Sunday, April 22, 2018

రలవ నీషిధ్ధములు

సంపద నిమ్మని యడుగను
నింపుగ నీనాామమెపుడు నెడదను నుండన్
హంపీపట్టణ  సామీ!
సొంపుగ  దయజేయుమయ్య! సూడగ నన్నున్

Friday, April 20, 2018

etuom

రాక్షస వంశపు శత్రువు
రాక్షసుడగు రావణుండ లంకేశుండే
రక్షకుడే రాము డనుచు
రాక్షసులెల్లరు  జదివిరి రామాయణమున్

g kumv

కవివర! వినుమా ,గణపతి
శివపుత్రుడు,మఱది యగును శ్రీనాధునకు
న్బవమానసుతుడు వలలుడె
యవనిన్దానిష్టుడగుచునాప్తుడునగుచున్

Thursday, April 19, 2018

agin

కారడవుల దాగెనుబులి
తారాధిపుభీతి,నబ్ధిదాగెనణువున
న్నౌరా దుర్యోధనుడే
పారుచువడి భీతినొంది వలలుని వలనన్

Wednesday, April 18, 2018

hkvnll

జంభారి యాఙ్ఞ మేరకు
దంభముతోమేనకమ్మ తాఋషి జేరన్
రంభోరురువులుగలయా
రంభనుగూడిసుతనుగనెరాజర్షి వెసన్

Monday, April 16, 2018

cdjl

మాట యింకను రాలేదు నోట నుండి
యెపుడు వచ్చునో దెలియదు నించు కైన
నేమి జేయగ నెంచెనో నీశు నన్ను
భార మంతయు నతనిపై వైచి యుంటి

qtil.

పూలధరింప నిష్టపడు ముగ్ధలులోకమునందు నుండురే
మాలలుగ్రుచ్చియున్మగువ మాడున నందుననలంకరించుగా
బూలను జాలమందిలను బ్రోగుగ జేసియు నమ్ముకొందురే
పూలల బంధమున్నరయ పూర్వసు భాషిణు లాకళింతురే

Sunday, April 15, 2018

sgjkmm

బాలా! సందియ మీయది
పూలను ధరియింపగోరు పొలతులు గలరే
పూలన నిష్టము కాదా?
మాలలుగా గ్రుచ్చ శిరపు మండన మౌనున్

ఆకాాశవాణి

అతిసా రంబులు వచ్చునా నరుని యాయాసంబువోలెన్సముల్
 యతిసాంగత్యములేని పద్యములె,విద్యాదేవి వాద్యశ్రుతుల్
 సతమున్వీణలు మ్రోగగా గరము నాశాపూరితంబయ్యుదా
శ్రుతిగా నొందుచు నెల్లవేళలిల దాసోహమ్మనంగావలెన్

Saturday, April 14, 2018

adjlp

సాంతము భక్తితోడ నిల సద్గుణ భూషితు ,భక్తపాలుశ్రీ
కాంతకు మ్రొక్కినన్గలుగు గామిత సంపద లెల్ల శీఘ్రమే
చింతల దీర్చువాడుభువి శ్రీకర ధాముడు సత్యదేవునే
స్వాంతము నందునన్నిలిపి సాదర మొప్పగ బూజజేయుమా

dhopp

శాంతము సహనము గలుగుచు
సాంతము గడు భక్తితోడ శంభుని గొలువ
న్గ్రాంతులు వెదజల్లెడుశ్రీ
కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్

suom.

వినయంబొప్పుచు నింతులన్గనగ నెవ్వేళన్బ్రవర్తించుమా
మునికిన్నేర్వగనొప్పురాజవదనా! మోహంపు బధ్ధుల్దమిన్
 దనివిందీరగ జూతురేసతతమెత్తరిన్సుఖంబున్దగ
న్వినుమా యయ్యది వారికి న్నగును నెవ్వేళన్బటాపంచలే

Friday, April 13, 2018

ryoncz

పనిగొని విశ్వామిత్రుని
మునికిన్నేర్పంగనొప్పుమోహపు బుధ్ధు
ల్నొనరెడు నాతని తపమును
మిన్నునకున్రాకుండజేయ  మేనకనంపెన్

Thursday, April 12, 2018

wtukmn

పద్య మయ్యది వ్రాసియు భావమువివ
రణముజేయనికవికె పరాభవమ్ము
ప్రాస,యతులును,గణములు భావములవి
సరిగ యుండుచో మెత్తురు సత్కవులిల

Wednesday, April 11, 2018

eh

కన్నె పిల్లల తోడన గలను నైన
సరస మాడగ తగవు కృష్ణా! ముకుందా!
వారి గాపాడు దుష్టుల బారి నుండి
యార్త రక్షకు డవుగాన  నడుగు చుంటి

Tuesday, April 10, 2018

yom

పండుగ నాడుకూడ గనబ్రాతమగండెలభించెనయ్యయో
పండుగ నాటికో మగడు పండుగకానిది నమ్ములందున
న్నండకుగానొకండు ధర నాయతరీతిని నుండయిష్టమో
రండల కిష్టమో యటుల ,రాక్షస జాతికి జెంది యుందురే

shm

అండగ నుండుట కొరకై
పండునునే బోలినట్టి పతియే దొరకన్
 మొండిగ బలుకుట న్యాయమె?
పండుగ నాడును లభించెబ్రాతమగండే

wuj v

అక్కట యేమనంగనగు నాస్తులనన్నియు గూడబెట్టిన
న్నొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే
యెక్కుచుబోవుగా నపుడ యేడగు కట్లును నుండగా దగన్
 లెక్కలు సూచి యాయముడు లెంకను జేయును నుంట పాపమున్

Monday, April 9, 2018

sgkll

రావణాదుల దునుమాడె రహిని రాము
డొక్కడొక్కడెమరియొక్కడొక్కడొకడె
సత్యమిద్దియ వలదింక సందియంబు
పేరు గాంచెను జగదేక వీరు డనుచు

ఆకాాాాాశవాాాాాణి

తెగువన్జూపుచుక్రొత్తనాయకులకేయో టిచ్చిగెల్పించగ
 న్నగుబాటంబుగ బాలనన్గడుపుచున్నాశంబె ధ్యేయంబుగా
మగువల్బాధను నొందుచుండ భువిలో మానమ్ముగోల్పోవగ
న్బగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్బర్వమ్ము లెన్నో మహిన్

Sunday, April 8, 2018

dyp

కోతులు గుంపుగ నేర్పడి
ప్రీతిని శ్రీరామ యనుచు బ్రేమగ బలుకన్
 గోతుల పధ్ధతి జూచియు
కోతులు కవులెల్లరనుచు గోకిల కూసెన్

Saturday, April 7, 2018

sgj

పూర్వ జన్మపు సుకృతముల్వరలు కతన
బయట పడితిని నాస్పిట ల్బారి నుండి
కాలు డీయగ బ్రాణముల్గనిక రించి
చూడ గలిగితి జగమును సుజను లార!

Wednesday, March 21, 2018

టఢిణుైళ

దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"
స్నిగ్ధమ నంబుతో నరయనేదియు గాదుగనబ్బురమ్మహో
దుగ్ధము జిల్కగా వెడలె దోరము గామృత జీవరాసులే
దగ్ధము లైపయో ధినట తోరముగాగను రేగెదు మ్ములున్

థధీముౌ

ఏమి పాపము జేసితి నేమొ కాని
యాసు పత్రిబా లయితిని నక్క టకట
యెన్ని మందులు ,సూదుల నెన్నతరమె!
వేడు కొందును గావంగ విశ్వ విభుని

ఖగీఢుభ

దేవ దానవు లిరువురు దీక్షతోడ
నమృత ముకొరకు పాలసం ద్రమును జిలుక
"దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
కల్ప వృక్షము లాదిగా గాకయికను

Tuesday, March 20, 2018

టడింఃంమి

కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
వేడుక యాయెగా నదియవేవురి నోటను ,పాడియే వినన్
 కోడియ మాంసహా రముగ,కూడుగ జేయుట  ధర్మమా ? కనన్
 కోడిని  బ్రాహ్మణే తరులు గోరుచు తిందురు సత్యమే గదా!

