Tuesday, December 28, 2021

 

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కరాజు ప్రకాశరావు గారి జన్మదిన శుభాకాంక్షలతో సమర్పించు పంచరత్నములు.

-------------------------

జక్కరాజను వంశాన సదయమూర్తి

ధరను ప్రకాశరావుగ బరగి మిగుల

నయముగావించితమ్ముల నడవడికను

మానవత్వంబు జాటిన  మహితు డతడు. 1


 తండ్రి యంకము జేరని దనయు లైన

దమ్ము లందరి బాగోగు లిమ్ముగాను

దాను దండ్రియై సాకిన ధర్మ యుతుడు

సాటి యెవరయ్య తనకిల సాటి యెవరు. 2


చదువు సంధ్యలు నేర్పించి చక్కగాను

మాకు బ్రదుకగ శక్తిసామర్ధ్య ములను

నొసగి నటువంటి నీవునౌ నుత్తముడవు

వందనంబుల నిడుదుము వందలాది. 3


నీదు పెంపక మరయగ నిజముగాను

కన్న కొడుకులా యనునటు కానిపించె

నీదు ఋణమును దీర్చగ నేర్వలేము

రెండు చేతుల తోడికై దండ లివియె. 4


ఆది దంపతి వోలెను నలరు నట్టి 

మీకు వదినెకు శంభుడు మిగులదయను

నాయు రారోగ్య సంపద లన్ని యిడుచు

నెల్ల కాలము గావుత  చల్లగాను

----------

ఇట్లు హృదయపూర్వక నమస్కారములతో....

కుటుంబ సభ్యులు

Thursday, December 9, 2021

ఉత్పల గజమాల 108

 భరత మాత కుత్పల గజమాల.

ప్రణీతము: పోచిరాజు సుబ్బారావు

108 పాదములు. 

