Monday, October 30, 2017

స-ర-స్వ-తి దత్తపది

సరససంగీతసాహిత్యచారుశీల
రమ్యమైనట్టిగాత్రమ్మురహినినిమ్ము
స్వఛ్ఛమగుపదలాలిత్యమంచితముగ
తిరముగానుండువిధమునుబరగజేయు

దుర్యోధనుబెండ్లియాడిద్రోవదిమురిసెన్

భార్యగ భానుమతిబరగె
దుర్యోధనుబెండ్లియాడి,ద్రోవదిమురిసెన్
వీర్యముగలభీముడుతన
కార్యుడుగానగుటవలననమితముగాగన్

Sunday, October 29, 2017

బంధుగణములగ్రూపు

బంధుగణములయునికులుబహుళముగను
దెలియవచ్చెనుగ్రూపులవలననిపుడు
భద్రపరచిననిటులనేభవ్యులార!
పెంపువహియించుబేర్ములెయింపుగాను

Saturday, October 28, 2017

తండ్రితోరతికేళినిదనయకోరె

తండ్రితోరతికేళినిదనయకోరె
నాహ కలికాలమహిమలెయవ్వ! యేమి
చోద్యములికనువినగను,జూడగాను
బ్రతికి యుండగ వలయునోభవ్యచరిత!

నాగులపూజసేయునెలనాగలకున్నరకంబుప్రాప్తమౌ

నాగులపూజసేయునెలనాగలకున్నరకంబుప్రాప్తమౌ
వేగముచింతజేయకుడువేమరుపాటునగాదునెయ్యెడన్
 నాగులపూజసేయునెడనాకముకల్గునునెల్లవారికిన్
 నాగుడెరక్షసేయునటనాగునిపిల్లలగంటికింపుగాన్

Friday, October 27, 2017

నాగపూజసేయ ,నరకమబ్బు

మంచి సంతు గలిగి మహానీయుడగునట
నాగపూజసేయ ,నరకమబ్బు
నాగుపాముజంపు  నరునకెవనికైన
తధ్య మిది య వినుడు తమ్ములార !

Wednesday, October 25, 2017

జిహ్వికకుపంచదారయెచేదుగాదె

తీయతీయగలడ్డులుతినెడునట్టి
జిహ్వికకుపంచదారయెచేదుగాదె
తీపివస్తువున తిగనుదినుటవలన
పుచ్చుపోవునుబండ్లన్నిపురుగుపట్టి

Tuesday, October 24, 2017

గట్రాచూలికిపతిహరికంతుడుసుతుడే

కట్రాజువారిపుత్రుడు
భట్రాజునునడిగెననిటులభర్గుడు హరియున్
 గట్రాయెవరననిట్లనె
గట్రాచూలికిపతిహరికంతుడుసుతుడే

ఆకాశవాణివారిసమస్య

పద్యపులక్షణంబులనుబాగుగనేర్చినవానికెప్పుడున్
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్
సద్యముతీపినిన్గలిగిశర్కరమిశ్రితమౌవిధంబుగా
హృద్యముగాగనెప్పుడునుహేయననొప్పుచునుండునేగదా

దశకంఠునిగొల్చునరులు.ధన్యులుగదరా!

మశకముకంటెనుహీనులు
దశకంఠునిగొల్చునరులు.ధన్యులుగదరా!
కుశలవులిరువురునరయగ
దశరధునకుమనుమలగుటధరణినిమిగులన్

Monday, October 23, 2017

పూసపాటివారు

సంధులుసేయుటలేదువి
సంధిగ వ్రాయవలదుకదసామీకవితల్
 బంధపుమాలికకందుని
బంధునిగాజేసెననుచుభావనజేతున్

వందనములనందుకొనుమపండితవర్యా!

స్కందునిగూరిచిచెప్పిన
బందముతోనుండుకవితబహుచక్కంగన్
 విందునుగూర్చెనుచెవులకు
వందనములనందుకొనుమపండితవర్యా!

Sunday, October 22, 2017

చరణముతోబతికిసేవసేసెనుసతియే

పరగడుపునసంకీర్తన
చరణముతోబతికిసేవసేసెనుసతియే
పరగనుబుట్టినరోజది
యరయంగానగుటవలననట్లుగజేసెన్

పంచవింశతిశతసమస్యాంచితమిది

పంచవింశతిశతసమస్యాంచితమిది
యనకతప్పదండ్రునార్యులవని
కందిశంకరయ్యగారిపట్టుదలకు
బహుముఖతకునిదియవరలుచుండె

Saturday, October 21, 2017

మారీచుడురాముజంపిమాన్యుండయ్యెన్

ఒౌరాయేమనియంటిరి
మారీచుడురాముజంపిమాన్యుండయ్యెన్
మారీచుడుచంపుటయా!
యారాక్షసుదరమెజంపయార్యా!రామున్

