Wednesday, December 21, 2016

న్యస్తాక్షరి - 38 (ఉ-త్త-రుఁ-డు) అంశము- ఉత్తరుని ప్రగల్భములు ఛందస్సు- ఉత్పలమాల మొదటి పాదం 1వ అక్షరం 'ఉ' రెండవ పాదం 7వ అక్షరం 'త్త' మూడవ పాదం 14వ అక్షరం 'రుఁ' నాల్గవ పాదం 19వ అక్షరం 'డు'

ఉత్తము డైన వాడిపుడు యుధ్ధము జేయగ సాయముండుచో
జిత్తుగ జేతు నత్తఱిని జేవను జూపుచు శత్రు సైన్యమున్
జిత్తము సంతసింపగను చె చ్చెర వైరుల జంపుదున్ననిన్
సత్తువ జూడుడీ యికను సాహస కార్యపు నాదు దాడులన్

No comments:

Post a Comment