Saturday, September 30, 2017

చారుధామయాత్ర

చారుధామ యాత్ర సఫలమగుటకును
సేమముగనుగృహము చేరుటకును
వలయు శక్తియుక్తు లలవోకగామీకు
కలుగు గాత! శివుని కరుణ వలన

పూసపాటివరేణ్య!

సకల దేవత లిచ్చు సకలసంపదలను
ననుచు వ్రాసి నట్టి యార్య! నీదు
రచన యద్భుతంబు పూసపాటివరేణ్య!
సాటి గలరె?నీకు సములలోన

విజయదశమివచ్చు,విదియనాడు

ఆశ్వయుజపుదశమియనబడుదినమున
విజయదశమివచ్చు,విదియనాడు
దుర్గమాతనెపుడు దుహితముల్ బరిమార్చ
పూజసేతురయ్య! పుడమిజనులు

Thursday, September 28, 2017

యన్నదమ్ములు.రాముడునంగదుండు

భరతశత్రుఘ్నులక్ష్మణుండరయగాదె!
యన్నదమ్ములు.రాముడునంగదుండు
లగుదురటయొకరికొకరుగానయ్యసుతులు
వారిబంధపుకారణమూర్మిళయ్యె

శాస్త్రీజీ

దేవ్యవతారములవలెను
నవ్యముగాదెలిసికొంటినవబతుకమ్మ
ల్భవ్యులుమీమూలంబున
సవ్యముగాబూజజేయశాస్త్రీ! సిరులే.
-----
ఏకవచన సంబోధనకు క్షంతవ్యుడను

నవరాత్రులబతుకమ్మ

 1. ఎంగిలి పూల బతుకమ్మ
  2. అటుకుల బతుకమ్మ
  3. ముద్దపప్పు బతుకమ్మ
  4. నానే బియ్యం బతుకమ్మ
  5. అట్ల బతుకమ్మ
  6. అలిగిన బతుకమ్మ
  7. వేపకాయల బతుకమ్మ
  8. వెన్నముద్దల బతుకమ్మ
  9. చద్దుల బతుకమ్మ

కామేశ!

బ్రతుకమ్మపాటజదువగ
బ్రతుకమ్మే వచ్చినటుల భావంబయ్యె
న్నతులితమగు నీకవితకు
సతతముకామేశ!యిచ్చుశంభుడు సిరులన్
ప్రత్యుత్తరంతొలగించు

Wednesday, September 27, 2017

బతుకమ్మపాటద్విపద మాలిక :
శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ

ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపార సక్కఁగ జూడఁగ రావె

వెతలన్ని బాపఁగ వేగంబ రావె
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి

మాయమ్మ దుర్గమ్మ మము గన్న తల్లి
యాయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ

తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు

కమనీయ గరికలు కనువిందు కట్ల
రమణీయ దోసలు లావణ్య బీర

చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందరు జేరి వాలుగ పేర్చి

పసుపు గౌరినిఁ జేసి వాటిపై నుంచి
వసుధను తంబల ప్రభల నీయంగ

నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడ

కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు

కుదురుఁగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.
(రచన:కామేశ్వరరా వు)

శుభాకాంక్షలు

ఇద్దినపుశుభాకాంక్షలు
నద్దిరబ్రతుకమ్మపర్వమగుటనువలన
న్నిద్దినముపూజజేసియు
చద్దన్నమునాహరింపసంతసమొందున్

బేగమ్

దద్దరిలుగొంతుతోడన
చద్దులబ్రతుకమ్మనాడెషంషాద్ బేగమ్
ముద్దులగుమ్మలుబాడగ
దద్దయువినసొంపుగలుగదానునుబాడెన్

Tuesday, September 26, 2017

పూసపాటి

దినముదినమునునొకక్రొత్తదియగువిధపు
చిత్రబంధాలరచనలుజేయుచుండు
కవివరేణ్యునకిచ్చుత!కామితార్ధ
ములనుశంకరుడెల్లవేళలపుడమిని