భారత దేశ సీమలుగఁ బశ్చిమ వైపున వార్ధ్యరేబియా 

దూరుపు దిక్కునం గలదు తోరపు సంద్రము తూర్పువార్ధియే 

యారయ నుత్తరంబునన హైమవతీ పిత పర్వతంబునున్ 

మూరును  దక్షిణాన నిలఁ బుణ్యపు హిందు మహాబ్ధి రత్నమే 

భారత దేశ వాసులకు భావి సుతాలికి మార్గ మీఁ దగున్ 

వారము వార మింపుగను బండిత వర్గము మెచ్చఁగా వలెన్  

గోరిన సాయ మెల్ల నిడి కూరిమి నెల్లరు  పంచఁగా వలెన్  

వారక సంతసం బడరి వర్తిలఁ బౌరులు గాంతు రున్నతిన్

వీరులు దేశ సైనికులు పెన్నిధు లౌదురు దేశ మంతకున్  

వారలు లేనిచో మనము ప్రాణము తోడను నుండఁ జాలమే 

శూరులె యెల్ల వేళలను శూరత జూపుదు రంక భూమిలో 

మారణ హోమమున్ జరిపి మచ్చరిఁ జంపుదు రప్రమత్తతన్ 

సూరన రామకృష్ణ కవి సుబ్బయ శాస్త్రులు తిమ్మ నార్యుఁడున్ 

మారన రంగనాధుఁడును మల్లన పెద్దన భట్టుమూర్తియున్ 

వారలు పండి తోత్తము లవారిత రక్తిని కావ్య సంపదం  

బారగులే మహా కవిత భాసిలు నట్లుగఁ జేయ వీరలున్ 

వీరికి మున్ను నన్నయ కవీశ్వర తిక్కన యెఱ్ఱ ప్రెగ్గడల్ 

గౌరన కృష్ణరాయలును గాకలు తీరిన రామలింగఁడున్ 

నారయ దీక్షితుల్ మఱియు నాచన సోమన వేమ నార్యుఁడున్ 

భారత దేశ మందుననె భాసిలి యిచ్చిరి పెక్కు కావ్యముల్ 

వీరును వారు నున్ననక పిన్నలు పెద్దలు బుద్ధిమంతులే  

వారలు వీరలున్ నిలిచి వ్యాక్సిను బొందఁగఁ బట్టు వట్టిరే 

భారత దేశవాసు లన భారత జాతికి ముద్దు బిడ్డలే 

యే రక మైన కార్యముల నింపుగఁ జేయ సమర్థు లెన్నఁగా  

నారిన జ్యోతికిం దిరిగి హారతి పట్టును భారతీయుఁడే

వారినిఁ బాఱు చుండఁ దగఁ బట్టెడు వాఁడును భారతీయుఁడే

పేరిమి జాతకంబులను బెద్దగ నమ్మును భారతీయుఁడే 

వైరము సూడకుండ జన వర్గము నమ్మును భారతీయుఁడే 

గోరను బోవు దానికిని గొడ్డలి వాడరు కర్కశమ్ముగాఁ  

గోరిన వారి కెల్లరకుఁ గూడును గుడ్డ నొసంగ నేర్తురే  

సైరికుఁ డొప్పుగం దివిరి సాగునఁ జాగును బ్రేమమూర్తియై

వైరము లేని పద్ధతిని భారత దేశము చేయి నిచ్చునే 

భారతి పుట్టి నిల్లయిన బాసర యిక్కడె యుండె నింపుగాఁ   

బౌరు లనంగ నేరుదురు భౌతిక రూపము గాంచి నంతనే 

వీరలు మెచ్చ రెప్పుడును వీసము కూడను గర్ణు దానమున్

వీరలు మెచ్చ రెచ్చటను భీముని శౌర్యము నెట్టి వేళలన్  

సైరికు లోగిరంబులను జక్కగఁ దిందురు పైరు మధ్యలోఁ 

బైరులు పండు బాగుగను భారత దేశపు పంట చేలలోఁ 

బేరు గడించు పండితులు పెక్కురు పుట్టిరి  భారతావనిన్  

భారత దేశ వైభవము బ్రహ్మకు కూడ వచింప శక్యమే 

బీరము లాడు వార లిట పేరుకు నైనను గాన రారులే 

క్రూర మనస్కు లుండ రిటఁ గూరిమి జూపుచు నుందు రెయ్యెడం   

జేరవు భూతముల్ దరికి సేమము సూడఁగ  గ్రామదేవతల్ 

నీరజ నాభుఁడే కదలి నెమ్మిని రక్షణ మిచ్చు ధాత్రికిం  

గారు దురాత్మకుల్ వశులు కాలుని సేవకు నెల్ల వేళలం  

గారుగ హంతకుల్ మదినిఁ గంపెడు జాలిని గల్గు వారలే 

కారుగ మోసగాళ్లు మఱి  కాంక్షలు దీర్చెడు కర్ణులే సుమా 

కారు సుసత్యదూరు లిఁకఁ గాంతలు సైతము సత్య వాదులే 

భారత దేశ కీర్తి యిఁక భాసిలు దేశ విదేశ సీమలన్ 

నీరజ నేత్ర యా గిరిజ నెమ్మిని గాచును  భారతీయులన్ 

భారము గాఁ దలంపకను బామ్మలు సైతము వంటఁ గూర్తురే 

గారెలు జంతికల్ వడలు కమ్మగ వండుదు రిద్ధరిత్రినిన్ 

ధారణ యందునన్ మిగుల దక్షులు భారత దేశ వాసులే

పైరులు పంట లిద్ధరను బాగుగ పండెడు దేశమే సుమా

నేరము జేయు వారి నిట నీతి విదూరులుగాఁ దలంతురే

మీరరు తండ్రి యాఙ్ఞలను మేదిని నొక్కరు నైనఁ గ్రోధులై   

యారదు దీప కాంతి యిట హారము వోలెను  గాంతి యిచ్చుటం  

గ్రూర మృగంబులన్ వనిని గూర్మిని బెంచును భారతీయుఁడే

క్రూరత జూప రెప్పుడును గ్రోధము గల్గిన భారతీయులే

గౌరవ మొప్పగాఁ బ్రభువు  గాచును దప్పక భారతావనిం  

జోరులు సైతమున్ దయను జూపుదు రొక్కొక వేళ లిద్ధరం 

జారులు  తోడ్పడంగఁ గడు చక్కని భద్రత నుండు దేశమే   

జోరున వానలే కురియఁ జూచుచు నుండక వాడు కొందురే 

దారను నొంటిగా వదలి ధర్మము దప్పరు భారతీయులే 

ధీరులు కాని వార లిఁక దివ్వెటఁ జూచిన గాన రా రిటన్ 

నేరము జేయు వాని నిఁక నీచుఁడె యందురు  భారతీయులే 

బేరము లాడు వారి నిట వీసము కూడను లెక్క సేయరే 

పారము సేరఁ గోరు ప్రతి భక్తుఁడు నిక్కపు భారతీయుఁడే  

భారత దేశపుం జనువు భాగ్యమె యౌనను భారతీయుఁడే 

భారవి యాదిగా కవులు భారత మాతకుఁ గన్నబిడ్డలే

భారత దేశ భామినులు పాకపు వృత్తిని నారితేరిరే

కోరిన తత్క్షణం బిడును గూర్మిని నన్నము నమ్మ యింపుగా  

నూరులు బెక్కులున్నయవి యోటమి నొల్లవు వీండ్ల నెన్నఁడుం 

బోరునఁ దీసిపో రెపుడు  భూపతు లెవ్వరు భారతావనిన్ 

వైరి జనంబులం దునుమఁ బ్రాఙ్ఞులు నిచ్చటి వీర సైనికుల్  

చారుతరంబులై మెఱయు చానలు చూడఁగ భారతీయులే 

కోరఁడు బంధువున్ భువినిఁ గూటికి గుడ్డకు భారతీయుఁడే

భారత దేశ సైనికుఁడు భారత మాతను  కాచు నిత్యమున్ 

నేరఁడు చేయి చాఁపుటను నీతిని మానుకు భారతీయుఁడే 

భీరుని జేయ రెప్పుడును  బ్రేమను బంచిన భారతీయునిన్ 

ఘోరముగా దలంతు మిఁకఁ గోడలి హత్యను భారతావనిన్ 

జారుని మోమునుం గనిన జాలిని జూపరు భారతావనిం  

దీరము దాట గోరు నెడ తేకువతోఁ జను భారతీయుఁడే 

ధారుణి నేలు భూపతులు ధార్మిక పద్ధతి నాకళించిరే 

జోరున వర్షముల్ బడెడు చొప్పది సంద్రము దోఁచు నత్తఱిన్ 

భూరిగ దానముల్ సలుపు భూజను లుండిరి  భారతావనిం  

బౌరులు పౌరుషం బడర భారత కీర్తినిఁ జాటి చెప్పరే 

బారుల బారులై మణులు భారత భూమిని దాఁగి యున్నవే 

తోరముగా సిరుల్ గలుగు దూరపు దృష్టిని సాగుచేయుచో 

బోరున నేడ్వ నాఁకలికిఁ బొట్టను నింపుదు రా క్షణంబునన్ 

మారఁడు సజ్జనుం డెపుడు మారుని బంటుగ భారతావనిన్ 

మేరువు వోలె నుందు రిట మీసము ద్రిప్పుచు ధైర్యవంతులై 

వీరశిఖా మణుల్ గలరు వెట్టము పాలిట దండ హస్తులై  

వైరి గణంబులం దునుమ బాసలు సేసిరి భారతీయులే 

వారము వారముం గురియు వానలు దప్పక భారతావనిన్ 

క్షీరము లిచ్చు గోవు లిట చేఁపగఁ జేఁపుచు మిక్కుటమ్ముగా 

సారము లేనిచో బ్రదుక సాధ్యము గాదిట యేరి కైననున్ 

సీరము చాలు నుండి గద సీతమ పుట్టెను భారతావనిన్ 

సూరన నామకం బలరి శోభిలె రాయల రాజ్య మందునన్ 

శారద పేరులో గలదు సౌమ్యత యమ్మల గన్న యమ్మయే 

నేరము జేయకుండు టది నిశ్చల తత్త్వపు భక్తియే సుమా 

కారణ జన్ము లెప్పుడును గాఁగల కార్యము లూహ చేయరే 

గౌరన సార్వభౌములకు గౌరవ పూర్వక వందనంబులే 

భారవి కాళిదాసులకు ఫాలము వంచి నమస్కరించెదన్ 

భారత దేశ కీర్తు లిలఁ బర్వగఁ గోరుదు దేశ రాశులన్ 

వారిజ నాభుఁ డింపుగను భారత దేశముఁ బ్రోచుగావుతన్ 

వారిజ గర్భుఁ డిద్ధరను భద్రత తోడుత రక్ష సేయుతన్ 

మార రిపుండు రక్షణము మానవ జాతి కొసంగుఁ గావుతన్ 

Friday, December 3, 2021

నాన్న పుట్టినదినము2-12


శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్ 

రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో 

నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని

త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్

Thursday, November 11, 2021

పురుషుని కంఠమందు సతి,పుస్తిని గట్టెను బెండ్లి పందిటన్

 విరులను గూర్చు దండను నభీష్టము మేరకు వేసె బ్రీతితో

పురుషుని కంఠమందు సతి,పుస్తిని గట్టెను బెండ్లి పందిటన్
నరహరిశాస్త్రి యొక్కడు సనాతనధర్మపరాయణడునౌ
మురిపెము గొల్పు మాలతికి మోహముతోడను మెచ్చరందఱున్

రణముంగోరుచు గొల్చుభక్తులనునార్యా రక్షసేయంగదే

 ప్రణతుల్ సేయుదు నెల్లవేశలను యోవారాణశీరాజవా

రణముంగోరుచు గొల్చుభక్తులనునార్యా రక్షసేయంగదే
యణగుంజేయుడు నాదుకోరికలు బాహాటంబుగాసాదయన్
క్షణమున్ వీడక నిన్నునేగొలుతు నోసామీ దయంగావవే

రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా!

 ప్రణతులివె వేగొనుచును శ

రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా!
క్షణమైనను నిను వీడక
ప్రణతులతో నిన్నుగొలుతు పర్వతపుత్రీ!

Friday, September 24, 2021

కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్

 శోకముతోడ నాయబల స్రుక్కుచు గృష్ణుని గోరనత్తఱిన్

కోకలు ద్రౌపదీసతికి గోర్కెనొసంగెను, గర్ణుడొప్పుగన్
నాకపుఱేడు కోరగను నమ్రతయొప్పగ గుండలంబులన్
గూకటి వ్రేళ్ళతో నొలిచి కోరికతీరగ నిచ్చెనేగదా

కర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను జారవిడిచెను దేవతల్ సంతసించ

 దేవరాజగు మఘునకు దీసి తనదు

కవచ కుండలముల డుగంగ దయకలిగి
కర్ణుడిచ్చె,ద్రౌపదికి గోకలను దయను
జారవిడిచెను దేవతల్ సంతసించ
భక్తరక్షక! నీకివె వందనములు

Thursday, September 23, 2021

పిల్లిదురంబునందునిమె,పెద్దపులింగడు విక్రమించుచున్

 మెల్లగ నాగుపామొకటి మేడను బ్రాకుచు నుండునత్తఱిన్

పిల్లిదురంబునందునిమె,పెద్దపులింగడు విక్రమించుచున్

జల్లుమనంగ నొక్కపరి చాపుచు కోరలుమీదికుంజనన్

పల్లమునెత్తులంగనక పాఱెను సోముడు గుండెపట్టుచున్

బుసలు గొట్టుచు దరిజేర భోగి,యంత పిల్లి పోరాటమున జంపె,బెద్దపులి

 బుసలు గొట్టుచు దరిజేర భోగి,యంత

పిల్లి పోరాటమున జంపె,బెద్దపులిని

వేటగాడొకడు పొదల చాటునుండి

చంపె బాణాన గలిగెడు తెంపు తోడ

Monday, September 20, 2021

కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్

 రేపులు మాపులున్ ననక ఱేయియు బ్రొద్దును జేయుచుండగా

నీపని యాపనియం చికను నిట్టుగ నట్టుగ జెప్పుచుండగా
గోపమునొంది కూర్చునగ గోమున యత్తయు జేరదీయుటన్
కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్

కోడలికినత్తసన్నిధిం గోపమె నగ

 చేయుకొలదిని నింకను జేయుమనగ

కినుక వహియించి కూర్చుండ,కేలుదమ్మి
వట్టి యత్తమ్మ బ్రతిమాలు వట్టు చూడ
కోడలికినత్తసన్నిధిం గోపమె నగ

Thursday, September 16, 2021

రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్

 రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్

నేమని బల్కుచుంటిరిట? యిట్లుగ బల్కుట పాడియే?రమా!

రాముడు శాంతమూర్తియయి రంజిలునట్లుగ మానవాళియున్

నీమము దప్పకుండగను నిశ్చల బుద్ధిని రాజ్యమేలెగా

రాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?

 ఏమీ? దారుణమీయది

రాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?

రాముడనంగను దైవమ

యేమాత్రము నుండబోవు నీర్ష్యాదులహో

శంకలు లేనివాడు సరసంబునెఱుంగునె మోదమందునే

 వంకలు జూడగా దొరకు వందలువేలుగ నిజ్జగంబునన్

శంకను నొందుచున్ మనక సర్దుకు బోయిన హాయిగల్గుగా

శంకల బాటలోనడువ శక్తివిహీనులె యౌదురెప్పుడున్

శంకలు లేనివాడు సరసంబునెఱుంగునె మోదమందునే

శంకలు లేనట్టివాడు సరసుండగునే?

 వంకలు వెదకిన దొరకును

పంకజముఖి చేతలోన బరిశీలించన్

శంకలు గలుగక యుండిన

శంకలు లేనట్టివాడు సరసుండగునే?

Wednesday, September 15, 2021

ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్

 ధవుని పరాభవించుటయె ధర్మము సాధ్వికి దప్పులేదిలన్

ధవుని పరాభవించుటను దప్పుగ నెంతును నోమహాశయా!
ధవునికి సేవజేయుట సదాశివు సేవయెయౌను ధారుణిన్
వివరముగానుటంకితిని బ్రేమను బంచుచు నుండమేలగున్

ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్

 అవకతవక లీమాటలు

ధవుననుమానించుటె కద ధర్మముసతికిన్
ధవుడన దైవమ యాలికి
ధవునుని సేవించునెడల దక్కును ఫలముల్

Sunday, September 12, 2021

దానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్

 హీనముగా దలంతునిక హేమపుటాభరణంబు లుండగా

దానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్

దానముజేయకుండగను ధార్మికసూక్తులు బోధసేయుటన్

దానము జేయగా వలయు దప్పక యన్నము నీరమున్ రతిన్

దానమొనరింపరాదు,క్షుద్బాధితులకు

 ధనము మత్తుగ గలవాని కెన్నడిలను

దానమొనరింపరాదు,క్షుద్బాధితులకు

నన్న దానము జేసిన మిన్నగాను

పుణ్య మబ్బును దప్పక గణ్యముగను

గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

 గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

మరణంబెందుల కోరుచుంటివిల నామార్తాండు సేవించుచో

నిరతంబీయును నాయువున్ సిరులు పానీయంబులింపారగా

గరమున్ మానుమ దుష్టచింతనను నోకామాక్షి!నీవిప్పుడున్

గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

 అరకొర బ్రదుకుల కంటెను

విరమణ నీయంగదలచి వివిధములుంగాన్

మరణపు యత్నము జేయగ

గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

Thursday, September 9, 2021

కర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్

కర్ణంపు కుండలంబులు
పూర్ణము గలిగిన కవచము పూర్తిగ శచికిన్
కర్ణుండీయుట కతమున
కర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్

Wednesday, September 8, 2021

చలివేళ.........