చజీఝుమవ

మాడునకేదోలోపము
వాడుకలోమిగులరాగవైద్యులు సెప్పన్
 జేడియతావండీ యగ
కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

Monday, March 19, 2018

టడిణంం

కావలిలో నుద్యోగము
పావనుడారంగనాధుభజియించుటకున్
దేవుళ్ళమ్మా! నాపతి
దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"

Sunday, March 18, 2018

dhk

అర్ధ సహితపు పద్యమ్ము జదువ దెలిసె
తెలియ నటువంటి పదములుచాలయుండె
మారు మూలనగలయట్టి మాండలికపు
పదముల నేనేరితెచ్చు మహితుడవుగదా

టడఝణ

పతియగు రాఘవ నాయుడు
ప్రతిదినమును మందు కొట్టి పరుషము లాడ
న్సతియగు లక్ష్మీకాంతము
పతినే మనసారనమ్మి  బాధలనొందెన్

జఝణుణధ

ఓవి ళంబి వత్స రంబ!జయ మునీకు
మనువునొందుదిలను మనుజులైన
మాక ష్టముల లెల్లపరిమార్చి ్మేలు నిమ్ము
మాడి సెంబరుండు మమతపంచి
వంద నంబు లిచ్చు వందలాది

ఛజీణూవ

ఓవి ళంబి వత్స రంబ!జయ మగుగాక
మాక ష్టముల లెల్లపరిమార్చి మేలు నిమ్ము
మాడి సెంబరుండు మమత పంచి
వంద నంబు లిచ్చు వందలాది

Wednesday, March 14, 2018

ఠఝీనుై

బంభర వేణియున్మరియుబాదపపుష్పపు సౌకుమార్యమున్
దంభము లేశమాత్రమయినదానొడగూడకయుండునా
రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్
శంభుని జాపమున్విరుగసారెనులాగ ఫెళ్ళనంగగన్

fjkk

డింభక! నలకూబరుడే
రంభనుబెండ్లాడెను,రఘురాముఁడు ప్రీతిన్"
శంభుని ధనువును విరిచియు
రంభయు,సీతమ్మసతిని రహిచే పట్టెన్

Tuesday, March 13, 2018

చడుముశ

సుందరియేడ్వసాగెనటజోరుగవచ్చినశీతలంబుచే
నందమునాశనమ్మయినదంచు,గడున్ముదమందెనాతియే
యందముదానుగాదనకుసంభవమౌటకునెంతయోమది
న్నందమె కాదెయింతులకునాహ్లదమొందగ జేయునీనిలన్

తదీముక్షళమంచుపడుటవలనమామిడికాయలు
రాల,వండిపెట్టెరమణిరుచిగ
పప్పు చేసి పతికి పరమసం తసముగ
బేవుమనగ తినెను బ్రీతితోడ

చఝీనశళ

సుందరిమిగులన్వగచెను
నందముచెడిపోయెననుచు,నతివయెమురిసె
న్నందముగలదాననగుచు
నందమెకదమనిషిమిగులనాకర్షింపన్

Monday, March 12, 2018

చఝుమూళ

పావనియైనసీతనటపాపుడుక్రూరుడునెత్తుబోయెనా
రావణుడంతరాముడయిరావణుజంపెరణమ్మునందునన్
 బావనమైనవంశమునబ్రాభవమొందియుమేరువీరుగన్
 బేర్వడిభూతలంబునలవేయివిధంబుల గీర్తినొందెగా

ఠఢఞశ

ఆవనవాసికిశత్రువు
రావణుడే,రాముడగుచు రావణుజంపెన్
 శ్రీవిభుడేనరుడైభువి
బావని యాసీతకొరకు ప్రమదులు మెచ్చన్

Saturday, March 10, 2018

టజీణువూహ

ఆజిని కౌరవుల్మరియుపాండవులెల్లరు మార్కొనంగగా
రాజుగనొప్పుదుష్టకురురాజు రణంబునజంపె భీమునిన్
 మాజవరాలులేపగ నుమాపటివేళనుగన్నయీకలన్
 శ్రీజకుజెప్పగావినుచుజెప్పుమ యింకను వింతలన్ననెన్

ఠఢీనుశ

తోయజాక్షి!వినుము దుష్టుడా కురురాజు
భీకరముగజంపెభీమసేను
ననుచుగలను గంటి యచ్చెరు వాయెను
నెట్లువచ్చెనట్లు నిద్దినమున

Friday, March 9, 2018

టిఝీళళహ

జూదమాడువారు సుజనవరులనుచు
గవివరేణ్యులిడుటకాదుమంచి
జూదమాడువారుశుంఠలు,వారిని
దరికిజేరనీయుతలపు వలదు

ఠిఢుశూఋహ

జూదమునాడువారుసరసుల్ సుజనుల్ గదలోకమందునన్ జూదమునాడువారలిలసౌమ్యులవోలెను నుందురేయిలన్ ?
మోదమునీయరెన్నటికిని ముఖ్యజనంబులు,దోటివారికిన్
 జూదమునాడువారలనుజొప్పడనీయకదూరముంచుమా

Thursday, March 8, 2018

xhool

భవబంధము విడనాడిన
దివిజస్థానంబుగలుగు దిరముగననుచు
న్నవిరళపదజాలముతో
రవిచెప్పెను విష్ణుకధలు రంజిల్లజనుల్

Wednesday, March 7, 2018

హనుమత

వినుటకు బాధగ నుండెను
హనుమంతుడు లంకకేగి యసువులబాసెన్
 హనుమంతుడుచంపెనుగద
కనుచుండగరాక్షసాదిఋఖలులనుననిలోన్

Tuesday, March 6, 2018

చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని జిత్ర మయ్యెడిన్

ఏమని జెప్ప నోపునిక నీకలి కాలమునందు జూ డగా
చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని జిత్ర మయ్యెడిన్
భామరొ  దీనిఁజూడగను బాపు య గీచె ను  నట్లుగా జుమీ
చీమల రూపమున్దనరె శీత మయూఖుడు  రోహిణుల్ నటన్

చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను

చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను
బాపు గీచిన చిత్రము భళిర యనుచు
దేలియాడిరి సంతోష ధేనయందు
చూచు వారలా చిత్రంపు చోద్యమునకు

Monday, March 5, 2018

వాసిగ గౌరికాత్మజుడుబ్రహ్మయనంగుడుశౌరికల్లుడౌ

శ్రీసతి లచ్చిమాతకునుశ్రీకరధాముడు విష్ణుమూర్తికిన్
 భాసురమౌ విధానమున బ్రాహ్మణవర్యులుబెండ్లిజేయగా
వాసిగ గౌరికాత్మజుడుబ్రహ్మయనంగుడుశౌరికల్లుడౌ
యాసమవర్తియున్మిగులనార్ద్రతభావమువిల్లసిల్లగన్
   సేసనబ్రాలనన్నిడగశీర్షముపైననువచ్చియుండిరే

గౌరికాత్మజుండు,కమలభవుడుస్కంద నామ కుండు శతపత్ర శకటుండు
గౌరికాత్మజుండు,కమలభవుడు
జగపు సృష్టి కర్త,శారదాదేవికి
భర్త,పరమ పూజ్యు డార్య! మనకు

Sunday, March 4, 2018

న్నాతని పంపకాలు కడుయాతన బెట్టెను గ్రామవాసులన్వీతభయంబుతోడరవి వేవురి సాయముబొందకుండగన్
మాతకుతమ్ముడైనరఘు మామయపంచగనత్తరిన్గన
న్నాతని పంపకాలు కడుయాతన బెట్టెను గ్రామవాసులన్
బాతగ నుండుచిహ్నములుమారుచు గ్రొత్తవికన్పడచ్చటన్

కాలు,కష్ట పెట్టె గ్రామజనులచెప్పినట్లుచేయడెప్పుడు మాపాన
కాలు,కష్ట పెట్టె గ్రామజనుల
జిలిపితనము బాటు చేష్టల తోడను
నొకరి పైననొకరి నుసిరి గొల్పి
ప్రత్యుత్తరంతొలగించు

Saturday, March 3, 2018

వచ్చె నుగాదిపర్వమిల, భాద్రపదాన చిగుళ్ళు వేయగన్

అచ్చపు జీకటిన్ బడిన నార్తుల బాధలు దీర్ వచ్చె
నుగాదిపర్వమిల, భాద్రపదాన చిగుళ్ళు వేయగన్చగా ననన్
జెచ్చెర బాలికామణులు శీఘ్రము గాదమ పుస్తకంబుల
న్నిచ్చలు దైవసన్నిధిని నెమ్మిని బెట్టుచు బూజసేతురే

భారత యుధ్ధరంగమున బార్ధుని,కర్ణుడు చంపె గ్రుధ్ధుడై

బారులు దీరియుండిరట బాహుబలాఢ్యులు మార్కొనంగసూ
భారత యుధ్ధరంగమున బార్ధుని,కర్ణుడు చంపె గ్రుధ్ధుడై
వీరులనంగవారినని వేయుచు బాణము లెన్నియో దగ
న్నీరకమైనయుధ్ధమట యిబ్బడి ముబ్బడి గాగసాగెహో

భారతాజిలోగర్ణుండు పార్ధు జంపె

కర్ణుడెవరిని జంపెను గమల!యనుచు
బాఠశాలలో ప్రశ్నించ బదులు సెప్పె
భారతాజిలోగర్ణుండు పార్ధు జంపె
గాదు  పార్ధుడు చంపెను కర్ణు డనిని
దెలిసి కొనుమమ్మ యియ్యది బేల!నీవు

Friday, March 2, 2018

మేమియు నిక జాలి లేద ?యీనా పైన

ప్రేమను గట్టితి నాలయ
మేమియు నిక జాలి లేద ?యీనా పైన
న్నేమీ యిడుమలు సెప్పుమ !
రామా ! నీచే  ఘటిల్లె ప్రార భ్ధమ్ముల్

న్నల్లుడు పుత్రుడున్మగడు నయ్యెను దానొకరుండె చిత్రమే

అల్లదె సోమరాజుగృహమందునబంధముజూడరాశికి
న్నల్లుడు పుత్రుడున్మగడు నయ్యెను దానొకరుండె చిత్రమే
యుల్లము సంతసం బడగ నూరునువాడయు దద్దరిల్లగా
నెల్లరుజూచుచుండగనునిద్దరునొక్కటి యయ్యెరేసుమా

Thursday, March 1, 2018

నల్లుడుమగడయ్యె, నొకడె యది చిత్రంబే

ఉల్లము నందుండిన మే
నల్లుడుమగడయ్యె, నొకడె యది చిత్రంబే
యల్లా యాశిసు లిచ్చెను
నల్లరి మల్లరిగదిరుగు నామనిచెలికిన్

Wednesday, February 28, 2018

మసియొనర్చెను,శంకరున్ మన్మధుండు

పూలబాణుని ,గోపాన పురహరుండు
మసియొనర్చెను,శంకరున్ మన్మధుండు
విరహ వంతుని జేసెను వేసి శరము
నంగ హీనుని ధాటికి నాగ గలరె?

