Tuesday, January 30, 2018

కాశీయాత్ర

కొడుకగు  కిరణును  గలుపు  కొనుచు
విజయ ,జామాత  లిరువురు  వెంట  రాగ
కాశి  కేగితి  విశ్వేశు  గనుట  కొఱకు
హాయి  గొలిపెను  పయనము   నందఱకును
-
కాశి కాపురమున  గ ను విందు  గావించె
కనక  మ యపు  దేహ  కాంతి  తోడ
యన్న పూర్ణ  తల్లి , య భయ మీ యంగను
భక్త  కోటి  కెల్ల రక్తి  నుండె .
-
చూసితి  దుర్గా  మాతను
జూసితి  మఱి  యాంజనేయు  జూసితి  గపులన్
జూసితి  వీణా ధారిని
జూసితి నే  గవల  మాత జూడ్కుల కింపౌ
-
విశ్వ  నాధుని   జూడంగ  వేల కొలది
భక్త  జనములు  వత్తురు  ప్రతి  దినమ్ము
వారి  నందర  బ్రోవను  వాస  ముండె
కాశి యందున  తిరముగ గాలు డచట
-
ఘాటు  లరువది నాలుగు  గలవు  సుమ్ము
నందు లోనన  మణి కర్ణి కాయు పట్టు
తాన  మాడిన దొలగును  దప్పు  లన్ని
కల్ల  కాదిది నిజమునే  బల్కు చుంటి
-
కాళ  భైరవ  దర్శన  కాంక్ష తోడ
పరుగు  పరుగున  బోవంగ  ప్రభువు  దరికి
సరిగ జూడంగ జాలము  జనము  మధ్య
ప్రణతు  లిడుదును నా కాళ  భైరవునకు .
-
చింతించ దగిన  విషయము
నంతా నిక  చెత్త యుండె  నా పుర మందున్
గుంతల  మాదిరె  వీధులు
నంతా  యా శివుని  లీల  లాహా  యరయన్
-
చీరల  విషయము జూసిన
బారమ యే  లేక యుండి  బహు  తేలికగా
నీరము తడిసిన  చెడక బె
నారసు  పటు  చీర  బోలు  నవ  వస్త్రము నున్ .
-
శివుని  యాజ్ఞ యు  లేనిచొ  చీమ యైన
కుట్ట డందురు  పండి తు లట్టు  లయ్యె
యాజ్ఞ గలుగగ  భర్గుని  యాత్మ  నుండి
వెళ్ళ గలిగితి మేముయా విభుని  దరికి .

పండ్ల యందున యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ
కాశి యందున విడిచితి  గంగ లోన 

న్యస్తాక్షరం

సూర్యచంద్రులనడుమనజొచ్చుభూగ్ర
హమ్ము జంద్రుని నాబడునపుడు గేహ
మందు దేనినిదినరాద?యమ్మ వీణ
రంగు రంగుల చంద్రుని రాత్రి కనుము

ఉష నెల్లూరు

సకల శుభములు గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
వారి యాత్మకు శాంతిని బరగ జేసి
యీయ దగినట్టి ముక్తిని నిచ్చు గాక!

న్బూతు పురాణముం జదువఁ,, బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"

పాతకులౌదురేగదిల పావనులైననుఖచ్చితంబుగ
న్బూతు పురాణముం జదువఁ,, బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
మాతనుదండ్రినిన్మిగులమానముతోడన జూచువారికిన్
బాతకమేమియున్దరికిభాస్కర! రాదనినేర్వుమాయికన్

Monday, January 29, 2018

శ్రీని వాసు

శ్రీని వాసుని బేరున దనరియిలను
చాక చక్యము తోడనసాటి జనుల
సరస సంభాష  ణలతోడ సంత సమును
గలుగ నటులుగ మాట్లాడుతెలివియుతుడు

బూతు పురాణమ్ముఁ జదువఁ, బుణ్యం బబ్బున్"

బూతులు దండిగ వచ్చును
బూతు పురాణమ్ముఁ జదువఁ, బుణ్యం బబ్బున్"
మాతాపితరుల గొలిచిన
బ్రాతఃకాలమునలేచి పదముల యొద్దన్

పూసపాటి వారు

దండమయావిశ్వంభర!
దండమయా వాసుదేవ! దండము కృష్ణా!
దండము జేతును నిరతము
బందములను బారద్రోలు బ్రదుకును నిమ్మా!