వలపున్ గూర్చును నేరికైననిల నాఫాలాక్షు సాక్ష్యంబుగా
జలివేళన్ గౌగిలింత ,మిగులన్ సంతాపముంగూర్చెరా
చెలియున్ బ్రక్కన లేనిచోరవికి దాజేయండుసుమ్మేదియున్
జెలితో నాతని జీవితంబుముడి యోశ్రీరామ!నీవేగతౌ

చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్

వలపుల రేకెత్తుంచును
చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్
చెలి ప్రక్కనలే కనయీ
చలికాలము రవికి మిగుల సైపగ లేమిన్

Monday, September 6, 2021

పాతివ్రత్యము జూపుచుండి ,విటులన్ బైకొందురబ్జానల్

నాతుల్ రక్షణ సేయుచుండిరి గదానారీలోకంబునున్
పాతివ్రత్యము జూపుచుండి ,విటులన్ బైకొందురబ్జానల్
నీతిన్ జాతియు లేకయుండుచు నికన్ నీచంపువృత్తిన్ ధరన్
రోతన్ బొందెడు జీవితంబునుగటాలోకంబు గానుంటిరే

పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సతుల్

నాతులు రాణింతురుగద
పాతివ్రత్యమున,విటులబైకొంద్రు సతుల్
వీతభయంబున,సిగ్గున
నీతిని విడనాడిరకట నీచపుబనికిన్

భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్

భర్తకు దాసిగా మఱియు భార్యగ నమ్మగ బ్రేమపంచుటన్
భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్
హర్తకు వోలె నుండకను హాయిని నిచ్చుచు నుండగావలెన్
భర్తకునెల్లవేళలను వాయికి చేతికి దోడుగాధరన్

Sunday, September 5, 2021

భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?


కీర్తీ! తలపగ నేరము
భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?
హర్తను సత్పురుషునిగా
గర్తవ్యము నెఱుగవలయు గనికరమందున్

 

Saturday, September 4, 2021

రతికి సిద్ధపడుడు రమణులార!

 పూజయాయె నిపుడె పూర్తిగ కనుకహా

రతికి సిద్ధపడుడు రమణులార!

హారతిచ్చి పిదప యయ్యవారినిబిల్వ

కనులకద్దు కొండ్రు తనివిదీర

రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్

 అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హా

రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్

మతియందెప్పుడు శంభునేదలచి నీమంబొప్పథ్యానించుచో

సతతంబిచ్చును నాయువున్ సిరులు నాజన్మాంతమశ్రాంతమున్

Thursday, September 2, 2021

యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే

 ముద్దులు మూటగట్టునటు మోములు గల్గిన వారుగాను నీ

కిద్దరు భార్యలున్నను వరించితెవేఱొకతెన్ రఘూద్వహా!

యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే

తద్దయు ఘోరమే కమల!ధార్మికరూపుని బంపనిర్దయన్

సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా

 పతిదశరధునకు రామా!

సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా

సుతులుగ బుట్టిరిగదమీ

రతిసుందరరూపుతోడ నార్యా! చెపుమా

Wednesday, September 1, 2021

రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపై

శీతలమయూఖుడున్ వెలుగు సేదనుదీర్చగ మానవాళికిన్
రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపై
యాతప యుక్తుడై మిగుల యార్తిని నీయచు ,నెల్లవారుదా
భీతిని గల్గునట్లుగను బెంపువహించుచు నుండెనాయనన్

రవివెలింగెను తూర్పున ,రాత్రివేళ

ప్రబల తేజస్సు తోడను బ్రజలు మెచ్చ
రవివెలింగెను తూర్పున ,రాత్రివేళ
చలువ వెన్నెల తోడను జంద్రుడుండి
హాయి గూర్చును నెనలేని హర్ష మొదవ

అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్

 అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్

నంధత్వంబున నుండువారలును దానానంద ముప్పొంగగా

బంధాలెన్నియొకల్గి సంతసముతోవ్యాపారాపారీణులై

యంధత్వంబును మర్చిపోవుచును దైవారాధనంబే యికన్

అంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్

 ఇంధనమువలన గలుగును

నంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్

బంధము లన్నియు పుడమిని

కంధరమున్ నలుపు గలుగు ఖచరుని గొలువన్

Tuesday, August 31, 2021

ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్

 కరమున్ మానసమందునన్ నిలిపి యాకాశీవిభున్ చంద్రశే

ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్

నరయంగా నదియేకదా శివుని మాహాత్మ్యంబులోకంబునన్

భరణీ!నేర్వుమ యీశ్వరార్చనకు సాఫల్యంబు ముమ్మాటికిన్

ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్

 అరమరిక లేకయుండగ

నిరతము దాసేవజేయ నిర్మలబుద్ధిన్

గరముం భక్తిని శశిశే

ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్

Monday, August 30, 2021

చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్

చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్
మీవచనంబులన్ వినగ మీరని సంతస మయ్యెనెంతయో
జీవము గల్గీయున్నయెడ జీవితమంతయు దుఃఖమొందుచున్
పావని! యుండనోపుగద బాములనోర్చుచు నిజ్జగంబునన్

చావొసగు సమస్త సౌఖ్యములను

బ్రతికియుండ కలుగు బాధలు విరివిగ
పుత్రమిత్రభార్య పోరు వలన
నేది దేని నొసగు నిజ్జగ మునయన
చావొసగు సమస్త సౌఖ్యములను

Sunday, August 29, 2021

పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్

వినుము కుటుంబపోషణయు బెద్దలరక్షణ భార్యకోరికల్
పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్
దినకర! వీరికోరికలు దీర్టగ నెంతయొ భారమైనయున్
బనిగొని చేయుచుండుచును బంధులమన్నన లందుకొమ్ముమా

పెనిమిటికేకలుగు,బ్రసవవేదన గడిదిన్

వినుముర కుటుంబ బాధలు
పెనిమిటికేకలుగు,బ్రసవవేదన గడిదిన్
గనగను భరించ రానిది
వనితలకున్ మరల జన్మ భరణిని సుమ్మీ

Saturday, August 28, 2021

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

చూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయా

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే

కారణమౌట జూడ,విను గామముజేయును తొత్తువానిగా

కారముగని పొందెదరు వికారము మౌనుల్

 కారము లందుగననహం

కారము బెనుకీడుజేయు కవివర, వినుడీ

పారంగతులయి దురహం

కారముగని పొందెదరు వికారము మౌనుల్

Thursday, August 26, 2021

మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

 అంగన,నాదుమాటవిను మందముబాటుగ మోక్షమందుకా

మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

చెంగటజేరి యాహరికి సేవనుజేయగ నెల్లవేళలన్

భంగముకాదు నీకదియ భావినిమేలును గూర్చుదప్పకన్

మంగలవాడే పతియగు మానుము దిగులున్

 మంగా!వినుమిది తిరునా

మంగలవాడే పతియగు మానుము దిగులున్

బెంగను వదులుమ యికనీ

చెంగటనేయుండునిజము శ్రీకరుడెపుడున్

Wednesday, August 25, 2021

నత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములొక్కజామునన్

 అత్తిలి,కొత్తపేట,తడ యాదగిరిన్వడి నేగినాదుమే

నత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములొక్కజామునన్

సత్తెపుకాలపున్,మనిషి ఛాందసమెక్కువయౌటచే దమిన్

సత్తువలేకపోయినను శక్తిని గూర్చుకు తిర్గుచుండునే

నత్త! తిరిగి వచ్చె నాలుగూళ్ళు

 బారసాల యనుచు పయనమై నాదుమే

నత్త! తిరిగి వచ్చె నాలుగూళ్ళు

కాలునిడవ కుండు కారణంబుననామె

తిరుగుచుండు నూళ్ళు ధీరయగుచు

జూడగనేగు సిగ్గుపడిచూడదు చూడకయుండ లేననున్

 వేడుక మీరగా గిరిజ భీముని మానసమందునన్ గనన్

జూడగనేగు సిగ్గుపడిచూడదు చూడకయుండ లేననున్

వీడగరాని ప్రేమయది వేవురు చెప్పిన లేదులాభముల్

వాడిగ కంతుబాణముల భారము సోకిన నంతియేకదా

చూడనేగును సిగ్గిలి చూడదయ్యె

 రాముచేతిలో ధనువది రమ్యముగను

ఫెళ్ళు మనుచును విఱుగగ బ్రీతితోడ

చూడనేగును సిగ్గిలి చూడదయ్యె

సరసి యగు సీత చెలికత్తె సన్నుతించ

Monday, August 23, 2021

వికృత రూపముల్ గలవారు ,విధుడు మరుడు

 రాహుకేతువు లిరువురు రహినిజూడ

వికృత రూపముల్ గలవారు ,విధుడు మరుడు

వారి వారల వృత్తుల నారితేరి

జగము నందున బ్రఖ్యాతులగుట వినమె?

