Saturday, August 31, 2019

గాాాాాడిద


గాడిదకర్ణపేయముగ గానముసేయగమెచ్చిరెల్లరున్
బాడియె యట్లనంగను రమ!పండితులెవ్వరునొప్పుకోరుగా
గాడిదపాటపాడగనుగాయనివోలెనునింపుగుండెనో
గాడిదపాటపాడుటయుకర్ణములింపుగ నుంటయాభళా

కర్ణపేయంబుగాాా


పాడుతా తీయగానందు భానుమతియె
కర్ణపేయమ్ముగాబాడె,గార్దభమ్ము
మోయునెంతటి బరువైన మూపుమీద
వేయ,శ్రమకునమ్మినబంటు పృధివియందు

రేడియో

అఙ్ఞానాంబుధిలోనమున్గిననరుండాలాపమట్లుండెబో
యఙ్ఞానంబువికాసదాయకమ,హోహ్లాదంబుపండించెడిన్
సుఙ్ఞానుల్దమపాండితీగరిమచేసౌగంధిపుష్పంబులే
ప్రఙ్ఞాపాటవమొప్పుసజ్జనుడుదాభాసిల్లునెచ్చోటనన్
----

Friday, August 30, 2019

నరులకొప్పును ప్రకృతివినాాాశనంబు


చీకుచింతలు లేకయే చెలిమినుంట
నరులకొప్పును,ప్రకృతివినాశనంబు
ముప్పుదెచ్చును నరులకుమొదటి కెసుమి
కాన రక్షించ బ్రకృతిని గద్దుమనకు

Thursday, August 29, 2019

ఏనుగుచంపజాాాాాాాలదుగదే


ఏనుగుచంపజాలదుగదే యెలుకన్ గడు విక్రమించినన్
గాననమందునన్మసలు గంజరమెక్కడ కన్నమందునన్
బూనికతోవసించునల మూషికమెక్కడ చింతజేయగన్
గానగరాదుగాబుడమిగాయలుగాచువీధంబుగాగనన్

ఏన్గు చంపనోపదెలుకనైన


దేహబలము గంటెదీటైన బలమును
గాన రామనుచును గర్వపడకు
బుద్ధి బలము ముందు భుజబల మేపాటి
యేన్గు చంపనోప దెలుకనైన

Wednesday, August 28, 2019

కోరికలన్ని


కోరికలన్నిటిన్దునిమి కోవెలయందున భక్తకోటికి
న్బారునగూరుచున్న,వరభక్తుడుగా గణియింత్రుసజ్జనుల్
పారమునందగోరునెడ బావనమైనమనంబు తోడుతన్
జేరువనుండగావలెను శీతనగేంద్రుని సూతుభర్తకున్

కోరికలు వెల్లువిరిసిన


కోరికలు వెల్లువిరిసిన
మీరక తనహద్దునెపుడు మెదలకగుడిలో
దీరుగనట యాభక్తుల
బారునగూర్చున్నవాడె భక్తవరుడగున్

Tuesday, August 27, 2019

నడకువ

నడకువమంచియుండిననున్యాయముబొందగవంగియుండుటన్
విడుచుటె యెగ్గుసిగ్గులను,విఙ్ఞులకున్హితమిచ్చు నిచ్చలు
న్నడకువతోడ బీదలకు నార్ధికసాయము జేయగోరుచో
బడుగులపాలిటయ్యది యపారపుగారవమౌనునేసుమా

ఎగ్గుసిగ్గుల విడుచుటెహితమొసంగు

చీదరించిన గొలదిని సిగ్గుబడక
తనయు నికినిదా మఱచియుతగ్గియుంట
యెగ్గుసిగ్గులువిడుచుటె,హితమొసంగు
నవిరళంబగు దానమ్ము లర్హులకిల

Monday, August 26, 2019

ఎక్కడిమేధపొత్తముల

ఎక్కడిమేధ పొత్తములనెన్నడు జూడనివానికివ్విధిన్
నక్కజమాయెనేనదియ?యాపరమేశ్వరు సేవజేయుచో
జక్కటిమేధగల్గునిల,శాస్త్రములేవియుజూడకుండనే
నిక్కముబల్కుచుంటిమరి నేర్పునమీరలుపూజజేయుడీ

