- హరిని తలంపకుండ మనమర్పణ జేయుక దైవసన్నిధిన్
తరుణుల జూచి మోహపడి తన్మయమొందుచు ప్రేమపేరుతో
నిరతము చూపునిల్పుచును నెచ్చెలు లందున నందమౌ మనో
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!
హరిని పరాత్పరున్ విడచి యన్యుల సేవల నుండవచ్చునే
నరులకు దేవదానవగణంబుల కైనను దారిదప్పి స్త్రీ
పరముగ బుధ్ధి నుంచి సుఖవాంఛల దోగుచు నిత్యమున్ మనో
హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!
No comments:
Post a Comment