Sunday, August 22, 2021

ప్రార్ధన

చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం 
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్ 
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్ 

by kameswararao

 

 



పరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్

దురితము లెన్నియోసతముదోర్బల మొప్పగ జేయువారిదౌ
పరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్
కరమును మేలుజేయుట సుకర్మమునౌనను భావనంబుతో
పరులను హింసజేయుటయు బర్వును దీయుట మేలుగాదుగా

పరువు దీయువారె బంధు హితులు

 సాధు జనులనెపుడు సంతోషబఱచగ

దురిత కర్మ జేయు దుష్టజనుల

పరువు దీయువారె బంధు హితులు

సాధురక్షణంబె జగతి కోరు

Saturday, August 21, 2021

స-హో-ద-రి యతిగ

 సంతసంబున రాఖీని సాదరముగ

నుర్వినిజరుపు కొనగమ హోత్సవముగ

దనదు పుట్టింట యుండెడు తమ్ముదరికి

ప్రియము తోడను వచ్చిము రిసెనుసహజ

Friday, August 20, 2021

పుళ్ళకునుప్పుకారములబూతగ నద్దిన మేలుగల్గెడిన్

 గుళ్ళకు గోపురంబులవి కూర్మిని భక్తిని నిచ్చునట్లుగా

వ్రేళ్ళకు నుంగరంబులను బ్రీతిగ దొడ్గిన నందమౌవలెన్

కాళ్ళకు చెప్పులున్ మఱియు కళ్ళకు కాటుకవోలె,బెండవే

పుళ్ళకునుప్పుకారములబూతగ నద్దిన మేలుగల్గెడిన్

పుళ్ళకు కారమ్మె మేలు పూతగ నద్దన్

 కాళ్ళకు చెప్పులె యందము

కళ్ళకునిక యందమౌను కాటుక యెపుడున్

నోళ్ళకు రుచినిచ్చెడు వే

పుళ్ళకు కారమ్మె మేలు పూతగ నద్దన్

Thursday, August 19, 2021

ధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్

ధర్మజు గూరిచిన్ విమల దానిటు చెప్పెను రామరాజుతో
ధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్
ఘర్మము నుండి వచ్చుటన గన్గొనలేకను సత్య,మట్లుగా
షర్మిళ! చెప్పెగాని,విను సాధుజనాదరణుండెయ్యెడన్

ధర్మజుండాం,జనేయుని తండ్రియెకద

ధర్మపాలన తత్పరుడార్య!యెపుడు
ధర్మజుండాం,జనేయుని తండ్రియెకద
వాయుదేవుడు నాల్లవ వాడు పంచ
భూతములయందు ప్రాణుల బ్రోచునతడు

Tuesday, August 17, 2021

జారుల నిత్యకృత్యములుసజ్జన మోదముగూర్చకుండునే

 తీరని కోరికల్ హరికి దెల్పుచుబ్రార్ధన జేయనేగగా

నోరిమితోడ నర్చకుడ యొప్పగు నాదర ణంబుతోడ మా

పేరును గోత్రమున్ నడిగి బేరిమి తోడను బూజజేయుపూ

జారుల నిత్యకృత్యములుసజ్జన మోదముగూర్చకుండునే

జారులకృత్యములగని సుజనులు మురిసిరే

 పేరును గోత్రము లడుగుచు

వారియు నిక బాలతోడ పశుపతి నెపుడున్

బేరిమి నభిషించెడుపూ

జారులకృత్యములగని సుజనులు మురిసిరే

వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్

 సాపాటులోనయీకరి

వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్

పాపా!సూనృత మియ్యది

యీపూటకునీ వుకూడ యియ్యది తినుమా

ర్వేపాకున్ గొని చేయపచ్చడి నహోవేడ్కన్ భుజింపందగున్

 పాపా!చెప్పుదునీకెయొక్కటి భారంబు నాయన్క క

ర్వేపాకున్ గొని చేయపచ్చడి నహోవేడ్కన్ భుజింపందగున్

మాపున్ జేయుమయంచు జెప్పుమ యుమామాహే శ్వరాశర్మకున్

నీపుణ్యంబును జేయగోరుదునునే- నిష్టంబుగాజేయుమా

Monday, August 16, 2021

ఇంతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా

 అంతయు మాయగానయెను నందఱు జూచుచునుండగాసభన్

నింతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా

వింతగ దోచెనాఘటన వేములవాడను జూచితే రమా!

కంతుని బాణముల్ మునికి గట్టిగనాటెనొ యేమొ యిట్లయెన్

యింతినింగౌగలించె మునీంద్రుడకట

 గాదిసూనుని దపమును గంగపాలు

జేయ,యింద్రుడు పంపగా జేరిమునిని

నాట్యమాడగ గామాన మోహితుడయి

యింతినింగౌగలించె మునీంద్రుడకట

స్వాతంత్ర్రముదొరికె విడువవా దాస్యంబున్

 తాతల కాలను పోయెను

నూతనమౌ తరము వచ్చె నొవ్వగలేలా?

మాతా!యీపని యేమిటి

స్వాతంత్ర్రముదొరికె విడువవా దాస్యంబున్ 

జాతింనేర్చెను నేమొ దాస్యమువిడం సంస్కారమడ్డొచ్చెనే

 స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీజాతికిన్

మాతా!చక్కటిప్రశ్న వేసియుమమున్ మాట్లాడకుండంగ మా

చేతన్ సత్యమువినం నోపుదువె?దాసీవోలె జీవించయీ

జాతింనేర్చెను నేమొ దాస్యమువిడం సంస్కారమడ్డొచ్చెనే

Friday, August 13, 2021

నూకలు నానిపోవుటకు నూఱుయుగమ్ముల కాలమయ్యెడిన్

 మాకనపాలెమందుగల మామిడి రంగయ పూటపూటకున్

రూకలు లెక్కపెట్టుచును రూప్యము లన్నియు లేనిచోనికన్

నాకసమంతయున్ హడలు నట్లుగ భీకరనాదుతోననెన్

నూకలు నానిపోవుటకు నూఱుయుగమ్ముల కాలమయ్యెడిన్

నూకలు నానుటకువలయు నూఱుయుగమ్ముల్

 మాకనపాలెపు యువకుని

రూకలు చేజాఱిపోవ రొప్పుచు మిగులన్

నాకము వినబడ యిటులనె

నూకలు నానుటకువలయు నూఱుయుగమ్ముల్

Thursday, August 12, 2021

సమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకై

సమరము జేయవచ్చియును శత్రుగణంబుల దూకుడుంగనిన్
సమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకై
సమయము జూచి వచ్చి మఱి సైన్యము దోడుగరాగ ,దప్పకన్
విమతుల యంతుజూసెదను భీకర యుద్ధముజేసి వారితోన్ 

సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్

అమరావతి భటుడొక్కడు
నమితోత్సాహంబునొంది యాజికి వెడలన్
విమతుల బాణపు ధాటికి
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్ 

Tuesday, August 10, 2021

దత్తపది అమ్మ-కొమ్మ-నిమ్మ-బొమ్మ

 అమ్మహామహు గృష్ణుని యాదరమున

సంధి జేయుట కొఱకునై సత్వరముగ

బొమ్మని దమకు నిమ్మనె బురములైదు

నందుకొమ్మిక బావరో వందనమని

దయను బ్రార్ధించె గృష్ణుని దర్మరాజు

శుభాకాంక్షలు


 అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగి



అప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదమ్మ!వినుము


పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
యి వ్వ ధూవరు ల నిరత మింపు మీర

 

నన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్

మిన్నగ భారతంబునిల మెప్పగునట్లుగ వ్రాసెనేగదా
నన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్
పన్నుగ గృష్ణరాయలిల భాషను లెస్సగు దెన్గులోనదా
చెన్నుగ ,నొప్పునట్లుగను జిందులుమీరగ వ్రాయకావ్యమున్

ఆంధ్రభోజుడు నన్నయ్య యనుటనిజము

ఆదికవియని నన్నయ్య నండ్రు వోలె
భాష లన్నిటి యందున ప్రధమ మైన
తెలుగు నందున కావ్యమ్ము తేజరిల్ల
ఆంధ్రభోజుడు నన్నయ్య యనుటనిజము

Monday, August 9, 2021

ఉత్తముడంచు బేర్కొని ,యయోసతిగోరుకోనెన్ విడాకులన్

 అత్తకు జేసె వందనము హర్షము నొందితి మిక్కిలిన్ మగం

డుత్తముడంచు బేర్కొని ,యయోసతిగోరుకోనెన్ విడాకులన్

జిత్తుగ ద్రాగివచ్చి పతి చిత్తుగబాదగ నెల్లవేళలన్

మత్తును గారణంబుగను మారెను నట్లుగ మంచివాడులే

డుత్తముడని,విడాకులనువిద గోరె

 సంతసించెను నెంతయో శైలజ మగ

డుత్తముడని,విడాకులనువిద గోరె

దినముదినముబీడించ పతి,సరి యైన

మార్గమనుకొని జేసెను మానవతిగ

Sunday, August 8, 2021

మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్

మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్
మదమున బల్కుచుంటివ?యమానుషపల్కులు న్యాయమా రమా
ముదమున నుంటివేయికను మూర్ఖునివోలెను బల్కుపల్కియున్
మొదటిగురుండు శంకరుడు మోమును వంచుచుమ్రొక్కుమా వెసన్

మరుని కంటిమంట మాడ్చెశివుని

మూర్ఖుడొకడు పలుక మోమోటముబడక
మరుని కంటిమంట మాడ్చెశివుని
నొజ్జ చెప్పెనిటుల యోరి!వినుము
మరుని సంహ రించె హరుని కన్ను

