Saturday, February 27, 2021

ఆద్యంతంబులు లేనిగాధ వినబ్రహ్మానంద మబ్బున్ గదా

 ఆద్యంతంబులు లేనిగాధ వినబ్రహ్మానంద మబ్బున్ గదా

యాద్యంతంబులు లేనివానిపలుకే,యాశ్చర్యమున్ బోకుమా

యాద్యంతంబులు గల్గుగాధ వినబ్రహ్మానంద మబ్బున్ గదా

యాద్యంతంబులు లేని వస్తువులిలన్ హాచూచితేమీరెటన్


నాద్యంతరహిత కధవిన నానందమగున్

మద్యము ద్రాగిన నతడనె
నాద్యంతరహిత కధవిన నానందమగున్
నాద్యంతరహిత మీయదు
నాద్యంత సహిత కధవిన నానందమగున్

Friday, February 26, 2021

పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్

 పరులన్ దూషణ జేయుచున్ నొగిని పాపాలన్ దగన్జేయు,కా

పురుషాధిక్యము తీవ్రశాపమగుచున్ బోగొట్టు సౌభాగ్యమున్

గరమున్ జేయుచు గర్మలన్ దనరగా గాఢంపుగా,గాక,దా

సరసంబౌవిధమొప్పగా బలుక శాస్త్రార్ధంబులింపౌగదా

పురుషాధిక్యమె సిరుల బోగొట్టుగదా

 గరువము నొందక విను,కా

పురుషాధిక్యమె సిరుల బోగొట్టుగదా

యెఱుగుము తక్కువ బలుకుచు

నరయంగా జేయదగును నధికపు పనులన్

అరులకునెల్లనెత్తిపొడుపౌవచనమ్ములుశ్రావ్యముల్గదా

పరులను నిందజేయుటను బాపముగానెదలంచువారికిన్ దరతమభేదముల్గనక ధార్మికదృష్టిని సాయమెంతయో
యొరవడి దిద్దునట్లుగను నొవ్వనివానికిబాటుగా వెసన్
నరులకునెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్గదా

Thursday, February 25, 2021

నెత్తిపొడుపుమాటలే రుచించు రిపులకున్

బత్తిన రత్తయ పలికెను
నెత్తిపొడుపుమాటలే రుచించు రిపులకున్
మత్తును వదలిన పిమ్మట
మెత్తగ మాట్లాడె,రిపులుమెచ్చువిధముగా

ముదిమినిగన్నెపిల్లలకు ముద్దిడగందలపోయు టొప్పగున్

అదనునుజుచి యీయుటను నచ్చెరువందగ వారలయ్యెడన్
ముదిమినిగన్నెపిల్లలకు ముద్దిడగందలపోయు టొప్పగున్
మదినిగలుంగు నట్లుగను మానముసిగ్గులే యొక్కమారుగా
సదమలదృష్టిగల్గుటకు చక్కని బుద్ధినిగోరుడీశునిన్

Wednesday, February 24, 2021

ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడదగు

ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడదగు
దప్పులేదని భావింతు నొప్పెయగును
ముదిమివయసున వారలు,మునిమనుమలు
ముద్దులీయగ నర్హులుముదము జెంది

భూమితనూజకున్ సవతిపోరు ఘటిల్లెగదా యయోధ్యలోన్

ఏమని జెప్పనొప్పుదును నీర్ష్యను నొందిన కైకయేకుపిన్
రాముని పంపుమా వనికి రాజునుజేయుము నాదుసూనునిన్
దామగనిన్ వరంబుగను దక్షణమిమ్మని పల్కనంతటన్
భూమితనూజకున్ సవతిపోరు ఘటిల్లెగదా యయోధ్యలోన్

 

Tuesday, February 23, 2021

జానకికి ఘటిల్లెనుగదా సవతిపోరు

 సోమునిదనయ యగునా సుగుణశీలి

జానకికి ఘటిల్లెనుగదా సవతిపోరు

తనకు పిల్లలు గలుగని దపన వలన

బెండ్లియాడెను లక్ష్శిని వెంకటేశు

హలములుమూలబెట్టిరటహాలికులెక్కువ పంటదీయగన్

సులువగు యంత్రముల్ గనుటచొప్పును జూచెను గారణంబుగా
హలములుమూలబెట్టిరటహాలికులెక్కువ పంటదీయగన్
బలువిధయంత్రరాజములు బారులుదీరిచియుండె యంగడిన్
హలములు మానిసేద్యమును హాలికులిప్పుడు జేయువీటితోన్