Tuesday, February 27, 2018

నిత్యముగావలెన్ మనకు నెమ్మదిగల్గ సమస్య మిత్రమా!

నిత్యముగావలెన్ మనకు నెమ్మదిగల్గ సమస్య మిత్రమా!
సత్య ము సామి!మీ పలుకు సైయని యందును నీదు మాటకు
న్భత్యము లేకపోయినను  బాధను నొందను గాని శంకరా!
నిత్యము లేనిచో నదియ నెమ్మది యుండదు నాదుబుర్రయున్

నిత్యము గావలెసమస్య నెమ్మదిగలుగ

సత్యము బలికితి రార్యులు
నిత్యము గావలెసమస్య నెమ్మదిగలుగ
న్నిత్యము శంకర గురుసాం
గత్యముతోనుండుకతనకవిగానైతిన్

Monday, February 26, 2018

న్బిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుక

అన్నగరాజుదాబిలువ హర్షముతోడన వేగిరంబుగ
న్బిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లిని జూడవేడుక
న్నన్నువబార్వతీ పతికి నామెకు గానుకగానిడన్నతు
ల్బన్నుగ వారలిత్తురిక బ్రాభవ మొందగసంపదల్సుమా

వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ

గిరిజ పెండ్లి కొఱకు   గిరిరాజు పిలువంగ
వెడలి రెల్ల భీష్ము పెండ్లి జూడ
నాది  దంపతులిక  నానంద మొందుచు
నిత్తు రన్ని సిరులు భక్తులకిల


Sunday, February 25, 2018

న్నిందల మోపి పిమ్మటనునెమ్మిని మెచ్చెను మేలుగోరుచు

బందిగ దాను జైలువడ బాధను నొందుట కారణంబున
న్గొందల మందిడెందమున  గోపన రాముడు మౌనముంటకు
న్నిందల మోపి పిమ్మటనునెమ్మిని మెచ్చెను మేలుగోరుచు
న్నందరి వోలెకాక రఘురాముడు దైవపుటంశమౌటయే

ఆకాశవాణి

బేల విశుద్ధ రూపవతి ప్రేమప్రపూర్ణవిలాసవర్తి శ్రీ.,                బాలను హేమచంద్రుడట బాహువశీకృతమూర్తిజేయగా., కోలను మన్మధుండటుల కూరిమితూపులవేయ నా  ప్రహా., రాలను పూలుబూసినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్

నింద లన్మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె

ప్రతిదినమ్మును బూజింతుభక్తితోడ
నరటి పండ్లును బత్తాయి యన్నితెచ్చి
యార గింపును జేతును నయిన నన్ను
దయను జూడవు కారణ మయ్య! యేమి?
యాది పురుషుడ వైనట్టి యాదిదేవ!
యందుకొనుమయ్య నాయొక్క వందనములు
నింద లన్మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె

26 th january

•Its is not enough to celebrate a single day as a Republic day
•Its not enough to remember those thousands of people who laid their lives for the sake of this day
•Its just not enough to praise the country on a single day and questioning rest of the "What country am I living in" with regards to the roads and garbage..
• I don't think it's the duty of the single person to make a India but a collective duty of all to do so...."UNITY IS THE STRENGTH"
•Be proud of the country that brought up you since your childhood, feed you like a mother and it's diverse cultures....
●Be proud its religions , Justice , Liberty , Fraternity and equality
●I am an Indian and I am proud of its varied heritage....salute those thousands of  people along with the one on the borders who are fighting for the country till their breath to make us sleep at Nights
              Jai Hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳

ఆకాశవాణి

ఆలయ మందుజూడగను హాయిని గొల్పెడులేతవైనకీ
రాలను బూలుబూచినవి,రమ్యసుగంధములన్ వెలార్చుచున్
బాలశశాంకునిన్ దనరుపచ్చనితెల్లని పూలతోపులే
యాలయ ప్రాంగణంబునవిరాజిలుచుండెను జూడుమాసఖీ!

Saturday, February 24, 2018

ఆకాశవాణి


రాలనుబూలు బూచినవి రమ్యసుగంధములన్వెలార్చుచున్
రాలనుబూలుపూయుటన రాలపయిందగ బూలుచెక్కుటే 
 పూలవి వాసనల్ననగపొందికయేర్పడునట్లుగాగదా
రాలను బూలుచెక్కగను రమ్యపుకాంతులు చిందునేగదా

సంసారికి లేనిచింత సన్యాసికగున్

కంసారిని మదిదలపక
హింసలనేజేయుచుండి యిడుముల  నిడుచున్ 
 సంసారులు సుఖముండగ
సంసారికి లేనిచింత సన్యాసికగున్

జీతములేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే

జీతము లేకయే సతులు  జీవిత మంతయు సంతు గూర్చియ
ప్రీతిని ధారవోయుదురుప్రేమకు సాటిది లేదుగా భువిన్
జింతనుజేయగామదికి చెందునుసంతస మట్టి వారికిన్
జీతములేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే

జీతము లేనట్టి కొలువిసీయన దగునే

జీతము లేకనె తల్లులు
బ్రీతిగనేసా కుదురుగ బిల్లలనెపుడున్
 మాతల వేతన లేమికి
జీతము లేనట్టి కొలువిసీయన దగునే

Thursday, February 22, 2018

రారమ్మని పిలిచె సీత,రాధా లోలున్

శ్రీరాముని మదిదలచుచు
రారమ్మని పిలిచె సీత,రాధా లోలున్
 మీరనిభక్తిని గొలిచిన
దీరని సంపదలనిచ్చు దేవర! మనకున్

లెక్కయె యెక్కువైనపుడులేదుగదాసుఖమెంతమాత్రమున్

అక్కర లేకపోయినను నర్ధము జూడగ బిచ్చిచేష్టలు
న్నెక్కువగా గనంబడును నెల్లజనాళిహృదంతరాళలో
చిక్కులుగల్గుచున్మదికిచేటును హానిని గల్గజేయునే
లెక్కయె యెక్కువైనపుడులేదుగదాసుఖమెంతమాత్రమున్

లెక్క యెక్కువైన లేదుసు ఖమనుట

చాలినంత ధనము సమకూర్చు  కొనినచో
బ్రదుక వచ్చు సుఖపు బ్రదుకె యిలను
లెక్క యెక్కువైన లేదుసు ఖమనుట
యక్షరాల నిజమె యార్య! యదియ

Tuesday, February 20, 2018

పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్పుత్రుని వినయము నడవడి
మిత్రులతో మెలగువిధము మైమరపించన్
బుత్రుని పధ్ధతి దెలియుత
పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్

Monday, February 19, 2018

పతిసరసమ్ములాడ సతి పర్వులువెట్టె నదేమీ చిత్రమో

సతియనునామె యెప్పుడును సాధ్వియ యైనను నేలకోమరిన్
పతిసరసమ్ములాడ సతి పర్వులువెట్టె నదేమీ చిత్రమో
మితముగ గాక గట్టిగ మమేకముగాగను జేయనాపనిన్
సతులగు వారలెవ్వరునుసత్కవి వర్యుడ! యొప్పరెచ్చటన్

పతిసరసము లాడగసతి పరువులువెట్టెన్పతియైన సిగ్గుచేతను
పతిసరసము లాడగసతి పరువులువెట్టెన్
మితిమీరిన సరసములను
సతులెవ్వరు నొప్పుకొనరు సత్కవి వర్యా!