ఎక్కడదీమేథ సుంతయెరుగడు


అక్కట!యేమీ ప్రవచన
మెక్కడదీమేధ? సుంతయెఱుగడు శాస్త్రాల్
నిక్కముగదైవకృపయే
తక్కువగా జూడరాదు తత్త్వంఙ్ఞుండే

Sunday, August 25, 2019

దుర్వినయమ్ముతో


దుర్వినయమ్ముతో మనసుదోచెడువారుహితైషులేకదా
దుర్వినయమ్ముతోనయిన దోచుటయౌటను గారణంబుగా
సర్వుల గౌరవించగను జక్కగనొప్పు హితైషులేయనన్
గర్వవిహీనులై భువినిగాచుచునుందురుమంచివారలే

దుర్వినయమ్ముననుమనసుదోచెదరుహితుల్

సర్వముగోల్పోవుదురుగ
దుర్వినయమ్మునను,మనసుదోచెదరుహితుల్
సర్వఙ్ఞుడవీవనుచును
నుర్వినిదాబొగడుచుండియుత్సుకతలతోన్

Saturday, August 24, 2019

దీపములాాార్పుచో

దీపములార్పుచో గనలిదేవళమందున గల్గునెప్పుడున్
బాపమె,దక్కునెల్లెడలశివస్తుతిజేసిన భక్తకోటికిన్
బాపముబోయికల్గునిల బ్రాపును,పుణ్యము దప్పకుండగన్
నాపరమేశుడేజగతి కంతటికీశుడు చింతజేయగన్

పాపము దక్కుజనులకుశివస్తుతిజేయన్


దీపములార్పుటగుడిలో
పాపము,దక్కుజనులకుశివస్తుతిజేయన్
బాపములుబోయి పుణ్యము
లేపారగవచ్చియార్య!యీశునిగరుణన్

Friday, August 23, 2019

ప్రకృతివినాశనంబె


వికృతపుచేష్టలన్జనినవేయివిధంబులుగానగున్సుమా
ప్రకృతివినాశనంబె,కడుపావనకార్యము మానవాళికిన్
సుకృతంబులేగడుంగడుగసొంపుగజేయుటనెల్లవారికిన్
బ్రకృతియనంగనేర్వుమికపార్వతిదేవిగభూతలంబునన్

వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే

పారముబొందుకోరికనుభవ్యునిగూరిచి దండకంబునున్
వారము వారమున్జదివి వారిజపత్రముతోడశంభుపై
నీరముజల్లగానపుడు నెమ్మదిసంతసమొందనత్తఱిన్
వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే

వారిజపత్రమ్ముసోకి వజ్రముచీలెన్


మారుడు శరములు వేయగ
మారణహోమంబుజేయ మాహేశ్వరుడున్
మారుని జూడగ నత్తఱి
వారిజపత్రమ్ముసోకి వజ్రముచీలెన్

Thursday, August 22, 2019

అభయమునిచ్చిబ్రోచెడి



ఉభయులురామలక్ష్శణులుపోరునభీతిని గొల్పువారయున్
నభయమునిచ్చిబ్రోచెడిమహాత్ములు,రావణకుంభకర్ణులే
యిభమునుబోలిగర్వముననీశుడురాముని ధిక్కరించగా
నభయమునిచ్చురాముడనినంతముజేసెనునొక్కవేటునన్





















అభయమొసగిబ్రోచును రాాాాావణాాాాాసురుండు


కష్టమందున వేడగ కాలుడార్య!
యభయ మొసగిబ్రోచును,రావణాసురుండు
నసురుడైనను,శైవుడునమితభక్తి
నిగొలుచుదినముదినమునునియమముగను

Wednesday, August 21, 2019

కాాాలము


ఫాలపునేత్రునిన్గొలిచి పాయసమాదిగ బిండివంటల
న్జాలముజేయకన్నిడగ భాలశశాంకుడుమోదమందిదా
కాలముదాటిపోయినను గాంచనమాదిగ సంపదల్వెస
న్గాలము మించిపోయిననుగాంచునుమందుడుసత్ఫలమ్ములన్

ఆలయములు

ఆలయములు మూయుదురయ
కాలాతీతమున,గలుగుగదసత్ఫలముల్
ఫాలునిదలచుచు భక్తిని
బాలన్నైవేద్యమిడగబ్రాతఃసంధ్యల్