రావణానుజుండు రాాముడుగదా

కుంభ కర్ణుడనెడుడింభుడౌక్రూరుండు
రావణానుజుండు.రాముడుగద
రావణాదిగాగరాక్షసగణమును
సంహరించినట్టిచక్రధరుడు

Monday, September 25, 2017

యబిణఢఠత

రాదుమిత్రమ!యెప్పుడురమ్మనిను
మునికిగోపమే.భూషణంబనగనొప్పు
మానవత్వముతోడనమసలుకొనుచు
దానధర్మములొనరించుధర్మగుణమె

పిట్టావారు

సామాజికతోరణమను
నామంబున వెలసినట్టి నాణ్యపురచనల్
 పామరజనములు సహితము
దామాషగ జదువగలరుతడబడకుండన్

గోపాలం 22-9-2017

మొదట టైపిస్టు గాజేరి తుదిని నీవు
తనరజిల్లాధి కారిగ వినుతికెక్కి
పదవి విరమణ  నొందిన పరమపురుష!
సాటి వారలుగలరనుమాటలేదు

 కన్న బిడ్డల కంటెను మిన్నగాను
సాకి తీవయ్యతమ్ముల సహృదయమున
నీదు ప్రేమను మరువరునిక్కముగను
తండ్రి యంతటి వాడవు  తమ్ములకును

కాన రానట్టి దూరమ్ము కడచి నావె
యెచట యున్నను మమ్ముల నచట నుండి
కంట గనిబెట్టు చుండుమా కరుణ తోడ
వేడు చుంటిని నిన్నునే వేయి మార్లు

 లేవు లేవయ్య గోపాల లేవయికను
నిన్ను నమ్మిన వారమే మిన్నగాను
విడిచి వెళ్ళుటమమ్ముల పాడియగునె?
మేము వత్తుము దరికినీ ప్రేమతోడ

 జ్ఞాప కంబులు  నీయవి  జ్ఞప్తి  కలిగి
యున్న లేకున్న  నున్నట్టు  లుండె  మాకు
నయ్య చూతుము  నొ కపరి యయ్యరమ్ము
 మునుపు వోలెను ,నీ రాక  ముదముమాకు

పట్టుదలనుగలిగి పట్టభద్రుడవయి
ప్రభులయందు మేటిప్రభుడవుగను
పేరుగాంచితీవప్రేమాదరమ్ముల
నిన్నుమించునతడుమన్నుగలడె?

ఏమి పాపముజేసితిమేమొగాని
దయనువిడనాడి పోయిరి ధర్మమగునె
నెదురు చూసియుచూసియునిజముగాను
కళ్ళుజూడుమకాయలుకాచెసుమ్ము

మాయమర్మములెరుగనిమనిషివీవు
మత్సరంబది నీకిసుమంతలేదు
సాటిమనిషిని మనిషిగా సాకినావు
సాటియెవరయ్యనీకిలసాటియెవరు?

మీరులేనట్టిలోటునుమేముదీర్చ
లేముభారమంతయునికనామురహరి
చూచుకొనునయ్యనిజమిదిలేచియికను
యందుకొనుమయ్యశ్రధ్ధాంజలందుకొనుము

సకల శుభములుగలిగించుశంకరుండు
మరల జన్మంబులేకుండు వరమునిచ్చి
పుణ్యలోకాలు జేరగ ననుమతించి
నీదునాత్మకుశాంతినినించుగాక!