రాముని పుత్రుడర్జునుడురావణుగెల్చె రణాంగణమ్మునన్

రాముని పుత్రుడర్జునుడురావణుగెల్చె రణాంగణమ్మునన్
  రాముడు చంపగాననిని రావణు మీరలుపల్కుటిట్లుగా
నేమని జెప్పనోపుదునునీతరుణిన్మరిపార్ధుడుండెనే
నేమియు లేడుగానరయ యీయుగ మందున నెచ్చటన్ సుమా

Sunday, February 18, 2018

రామునిసుతుడర్జునుండురావణు గెలిచెన్

ఏమీ వింతగ బలికిరి?
రామునిసుతుడర్జునుండురావణు గెలిచెన్
 రాముని సుతుడర్జునుడా?
సామీ! లవకుశలుగాదె సలక్షణముగా

ఆకాశవాణి


విషముసుధామయంబనుచువేల్పులుదెల్పిరిమానవాళికి
న్విషమునుగూర్చిదెల్పుటనువిడ్డురమయ్యెనువిన్నవారికీ
విషయము దేవతాదులునుబేర్మినిజెప్పుటసంభవంబయే
వకుళ!సుధామయంబనుటపధ్ధతికాదుగనీవిషంబునున్

విషముసుధామయంబనుచువేల్పులుదెల్పిరిమానవాళికిన్

విషమయమైననీరమునువీక్షణజేసిచలించి మానవుల్
విషమునుజిమ్ముకాళియునివేడుకలంచుభయంబునందగా
విషముహరింపకృష్ణుడలవేదఫణాలననాట్యమాడగా
విషముసుధామయంబనుచువేల్పులుదెల్పిరిమానవాళికిన్

Saturday, February 17, 2018

దుష్టసుయోధనున్ వలచిద్రోవదిపెండిలి యాడె వేడుకన్


దుష్టసుయోధనున్ వలచిద్రోవదిపెండిలి యాడె వేడుకన్
దుష్టుని బెండ్లి యాడగను ద్రోవదివెర్రిదె? మీరెజెప్పుడీ
యిష్టము తోడనే కరము నిచ్చెను పాండవు లైదుమందికిన్
ద్రష్టలు సంతసంబలర రాణిగ నయ్యెను వారికిన్జుమీ

దుష్ట దుర్యోధనుని భార్య ,ద్రోవదిగదా

భానుమతియను సాధ్వియే వాసుదేవ!
దుష్ట దుర్యోధనుని భార్య ,ద్రోవదిగదా
మత్స్య యంత్రమ్ము గొట్టిన మనుజ విభుని
భార్య యయ్యెను సభికులు ప్రమద మలర

ఆకాశవాణివిషముసుధామయంబనుచువేల్పులుదెల్పిరిమానవాళికి
న్విషమునుగూర్చిదెల్పుటనువిడ్డురమయ్యెనువిన్నవారికీ
విషయము దేవతాదులునుబేర్మినిజెప్పుటసంభవంబయే
వకుళ!సుధామయంబనుటపధ్ధతికాదుగనీవిషంబునున్

*శివ తాండవ స్తోత్రం*జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ
విలోల వీచివల్లరీ విరాజమాన మూర్ధని
ధగ ద్ధగ ద్ధగ జ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ

ధరాధరేంద్ర నందినీ విలాస బంధుబంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే
కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే
మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి

సహస్ర లోచన ప్రభృత్య శేషలేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః
భుజంగ రాజమాలయా నిబద్ధ జాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః

లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచ సాయకం నమన్నిలింప నాయకమ్
సుధా మయూఖ లేఖయా విరాజ మాన శేఖరం
మహా కపాలి సంపదే శిరోజటాల మస్తు నః

కరాల ఫాల పట్టికా ధగ ద్ధగ ద్ధగ జ్జ్వల
ద్ధనంజయా హుతీకృత ప్రచండ పంచ సాయకే
ధరా ధరేన్ద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీథి నీతమః ప్రబంధ బంధు కన్ధరః
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సిన్ధురః
కళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్ఛటా
విడంబి కంఠ కంథరా రుచి ప్రబద్ధ కందరమ్
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంద కచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే

అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ
రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంత కాంత కాంతకం తమంత కాంతకం భజే

జయత్వ దభ్ర విభ్రమ భ్రమద్ భుజంగ మస్తురః
ధగ ధగ ద్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవాట్
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః

దృషద్వి చిత్ర తల్పయోర్ భుజంగ మౌక్తిక స్రజోర్
గరిష్ఠ రత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః
తృణార వింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయోః
సమం ప్రవర్తయః మనః కదా సదాశివం భజే

కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరఃస్థ మంజలిం వహన్
విముక్త లోల లోచనో లలాట ఫాల లగ్నకః
శివేతి మంత్ర ముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్

ఇమం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ భృవన్నరో విశుద్ధి మేతి సంతతమ్
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్

పూజావసాన సమయే దశవక్త్ర గీతం యః
శంభు పూజనమిదం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః

                    - రావణ బ్రహ్మ
        గానం   - యస్ పి బాల సుబ్రహ్మణ్యం

వాక్శుద్ధికీ వాక్సిద్ధికీ ఇవిగో నాల్గు పద్యాలు !టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత డండడమృడండ
మృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడ
డండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూ(ghoo)ర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన
"డ"కారనుత బసవేశ పాహిమాం!

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘ(gha)ర్
క్షణగుణతాండవాటన
"ఢ"కారనుత బసవేశ పాహిమాం!

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ
విక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన
"ణ"కారనుత బసవేశ పాహిమాం!

                                 -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు
                                    "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.

ఈ నాలుగు పద్యాలు మొదటి ప్రయత్నంలోనే తప్పులు లేకుండా చదువగలిగితే మీరు ఉత్తములు.ఓ నాలుగు సార్లు ప్రయత్నించి తప్పులు లేకుండా చదువగలిగితే మధ్యములు. ఎన్ని సార్లు ప్రయత్నించినా తప్పులు లేకుండా చదువలేకపోతున్నారంటే మీరిక ఈజన్మలో తెలుగుభాషను స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడలేరని హెచ్చరించేవారు మా గురుదేవులు.మీరు కూడా ఓసారి చదవండి.మీ పిల్లలతో వీటిని చదివించండి.మీరందరూ "ఉత్తమ"స్థానంలోనే నిలబడాలని మా కోరిక. (శ్రీశివయోగపీఠం)

న్నెంతయొనంచునెంచితినియింతియయే యని మీరలెంతురే

చింతన జేయుటెట్లొయనిజింతన జేయగనీదు మాటయు
న్జింతలుబాపి నేనిపుడు శ్రీలను నిచ్చెడులక్ష్మినేభళా
సంతసమొందుచున్నడుగ జాలని సంపద లీయనత్తరి
న్నెంతయొనంచునెంచితినియింతియయే యని మీరలెంతురే

Friday, February 16, 2018

నెంతయో యనుకొంటి మీరింతెయంద్రు

ఇంటి యవసరములకుగా నీయగోర
వేయి మాత్రమే యిత్తునునిందువదన!
ననుచు బలుకగ నోసామి! యట్లె యనుచు
నెంతయో యనుకొంటి మీరింతెయంద్రు

pedda raja

[28/01, 6:58 a.m.] Peddaraja: 💐💐💐💐 *Good Morning.*
To be happy in life, we have to be tolerant and happy about the wellbeing of the others.
*Have a wonderful day.* 💐💐💐💐
[29/01, 6:25 a.m.] Peddaraja: 💐💐💐💐 Life itself teaches us all the lessons we need to have a happy, healthy and spiritually comfortable life which cannot be taught or propagated by any preachers through PRABACHAN.

Good morning... 💐💐💐💐
[30/01, 6:37 a.m.] Peddaraja: 💐💐💐💐 Try is a small word that can make a big difference in our life. If we try, we only Risk Failure, But, if we don't try, we Ensure Failure ..... 🌞..... *good morning* 💐💐💐💐
[31/01, 5:57 p.m.] Peddaraja: Biggest Environmental Joke:

A small ATM room having two ACs and 3 tube-lights, working 24 hours, is asking me not to print receipt to save environment.. 😂
[01/02, 5:43 a.m.] Peddaraja: 💐💐💐💐 Lovely Thing to learn from Water.
Adjust yourself in every Situation and in any shape.
But Most importantly, Always find out your Own Way to FLOW...
Good Morning 🙏 💐💐💐💐
[03/02, 6:26 a.m.] Peddaraja: 💐💐💐💐 An apology and forgiveness are two sides of a coin.
When we hurt others we must apologize.
When others hurt us we must forgive.

The key to happiness lies in the hands of one who is strong enough to do both.           

🌻Good Morning 🌻 💐💐💐💐
[05/02, 6:53 a.m.] Peddaraja: 💐💐💐💐 If God answers your prayer,
He's increasing your Faith.
If he delays,
He's increasing your patience.
If he doesn't answer,
He knows you can handle it.
*Good morning* 💐💐💐💐
[06/02, 6:35 a.m.] Peddaraja: 💐💐💐💐 Good people are like Diamonds, they should not be tested too much.
If they are hit hard, they will not break but slip away from your hand.

Good Morning 😊🌹🌻😊 💐💐💐💐
[08/02, 6:28 a.m.] Peddaraja: 💐💐💐💐 *Good morning.*
If you want something you never had before you have to act and do something extraordinary you never have done before. 
*Have a wonderful day.* 💐💐💐💐
[09/02, 7:15 a.m.] Peddaraja: 💐💐💐💐 The heart is the only machine that works without any rest for years.
Keep it happy always,
whether it is yours or others.

Good morning🙏 💐💐💐💐
[10/02, 7:00 a.m.] Peddaraja: 💐💐💐💐 Suprabatham 😊🙏

Good people are like street lights along the roads they don't make the distance short but they light up the path & make the walk easy & safe.                                           
Have a Blessed Saturday 🙏😊 💐💐💐💐
[12/02, 5:50 a.m.] Peddaraja: 💐💐💐💐 If you get tired Learn to Rest, Not to Quit.
- LORD BUDDHA -
Happy Morning. 💐💐💐💐
[13/02, 6:33 a.m.] Peddaraja: 💐💐💐💐 Every New Idea is a Joke
Until One Man Achieves it .....