Thursday, October 19, 2017

రాణ్ముని.దుర్యోధనుండురామునిసుతుడే

షణ్ముఖునిదండ్రిశంభుడె
రాణ్ముని.దుర్యోధనుండురామునిసుతుడే
సన్మతిహీనుడు.కుశుడే
హన్మా!వినుమామరియీ యక్షరసత్యమ్

బంధపుకవితలకవివర!బంధపుకవితలకవివర!
బంధముచతురస్రమదియపఠనముజేయన్
గంధముజల్లిననట్లును
కంధరమునుద్రాగినటులుగమ్మగనుండెన్
-

Wednesday, October 18, 2017

ధనలక్ష్శీవ్రతమొసంగు.దారిద్ర్యమునే

ధనమునుగనకమువస్తుల
ధనలక్ష్శీవ్రతమొసంగు.దారిద్ర్యమునే
వినుతొలగించకవచ్చును
ననయముమదినుంచునెడలనభవునిసుమ్మా

కంది శంకరయ్య గారు

తీర్ధయాత్రలుబాగుగదెమలుచుకొని
యేగుదెంచినకవివర!యిపుడమిమ్ము
భక్తరక్షకుడైనట్టిభవుడుదయను
నెల్లవేళలజూచుత!చల్లగాను

Tuesday, October 17, 2017

కాలుపెండ్లియాడెకరమువలచి

అందగత్తెయైననాదిలక్ష్మినిపాన
కాలుపెండ్లియాడెకరమువలచి
వారిబంధమెపుడునారుకాయలుగను
మూడుపూవులుగనుమురియుగాక!

Monday, October 16, 2017

కాంతనుసేవించువారెఘనులుజనహితుల్కాంతా!వినుమా కవితా
కాంతనుసేవించువారెఘనులుజనహితుల్
గాంతలుబెక్కురుగలిగిన
కొంతైననుసాటియగునె?కువలయమందున్

సింగయ్యగారిసూచన

సింగయ్యగారిసూచన
యంగాంగముబులకరించియయ్యెనుముదమున్
 జంగమదేవునిపూజకు
రంగమునున్వెదుకకొరకురమ్మనవత్తున్

Sunday, October 15, 2017

బాలభానుడు.నేలపైపరుగులెత్

చూడముచ్చటయాయెనుసొబగుగలిగి
బాలభానుడు.నేలపైపరుగులెత్తె
నాదుమనుమడుబులిబులినడక వంటి
పరుగుతోడనగ్రిందకుపడుచులేచి

Saturday, October 14, 2017

తమ్ములనిరసించెరామధరణీశుడొగిన్

నమ్మగశక్యముకానిది
తమ్ములనిరసించెరామధరణీశుడొగి
న్నమ్మహితాత్మునినిరసన
తమ్ములపైయుండదెపుడుతమకముతప్పన్

తనయుడుభర్తయయ్యెవనితామణిజేసినపుణ్యమెట్టిదో

వినుముర రాజశేఖర! వివేకముతోడననీదుపుత్రికా
తనయుడుభర్తయయ్యెవనితామణిజేసినపుణ్యమెట్టిదో
కనగనువారిబంధములుగామితలోకముగర్వమొందగా
ననయమువారలిర్వురునహర్నిశముల్నెడబాటులేరెటన్

తనయుడుపతియయ్యెతరుణిమురిసె

కోరుకొనినవిధముకూరిమిగలమామ
తనయుడుపతియయ్యెతరుణిమురిసె
దనదువాంఛదీరెననుచునుదనలోన
దానుసంతసంబుదనరమిగుల

Thursday, October 12, 2017

కరణమేల.కావ్యకరణమునకు

గ్రామపెద్దలుండకార్యసఫలతకు
కరణమేల.కావ్యకరణమునకు
పదునెనిమిదియైనవర్ణనలుండవ
లయునునంతెకాక రమ్యముగను

కారము నయనముల జల్లగన్ హితమబ్బున్

ఊరును బంధుగణంబుల
పోరును సహియించ లేక పోవగ నెటకో
సారీ యని వారలమమ
కారము నయనముల జల్లగన్ హితమబ్బున్

Wednesday, October 11, 2017

వడ్డనజేయువాడుపగవాడె.తినందగుశంకవీడియున్

గ్రుడ్డివె?చూడుమాయతడుక్రొత్తగగన్పడుచుండువాడటన్
వడ్డనజేయువాడుపగవాడె.తినందగుశంకవీడియున్
లడ్డులుమంచివేయవియలక్ష్మియెతానుగజేసెనిప్పుడున్
గుడ్డలుమార్చుకోయికనుగోరినలడ్డులుతీయతీయగాన్

వడ్డించెడివాడు శత్రువా ?తిననొప్పున్

వడ్డాది కమల ! చెప్పుమ
వడ్డించెడివాడు శత్రువా ?తిననొప్పున్
వడ్డనవాడెవడైనను
వడ్డన సరియుండు నటుల బరికింప దగున్