Sunday, September 24, 2017

తమ్మునిబెండ్లియాడెనొకతన్విముదంబునతానపెద్దయై

అమ్మరొ యెంతమాటిదియయందరుమెత్తుర ?నీదుపల్కులన్
తమ్మునిబెండ్లియాడెనొకతన్విముదంబునతానపెద్దయై
గమ్ముగనుండుమాసరళ! కాముకుడైనను నట్లుమారునే?
నిమ్మహినెచ్చటైననిలనీరకపుంజనులుందురేమొలే

సవతిలేనియింటసౌరులేదు

జీవనమ్ముసాగు జేజీయమానమై
సవతిలేనియింట,సౌరులేదు
చెట్లుచేమతోడచీకాకుగానుంట
కారణంబు వలనకాంత గృహము

Saturday, September 23, 2017

నెల్లూరు ప్రయాణము

నెల్లూరు వచ్చియుంటిమి
యల్లదెమాబావమరది యనుకోకుండా
యిల్లును బంధుగణంబుల
నెల్లరదావిడిచినిచటె నేగెనుదివికిన్

Thursday, September 21, 2017

భీమసేనుడు తాటకి పీచ మడచె

కీచకుని పీచ మడచెను కింకు పెట్టి
భీమసేనుడు ,తాటకి పీచ మడచె
లక్ష్మణుండా మె ముకుచెవుల్లాగి కోసి
రక్త సిక్తము గావించి రహిని చెడగ

పూసపాటివారు

శంకరాభరణపుమనసత్కవులకు
దేవి నామాల తోడన దెల్పినట్టి
నీదు రచనకు జోహార్లు నిండుకుండ!
శుభములిచ్చునునీకును శుక్లమాత

షోడశ దళ కమల సీస  సుమము జదువ
నీదు దీశక్తి దెలిసెను నిజము సామి !
శ్రీహరియనిన్ను గాపాడు సిరుల నిచ్చి
పుణ్య పురుషుడ యోయన్న పూసపాటి !

Wednesday, September 20, 2017

దసరా శుభాకాంక్షలు

సాటి కవివరేణ్యుల కిల సంతసములు
శుభము లుగలుగు గావుత యాభవాని
సాద్వి కరుణన యీశుభ సమయ మందు
కల్ల కాదిది నిజమునే పల్కు చుంటి

హర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్

హర్మ్యమ్ము లుండునెడలను
హర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్ 
హర్మ్యమ్ముల నానందము
ధర్మ్యమ్ముగదలతు నెపుడు ధార్మిక బుధ్ధిన్

Tuesday, September 19, 2017

విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్

విజ్ఞత ప్రజ్ఞత సుజ్ఞత
లజ్ఞానపు మెట్టులవియ యార్యా ! తలపన్
విజ్ఞత యుండిన జాలదు
విజ్ఞత లేనట్టి నరుడె విజయము నందున్

విజ్ఞత లేనట్టినరుడె విజయమునందున్

ప్రజ్ఞను గలిగియు నుంటయె
విజ్ఞత, లేనట్టినరుడె విజయమునందున్
సుజ్ఞాను దరికి జేరక
యజ్ఞానపు రక్కసె పుడు నాతని దరినిన్

Monday, September 18, 2017

భారవియెరచించె,భారతమును

పాశుపతపు కధను భాసురమగునట్లు
భారవియెరచించె,భారతమును
నన్నయ యికతిక్కనార్యుడెర్రనలను
మువ్వురుదెనిగించిముదముగొల్పె

భారవి వ్రాసె భారతము బాడిరి దానిని రాఘవాత్మజుల్

భారవి వ్రాసె భారతము బాడిరి దానిని రాఘవాత్మజుల్
భారవి వ్రాయ భారతము బాడుట యా ?యది  రాఘవాత్మజుల్
మీరిటు లాడుటన్ దగునె ? మేమిట శూన్య మనస్కు లైతిమే
యే రకమున్ర చించవలె నిప్పుడు దీనిని దెల్పు సోదరా !

