Tuesday, February 7, 2017

శుభాకాంక్షలు

శ్రీకారము తోనిరువురి
నేకమును న్జేయదలచి యీమూర్తమునున్
బ్రా కటముగ బెట్టించిరి
శ్రీకర పండితుల చే త సిరులు న్గురవన్

వరుడు పుట్టెను బలభద్ర పాత్రు నింట 
వరలు పోచిరాజనబడు వంశ మందు 
వధువు పుట్టెనుభరణిని భరణి వోలె 
జూడ చక్కని జంటయే సొబగు లోన

 ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
   యగ్ని  సాక్షిగ నొకటిగ  నగుట కొఱకు
   వేచి యుండిరి యిరువురు వినయముగను
   వరలు  కళ్యాణ ఘడియలు  వచ్చు వరకు




ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

 కల కాలము మీ రిద్దరు
   కలసి మెలసి జీ వితమును గడుపుచు పతి ప
   త్నులు మిత్రులు గా కష్టం
   బుల సుఖముల  దోడ యి  శుభముల  నంద వలెన్


అమ్మ ! అశ్వని !


త నర రఘువంశి యే నీకు తగిన భర్త
యతని కనుసన్న మెలఁగుచు నహరహమ్ము
చీకు చింతలు లేకుండ జీవితమ్ము
సాగి బోనిమ్ము హాయిగ శర్వ పుత్రి !

 అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగి



అప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదమ్మ!వినుము


పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
యి వ్వ ధూవరు ల నిరత మింపు మీర

(రచన ==పోచిరాజు సుబ్బారావు )

No comments:

Post a Comment