Thursday, July 31, 2014

మాన మభి మానములు రెండు మంట గలిపె

గొప్ప యింటిన బుట్టిన పప్పు రాధ
దొంగ తనములు సేయుచు దొరికి పోయి
మాన మభి మానములు రెండు మంట గలిపె
నెందు లకటుల జేసెనో నీశుడెరుక

Wednesday, July 30, 2014

పెండ్లి కళ వచ్చె నట కదా పీనుగునకు

మంగ కొమరిత కప్పుడే మంగ ళ మగు
పెండ్లి కళ వచ్చె నట కదా, పీనుగునకు
పెండ్లి కళ వచ్చె ననుచును బేర టాం డ్రు
పంచి పెట్టిరి పుర్రెలు బంధు వులకు

ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్

వరముల నిచ్చెడు శంకరు
నవిరళ ముగ బూజ జేయ నంచిత భక్తిన్
కరమున్దయ గల యా శే
ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్

పద్య రచన -మునగ కాయలు

ఆకు పచ్చని రంగున నలరు చుండి
మునగ కాయలు జూడగ మోద మలరె
కూర ,సాంబారు జేయుట కుపక రించి
మంచి శక్తిని గలిగించు మానవులకు

పద్య రచన-పెరుగు అన్నము

కాన బడుచుండె నచ్చట కాంత !చూడు
పెరుగు కలిపిన యన్నము ,పిలువ బడును
వరల దధ్యో జనంబని ,కరము రుచిని
గలుగ జేయును జిహ్వకు ,కడుపు నింపు

Monday, July 28, 2014

పద్య రచన -ఇంద్ర ధనుస్సు

వాన వెలిసిన పిమ్మట వాలు గాను
నాకసంబున గనబడు నద్భుత ముగ
నేడు రంగుల కలయిక నింద్ర ధనుసు
దాని యందము వర్ణించ దరము గాదు

గోపాలుడు మెచ్చునయ్య !కొంగ జపమ్మున్

గోపకులు వెన్న దింపిన
గోపాలుడు మెచ్చునయ్య, !కొంగ జపమ్ము
న్జేపల బట్టుట కొఱకై
నోపికగా జేయుచుండు నొంటి ప  దముపైన్

కొక్కొరోకో కొక్కొరొ యని కోకిల కూసెన్

కుక్కుటము కూయు నిట్లుగ
కొక్కొరోకో కొక్కొరొ యని, కోకిల కూసెన్
చక్కని గొంతుక తోడన
కుక్కుటమున్వ లెను గాక కూకూ యనుచున్

వీపు జూపు వాడు వీర వరుడు

చేత కాని చవట జేజమ్మ తమ్ముడు
వీపు జూపు వాడు, వీర వరుడు
యుద్ధ రంగ మందు యోధు గ  ణములను
చీ ల్చి చెండు నతడు శీ ఘ్రముగను

వానలు రైతులకు దుఃఖ భాజనము లగున్

ఆనందము గలిగించును
వానలు రైతులకు, దుఃఖ భాజనము లగున్
వానలు గురవని యెడ లను
పానమునకు నీరు లేక ప్రజలందరు నున్

Sunday, July 27, 2014

పద్య రచన -నమస్కారము

బ్లాగు కవులకు నేనుగా భక్తి తోడ
వంద నంబులు సేతును వంద లాది
అందు కొనినాకు మన సార , యాశిసులను
నీయ గోరుదు మిమ్ముల నిప్పు డార్య !

కుపతిని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

కుపితుడు జూదరి యైనను
కుపతినిగని  మెచ్చె సాధ్వి, కోర్కులు మించన్
జపములు తపములు సేయుచు
నపమార్గము దొక్క కుండ హాయిగ నుండెన్

ఆంద్ర భోజుని పట్టాభి షేకము

రాజ్య పాలన యందున రాణ యతడు
కవన మందున మేటైన కవి యు కూడ
 పట్ట మభిషేక సమయాన భరణి !దెలుపు
 కృష్ణ దేవ రాయల వారికి నతులని యు


పద్య రచన -తుపాకులు

నక్సలైట్లను దునుమాడి నగర జనులు
తెచ్చి పెట్టిరి గన్నులు దెలివి గాను
చిత్ర మందున్న వాటిని శేషు !చూసి
లెక్క పెట్టుమ యొకసారి యన్ని యూను

కాశి కేగిన వానికి కలుగు మిత్తి

ముక్తి నిచ్చును శంభుడు మోద మలర
కాశి కేగిన వానికి కలుగు మిత్తి
ప్రాణ వాయువు మననుండి బయట బడగ
పుట్టు మనుజుడు తప్పక గిట్టు సుమ్ము

వార కాంత మీది వలపు మేలు

పెట్టు కొనకు నెపుడు ప్రియమైన సోదర !
వార కాంత మీది వలపు ,మేలు
నీదు భార్య పైన నిజమైన ప్రేమను
కలిగి యుంట , సుఖము కలుగు నపుడు

Saturday, July 26, 2014

బొమ్మా ! నీకింతసిగ్గు పోలదు సుమ్మా !

