Friday, March 31, 2017

నారద ముని సత్తమునకు నలువురు భార్యల్

ఆరయ భక్తియు కలహము
నారాయణు గాన మదియ జ్ఞానము లవియే
యూరా యనునటు గలుగుత
నారద ముని సత్తమునకు నలువురు భార్యల్

Thursday, March 30, 2017

తనయుడె తండ్రికిన్ దలను దన్మయ మొందగ గీకె నవ్వుచున్

అనయము ద్రాగు చుండియు సహాయము జేయక దిర్గు చుండగా
తనయుడె  తండ్రికిన్ దలను దన్మయ మొందగ గీకె  నవ్వుచున్
వినుముర దండ్రు లెప్పుడు వివేకము తోడను మెల్గుచో మరిన్
దనయులు వారి కిత్తురు గ ధైర్యము , ద్రా గక నుండు మార్గమున్

తనయుడె తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ

వినుమా  సోదర ! యియ్యది
తనయుడె  తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ
వినుటను  జరిగినె  నిట్లుగ ?
మునుపెన్నడు గాని  నీకు  మోమిడి  చెపుమా !


Wednesday, March 29, 2017

గరుడుని చూచి నంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై

ఇరవని జాటు మార్గమును నెంచుకు బోవుచు నుండగా నటన్
గరుడుని చూచి నంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్ర మూర్తియై
పరమ విరోధి దానగుట పాము భయంబును నొంది   యత్తఱి
న్న రయగ సాజమే గద వినమ్రతగాను జరించు టి ధ్ధరన్

గరుడుని హరి చూచి నంత గ్రక్కున మ్రొక్కెన్

ఇరవుగ  రమ్మని బిలిచెను
గరుడుని హరి చూచి నంత, గ్రక్కున మ్రొక్కెన్
గరుడుడు వచ్చుచు నతనికి
పరమాత్మా !వందనములు బాయకు  నన్నున్

Tuesday, March 28, 2017

శంకరార్య!

లలిత పదజాల ములతోడ లహరి వోలె
సాగె మీయది కవనమ్ము  శంకరార్య!
యేమి భాగ్యము మాయది యీపుడమిని
మీకు శిష్యుల మైతిమి మేము  మరిని

శుభాకాంక్షలు హేవిళంబి

క్రొత్త వ త్స రమ్ము  కోరి రాగంగను
బ్లా గు  కవుల కిత్తు  వందనములు
హేవిళంబి మీకు హితము నొసఁగు గాక !
వత్స రమ్ము పూర్తి వరకు  ధరను

విషమును ద్రాగె మాధవుడు విందనుచున్పరమాను రక్తితోన్

ఉషను నడుంగగా బలికె సూ సభయంతయు దేరిజూడగన్
 విషమును ద్రాగె మాధవుడు  విందనుచున్పరమాను రక్తితోన్
 విషయమ యియ్యదే యిక వివేకము తోడ నజెప్పితిన్సుమా
విషమును ద్రాగె మాధవుడు వేగముగా గను దప్పిగొనంగన్

శ్రధ్ధాంజలి

అత్త! మేనత్త! నీవును నరిగితీవ
శోక సంద్రాన  మమ్ముల స్రుక్క జేయ
జాలి యనునది యిసుమంత కలుగ లేదె?
యేమి మామీద కోపమా? యేమి నీకు

అమ్మ నాన్నలు మామయ్య యరిగి రమ్మ
వారి మార్గమ్ము నీవును బడసి తీవ
దిక్కు మాకిక యెవరమ్మ యిక్కడింక
దిక్కు లేనట్టి వారమే యక్క టకట

కన్న బిడ్డల కంటెను మిన్నగాను
సాకి తీవమ్మ  మమ్ముల సహృద యమున
నీదు ప్రేమను మరువను నేది నమ్ము
దల్లి యంతటి దానవు కల్ల కాదు

కాన రానట్టి దూరమ్ము కడచి నావె
యెచట యున్నను మమ్ముల నచట నుండి
కంట గనిబెట్టు చుండుమా కరుణ తోడ
వేడు చుంటిని నిన్నునే వేయి మార్లు


