Thursday, January 31, 2019

యోగికి

ఆగమ శాస్త్రమునేర్వక
రాగాదులగూడియుండిరంజిలు చుండన్
యోగివరేణ్యుని చట్టగు
యోగికి యోగమ్మునేర్పె యోగిముదమునన్

Wednesday, January 30, 2019

దత్తపది



ప్రజల గళములు వినుముర నిజము దెలియు
పాండవులనుజేపట్టినభావి నిన్ను
కప్ప మనునది లేకయే కాచు నిన్ను
మ్రొక్కు లిడుదురు మేనత్త ముఖము జూచి

Tuesday, January 29, 2019

సీతాదేవి

కందపద్యక దంబపు కవనకర్త
యైన గుఱ్ఱము సీతకు నాదరమున
వంద నంబులు సేయుదు నందుకొనుడు
గ్రంధమావిష్కరణశుభ ఘడియలందు

wt mjv

కల్పన! నాదుపల్కులను గాదనకుండగ నేర్వుమాయిటన్
నల్పుని జెప్పగాదగు మహాత్ముడటంచు జనుల్ భళీయనన్
నల్పుడు చేయకేపనిని హాయిగబొట్టను నింపుకొంచుచున్
నల్పపుబుద్ధితో దనుమ హాత్మునిగాదలచున్గదాభువిన్

dhlnxz

బక్కపలుచగ నుండి,యే పనియురాని
నల్పుజెప్పనగును మహాత్ముడనుచు
తినుచుగూర్చుంటయాతని దినపుచర్య
భాగ్యమనగను నతనిదే భరణి యందు

etuokmv

నీరజమందునన్గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్
వారిజలోచనుల్వినగబండితు లందఱునేకధాటిగా
నీరజ వాసమున్గురిచి నీమము దప్పక బల్కనట్లుగా
మారులు మాటలాడకను మౌనముతోడను నుంటినచ్చటన్

Monday, January 28, 2019

dk j yop



విరసపు భావన యీయది
నీరజమున గలువఱేని నెలవొప్పారెన్
నీరజమనగా దామర
నీరజములు దాబూవులగును నెలజోడుగనన్

Sunday, January 27, 2019

fjkbs


మంచి చెడ్డలు గ్రహియించి మసలునతని
సాధువుగ గ్రహింతుము,దురాచారునెపుడు
దూరముగ నుంచవలయును దురముగాను
లేని యెడలను గీడును నొనరజేయు

tfazbli



హరుని గటాక్షమున్గలిగియద్భుతరీతిని జేరెసంపదల్
వరమది దేవుడిచ్చినది, వంచనసేసెను భక్తసంఘమున్
సురవరవంశజుండొకడు చూపుదు వేంకటనాయకుండిటన్
నిరవుగరండిమీరలని నెత్తుకు పోయెను వారలందఱిన్

Saturday, January 26, 2019

vcSyn

హరిహరులు వరము లీయగ
వరగర్వముతోడ సురల బాధించంగా
భీరులులై వేడగ హరి
వరమది భక్తులను మిగుల వంచించెగదా

zcnk

అనయము బచ్చగోరెడు మహాత్ములు దాముగ బోయి హాయిగా
వనమున సంచరింపదగు, వైభవముల్ మదిగోరువారికిన్
నినకులనాధు పూజల ననేకపు రీతులజేయ భక్తితో
బనిగొని యిచ్చు సంపదలపారముగాగను దప్పకుండగన్

Friday, January 25, 2019

లేళ్ళు


లేళ్ళు దుప్పులు సింగముల్ ముళ్ళపందు
లెన్నియో గనబడు గంటికింపుగాను
వనమునన్సంచరింప,వైభవము దక్కు
నున్న తంబగు పదవిని నుండునెడల

Thursday, January 24, 2019

asfj

అల్లదె యేమని యంటిరి
భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్
గల్లలు బలుకుట యొప్పునె
పుల్లయ్యా! యేమియిటుల బొసగని మాటల్

Wednesday, January 23, 2019

దీపము

దీపము బొమ్మవేయ నిజదీపపు భ్రాంతిని నుత్సుకంబుతో
దీపముపైననీగ కడుధీరత వ్రాలె సురక్షితమ్ముగా
దీపపువెల్గులన్గనిన దీరని సంతస మొందుచున్దగన్
బ్రాపును బొందగోరుచును వ్రాలును వెల్గులు గల్గుచోటనన్

paaoalu

పాపలు బొమ్మలు వేయుచు
నాపద మ్రొక్కుళ్ళపతిని ,నాతని దరినిన్
దీపపు బొమ్మను నిడనా
దీపముపై నొక్కయీగ ధీరత వ్రాలెన్

