౧. లేవు బాబయ్య యిక మాకు లేవు నీవు
కాను పించియు కనుమరు గ య్యె మాకు
చూడ నిన్నిక బామ్మను జూచి నట్లు
భ్రాంతి కలిగించు మాకయ ! మరువ లేము
౨. ఉన్న దిక్కుల రెంటను నొకటి పోయె
నియమ నిష్టల పాలన నేర్పి తీవు
మాకు నెవరయ్య దిక్కిక మాకు నిలను
వీడి యేగుట మమ్ముల పాడి యగునె ?
౩. అన్న దమ్ముల మూవురి కాప్తు డీవ
చదువు సంధ్యలు వారికి సాగ గాను
పంపి నావట సొమ్ములు బామ్మ చెప్పె
అందు కొనుమయ్య ! జోహార్ల నందు కొనుము .
౪. కోప మధికంబు శాంతము కొంచె మరయ
నీవు వచ్చిన మేమును నిజము గాను
భయము నొందుచు పరుగెడి వార మపుడు
భయము లేదయ్య,యిక మాకు భయము లేదు .
౫. చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
తిరిగి జన్మలు లేకుండ తిరము గాను
స్వర్గ మందున నుంచియు శంకరుండు
నీదు నాత్మకు శాంతిని నిచ్చు గాక !
ఇట్లు ,
అశ్రు నయనాలతో
సుబ్బారావు
No comments:
Post a Comment