హలమువిడువబంటలధికమగును

నుయంత్ర యుగము గాన వ్యవసాయము నకును


రైతు లంద రిపుడు హలము మాన
పాతపరికర మన బడునట్టి యాపాత
హలము విడువ బంట లధికమగును

Saturday, February 20, 2021

మానక మాతృభాష నవమాన మొనర్చెడివాడె,మాన్యుడౌ

 హీనపు వానిగా మసలి హేయపు జీవిత మొందనౌనుగా

మానక మాతృభాష నవమాన మొనర్చెడివాడె,మాన్యుడౌ

మానవు డెల్లవేళలను మంచిగ నుండుచు బీదసాదకున్

దానయి పెద్దదిక్కుగను ధార్మికదృష్టిని సాయమిచ్చుచో

మాతృభాషావమానమ్ము,మాన్యతనిడు

 దండనార్హుని జేయును దప్పకుండ

మాతృభాషావమానమ్ము,మాన్యతనిడు

మాతృభాషను బ్రేమించు మానవునకు

మధుర మైనదిగద మన మాతృభాష

వద్దనుకొన్నవే మరలవచ్చెనటంచు ముదంబునొందితిన్

పెద్దగ సుద్దులన్ బలుక భీతినినొందుట కారణంబుగా
దద్దయు పండీతోత్తముల ధార్మికసూక్తుల నొల్లలేకనే
వద్దనుకొన్నవే మరలవచ్చెనటంచు ముదంబునొందితిన్
వద్దనుకొన్న మానవవి వచ్చుచు నుండును జోద్యమొందగన్

Friday, February 19, 2021

వద్దనికోరినవె మరలవచ్చె మురిసితిన్

 పెద్దగ జదువులు నేర్వమి

పద్దెములన్ వ్రాయరాక పండితసభలన్

దద్దయు బిడియము నొందగ

వద్దనికోరినవె మరలవచ్చె మురిసితిన్

చిరంజీవి టి.బి.యస్ శర్మ పదవీవిరమణ సందర్భపు శుభాకాంక్షలు.
0------------0--------------------0

తోపెల్ల వంశమండన!
నా పాలిట శక్తి నీవు నమ్ముము నిజముం 
బాపలు పెద్దలు వృద్ధులు
నీ పలుకులు నేర్చు కొనిరి నిష్ఠను జుమ్మీ

పదవిఁ దగ విరమించుట వరము మనకు
నలసి పోయిన మనసున కాట విడుపు
రామ నామము జపియించు రమ్యముగను
మోక్ష మిచ్చును దప్పక మోద మలర

అంచె లంచెలుగ నెదిగి యైతి వీవు
పాల నాధికారిగ,నిఁకఁ బదవి నుండి
తొలఁగు చున్నట్టి సమయానఁ దోరముగను  
నిచ్చు చుంటిని యాశీసు లివిగొ గొనుము

సకల శుభములు గలిగించు శంకరుఁడు వ
రాయు రారోగ్య సంపద లన్నియిచ్చి
కంటికిని ఱెప్ప యట్లయి కాచుగాత!
యీశు పుత్రుని దాక్షిణ్య మినుమడింప

రచన::పోచిరాజు సుబ్బారావు
రిటైర్డు తెలుగు పండితుడు
హైదరాబాదు:::9866283384

వాలముశాత్రవాళికరవాలము చాలము దానిమెచ్చగన్

ఆలము జేయజాలకును నాహనుమంతునిదోకజుట్ట యా
వాలముశాత్రవాళికరవాలము చాలము దానిమెచ్చగన్
వాలము తోడనే హనుమ బాధిలజేయుచురాక్షసాళినిన్
లీలగసంహరించి యవలీలగగాంచెను మాతసీతనున్

Thursday, February 18, 2021

వాలము శాత్రవులకు గరవాలంబయ్యెన్

ఆలంకా వాసులు గని
వాలమున్జుట్ట,నంతవారికి సరగున్
నాలము నందున నాతని
వాలము శాత్రవులకు గరవాలంబయ్యెన్

రాముడుదెల్గువాడనుచు వ్రాసిరి విఙ్ఞులు వంగభాషలో

నీమముతోడ రాష్ట్రమునునిచ్చలుమోదము గోరుపొట్టిశ్రీ
రాముడుదెల్గువాడనుచు వ్రాసిరి విఙ్ఞులు వంగభాషలో
నామరణంబునాతడుపహారముమానుచు నేకదీక్షతో
నేమరుపాటునున్గనక యైక్యతనొందగ జేసె రాష్ట్రమున్

