యవధానము

తనరపార్వతీశునియవధానమందు
పాలుపంచుకొనినకవిపండితులకు
కార్యకర్తలకునిడుదుకరముమోడ్చి
వందనమ్ములునాయవివందలాది

యవకాశమువిడిననరులకాహ్లాదమ్మా

పవనా!చెప్పుమయీయది
యవకాశమువిడిననరులకాహ్లాదమ్మా
వివరణగోరుదుమరినే
వివరముగాజెప్పుమయ్యవిందునునిపుడే

వీరుడుపోవిడుచు,యుధ్ధవిముఖుండగుచున్

భీరుడుతావేడినచో
వీరుడుపోవిడుచు,యుధ్ధవిముఖుండగుచున్
 పారుటభీరునినైజము
వీరునిగానుంటమేలువేవిధములుగన్

Monday, December 26, 2016

అవధానంబొకప్రఙ్ఞయేనననసత్యంబేకదామిత్రమా

అవధానంబొకప్రఙ్ఞయేనననసత్యంబేకదామిత్రమా
యవధానంబదిప్రఙ్ఞనామిగులసత్యంబేమిత్రమాభువిన్
 వివరంబిచ్చితిచాలునారమణయావేశంబుగాబల్కుచో
నవధానంబదియెన్నడున్నరయయయ్యాకాదసత్యంబుదా

Sunday, December 25, 2016

అవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుడా

అవధానము ప్రజ్ఞయె మఱి
యవధానము జేయునతడు హరిహర సఖుడే
యవగతము లేనిపలుకిది
య వధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుడా 

Saturday, December 24, 2016

శంకరు నాశ్ర యించి రట సైయని క్రైస్తవు లెల్ల భక్తి తోన్

జంకక క్రైస్తవుల్ ద నరశంకరుడే తమ యేశు నంచు దా
పంకజ నాభునిన్ దయను భవ్యుని గొల్చుట మంచి దంచుచున్
శంకరు నాశ్ర యించి రట సైయని క్రైస్తవు లెల్ల భక్తి తోన్
శంకరు డిచ్చుదప్పక ను సర్వశు భంబులు నంచు బ్రీతి గాన్ 

శంకరుని గొల్చు చుంద్రు క్రైస్తవులు సతము

దైవ మొక్కడే వినుమరి ధరణి నుండు
నామములు బలు విధములు నమ్ము డార్య !
తనరశంభుడు క్రీస్తుగా గనబడుట న
శంకరుని  గొల్చు చుంద్రు  క్రైస్తవులు సతము 

Friday, December 23, 2016

శస్త్రశ్రేణులనుమించుసరిచిరునవ్వే

శస్త్రశ్రేణులనరయగ
శస్త్రశ్రేణులనుమించుసరిచిరునవ్వే
శస్త్రముచిరునగవులికను
నస్త్రములేయౌనుబ్రదుకయందరికెపుడున్

భర్తపరేతుడయ్యెననిభార్యయెనవ్వుటనమ్మశక్యమా

భర్తపరేతుడయ్యెననువార్తవినంగనెభార్యనవ్వెరా
భర్తపరేతుడయ్యెననిభార్యయెనవ్వుటనమ్మశక్యమా
యార్తినిరోదనంబుననహాపతి!వీడినయేమిచేయుదున్
 ధూర్తులునాకికన్భువినిదోరముగాబలునిందలేతురే

Thursday, December 22, 2016

భర్త మరణ వార్తను విని భార్య మురిసె

ఏక ధాటిగ నేడ్చెను భాగ్య లక్ష్మి
భర్త మరణ వార్తను, విని భార్య మురిసె
ముద్దు మురిపాల తోడనుముంచి తనను
రేయి బగలును దానుంట రీతి గాంచి 

Wednesday, December 21, 2016

న్యస్తాక్షరి - 38 (ఉ-త్త-రుఁ-డు) అంశము- ఉత్తరుని ప్రగల్భములు ఛందస్సు- ఉత్పలమాల మొదటి పాదం 1వ అక్షరం 'ఉ' రెండవ పాదం 7వ అక్షరం 'త్త' మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ' నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'