Saturday, August 7, 2021

జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్

 విమల మనంబు గల్గుచును వెన్నెలవోలెను వెల్గునాసతిం

జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్

మమతలె యుట్టి చెందగను మాన్యతతోడను జిత్రమందులీ

నమయినరీతి చిత్తమున నాట్యముజేయుచు నుండునేగదా

జమున జూడ విజయశాంతిదక్కె

 నాదు మనుమరాలు నాట్యమాడగనిన్న

యూరివారలపుడ యుత్సుకతన

వేయి విధములుగను వినుతించ ముఖపంక

జమున జూడ విజయశాంతిదక్కె

Friday, August 6, 2021

వనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే

 వినయంబొప్పుచు దానధర్మములు దావేవేగ గావించుపా

వనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే

వినుచో సత్యము మీరలందరును భోవీరేశ్వరాయా!వెసన్

గనగన్ సౌఖ్యములన్నియున్ ధరనువేకైవశ్యమౌధరన్

వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే

 అనయము శివునిం జూచుచు

మనమున ధ్యానించుచుండు మనుగడ గలరై

వినయము దానములను పా

వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే

Wednesday, August 4, 2021

అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రులక్షణ మందురెల్లెడన్

 సతతముగౌరవించుచును సజ్జనభావము గల్గుచుండగా

నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రులక్షణ మందురెల్లెడన్

మతిచెడువాని పల్కులవి మర్మపుమాటలు బల్కనోపునే

యతివినయమ్ము లాంధ్రులని హారతులిచ్చెను దేశదేశముల్

అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

 సతతము గలహము లాడుచు

నతలాకుతలంబుజేసి యాప్తుల యాస్తుల్

నతులను జేయుచు నెదుటన

అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

Tuesday, August 3, 2021

దున్నను,సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్

అన్నరొ గడ్డివాములకు నడ్డము వచ్చెనుగట్టుమా వెసన్
దున్నను,సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్
గన్నులు మూసిదెర్వగనె గాంచుడు దారమునిప్పుడే వెసన్
నెన్నగ జాలకష్టమిది యేబది యేండులు దాటువారికిన్

దున్ననుదున్నను,సూచీబిలమున దూర్చెదగనుమా

అన్నా!కట్టుమ ఱాటికి
దున్నను,సూచీబిలమున దూర్చెదగనుమా
కన్నుంగవ మూసితెఱచి
కన్నంతనె బాల!యిపుడె కలకాదుసుమా

 

Monday, August 2, 2021

తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో

పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్
తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో
కట్టడి జేయగా దగును కబ్బములెన్నియొ వ్రాయుకంటె దా
పట్టును గల్గుపద్యములు వ్రాయగనుండువిధంబుగానికన్

తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?

,చట్టున నర్ధము నగుచును
బిట్టగు భావంబు గలిగి భేషుగ దనరన్
బట్టును గల్గుచు నికమది
తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?

Sunday, August 1, 2021

ఎవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో

 జవరాండ్రందఱి కోకలన్ గవిసి వశ్యంబునగావించువా

డెవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో

యవనీనాధుడు కాడొకో దలచస్వర్గాధీశుడోగృష్ణుడో

వివరం బొప్పగ దెల్పుమా కమల! వేవేలంగ బ్రార్ధించెదన్

ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే

కవనము జెప్పెద వినుడీ

భవితను గుఱిచియు నికగతిఫలముల గూర్చిన్

వివరముగ నని పలుకువా

డెవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే

పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్

కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్
పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్
బలమగు గొల్సుచేత ,నికవంతలు బెట్టక లొంగియుండుగా
గలనున సైతమున్ బసిరిగడ్డిని జుల్కనజేయ యొప్పునే

గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు

గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు
దెలివి తేటలు గల్గుచో దేనినైన
జేయ వచ్చును ,మృగరాజు సింహమరయ
చంపబడెనుగా గుందేలు చర్య వలన

Friday, July 30, 2021

శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

 శాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్

భ్రాంతిని నొంది యట్లుగను బల్కిరి వారలు నమ్మబోకుడీ

శాంతిని గాకవా రిడు నశాంతిని నట్లుగ బోధజేయుచున్

శాంతిసతమ్ము శిష్టజన సౌఖ్యమె యిచ్చునుదప్పకుండగన్

శాంతి సతతమ్ము, దుర్జన సౌఖ్యదమ్ము

 సౌఖ్యమిచ్చును దప్పక సర్వులకును

శాంతి సతతమ్ము, దుర్జన సౌఖ్యదమ్ము

పరులు దుఃఖము తోడను బాధపడుట

దుర్జనసహవాసమ్మున దురిత మబ్బు

భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచగన్

 భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమార్జునుల్ గాంచగన్

భీష్మద్రోణు లనంగ గౌరవులకున్ బేరాశ యుద్ధంబునన్

చష్మాయుండెడు వీరవర్యులనుచున్,సంతోషమందుండగా

భీష్మద్రోణుల సంగరంబునగునేభీమార్జునుల్ జూడగా


భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్

 చష్మాలేకయె యిట్లనె

భీష్మద్రోణుల సమరము భీముండు గనెన్

భీష్మద్రోణుల నెయ్యము

కూష్మాండపు విత్తువోలె గురుతర మగునౌ

Wednesday, July 28, 2021

ల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

వాలము లేకయుండగను వానరమూకల జెక్కు పుత్రునిన్
చాలును శిల్ప చెక్కడము శ్రద్ధగ బొమ్మిక పాఠశాలకున్
మేలగు జీవితంబునకు,మెప్పును బొందెద వంచు బల్కిశి
ల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

ల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై

వాలమురహి వానరముల
బాలుడు దాజెక్క శిలనుబంధువు మిగులన్
హేళన జేయుచు నాశి
ల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై

Monday, July 26, 2021

వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణంబయ్యయో

 విసుగుం జెందక ప్రత్యహంబునిట దేవేరిన్ మనంబందునన్

నసమానంబగు రీతినిన్ దలచి యాహాహా యనంగానికన్

బసయౌనట్లుగ వ్రాయబూనుదును నాపద్యంబు లన్నింటినిన్

వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణంబయ్యయో

వ్యసనమిది సమస్యాపూరణా చరణము

 వ్యసనమిది సమస్యాపూరణా చరణము

సత్య మయ్యది జూడగ శంకరార్య!