Wednesday, February 17, 2021

రాముడాంధ్రుడనిరి ప్రముఖబుధులు

భద్రగిరియె తనకు వాసము కనుకన
రాముడాంధ్రుడనిరి ప్రముఖ బుధులు
కానియిపుడు భద్ర నగముక లదుతెలం
గాణమందు నార్య! గణుతి జెందె

బొగడినవారి ప్రాణముల బోరనదీయుటె నీతికార్యమౌ

 పొగరదిలేక వైరులకు బూర్తిగలొంగుచువారలన్గడున్

బొగడినవారి ప్రాణముల బోరనదీయుటె నీతికార్యమౌ

పగతురశిక్షజేయుట ను వద్దనిచెప్పరె,యెవ్వరెప్పుడున్

బొగడత మానుటొప్పగను బుద్ధిగసత్యము జెప్పనేరుమా

Tuesday, February 16, 2021

బొగడినట్టి వారలను జంపుటయెనీతి

 స్వీయ పక్షము వాడయి విమతబలము

బొగడినట్టి వారలను జంపుటయెనీతి

శత్రు బలమును బొగడిన నేరినైన

విడువకూడదు చంపుడు వెంటదగిలి

పరమేశా!


ధరణిన్ గొలుతును నిన్ను దాపసి వర్యా! 

స్ధిరమౌ కలిమిని నిమ్ము చేతన రూపా! 

వరదా! శుభకర! నందివాహన! శంభూ!  

పురశాసనుఁడ! మహేశ! భో పరమేశా!


భువనంబునకు గిరీశ! పూజ్యుఁడ వీవే 

భవ బంధములను బాపి పారము నిమ్మా 

భవహారి శివ! మహేశ! పాపవిదూరా! 

శివ మౌను నిను నుతింప శ్రీ పరమేశా!


శివరాత్రి దినము నందుఁ జేయుదు నింకన్ 

భవ పూజలను మహేశ! భక్తిని నింపౌ 

శివముల్ విరివిగ నీయ సేమము గల్గున్ 

శివ! భార్గవి పతిదేవ! శ్రీ పరమేశా!


కనులార నిను సతీశ! కాంచఁగ నిమ్మా 

వినఁగన్ నుడులను మంచి వీనుల నిమ్మా

మనమున్ వెతలకు దూర ముంచుమ ప్రీతిన్ 

విని నా మొఱలను గావు వే పరమేశా! 


గతి కానక యిట నుంటిఁ గావుమ శర్వా!  

మతియున్ గడచెను నేమి మాటలు రావే!

మతినిన్ గతిని నొసంగు మాటను నిమ్మా  

సతమున్ గొలుతును ని న్బసం  బరమేశా!

అన్నమునుగోరడయ్యె క్షుధార్తుడొకడు

 పంచభక్ష్యములన్నియు బంచనుండ

నన్నమునుగోరడయ్యె క్షుధార్తుడొకడు

విసుగు వచ్చెనుగాబోలు వీసమంత

చూచినంతనేయన్నమ్ముక్షుధలువోయి

 మిన్నగు వంటకంబులవి మెండుగనుండగ సంతసంబునన్

నన్నము వద్దువద్దనె క్షుధార్తుడు రోయుచునన్నదాతతోన్

నన్నముజూడగా దనకుహర్షిత!గబ్బుగ గానిపించెనౌ

చిన్నగనన్నదాతకును జెప్పెనురోయుచువద్దువద్దనిన్

Monday, February 15, 2021

యహమదుఖానుడిష్టపడియాచమనంబొనరించె నిష్ఠతో

 అహమునులేనివాడునునయాచితభక్తిని గూడువాడుటౌ

యహమదుఖానుడిష్టపడియాచమనంబొనరించె నిష్ఠతో

తహతహలాడుచుండెనటదానునుసంధ్యనువార్చుసైతమున్

నహమహమున్ ముదంబుననె,యర్చనజేయగసిద్ధమాయెనే

Sunday, February 14, 2021

నహమ్మదుఖానుడొనరించె నాచమనంబున్

 మహినిగలమతము లన్నియు

నహమికతోజెప్పనిజమునన్నియు నొకటై

యహముందొలగుటకతమున

నహమ్మదుఖానుడొనరించె నాచమనంబున్

లోకోత్క్రుష్టసమస్తసంపదలుగల్గున్ బిచ్చమెత్తంగనే

 నాకేమీబిడియంబులేదుశివునిన్ ,నాకాధిపుండావృషిన్

రాకాచంద్రుని,సత్యదేవునినికన్ రామాంజనేయున్ దగన్

నేకాంతంబున శ్రద్ధతోడనుబ్రభున్ నింపొందసేవించుచో

లోకోత్క్రుష్టసమస్తసంపదలుగల్గున్ బిచ్చమెత్తంగనే

విభవములుపెక్కుదక్కునుబిచ్చమెత్త

వండుకొనునట్టి యామెకు నొక్కకూర
పాతివ్రత్యంబు గలయట్టిభామకునొక
మగడె,యోలక్ష్మి!యిటులనె ఱుగుము నిజము
విభవములుపెక్కు దక్కును బిచ్చమెత్త