భారవియె రచించె భారతమును

పాశుపతపు కథను బరిపూర్ణముగ గవి
భారవియె రచించె,భారతమును
దెనుఁగు జేసిరిగద తేటతెల్లముగను
నన్నయాదులార్య ! భిన్న సరళి

Sunday, September 17, 2017

మల్లెలు నల్లబారినవి మాలల నల్లెడి వేళచిత్రమే

అల్లదె యెండ వేడిమికి నావిరి యుండగ తాళలేక యా
మల్లెలు నల్లబారినవి ,మాలల నల్లెడి వేళచిత్రమే
యుల్లము సంతసిల్లగ నట నోమ్మనునా దము శోత్రపేయమై
మెల్లగ మేనుకు న్దగుల మేదురమై యది హాయిగొల్పెడిన్

మల్లెలు గడు నల్లనయ్యె మాలలుగట్టన్

అల్లదె వింతగ నుండెను 
మల్లెలు గడు నల్లనయ్యె మాలలుగట్ట
న్నల్లటి దారము వాడిన
దెల్లగనే మల్లెలుండు దేవర పల్లీ !

కన్నురెప్పల,కటకత్తులాయె

ఎర్రబారెరంగ! యేలకోమరినీదు
కన్నురెప్పల,కటకత్తులాయె
నేమిమాయజేసెనేమొయాకర్రలు
మాయలాడిచేతిమహిమవలన

కన్నుల రెప్పలేయకట కత్తులుగాననుజీల్చెనిల్వునన్

అన్నువతోగనంబడుచునానన మందున లేతనవ్వుల
న్మిన్నగ గానిపించుచును మేదిని యందున వెల్గులీనునా
నున్ననిపాప బుగ్గలను నోటినిబట్టుచు ముద్దులీయగా
కన్నుల రెప్పలేయకట కత్తులుగాననుజీల్చెనిల్వునన్

కన్నురెప్పలకట కత్తులాయె

కోరినట్టి ధనముగొడుకునకీయని
కారణంబునసుతుడలుగనతని
కన్నురెప్పలకట కత్తులాయెనుజూడు
తండ్రి చర్యలెటుల యుండునొనిక

Saturday, September 16, 2017

కలియుగదైవంబనంగ కాలుడెసుమ్మీ

లలనా !వేంకట నాధుడె
కలియుగదైవంబనంగ కాలుడెసుమ్మీ
యిల జీవుల బ్రాణంబుల
నల వోకగ దీయునెవడొ యాతడె లేమా !

Friday, September 15, 2017

సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్

ఉత్కళ దేశపు ప్రభువగు
నుత్కళ రాజేంద్రు తోడ నోరిమి లేమి
న్నా త్కురికి  సోము డనియెను
సత్కార్యమ్ములె మనకపజయ కారణముల్

ఛీ త్కృతి జేయుట వృధ్ధుల
సత్కార్యమ్ములె ,మనకపజయకారణముల్
సత్కృతి జేయక పరులకు
చీత్కారముతోడ నుండి చేయనపకృతిన్


తనికెళ్ళ భరణి

తెలుగు భాషగొప్పదనము దేటతెల్ల
ముగను జెప్పిన తనికెళ్ళసొగసుదనము
భాష నేర్పుసా హిత్యాభి లాషలవగ
తంబు లయ్యెను శివరామ! యద్భుతముగ

పుస్తకావిష్కరణము

సత్యనారాయణా!నీకుసాదరంపు
వందనంబులుశతకోటి యందుకొనుమ
పొత్తమావిష్కరణశుభమూర్తమందు
పంపుడొకకాపి దయతోన భారమనక

Thursday, September 14, 2017

ధరలు తగ్గిన జగమెల్ల దల్లడిల్లె

సంతసంబును  నొందురు సకల జనులు
ధరలు తగ్గిన, జగమెల్ల దల్లడిల్లె
హారి కెనుతుఫాను నుగాంచి" హా"యనుంచు
కూలిపోయెను భవనము ల్గొన్ని వేలు

Wednesday, September 13, 2017

హరియే మహ్మదు కుదురుగ హరుడే సుగదా

హరిహరులమయమె జగమిది 
హరియే మహ్మదు కుదురుగ హరుడే సుగదా
హరియంశమె వారలుమఱి
తరతమ భావంబు లేదు తమలో తమకున్
 

దత్త పది --ముక్కు --నోరు చెవి -కన్ను (రామాయణార్ధము )