లేని దినమది దుద్దిన మౌను మాకు

కనుల విందౌను గనిపించ దినము దినము

Sunday, July 25, 2021

మరణము గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో

 భరణము నీయలేదనుచు భర్తయె దానుగ గెంటివేయగా

మరణము గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో

యరయగ దెల్సె నాకిపుడె హర్షకుమార! దయార్ద్రదృష్టితో

నురమునబెట్టుకొందువనియూపిరియుందెడునంతకాలమున్

మరణమ్మును గోరివచ్చె మానిని గనుమా

 భరణమునకు పీడించగ

మరుమాటల్ బలుకలేక మనసది మిగులన్

బరువై మమతలు సంపుచు

మరణమ్మును గోరివచ్చె మానిని గనుమా

Saturday, July 24, 2021

ముద్దుగ నాణిముత్తెమది ముక్కునజేరినజూచి మెచ్చితిన్

 ముద్దుల మూటగట్టునటు మోదము తోడను నీయయానగన్

దద్దయు సంబరంబడుచుదానది నాసిక కున్ దగన్ నిడన్

ముద్దుగ నాణిముత్తెమది ముక్కునజేరినజూచి మెచ్చితిన్

నద్దిర వారిసంతసమె యందరి డెందము లుల్లసిల్లుగా

ఆణి ముత్తెము ముక్కుపై నమరి యుండె

 పిల్ల కోరిక మేరకు నుల్లమలర

ధవళ కాంతుల మెఱయుచు దళుకులీను

నాసికాభరణము నీయ నారి యపుడు

ప్రేమతోడను ముక్కుకు పెట్టు కొనగ

నాణి ముత్తెము ముక్కుపై నమరి యుండె

Friday, July 23, 2021

తలపగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమా

 పలువిధ పాపకార్యముల బాధితు జేయగ బూనువాడిలన్

తలపగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమా

యిలనజరామరంబగుచు నెల్లెడగారవమొందుచుండుచున్

బలువురిచేత మన్ననల వాసిగడించుచు బ్రీతినొందుగా

గురుదక్షిణ నొసగువాడు,గ్రూరుండుగదా

 అరుదుగ నుండును భువిలో

గురుదక్షిణ నొసగువాడు,గ్రూరుండుగదా

నిరతము దుష్టుని వోలెను

బరులను బాధించునతడు పండితుడైనన్

చెంగటనున్న గంగని సిసీయని రోసి మునింగె కాల్వలోన్

 గంగకు డెందమున్ జెడగ గానని చోటులు దిర్గుచుండుచున్

చెంగటనున్న గంగని సిసీయని రోసి మునింగె కాల్వలోన్

భంగము నొందు భామలిల వారల చేష్టల వారి భావముల్

మంగపతీ! గనంబఱగ మంజుల రీతిని దెల్పుచుందురే

గంగమ్మను రోసి మురుగుకాల్వను మునిగెన్

 గంగకు మతి చెడిపోవగ

గంగమ్మను రోసి మురుగుకాల్వను మునిగెన్

భంగము నొందిన వారల

భంగిమ లునునటు లెయుండు బరికింపంగన్

Wednesday, July 21, 2021

భానుని గాంచినంతటనె,భానుడు బిట్టు వడంకెభీతుడై

 ఆనన మందుగల్గెగడు హర్షముశంకర! యొక్కసారిగా

భానుని గాంచినంతటనె,భానుడు బిట్టు వడంకెభీతుడై

కాననమందుగల్గు పులి గ్రామపు మధ్యన గానిపించగా

మేనున జూడనయ్యెడను మీదికి రోమము లన్నియున్ నెగన్

Tuesday, July 20, 2021

భానుని భానుండు గాంచి వడవడ వడకెన్

 కోనలు గొండలు దాటుచు

పూనకమది వచ్చునట్టి పురుషుని వోలెన్

వేనయగారములయలరు

భానుని భానుండు గాంచి వడవడ వడకెన్

Monday, July 19, 2021

ముద్దులుమూటగట్టునటు మోదము తోడనువచ్చెనేసుమా

 వద్దుర వద్దురాభరత! పండుగ జేయగలేనుగావునన్

వద్దని యెంతవేడినను వచ్చెడివాడెస్తుతింపనర్హుడౌ

పెద్దలయందునన్ మిగుల పేర్మియు గారవముండు గావుతన్

ముద్దులుమూటగట్టునటు మోదము తోడనువచ్చెనేసుమా

వద్దన్నను వచ్చువాడె వంద్యుండుగదా

 ఇద్దరము రోగయుతులము

వద్దుర జోగయ్య యిచటపని లేకుండన్

చద్దుల మూటను బట్టుకు

వద్దన్నను వచ్చువాడె వంద్యుండుగదా

Sunday, July 18, 2021

ద్రాగెడు వారలెల్లరకుదానగు నెప్పుడు రామరక్షయై

 రాగముగల్గియున్ శివునిరంజిలజేసెడుఋభక్తిధారనున్

ద్రాగెడు వారలెల్లరకుదానగు నెప్పుడు రామరక్షయై

భోగము లన్నియున్ వదలి పూర్ణమనంబున నెల్లవేళలన్

ద్యాగయ,రామదాసులిల ధార్మిక వృత్తిని రాముగొల్చిరే

త్రాగుబోతుల కదియె శ్రీరామ రక్ష

 పీక నిండిన సారాయి పెదవిజేరి

యెంత తిట్టిన గొట్టిన నెంత వాగ

వారి జోలికి వెళ్ళరు బంధు గణము

త్రాగుబోతుల కదియె శ్రీరామ రక్షభొ

Saturday, July 17, 2021

వనధికి సాగరమ్మునకువార్ధికి నబ్ధికి నంబురాశికిన్

 వినయముతోడ మర్కటము వేనకువేలుగ సంతసంబునన్

మననము జేయుచున్ మదిని మైధిలి భర్తను ,రాళ్ళువేయగా

ననువగు వారధిన్వలెను నడ్డుగ నేర్పడెగాదె చూడగన్

వనధికి సాగరమ్మునకువార్ధికి నబ్ధికి నంబురాశికిన్ 

వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

 మననము జేయుచు రాముని

వినయముతో కోతిమూక విసరగ రాళ్ళన్

ననువగు వంతెన యాయెను

వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

సంతాపముదెల్ప నొప్పు జన్మదినమునన్

  • జన్మదినశుభ సమయాన శంకరుండ
    యాయు రారోగ్య సంపదల్ హర్ష మొదవ
    యిచ్చు గావుత శంకర! యిహమునందు
    వందన శతము లీయవి యందుకొనుము

    ప్రత్యుత్తరంతొలగించు
  • అంతయు మిధ్యయె పుడమిని
    సంతును నిక నాలుమగల సంబంధమునున్
    వింతయె,నగుచోనెటులుగ
    సంతాపముదెల్ప నొప్పు జన్మదినమునన్

    ప్రత్యుత్తరంతొలగించు
  • ఆపగరాని దుంఖమిడి యాప్తుడు సద్గుణు డంతమొంద,సం
    తాపముదెల్పగాదగును దప్పక,జన్మదినమ్మునన్ సఖా!
    పాపము జేయనెప్పుడును భద్రము జేతును నంచు నాభవున్
    బ్రాపును గోరుచున్ భువిని రక్షణ నిమ్మనిఋవేడుకొమ్మికన్

  •  

    Thursday, July 15, 2021

    వనితం బోల్చగ నొప్పునాకవితతో వారింపనొప్పున్ గవీ!

    వనితం బోల్చగ నొప్పునాకవితతో వారింపనొప్పున్ గవీ!
    వనితం బోల్చగ న్యాయమే కవితతో వారింప వీలయ్యెనే?
    వనితల్ సూడగ సౌకుమార్యమును భావావేశ చిత్తంబుతో
    ననయంబబ్బుర మైన యాకవితలభ్యాసంబు గావించుటన్

    వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ!

     వినుడీ విషయము శారద!

    వనితయు మఱి కవితయనగ బహు కోమలముల్

    కనుకను బాడియె యీయది

    వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ!

    Wednesday, July 14, 2021

    కారాగారమున బుట్టెగద,కర్ణుండే

     క్రూరుల శిక్షకు శ్రీపతి

    కారాగారమున బుట్టెగద,కర్ణుండే

    వీరుడు భీభత్సునితో

    బోరుసలిపి పరమపదము బూర్తిగ బొందెన్

    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్

     శ్రీరామా కరుణించ వాయిక ప్రభో సీమాంధ్రవారిన్ దగన్

    వారీరీతిగ నిచ్చుచుంటిరి యిటన్ వారింప వీలుండునే!

    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్

    నౌరాబంధము జెప్పరానిది గదా కర్ణుండు గాధారికిన్

    తెలివి రవంత లేకయె సుధీవరుడన్న ప్రశస్తి నందితిన్

     తెలివి రవంత లేకయె సుధీవరుడన్న ప్రశస్తి నందితిన్

    తెలివి యొకింత లేదనుచు ధీరతబల్కితివమ్మ! కానినా

    బలుకులు విశ్వసింపుచును భక్తిని శంకరు వేడుకున్నచో

    దెలివది వచ్చి శీఘ్రము,సుధీవరుడన్న ప్రశస్తి సత్యమౌ

    Tuesday, July 13, 2021

    తెలివి రవ్వంత లేని సుధీవరుండ!

     తెలివి రవ్వంత లేని సుధీవరుండ!

    తెలివి తేటల తోడను మెలగుమయ్య!

    సంతసింతురు బంధువుల్ సక్కగాను

    తెలివి హీనుని జూతురు చులకనగను

    Monday, July 12, 2021

    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

     చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

    చదువే యిచ్చును నేర్వుమా కమల! సంస్కారంబు సౌశీల్యమున్

    విదితంబేయిది నీకు వేరుగను సమావేశంబు గావించినీ

    మదికిన్ జెప్పగ జాలనేనిపుడు సామాన్యంబు గుర్తించుమా

    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్

     చదివితిరిగ మీరిట్లుగ

    చదువగ సదసద్వివేక చతురత కలుగున్

    విదితమయయి యిటులంటిరె!

    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    Sunday, July 11, 2021

    మానిసి మానుషము వీడి మర్కట మయ్యెన్

     కానగ దెలిసెను రమ్యా!

    మానిసి మానుషము వీడి మర్కట మయ్యెన్

    నౌనని,జెప్పక తప్పదు

    మానిసి మానిసి గనుండ మగటిమ యగునున్

    Saturday, July 10, 2021

    వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందున్ గదా

    దృగ్వ్యాపారమె యంచు దానెఱిగి సంతృప్తిన్సిన్సు వర్జించు నా
    వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందున్ గదా
    వాగ్వ్యాపారము జెల్లదెచ్చటను నోభామా దగన్ నేర్వుమా
    వాగ్వ్యాపారము మాని చేరుమ యికన్ వారాణసీ యంగడిన్

    వాగ్వ్యాపారమ్ము, లేనివాడె బుధుండౌ

    దుగ్వ్యాపా రంబౌ సుమ
    వాగ్వ్యాపారమ్ము, లేనివాడె బుధుండౌ
    వాగ్వ్యాపారంబుల జల
    వాగ్వ్యాపారంబు వలదు భరణిని వినుడీ

    Friday, July 9, 2021

    మీకును మీకుమీకుమఱి మీకును మీకును మీకుమీకునున్

     సోకులు మానుచున్ యువత సౌఖ్యము తోడను నుండగోరుచో

    దేకువగల్గి వారలిక ధైర్యము తోడను మెల్గుచుండినన్

    శ్రీకర సంపదల్ దరికి జేరును శంకరు సత్కృపన్ సుమా

    మీకును మీకుమీకుమఱి మీకును మీకును మీకుమీకునున్ 

    మీకుమీకును మీకును మీకుమీకు

     ముక్కు నోరును నిరతము మూయకుండ

    దేశ సంచారమయ్యది తీవ్రమైన

    ప్రాణ హానిని గలిగించు భవ్యులార!

    మీకుమీకును మీకును మీకుమీకు

    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో

     పరధర్మంబిడు భీతినంచుహరిదా పల్కెన్ గదాగీతనన్

    మరియీ మాటలు బల్కగా దగునె భామా!నీకు నేమాయెనే

    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో

    యిరవు బొందనీ మాటలాడగను నేదేనింగలంగంటివా?

    Thursday, July 8, 2021

    పరధర్మమె మేలని హరివలికెను గీతన్

     పరధర్మం బిడు భయమని

    హరియే చెప్పంగగీతయందున భామా!

    తిరకాసు మాటలీయవి

    పరధర్మమె మేలని హరివలికెను గీతన్

    త్రుంచెను కృష్ణుడాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్

     ఎంచగ లెక్కకున్ శతము మీరిన ఛేదినృ పాలునిన్

    త్రుంచెను కృష్ణుడాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్

    మంచిగ గూర్చెనాజగము బాలన జేసెడు నందపుత్రుడే

    యంచిత భక్తినిన్ గొలువ యాయువు సంపద నిచ్చుదప్పకన్

    Wednesday, July 7, 2021

    చెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్

     అడుగుచు నుంటిని జెప్పుమ

    బడుగుంవలె మాటలాడ భావ్యమె జ్యోతీ!