Friday, February 12, 2021

వాసము,వాసనాదులకువాసనల్దొలగించిభాసిలున్

 వాసిగ యఙ్ఞయాగములు బాగుగజేసిననైన ముందుగా

గాసిలజేయునామదము గట్టడిజేయుచు గ్రోధమున్ వలెన్

నీసును బాఱద్రోలుచునునీశునిబాదము లాశ్రయించునౌ

వాసము,వాసనాదులకువాసనల్దొలగించిభాసిలున్

వాసము,వాసనల నడచి భాసిలునెపుడున్

 ఈసును గ్రోధము మదముల

వాసన దరిచేరకుండ భద్రతనుండన్

వాసిగశంకరు పదముల

వాసము,వాసనల నడచి భాసిలునెపుడున్

Thursday, February 11, 2021

నాతి!విశాఖపట్టణముననన్ గనుగొంటినిచార్మినారునున్

నాతి!విశాఖపట్టణముననన్ గనుగొంటినిచార్మినారునున్
గాతరమొందకుండగనుగాంచుమ తప్పకయోలలామరో
తాతలనాటిగోడలవిదానిని హైదరబాదులోదగన్
బ్రీతినిజూడగల్గుదువువేమరు,కాదువిశాఖలోసుమా

నాతి!వైజాగులోచార్మినారుగంటి

నాతి!వైజాగులోచార్మినారుగంటి
నుక్కుఫ్యాక్టరీనమ్మెనునోబులమ్మ
కృష్ణజలరాశి యింకెను నుష్ణమునకు
నిట్టిమాటలుబలుకుటయెటులపాడి?

విద్యవినాశమూలమువివేకమున్దొలగించుశత్రువౌ

 విద్యవిశిష్టమున్దెలిసివెర్రిగ వర్తిలువానికిన్ వెసన్

విద్యవినాశమూలమువివేకమున్దొలగించుశత్రువౌ

విద్యనుగౌరవించునెడవిద్యలనన్నిటగొప్పవానిగా

సద్యశమొందగూర్చునిలసాటికవీంద్రులకంటెమిన్నగాన్

Wednesday, February 10, 2021

విద్య,నాశనకరమువివేకమడచు

సకలసంపదలొనగూర్చు సత్యముగను
విద్య,నాశనకరమువివేకమడచు
నేనునేననుభావముమానవునకు
చేరనీయనుగబ్బునా చెంతకెపుడు

Tuesday, February 9, 2021

వారకవారకాంతలనివాసముజేరుటెశిష్టకృత్యమౌ

 వారలజీవితంబులనుబాగుగజేయుతలంపుగల్గుటన్

వారకవారకాంతలనివాసముజేరుటెశిష్టకృత్యమౌ

వారునునందజేయునెడభాసురమొప్పగసాయమున్దగన్

వారలజీవితంబులికభావితరాలకుమేలుజేయుగా

Monday, February 8, 2021

శిష్టులకువారకాంతలచెలిమి,మేలు

మేలుజరుగదు పుడమికి బాలవినుము
శిష్టులకువారకాంతలచెలిమి,మేలు
చేయునిరతముజపియించ శివునిపేరు
ముక్తినిచ్చునుదప్పక మోదమంది

మగవాడోసతియొచందమామయొరవియో

అగణితశౌర్యపుధాటికి
విగతుడుగానైననతడువిరటునిబావే
పగతీర్చినభీముడరయ
మగవాడోసతియొచందమామయొరవియో

Saturday, February 6, 2021

నింతకుముందుచూచినదెయిప్పుడుచూచుచునుంటివింతగన్

 చింతలపాడునందుగల శేషునిచూచుటకేగగానటన్

నింతకుముందుచూచినదెయిప్పుడుచూచుచునుంటివింతగన్

గొంతయుమార్పులేదచటకోనలుగుట్టలునొక్కరీతిగా

వింతగగానిపించెరమ!బీటలువారినగోడపంక్తితోన్


నింతకుమునుపుగన్నదే యిపుడుగంటి

 రామలింగేశుజూడగ రహినినేగి

భక్తిశ్రద్ధలసేవించి రక్తిజూడ

నింతకుమునుపుగన్నదే యిపుడుగంటి

పాలకొల్లునగలయట్టి పసిడిప్రతిమ

పద్యమువ్రాయబూనుటయెపాపము

హృద్యముగాకభావమునునేరికినర్ధముగానియట్టుగా
పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకొమ్మికన్
పద్యమువ్రాయగావలయుప్రాసయుతంబుగ,లక్షణాలతోన్
చోద్యముగాదెపండితులుసూచనలిచ్చుటనట్లుగానిటన్