ఉత్తము డైన వాడిపుడు యుధ్ధము జేయగ సాయముండుచో
జిత్తుగ జేతు నత్తఱిని జేవను జూపుచు శత్రు సైన్యమున్
జిత్తము సంతసింపగను చె చ్చెర వైరుల జంపుదున్ననిన్
సత్తువ జూడుడీ యికను సాహస కార్యపు నాదు దాడులన్

అవధాానము

అవధానిపార్వతీశుని
యవధానముజక్కసాగునందరియెదుట
న్నవరసయుతముగమరియును
గవులెల్లరుమెచ్చువిధముకాంచుమురాధా!

Tuesday, December 20, 2016

అ మ్మా రమ్మనుచు బిలిచె నాలిని మగడే

తమ్ముని బెండ్లికి నేగగ
నిమ్ముగ నిక సిధ్ధమగుమ యెప్పటి వలెనే
కమ్మని పలుకుల యోసీ
తమ్మా రమ్మనుచు బిలిచె నాలిని మగడే 

Monday, December 19, 2016

దైవమ్మును నమ్మ కుండ దరమే యుండన్

దైవమె తల్లియు దండ్రియు
దైవమె మఱి యత్త మామ దైవమె గురుడున్
దైవము లేనిది లేదిల
దైవమ్మును నమ్మ కుండ దరమే యుండన్ 

దైవమును నమ్మ కుండగద ర మె యుండ

దైవమును నమ్మ కుండగద ర మె యుండ
కాదు ముమ్మాటి కినిసామి ! కాదు తరము
దైవ మనునది లేనిచో ధరణి యేది ?
యవని లేనిచో లేదుగా జీవ కోటి 

షటిల్

ఏమియయ్యెనోకుడిచేయియేమొకాని
సలుపుచుండెనువిపరీతసద్దుతోడ
నాడకూడదనుకొనుచునాడుచుంటి
దైవమేశరణుయికనుగావనన్నుపులుసుపోయెనునొడలంతసలుపువలన
నరమునరమునులాగుచునాట్యమాడె
పులకరంబునువచ్చెనుజలికిమిగుల
జండుభామునువ్రాయుదుజక్కజేయ

Sunday, December 18, 2016

వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడు భక్తి నెల్లరున్

వేశ్యను జూడగా ధరణి వేదము సాక్షిగ దల్లి భావనన్
లా శ్యము జేసివారి మది లాలన తోడున నుండగా మరిన్
వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడు భక్తి నెల్లరున్
వేశ్యల నెప్పుడున్నిలను వేరుగ జూడక నుంట మేలగున్ 

వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్

వేశ్యను వేశ్యగ జూడక
వేశ్యను దమ తల్లి వోలె వితరణ బుధ్ధిన్
పశ్యతి భావము గలుగుత
వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్ 

స్వాానుభవము

వచనముండదునాయొక్కరచనయందు
పద్యరూపానవ్రాయుదుభావమలర
సాధ్యమైనంతవరకునుసరళముగను
దేటతెల్లపుపదములమూటతోడ

కాామేశ

గణముగూర్చుకొరకుకామేశనామధే
యయని వ్రాసితినటయన్యముగను
దలచవలదునాదుతమ్ముడ!కామేశ!
కవులలోనమేటికవివినీవ

పద్యము

తప్పులసవరణకోరిక
నెప్పగిదినిలేనివారెయీసునతోడన్
తప్పులతడకలపద్యము
లెప్పుడుమరివ్రాయుచుండ్రునిలలోసుమ్మీ

అపరకoదివర్య!

