Sunday, December 31, 2017

2018

భారతీయులనోములపంటగాను
వచ్చెబదునెనిమిదియగువత్సరమ్మ
యాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కాచుగావుతమనలనుగరుణతోడ

పాడిపంటలవృధ్ధతబహుళమగుచు
కూడుగుడ్డలకెప్పుడుకొదవలేక
యైకమత్యముదోడననహరహమ్ము
పంచుకొందురుసంతోషపరిమళమును

తెలివితేటలయందునదెలివిమీరి
యేదిమంచిదియేదిచెడ్డదిపుడమిని
దాననెరుగుచుబ్రతియొక్కమానవుండు
మసలుచుండునునిరతముమాన్యువోలె

వత్సరమంతయునరయగ
మత్సరములువీడిజనులుమమతలతోడన్
నుత్సుకతలుగనబరచుచు
నుత్సవములుజేసికొండ్రునోపినగొలదిన్


అంతర్జాలమునేర్చిరి
వింతగనీతరమునాటిపిల్లలుమిగులన్
 పంతుళ్ళువారుమనకిక
సంతసమునవారియొద్దచట్టులుమనమే

సామరస్యముగలుగుచుసకలజనులు
వారువారలవృత్తులుభవ్యముగను
జేయుచుందురువిడువకన్యాయమెపుడు
సాలుమహిమయేయిట్లుండుసాంతముగను

నోట్లరద్దువలననోటమాటలులేక
నేమిచేయవలయునెందుభద్ర
పరచవలెను?మోడియెరుగలేనట్టిప్ర
దేశమనుచుజింతదీవ్రపరచె

Friday, December 29, 2017

దత్తపది

స్వాతివండెనుజక్కటివంటకములు
షడ్రుచులతోడనలరారెజిత్తమునకు
బ్రేవుమనగనుదిందునునవియయిపుడు
హస్తవాసియేమూలమ్మునట్టమునకు

Thursday, December 28, 2017

ఏకాదశి నాటి పూజ లిడుమల గూర్చున్

ఏకాదశి తిధి యనగను
లోకేశుండి ష్ట పడును లోకము కంటెన్
జీకాకులతో జరిపెడి
యే కాదశి నాటి పూజ లిడుమల గూర్చున్

భార్యకుసేవజేయభువిభర్తతరించునుజన్మజన్మకున్

భార్యనుజూచుగావుతనుభార్యనువోలెనుగాకమాతగా
నార్యుడునాతడెప్పుడునునాలినిబ్రేమనుజూచుచున్సదా
భార్యకుసేవజేయభువిభర్తతరించునుజన్మజన్మకున్
భార్యయుభర్తయున్గలిసిభార్గవియీశులవోలెయుండనొప్పగున్

Wednesday, December 27, 2017

భార్యనుసేవించునట్టిభర్తతరించున్భార్యాభర్తలుజగతిని
నార్యులెగదయెల్లరకునునాలోచింపన్
భార్యలుదరించునటులనె
భార్యనుసేవించునట్టిభర్తతరించున్

Monday, December 25, 2017

విల్లది రామునకునైన విఱువ దరమ్మే

విల్లును విఱిచియె రాముం
డల్లదె యాసీతమాతనా హ్వా నించె
న్ను ల్ల ము లోనికి గ ద మఱి
విల్లది రామునకునైన విఱువ దరమ్మే

Sunday, December 24, 2017

దత్తపది


కాలమేరీతిసాగునోగాలమెరుక
పాడియేసుయోధన!గృష్ఞబంధనమ్ము
భాసిలువదనుడాతడువరదుడుగద
యింకచర్చింపకేదియునిమ్ముపాలు

Saturday, December 23, 2017

పోరాటముజేయశస్త్రములపనియేలాఆరాటమేలకవివర!
పోరాటముజేయశస్త్రములపనియేలా
యారయగాంధీదెచ్చెను
పోరాటములేకయుండభువికిన్ స్వేఛ్ఛన్