ఎండ లెక్కువ నుంటచే నెచ్చటకును
బయన మయ్యది జేయగ వలను కాదు
కాన మమ్ముల నించుక కనిక రించి
యందు కొనుమమ్మ! శ్రధ్ధాంజ లందు కొనుము

Monday, March 27, 2017

విషము ద్రా గె .హరియె విందటంచు

గిరిజ కోర గాను హరుడుదా నీలపు
విషము ద్రా గె .,హరియె   విందటంచు
దేవత లకు వరుస  దీ యనైనట్టి యా
యమృత మిడగ దృప్తు లైరి వారు

వచ్చిన హేవిళంబి కడువంతలు బెట్టును మానవాళికిన్

వచ్చిన హేవిళంబి కడువంతలు బెట్టును మానవాళికిన్
బచ్చియబధ్ధ మే యదియ బాధలు బెట్టదు  హేవళం బిలన్
బచ్చగ నుండజేయునిక  పైరుల తోడన  భూమి నం తయున్
మెచ్చు విధంబునం బ్రజలు మేదిని బంగరు భూమిజేయుగా

పడమట దోచె భాస్కరుడు పద్మము లెల్ల విషాద మందగన్

పడమట దోచె భాస్కరుడు పద్మము లెల్ల విషాద మందగన్
తడబడి రార్య మీరలు గతంబున కేగిర యేమి యిప్పుడున్
పడమట నస్త మించునుగ భాస్కరు డెప్పుడు దైవ సాక్షిగన్
నుడుపతి రాగ జెం గలువ  లొయ్యన తోషము నొందు చుండగా

Sunday, March 26, 2017

పడమట నుదయించెనురవి పద్మము లేడ్వన్

పడమట రవి యుదయించడు
తడబడి యిక బలికితివ? తలిరుంబోడీ!
నుడువగ యిట్లుం సబబే?
పడమట నుదయించెనురవి పద్మము లేడ్వన్

హేవళంబి జగతి కిడుము లిచ్చు

హేవళంబి జగతి కిడుము లిచ్చుననుట
పాడి గాదు సామి! పాడి పంట
లనిల నిచ్చి బ్రజకు లహరి వోలెనుసాగు
గాక వత్స రంబు కడవరకును

పొన్న కంటి వారు

నిన్న ఫేసు బుక్కు నెగ్లెట్టు కాబడ
పుట్టి నట్టి దినము  బోధ పడమి
చెప్ప లేక పోతి శుభములు మీకార్య!
వేరు దలచ వలదు  విబుధ వర్య! 

మురళీ కృష్ణా!

నీదీ యుత్పల మాలిక
మోదము జేకూర్చె మాకు మురళీ కృష్ణా!
సాదర వందన మిదిగో
గాదిలి కవివర్య! నీవు గైకొను  మిపుడే

భక్తుని, బూజసేయుటకు భారతి తానయి వచ్చెహంసపై

రక్తిని నాదరించవలె రాముని జేరగ నెల్లవేళలన్
 భక్తుని, బూజసేయుటకు  భారతి తానయి వచ్చెహంసపై
ముక్తినినీయగోరి యిక మోదము తోడన కాళిదాసుకిన్
 శక్తియె దానుగా ముదము సల్పగ రక్తిని జేరనా తనిన్

Saturday, March 25, 2017

భక్తుని బూజింప వచ్చె భారతి తానే

భక్తుడు పోతన వర్యుని
రక్తిని నోదార్చ దలచి రమణీ! గంటే?
ముక్తిని నీయగ దానా
భక్తుని బూజింప వచ్చె భారతి తానే

అమృతము గ్రోలి నంత సురలక్కట రాక్షసులై చరించిరే

అమృతము గ్రోలి నంత సురలక్కట రాక్షసులై చరించిరే
యమృతము గ్రోలినంత సురలయ్యిరి రక్కసులా? భళాగురో!
యమృతము ద్రాగినంతన విహాయస వీధి జరించ వచ్చుగా
నమృతముద్రాగి మేమును నమాంతము గాంతుముదేవలోకమున్