Tuesday, August 20, 2019

సకలకళలకు


సకలకళలకు నిరవుగా ఛాత్రులకది
వెలుగుచుండగ దెలిసియుదెలియ కిటుల
మిత్తికిన్ముఖద్వారమమీరుపేట
యనుట పాడియే గురువర!మననజేయ

అంఘ్రిద్వంద్వము

అంఘ్రి ద్వంద్వములేకయుండిన సహాయంబౌట దివ్యాాంఘ్రమే
యంఘ్రిద్వంద్వములేని భామ వెసనాట్యంబాడెజిత్రమ్ముగన్
నంఘ్రిన్బుట్టిన గంగకూడను మహాహర్షంపు వేగంబుతో
నంఘ్రుల్దాటుచు బర్వులెత్తును గదాయాాాాాానందముప్పొంగగన్

Monday, August 19, 2019

అంఘ్రిద్వంద్వంబు


అంఘ్రిద్వంద్వము లేకను
నంఘ్రిద్వంద్వంబునునుచ,నసలుకుసరిది
వ్యాంఘ్రముదాగలుగుకతన
నంఘ్రిద్వంద్వంబులేని యాడదియాడెన్

Sunday, August 18, 2019

దండిగ

పండితు లందఱున్గలిసి భవ్యునిగూరిచిబూజజేయగా
దండిగవానలేగురిసె,దప్పికదీరదిదేమిచిత్రమో
కొండలనుండిదామిగులగ్రౌర్యపురావముగల్గుచున్వెసన్
దండిగ వర్షమున్బడగధారుణియంతయుమున్గిపోయినన్

దప్పిదీరును


వానదేవుని గరుణన వసుధయందు
వానలెన్నియోకురిసె,పిపాసపోదు
త్రాగనుప్పునీటినిసరిత!తెలియుమిది
దప్పిదీరును మజ్జీగ ద్రాగునెడల

రేడియో


పారముబొందుకోరికనుభవ్యునిగూరిచి దండకంబునున్
వారము వారమున్జదివి వారిజపత్రముతోడశంభుపై
నీరముజల్లగానపుడు నెమ్మదిసంతసమొందనత్తఱిన్
వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

Saturday, August 17, 2019

భద్రగిరీశుని


భద్రగిరీశునిన్గొలుచు భక్తులకున్చెఱసాలదక్కురా
నిద్రనుమున్గుచున్నిటుల నేరముగోచరమౌవిధంబుగా
క్షుద్రపుమాటలన్బలుక చోద్యముగాదెదలంచగానిటన్
భద్రమెయౌను రామునిల భక్తినిగొల్వగ నెల్లవారికిన్

భద్రగిరీశుడు

భద్రాచల రామునినిటు
భద్రగిరీశుండొసగునుభక్తులకు చెరన్
చిద్రూపుని భగవంతుని
క్షుద్రముగా బలుకనిటుల చోద్యముగాదే?

Thursday, August 15, 2019

గాాాధీసూ






















మేలుగ గాధిసూనునకు మేనకతల్లియగున్నిజంబుగన్
చాలును సామి!మీపలుకుసైయననొప్పదుగాధీసూనుకున్
మేలుగదల్లియౌననుట ,మేదినిప్రేయసియౌనుగానికన్
భాలపు నేత్రునత్తయగుభామయెమేనకనామధేయుగాన్

గాాాాాాాధిసూనునకు


ప్రేయసిగనాయె బుడమిని బ్రేమజూపి
గాధిసూనునకుమేనక,కన్నతల్లి
మిన్నదైవముగంటెను నెన్నగాను
దల్లిదండ్రుల సేవించనుల్లమలరు

Wednesday, August 14, 2019

స్వాాాాతంత్ర్యదినోత్సవము

భరత మాతకు బంధముల్దొరగుకతన
మూడురంగుల జెండాలు ముచ్చటగను
నెగురు చుండును నీరోజు నెల్లదిశల
దనివి దీరగ జేతుబ తాకములకు
వందనమ్ములు భక్తిని వందలాది