ఆకాశవాణి


చదివినఙ్ఞానమంతయునుచప్పునబోవునదేమిచిత్రమో
చదువునుబట్టియుండునదిశ్రధ్ధగదాజదువంగలేనిచో
చదివినఙ్ఞానమేమియునుజక్కగనుండదునేరికైనను
న్జదువులతల్లియిచ్చునికసర్వమువేడగజిత్తశుధ్ధితోన్

మదికి కుశాగ్రతత్త్వమును మానితరీతిని సంతరించిన
న్నది ఘనమై మహోన్నత సభాంతర రాజిత దివ్యతేజమౌ
సదమల భావశూన్యుడయి సారవిహీనత మూర్ఖతత్త్వముం
చదివిన జ్ఞాన మంతయును చప్పునబోవునదేమిచిత్రమో.

బారనిచెప్పగానెవినిబాపడుసంతసమొందెజూడుమాకోరినవెంటనేముదితగొప్పగజేతునునిప్పుడేనుసాం
బారనిచెప్పగానెవినిబాపడుసంతసమొందెజూడుమా
దూరముగాదలంచకనుదోరముసంతసమొప్పగాదగ
న్గూరలుగాయలున్గొనగగూరిమితోడననేగెసంతకున్

Friday, December 22, 2017

బారనంగమురిసెబాపనయ్య

బారనంగమురిసెబాపనయ్యయనుచు
మిత్రుడనెనుసామి!చిత్రముగను
బాపనయ్యలనినవారికిచులకన?
వారినటులననినబాపమబ్బు

రసముతోడవిసిగివేసారచూడుసాం
బారనంగమురిసెబాపనయ్య
పిల్లపెద్దలందరుల్లమలరదిని
బ్రేవుమనుచుదేల్చెబెండ్లియందు

Thursday, December 21, 2017

తెలుగుజదువువారు,దేహియనరెకొద్దిమందిమాత్రమిధ్ధరణిగలరు
తెలుగుజదువువారు,దేహియనరె
భిక్షగోరువారువీధివీధితిరిగి
కర్మఫలముతప్పదేరికైన

Saturday, December 16, 2017

నన్నయరచించె,గావ్యముగన్నడమున


మూడుపర్వములాంధ్రాన ముచ్చటగను
నన్నయరచించె,గావ్యముగన్నడమున
వాహయనగనుగవులెల్లపంపకవి
సరళమగురీతిదనదైన శైలితోడ

Thursday, December 14, 2017

తెలుగుతెలుగనిధీవరుల్ వలుకదగునె


అన్నిభాషలగంటెనునరయతెలుగు
శ్రేష్ఠమైనదియెంతయోచేవకలది
తెలుగుతెలుగనిధీవరుల్ వలుకదగునె
బలుకవచ్చునుహాయిగదెలుగునుడువు

కిరణ్


ఆలివంకవారెయాత్మబంధువులన
నిజముజేసితీవునిజముగాను
నామెయుండునొక్కయరగంటమాత్రమే
సాటిలేరునీకుజగమునందు

పదములులేకుండవ్రాయవలెపద్యములన్


మదికిన్వెతలనుగూర్చెడు
పదములులేకుండవ్రాయవలెపద్యములన్
ముదమున్బొందుదురుగదా
పదములలాలిత్యముండపండితులెపుడున్

Wednesday, December 13, 2017

అరుణాచలయాత్ర


అరుణాచలశివుజూడగ
పురములనేదాటిమేముపోవుచునుండ
న్దిరుమన్నామలయనునొక
కరివరదునియూరుమాకుకనబడెసాగెన్

మల్లెపూలవోలెదెల్లదనముతోడ
పత్తిపూలుమెరిసెపథమునందు
జొన్న చెట్లుగలవుజొన్నకంకెలతోడ
జూడ ముచ్చటయ్యె జూడ్కులకట