నమృత పానమ్ముచేసుర,లసురులైరి

చీకు చింతలు లేకుండ నాక మందు
సర్వ సుఖముల నొందుచు సంత సమున
హాయి గలిగెడు బ్రదుకును ననుభ వింత్రు
నమృత పానమ్ముచేసుర,లసురులైరి
దితికి పుట్టిన గతనాన పతితు లగుచు

Friday, March 24, 2017

పద్య రచన -దూకుడా ట

వంగి యున్నట్టి యామెపై బా లికొకతె
దూకు చుండెను జూడుమా దూకుడు గను
బ్రక్క నున్నట్టు బాలుడు  పండ్లి గిలిచి
నవ్వ సాగెను జి త్రా న  నయము లేక

ఉ గా ది

వర్ష మంతయు శుభముల బడయు కొరకు
హేవిళంబికి మనసార యిప్పు డిచట
స్వాగ తంబును బలుకుడు సభికు లార!
దాని కనువగు వేదిక తనరె యిదియ

మూడు కాలాల బాటుగా ముచ్చటగను
నాలు బిడ్డలు మోదాన హాయి గాను
పాడి పంటల తోడను బ్రతిది నమ్ము
జీవ నంబును సాగుత! సేమ ముగను


రైతు జనములు వృధ్ధులు రజకు లిలను
సంతసంబులు మీరగ ,చింత లేక
వత్స రముపొడుగునదాము వరలు గాక
యన్ని జాతులు గులములు మిన్న గాను

హేవి ళంబివ త్సరమంత హైయ నంగ
నన్ని రంగాలు వృధ్ధిని నందు గాక!
బడుగు వర్గాల మధ్యన వడుదు డుకులు
లేక యుండగ జూచుత! శంక రుండు

నరకంబందును మానవుండు ,వరదా ! నారాయణా యన్నచో

పరువంబందున  నీచ కార్యముల దా బాహాటము న్ జేయుచో
నరకంబందును మానవుండు ,వరదా ! నారాయణా యన్నచో
నిరతంబాతడు  బోవు సద్గతికి దానే కంబుగానిధ్ధరన్
నరకంబయ్యది చూడబోదలచ నానాపా పాముల్ జేయుమా

నారాయణ యనిన నరుడు .నరకము జెందున్

నేరుగ దివికే నేగును
నారాయణ యనిన నరుడు .నరకము జెందున్
 పోరానిచోటు కేగిన
రారానిగ నిడుములొంది రహిచెడి దానే

Thursday, March 23, 2017

పద్య రచన -రుబ్బురోలు -పొత్రము

రుబ్బు రోలును పొత్రము లబ్బురంబు
జూసి వాటిని  నాయెను  సుమ్ము చాల
కాల మార్య!యి కకనగ  గాలు వోలె
దోచె నాదు మ ది కదియ తులక రించె

భార్యను గాంచినట్టి పతిపర్వులు వెట్టెను భీత చిత్తుడై

భార్యకు పిచ్చియెక్కగను బంపగ వైద్యము జేయన త్తరిన్
 భార్యను గాంచినట్టి పతిపర్వులు వెట్టెను భీత చిత్తుడై
భార్య పరిస్ధితిన్గనుచు బావురు మంచును నేడ్వగా మరి
న్నార్యులు వచ్చి రయ్యెడను హాయిని గొల్పెడు మాటలా డెసూ

Wednesday, March 22, 2017

పద్య రచన =దో ర కాకర

దోర కాకర జూడుము తోయ జాక్షి !
యెంత   బాగుగ నున్నదో  నంత చేదు
కలిగి రక్తప్ర సరణము గట్ట డించు
వరుస దప్పక వాడుము ప్రతిది నమ్ము