Tuesday, August 13, 2019

అల్లదె


అల్లదె చక్కగానమరె నల్లికపూవులుగుంఫనంబుగా
మల్లెలలోన,రేగినవిమంటలుబొబ్బలుపుట్టెనయ్యయో
కల్లుదుకాణపుందరినికాసులమంజులయింటిదూలము
న్గాలగనంతముట్టుకొనగందుచునెర్రగ నుండెనక్కటా

దివ్వెలపండుగ


దివ్వెలపండుగ రోజున
జువ్వలుగాల్చంగనవియ చురచురయెగరన్
రవ్వలుగలిగిన కాకర
పువ్వులలోజ్వాలలెగసిబొబ్బలుపుట్టెన్

మాాాాాాామకె


భామిని పార్వతీసతికిభర్తగు ధూర్జటిమామకున్దగన్
మామగుమేరుపర్వతుడు మాన్యుడునౌటనునెల్లవేళలన్
వేమరుసారులున్మదినివీడక నెప్పుడుసాదరంబుగా
మామకెమామగానిలిచిమాన్యతగన్నఘనున్ స్తుతించెదన్

మాాాామకు


భామిని గిరిజను గైకొన
మామగ దాబేరునొందె మాహేశునకున్
మామకుమామగుమేరుని
మామకెమామగనునిల్చుమాన్యునిగొలుతున్

Friday, August 9, 2019

కలిమిదొలగినపుడెకలుగుసుఖము


కాంక్షలెక్కువగునుగనకము మీదన
కలిమిదొలగినపుడె,కలుగుసుఖము
దైవచింతవలనదేదీప్యముగనిల
వాంఛలేకయుంట వరముమనకు

ఆకాశవాణి

పాపకర్మలుసేయకపరమపదము
జేరుకొఱకునైనిత్యము శివునిగురిచి
పూజజేయగ శ్రద్ధను బొసగుముక్తి
కాంతనువలచియోగిగాగణనకెక్కె
--

స్త్రీలెవ్వారలు

స్త్రీలెవ్వారలు భక్తితోడవరలక్ష్శిన్ గోల్వరాదెన్నడున్
షీలా!యేమిదివైపరీత్యమయొకో శ్రేయంబయౌనేనికన్
స్త్రీలేపూజకునర్హులౌటనుభువిన్ శ్రీకారమున్జుట్టుమా
మేలంబాడుటనీకుధర్మమె?యయో!!మేధావియౌనీకిటన్

Thursday, August 8, 2019

లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్


కలతల నిద్రను నిట్లనె
లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్
మెలకువరాబలికెనిటుల
లలనలుసేయంగవలయు లక్ష్శీ పూజన్

Wednesday, August 7, 2019

మాతనుభర్తగాగొని

మాతనివారణన్మదిని మాన్యతజేయక దీక్షతోడనన్
భూతలనాధునిన్గురిచిపోడిమితోడన జేసిసంయతిన్
బూతమనస్కుడున్నగపుభూపతి,హైమవతేశుమామజా
మాతనుభర్తగాగొనియుమాసతిగాంచెనుకార్తికేయునిన్
కల్లోలమ్మునిరంతరాయమగుతన్గాశ్మీరదేశమ్మున
న్బల్లాలమ్మనుగోరుకొందునిపుడేభారమ్మునీదేసుమా
కల్లోలమ్ములులేకనుండగమమున్ఖండాంతరాళంబున
న్నెల్లన్నుండెడువారలందఱినిసూయీసారిగాపాడుమా

మాాాాతనుతనపతిగగొనియుమాాాాాాాసతిమురిసెన్


చేతనరూపుడు సదయుడు
భూతములకుబతియునైన బూతచరిత్రున్
శీతల నాగపుప్రభు,జా
మాతనుతనపతిగగొనియుమాసతి మురిసెన్

Tuesday, August 6, 2019

మూడేడుల్ గలపిల్లగర్భవతియైబుత్రున్ గనెన్ బ్రీతిమై


మూడేడుల్గుణియించగానగుగదామోదంబుగానిర్వయొ
క్కండున్లెక్కనగానసంభవమగున్గాంతాలలామిట్లవన్
మూడేడుల్గలపిల్లగర్భవతియైబుత్రున్గనెన్బ్రీతిమై
చూడన్న్యాయమెయౌనుగానదిరమా!సోత్కర్షమొప్పారగన్