అపరకందివర్యయాప్తుడకామేశ
నామధేయ!పూరణములుమావి
సదయజూసివలయుసవరణలనుజేయ
వలయుననుచునాదువాంఛవినుమ

Saturday, December 17, 2016

తాళము లోని కప్ప కడు దల్లడ మందె భయార్త చిత్తయై

వ్యాళము రాగ లోపలకు బంధు జనంబులు వేసె దా
తాళము ,లోని కప్ప కడు దల్లడ మందె భయార్త చిత్తయై
వ్యాళము జూచి నంతటను వ్యాకులచిత్తము దోడనత్తఱిన్
వ్యాళము గాంచినన్ భయము బారిని నొందుట సాజమే కదా 

గరిక పాటి కాడు గరిక పాటి

గరిక పాటి వారి కమ్మని పూరణ
దెలుపు డా ర్య !యిచట తెలిసి కొందు
మతని పూరణంపు చాతుర్య ప్రతిభను
గరిక పాటి కాడు గరిక పాటి 

తాళములో నుండు కప్పదడదడ లాడెన్

వేళా కోలము కాదిది
కాళిందుని బట్నమందు కాతర మగు నా
నా ళపు టడుగున గల పా
తాళములో నుండు కప్పదడదడ లాడెన్

గరిక పాటి వారి కమ్మని పూరణ
దెలుపు డా ర్య !యిచట తెలిసి కొందు
మతని పూరణంపు చాతుర్య ప్రతిభను
గరిక పాటి కాడు గరిక పాటి 

Friday, December 16, 2016

తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని చెప్పి రెల్లరున్

తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు గాడని చెప్పి రెల్లరున్
తిరుమల వేంకటేశ్వరుడు దేవుడు కాక మరేమగున్నిల
న్నురమును సాక్షిగా జెపుమ యోకవి పుంగవ ! వేంకటేశుఁడున్
ధరణిని దైవమే గదయ దా మనబోటి సుభక్త కోటికిన్


తిరుమలేశు డెట్లు దేవు డగును

తిరుమలేశు డెట్లు దేవు డగుననుట
నాస్తికుల పలుకులు నమ్మ వలదు
కలియుగమున మనకు కాంక్షితములు దీర్చు
దైవ మాయనగద కవి వరేణ్య !

Thursday, December 15, 2016

కాసులు జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్

కాసులు జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియు
న్నా సలు గల్గె వాటికిని నాయత రీతిని గాసు ల న్గనన్ 
వీసము నాలసింపకను వేగముగా నట చిందు లేయుచు న్ 
గా సర బీ సరన్ దిరుగు కాలక పీశు ల జూచితే శివా !

వాారసుడు

పోచిరాజవంశభూరుహమునకిల
వారసుండొకండువాహ్వయనగ
బుట్టెబూర్ణచంద్రుబోలుచువానికి
నిచ్చునాశిసులనునీశుడెపుడు

కాసులు గని వచ్చె గపులు గంతు లిడుచు

త మిని దానిమ్మ పండ్లుగా దలచి మదిని
మేటి రత్నాల కాంతుల మెఱయు చుండు
కాసులు గని వచ్చె గపులు గంతు లిడుచు
నాహ రించగ విత్తుల నార్య !యవియ

2017-స్వాాగతము

వచ్చుచున్నదికొత్తగావత్సరమ్ము
రెండువేలపదియునేడు,రండుమీరు
గౌరవంబునమరియునుకౌతుకమున
స్వాగతంబునుబలుకుగ సాలునిలకు

Wednesday, December 14, 2016

ఇనశశి బింబయుగ్మ ముదయించె దినాంత మునందు దద్దిశన్

కనుముర రాజ శేఖరుడ !కాంతులు జిమ్ముచు నాకసంబున
న్నినశశి బింబయుగ్మ ముదయించె, దినాంత మునందు దద్దిశన్
గనుమిక నెఱ్ఱ కాంతులు వికారము బుట్టు విధంబుగా మరిన్
 గనబడు చుండెనే జెపుమ కాంతుల మధ్య న వెల్గు నాశివున్ 