    బిడియము లేదే యిటులన

    చెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్

    Tuesday, July 6, 2021

    తేనీరే,యిడనొప్పుదేవళములో దీర్ధంబుగా నెప్పుడున్

    నానీ! కంటివె,యిత్తురెప్పుడు మఱిన్ నారంబుగానచ్చటన్
    తేనీరే,యిడనొప్పుదేవళములో దీర్ధంబుగా నెప్పుడున్
    మాన్యంబౌ తులసీ రసంబును నికన్ మందుంగ జీరంబునున్
    బానీయంబుగ నీయ పొందురుగదా భక్తాళి కైవల్యమున్

    తేనీరే,తీర్ధమగును దేవునిగుడిలో

     ప్రాణంబు నేటి యువతకు

    తేనీరే,తీర్ధమగును దేవునిగుడిలో

    పానకము,తులసిజలములు

    శ్రీనాధుని కిష్టమైన చెఱకు రసమ్ముల్

    Monday, July 5, 2021

    తమకుందాముగ గొయ్యిత్రవ్వుకొనుటే తధ్యంబుగా మేలగున్

     తమకం బొందిన మానసంబునయి తాదాత్మ్యంబుతో నిద్ధరన్

    మమకారంబును బొంది మొక్కలనుదామాన్యంబుగాబాతుచో

    దమకుందాముగ గొయ్యిత్రవ్వుకొనుటే తధ్యంబుగా మేలగున్

    రమయుం సంతస మొందుచున్ నిడును నార్యాసంపదల్ మెండుగా

    గొయ్యి దమకుదామే త్రవ్వు కొనుట మేలు

     మొక్క నాటెడు ఫలితమ్ము బొందగోర

    గొయ్యి దమకుదామే త్రవ్వు కొనుట మేలు

    ఫలిత మెటులున్న జేసిన భవ్యు డెఱుగు

    నేది యెవరికి యర్హతో యిచ్చు నదియ

    మతిసెడినట్టి వారలకు మాధవుడేనిజమైన దేవుడౌ

    వితరణ బుద్ధితోడనిల వేలకువేలుగ దానమీయగా
    బ్రతిదిన మట్లు జేయగను బాడియు పంటలు సొమ్ము లన్నియున్
    నితరుల బాలికింజనగ నించుక లేమికి భీతు డై దగన్
    మతిసెడినట్టి వారలకు మాధవుడేనిజమైన దేవుడౌ

    Sunday, July 4, 2021

    మతిసెడిన వారి దైవము మాధవుండు

     ఆర్జిత మిసుమంతయులేక యవని యందు

    పొట్ట జేతబట్టి తిరిగి పొందలేక

    గుప్పె డన్నమ్ము నెచటను ,గుండెపగిలి

    మతిసెడిన వారి దైవము మాధవుండు

    చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణునున్ గ్రుధన్

    చంపెను రాఘవుండు దన సఖ్యము గోరు విభీషణునున్ గ్రుధన్
    నింపగు లంకనున్ గెలిచి యిచ్చెవిభీషణుగైవశంబుగా
    చంపుట రాఘవుండకట సాధ్యమె చెప్పుమ నీవయిత్తఱిన్
    బెంపును జూడు రామునిట భీకర మాటలు న్యాయమే రమా!

    Saturday, July 3, 2021

    చంపెను విభీషణుని రామచంద్రుడలిగి

     రామ చంద్రుడ యెవరిని రణమునందు

    చంపెననిబ్రశ్నింప పలికె జట్టు నిటుల

    చంపెను విభీషణుని రామచంద్రుడలిగి

    యేమి చదువులు నేర్తురొ?యేమొ వీరు

    Friday, July 2, 2021

    విడువక బంధుగణములను వేధించంగన్

     కడుకఠినమనస్కులగుచును

    విడువక బంధుగణములను వేధించంగన్

    బడతులు కితాబు నిచ్చిరి

    దుడుకడు కాపురుషుడులిపి ధూర్తుడు ఖలుడున్



    విడువక యెల్లవారలను వేదనకున్ గురిజేయ యాతనిన్

    దుడుకడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్

    గడుకఠినుండునా యనుచు గాంతలు చెప్పులు వేసి వానిపై

    విడువుము గ్రామమంచు నికవేగమె పొమ్మనిరందఱు

    చెడనిది,పాంచభౌతిక విశిష్ట శరీరమె సర్వ మంతమౌ

     ఎడపక విష్ణునామమును నెల్లపుడంచితమౌవిధంబుగా

    నడరిన భక్తి గల్గుచును హర్షము నొందెడుఫక్కి బల్కునా

    తడుధర బుణ్యవంతమును ధార్మికులందున గారవంబునున్

    చెడనిది,పాంచభౌతిక విశిష్ట శరీరమె సర్వ మంతమౌ

    చెడదుతనువు సర్వముగన జెడుతధ్యముగన్

     ఎడదను శివునిం దలచుచు

    నడలిన దగు భక్తితోడ నారాధించన్

    నిడుములు గలిగిన నెపుడును

    చెడదుతనువు సర్వముగన జెడుతధ్యముగన్

    Thursday, July 1, 2021

    నోములునోచి పొందితిని,నూత్నములౌ దురవస్ధలెన్నియో

     కామిత వస్తువెల్లయును గౌరిని గూరిచి నిష్ఠతో ధరన్

    నోములునోచి పొందితిని,నూత్నములౌ దురవస్ధలెన్నియో

    మామకు మారునున్ వలచి మంచిగ బెండ్లియాడగా

    కామపిశాచియై పలువికారపు చేష్టల బొందితిన్ సుమా

    Wednesday, June 30, 2021

    నోచి పొందితి గష్టముల్ నూతనముగ

     సెనగ నోమును భక్తితో గనులలరగ

    శాస్త్ర విధులను దప్పక శ్రద్ధ తోడ

    నోచి పొందితి గష్టముల్ నూతనముగ

    చిన్ని కొమరుడు మరణించ సెనగ వలన

    Tuesday, June 29, 2021

    సుంతయు బ్రేమలేని పతిజూచి సతీమణి,పొందు మోదమున్

     చింతను బొందుదా మీగుల జీవిత మెట్లుగ నీడ్తునంచికన్

    సుంతయు బ్రేమలేని పతిజూచి సతీమణి,పొందు మోదమున్

    వంతలు లేక జీవితము బాగుగ సాగుట కారణంబుగా

    చింతలు లేక యుండుటయ శ్రేయము పృధ్విని నెల్లవారికిన్

    ప్రేమ లేనిమగని జూచి భామ మురియు

     అన్య కాంతలు గోరిన నైచ్ఛికంపు

    ప్రేమ లేనిమగని జూచి భామ మురియు

    దనకు తోడుగా దనభర్త మనగ వలయు

    ననుచు గోరుకొందురుగద యతివలెపుడు

    Monday, June 28, 2021

    వరములనిచ్చి దుష్టులకు వాసిగ డించితి వెట్లు శంకరా!

     అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్

    విరివిగ నిచ్చుచుంటివిల వేలకువేలు వరంబు లొక్కెడన్

    ఖరులగు వారలెప్పుడును ఖర్కశ వృత్తిని జేటు జేతురే

    వరములనిచ్చి దుష్టులకు వాసిగ డించితి వెట్లు శంకరా!

    వరములిడి దుష్టులకు శివ వాసిగంటె

     ధరగజాసురునకు దయ వరమునిచ్చి

    ప్రాణ హానికి గుఱియయి భయప డితివి

    యేమి ఫలితము గలిగెను నేమి నీకు

    వరములిడి దుష్టులకు శివ వాసిగంటె

    Sunday, June 27, 2021

    తొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్

     సులువగు మార్గము సుగతికి

    తెలిపిరి మనగురువుగారు తీయటి కబురున్

    కలగా భావించక విను

    తొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్

    దురితము లెల్లబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో

     దురితము లెల్లబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో

    నరయుము గొంతపాపమది యాక్షణమందున బోవు నిక్కమే

    యిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుటన్

    కరమును సంతసించుచును గాంక్షలుదీరగ బుణ్యమబ్బుటే

    Saturday, June 26, 2021

    కాంతుని గాంచినన్ మొగము గాంతులు దప్పెగళావిహీనమై

     కాంతుని రూపమందలరి కాంతయహల్యను జేరునింద్రునిన్

    సంతస మొప్పగా గలిసి సర్వసు ఖంబులు బొందనంతలో

    కాంతుని గాంచినన్ మొగము గాంతులు దప్పెగళావిహీనమై

    వింతగ నిట్లుమాయవడి వేడుక జేయుట పాపమే కదా

    కాంతుని గనినంత మొగము కాంతులు,దప్పెన్

     కాంతకు తళతళ మెఱసెను

    కాంతుని గనినంత మొగము కాంతులు,దప్పెన్

    గాంతులు మొగమున భామకు

    కాంతుడు పరదార గమన కాముకుడౌటన్

    చెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీధులన్

     మక్కికి మక్కిగా దొలక మార్చుచు జెక్కగ బొమ్మగాను,నా

    చెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీధులన్

    జక్కగ పూర్వకాలమున సర్వులు సంతస మొందగా,పురిన్

    జెక్కిన బొమ్మలన్ కదిపి చేతనరీతిని ద్రిప్పుచుందురే

    Friday, June 25, 2021

    చెక్కి నట్టి బొమ్మ సేసె నటన

     తోలు బొమ్మ జెక్క తోపిక తోలుతో

    చెక్కి నట్టి బొమ్మ సేసె నటన

    పూర్వ కాల మందు పర్వదినములలో

    గ్రామ గ్రామ మందు కద్దు సుమ్ము

    పూజల రోయునాస్తికుడె,పొందును మోక్షము నిశ్చయమ్ముగన్

     భాజను డౌను నిక్కముగ బాపపు కూపము జేరుదప్పకన్

    బూజల రోయునాస్తికుడె,పొందును మోక్షము నిశ్చయమ్ముగన్

    బూజలు భక్తితో నెవరు పూనిక తోడను జేతురో,యికన్

    నాజగదీశు నామమును నార్తిని గానము జేయువారలున్

    Thursday, June 24, 2021

    పూజల నిరసించు వాడె మోక్షము నందున్

     పూజించుటకును బదులుగ

    పూజించెడు వారుభువిని మూర్ఖులె యనుచున్

    నాజన్మము రిపుడౌచును

    పూజల నిరసించు వాడె మోక్షము నందున్

    ఇంద్రసతి, భానుమతి మ్రొక్కె నెల్లరకును

     విను శచీదేవియేగద విమల చరిత!

