Tuesday, February 28, 2017

వదినాకౌగిటజేర్చుకొందునినునేస్వర్గంబుజూపించెదన్

వదినాకౌగిటజేర్చుకొందునినునేస్వర్గంబుజూపించెదన్
 మదికొవ్వెక్కియుపల్కుచుంటివిటయోమాతామహుండా!దగన్
  హృదిలోభీతియులేదనీకుమరియాహైమావతిన్గోరగా
పదికిన్దొమ్మిదిరెట్లుగావయసుదాభారంబుగాదాయికన్

వదినా!నీకందజేతుస్వర్గసుఖమ్ముల్

ఇదిగోయోయత్తదుహిత,
వదినా!నీకందజేతుస్వర్గసుఖమ్ముల్
 మదినిన్నేనేవలచితి
నోదమయంతీ!రాయనినుదయుడుపిలిచెన్

Monday, February 27, 2017

మగనిన్రోసిపతివ్రతామణికడున్మాన్యత్వమున్బొందెరా

తగురీతిన్దనపట్లదూకుడుగనేదానుంటచేనట్లుండెసూ
మగనిన్రోసిపతివ్రతామణికడున్మాన్యత్వమున్బొందెరా
మిగులన్సేవలుజేసిరేవగలుమామీనాక్షియెల్లప్పుడున్
 నిగమోక్తంబుగరీతిగాదనరిదానిష్ఠన్బ్రవర్తించుగా

మాన్యయయ్యెబతివ్రత,మగనిరోసి

భర్తసేవయేయికపరమార్ధమనుచు
సాధ్వియనసూయశిరముపైసరగుమోసి
మాన్యయయ్యెబతివ్రత,మగనిరోసి
పర్వువెట్టెనుబుట్టింటిపథమువైపు

Sunday, February 26, 2017

బాలురసంహరించిశిశుపాలుడు,కీర్తిగడించెబుణ్యుడై

పాలకుడయ్యునాతడిటపాలసుడయ్యెనునేమిఖర్మమో
బాలురసంహరించిశిశుపాలుడు,కీర్తిగడించెబుణ్యుడై
బాలలమంచిచెడ్డలనటబాగుగజూచుచున్యాయశీలుడై
లాలనతోడనుంటయనురాగమునొందెనువారినుండియున్

బాలురబరిమార్చినశిశుపాలుడ,నఘుడౌ

పాలకుడయ్యునుదుష్టుడు
బాలురబరిమార్చినశిశుపాలుడ,నఘుడౌ
బాలురమంచినిచెడ్డను
లాలనతోజూచునతడురహినీజగతిన్

ఖ్యాతిని గన్న వీరు డెవడన్న పు డుత్తరునే దలంచెదన్

ఖ్యాతిని గన్న వీరు డెవడన్న పు డుత్తరునే దలంచెదన్
మీత లపట్లుగా గలదు మేమిపు డేమియనంగ లేముగా
నాతలపెన్నగా వినుడు నాకవి భుండుని సూనుడే సుమా
ఖ్యాతిని గన్న భీరు డె వడన్న పుడు త్తరురునే దలంచెదన్ 

Saturday, February 25, 2017

దత్త ప ది

అంతరసికుడువాకీచకాధమ!యిక
నెవరుకాపుండునోజూతునిప్పుడేను
దనరనిన్నుగాయమునిచెంతకునుజేర్తు
బళిరనీవాపుకొందువాబలముతోడ?

