Saturday, January 6, 2018

ఝాన్సీలక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీ బాయిని గూర్చి పాట.              పల్లవి....మహిళాశక్తికి మారురూపమై మణికర్ణికగా మొలిచింది.    బ్రిటీషు వారికి సింహస్వప్నమై భీకరపోరుకు పిలిచింది.  చరణం...1.కాశీలోన పుట్టి, కమ్మని ఝాన్సీ మెట్టి,    మహారాణిగా మమతలు పంచుచు, తన ప్రజకెప్పుడు తానై నిలచెను.॥మహిళాశక్తికి॥.2. కర్రసాముతో కత్తిసాముతో, ఘనమౌగుర్రపుస్వారీతో,విచ్చుకత్తులవీరనారిగా.                      ॥మహిళాశక్తికి॥ 3.దత్తతనీకు చెల్లదంటును, ఝూన్సీరాజ్యం వీడిపొమ్మని, డల్హౌసీయే డాబుగ బలుక॥మహిళా శక్తికి॥ 4. వీపునబాలుని కట్టుకొని, కష్టాలన్నీ తట్టుకొని, ఆంగ్లేయులతో పోరాడి, వీరస్వర్గమున వెలిగింది.

No comments:

Post a Comment