Sunday, January 28, 2018

ఆకాశవాణీ

రకరకమైన భావనల రమ్యనిగూఢపు మానసంబుతో .,    పకపక నవ్వులన్విసిరి భామతియై కనుచూపుతూపులం     జకచక వేయునా వర రసాన్విత భాసితమోహనాంగి"శ్యా మ"కరముబట్టినంత రసమంజులభావములుద్భవించవో.        

దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"

దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"
దుఃఖమునిచ్చునాసరళ! తుష్టినిపుష్టిని స్త్రీలకెప్పుడున్
  దుఃఖమునేరికైననిల దుష్టినినీయదు నానెరుంగుమా
దుఃఖమురాకయుండుటకు దుర్గనుగొల్వుముపూటపూటకున్

దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"

స్వంత బిడ్డను గనులార సాకునపుడు
కలుగు సంతోషఝరిముందు కలుగ వేవి
బ్రసవ వేదన సమయాన వరలు నట్టి
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"

కీచకుఁ డైన ,సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"

నీచునిగాదలంచియునునేర్పుననాతనిబారద్రోలుమా
కీచకుఁ డైన ,సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"
వాచ్యపుభావనల్సరళభాషనుబోధనజేయుచుండుటన్
కీచకుడన్నవానికిలకీలక వృత్తినినీయగాదుగా

Saturday, January 27, 2018

కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్

నీచకుడగు,శిక్షార్హుడు
కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్
గాచుచునిరతము జనులను
సూచావాచాలుడవకశుధ్ధిగబలుకన్

బైబిలుపరికించివ్రాసెభాగవతమ్మున్

మాబడిదరినొకబాలుడు
సొబగుందనమ్ములులేకసూటిగబలికె
న్బాబయ పిన్నులతోడన
బైబిలుపరికించివ్రాసెభాగవతమ్మున్

Thursday, January 25, 2018

దత్తపది

దేశము కొరకై మనమే
కోశమునన్భీతిలేకకూరిమితోడన్
 బాశములనువిడనాడుచు
నాశముదలపెట్టకుండనడవగవలయున్

Republic day

•Its is not enough to celebrate a single day as a Republic day
•Its not enough to remember those thousands of people who laid their lives for the sake of this day
•Its just not enough to praise the country on a single day and questioning rest of the "What country am I living in" with regards to the roads and garbage..
• I don't think it's the duty of the single person to make a India but a collective duty of all to do so...."UNITY IS THE STRENGTH"
•Be proud of the country that brought up you since your childhood, feed you like a mother and it's diverse cultures....
●Be proud its religions , Justice , Liberty , Fraternity and equality
●I am an Indian and I am proud of its varied heritage....salute those thousands of  people along with the one on the borders who are fighting for the country till their breath to make us sleep at Nights
              Jai Hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Wednesday, January 24, 2018

సదయను!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

అనుదినము నిన్ను గూర్చియు
వినసొంపుగజదువుచుందువీనుల విందౌ
యినకులనాధునిలెంకా
సదయను!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్

ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
ధారణలేనిమాత్రమునదానవధానిగగాకబోవునే
ధారణవచ్చున్గవికిదాపలుమారులుసేయగాదగ
న్దారకమంత్రమున్వలెనుదానవధానములొయ్యనొయ్యగాన్

Tuesday, January 23, 2018

ధారణలేనికవియెయవధానిగనెగడున్

ధారణ యనునది యొకకళ
ధారణమున్గలుగుకవికిదాచేయంగన్
 దరచుగనవధానంబును
ధారణలేనికవియెయవధానిగనెగడున్

సమరము శాంతిగూర్చు. ఘనసంపదలిచ్చును నిశ్చయంబుగా.

   విమలవిదూర రాక్షసత విజ్ఞతసుంతయు పాటిసేయకే,
 ప్రమదల చిన్నిపాపలను ప్రాంతపుభేదము జూడకుండగన్,
సుమములద్రొక్కివేయు కడు శుంఠలనీచుల దాష్టికంబుపై
 సమరము శాంతిగూర్చు. ఘనసంపదలిచ్చును నిశ్చయంబుగా.