Friday, February 24, 2017

భక్తునిదైవమేకొలుచువాడయిపొందె వరమ్ములెన్నియో

భక్తుడుమిన్నయేయనుచుబాఠకలోకముదెల్సుకోవలెన్
 భక్తునిదైవమేకొలుచువాడయిపొందె వరమ్ములెన్నియో
భక్తుడురక్తితోనిలనుబారమునొందునునిశ్చయంబుగన్
 భక్తునకెప్పుడున్నొసగుభాగ్యము,సౌఖ్యమునాయువున్సుమా

పఠానేని

ఎండలచ్చటయుండెనుమెండుగాను
జూడనెట్టునుదెలిసెనుసుమ్ముచంద్ర!
పయనమయ్యదిచేయుటవలనుకాదు
వేరుగాదలపవలదుమీరుమమ్ము

సకల శుభములుగలిగించుశంకరుండు
వినయునకునిచ్చుగావుత!వినయమికను
నాాయురారోగ్యసంపదలధికముగను
నుపనయనశుభవేళననుత్సుకతన

భక్తునిదైవమ్మెకొలిచి వరముల నందెన్

ముక్తేశ్వర ! వింటివ యిది
భక్తునిదైవమ్మెకొలిచి వరముల నందెన్
భక్తుని ఘనతయె యీయది
భక్తికి మఱి మూలము గద భరణిని రక్తిన్ 

Thursday, February 23, 2017

క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికి జేతురు శంభు పూజలన్

క్రీస్తునినే ధర న్నొగిని గేలును మోడ్చుచు బూజ సేతురే
క్రైస్తవు లెల్ల భక్తి, శివరాత్రికి జేతురు శంభు పూజలన్
వాస్తవ మొప్పగా బ్రజలు భక్తియు రక్తియు దోడు గల్గగా
నిస్తులు డైన శంకరుని నిక్కపు పుట్టిన రోజు గావుతన్

క్రైస్తవులపండగయెశివరాత్రియనగ

క్రైస్తవులపండగయెశివరాత్రియనగ
క్రైస్తవులుమరిబౌధ్ధులుముస్లిములును
శివునివేడుచుపండుగజేసికొనగ
దగును,శంభుడందరివాడెతరచిచూడ

బీరతీగకుగాచెమెండుగబెండకాయలుచూడుమా

బీరతీగకుగాచెమెండుగబెండకాయలుచూడుమా
బీరతీగకుగాచెనాయటబెండకాయలు?సామి!యీ
దారుణమ్మునుజూడగావలెధారుణీతలమందునన్
 మీరలందరిరాకగోరుచుమేమువేతుమురండిసూ

బీరతీగకు,గాచెనుబెండకాయ

బుల్లిపిందెలువచ్చెనుభువన!చూడు
బీరతీగకు,గాచెనుబెండకాయ
పెరటిలోపలమొలిచినబెండమొక్క
కాపుకాయుటమొదలిడెనేపుగాను

Wednesday, February 22, 2017

విబుధవరేణ్యా!

గుర్తునుబెట్టిరియార్యులు
గుర్తునకర్ధమ్ముదెలుపగోరుదుసామీ!
కర్తలుగర్మలుగ్రియతో
భర్తీయైలేదరచనభావములేదా?

అయ్యో!వందనమంటిరి
యయ్యా యిదిన్యాయమగునె?నర్హతగలదే
యియ్యంగాదీసికొనగ?
వెయ్యింతలనతులుమీకువిబుధవరేణ్యా!

Tuesday, February 21, 2017

ఖర పాదమ్ముల సేవ మానవుల కు న్గళ్యాణ ముల్ గుర్చుటగూ ర్చుతన్

ఖర పాదమ్ముల సేవ మానవుల కు న్గళ్యాణ ముల్ గూ  ర్చుతన్ 
ఖర పాదమ్ముల సేవ మానవుల కున్ గష్టo బు  లీడే ర్చునే
ఖర పాదమ్ముల దా క గా నెపుడు నోకాంతమ్మ !పోబోకుమా
యిరవుoగా దది గానె  ఱుంగుమిక నేయేవే ళ లన్ బో సుమీ 

ఖరపదములసేవయొసగుగళ్యాణమ్ముల్

పరిపూర్ణుడునిశ్చలుడును
నిరతముదాయోగమందునిండినయతడు
న్పార్వతియుతుడగుశశిశే
ఖరపదములసేవయొసగుగళ్యాణమ్ముల్