ఇమ్మా నాకొక ముద్దును
బొమ్మా ! నీకింతసిగ్గు  పోలదు సుమ్మా !
కొమ్మా !నాయా శీ సులు
నెమ్మనమున నిచ్చు చుంటి నిజముగ నీ కున్

పద్య రచన _శ్రీకృష్ణునకు పూలహారము

దండ వేయగ బాపడు దరికి రాగ
శత్రు మూకల జెండాడు శక్తు డయ్యు
వంగి వేయించు కొనుటకు మంగ పతియు
సిద్ధ పడుచుండె  జూడుము సీత !యచట

Friday, July 25, 2014

కామ క్రోధములు దెలియగా సద్గుణముల్

బాములనే గలిగించును
కామ క్రోధములు, దెలియగా సద్గుణముల్
రాముని నిత్యము గొలుచుట
ప్రేమను మఱి పంచి యిడుట పది మందికియున్

పద్య రచన -న్యాయ దేవత

న్యాయ దేవత మఱి నాయము బలుకక
కళ్ళు మూసికొనియె కాంత జూడు
కాల మహిమ యదియ కలికాలము గద !
కల్ల లాడు వారు కొల్ల లిలను

కల్లు ద్రాగు మనెను గాంధి జనుల

కల్లు ద్రాగు మనెను గాంధి జనులనట 
యె వరు ద్రాగు మనిరి యెందు కనిరి ?
కల్లు నేర ముగద !కల్లునకు బదులు
చల్ల ద్రాగు డార్య !చల్ల గుండు

Thursday, July 24, 2014

పూవులో రెండు పూవులు పూచె గనుడు

తీయ నైనట్టి చిక్కని తేనె యుండు
పూవులో, రెండు పూవులు పూచె గనుడు
పెరటి యందున్న యాగులాబి మృదు  వుగను
ముద్దు ముద్దుగ నుండెను పూలు జూడ

పద్య రచన -భారత దేశము ఆకారములో వృక్షము

భారత దేశము జూడుము
తారామణి గీచె దాని దారువు వోలెన్
ఆరని పచ్చని రంగున
తోరము వలె చుట్టు తిరుగు దృశ్యము దోచెన్

పుట్టిన వాడెవడు గిట్ట బోడీ ధరపై

పుట్టుట గిట్టుట కొఱకే
పుట్టిన వాడెవడు గిట్ట బోడీ ధరపై
నిట్టుగ జెప్పుట చెల్లదు
గిట్టును మఱి తప్ప కుండ కేశవు డైనన్

పద్య రచన -కాఫీ గ్లాసులు 6

వరుస పేర్చిరి గ్లాసులు కాఫి తోడ
రుచిని గలిగించు మఱియును శుచిగ నుండు
లెక్క కారుగా గల వార్య !నొక్క కప్పు
ద్రాగి జూడుము తెలియును దాని రుచులు


వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన

ఆంద్ర రాష్ట్రము రెండుగా నగుట ననెడు
వరము వైషమ్యముల దెచ్చె ప్రజల లోన
రెండు ప్రాంతాల వారలు మెండు గాను
పెంచు కొనిరి విద్వేషముల్ నంచితముగ

చవట కదా నిన్ను దలప శంకర పత్నీ !

శివునిం ధర దూరు నతడు
చవట కదా ,నిన్ను దలప శంకర పత్నీ !
యవిరళ సంపద లిత్తువు
సవినయముగ జెప్పు చుంటి సరియగు మాటన్


పద్య రచన -పార్వతి -శివ పూజ

చిత్ర మందున పార్వతి చిత్రముగను
మౌని కన్యక వోలెను గాని పించి
పూల సజ్జను జేబూని పోవు చుండె
పూజ జేయంగ శివునకు బూల తోడ

Wednesday, July 23, 2014

పద్య రచన -రావణుడు సీత ను అపహరించుట

సాధ్వి యొద్దకు వచ్చెను సాధు వొకడు
పేర రావణుం డా తడు భిక్ష మిషన
ముదిత సీతను మాటల మోస గించి
యపహరించగ సమకట్టె నదును జూచి