Monday, January 22, 2018

ఖరప థంబు సౌఖ్య కా ర కంబు

ఎట్టి వారి కైన నిహమున జంద్రశే
ఖరప థంబు సౌఖ్య కా ర కంబు
సందియంబు లేదు శ్రధ్ధగా బూజను
జేయ పరమపదము జెందు సుమ్ము

ఆకాశవాణి

అమరులవోలెబంధములనన్నియుదావిడనాడియుండునా
సమరముశాంతిగూర్చుఘనసంపదలిచ్చునునిశ్చయంబుగా
మమతలతోడనెల్లరునుమాన్యులవోలెజరించుటొప్పగు
న్నమితపుభక్తిశ్రధ్ధలప్రజాళికిమేలొనరించగావలెన్

ఆకాశవాణి2

విమలవిదూరులై రాక్షసాంశులయి విజ్ఞత సుంతయు పాటిసేయకే.,                                                               ప్రమదల చిన్ని పాపలను ప్రాంతపు భేదము చూడకుండగన్., సుమములద్రొక్కివేయుకడుశుంఠల నీచుల దాష్టికంబుపై.సమరముశాంతిగూర్చు. ఘనసంపదలిచ్చునునిశ్చయంబుగా.y

సంహ రింతును జగమున శాంతి నిలుప

శిష్ట రక్షణ కొరకునై దుష్టుల నిల
సంహ రింతును జగమున శాంతి నిలుప
ననుచు బలికెను గహరిదా నర్జునునకు
గీత యందున జదువుమా సీత నీవు

Saturday, January 20, 2018

సర్వఙ్ఞుండైనవాడుచంద్రుడెసుమ్మీ

ఇర్వురుచంద్రులుదమతమ
యుర్వినిబాలించుదెరగుజూడగదెలిసెన్
 వారలసర్వఙ్ఞత్వము
సర్వఙ్ఞుండైనవాడుచంద్రుడెసుమ్మీ

Friday, January 19, 2018

కన్నులనిండుగజూతును

కన్నులనిండుగజూతును
చెన్నగునీరూపునెపుడుసీతాన్వేషీ!
దన్నుగనినునేదలతును
బన్నుగనిలనుండుమాకుపవనకుమారా!

పొన్నకంటెవారు

చక్కవర్ణించిచెప్పిరిసత్కవివర!
చూచినట్టులెయుండెనుజూడ్కులకును
మాకుదక్కెనుదర్శనభాగ్యమదియ
పూర్వజన్మపుసుకృతముపొందుకతన

కవితలలేనిభావములుకైతలకెక్కెబ్రశంసనీయమై

కవితలుజూడనేటివికకావికలైనవిగావుటన్భళా
కవితలలేనిభావములుకైతలకెక్కెబ్రశంసనీయమై
కవితలెయుండగోరుదుసకారణయోగ్యముతోడనెప్పుడు
న్గవివరుశంకరార్యులుసుకైతలువ్రాయుజగధ్ధితంబుగన్

Thursday, January 18, 2018

కవితలలోలేనితలపుకైతలకెక్కెన్

కవితలయంతర్జాలము
వివరములవియన్నియుండువిపులముగాగన్
 గవితలతలపులమయమే
కవితలలోలేనితలపుకైతలకెక్కెన్

పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్

అడకు వగా మెలంగుచు నవారిత క్రోధము తోడ నుండు నా
పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్
న్బడతులనంగ నేర్వుమిక బాధల దీర్చెడి యాది శక్తియై
పుడమిని జన్మ నొందునట పోడిమి తోడన ను ధ్ధరించగన్
 

Wednesday, January 17, 2018

పడతియేశాంతిసౌఖ్యముల్భంగపరచు

పడతియేశాంతిసౌఖ్యముల్భంగపరచు
ననుటసరికాదుపురుషుడునగునునార్య!
శాంతికినిసౌఖ్యములవినాశనమునకిల
నహముమూలానభంగములగునుసుమ్ము 

ఆకాశవాణి

1.వేంకటనాథుసత్కృపను వేయిరకంబులబూలతోడ నా.,     2.పంకజమందుచంపకము భాసురమాయెను సుందరాంగికిన్.,3.పంకజనాభునిన్గొలువ బ్రాహ్మిముహూర్తములోన పాప  నా              4.శంకరుబత్నియౌ గిరిజ సన్మతిజేరె సభక్తికంబుగన్.