రాముడు,వియ్యమందెనుబలరామునితోరవిచంద్రసాక్షిగా

బాములనెన్నియోబడెనుభార్యయుదానునునావనిన్దగన్
రాముడు,వియ్యమందెనుబలరామునితోరవిచంద్రసాక్షిగా
న్నామహితాత్ముడానరుడుహర్షముతోశశిరేఖనున్మరిన్
కోమలియైనయామెనికకోడలుగామదినెంచెనప్పుడున్

Monday, February 20, 2017

రాముడువియ్యంకుడుబలరామునకుగదా

రాముడుమరిబలరాములు
సోముడ!యికజెప్పునీవుచుట్టములేనా?
యేమీసందియమేలకొ?
రాముడువియ్యంకుడుబలరామునకుగదా

Sunday, February 19, 2017

కులటను గాంచి భూమి సుత కోరికతో గురు లల్ల బిల్చెరా

కులటల ?సాధ్వు లా యనెడు కుంచితబు ధ్ధిని లేనిదౌ టనే
కులటను గాంచి భూమి సుత కోరికతో గురు లల్ల బిల్చెరా
లలనలు తోటి భామినుల రాక్షస భావము తోడ గాకయా
లలనల బ్రేమ పూర్వకపు లాలన తోడ న జూడనొప్పు సూ 

కులటంగని పిలిచి సీత కురు లల్ల మనెన్

లలనా మణులకు శత్రువు
లలనలలే యనెడు మాట రహితము జేయన్
కులట య ?సాధ్వియ ?దల పక
కులటంగని పిలిచి సీత కురు లల్ల మనెన్ 

Saturday, February 18, 2017

బెదరి పలాయతుండయెను పృచ్ఛ కులంగ నగన్ వధానియే

చదువది శూన్యమై ధరను జాలక శక్తి యు జెప్ప పద్యముల్
బెదరి పలాయతుండయెను పృచ్ఛ కులంగ నగన్ వధానియే
బెదరి పలాయతుండగుట పెద్దరికంబును గాదు గా ధరన్
పదును నెఱింగి పృచ్ఛకుల బ్రశ్న ల కుత్తర మీయగా దగున్ 

పృచ్ఛ కులగాంచి యవధాని బెదరి పా ఱె

కొఱ క బడరాని పదములు గూర్చి మిగుల
వీలుకాని స మస్యలు  విసరు నట్టి
పృచ్ఛ కులగాంచి యవధాని బెదరి పా ఱె
ననువు గానిచోదలదూర్చ వ్యర్ధ మనుచు


కందిశంకరులాదిగాగలుగునట్టి
పృఛ్ఛకులగాంచియవధానిబెదరిపారె
దనదుధారణాశక్తినిదలచిమదిని
ననువుకాదనియవధానమచటతనకు

Friday, February 17, 2017

ఆలు లేని మగడు హాయి నందు

ఆలు లేని మగడు హాయి నందనుమాట
యక్ష రా ల నిజము హర్ష !యదియ
చీకు చింత లేని జీవనంబు గడుప
వచ్చు మనము దైవ ప్రార్ధన మున

Thursday, February 16, 2017

కుందేటికికొమ్ముమొలిచికులుకుచునడచెన్

అందముగలయొకభామిని
విందునకున్వచ్చియచటవేవురియెదుటన్
 చిందులువేయుటజూడగ
కుందేటికికొమ్ముమొలిచికులుకుచునడచెన్

రాధనుబెండ్లియాడె.రఘురాముడుభూజనులెల్లమెచ్చగన్

మాధవుడయ్యెడన్ దనదుమానసమందునబ్రేమమీరగన్
 రాధనుబెండ్లియాడె.రఘురాముడుభూజనులెల్లమెచ్చగన్
 భూధరరాజకన్యకగుభూసుత.సీతనుబెండ్లియాడెయా
మాధవుకోలమున్ విరిచి మాన్యుడయయ్యెనులోకమంతకున్