ఇన హిమకర బింబము లుదయించె నొక మొగిన్

కనియాా కుమారి యొద్దన
ని న హిమకర బింబము లుదయించె నొక మొగి
న్నె నరగ బౌర్ణమి రోజున
కనువిందగు జూడ మనకు గాంచిన గొలదిన్

Tuesday, December 13, 2016

గీతనుజెప్పెనర్జునుడుగీష్పతియేవినగన్ రణంబునన్

గీతనుజెప్పెనర్జునుడుగీష్పతియేవినగన్ రణంబునన్
గీతనుజెప్పెగృష్ణుడటగీష్పతిసాక్షిగగ్రీడికేగదా
తాతకుమందమర్పగుటదప్పుగజెప్పెనులెక్కజేయకన్
గీతనునెప్పుడున్జదువకేలునుమోడ్చుచుమోక్షమబ్బుగా

గీతనుబోధించెనరుడుగీష్పతివినగన్

తాతనునడుగగనిట్లని
గీతనుబోధించెనెవరికియెవరుచెపుమా
యాతడుజెప్పెనునిటులను
గీతనుబోధించెనరుడుగీష్పతివినగన్

దత్తజయoతి

చిత్రా!వింటివె యీయది
దత్తుడుమరిపుట్టెనంటదానీరోజున్
 దత్తాత్రేయుడెయాయన
దత్తునకున్నిత్తునతులుదప్పకనిపుడే

Monday, December 12, 2016

రాామాాయణము

రామరామయనుచురామునిదలచిన
రాముడిచ్చుమనకురాసులగమి
రాసులనగధనపురాసులుబు డమిన
నిజముబలుకుచుంటినిజముగాను

Sunday, December 11, 2016

జనకునిచావుపుత్రునకుసంతసముంగలిగించుసత్యమౌ

జనకునిచావుపుత్రునకుసంతసముంగలిగించుసత్యమౌ
జనకునిచావుపుత్రునకుసంతసముంగలిగించదెప్పుడున్
 గనుమురదుఃఖమున్గలిగికానగరానియవస్ధలెన్నియో
యనయముగల్గుచుండునుగదార్య!మరెందులకిట్లుపల్కిరే?

తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము

తీర నట్టిది యాలోటు నేరి కైన
తండ్రి మరణమ్ము, సంతోష దాయకమ్ము
మరణ మొందిన కొమరుడు మరల బ్రదుక
జరుగ వచ్చును నిట్లుగ నరుదు గాను
కొంత మందికి మాత్రమే కువల యమున 

Saturday, December 10, 2016

అరయగశంకరాభరణమందుసమస్యలవెల్లువేకదా

అరయగశంకరాభరణమందుసమస్యలవెల్లువేకదా
యురకలువేయపండితులయూహలు,భావములెన్నియోమరి
న్వరలినశంకరాభరణమందలిపూరణంబులేసుమా
వరమగుపాయసంబుగడుపారభుజించినదృప్తిమాదిరిన్

శంకరాభరణముసమస్యలకునెలవు

శంకరాభరణముసమస్యలకునెలవు
కాదుసామి!స మస్యలగణమునిజముకాదు
పూరణలుజరుగునిచటముఖ్యముగను
బరగనిదియొకమంచిదేవాలయమ్ము

2222

నాలుగురెండులవరకును
నీలహరీసాగుకతననింపయెమదికి
న్బాలా!యింకనునెన్నియొ
నలవోకగవ్రాయునేర్పునందీయుముమా

రెండువేలకుపైగనునుండెననుచు
సంబరమ్మునునొందితె సామిమీరు?
చాలదాసంఖ్య మీయండసామిమాకు
నుండునెడలనునింకనుమెండుగాను
వ్రాయనేర్తుముతప్పకవలదుశంక

Friday, December 9, 2016

బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్

అల రాహువు మ్రింగఁగ మఱి
బలవంతపు చావు వచ్చె భాస్కరునకట
న్నిల యంతయు జీకటి యయి
చలనమునే లేకయుండె జగతి యె సుమ్మీ