యాత్రాస్ధలములు

విజయవాడ,పెదకాకాని,కోటప్పకొండ,అమరావతి,శ్రీకాాకుళం,మోపిదేవి,చిలకలపూడి,మంగినపూడిబీచ్ ,వేదాాద్రి,పవిత్రసంగమము

ఆకాశవాణి

అంకముపైనభూసుతనునాదరముంచిన రాముశిల్పమున్., శంకర సర్వమంగళ ప్రశాంతకుటుంబపు బొమ్మలెల్ల క్షే  మంకరమౌనటంచు పరమాద్భుతకొల్వును జూడవచ్చినా
పంకజమందుచంపకముభాసురమాయెనుసుందరాంగికిన్

రణమేయవధానమందురహిమంగళమౌ

గణితముతోబాటుగధా
రణమేయవధానమందురహిమంగళమౌ
గణములబొందికకుదిరిన
గణనకుదానర్హుడగునుగవిగాజగతిన్

Friday, January 12, 2018

చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్

కారణ జన్ముడై వరలి కాంతల ,మర్త్యుల మానసంబునున్
చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్
వారిజనేత్రులందరిని బ్రాణ ప్రదంబుగ జూచు గావుతన్
భారమునం తయు న్నతని బాహువు లందున నుంచిరే సుమా

Thursday, January 11, 2018

చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే

పరమాత్మ పుట్టె జగతిని
కారణ జన్ముండు నగుచు గాంక్షలు దీర్చన్
వారిజ నేత్రుల మానస
చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే

ఆశ్రమము

ముచ్చింతలకున్నేగితి
నచ్చముగానదియయుండెనమరావతిగా
బచ్చనిమొక్కలదోడను
విచ్చినబలుపూలతోడవీధులుసూడన్

ఆది దేవుని దర్శన మైన పిదప
స్వామి చిన జీయరు పదేశ సార మవగ
తమ్ము గావించు కొనియుంటి బిమ్మటా ర్య !
మౌఖికంబుగ మాతోడ మాట లాడె

వేంకటేశునిబూజించిపిదపవారు
ధూపదీపనైవేద్యమునర్పణమ్శు
నొనరజేసినతదుపరినొయ్యనీయ
నోటవేసికొంటిమికమానోరుదెరచి

వేణుస్వామినిజూడంగవేగిరముగ
నడచుకొనుచునుబోతిమినలుగురమ్ము
చూచిమమ్ములస్వామియేచూరగొనుచు
దీయతీయగనాశీర్వదించెమమ్ము

ఉచితభోజనమునుబెట్ట,నుచితరీతి
భోజనమ్మునుగావించిపొట్టనిండ
బయలుదేరితిమటనుండిబరువుతోడ
విడిచివచ్చుటమూలానవేంకటేశు

మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో

మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో
మాన్యతలేకపోయిననుమన్ననలొందుచుగొందరుందురే
యన్యులనంగవారిలనునార్ధికరంగమునందునన్సదా
విన్యాసములైమన్ననలబెంపునునొందుచునుంటిరేకదా

మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్

అన్యాయంబునుజేయును
మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్
 మన్యపుభూములుబ్రజలకు
నన్యులుగాదలచకుండహర్షుడునీయన్

Wednesday, January 10, 2018

దత్తపది

దండిగసమస్యలీయగ
మెండుగలాలిత్యపదపుమిళితముతోడన్
 నిండుగ నవధానిగూర్చి
పండుగదోపించెమాకుపావనచరితా!

