Monday, January 23, 2017

జ నవరి 26

జ నవరి 26
-------
మూడు రంగుల  జెండాను  ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది   నేత లపుడు
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును  బంచిరి  జనవ రి యిరు
వదియ   యారు తే దియుదయా న దిశ లెల్ల
మారు మ్రోగంగ రవములు  మదిని  నిండ

ప్రజల కొరకును నింకను బ్రజల చేత
బ్రజల వలనను మఱియును బ్రజల గూర్చి
యేర్ప డెను నీగ ణ న తంత్ర మప్పు డచట
సాటి నాయక గణముల సమ్ము ఖమున


 ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రము చిక్కి వోయె గణ నీ  యముగాన్

 గణనీయుల త్యాగముల
న్గు ణహీనులు ప్రభువు లగుచు  కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ! నీకు నతులు కాదన కమ్మా !


తృణభుక్కులు, స్వార్ధపరులు,
గుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయిన  భరతమాతకు
ననయము నిక యిచ్చు మోడి యా నందంబున్


 గణతంత్ర శుభాకాంక్షలు
వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గుణవంతుల నెన్ను కొనుడు కూరిమి తోడన్

సకల శుభములు గలిగించు శంకరుండు
గణన తంత్రపు దివసాన గుణము లాఱు
కలుగు నటులుగ దీవించి కరుణ తోడ
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళలీ వృద్ధుల చల్ల గాను .

( ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఇవి షడ్గుణములు.)
రచన = పోచిరాజు సుబ్బారావు

No comments:

Post a Comment