రాముమేనముక్కుటమదిరమ్యమలర
విల్లునోరుద్రునిదియతా విరిచె విమల !
లక్ష్మణునిసోద రునకన్నువగనువేసె
పుష్పమాలనురామునిభుజములందు


Tuesday, September 12, 2017

కంది వారు

చిన్నతనమున నుండియే చిన్నచిన్న
పద్యములవ్రాసి యిప్పుడు ప్రముఖ కవిగ
పేరు గాంచిన కవివర! ప్రీతి తోడ
వందనంబులు నాయవి యందు కొనుడు


సంగమేశ్వరశాస్

సంగమేశ్వరశాస్త్రికి సాదరముగ
వందనమ్ములుసేతునువందలాది
విశ్వ కవిరవీంద్రులకునువేలకొలది
హృదయ పూర్వక నతులతోనాదరింతు

Monday, September 11, 2017

తద్దినమే శుభంబి డుట తధ్య మటంచు వచించు విజ్ఞుడై

ఎద్దిన ముండునో రవియు నిద్ధర నెప్పుడు జింతజేయగన్
తద్దినమే శుభంబి డుట తధ్య మటంచు వచించు విజ్ఞుడై
మద్దుల గోపీనాథుడట మాన్యుడు ,పెద్దలు గానిపించగా
నొద్దిక తోడదా నెపుడు నుండును సాదర మొప్ప నత్తఱిన్

తద్దినమే శుభమిడునట తధ్యము సుమ్మీ

ఎద్దినము సూర్యుడుండునొ
తద్దినమే శుభమిడునట తధ్యము సుమ్మీ
యద్దినము పనులు చక్కగ
నొద్దికగా జేయవచ్చు నుర్విని మనమున్

Sunday, September 10, 2017

రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

రంగడు దైవమ ప్రజలకు
రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్
రంగని భక్తుల కిటులుగ
భంగము గలిగించు మాట బలుకగ నేలా ?

 

Saturday, September 9, 2017

చక్కర చేద నుట విబుధ సమ్మతమె కదా

అక్కజమొదవెనునీ యది
చక్కెర చేద నుట విబుధ సమ్మతమె కదా
యెక్కడి విబుధులు వీరలు
పక్కాగా చేదె యనుట భావ్యమె సితమున్

తండ్రులకుమ్రొక్కెను,పతివ్రతాసుతుండు

పద్మదళములవోలెనువలయముగను
నుండునాశత్రుసేనపునుక్కడంచ
బయలుదేరుచునభిమన్యబాలుడపుడు
తండ్రులకుమ్రొక్కెను,పతివ్రతాసుతుండు
మంచిమర్యాదసహితుడై మసలునెపుడు

Friday, September 8, 2017

తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సు తుండు

పద్మ వ్యుహమ్ము  ఛేదన బరుప దలచి
బాలు డభిమన్యుడయ్యెడ ప్రధమముగను
తండ్రులకు మ్రొక్కెను ,పతివ్రతా సు తుండు
మదిని కల్మష  రహితుడై మసలుచుండు

Thursday, September 7, 2017

జింకను గాంచి తక్షణమె సింహము పారె నదేమి చిత్రమో

డొంకల చాటున న్మిగుల డో గుచు నుండిన చిన్నదైన యా
జింకను గాంచి తక్షణమె సింహము పారె నదేమి చిత్రమో
జంకుచు దానితల్లి యట  సాగిలు చుండను   భావము న్మదిన్
శంకను బొందుచు న్మృగము సానువు వీడుచు నత్తఱిన్సుమా

జింకను గని తక్షణ మ్మె సింహము పారెన్

జంకుచు నేడ్చెను బాలుడు
జింకను గని, తక్షణ మ్మె  సింహము పారెన్
డొంకల మాటున మృగమను
శంకను దా బట్టు కొనగ సానువు నుండిన్