Monday, January 8, 2018

తర్షముతీరలేదుగదద్రాక్షరసమ్మునుద్రాగిచూచినన్

వర్షమునందుగంతులనుబాగుగవేసిననైననున్భళా
తర్షముతీరలేదుగదద్రాక్షరసమ్మునుద్రాగిచూచినన్
 తర్షముతీరదెన్నటికిదాగలిగించునుమత్తుదప్పకు
త్కర్షముగాదుగానెరుగుమోకవిశ్రేష్ఠుడ!నీవయిత్తరిన్

తర్షమదితీరదట,త్రాగద్రాక్షరసము

వర్షమందున స్నానమ్ముబడయునెడల
తర్షమదితీరదట,త్రాగద్రాక్షరసము
మత్తుగలిగించునొడలికామధురరసము
నేదియేమైనద్రాగుటకాదుమంచి

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్
 దుంఖముసౌఖ్యముల్లరయదోబుచులాడునునొక్కటొక్కటిన్
 దుంఖమునొందగాతుదినిదుష్టియుగల్గునుఖచ్చితంబుగాన్
 దుఃఖమెకారణంబగునుధూర్వహనాధునివేడుకుంటగన్

Sunday, January 7, 2018

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్

దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్
 దుంఖముసౌఖ్యముల్లరయదోబుచులాడునునొక్కటొక్కటిన్
 దుంఖమునొందగాతుదినిదుష్టియుగల్గునుఖచ్చితంబుగాన్
 దుఃఖమెకారణంబగునుధూర్వహనాధునివేడుకుంటగన్

దుఃఖమెరిగినవానికేతుష్టికలుగు

దుఃఖమెరిగినవానికేతుష్టికలుగు
సుఖముదుఃఖముల్ రెండునుసఖులుభువిని
వరుసవెంబడివచ్చునుబ్రజలకవియ
యనుభవించుకొలదినిసహ్యమగునుగద

పద్యమువ్రాయువాడుచెడిపాతకమందునుసత్కవీశ్వరా!

పద్యమువ్రాయువాడుచెడిపాతకమందునుసత్కవీశ్వరా!
పద్యమువ్రాయగాభువినిపాతకమంచునుబల్కుచుంటిరే
చోద్యముగాదెస్వామి!శూన్యమయాయెనుడెందమిత్తరిన్
 బద్యమువ్రాయువాడుగదపంకజనాభునిముద్దుబిడ్డడున్

Saturday, January 6, 2018

పద్యమ్మునువ్రాయువాడుపాతకమందున్

హృద్యంబగుపదములతో
బద్యంబునువ్రాయకుండపరిహాసముగాన్
 మద్యముశ్రేయంబనుచును
పద్యమ్మునువ్రాయువాడుపాతకమందున్

రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

రైతుపడినట్టికష్టాలురయముతీర
పాడిపంటల  తోడనబరవశింప
గాదెనిండుగధాన్యమ్ముగనబడంగ
రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

రంగవల్లులకాంతి సంక్రాంతి వచ్చె.

గొబ్బిదేవతలింటింట కొలువుదీరి,
కన్నెపిల్లల చిత్రంపు కల్పనలన,
 సప్తవర్ణాల శోభిల్లు స్వర్గమనగ,
రంగవల్లులకాంతి సంక్రాంతి వచ్చె.

భాగవతంబువ్రాసెనలప్రాఙ్ఞుడునన్నయభట్టుతెన్గునన్

ఆగనిభక్తిభావముననార్యుడుపోతనదెన్గునన్భళా
భాగవతంబువ్రాసెనలప్రాఙ్ఞుడునన్నయభట్టుతెన్గున
న్వాగనుశాసనుండగుచుభారతగాధనువ్రాసెనేగదా
యాగమశాస్ర్రమయ్యదియహర్షమునొందుచుసమ్మతించగన్

భాగవతమును.నన్నయభట్టువ్రాసె

భక్తిభావానవ్రాసెనుపోతనయిల
భాగవతమును.నన్నయభట్టువ్రాసె
భారతమ్మునుదెనుగునవాసిగాను
నదియపంచమవేదమునాబరగెను