పదములులేక

సదమల భావమొందుచు నసత్యముగాక జనాళి మెచ్చగా
బదములగూర్పు టెల్లరకు భాసిత రీతిని నుండుచోదగన్
బదుగురు మెచ్చుకొంచును షభాషను నట్లుగ నుండిదుష్టమౌ
పదములు లేక సత్కవిత వ్రాసినవాడె కవీశ్వరుండగున్ 

Tuesday, January 22, 2019

పదములు లేకుండ కవిత

పదముల పొందిక గలుగుచు
సదమల భావంబునొప్పి సద్గుణములతోన్
జదువరులకుమఱి కఠినపు
పదములు లేకుండ కవిత వ్రాసిన గవియౌ

కొండలు

పిండము గాలిదేవునిది వేగముబెంచుచు గెంతువేయగా
కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయెను దొర్లుచున్వడిన్
గండలు బెంచునాతనికి గారవమొప్పగవందనంబులే
దండిగబెట్ట రండీటకు ధార్మిక జీవనమొందగా దగన్

Monday, January 21, 2019

వరద



వరద వెల్లువై యంతట పాఱుచుండ
పుడమి యందలి లావైన భూరుహములు
కొట్టుకొనిపోయె,గాలికి కొండలెల్ల
వంగె నించుక,చెట్లతో భరణి కపుడు

త్రివర్ణ పతాకం

మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

ఆపద

ఆపద నొందు వారలను నాదుకొనంగను బూనకుండుచో
బాపము,లేనిచో జగము పాడైపోవునునిశ్చయమ్ముగన్
బాపుల మార్చగా వలయు బాపపు కర్మల జోలికెన్నడున్
దాపునకైన బోకునికి తద్దయుజేయగా ముఖ్యమిప్పుడున్

Sunday, January 20, 2019

ఆపద

ఆపద నొందిన వారిని
గాపాడక యుండు నతడు కాపురుషుండే
కాపాడకుండ యుండుట
పాపము,లేకున్న జగము పాడై పోవున్

Saturday, January 19, 2019

సంధి-సాాాాాాాస

దురిత కారకములుగద దురము లవియ
యన్నదమ్ములు సమాస మగుటమేలు
సంధి జేయుమ మామధ్య శౌరి!నీవ
యేక్రి యనుజేతు వోచేయు మిపుడు సామి!

Friday, January 18, 2019

కుక్కలు

అక్కట యేమియీ పలుకు లార్యులవారివె? నమ్మశక్యమే
కుక్కలు పచ్చగడ్డిదిను గోవులుమ్రింగును పచ్చిమాంసమున్
కుక్కలు మాంసమున్దినును గోవులు గడ్డిని నాహరించుగా
నక్కజ మాయెనేనిదియ యబ్బుర మందితి జూచిచూడగన్

కుక్కగడ్డినిమాంసమున్ గోవుదినును

కుక్క గడ్డిని మాంసమున్గోవు దినును
నేమి యాయెనోజగమున నిటులజరుగ
వీరబ్రహ్మముచెప్పిన విధము గాను
జరుగు చున్నవి యన్నియు వెరగు గలుగ

పరగగ

పరగగ దైవభక్తియునపారముగా గలుగంగమంగళా
చరణముతోడ భర్త్రుపరిచర్య యొనర్చె లతాంగివేడుకన్
నరయగ భర్తయేగద యయాచిత సంపదలిచ్చువాడునై
గరము నుదార బుధ్ధిని నెకాయెకి సంబరమిచ్చునేగదా

Thursday, January 17, 2019

చరణముతోభర్త్రుసేవ సతియొనరించెన్

పరమాత్ముని గాధలు విని
నిరతముదాభక్తితోడ నెనరగ మిగులన్
హరిసదృశుపతినిభక్త్యా
చరణముతోభర్త్రసేవ సతి యొనరించెన్

Wednesday, January 16, 2019

వడకెను

వడకెను మేడసాని కవివర్యుడుసేయుమనన్ నవధానమున్
వడకుటగాదు సుమ్మది సభాంగణ వేదిక జూడ గామదిన్
దొదరెను సంతసంబులె యితోధికనుత్సహ మబ్బగా దనున్
వడకుట గల్గెగాని యది పద్యము జెప్పగలేక కాదుగా

వధానమన మేడసాని వడవడఋవడకెన్

వధాన మనునది యెకకళ
వధానమున్జేయగలరు ప్రాఙ్ఞులు ధరణిన్
వధానము జేయగలిగియు
వధానమన మేడసాని వడవడ వడకెన్

చి . సౌ చిన్మయి ,కౌండిన్య శర్మ ల వివాహ మ హోత్స వ ము


చి.సౌ.చిన్మయి!

అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
లరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
అట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల

తనర కౌండిన్య శర్మయే తగిన భర్త
యెదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు

మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున

ఒకరి కోసము మఱియొకరుద్భవించి
యగ్ని సాక్షిగ బరిణయ మాడదలచి
యేకమగుటకు సిధ్ధమె యైన మీర
లందు కొనుడునా జోహార్ల నందుకొనుడు

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .


దత్తపది


(తెలుఁగు, వెలుగు, జిలుఁగు, కలుఁగు పదాలతో సంక్రాంతి లక్ష్మి యొక్క వర్ణన చంపకమాలలో)
తెలుఁగుల తేట పొంగఁగను ధీరవి సంక్రమణంబు తేజమై
వెలుగులు విశ్వరూపమున వృద్ధినిఁ జెందఁ దమోధి నక్రమున్
జిలుగుల చేలముం గొనుచు శ్రీశుఁడు విక్రమ మొందఁగా భువిన్
కలుగును సర్వ సౌఖ్యములు జ్ఞాన బలోద్ధతి శాంతి నొందఁగన్.

సూర్యనారాయాణా

మకర సంక్రమణ భోగి పర్వ శుభంకరుడైన శ్రీ సూర్యనారాయణ భగవానుని కీర్తిస్తూ...,
*ద్వ్యక్షర* కందము.

కరకరకాకర కా కర
కరుకుకరకు రకరక కర కారక రాకా
కర కిరికిరికిరికిరకక
కురరీకర రకకర కర కొరకొర కొరకే

కా = ఎక్కడ
కరకర= ౘురుకైన
కరుకు= గట్టిదైన
అరకు= పదునైన
రకరక= అనేక విధాలైన
కరకర= కిరణములనిౘ్చుటలో
కిరికిరికి= చిక్కులకు
ఇరుకక = దొరకకుండా
కారక=  ముఖ్యుడవైన
ఆకర=  ఆధార స్వరూపమా!,
ఇరికి= దొరికి
రాకాకర= రాత్రి(చీకటీ)కి
                కారణమైన స్వామీ!
కొరకొర = వేడియైన
కరకర = వాడియైన
కురరీకర= వేగవంతమైన
రక= స్వభావము గల
కర= కిరణములు
కొరకొర= కొంచెము (ఆయుష్షు)
ఆకర= ఆధారమైన వారి (జీవుల)
కొరకే= కోసమే (ఉద్ధారమునకే)

ఆకాశవాణి

అరిమూకల భంజనకై
యిరవగుఖడ్గాయుధమ్ము  నేపారంగన్
గరమునజేబూనుచుశ్రీ
కరినినుడాక్రమణజేసె కాంక్షలు హెచ్చన్

Tuesday, January 15, 2019

అగజాాాాాాా

అగజా! వింటివె కీడుజేయునుగ నాయావేళలందెంచగన్
సిగరెట్టున్సిగపట్లు రెండును మనకున్, శ్రేయంబున్గూర్చెడిన్
లగనంబొందుచు నారమాపతిని నుల్లాసంబుబూజించగా
సిగపట్లందుచునుండుచోగరిమ నిస్తేజంబునొందున్గదా

కరములు

కరములు గలిగిన రవియెమ
కరమ్మున్జేరుకతన గరమది మిన్నై
కరముగబుణ్యమిడుదివా
కరునిన్ ప్రార్ధింతునెపుడు కరుణను జూపన్
ప్రత్యుత్తరంతొలగించు

జగతికామే

జగతికి హానులు సేయును
సిగరెట్ సిగపట్లు,మనకు శ్రేయముగూర్చున్
ఖగపతి సేవలు మాత్రమె
సిగపట్టులవలన దొలగు చెలుములు గదరా

Monday, January 14, 2019

అజగరమున్గుటుక్కుమనియచ్చెరువందగమ్రింగెచీమయే

అజగరమున్గుటుక్కుమనియచ్చెరువందగమ్రింగెచీమయే
గజిబిజియౌటపూరణకుకష్టముగాగనుజేయబోతినే
నిజమునుజెప్పుచుంటినదినేరముకాదుగసామి!చెప్పుడీ
యజగరమున్జటుక్కునహారముజేయుటవింతయేగదా