Tuesday, March 21, 2017

బరుల హితంబు గోరెడి కృపామయుడే ,పతితుండునా దగున్

నిరత ము బోవు సద్గతి కనేకుల యాశిసు లొందుచున్భువిన్
 బరుల హితంబు గోరెడి కృపామయుడే ,పతితుండునా దగున్
 కరంబు మదంబు తోడన నెకాయెకి దుష్కృత కార్య మెంతయు
న్నెరవది లేక జేసిన ననేకము గాగను నాతడేధరన్

పరులకు మేలు గోరునతడు పతితుడు గద

పుణ్య లోకంబులకు నేగు బోధ గురువ !
పరులకు మేలు గోరునతడు ,పతితుడు గద
గొడ్డు మాంసాలు దినుచును  గొదవ యైన
పాప భీతిని  లేనట్టి  బడుగు వాడు

పద్య రచన -వానలో ప్రయాణము

వా న  వచ్చిన దప్పదు పయన మకట
చిత్ర మందునపొగ బండి జేరు కొనగ
తడిసి బోవుచు నేగగ  దలి రు లచట 
చూడ నొచ్చుకొ నెను మది  సూ ని జముగ
గొడుగు నీయగ నేపోవ  గూ త వెట్టి
రయ్యు మనుచును సాగెను  రైలు బండి

కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్

కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్
 వందన మాచరింతు నిక పండితు డాతడు నిజ్జగంబునన్
 కందమువ్రాయగా దగును కష్టమొ  కించుక బడ్డచోధరన్
 ఛందము సాక్షిగా నతడు సత్కృతిజేయును నెల్లవే ళలన్

Monday, March 20, 2017

కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్

చందా నగరపు పౌరుడు
విందున నొకచోటబలికెవెటకా రముగా
నందరు వినుడీ మాటను
కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్

గాంగేయుండనగనెవడు.గంగాపతియే

గంగా! చెప్పుమ యియ్యది
గాంగేయుండనగనెవడు.గంగాపతియే
రంగని రూపున కంసుని
నంగాంగము తునకలుగను నంతము జేసెన్

Sunday, March 19, 2017

పద్య రచన -బాలిక రిక్షా

రిక్షా ద్రొక్కుచు బాలిక
శిక్షణ కై బోవుచున్న చిన్నారులరన్
దీ క్షగ జూచుట నరయగ
శిక్షణకును దానుగూడ జేరును నేమో

శంకరయ్య

అభమునుశుభమునుదెలిసిన
సుభగుడు మాశంకరయ్య సూనృత వ్రతుడు
న్నభినందింతును నాతని
శుభముగదారాకకతనసుకవుల దరికిన్

Saturday, March 18, 2017

రాముని జంపి నాడు గద రాక్షసు లే డ్వగ వాయు పుత్రుడే

నేమము దోడ నా హనుమ నెయ్యము మీరగ సేవ జేయుగా
రాముని , జంపి నాడు గద రాక్షసు  లే డ్వగ వాయు పుత్రుడే
రాముని నామము న్దరచు రమ్యము గా నట బల్కుచు న్మఱిన్
గా ముకుడైన  రావణుని గా దిలి  బట్టిని యుధ్ధమందునన్

రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్

భూమాత జాడ కొఱకుగ
రాముని నామంబు దోడ రయ్యున జనగా
రామా ! లంకిణి యనునా
రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్

పురుషుడు పూరుషుం గలియ బుత్రుడు బుట్టె నదేమి చిత్రమో

పురుషుడు పూరుషుం గలియ బుత్రుడు బుట్టె నదేమి చిత్రమో
యరయగ నిద్ది చిత్రమ యహాయనగా బ్రజలం దరప్పుడున్
 హరిహరు లిద్దరా విధపు నాకృతి దాల్చగ సంభవించెగా
నిరవగు పుత్రజన్మ పు నహీన చరిత్ర ను గాంచుమా యికన్

Friday, March 17, 2017

పురుషు లిద్దరు గలియగ బుట్టె సుతుడు

ఇంతి యొకతె పు రుషవేష మింపు గాను
దాల్చి సంగమంబును గోరి  దాను బోయి
పురుషు  నొద్దకు, బ్రీతితో పొర్లి యాడ
పురుషు లిద్దరు గలియగ బుట్టె సుతుడు

చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతిన్

భువిలో బ్రదుకును హాయిగ
చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతి
న్నవమానము లెదురైనను
భవములనే గోరుకొనెడు భవ్యుడె  దలపన్

Wednesday, March 15, 2017

రణము రణమ్మహా రణము ప్రాగణ మెల్లరణాంగణమ్మగున్

పణముగ బెట్టగా గొలుసు భార్యది యప్పుడు గోల బెట్టగా
నణకువ యెంత యైన దన హారము గానక పోవ నత్తరిన్
 రణము రణమ్మహా రణము ప్రాగణ మెల్లరణాంగణమ్మగున్
 సణుగుల తోడ నుండుచు గషాయి ని బోలుచు నుండు సుమ్ముదా

రణము ప్రాంగణమది రణము గాదె

కడుపు నిండ త్రాగి  కల్లు సారాయిలు
హోళిహోళి యనుచు నూగు చుండి
యొకరి మీదను మరి  యొకరు ప డుచుండ
రణము ప్రాంగణమది,  రణము గాదె

న్యస్తాక్షరి -రా -మ-చం -ద్ర =రామరా వణ యుద్ధము (5-6-14-18)

పలికెను రావణుంగని సభాసదు లందరు నిచ్చ మెచ్చగన్
నిలువుము నీమదంబును ననేకులు జూడగ ద్రుంచు దిప్పుడే
తెలియుము రావణా !కసిని దీరగ జంపెద జూడుమా యిట న్
బలికెను నీవి ధంబుగ సభాంగం ణ మధ్యన రౌద్ర మూర్తియై

Monday, March 13, 2017

తమ్ముల మీదమ త్సరము దాల్చె సధర్ముడు రాముడు ధ్ధతిన్

తమ్ముల మీదమ త్సరము దాల్చె సధర్ముడు రాముడు ధ్ధతిన్
 తమ్ముల మీద మత్సరము దాల్చ సధర్ము డెట్లగు
న్నిమ్ముగ రాముడె ప్పుడును నేరికి నైనను మంచినే నిడున్
 అమ్మహిమాత్ముని న్దనర నౌదల దాల్చిన మోక్షమబ్బు తన్

దమ్ములపై రాముడు ,పగదాల్చె గుపితుడై

ఇమ్ముగ బ్రేమను జూపును
దమ్ములపై రాముడు ,పగదాల్చె గుపితుడై
నమ్మించి ద నదు  భార్యను
ఛుమ్మన గ్రో శించు చుండ  జోరుగ బోవన్ 

కౌముది లేని రాతిరిని గాంచెను ,బున్నమి నాడు వింతగా

ఆమని యైననున్నపుడు రాహువు మ్రింగగ  చంద్రునిన్భళా
కౌముది లేని రాతిరిని గాంచెను ,బున్నమి నాడు వింతగా
నామది యేలకో దిగులు నాయని పించెను గారణంబహో
యేమయి యుండునో దెలియ దిప్పటి కార్యుడ! యేమొభా వినిన్

Sunday, March 12, 2017

కౌముది లేనట్టి రాత్రి ,గనె బున్నమికిన్


తామిశ్ర మావరించును
కౌముది లేనట్టి రాత్రి ,గనె బున్నమికిన్
 మామనుమని మా కోడలు
బాములు దా బడుచునెన్నొ బ్రసవము నందున్

Saturday, March 11, 2017

న్శుకయోగీంద్రునకల్లుడయ్యెగదభీష్ముండందరుప్పొంగగ

అకలంకుండగు వ్యాసరా డ్విభుడు నౌన్గదా తండ్రియు
న్శుకయోగీంద్రునకల్లుడయ్యెగదభీష్ముండందరుప్పొంగగ
న్నకటా భీష్ముడు భీకరముగా హా దాను నుద్వాహము
న్నికజే బూననిబల్కగా నగునె నోయీ భీ ష్మకుం డల్లుగాన్

శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే

అకటా యేమని వ్రాయుదు
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే
తికమక గా నుండెను మరి
శుక భీష్ముల కిడుదు నతులు  సుమ్మీ యిపుడున్