Wednesday, February 15, 2017

రాధనుద్వాహమాడెను,రామవిభుడు

జగమునాడించుకృష్ణుడుసాధ్వియైన
రాధనుద్వాహమాడెను,రామవిభుడు
పెండ్లియాడెనుసీతనువిల్లువిరిచి
రాజులందరుజయజయరావమిడగ

Tuesday, February 14, 2017

గద్వాలానలముగాల్చెగదలంకనయో

విద్వాంసులుసెప్పిరియిటు
గద్వాలానలముననగఖడ్గముగదయున్
 విద్వత్తేజుడుకపితా
గద్వాలానలముగాల్చెగదలంకనయో

సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించె గాంచుమా

సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించె గాంచుమా
సుమమున సూనముల్దగ సుశోభిత మై జనియించు టు o డునా
విమల మనంబు తోడనవివేకము జూపుచు బల్కె యీయది న్
వరమది నాదు మాటనున వారిత రక్తిని జూడ గోరెదన్ 

Monday, February 13, 2017

కుసుమ మందున గుసుమముల్ బ్రసవ మగును

రెండు శిరములు గలయట్టి బుడత వోలె
కుసుమ మందున గుసుమముల్ బ్రసవ మగును
వింత లెన్నియో జరుగును విశ్వమందు
చూచు చుండుము సోదరా !చోద్య ములను 

భయపడినంతవీరుడనిపల్కుచుమెచ్చిరిలోకులెల్లరున్

భయపడినంతవీరుడనిపల్కుచుమెచ్చిరిలోకులెల్లరున్
 భయపడినంతభీరుడనిబల్కగనొప్పునుగాదెయిధ్ధరన్
 రయమునసాగుముందునకురాజసమొప్పగవీరుడెప్పుడున్
  జయమునుబల్కగాదగునుసాయుధవంతునకేగదాయికన్

Sunday, February 12, 2017

భయపడగ.వీరుడనిజనుల్ బ్రస్తుతింత్రు

అనునయించెనుమానాన్నతననుజూచి
భయపడగ.వీరుడనిజనుల్ బ్రస్తుతింత్రు
సాహసంబునరిపులనుసంహరించ
సాహసంబులుగలచోటజయములుండు

Saturday, February 11, 2017

శంకరార్య

పోయె ననుకున్న సొమ్ములు పొందు కత న
మిమ్ము  లనభి నం దింతును నిమ్ము గాను
పోదు కష్టార్జి తంబది పుడక యైన
నిలవదెప్పుడు మనయొద్ద యొరుల సొమ్ము 

గర్ణుని యా యువు చెల్లగ గెలిచినట సుయోధను డ నిలో

అవనిని గలిసె గర్ణుని యా
యువు చెల్లగ, గెలిచినట సుయోధను డ నిలో
నవహేళన జేయుట గద
పవన సుతు న్  గెల్వ ననిని వశమే దలపన్ 

Friday, February 10, 2017

దత్తపది

శైశవముదాటిపెండ్లీడుశర్మ!వచ్చె
వేచియుండుటపాడెయే?విమలచరిత!
దాచితినిధనమునుమరిదానికొరకు
చూచుకొనుమురచక్కనిచుక్కనికను

తాతాసాందీపశర్మ

ఈతరముకవులయందున
ధారుణిమిగులన్తాతాసాందీపశర్మ
 దాదనదగుశైలినినట
చేతోమోదంబుగలుగజెప్పగవలయున్

వరపితృవాక్యపాలనమె,పాపులజేయునుపుత్రసంఘమున్

అరయగసాధుశీలునిగనార్తులరక్షణజేయనిచ్చెడున్
 వరపితృవాక్యపాలనమె,పాపులజేయునుపుత్రసంఘమున్
 దురితముదానుజేయుచునుదోహదపర్చినమీదుమిక్కిలిన్
 బరమయుదాత్తుగైవడినిభారముదైవముపైనవేయుమా

పితృ వాక్పాలనమె సుతుని వృ షభుo జేయున్

పితృవరులు గూ ళులగు నెడ
పితృ వాక్పాలనమె సుతుని వృ షభుo జేయున్
పితృ వాక్పాలన మనునది
పితరుని  దే బాధ్యతదియ వేంకట రమణా !