Wednesday, September 6, 2017

పండుతులువసింపనిధరపావనముగదా

దండిగ సంస్కృతి యుండియు
మెండగు గర్వంబుతోడమేదినిబ్రజలన్
 బండగ దూషించునట్టి
పండుతులువసింపనిధరపావనముగదా

Tuesday, September 5, 2017

దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యి ధ్ధరన్

దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యి ధ్ధరన్
రంగడు చెప్పగా దెలిసె రాహువు కేతువు లిద్దరు న్సదా
దొంగతనంబున న్గలిసి దొడ్డతనంబున మంత్రిగారితోన్
భంగముగాక నెప్పుడును భారిగ జేతురు నిర్భయంబుగన్

దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

రంగని యాభరణమ్ములు
దొంగలతో గుడికి పెద్ద ,దోచెను గలిసీ
రంగా ! చెప్పుమ యిప్పుడు
దొంగలతో  దొరలు గలిసి దోచెదరు గదా

Monday, September 4, 2017

ఉపాధ్యాయుల దినోత్సవము

గురువున కిత్తును నతులను
గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం
గురువునె మఱి పూజించిన
గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

శంకరుడు మొద లుకొనుచు శంక రార్యు
లనడుమగలుగు గురువు ల లహరి నుండి
నాదు గురుపరం పరలకు నతుల నిడుదు
శతము కొలదిని భక్తిని సవిన యముగ 

దత్త పది =గు -రు -పూ -జ

గురువు కలిగించు నుత్తమ గుణము లనిల
రుచిర వాక్కుల నిరతము రోత లేక
పూజ జేయుడు నుత్సవ  ముపగిదినిక
జపతపంబులనొప్పెడు చైత్య మతడు

దత్తపది అవ్వ -తాత -అత్త -మామ (భారతార్ధము )

అవ్వలిని జచ్చు వారల త్తనువుల నిక
మరుల భూమికి గొంపోవు మా మరువక
ననుచు నప్పుడు ధర్మజుండాన తీయ
బంటు లయ్యెడ  తా త మక o బు తోడ
పర్వు లెత్తిరి యనిలోన వరుస గాను

Saturday, September 2, 2017

రాతిరి సూర్య బింబము తిరంబుగ వెల్గె విహాయసంబునన్

రాతిరి సూర్య బింబము తిరంబుగ వెల్గె విహాయసంబునన్
భూతల మందుగానమది పోడిమి కాంతులు చిమ్మెనేమొ దా
రాతిరి చంద్ర బింబము తిరంబుగ వెల్గుల నిచ్చు నెప్పుడు
న్నంతియె కానివే ఱొకటి యౌటకు నచ్చట వీలుగా దుగా

రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

మాతా !కా నబడడు గద
రాతిరి రవి నభమునన్, దిరంబుగ వెలిగెన్
జోతులు వాయువు లేమిని
రాతిరి నన్  వెలుగు నిచ్చు రాగుడు  మనకున్

మార్గ దర్శక మగునను మాటనిజము

సుకవి వర్యుడ! వేంకట సుబ్బరాయ!
నీదు పూరణ పధ్ధతి నిజము గాను
నధ్భు తంబయి యలరారి యదియ మాకు
మార్గ దర్శక మగునను మాటనిజము

Friday, September 1, 2017

విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్

కృష్ణుడు ,రాముడు ,శివులన
విష్ణువె, హాలాహలమను విషమును గ్రోలెన్
విష్ణుని రూపుడు శంభుడు
తష్ణీభావంబు తోడ ధాత్రిని బ్రోవన్ 

కవిసమ్మేళనమయ్యది

కవిసమ్మేళనమయ్యది
కవులందరుగూడిరచట కవనపుఝరులు
న్నవరసపుగుభాళింపుల
శ్రవణానందంబుగలుగ జరుపగ వలయున్

పూసపాటివారు

చతురంగబంధసీసము
చతురతతోవ్రాసినట్టిసత్కవివర్యా!
సతియగుశాంభవి మిమ్ముల
సతతముగాపాడుగాక! సకలము నొసగీ