దార్య! నిజము నుడివి తిపుడు

ప్రేమ కుండు విలువ వేరువా టికిలేదు
నెంత వారి నైన నేక  బరచు
ప్రేమ లేని  చోట పిసరంత  కారుణ్య
ముండ దార్య! నిజము నుడివి తిపుడు

Friday, March 10, 2017

భామయు భామయున్గ లియ బాలుడు పుట్టెను సత్య భామకు

రామయ శెట్టియున్బలికె  రాక్షస కృత్యము గాదలం చుమా
భామయు భామయున్గ లియ బాలుడు పుట్టెను సత్య భామకు
న్నామని బాధ లొందినను హాయిని నీయగ గాన్పు నొందగా
రాముని దీవనల్గలుగ రమ్యమ యౌనుగ జీవితంబుసూ

భామయు భామయు గలియగ బాలుడు పుట్టె

రామా యేమీ వింతలు
భామయు భామయు గలియగ బాలుడు పుట్టె
న్నీమా వైద్యులు మార్చిరి
భామల లింగాల నొకటి భవ్యత కొరకై

శంకరయ్యగా

నీదు పయనము జరుగుత! మృదువు గాను
నెట్టి యవరోధ ములులేక యిప్పు డార్య!
దర్శ నీయంబు లైనట్టి యాలయాలు
చూచి కళ్ళార  రండిక సుఖము గాను

భారత కీర్తిచం ద్రికలు భావి తరాలకు జేటు గూర్చుగా

వారధి గాగనుం డవలె బాయని రీతిని నెల్ల వేళలన్
 భారత కీర్తిచం ద్రికలు భావి తరాలకు జేటు గూర్చుగా
బీరము లాడుచు న్మిగుల పేకలు బేర్చుచు గూరుచుండుచో
నేరికినైన నీభువిని ,నీశుని వేడిన నిచ్చు సౌఖ్యముల్

Thursday, March 9, 2017

భారత యశ మడచు సుమ్ము భావి తరములన్

ఏరకముగ బలికితి రి టు
భారత యశ మడచు సుమ్ము భావి తరములన్
వీరులన బడెడు వారలు
భారతమున బెక్కు మంది భటులు గలరుగా 

Wednesday, March 8, 2017

పడమ టంబొంచె రవిసుప్ర భాత మందు

దినము పూర్తిగ బయనించి తీక్ష్ణముగను
పడమ టంబొంచె రవిసుప్ర భాత మందు
రక్త వర్ణపు వెలుగున రక్తి కలుగ
నుదయమొందునుసూర్యుడు ముదము కలుగ

Tuesday, March 7, 2017

కాశి యాత్ర

కాశి యాదిగా గలయట్టి యీశు నిలయ
ములను జూచిరం డికసేమ ముగను సామి!
వలయు శక్తియు సహనము  భవుడ యిచ్చు
పోయి రండిక సుఖముగ పోయి రండు

హరుని జూచి వేగమ్మున హరుడు పారె

హరుని జూచి  వేగమ్మున  హరుడు పారె
హరియు  హరుడును  నొక్కరే  యార్య !వినుము
పారు  ట నునది  జరుగదు  భవులు వారు
వారి  గూరిచి  మనమట్లు పలుక వలదు
వంద నంబులు సేయగ  వలయు సుమ్ము 

Monday, March 6, 2017

దత్తపది =మసి -బూది -నిప్పు -కట్టె

తామసి తొలగగ వెలిగెధగధగ మన
కట్టెదుటన నా బైరుల కంకులవియ
తనరగ విబూది రంగును బోలి.చూడ
నిప్పురమగు చోడవరము నొప్పెసామి!