Wednesday, February 8, 2017

పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు

పంటల నొసంగని పొలము పసిడి నిచ్చు
నందు సందియము వలదార్య !యాపొలమున
వ రుసనిండ్లను గట్టిన వలసి నంత
ధనము నార్జింప వచ్చును దధ్య మిది య

Tuesday, February 7, 2017

ఖ్యాతిని గన్నట్టి వీరుడననుత్త రుడే

చేతల జేవను జూపక
కోతలనే గోయుచుండి కూరిమి తోడన్
నా తుల బొగడ్త లందుచు
ఖ్యాతిని గన్నట్టి వీరుడననుత్త రుడే  

శుభాకాంక్షలు

శ్రీకారము తోనిరువురి
నేకమును న్జేయదలచి యీమూర్తమునున్
బ్రా కటముగ బెట్టించిరి
శ్రీకర పండితుల చే త సిరులు న్గురవన్

వరుడు పుట్టెను బలభద్ర పాత్రు నింట 
వరలు పోచిరాజనబడు వంశ మందు 
వధువు పుట్టెనుభరణిని భరణి వోలె 
జూడ చక్కని జంటయే సొబగు లోన

 ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
   యగ్ని  సాక్షిగ నొకటిగ  నగుట కొఱకు
   వేచి యుండిరి యిరువురు వినయముగను
   వరలు  కళ్యాణ ఘడియలు  వచ్చు వరకు
ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

 కల కాలము మీ రిద్దరు
   కలసి మెలసి జీ వితమును గడుపుచు పతి ప
   త్నులు మిత్రులు గా కష్టం
   బుల సుఖముల  దోడ యి  శుభముల  నంద వలెన్


అమ్మ ! అశ్వని !


త నర రఘువంశి యే నీకు తగిన భర్త
యతని కనుసన్న మెలఁగుచు నహరహమ్ము
చీకు చింతలు లేకుండ జీవితమ్ము
సాగి బోనిమ్ము హాయిగ శర్వ పుత్రి !

 అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగిఅప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదమ్మ!వినుము


పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
యి వ్వ ధూవరు ల నిరత మింపు మీర

(రచన ==పోచిరాజు సుబ్బారావు )

గురువుల తప్పు పట్టుట యె కూర్చు యశంబిల శిష్య కోటికిన్

గురువుల తప్పు పట్టుట యె కూర్చు యశంబిల శిష్య కోటికిన్
గురువుల దప్పు పట్టుటను ఘోరమయూ  నను భావ మొందుచు
న్ని రతము గారవంబున ననేక విధంబుల వందనంబుల
న్ని రవుగ నీయ శ్రేయము వివేకము తోడనశిష్య కోటికిన్ 

Monday, February 6, 2017

గురుల దోషంబులన్ శిష్య కోటి పట్టు

ఎన్న డైనను కూడదు గద యిది యటంచు
గురుల దోషంబులన్ శిష్య కోటి ,పట్టు
కొనగ వలయునా తనిబ్రతిభ ను ని రతము
శిష్యు డుండవలయునుసూ చెలిమి తోడ


గణ యతు లుజ్జ గించిననె గారవ మందును పద్య కావ్యముల్

గణముల తోడ వ్రాయుటకు గా దగు శక్తియు లేక చెచ్చెర న్
గణ యతు లుజ్జ గించిననె గారవ మందును పద్య కావ్యము
ళ్లణువునునొప్ప డట్లన,గ దా ర్య !మరింతగ నీఛమౌ సుమా
గణ యతు లుండ యందమును గారవ మబ్బును గాదె యెల్లెడన్

Sunday, February 5, 2017

గణ యతులు లేని పద్యంబు గణన కెక్కు

చెత్త చె త్తగా రచనలు సేయు వారి
భావ మిట్లుండు నిరతము బంకిలముగ
గణ యతులు లేని పద్యంబు గణన కెక్కు
వారి సంస్కార మదియ యో పాండురంగ !