చేరితితిరువన్నామల
చేరితిమీరాత్రియందుచేరుచునొకచో
న్నారసిశివసన్నిధినట
జేరితిమోగదినినీయసేమముతోడన్

చేసితిమభిషేకమ్మును
జేసితిమాబావమరదిచెప్పుటవలన
న్జూసితిమంగళరూపుని
వాసిగనభిషేకమైనపార్వతినియునున్

తల్లియుదండ్రియునతనిగ
నుల్లమునన్దలచుకొనుచునుత్సుకతోడ
న్నల్లదెయభిషేకమ్మును
గళ్ళారాచూచియుంటిగనబడువరకున్

భోజనమ్మునుటిఫినులుముదముతోడ
బెట్టుచుందురటయ్యయివేళలందు
భక్తవరులకునిత్యమురక్తితోడ
వారిగదులందువాసపువారలకట


తపముజేసెనురమణుడుతాదాత్మ్యమున
గుహలుమూడింటశ్రధ్ధగాగుట్టుగాను
జేరిచూచితివాటినిజేరుగాను
నేమిభాగ్యముమాయదియేమికరుణ

తనరుగుహవిరూపాక్షునిమరియు
యోంన మశ్శివాయకందగుహనబడునవి
మాకుకలిగెనుదర్శనభాగ్యమవియ
పూర్వజన్మపుసుకృతమువరలుకతన

ఏతావుగనదపమునకు
నాతావునుజేరిధూర్తులారడిజేయ
న్బాతాళలింగమందున
దాతపమునురమణుజేసెదన్మయదృష్టిన్

రమణుడెనీవటనీవే
రమణుడవటసత్యమయిది?రాకాచంద్రా!
యెటజూచిననీనామమె
పటుతరముగబలుకుచుండెపశుపతినాధా!


రమణునివోలెనునాకును
నమలంబగుమోక్షమిచ్చియాదుకొలేవా?
కమలాప్తుబాదుకొలిపిన
ప్రమధాధిప!యాదిదేవ! పార్ధివలింగా!

దర్శనీయంబులైనట్టిదైవములను
వరుసవెంబడిజూచుచుపర్వతమ్ము
చుట్టుతిరిగితిమయ్యదిచూడదవ్వు
పదియునాలుగుమైళ్ళుగబలికెజనము

ఈరకంబుగయాత్రనుబూర్తిజేసి
యన్నపానాదులన్నియునైనపిదప
పయనమగుచునునికరైలుబండిమీద
చేరియుంటిమియింటికిక్షేమముగను

(8-12-2017 to 13-12-2017)

Tuesday, December 5, 2017

శంకరయ్య గారు

నామటుకునేనువ్రాయుదు
నేమియునేజెప్పలేదెయెవరికిస్వామీ!
నామాదిరిగావారలు
దాముగనేవ్రాయుచుండెతమతమశైలిన్

రాయల వారికి న్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్

రాయల వారికి న్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్
మాయని మచ్చగా బలుక మాన్యుల కెట్లుగ దోచె నోగదా
రాయల వారనంగ నిల రాశిగబోసిన మేటి రత్నమే
యాయనఘున్సదా తమిని హర్షము తోడన బ్రస్తుతించెదన్

రాయలకున్దెనుగురాదురసమున్ర్గోలన్

మాయలమాటలెయీయవి
రాయలకున్దెనుగురాదురసమున్ర్గోల
న్నాయతరీతినినరయగ
రాయలెయిలమేటికవియ రమణా!వింటే?

Monday, December 4, 2017

వేంకటపతి కి భామలు వేయిమంది

వేంకటపతి కి భామలు వేయిమంది
వేయిమందియ ,పదునాఱు వేలమంది
భామలమగడు ,నరయగభక్త కోటి
కిసులభుండు ను, వరదుడు  భాసురుండు