రావణుడా సీత మగడు రక్షించు మిమున్

వావియు వరుసల శూ న్యుడు
రావణుడా, సీత మగడు రక్షించు మిమున్
వేవిధములగాను నెపుడు
నావిభునే సేవించు నెడల ననవర తంబున్


పద్య రచన -బోనాల పండుగ

బోనాల పండు గియ్యది
తానాలను జేసి రండు దవ్వున గల యా
కోనేరు యొద్ద మాత కు
బోనాలను బెట్టి మనము భుజి యించెదమున్

వేయి కనుల వాడు వినత కొడుకు

 వేయి కనుల వాడు ,వినత కొడుకు యును
బాహు బలము చేత బరగు వారు
వారి నెవరు కూడ వారించ జాలక
పారి పోయిరకట వార్ధి గురిచి

Tuesday, July 22, 2014

తార తనయుడై పుట్టె సుధా కరుండు

తార తనయుడై పుట్టె సుధా కరుండు
తార తనయుడు కాదార్య !తప్పు తప్పు
తారకు ప్రియుడు మఱి యీ సు  ధాకరుండు
నిజము బలికితి నమ్ముడు నిజము గాను

పద్య రచన -అమ్మ -కూతురు

 తల్లి వెనుకన నిలబడి తనయ యచట
తల్లి    వ్రాసెడి యక్షర తతుల నిరతి
దాను నేర్చు కోవలెనను దహదహతన
చూచు చుండెను జూడుమా సూర్య !నీవు

పద్య రచన -రైతు

చేను మధ్యన కూర్చుండి చిన్న రైతు
ఆకసమువంక జూచెను నాశ తోడ
వాన పడునేమొ ,మనకింక వంత లేదు
పంట పండును బాగుగ భవుని దయను

మీసములే సొబగు గూర్చు మెలతల కెల్లన్

రోసము గలిగిన వానికి
మీసములే సొబగు గూర్చు, మెలతల కెల్లన్
కాసుల పేరుల మీదన
నాసలు మఱి యుండవచ్చు ననుకొను చుంటిన్

Monday, July 21, 2014

శర్మ గారి గృహాప్రవేశ ము సందర్భముగా శుభాకాంక్షలు

స్వంత యింటి కలను సాకార మొనరించు
నోయి శర్మ !నీకు నొసగు నీశు
డెపుడు సుఖము ,శాంతి ,యిష్టముల నిలను
జీవి తమును గడుపు సేమ మలర

వేద మంత్రాలు సదువంగ విబుధ వరులు
పూజ్య గోమాత వెనుకన పొమ్ముసామి !
నీవు కొన్నట్టి యింటికి నెమ్మనమున
శుభము లగుగాత !నిరతము భవుని దయను


కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.
 
ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
శర్మ కీర్తన నుమలను సంతసమున .

(రచన ==పోచిరాజు సుబ్బారావు )

పద్య రచన -కాకి

కాకి రంగు జూడ కాఱు న లుపెయైన
దాని మేలు నరయ దండి గుండు
శ్రాధ్ధ పిండ ముదిని స్వర్గ ము నకునం పు
పితృ దేవ తలను బ్రియము తోడ

తత్త్వ దర్శి చెప్పు దప్పు లెల్ల

కాచి వడగ జేయు కాలము నంతయు
తత్త్వ దర్శి, చెప్పు దప్పు లెల్ల
చేతకాని యొజ్జ శిష్య గణములకు
నొప్పు జెప్ప మేలు నె ప్పటికిని

Friday, July 18, 2014

నెల్లూరు పయనము

పచ్చని చెట్లను జూడ గ
నచ్చముగా నీలి రంగు హత్తెడి విధమున్
పచ్చగ నందము నింపెను
నిచ్చోటన జూడు డార్య!యీ దృశ్య మునున్

అత్త  మామల జూడుమా చిత్ర మందు
చూచుచున్నారు మనలను సూటి గా ను
దీన ముఖముల వోలెనుగాని పించె
గార  ణం బును నర యుమా నార సింహ !

గూటి లోపల కూర్చుండె గుంఫనముగ
విఘ్న ముల కధిపతియగు విశ్వవిభుడు
ఏక దంతుడు వరముల నిచ్చు నతడు
బరగు విఘ్నే శ్వరుడనగ వసుధ యందు

ఇంటి చుట్టును గలవార్య !కంటికింపు
గాను జామచెట్లు మరియు కాపు తోడ
మామి డరటి యు నుసపో ట మధుర ములగు
రుచిని గలిగించు ఫలములు రుక్మి !గలవు

ఆలయముల దర్శనము .....