And ......

Every New Thought is Silly,
Until One Believes It......
 
Life Is All About Learning From *Yesterday*, Living For *Today*, And Hoping For *Tomorrow* ...... 
                 
              *Good Morning* 💐💐💐💐
[14/02, 6:34 a.m.] Peddaraja: 💐💐💐💐 “There is no elevator to success, you have to take the stairs." Good morning & have a great day 💐💐💐💐
[15/02, 6:39 a.m.] Peddaraja: 💐💐💐💐 Future is not what we planned for tomorrow, Actually it is the result of what we do today. So do the best in present and You will definitely enjoy the future.

🙏Good morning🙏 💐💐💐💐
[16/02, 5:03 a.m.] Peddaraja: 🌹🌳🍁no millions can buy you time your loosing now so make use of it correctly tomorrow you may have millions but no time to spare🍁🌳🌹good morning🌹🌳🍁

Thursday, February 15, 2018

శారదయేబలింగొనెనుసర్వులవీతదయాంతరంగయైశారదనామకంబిలనుసాగరమొక్కటియుండనత్తరిన్
బారగవేగమైవరద పాకలుమొక్కలు చెట్లతోసహా
శారదయేబలింగొనెనుసర్వులవీతదయాంతరంగయై
యేరదియీయదయ్యదనుదేనినినైననుముంచునేగదా

శారదయే,బలిగొనెగదజనులెందరినోఆరయ చదువుల తల్లియ
శారదయే,బలిగొనెగదజనులెందరినో
వరదల మూలంబునవిను
శారద యుప్పొంగి మిగుల సరగున ముంచిన్

అవధాన విద్య - అవగాహన

అవధానంబదియొకకళ 
యవగాహన ,ధార యికను నాకర్షణముల్ 
కవనంబందున నుండిన 
భువనమునన్ బేరువ చ్చు   మురళీ కృష్ణా !

అనలమెసుమ్మిచల్లనమహాహిమశైలమువేడియీభువిన్

అనలమెసుమ్మిచల్లనమహాహిమశైలమువేడియీభువి
న్ననలముదాకుచోదెలియునార్యుడ!చల్లనయౌనొనుష్ణమో
వినుముహిమాద్రియెప్పుడునుభీకరశీతలవాయువేగదా
యనయమునగ్నియెప్పుడునునాయతవేడినిగల్గియుండుగా

 

Wednesday, February 14, 2018

ననలమ్మేసుమ్మి,చల్లనైనదియిలలో


వినుబడబాగ్నియునరయగ
ననలమ్మేసుమ్మి,చల్లనైనదియిలలో
ననురాగపుటమ్మమనసె
యనయముశీతాద్రియటులెయద్రిజకంటెన్

Tuesday, February 13, 2018

దారముపైనవ్రాలెనుగదామకరందముగ్రోలదుమ్మెదల్

మీరలురాగదేయిటకుమీరునుజూడగరామనాధ!మం
దారముపైనవ్రాలెనుగదామకరందముగ్రోలదుమ్మెదల్
దారవిజంటజంటగటతారసియుండుటజూడగాభళా
మీరనిసంతసంబులనుమేమిపుడిచ్చటపొందుచుంటిమే

దారముపైవ్రాలెదేటిత్రాగగమధువుటున్

ఔరా చూడుమయటమం
దారముపైవ్రాలెదేటిత్రాగగమధువు
న్నారగ ద్రాగినమధువును
భూరుహపున్శాఖపైనపుట్టగబెట్టున్ 

Monday, February 12, 2018

న్యస్తాక్షరి----శి-వ-రా-త్రిక్షేమములనీయనిరతముశివునిగురిచి
భక్తిమీరగగొలిచెదవరదభవుని
రండిమీరలుశుచితోడరాత్రికిమరి
దీవనలలందుకొనగనుద్రిపురహరుని

కందిశంకరయ్యకనులగాంచితినీపూటకందిశంక
రయ్యగారిముఖాముఖియయినభాష
ణమ్ముయూట్యూబునందున,నిమ్ముసాగె
వారిప్రతిభనుగూర్చినబలుకులెన్నొ

Sunday, February 11, 2018

తెలుగు వెలుగు

శంకరార్యుల బ్లాగున సముచితులగు 
కవివ రేణ్యులు దమదమ కవనములను 
పొందు పఱచుచు నుండిరి  ప్రౌ ఢముగను 
వారి రచనలు సక్కగ బత్రిక యగు 
తెలుగు వెలుగున వెలుగుత ! దినముదినము

ననృతమ్ములు బల్కు వాడె యారాధ్యుo డౌ

మానము ప్రాణము పెండ్లిన
ననృతమ్ములు బల్కు వాడె యారాధ్యుo డౌ
వినుమిది పెద్దల మాటగ
ననృతము లేబలుక వచ్చు నాపద లందున్

మీసములన్గనంగగలమేయికమేదినినెందుగాంచినన్

భాసురమైనభామలునుబావనమూర్తులునైననున్భళా
మీసములన్గనంగగలమేయికమేదినినెందుగాంచినన్
 మీ,సములన్గనన్వశమెమేదురమందునశంకరార్యుడా
యీసహపాటికిన్గరుణనీయగవేడుమ శంకరున్దగన్

Saturday, February 10, 2018

మీసములన్ గనగలమెమేదినియందున్

ఆసలమయమీలోకమె
యాసలులేనట్టినరుడెయగుపడడెచట
న్నాసలపల్లకివీడిన
మీసములన్ గనగలమెమేదినియందున్

ఆకాశవాణి3

వేకువనుండి లోకుల ప్రవీణతనెంచక లోపరాశులే,             నాకగు ముఖ్యమంచని యనైతికరీతిని గోలచేయుచున్, కేకలువెట్టి లోకమునగీర్తిగడింపగ జూచువారికిన్,       కాకులపాట కమ్మన-పికమ్ములపాట కఠోరమయ్యెడున్

ఆకాశవాణి2

వ్యాకులమున్ శిరోభరమపాయము తప్పక  దెచ్చిపెట్టుగా,     కాకులపాట-కమ్మన పికమ్ములపాట-కఠోరమయ్యెడున్, భీకరగార్దభంబుల విభేదపు సారవిహీనగాత్రముల్, శ్రీకరచిద్విలాస!రసచిన్మయ!కావుమ కోకిలమ్మలన్

ఆకాశ వాణి

కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠో ర మయ్యెడిన్
కాకుల  పాటనున్  వినగ కంపర మొందును మేని యంతయున్
కాకుల పాటగా నగునె ? కావను గేకలు ,గోలయే గదా
కోకిల కూతలే వినగ గూరిమి గల్గుచు కమ్మనౌ సుమా

Friday, February 9, 2018

తెలుగునునేర్చుకొమ్మనుటతేలికనేర్చినగొల్వులి త్తురే

తెలుగునునేర్చుకొమ్మనుటతేలికనేర్చినగొల్వులి త్తురే
కొలువులులేకపోయిననుగోరికదీరగనేర్చుకోదగున్
గొలువులువచ్చుకొందరకుకోరినచోట్లకుగౌరవంబున్
దెలియుముదీనిభావమునుదేతలికొండలరావ!యిత్తరిన్

కొనుమనుచుబల్కదేలిక కొలువులేవి?దేవి!వినుమిది పరులకు తెలుగు నేర్చు
కొనుమనుచుబల్కదేలిక కొలువులేవి?
యాంగ్లభాషకుగలయట్టి యాదరణము
తెలుగుభాషకులేదుగా దెలుగునేల

గోమాత

గోమాతయొక్కమహిమలు
మీమా టలవలనదెలిసి మేమలరితిమే
 భూమాతవంటిదనుచును
గోమాతకుపూజసేయకోరికదీర్చున్

Thursday, February 8, 2018

సంకటములగూర్చువాడు.సంకర్షణుడే

సంకర్షణుడేజనులకు
సంకటములగూర్చువాడు.సంకర్షణుడే
సంకటములబాపునతడు
శంకరుడేదేనికైనజాలునుసుమ్మీ

అమ్మ

అమ్మ యొడిలోన గలయట్టి కమ్మదనము
నెందుజూచిన గనరాదుచంద్రవదన!
యమ్మ నాన్నలు మనకిల దైవసములు
నీదు ప్రేమను బంచుము నిరతమునిక

Wednesday, February 7, 2018

అ క్కా!యిటురమ్మని మగడాలిన్బిలిచెన్

ఇక్కడె యుండిరిపిల్లలు
నెక్కడనికవెదు కవలద యిప్పుడు మరి నీ
వె క్కడయుంటివి యోరమ
ణ క్కా!యిటురమ్మని మగడాలిన్బిలిచెన్

Tuesday, February 6, 2018

పల్లెటూరులయందునబారునదులుపల్లెటూరులయందునబారునదులు
పచ్చపొలములకిరవయ్యిపసిడిపండి
మార్చునూరును,శోభిల్లియేరుబ్రాల
బసిడిరంగునుబోలుచుభాసిలుగద

కాటుకగా ధరించె గద కంజ దళాయ నేత్ర ,కారమున్

ఘాట గు  లేపనంబునుట కంజపు లోచన నేత్ర శుద్ది కై
కాటుకగా ధరించె గద కంజ దళాయ నేత్ర ,కారమున్
మేటిగ వాడుచో  కనులు మీరని వేడికి నెఱ్ఱ బడ్డవై
మాటికి మాటికి న్నవియ మైకము  గల్గుచు మూయునో సుమా