Sunday, January 13, 2019

aజగరమును మ్రింగె,జీమయాశ్చర్యముగన్

గజరిపుడాకలి గొనగను
నజగరమును మ్రింగె,జీమయాశ్చర్యముగన్
గజముఖము నందు గనబడె
నజరామర జీవియగుచునట్టిటుదిరిగీ

సంక్రాంతి శుభా కాంక్షలు


భోగ భాగ్యములు గలుగు  భోగి నాడు
సిరియు సంపద లువిరియు శివుని గృపను
పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
పాడి పంటల వృద్ధియు బాగు గాను
కనుము  దినమున మొదలిడు ననుట నిజము .

సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
సంక్రాంతి మూడు రోజులు
‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

నంబనుబెండ్లియాడె జనులందఱు మెచ్చగ, సాల్వుడాదటన్

సంబరమొప్పగా శివుడు శౌరియుబ్రహ్మయు జూచుచుండగా
నంబనుబెండ్లియాడె జనులందఱు మెచ్చగ, సాల్వుడాదటన్
డంబపుసౌభగంబనెడు డండను శబ్దముగల్గునావిమా
నంబునునెక్కినేగెనట నాతులు పెద్దలుసంతసించగన్

యంబనుబెండ్లాడె,సాల్వుడందఱు మెచ్చన్

సంబరము గలిగి శివుడా
యంబనుబెండ్లాడె,సాల్వుడందఱు మెచ్చన్
డంబపు సౌభగ మెక్కుచు
నంబరమునకేగె నచట నాలముజేయన్

Saturday, January 12, 2019

వివేకానందుడి సందేశాలు

*నేడు వివేకానందుడి 156వ జయంతి.*

 *ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.*

 *ఓ యువతా మేలుకో !*

అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృద‌యాలను సైతం చూరగొన్న భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానందుడు. *భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి.*

 *కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించిన వివేకానంద 1902 జులై నాలుగున, 39 సంవత్సరాల నిండు యవ్వనంలో శ్రీ కైవల్యం చెందారు.*

 వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. *యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు.* ఆయన యువతకు ఇచ్చి సందేశాల్లో ఇదో మచ్చుతునక.

 *లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. లేవండి...మేల్కోండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి...* *ఇకపై నిద్రించకండి.... మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి.. మేల్కోండి... గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి..* ఎప్పడూ జాగృతంగానే ఉండండి. *బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు.*

మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. *బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తించండి. విశ్వాసంతో లేచి నిలబడి ధైర్యంగా బాధ్యతలను మీ భుజ స్కంధాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి....* *ప్రారంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలను సాధిస్తారు....* సాహసంతో పని చేయండి అంటూ నిద్రాణమైన ఉన్న యువతను మేల్కొలిపాడు స్వామి వివేకానంద.🙏

యరిషడ్వర్గములా,ప్తమిత్రములుగానానందమందించులే

అరయన్గీడునుగల్గజేయునుగదామాత్సర్యక్రోధాదులౌ
యరిషడ్వర్గములా,ప్తమిత్రములుగానానందమందించులే
పరగన్శాంతియుసౌఖ్యముల్ సహనముల్బాహాటమైయొప్పగన్
నరిషడ్వర్గములొందుచోసతముకయ్యాలొయ్యనన్ వచ్చుగా

Thursday, January 10, 2019

గద్వాలప్రభవ,వహ్నికాల్చెనులంకన్

అద్వైతంబునగొఱకే
గద్వాలప్రభవ,వహ్నికాల్చెనులంకన్
నుద్వేగంబునహనుమయె
విద్వేషముబొంగిపొరలవిఖరులపైనన్

Wednesday, January 9, 2019

చదువనివాడు పండితుడుశాస్త్రమునేర్చినవాడుమూర్ఖుడౌ

చదువనివాడు పండితుడుశాస్త్రమునేర్చినవాడుమూర్ఖుడౌ
చదువులుసేయయున్నతిగ,సత్కవులట్లుగబల్కచోద్యమే
చదివిననబ్బు సౌమ్యతలు,శాంతము దోటివారకున్
సదయనుమేలుజేయునునశాస్త్రముమార్గమునుండబోదుగా