Friday, February 5, 2021

పద్యమునువ్రాయబూనుట,పాపమగును

శుభము గలిగించు జగతికి సుకృతిగలుగు
పద్యమునువ్రాయబూనుట,పాపమగును
జీవహింసను జేసిన యెవరునైన
ప్రాణరక్షణజేయగవలయుమనకు

మాలాంకృతుజేసితిట్టిరినిజామాత్యున్ జనుల్ సత్సభన్

వేళంజూడకత్రాగుచుండియుసభావేదికన్ త్వరంజేర,పూ
మాలాంకృతుజేసితిట్టిరినిజామాత్యున్ జనుల్ సత్సభన్
జాలున్ మాటలుపొమ్ముదుష్టుడ!యికన్ సాహాయ్యమీబోకుమా
కాలాతీతముజేయబోకుముసుమాకర్కోటకుండా!యికన్

Thursday, February 4, 2021

మాలవేసిదూషించిరమాత్యుబ్రజలు

 మంత్రియయ్యును నభివృద్ధి మాటమఱచి

బ్రాదిసీసాలద్రవమును ద్రాగుచుండి

పనులుసేయమి కోపానపావకోళ్ళ

మాలవేసిదూషించిరమాత్యుబ్రజలు

జలములనెంతబోసిననుజ్వాలయడుంగదుతగ్గదుష్ణమున్

వలపులఱేనిచర్యలకువాడిగజ్వాలలురేగమేనిపై
జలములనెంతబోసిననుజ్వాలయడుంగదుతగ్గదుష్ణమున్
దెలియుమువీరరాఘవుడ!దిట్టగువారలుసైతమున్ గనన్
లలనలగాంచినంతనెయరాచకవృత్తినిసంచరింతురే

Wednesday, February 3, 2021

జలముబోసిననడగదుజ్వాలసుంత

బంధువర్గముపలికినబలుకులవియ
గ్రుచ్చుకొనియెనుడెందాన చిచ్చువోలె
జలముబోసిన నడగదుజ్వాలసుంత
ప్రియముగల్గెడుమాటలునయముపలుక

స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరెనుగౌరిప్రేముడిన్

స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరెనుగౌరిప్రేముడిన్
కర్ణకఠోరమాయెనిదికానగరానిదిభూతలంబునన్
స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరుట నవ్వులాటయే
వర్ణమువర్ణముల్గలిగిభాసిల భూమిజగోరెలక్ష్మణున్

స్వర్ణమృగముదెమ్మని యుమశంకరుగోరెన్

కర్ణకఠోరమయీయది
స్వర్ణమృగముదెమ్మని యుమశంకరుగోరెన్
పర్ణకుటీరపుభూమిజ
వర్ణంబులుగల హరిణముబట్టగగోరెన్

Tuesday, February 2, 2021

 అన్నువమిన్నరోగనుమయచ్యుతుహారమువెల్గుచుండెనే

ఠితనువుగార్చెరణంబునరక్తధారలన్

మన్నునరామరావణునిమధ్యనజర్గినకారణంబుగా

గ్రన్ననరాక్షసాంగనలగాంతులనందఱియేకధాటిగా

Monday, February 1, 2021

కనులపండుగగూర్చె,రక్తపుఝరులు

శ్రీనివాసునిమెడలోని యాణిపూస
కనులపండుగగూర్చె,రక్తపుఝరులు
యుద్ధభూమినిప్రవహించె నుద్ధృతముగ
రామరావణయుద్ధపు సీమయందు

ఎంతమహాపచారముహరీయనిపిల్తువెవిష్ణువున్గవీ!

ణూ

ఎంతమహాపచారముహరీయనిపిల్తువెవిష్ణువున్గవీ!
యంతగమారిపోతివెయయాచితమాటలుబల్కవేలకో
సంతసమబ్బునట్లుగనుసజ్జనులందఱుమెచ్చునట్లుగా
బొంతనగూడుమాటలనుబొందికగానికనుండమేలగున్

నపచారమెహరిని విష్ణువనుటకవివరా



 

కపియర్ధముగైకొనగను
నపచారమెహరిని విష్ణువనుటకవివరా
యపచాారముగాదుహరిని
నపశబ్దముజూడకునికి యర్ధముసబబే