Saturday, February 4, 2017

రమణియఙ్ఞోపధారణముజేసె

నాదుకొమరునినుపనయనముదినమున
వేదమంత్రాలఘోషణవిబుధవరుల
పిక్కటిల్లగదశదిశల్లొక్కసారి
రమణి!యఙ్ఞోపధారణముజేసె

ఈ శుడుశంకరుండవతరించెనురాముడుగాధరాస్ధలిన్

ఆశలుదీర్చగాబ్రజకునాదిభవుండునుబార్వతీప్రియుం
డీశుడుశంకరుండవతరించెను,రాముడుగాధరాస్ధలి
న్నాశముజేయరాక్షసులనాకముభూమినిరక్షసేయగన్
 దాశరణీయగానిలకుదాశరధింగనుజన్మనొందెసూ

ఈ 

శంకరయ్య గారు

చింతబడకుడుమీడబ్బుచేరుమిమ్ము
వ్యవధిపట్టునుదిరిగిరాయార్య!యదియ
నాకుపట్టెనునొకసారినాల్గుపగలు
జరుగుచుండునునిట్టివిజగమునందు 

Friday, February 3, 2017

శంకరుడవతరించిదాశరధియయ్యె

ధర్మరక్షణగావించెధరణినాది
శంకరుడవతరించి,దాశరధియయ్యె
దశరధునిగొమరుడుగనుదాజననమ
గుటన.మంచిపాలననిచ్చెగువలయమున

Thursday, February 2, 2017

రధసప్తమి

జిల్లేడుపత్రమందున
నల్లదెయారేగుపండునానిచిమిగుల
న్నోలాడదానమాడగ
నుల్లముదాదప్పకుండనొందునుముక్తిన్

దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తముల న్ ద్యజింపుమా

దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తముల న్ ద్యజింపుమా
పౌరులు నీదు మాటలను బూర్తిగ నమ్మరు కారణంబునా న్
దూరముగా జరింపవలె ధూర్తునకు త్తము లౌను వారిని
నార్తిని గుండెకున్నునిచి యాదర మొప్పగ జూడ టొప్ప గున్ 

ధూర్తుని తో మైత్రి జేసి తొలగుడు సుజనున్

మూర్తీ ! యేమని యంటివి
ధూర్తుని తో మైత్రి జేసి తొలగుడు సుజనున్
ధూర్తుని వోలెను నీవును
గర్తవ్యపు బోధనమ్ము గావించితివా ?

Wednesday, February 1, 2017

హారములేకపోయిన,మహాప్రళయమ్మెసముద్భవించెడిన్

నీరముమాత్రమేగొనుచునీరజనాభునిగొల్వుమాసమా
హారములేకపోయిన,మహాప్రళయమ్మెసముద్భవించెడిన్
 ధారుణిశత్రుభావములుదారుణమొందగరక్తధారలే
గారుచునొక్కరొక్కరుగగాలునిచెంతకుబోవుచుండుటన్

హారములేకున్ననగు,మహాప్రళయమ్మే

నీరసముమూర్చ యు నునా
హారములేకున్ననగు,మహాప్రళయమ్మే
కారడవినిబెనుమంటలె
యూరికివ్యాపించునెడలనూరేగాలన్

సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నీక్ష్యతన్

ఇరవగుగాదెయయ్యవియధేఛ్ఛగవేమరుసంచరించగన్
 సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నీక్ష్యతన్
 మురికినిగూడినట్టివిసమూలముశుభ్రముజేయగోరుచో
నరయదమంతదామికసహాయముజేసికొనంగనొప్పగున్