చదువకపండితుడగు,మఱిచదివిమొఱకునౌ

పదములుబూతివియైనవి
చదువకపండితుడగు,మఱిచదివిమొఱకునౌ
మెదడునకందనిజదువులు
చదువన్గన్వలయునీతిశాస్త్రపుజదువుల్

Monday, January 7, 2019

కవికా

కవికి కవికి మధ్య గలిగెడు గట్టిపో
టీవలన కవిత్వమే విలసిలు
కవన మయ్యదియొక కళయండ్రు పెద్దలు
దానివలన గలుగు దైవభక్తి

వినుమాాాాాాాా

వినుమా శారద! నాదుపల్కులను నివ్విధంబుసంగీతమున్
నననానానననాననాననననానానానానానాననా
ననయంబీయదిసాధనమ్మొనరయయ్యాప్రాంతసీమంబులన్
ఘనమౌకీర్తులువచ్చునున్ధరనుదిగ్గంతమ్మువ్యాపించగాన్

Sunday, January 6, 2019

రాాాామ

రామరామరామ రావణమర్దన!
వేడుచుంటినిపుడు వినయముగను
బాలముంచెదొయిక నీరముంచెదొసామీ!
నాననాననానననననాన

Saturday, January 5, 2019

ఆకాశవాణి

కనుమదిరాజశేఖర,యెకాయెకి  శంకరువారిదైనయా
కనక వనంబులో విరియుకాంతులు దీపములెన్నపద్యముల్
ననుదినమచ్చటన్దనరునద్భుతమబ్బెడు పద్యరాజముల్
గనగనునేగుమాధరనుగాంచగవీలగునియ్యెడన్సుమా
-------
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

లీలాాాాా

లీలామానుష విగ్రహు
నాలయ ప్రాంగణముజేరి యారాధనకై
వాలాయమ్ముగ మనకో
పాలన్దూరమునబెట్టస్వాస్ధ్యముదక్కున్

Friday, January 4, 2019

ఇంద్రధ

ఇంద్రధనుస్సువోలెగడునింపొనగూర్చుచునాకసంబునన్
జంద్రుడువచ్చెచూడుడుప్రచండవిభాకరుడైదినమ్మునన్
చంద్రునిజూడగామఱిప్రచండవిభాకరివోలెలేడుగా
సంద్రమునుండియేవెడలిసంద్రపుఛాయలుబోలెనేసుమా

bhommi



భూమి సూర్యుల మధ్యకు సోమ గ్రహము
వచ్చు కతనాన జీకటి విచ్చుకొనగ
చంద్రు డేతెంచె మధ్యాహ్న సమయ మందు
కనుమ యట్లగుగ్రహణపు కాలమందు

బధ్ధమనస్

బధ్ధ మనస్కులై హితులుబాపనిపంపున గ్రొత్తబట్టలన్
శ్రాధ్ధముబెట్టినారటవిశాలవివాహపుమండపమ్మునన్
నిధ్ధరనానవాయతియయిట్లుగబట్టలువెట్టుటిత్తరిన్
శ్రాధ్ధమనంగనేర్వుమిటశ్రధ్ధనుజేయుటనెల్లవేళలన్

Thursday, January 3, 2019

పెండ్లివేదిపై శ్రాాాాా

గుండెపోటున మరణించ క్రొత్తవధువు
పెండ్లివేదిపై శ్రాధ్ధంబుపెట్టీరంట
శాస్త్రయుక్తపు మంత్రాలు చదువు చుండి
పెండ్లి వోలెను గర్మగా వించి రార్య!

Wednesday, January 2, 2019

మల్లెలవాాాాాాాసన

మెల్లగమంచమెక్కెనటమేకలనాగినిసంబరంబున
న్మల్లెలవాసనల్సెలగ,మానినిరోయుచుముక్కుమూయదే
గల్లునుద్రాగివచ్చిదనకాంతకుమీదికిబోవుచుండగా
నల్లదెవాసనల్దగులనాయమయట్లుగముక్కుమూసెనే

మల్లియలుగుబాళించగమహిళరోసె

కామక్రీడలదేలెనుగామరాజు
మల్లియలుగుబాళించగ,మహిళరోసె
త్రాగివచ్చినబెనిమిటితంతుజూసి
భర్తప్రేమనేగోరునుభార్యయెపుడు

మతిచెడి


మతిజెడితిర్గుచుండెనటమానినియైననులజ్జలేకయే
పతినిపరిత్యజించియొకభామ,పతివ్రతగానుతుల్గొనెన్
సతియగు ద్రౌపదయ్యెడలజారుగుణంబులనొప్పుచుండుచున్
బతివ్రతలెల్లరున్గడుగృపారసయుక్తులుమౌనభాషణుల్