చూఛి తి నయ్యప్పను నట
చూచితి నే రంగనాధు జూచితి శివునిన్
చూచితి కామాక్షమ్మను
చూచితి నిక సత్య సాయి జూచితి హనుమన్

చూచితి నారసింహుని
జూచితి నట జొన్నవాడ సుక్షేత్ర మునున్
జూచితిని చెంచు లక్ష్మిని
జూచితి మరి శారదాంబ సునయన మాతన్

అమ్మ !రాజ రా జేశ్వరి ! యందు కొనుము
మనసు నిండార మాయవి వినతు లిపుడు
భోజనంబున నిడుదును బూర్లునీకు
కడుపు నిండుగ దినుమఱి కనక దుర్గ !

పోయితిని జొన్నవాడకు
పోయితినే నారసింహు పుణ్య స్థలికిన్
పోయితి పెంచెలు కోనకు
పోయితి నిక ను వరికొండ ముక్తిని గోరన్

పయనమంతయు సాగెను బ్రమద మలర
అన్ని చోట్లకు సులువుగ నాది దేవు
నిదయ గలుగంగ మాపైన నియతి గాను
వంద నంబులు మఱి యా శు భం కరునకు

Thursday, July 17, 2014

శ్రీ శంకరయ్య గారి పుట్టినరోజు

పుట్టితి వట  యీ రోజున
పుట్టిన శ్రీ శంకరుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను  దిరుగు చుండి నలుగురి లోనన్ 

Saturday, July 5, 2014

పద్య రచన -కనక దుర్గ

అమ్మ !దుర్గమ్మ!వందన మమ్మ !నీకు
చేతు లారంగ బూజింతు జెలువ మీర
మమ్ము గాపాడు నిరతము నెమ్మనమున
కరుణ యుంచుము మాయందు కనక దుర్గ !Friday, July 4, 2014

మంచి విద్యల నేర్చుట మాన వలెను

దేశ ప్రగతికి నత్యంత వాసి తనము
మంచి విద్యల నేర్చుట, మాన వలెను
పరుల దూషణ మఱియును పరుల సొత్తు
నపహ రించుట యనునది యనవరతము

పద్య రచన -చార్మినారు

చుట్టు బ్రక్కల పావురాల్జుట్టు దిరుగ
తీర్ధ యాత్రగ వచ్చిన దెరువ రులిట
యూసు లాడుచు సరదాగ బాసలాడ
కోటి యందాల కాంతుల మేటి గాను
చారు మీనారు గన్బడె జారు తోడ

Thursday, July 3, 2014

గర్భము లో నుండి వెడలె గమలాప్తు డొగిన్

నిర్భయముగ దండ్రి గురిచి
యర్భకు ప్రహ్లాదు దపుడ యర్చన జేయ
న్నార్భాట మునన్ స్తంభపు
గర్భము లో నుండి వెడలె గమలాప్తు డొగిన్

పద్య రచన -వీధి నాటకములు

పూర్వ మందున నాటక ములు విరివిగ
వేయు చుండెడి వారలు వీధి నాట
కములు తదుపరి వచ్చెను కమల !వినుము
చలన చిత్రము లేయిక జాలి నన్ని

సవతి లేని యింట సౌఖ్య మేది ?

సుఖము శాంతి గలుగు సుజనులార!మనకు
సవతి లేని యింట సౌఖ్య మేది ?
సంపద లవి  యుండి సరియగు నారోగ్య
వంతు డుమఱి  కాని వాని కిలను

Tuesday, July 1, 2014

పద్య రచన -చిత్ర కారుడు

చిత్ర కారుడు గీ చెను జిత్రము లట
కుంచె తోడన జక్కగ కువలయాక్షి !
పోయి చూడుము నీవును బొమ్మ లన్ని
యొకటి మించిన దొకటిగా నుండె మిగుల

కొట్టు కొనిపోయె గాలికి గొండ లెల్ల

మోడి  రాకతో ప్రజలకు  వేడి యెక్కి
సంత సంబులు మది నిండ  సంతరించి
యోటు వేయుట మూలాన రాట దేల
కొట్టు కొనిపోయె  గాలికి గొండ లెల్ల

చోరుని బూ జించువారె శుద్ధాత్ము లిలన్

వీ రడు కొట్టెను బలముగ
చోరుని, బూ జించువారె శుద్ధాత్ము లిల
న్నారని జోతుల రూపుని
నారవినే భక్తి తోడ ననుదిన మందున్