Sunday, March 5, 2017

యరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్

పరగడుపు మాటలివ్వియ
యరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్
 పరమాత్ము లెయా మువ్వురు
వరముల నేనీ  యుప్రభులు వారలు మనకున్

Saturday, March 4, 2017

స్త్రీలకు మ్రొక్కినన్ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్

బాలకుమారి వింటివిగ భాస్కరు సెప్పిన నాపతి వ్రతా
స్త్రీలకు  మ్రొక్కినన్ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్
 స్త్రీలను జూడగా దగును శ్రీలిడు దేవత వోలెనెప్పుడు
న్మేలగు నప్పుడే మనకు మేదిని బాగుగ నుండ వీలగున్

శుభాకాంక్షలు

నాకిపుడుశుభాకాంక్షలునగవుతోడ
నందజేసినవారలకందరకును
జేతులెత్తుచునిప్పుడుచేతునండి
వందనమ్ముల శతముల నందుకొనుడు

Friday, March 3, 2017

రావణ కుంభకర్ణులకు, రాముడు పుట్టెనుగుణాభిరాముడై

రావణ కుంభకర్ణుల యరాచక మోర్వక వేడగాదనున్
 దైవము రూపమున్దనరు దాశరధిన్గడుభీషణంబయెన్
 రావణ కుంభకర్ణులకు, రాముడు పుట్టెనుగుణాభిరాముడై
జీవుల నెల్లటిన్దనుప శీతలదృక్కుల నెల్లవేళ లన్

రావణునకుబుత్రుడయ్యెరాముడయోధ్యన్

బావా విద్యాసాగర!
రావణునకుబుత్రుడయ్యెరాముడయోధ్య
  న్బైవిధమ యెట్లు జెప్పితి
 వేమీ యీకలను గంటె?నిట్లుగ నిన్నన్

వేడుచుంటినిమిమ్ములవినయముగను

ఇత్తువ్యవధానమికపైననెక్కడెకడ
యవసరమ్మనితోచునోనక్కడకడ
సామి!మన్నించుడిప్పుడుసదయనుమరి
వేడుచుంటినిమిమ్ములవినయముగను

Thursday, March 2, 2017

ద్రౌపదిసీతయునునొక్కతండ్రికిసుతులే

ఆపరమాత్మయెజగతికి
ప్రాపునునైమనలనెపుడురక్షించుటతో
నేపుగమనతోబాటుగ
ద్రౌపదిసీతయునునొక్కతండ్రికిసుతులే

ద్రౌపదిసీతయిద్దరొకతండ్రికిబుట్టినబిడ్డలేకదా

ఆపరమాత్ముడేమనకునన్నిటబాసటగాగనుండుట
న్నేపుగనుంటిమిన్గనుకయీశునిదండ్రిగనెంచుకొంటిమే
ప్రాపుగనుండుమూలమునభావ్యమపల్కగవీరినిన్సుమా
ద్రౌపదిసీతయిద్దరొకతండ్రికిబుట్టినబిడ్డలేకదా

ముగ్గురుసుందరీమణులముద్దులభర్తయె,యాదియోగియౌ

జగ్గయశాస్ర్రియేపలికెసాదరమొప్పగశంభుడేకదా
ముగ్గురుసుందరీమణులముద్దులభర్తయె,యాదియోగియౌ
నగ్గలమైనరక్తినిలనాశ్రితభక్తులవాంఛితంబుల
న్నెగ్గులురానిచొప్పునననీశుడుతప్పకతీర్చునేసుమా

Wednesday, March 1, 2017

ముగురుస్త్రీలకుమగడు,మొదటియోగి

భరణికోసలంపుబతియదశరధుడు
ముగురుస్త్రీలకుమగడు,మొదటియోగి
ముగురుకాంతలుండుమృడుడునుబుడమికి
యోగివరులకతడునొజ్జసుమ్ము

కామకేళి

కామకేళియందుకసితీరవలెనన్న
మీరుచెప్పినట్లుమెత్తదనపు
పూలపాన్పుమరియుపూగుబాళింపులు
వలయుసామి!మీకువందనమ్ము

గరికపాటివారికమ్మనిపూరణ

గరికపాటివారికమ్మనిపూరణ
తెలియజేయమిమ్ముగోరుచుంటి
వారిపూరణంపుపధ్ధతినాదర్శ
ముగనుజేసికొందుముందుముందు