Thursday, December 8, 2016

బలరాముడుసీతజూచిఫక్కుననవ్వెన్

లలనలమాటలమధ్యన
చిలిపిగనొకలలనయనియెజెలియా!వింటే
యిలనీసంఘటన జరిగె
బలరాముడుసీతజూచిఫక్కుననవ్వెన్

Wednesday, December 7, 2016

సాహిత్యాధ్వ మున దుమ్ము సమధిక మయ్యెన్

హాహా హీహీ యనుచును
కుహనా గేయాలు వ్రాయ గోవిదు డనుచున్
హాహా యోహో యనుటన
సాహిత్యాధ్వ మున దుమ్ము సమధిక మయ్యెన్  

పొన్నగoటివాారు

ఈ రోజు రాత్రికి (7.12.26) బెంగుళూర్ నుండి హైదరాబాద్ కు ప్రయాణం.

ఈరోజువత్తురనగను
తీరనిసంతోషమయ్యెదేశికవర్యా!
యారోగ్యవంతుడువుగను
నీరాత్రికివచ్చుకతనయీమాదరికిన్

Tuesday, December 6, 2016

తప్పులు సేయుమానవుడె ధర్మవి దుండ న నొప్పు నెల్లెడన్

తప్పక దండనార్హు డిలదానగు నెప్పటి కైనను న్సుమా
తప్పులు సేయుమానవుడె, ధర్మవి దుండ న నొప్పు నెల్లెడ
న్నెప్పటి కప్పుడున్విమల చిత్తము తోడన నెల్లవారికిన్
 దప్పిక నో గిరంబులను దప్పక దీర్చుచునుండుచో భువిన్

జయలలిత

అమ్మా!
బడుగుజీవులుగుండెలుబ్రద్దలవగ
నేడ్చుచుండిరికంటివె?యేకధార
గాను,గదలిరావమ్మయొకపరికాంచి
నిన్నుసేదదేరుదురమ్మనిజముగాను

శాాస్త్రీజీ!

శాస్త్రిగారికినిడుచునుసాదరముగ
వందనంబులనేనిటపదులకొలది
శంకరాభరణమ్మునశక్తికొలది
వ్రాయగోరుదుబద్యముల్ప్రతిదినమ్ము

తప్పుసేయువాఁడె ధర్మ విదుడు

దండనార్హుడి లను దప్పక ధరణిని
తప్పుసేయువాఁడె ,ధర్మ విదుడు
ధర్మ శాస్త్ర ములను దాతె లియు నతడు
ధర్మ మునువి డువడు ధర్మ విదుడు

Monday, December 5, 2016

రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు సహస్ర నేత్రుడే

రాక్షస రాజుగా నెనరు రావణు డేలెను గన్నతండ్రిగా
రాక్షసు లెల్లరన్ ,సతము రక్షణ సేయు సహస్ర నేత్రుడే
యేక్షణ మందునై నమరి యేమరు పాటును లేక యుండగా
 వీక్షణ జేయుచున్ దివిని వేలుపు లందఱి బాగు లన్ సుమీ 

రాక్షసుల సహస్ర దృక్కు రక్షించు సదా

యక్షులు నరయగ బక్షమె
రాక్షసుల, సహస్ర దృక్కు రక్షించు సదా
యక్షయ పాత్రను బోలెను
భిక్షుల నందరిని దాను బ్రేమనుధరణిన్ 

దత్తపది

రాజ్యలాలసకొరకుకైకయ్యమాడ
సీ,త మరిటుసుమిత్రవాసిగనుమెలగు
చుండతారసిల్లగనెవ్వరుండరార్య
యనుచుబలికెనుగృష్ణుడునచ్చటపుడు

Sunday, December 4, 2016

అవధాానము

శంకరాభరణమునదిగ్గజమ్ములైన
కందిశంకరయ్యమరియుకవివరేణ్యు
డైనమధుసూదనుండునునరుగుకతన
దిగ్విజయమగుగావుత!దేవిదయను