Monday, February 5, 2018

కాటుకుగ ధరించె ,నింతి కారము నెలమి న్

సూటిగ  లేపనమును లత
కాటుకుగ ధరించె ,నింతి కారము నెలమి న్
ఘాటుగ నుండుట కొరకై
మేటిగనే  వేసియుండె మీరా జాస్మిన్

Sunday, February 4, 2018

దుర్మార్గముగాదుగురులదూషించినచో

వర్మా!దుష్టులశిక్షణ
దుర్మార్గముగాదుగురులదూషించినచో
ధర్మముజతికిలబడుచు
న్మర్మములేప్రబలమగును మర్త్యమునందున్

తద్దినమేశుభంబులిడుధారుణిలోనిజనాళికెప్పుడున్

ఎద్దినమందుసూర్యుడిలనింపుగగానబడంచునుందునో
తద్దినమేశుభంబులిడుధారుణిలోనిజనాళికెప్పుడున్ 
న్నిద్దియసత్యమే సరళ! యీశునినాఙ్ఞనుదాల్చియేసుమా
యద్దిననాయకుండిలకునారనిగాంతినినిచ్చుచుండెగా

Saturday, February 3, 2018

దద్దినమేశుభములొసగుధరణిజనులకున్

ఎద్దినముసూర్యుడగుపడు
దద్దినమేశుభములొసగుధరణిజనులకున్
న్నిద్దిరసత్యమునమ్ముము
మద్దులగోపాలకృష్ణ!మహనీయుండా!

Friday, February 2, 2018

యల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!

మల్లయ్య పలికె నిట్లని
యల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!
కల్లలను బలుక నెప్పుడు
నెల్లరకు న్జెప్పుమయ్య! యియ్యది యిపుడే

శస్త్ర చికిత్

శస్త్ర చికిత్స యయ్యది శంకరులకు
చక్క నగుగాక!శంభుని సత్కరుణను
నాయు రారోగ్య సంపద లధిక మగుచు
జీవ నంబును సాగుత! నవ్యతగను

Thursday, February 1, 2018

లక్ష్శణుబెండ్లియాడినదిరాజితసీతసకామయైభళా

లక్ష్శణుబెండ్లియాడినదిరాజితసీతసకామయైభళా
లక్ష్మణరావ!వింటెయిదిలక్ష్మణుతోడనబెండ్లియా?యయో
లక్ష్శిసమానురాలయినరాజితసీతనునట్లుగానన న్
బక్ష్మలులేకయుండగనుభస్మముగానగువారనేత్రముల్

లక్ష్శణుబెండ్లాడె ,సీతరాగాన్వితయై

లక్ష్శీ! యూర్మిళ యేగద
లక్ష్శణుబెండ్లాడె ,సీతరాగాన్వితయై
లక్ష్శణు భ్రాతగు రాముని
బక్ష్శల కాలంబులోనబరిణయ మాడెన్

హనుమంతుడు,పెండ్లియాడెనద్రి తనూజన్

వినుమా రామునిబంటుగ
హనుమంతుడు,పెండ్లియాడెనద్రి తనూజ
న్ననలముభ్రుకుటిని గలిగెడు
ననిరుధ్ధుడుప్రేమమీర న మరుల యెదుటన్

Tuesday, January 30, 2018

కాశీయాత్ర

కొడుకగు  కిరణును  గలుపు  కొనుచు
విజయ ,జామాత  లిరువురు  వెంట  రాగ
కాశి  కేగితి  విశ్వేశు  గనుట  కొఱకు
హాయి  గొలిపెను  పయనము   నందఱకును
-
కాశి కాపురమున  గ ను విందు  గావించె
కనక  మ యపు  దేహ  కాంతి  తోడ
యన్న పూర్ణ  తల్లి , య భయ మీ యంగను
భక్త  కోటి  కెల్ల రక్తి  నుండె .
-
చూసితి  దుర్గా  మాతను
జూసితి  మఱి  యాంజనేయు  జూసితి  గపులన్
జూసితి  వీణా ధారిని
జూసితి నే  గవల  మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ  నాధుని   జూడంగ  వేల కొలది
భక్త  జనములు  వత్తురు  ప్రతి  దినమ్ము
వారి  నందర  బ్రోవను  వాస  ముండె
కాశి యందున  తిరముగ గాలు డచట
-
ఘాటు  లరువది నాలుగు  గలవు  సుమ్ము
నందు లోనన  మణి కర్ణి కాయు పట్టు
తాన  మాడిన దొలగును  దప్పు  లన్ని
కల్ల  కాదిది నిజమునే  బల్కు చుంటి
-
కాళ  భైరవ  దర్శన  కాంక్ష తోడ
పరుగు  పరుగున  బోవంగ  ప్రభువు  దరికి
సరిగ జూడంగ జాలము  జనము  మధ్య
ప్రణతు  లిడుదును నా కాళ  భైరవునకు .
-
చింతించ దగిన  విషయము
నంతా నిక  చెత్త యుండె  నా పుర మందున్
గుంతల  మాదిరె  వీధులు
నంతా  యా శివుని  లీల  లాహా  యరయన్
-
చీరల  విషయము జూసిన
బారమ యే  లేక యుండి  బహు  తేలికగా
నీరము తడిసిన  చెడక బె
నారసు  పటు  చీర  బోలు  నవ  వస్త్రము నున్ .
-
శివుని  యాజ్ఞ యు  లేనిచొ  చీమ యైన
కుట్ట డందురు  పండి తు లట్టు  లయ్యె
యాజ్ఞ గలుగగ  భర్గుని  యాత్మ  నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని  దరికి .

పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి  గంగ లోన 

న్యస్తాక్షరం

సూర్యచంద్రులనడుమనజొచ్చుభూగ్ర
హమ్ము జంద్రుని నాబడునపుడు గేహ
మందు దేనినిదినరాద?యమ్మ వీణ
రంగు రంగుల చంద్రుని రాత్రి కనుము

ఉష నెల్లూరు

సకల శుభములు గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
వారి యాత్మకు శాంతిని బరగ జేసి
యీయ దగినట్టి ముక్తిని నిచ్చు గాక!

న్బూతు పురాణముం జదువఁ,, బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"

పాతకులౌదురేగదిల పావనులైననుఖచ్చితంబుగ
న్బూతు పురాణముం జదువఁ,, బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
మాతనుదండ్రినిన్మిగులమానముతోడన జూచువారికిన్
బాతకమేమియున్దరికిభాస్కర! రాదనినేర్వుమాయికన్

Monday, January 29, 2018

శ్రీని వాసు

శ్రీని వాసుని బేరున దనరియిలను
చాక చక్యము తోడనసాటి జనుల
సరస సంభాష  ణలతోడ సంత సమును
గలుగ నటులుగ మాట్లాడుతెలివియుతుడు

బూతు పురాణమ్ముఁ జదువఁ, బుణ్యం బబ్బున్"

బూతులు దండిగ వచ్చును
బూతు పురాణమ్ముఁ జదువఁ, బుణ్యం బబ్బున్"
మాతాపితరుల గొలిచిన
బ్రాతఃకాలమునలేచి పదముల యొద్దన్

పూసపాటి వారు

దండమయావిశ్వంభర!
దండమయా వాసుదేవ! దండము కృష్ణా!
దండము జేతును నిరతము
బందములను బారద్రోలు బ్రదుకును నిమ్మా!

Sunday, January 28, 2018

ఆకాశవాణీ

రకరకమైన భావనల రమ్యనిగూఢపు మానసంబుతో .,    పకపక నవ్వులన్విసిరి భామతియై కనుచూపుతూపులం     జకచక వేయునా వర రసాన్విత భాసితమోహనాంగి"శ్యా మ"కరముబట్టినంత రసమంజులభావములుద్భవించవో.        

దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"

దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"
దుఃఖమునిచ్చునాసరళ! తుష్టినిపుష్టిని స్త్రీలకెప్పుడున్
  దుఃఖమునేరికైననిల దుష్టినినీయదు నానెరుంగుమా
దుఃఖమురాకయుండుటకు దుర్గనుగొల్వుముపూటపూటకున్

దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"

స్వంత బిడ్డను గనులార సాకునపుడు
కలుగు సంతోషఝరిముందు కలుగ వేవి
బ్రసవ వేదన సమయాన వరలు నట్టి
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"

కీచకుఁ డైన ,సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"

నీచునిగాదలంచియునునేర్పుననాతనిబారద్రోలుమా
కీచకుఁ డైన ,సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"
వాచ్యపుభావనల్సరళభాషనుబోధనజేయుచుండుటన్
కీచకుడన్నవానికిలకీలక వృత్తినినీయగాదుగా

Saturday, January 27, 2018

కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్

నీచకుడగు,శిక్షార్హుడు
కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్
గాచుచునిరతము జనులను
సూచావాచాలుడవకశుధ్ధిగబలుకన్

బైబిలుపరికించివ్రాసెభాగవతమ్మున్

మాబడిదరినొకబాలుడు
సొబగుందనమ్ములులేకసూటిగబలికె
న్బాబయ పిన్నులతోడన
బైబిలుపరికించివ్రాసెభాగవతమ్మున్

Thursday, January 25, 2018

దత్తపది

దేశము కొరకై మనమే
కోశమునన్భీతిలేకకూరిమితోడన్
 బాశములనువిడనాడుచు
నాశముదలపెట్టకుండనడవగవలయున్

Republic day

•Its is not enough to celebrate a single day as a Republic day
•Its not enough to remember those thousands of people who laid their lives for the sake of this day
•Its just not enough to praise the country on a single day and questioning rest of the "What country am I living in" with regards to the roads and garbage..
• I don't think it's the duty of the single person to make a India but a collective duty of all to do so...."UNITY IS THE STRENGTH"
•Be proud of the country that brought up you since your childhood, feed you like a mother and it's diverse cultures....
●Be proud its religions , Justice , Liberty , Fraternity and equality
●I am an Indian and I am proud of its varied heritage....salute those thousands of  people along with the one on the borders who are fighting for the country till their breath to make us sleep at Nights
              Jai Hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Wednesday, January 24, 2018

సదయను!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

అనుదినము నిన్ను గూర్చియు
వినసొంపుగజదువుచుందువీనుల విందౌ
యినకులనాధునిలెంకా
సదయను!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్

ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
ధారణలేనిమాత్రమునదానవధానిగగాకబోవునే
ధారణవచ్చున్గవికిదాపలుమారులుసేయగాదగ
న్దారకమంత్రమున్వలెనుదానవధానములొయ్యనొయ్యగాన్

Tuesday, January 23, 2018

ధారణలేనికవియెయవధానిగనెగడున్

ధారణ యనునది యొకకళ
ధారణమున్గలుగుకవికిదాచేయంగన్
 దరచుగనవధానంబును
ధారణలేనికవియెయవధానిగనెగడున్

సమరము శాంతిగూర్చు. ఘనసంపదలిచ్చును నిశ్చయంబుగా.

   విమలవిదూర రాక్షసత విజ్ఞతసుంతయు పాటిసేయకే,
 ప్రమదల చిన్నిపాపలను ప్రాంతపుభేదము జూడకుండగన్,
సుమములద్రొక్కివేయు కడు శుంఠలనీచుల దాష్టికంబుపై
 సమరము శాంతిగూర్చు. ఘనసంపదలిచ్చును నిశ్చయంబుగా.

Monday, January 22, 2018

ఖరప థంబు సౌఖ్య కా ర కంబు

ఎట్టి వారి కైన నిహమున జంద్రశే
ఖరప థంబు సౌఖ్య కా ర కంబు
సందియంబు లేదు శ్రధ్ధగా బూజను
జేయ పరమపదము జెందు సుమ్ము

ఆకాశవాణి

అమరులవోలెబంధములనన్నియుదావిడనాడియుండునా
సమరముశాంతిగూర్చుఘనసంపదలిచ్చునునిశ్చయంబుగా
మమతలతోడనెల్లరునుమాన్యులవోలెజరించుటొప్పగు
న్నమితపుభక్తిశ్రధ్ధలప్రజాళికిమేలొనరించగావలెన్

ఆకాశవాణి2

విమలవిదూరులై రాక్షసాంశులయి విజ్ఞత సుంతయు పాటిసేయకే.,                                                               ప్రమదల చిన్ని పాపలను ప్రాంతపు భేదము చూడకుండగన్., సుమములద్రొక్కివేయుకడుశుంఠల నీచుల దాష్టికంబుపై.సమరముశాంతిగూర్చు. ఘనసంపదలిచ్చునునిశ్చయంబుగా.y

సంహ రింతును జగమున శాంతి నిలుప

శిష్ట రక్షణ కొరకునై దుష్టుల నిల
సంహ రింతును జగమున శాంతి నిలుప
ననుచు బలికెను గహరిదా నర్జునునకు
గీత యందున జదువుమా సీత నీవు

Saturday, January 20, 2018

సర్వఙ్ఞుండైనవాడుచంద్రుడెసుమ్మీ

ఇర్వురుచంద్రులుదమతమ
యుర్వినిబాలించుదెరగుజూడగదెలిసెన్
 వారలసర్వఙ్ఞత్వము
సర్వఙ్ఞుండైనవాడుచంద్రుడెసుమ్మీ

Friday, January 19, 2018

కన్నులనిండుగజూతును

కన్నులనిండుగజూతును
చెన్నగునీరూపునెపుడుసీతాన్వేషీ!
దన్నుగనినునేదలతును
బన్నుగనిలనుండుమాకుపవనకుమారా!

పొన్నకంటెవారు

చక్కవర్ణించిచెప్పిరిసత్కవివర!
చూచినట్టులెయుండెనుజూడ్కులకును
మాకుదక్కెనుదర్శనభాగ్యమదియ
పూర్వజన్మపుసుకృతముపొందుకతన

కవితలలేనిభావములుకైతలకెక్కెబ్రశంసనీయమై

కవితలుజూడనేటివికకావికలైనవిగావుటన్భళా
కవితలలేనిభావములుకైతలకెక్కెబ్రశంసనీయమై
కవితలెయుండగోరుదుసకారణయోగ్యముతోడనెప్పుడు
న్గవివరుశంకరార్యులుసుకైతలువ్రాయుజగధ్ధితంబుగన్

Thursday, January 18, 2018

కవితలలోలేనితలపుకైతలకెక్కెన్

కవితలయంతర్జాలము
వివరములవియన్నియుండువిపులముగాగన్
 గవితలతలపులమయమే
కవితలలోలేనితలపుకైతలకెక్కెన్

పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్

అడకు వగా మెలంగుచు నవారిత క్రోధము తోడ నుండు నా
పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్
న్బడతులనంగ నేర్వుమిక బాధల దీర్చెడి యాది శక్తియై
పుడమిని జన్మ నొందునట పోడిమి తోడన ను ధ్ధరించగన్
 

Wednesday, January 17, 2018

పడతియేశాంతిసౌఖ్యముల్భంగపరచు

పడతియేశాంతిసౌఖ్యముల్భంగపరచు
ననుటసరికాదుపురుషుడునగునునార్య!
శాంతికినిసౌఖ్యములవినాశనమునకిల
నహముమూలానభంగములగునుసుమ్ము 

ఆకాశవాణి

1.వేంకటనాథుసత్కృపను వేయిరకంబులబూలతోడ నా.,     2.పంకజమందుచంపకము భాసురమాయెను సుందరాంగికిన్.,3.పంకజనాభునిన్గొలువ బ్రాహ్మిముహూర్తములోన పాప  నా              4.శంకరుబత్నియౌ గిరిజ సన్మతిజేరె సభక్తికంబుగన్.

యాత్రాస్ధలములు

విజయవాడ,పెదకాకాని,కోటప్పకొండ,అమరావతి,శ్రీకాాకుళం,మోపిదేవి,చిలకలపూడి,మంగినపూడిబీచ్ ,వేదాాద్రి,పవిత్రసంగమము

ఆకాశవాణి

అంకముపైనభూసుతనునాదరముంచిన రాముశిల్పమున్., శంకర సర్వమంగళ ప్రశాంతకుటుంబపు బొమ్మలెల్ల క్షే  మంకరమౌనటంచు పరమాద్భుతకొల్వును జూడవచ్చినా
పంకజమందుచంపకముభాసురమాయెనుసుందరాంగికిన్

రణమేయవధానమందురహిమంగళమౌ

గణితముతోబాటుగధా
రణమేయవధానమందురహిమంగళమౌ
గణములబొందికకుదిరిన
గణనకుదానర్హుడగునుగవిగాజగతిన్

Friday, January 12, 2018

చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్

కారణ జన్ముడై వరలి కాంతల ,మర్త్యుల మానసంబునున్
చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్
వారిజనేత్రులందరిని బ్రాణ ప్రదంబుగ జూచు గావుతన్
భారమునం తయు న్నతని బాహువు లందున నుంచిరే సుమా

Thursday, January 11, 2018

చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే

పరమాత్మ పుట్టె జగతిని
కారణ జన్ముండు నగుచు గాంక్షలు దీర్చన్
వారిజ నేత్రుల మానస
చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే

ఆశ్రమము

ముచ్చింతలకున్నేగితి
నచ్చముగానదియయుండెనమరావతిగా
బచ్చనిమొక్కలదోడను
విచ్చినబలుపూలతోడవీధులుసూడన్

ఆది దేవుని దర్శన మైన పిదప
స్వామి చిన జీయరు పదేశ సార మవగ
తమ్ము గావించు కొనియుంటి బిమ్మటా ర్య !
మౌఖికంబుగ మాతోడ మాట లాడె

వేంకటేశునిబూజించిపిదపవారు
ధూపదీపనైవేద్యమునర్పణమ్శు
నొనరజేసినతదుపరినొయ్యనీయ
నోటవేసికొంటిమికమానోరుదెరచి

వేణుస్వామినిజూడంగవేగిరముగ
నడచుకొనుచునుబోతిమినలుగురమ్ము
చూచిమమ్ములస్వామియేచూరగొనుచు
దీయతీయగనాశీర్వదించెమమ్ము

ఉచితభోజనమునుబెట్ట,నుచితరీతి
భోజనమ్మునుగావించిపొట్టనిండ
బయలుదేరితిమటనుండిబరువుతోడ
విడిచివచ్చుటమూలానవేంకటేశు

మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో

మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో
మాన్యతలేకపోయిననుమన్ననలొందుచుగొందరుందురే
యన్యులనంగవారిలనునార్ధికరంగమునందునన్సదా
విన్యాసములైమన్ననలబెంపునునొందుచునుంటిరేకదా

మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్

అన్యాయంబునుజేయును
మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్
 మన్యపుభూములుబ్రజలకు
నన్యులుగాదలచకుండహర్షుడునీయన్

Wednesday, January 10, 2018

దత్తపది

దండిగసమస్యలీయగ
మెండుగలాలిత్యపదపుమిళితముతోడన్
 నిండుగ నవధానిగూర్చి
పండుగదోపించెమాకుపావనచరితా!