Tuesday, October 10, 2017

నెలజూచిలతాంగి యేడ్చెనేరుపుమీరన్

వలపులబాధనునోర్వక
నెలజూచిలతాంగి యేడ్చెనేరుపుమీర
న్నెలలేనెలలునుదాటగ
బలుకులుదనభర్తతోడభామినియపుడున్

Sunday, October 8, 2017

పసుల సేవ పరమ పదమొసంగు

పసుల సేవ పరమ పదమొసంగు ననుట
యక్షరాల నిజము ,హర్ష మదియ
గోవు వలన మనకు కొండంత లాభమ్ము
పసుల జంప గలుగు పాపమార్య !

లలనల సహకారమ్మున

లలనల సహకారమ్మున
నలవోకగ ,లేని బెర్తు నమరుట వలనన్
సులువుగ వచ్చితి పడుకొని
యలకాపురి యింటి కిపుడె యానందముగా

పుణ్య మార్జింప ,పొరుగింటి పొలతి గూడె

ప్రతి దినమ్మును నర్చింతు భక్తి తోడ
పుణ్య మార్జింప ,పొరుగింటి పొలతి గూడె
నుచ్చనీచము  ల్లేకుండ యోరుగంటి
రామ భద్రుడు వింటిరే ? రామలార !

Friday, October 6, 2017

కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

పరువముగలయొకయాడుది
యురమునుదాబాదుచుండనోపకయపుడున్
 సరగునదండనజేయుట
కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

పరువముగలయొకయాడుది
యురముననాఛ్ఛాదనంబునోపమివలనన్
సరగున కినుక వహించుట
కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

Thursday, October 5, 2017

సత్పుత్రుడొకడుజనింప.సద్గతికరువౌ

సత్పధములందవచ్చును
సత్పుత్రుడొకడుజనింప.సద్గతికరువౌ
తత్పరతయెలేకుండగ
మత్పితరునిగొల్వునెడలమమతలులేకన్

శంకరార్య !

నీదు పయనము జరుగుత! మృదువు గాను
నెట్టి యవరోధ ములులేక యిప్పు డార్య!
దర్శ నీయంబు లైనట్టి యాలయాలు
చూచి కళ్ళార  రండిక సుఖము గాను

 

Wednesday, October 4, 2017

సోమరితనమ్మె.జనులకుసొబగుగూర్చు

కటిక దారిద్ర్యమొనగూర్చికఠినుజేయు
సోమరితనమ్మె.జనులకుసొబగుగూర్చు
ప్రేమతోడన పరులకుబ్రీతిజేయు
నట్టి మంచితనమెయిలనుట్టిపడుచు

Tuesday, October 3, 2017

జనహననముజేయువాడెజనవంద్యుడగున్

వినుమాయీయదిమరిదు
ర్జనహననముజేయువాడెజనవంద్యుడగు
న్ననయముజెడునాలోచన
గనుచునుబాధించుగతనగాపురుషుండై

Monday, October 2, 2017

రాధనాలింగనముజేసె రాఘవుండు

రాధనాలింగనముజేసె రాఘవుండు
నాటకంబునవారట్లునటనజేసె
గాని నిజజీవితంబునగాదు సామి!
రాధ రాఘవులిరువురుబాత్రలచట

గాంధిస్వాతంత్ర్యయోధుడు.గాడునిజము

తనర సత్యమ్ముశాంతియుబ్రాణమైన
గాంధిస్వాతంత్ర్యయోధుడు.గాడునిజము
దేశసంపద నాశించునాశపరుడు
శుధ్ధమైనట్టిమనుజుడుసుమ్ముధరను

Sunday, October 1, 2017

చక్రబంధము

చక్రబంధంపుసీసమ్ముజదువతెలిసె
నీదు రచనావిధానమునిక్కముగను
పండితులకుకాకుండగ బామరులకు
సులువుగానర్ధమగునది సుమ్ముసూర్య!

నంద నందనా,

  శ్రీ లక్ష్మి వల్లభ, శ్రీ గోపికాలోల,
          శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస,
శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ,
          శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
శ్రీ శార్ఙ్గ పాణయే, శ్రీ కటిహస్తాయ,
          శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే,
          శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
శ్రీ హయగ్రీవాయ, శ్రీ జగదీశ్వరా,
          శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేశ,
శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా,
          శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,   
శ్రీ యజ్ఞరూపాయ, శ్రీ ఖడ్గధారిణే,
          శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ,
          శ్రీ సురపూజితా, శ్రీ శిరీశ,     
తే.
నంద నందనా, దశరధ నందన, మధు
సూదన, పశుపాలకుడ, అనాధ రక్ష
కా, దినకర తేజా, సాలగ్రామ హర,  పు
రాణ పురుష,  కాపాడు  పరమ దయాళు.