కమేష్ రచన

కొందరి జీవితాలను చదివితే వారి అనుభవములు మనకు ప్రేరణ కలిగిస్తాయి. మార్గదర్శకాన్నిస్తాయి. అటువంటి ఉన్నత మార్గదర్శక లక్షణములు కలిగిన వారే కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
ఆ మార్గదర్శి గారిని గూర్చి తెలుసుకుందాము వారే మన సభ్యులైన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి తండ్రి. వారిని గూర్చి వారి అబ్బాయిగారి మాటలలో తెలిసికుందాము. కామేశ్వర రావు గారి అన్నగారు శ్రీ సుబ్బారావుగారు మా పినతండ్రి గారి సహాధ్యాయి మా పెదతండ్రి గారికి శిష్యులు మోడేకుర్రులో.

కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
బి. దొడ్డవరము, (రాజోలు తాలూక).
(1920 – 2001)
సంక్షిప్త పరిచయము:
    కపిలేశ్వర పురములో శ్రీ పోచిరాజు సుబ్బారావు సత్యవతీ దంపతులకు 1920 లో జన్మించిరి.
    చిన్న వయస్సు లోనే వివాహమైనది. మా తల్లి గారు శ్రీమతి సత్యసుందరి. పాలగుమ్మి వారి యాడపడచు.
    అమరకోశమును తన మేనమామ అయ్యగారి భాగయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు.
    మా నాన్న గారు చిఱుత ప్రాయములోనే తండ్రిని పోగొట్టుకొని గ్రామ కరణము గా చిన్న కాఱు రైతుగా     ముగ్గురు తమ్ముళ్ళ నొక్క     చెల్లెలిని పోషించి పెళ్ళిళ్ళు చేసిరి.
    ఆయన సంతానమైన మా నలుగు రన్నదమ్ములను మఱియు నైదుగు రప్ప చెల్లెళ్ళను వృద్ధి లోనికి తీసుకొని     వచ్చిరి.
    చిన్నప్పటినుంచి యాధ్యాత్మిక చింతనలో పరధ్యానముగా నుండెడి వారని మా మామయ్య (మేనత్త గారి     భర్త). మాకు చెప్పరి.
    స్వామి శివానందుల వారి శిష్యులు. ఉత్తర ప్రతుత్తరములు చేసిన భాగ్యవంతుఁడు.
    రమణ మహర్షి, ఇనమడుగు సత్యానంద స్వాముల వారి శిష్యుఁడు.
    భగవద్గీత, స్వామి వివేకానంద రచనలు,  మున్నగు నాధ్యాత్మిక గ్రంథములు నిత్యము చదువు చుండెడి వారు     దిన చర్యగా.
    ప్రతి రోజు మద్యాహ్నము, సాయంత్రము తిరుగుచు భాగవతము లోని పద్యములను (కంఠత) చదువు     ఛుండెడి వారు క్రమము తప్పకుండ.

వ్రాసిన గ్రంథములు:
1.    గీతా యోగము, భగవద్గీత వ్యాఖ్యానము.
2.    Man and God
3.    How to become Yogi
4.    సావిత్రి, అరబిందొ ఘోష్ గ్రంధ వ్యాఖ్యానము.
5.    Glimpses of Ancient Vedic Thought of India.

ఈ పుస్తకము లన్నియు నాయన ప్రియ మిత్రుఁడు, మా మామ గారు నయిన కీ.శే. ధరణీప్రగడ వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద నుంచిరి.
అప్పటి మా బా ల్యావివేకము వలన వాటి విలువను గుర్తించ లేక పోయితిమి. ఈ ప్రతులను శ్రీ శివానందాశ్రమము, సత్యానందాశ్రమములకు నొసంగిరి.  కొన్ని ప్రతులుంచగ  వాటిక కొఱకు నేను ప్రయత్నించు చున్నాను.


సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్   

తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాయోగ భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్


నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే           

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్           

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్    

విబుధ జన విధేయుఁడు
పోచిరాజు కామేశ్వర రావు.

Tuesday, January 1, 2019

పతిని

పతినిత్యజియించి యనగనుబతియరాచ
కములరూపుమాపునటులగట్టడించి
మంచిమార్గముజూపించిమనిషిజేసి
పతినిత్యజియించిసతిపతివ్రతయనబడె