Monday, January 8, 2018

తర్షముతీరలేదుగదద్రాక్షరసమ్మునుద్రాగిచూచినన్

వర్షమునందుగంతులనుబాగుగవేసిననైననున్భళా
తర్షముతీరలేదుగదద్రాక్షరసమ్మునుద్రాగిచూచినన్
 తర్షముతీరదెన్నటికిదాగలిగించునుమత్తుదప్పకు
త్కర్షముగాదుగానెరుగుమోకవిశ్రేష్ఠుడ!నీవయిత్తరిన్

తర్షమదితీరదట,త్రాగద్రాక్షరసము

వర్షమందున స్నానమ్ముబడయునెడల
తర్షమదితీరదట,త్రాగద్రాక్షరసము
మత్తుగలిగించునొడలికామధురరసము
నేదియేమైనద్రాగుటకాదుమంచి

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్
 దుంఖముసౌఖ్యముల్లరయదోబుచులాడునునొక్కటొక్కటిన్
 దుంఖమునొందగాతుదినిదుష్టియుగల్గునుఖచ్చితంబుగాన్
 దుఃఖమెకారణంబగునుధూర్వహనాధునివేడుకుంటగన్

Sunday, January 7, 2018

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్
 దుంఖముసౌఖ్యముల్లరయదోబుచులాడునునొక్కటొక్కటిన్
 దుంఖమునొందగాతుదినిదుష్టియుగల్గునుఖచ్చితంబుగాన్
 దుఃఖమెకారణంబగునుధూర్వహనాధునివేడుకుంటగన్

దుఃఖమెరిగినవానికేతుష్టికలుగు

దుఃఖమెరిగినవానికేతుష్టికలుగు
సుఖముదుఃఖముల్ రెండునుసఖులుభువిని
వరుసవెంబడివచ్చునుబ్రజలకవియ
యనుభవించుకొలదినిసహ్యమగునుగద

పద్యమువ్రాయువాడుచెడిపాతకమందునుసత్కవీశ్వరా!

పద్యమువ్రాయువాడుచెడిపాతకమందునుసత్కవీశ్వరా!
పద్యమువ్రాయగాభువినిపాతకమంచునుబల్కుచుంటిరే
చోద్యముగాదెస్వామి!శూన్యమయాయెనుడెందమిత్తరిన్
 బద్యమువ్రాయువాడుగదపంకజనాభునిముద్దుబిడ్డడున్

Saturday, January 6, 2018

పద్యమ్మునువ్రాయువాడుపాతకమందున్

హృద్యంబగుపదములతో
బద్యంబునువ్రాయకుండపరిహాసముగాన్
 మద్యముశ్రేయంబనుచును
పద్యమ్మునువ్రాయువాడుపాతకమందున్

రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

రైతుపడినట్టికష్టాలురయముతీర
పాడిపంటల  తోడనబరవశింప
గాదెనిండుగధాన్యమ్ముగనబడంగ
రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

రంగవల్లులకాంతి సంక్రాంతి వచ్చె.

గొబ్బిదేవతలింటింట కొలువుదీరి,
కన్నెపిల్లల చిత్రంపు కల్పనలన,
 సప్తవర్ణాల శోభిల్లు స్వర్గమనగ,
రంగవల్లులకాంతి సంక్రాంతి వచ్చె.

భాగవతంబువ్రాసెనలప్రాఙ్ఞుడునన్నయభట్టుతెన్గునన్

ఆగనిభక్తిభావముననార్యుడుపోతనదెన్గునన్భళా
భాగవతంబువ్రాసెనలప్రాఙ్ఞుడునన్నయభట్టుతెన్గున
న్వాగనుశాసనుండగుచుభారతగాధనువ్రాసెనేగదా
యాగమశాస్ర్రమయ్యదియహర్షమునొందుచుసమ్మతించగన్

భాగవతమును.నన్నయభట్టువ్రాసె

భక్తిభావానవ్రాసెనుపోతనయిల
భాగవతమును.నన్నయభట్టువ్రాసె
భారతమ్మునుదెనుగునవాసిగాను
నదియపంచమవేదమునాబరగెను

ఝాన్సీలక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీ బాయిని గూర్చి పాట.              పల్లవి....మహిళాశక్తికి మారురూపమై మణికర్ణికగా మొలిచింది.    బ్రిటీషు వారికి సింహస్వప్నమై భీకరపోరుకు పిలిచింది.  చరణం...1.కాశీలోన పుట్టి, కమ్మని ఝాన్సీ మెట్టి,    మహారాణిగా మమతలు పంచుచు, తన ప్రజకెప్పుడు తానై నిలచెను.॥మహిళాశక్తికి॥.2. కర్రసాముతో కత్తిసాముతో, ఘనమౌగుర్రపుస్వారీతో,విచ్చుకత్తులవీరనారిగా.                      ॥మహిళాశక్తికి॥ 3.దత్తతనీకు చెల్లదంటును, ఝూన్సీరాజ్యం వీడిపొమ్మని, డల్హౌసీయే డాబుగ బలుక॥మహిళా శక్తికి॥ 4. వీపునబాలుని కట్టుకొని, కష్టాలన్నీ తట్టుకొని, ఆంగ్లేయులతో పోరాడి, వీరస్వర్గమున వెలిగింది.

ఆకాశవాణి

రైతుపడినట్టికష్టాలురయముతీర
పాడిపంటల  తోడనబరవశింప
గాదెనిండుగధాన్యమ్ముగనబడంగ
రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

Thursday, January 4, 2018

దత్తపది

పదిలమైనదిగురుశిష్యబంధమిలను
గురువుబోధించుగదితలునిరతమతడు
మదిని మననజేయుచునుండుమానకుండ
నదియబంధమువారిదియనుటదగును

Wednesday, January 3, 2018

కోడిమాంసమ్ముహితము.యోగులకు

అవయవంబులగట్టికియార్యులండ్రు
కోడిమాంసమ్ముహితము.యోగులకుదినగ
గాయగూరలుమాత్రమేశ్రేయముగద
కామక్రోధాదులేవియుగానరావు

ఆకాాశవాణి

అన్యాయంబుల ఘోరకార్యముల నా యాంగ్లేయులే చేయగా
    విన్యాసంబుగ వింటినారి ధ్వనిచే విఖ్యాతవీరుండుగా
మాన్యుండై భరతావనిన్నిలచె మా మన్నెంపు సింగంబహో
 జన్యంబేకద కార్యసాధకము సౌజన్యాగ్రగణ్యాళికిన్.

కన్నవారికన్నఖలులుగలరెవెదకిజూచినన్

కన్నవారికన్నఖలులుగలరెవెదకిజూచిన
న్నెంతయెచటవెదకిజూడనెంతమాత్రమున్ఖలు
ల్గాదుభువినినిజముస్వామి!కన్నవారుపూజ్యులే
యాదిదంపతులకుసాటియగుదురుగదవారలే

కన్నవారికన్న.ఖలులుగలరె

వేరుదైవమిలనువెదకిజూడగలరె
కన్నవారికన్న.ఖలులుగలరె
రావణాసురువలెరహిచెడిమెలగుచు
నన్యకాంతలనపహరించెడి

Tuesday, January 2, 2018

: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి

: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వసైన్యాధిపత్యంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
రావణుబెండ్లియాడినది.రాజితసీతనుసకామయైభళా

పావనమైనయాముదితగభాసురలీలనుగాంచనత్తరిన్
రావణుబెండ్లియాడినది.రాజితసీతనుసకామయైభళా
యావనమందునన్నునచనాఙ్ఞనునిచ్చెనులక్ష్ణ్మణాఖ్యకున్
భావనజేయగానదియభావ్యముకాదుగననెట్టివారికిన్

రావణునిబెండ్లియాడె,ధరాతనూజమయునికొమరితమండోదరాఖ్యభామ
రావణునిబెండ్లియాడె,ధరాతనూజ
కోసలేంద్రుడురామునిగూర్మితోడ
బెండ్లియాడెనుబూమాలవేసి సభను

Monday, January 1, 2018

క్రొత్తసాలు యతి స్థానాలలో

క్రొత్తవత్సరమందలిక్రొత్తదైన
దలపుముదమునిచ్చెనుగజిత్తమునకిపుడు
శాంతియుతముగబ్రదుకులుసాగిపోవ
బ్రోవగోరుదునిపుడుపలువిధముగను