ఝాన్సీలక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీ బాయిని గూర్చి పాట.              పల్లవి....మహిళాశక్తికి మారురూపమై మణికర్ణికగా మొలిచింది.    బ్రిటీషు వారికి సింహస్వప్నమై భీకరపోరుకు పిలిచింది.  చరణం...1.కాశీలోన పుట్టి, కమ్మని ఝాన్సీ మెట్టి,    మహారాణిగా మమతలు పంచుచు, తన ప్రజకెప్పుడు తానై నిలచెను.॥మహిళాశక్తికి॥.2. కర్రసాముతో కత్తిసాముతో, ఘనమౌగుర్రపుస్వారీతో,విచ్చుకత్తులవీరనారిగా.                      ॥మహిళాశక్తికి॥ 3.దత్తతనీకు చెల్లదంటును, ఝూన్సీరాజ్యం వీడిపొమ్మని, డల్హౌసీయే డాబుగ బలుక॥మహిళా శక్తికి॥ 4. వీపునబాలుని కట్టుకొని, కష్టాలన్నీ తట్టుకొని, ఆంగ్లేయులతో పోరాడి, వీరస్వర్గమున వెలిగింది.

ఆకాశవాణి

రైతుపడినట్టికష్టాలురయముతీర
పాడిపంటల  తోడనబరవశింప
గాదెనిండుగధాన్యమ్ముగనబడంగ
రంగవల్లులకాంతిసంక్రాంతివచ్చె

Thursday, January 4, 2018

దత్తపది

పదిలమైనదిగురుశిష్యబంధమిలను
గురువుబోధించుగదితలునిరతమతడు
మదిని మననజేయుచునుండుమానకుండ
నదియబంధమువారిదియనుటదగును

Wednesday, January 3, 2018

కోడిమాంసమ్ముహితము.యోగులకు

అవయవంబులగట్టికియార్యులండ్రు
కోడిమాంసమ్ముహితము.యోగులకుదినగ
గాయగూరలుమాత్రమేశ్రేయముగద
కామక్రోధాదులేవియుగానరావు

ఆకాాశవాణి

అన్యాయంబుల ఘోరకార్యముల నా యాంగ్లేయులే చేయగా
    విన్యాసంబుగ వింటినారి ధ్వనిచే విఖ్యాతవీరుండుగా
మాన్యుండై భరతావనిన్నిలచె మా మన్నెంపు సింగంబహో
 జన్యంబేకద కార్యసాధకము సౌజన్యాగ్రగణ్యాళికిన్.

కన్నవారికన్నఖలులుగలరెవెదకిజూచినన్

కన్నవారికన్నఖలులుగలరెవెదకిజూచిన
న్నెంతయెచటవెదకిజూడనెంతమాత్రమున్ఖలు
ల్గాదుభువినినిజముస్వామి!కన్నవారుపూజ్యులే
యాదిదంపతులకుసాటియగుదురుగదవారలే

కన్నవారికన్న.ఖలులుగలరె

వేరుదైవమిలనువెదకిజూడగలరె
కన్నవారికన్న.ఖలులుగలరె
రావణాసురువలెరహిచెడిమెలగుచు
నన్యకాంతలనపహరించెడి

Tuesday, January 2, 2018

: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి

: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వసైన్యాధిపత్యంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
రావణుబెండ్లియాడినది.రాజితసీతనుసకామయైభళా

పావనమైనయాముదితగభాసురలీలనుగాంచనత్తరిన్
రావణుబెండ్లియాడినది.రాజితసీతనుసకామయైభళా
యావనమందునన్నునచనాఙ్ఞనునిచ్చెనులక్ష్ణ్మణాఖ్యకున్
భావనజేయగానదియభావ్యముకాదుగననెట్టివారికిన్

రావణునిబెండ్లియాడె,ధరాతనూజమయునికొమరితమండోదరాఖ్యభామ
రావణునిబెండ్లియాడె,ధరాతనూజ
కోసలేంద్రుడురామునిగూర్మితోడ
బెండ్లియాడెనుబూమాలవేసి సభను

Monday, January 1, 2018

క్రొత్తసాలు యతి స్థానాలలో

క్రొత్తవత్సరమందలిక్రొత్తదైన
దలపుముదమునిచ్చెనుగజిత్తమునకిపుడు
శాంతియుతముగబ్రదుకులుసాగిపోవ
బ్రోవగోరుదునిపుడుపలువిధముగను