మూడేడులపిల్లకొక్కపుత్రుడుగలిగెన్


మూడేడులు గుణియించగ
వాడుకలోనగునదియిరు వదియొక టిగదా
వేడుకను బెండ్లిజేయగ
మూడేడుల పిల్లకొక్కపుత్రుడుగలిగెన్

కల్లోలమ్మునిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్

కల్లోలమ్మునిరంతరాయమగుతన్గాశ్మీరదేశమ్మున
న్బల్లాలమ్మనుగోరుకొందునిపుడేభారమ్మునీదేసుమా
కల్లోలమ్ములులేకనుండగమమున్ఖండాంతరాళంబున
న్నెల్లన్నుండెడువారలందఱినిసూయీసారిగాపాడుమా

Monday, August 5, 2019

కల్లోలముసాాాాాగుటొప్పుకాాాాాాశ్మీరమునన్


కల్లగ నెంతును దీనిని
కల్లోలము సాగుటొప్పుకాశ్మీరమునన్
మల్లియతీగను వోలెను
నల్లుకొ నుచునొక రికొకరుహాయి మనవలెన్

కష్టము లెల్లదీరెనని

సుష్టుగ వర్షముల్ గురువ సౌరభమొప్పగ జేలుపండగన్
గష్టములెల్లదీరెనని గార్చిరిగంటనునీరుబ్రీతితోన్
బుష్టియెతిండిగింజలకు,భుక్తికిలోటదిగల్గరాదనే
స్పష్టత వారిలో గలిగి సౌఖ్యపుజీవనమిచ్చగించిరే

కష్టములదీరగన్నీరుగార్చిరడలి

కఱవురాక్షసి జగమంత కదలియాడ
ప్రభుత గమనించి ధనమీయ వలసినంత
కష్టములదీర గన్నీరు గార్చిరడలి
పుడమి జనులార్య!సంతసపుబొంగుతోడ

Saturday, August 3, 2019

కలము


కలముద్యజించి మేటికవిగా యశమందెనొకండుధాత్రిపై
యలరుచు నాశువున్ భువినినందముగల్గుసుపద్యమాలలన్
బలువిధపోకడల్ సదువ పాఠకలోకముసంతసిల్లగా
బలిబలియంచునచ్చటిసుపండితులందఱుమెచ్చిరేసుమా

కలమువిడిచిమేటికవిగవెలిగె


గరిక పాటి వారిగళము నుండిసుధలు
జాలువాఱుచుండి జనముమెచ్చ
కలమువిడిచి మేటికవిగ వెలిగెనార్య!
గరికపాటివంశ కవితిలకుడు

ఆకాశవాణి

కలిములుదండిగుండిననకారణవైరముపొర్గువారితో
గలుగుచుమానసంబునుజికాకుమయంబుగజేయుచుండుచున్
దలపగనీదుదైవమును,ధార్మికదృష్టినిడొల్లజేయుటన్
గలిమిదొలంగినప్పుడెసుఖంబులభించును మానవాళికిన్
-----

Friday, August 2, 2019

కవినాశముగోరివ్రాయుగావ్యములెలమిన్

కవియన ఋషిసంభూతుడు
కవిరచనలుశుభములీయ ఖగవతిప్రజకున్
గవినిన్ న్యాయమె యిటులన
కవినాశము గోరివ్రాయు గావ్యములెలమిన్

Thursday, August 1, 2019

ఔనా గల్లలె జెప్పునందురుగదా యాకాశవాణిన్ జనుల్

ఙ్ఞానంబిచ్చును వార్తదెల్పునునికన్ గైతల్ సరాగంబుతో
నానందంబును బొందునట్లుగ దగన్నాలాపముంజేయగా
నౌనా గల్లలెచెప్పునందురుగదాయాకాశవాణిన్జనుల్
వీనుల్సోకగరానిమాటలుసుమావిన్పించెగానిత్తఱిన్

కల్లలేచెప్పుచుండునాకాశవాణి

కల్ల లేచెప్పు చుండునా కాశవాణి
యనెడుపలుకులు నిజములే యక్షరాల
వచ్చుననుజెప్పు వర్షమ్ముపడదు మనకు
రాదనినుడువు తోడన రాళ్ళుపడును
(రాళ్ళవర్షము)