సభికు లందఱు మెచ్చగ సరళ ముగను
 దిగ్విజయము గా నవధాన ప్రక్రియ యట
సాగి నందుల కెంతయో సంబ రమ్ము
నయిన  కతమున నతులివె యందఱకును 

Saturday, December 3, 2016

మూడును నాలుగున్ గలియముప్పది యూ గదలెక్క జూచినన్

ఏడగు నార్యవింటివిగ నెవ్విధ మున్మఱి కూడినన్సుమా
మూడును నాలుగున్ గలియ,ముప్పది యూ గదలెక్క జూచిన
న్నేడును గల్పగా నిటను  నిర్వది మూడున కిప్పుడీ తరి
న్వాడును వీ డు ను న్ననక పామరు డైనను జెప్పుదీని నిన్ 

మూడు నాలుగు గలిపిన ముప్పది కద

ఆర్యు లారవి నుడుమీ ర లగును నేడు
మూడు నాలుగు గలిపిన, ముప్పది కద
మూడు పదులను గలుపగ ముచ్చటగ ను
నెక్కములపుస్త కమ్మును జక్క జదువ
లెక్క లన్నియు వచ్చును మిక్కుటముగ

Friday, December 2, 2016

వరసురలోక మేగుదురు వారక చేసిన పాపకృత్యముల్

ఇరవుగ జేయ పుణ్యము లునేపున హాయిగ నెల్లవారునున్
వరసురలోక మేగుదురు ,వారక చేసిన పాపకృత్యము
ల్లరయగ బాపు లౌదురట,యా రడి వెట్టిన సాటి వారల
నిరతము బోదురయ్యెడను నేరుగగాలుని యొద్దకున్గదా

స్వర్గ లోక మేగె దరట పాపు లెల్ల

స్వర్గ లోక మేగె దరట పాపు లెల్ల 
రైన పుణ్యాత్ము లందఱు నరుగ వలెను 
నరక లోకమునకు మఱి న్యాయ మదియ 
కారణంబరయగబాపి  గణము దివిని 
నాక్ర మించుట మూలాన నట్లు జరుగు 

నాాన్నపుట్టినరోజు

భువినిమమ్ములవిడుచుచుదివికినేగ
భావ్యమేనీకు?చెప్పుమ!పరమపురుష!
మీరుపుట్టినయీరోజుమరువలేము
అంజలిఘటియింతునుమరియందుకొనుడు
( నాన్నపుట్టినరోజుసందర్భముగా)

సానుల పొందు గల్గిననె సత్పు రుషుల్ యశమున్ గడింతురే

సానుల పొందు గల్గిననె సత్పు రుషుల్ యశమున్ గడింతురే 
సానుల పొందునున్ గలుగ సత్పురు షుండ గు టొప్పునే ధరన్ 
సానుల గూడుచున్మసల జాడ్యము లెన్నియొ గల్గునే గదా 
తానుగ మంచియై యొరుల తా పము దీర్చిన గీర్తిగల్గు నున్ 

Thursday, December 1, 2016

సాని పొందున్న వారలే సత్పురుషులు

చాల మంది గల రట యీ జగము నందు
సాని పొందున్న వారలే ,సత్పురుషులు
శక్తి గొలదిని బరులకు సాయము నిల
జేయువారలే జగతిని శేఖరన్న !

న్యస్తాక్షరి వి -వా -హ =ము

వివిధ రకముల వాద్యముల్ వినబ డంగ
వార కాంతల నృత్యముల్ వాహ యనగ
హసిత వదనంబు తోడన హన్సి కచట
ముడులు వేయించు కొనియెను మూడు సామి !న్యస్తాాక్షరి"వి.వాా.హము

విడిదియంతటనిండగబెండ్లివారు
వాద్యఘోషాలువినువీధివ్యాప్తిజెంద
హర్షపులకితగాత్రయౌయాగిరిజకు
ముడులుమూడునువేసెనుమూర్తిరాజు