Sunday, July 23, 2017

ఆగష్టు 15

ugust 10, 2015

ఆగష్టు 15

ఈ రోజే మన పండుగ
మీరందరు వచ్చిరిటకు మీరని భక్తిన్ 
గారవపు నతుల నిడుదును 
వీరుల మది దలచు చుండి వీడని భక్తిన్ 
ఆంగ్ల పాలకు లవశమై యష్ట కష్ట 
ములను  భరియించు బ్రజలకు ముక్తి కొరకు 
గాంధి  మొదలగు వారలు గలసి గట్టు 
తనము తోడన పోరాడి తనర దెచ్చె 
దేశ మునకు స్వరాజ్యము దేజరిలగ 
ఖైదు  లోపల మ్రగ్గియు కఠిన మైన 
దెబ్బ లెన్నియో భరియించి ,తెలివి పోయి 
బ్రతికి రార్యులు  జీ వ చ్ఛ వంబు వోలె 
చెప్ప  లేమయ్య  వారల చిప్ప కూడు 
అట్టి  మహితాత్ము  లగురిచి గట్టి గాను 
నెంత జెప్పిన మఱి యది  సుంతె  యగును
వంద నంబులు వారికి వంద లాది
చేయుటే మన  కర్తవ్య మార్య !యికను

భరత మాతకు పలుకుడు భవ్యు లార !
జైభ  రతమాత !యిక నీకు  జయము జయము
సేవ జేతును నిరతము శిరము  వంచి
దయను జూడుమా నాపైన ధాత్రి  జనని !

దేశ  మునకునై ప్రాణాలు దీ సికొనిన
నాయ  కులయాత్మ శాంతికై నలువ గురిచి
చేయ బ్రార్ధన నేనును  జేతు నార్య !
సెల  వొ  సంగుడు నాకిక  సేతు నతులు

No comments:

Post a Comment