    యింద్రసతి, భానుమతి మ్రొక్కె నెల్లరకును

    దనదు పెండ్లికి మోదాన తరలి వచ్చు

    దేశ దేశాల ప్రభువులు,తెరువరులకు

    ఇంద్రునిభార్య,భానుమతి యెల్లరకుంబ్రణమిల్లె భక్తితోన్

     చంద్రుని బింబమున్ వలెను జక్కటి రూపుననుండునామెయే

    యింద్రునిభార్య,భానుమతి యెల్లరకుంబ్రణమిల్లె భక్తితోన్

    నింద్ర సమాన తేజులగు హైందవరాజుల రాకతోనొగిన్

    చంద్రముఖారవిందయయి సంతస మప్పుడు పిక్కటీల్లగన్ 

    Tuesday, June 22, 2021

    కదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

    ఎదుటన పాము జూసిన నరేంద్రుడు భీతిని నొక్కసారిగా
    నెదకు భయంబు గల్గుట నహెచ్చుగ రక్తము పాఱుచుండుటన్
    గదలగ రక్తనాళములు గ్రక్కున నుబ్బుచు దేహమంతటన్
    గదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్ 

    కదలనివాడె పరుగెత్తె గడు వేగముగనన్


    ఎదుటన బామును జూడగ
    హృదికిన్ భయముగ లుగంగ ,హెచ్చుగ బీపీ
    నదుముకొ నంగను నంతన్
    కదలనివాడె పరుగెత్తె గడు వేగముగనన్

     

    కోడిని గోడిమ్రింగె గనుగొన్న జనుల్ సహజమ్మటందురే

     కోడిని గోడిమ్రింగె గనుగొన్న జనుల్ సహజమ్మటందురే

    చూడగ నిట్టులే ధరను జోద్యము లెన్నియొ జర్గుచుండు,నే

    నాడొవచించె గా మనకు నైతిక గుర్వులు వీరబ్రహ్మమున్

    బాడియ నంగ గానమిక వ్యర్ధుల రాజ్యము సాగునీ ధరన్

    కోడినిన్ మ్రింగె,నొకకోడి సూడజనులు

     గ్రద్ద యొక్కటి ధరదిరు గాడునట్టి

    కోడినిన్ మ్రింగె,నొకకోడి సూడజనులు

    గ్రుడ్లు వెట్టెను దెల్లటి రంగు గలవి

    మెఱయు చున్నవి దళదళ మెఱుపు తోడ


    Sunday, June 20, 2021

    మందరపర్వతము నొకమానిని నింద యొనర్చె గిన్కతోన్

     మందర పర్వతంబిడెను మాన్యత నొప్పగ నమృతంబునున్

    నందఱి దేవతాళికిని నాయతరీతిని నంచుబల్కుచున్

    నందఱి కన్నియిచ్చి,దనుహర్షము నొందగ నీయకుండగా

    మందరపర్వతము నొకమానిని నింద యొనర్చె గిన్కతోన్

    మందరపర్వతము,నొక్కమానిని దిట్టెన్

     కందుకము వోలె నుండును

    మందరపర్వతము,నొక్కమానిని దిట్టెన్

    నందఱు నుండగ సభలో

    మందుడు మూర్ఖుడు నగునొక మంత్రిని బాధన్

    చి.సౌ.ఉషా హవీష్ ల వివాహపు శుభాకాంక్షలు


    అమ్మా  ఉషా!

    తల్లి దండ్రుల గారాబు తనయ వగుచు
    ముద్ద మందార పుష్పమై ముద్దులొలుకు
    బాల! కుడిచేయి చిటికెన వ్రేలు నిచ్చి
    యధిక సుఖమును బొందుమా హవిషుతోడ

     పుట్టినింటనుమెలగిననట్లుగానె
    మెట్టినింటనుగూడనుమెలగుమమ్మ
    యాదిదంపతిసములగునత్తమామ
    లాదరించుమునిరతముహర్షమొదవ

     అమ్మనాన్నలవిడిచియునరుగుదేర
    బెంగయుండునునిజమది బేల!నీకు
    అత్తలోనన జూచినయమ్మనికను
    బాధయుండదుగదనీకుపచ్చినిజము

     మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
    మానినుల యందగుచు  దల  మానికముగ
    పిల్ల పాపల తోడన  చల్ల గాను
    నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున

     సకల శుభములు గలిగించు శంకరుండు
    నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
    ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

     రచన::పోచిరాజు సుబ్బారావు
    హైదరాబాదు

    Saturday, June 19, 2021

    నెత్తురటంచు ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

     నెత్తురటంచు ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛనీరమున్

    నెత్తురు ద్రాగగోరుచును నీరముద్రాగెను జిత్రమయ్యెడిన్

    చిత్తము నందు జూడగను జిత్రమ యాయెను రాక్షసాంగనౌ

    మత్తున నుండుచున్ నటుల మార్చుచు ద్రాగెను దైవమోపెడున్

    నీరమునుద్రాగె జలజాక్షి నెత్తురనుచు

     పూర్వ జన్మము రాకాసి భూత మేమొ

    కళ్ళు కామెర్లుగ్రమ్మగ గానబడక

    నీరమునుద్రాగె జలజాక్షి నెత్తురనుచు

    జన్మ ఫలితమ్ము గనిటుల జరిగెనిపుడు

    Friday, June 18, 2021

    కన్యంగూడంగ దొలగు ఘనపాపమ్ముల్

    అన్యుల వోలెం బలుకగ
    మన్యంబున నుంటెయమల! మాన్యత లేమిన్
    గన్యల గూరిచి యిట్లన
    కన్యంగూడంగ దొలగు ఘన పాపమ్ముల్?

    కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురే

    కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురే
    కన్యంగూడిన వచ్చు గర్భము గదా కాదందురా మీరుభో
    మన్యంబందున నుండు వారల వలెన్ మాట్లాడన్యాయంబు నే?
    కన్యంగోరుట ధర్మమారవి!యికన్ గౌరింగ భావింపుమా

    Thursday, June 17, 2021

    మేకను గాంచి సింహమదె,మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్

    వేకువ ఝామునన్ గుహను వీడుచు ముందుకు దూకెనొక్కటన్
    మేకను గాంచి సింహమదె,మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
    నాకుల నాహరించుటను నాహరిణంబట యాపుచున్ వెసన్
    భీకర మౌవిధంబుగను వేలకొ లందిగ నంగలేయుచున్

    మేకనుగని,జడల మెకము వాఱె

     జడల మెకము దూకె సరగున ముందుకు

    మేకనుగని,జడల మెకము వాఱె

    వేట గాడు శరము వేవేగ సంధించ

    భయము తోడ వడిగ వనికి యపుడు

    జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదులేదుపో

     మనము చలించగా నొకడు మాన్యత లేకను బల్కెనిట్లుగా

    జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదులేదుపో

    యనగను నమ్మువారలును,హర్షముజెందెడు వారలుందురా?

    వినుముర రామరాజ్యమును బృధ్విని నాఃధ్రమునందు జూడుమా

    Wednesday, June 16, 2021

    సౌఖ్యమేలేదు రామ రాజ్యమ్ము నందు

     రాముడే పోవలసి వచ్చె భామతోడ

    దండకారణ్య వాసంపు తమము తోడ

    రావణాసురి చేష్టలు రచ్చ యగుట

    సౌఖ్యమేలేదు రామ రాజ్యమ్ము నందు

    Tuesday, June 15, 2021

    కోడలి కత్తయుంజెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే

    చూడగ లేమువారలను జూడ్కులకందరు చెల్మితోడయున్
    వీడరు పెత్తనంబులను వేరుగ నుండుట కిచ్చగింతురే
    వీడును వాడునున్ ననక పెంపగు గర్వము గల్గియుండుటన్
    కోడలి కత్తయుంజెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే

    కోడలికత్తకును జెలిమి ,గూర్చునె యజుడున్

    వీడని బంధమె యాయది
    కోడలికత్తకును జెలిమి ,గూర్చునె యజుడున్
    పోడిమిగల యాలక్ష్మికి
    చేడియయౌ శారదాంబ చేరికయౌటన్

    హరినీవే శరణంచు వేడిరట,దైత్యశ్రేణి సద్భక్తితోన్

     స్ధిరమౌ నీవని భక్తులెల్లరును నీసేవఃదగన్ జేయుచున్

    హరినీవే శరణంచు వేడిరట,దైత్యశ్రేణి సద్భక్తితోన్

    పరమాచార్యుని విష్ణునిన్ ముదము నింపారన్ నొగిన్బంచుమా

    సురలున్బాటుగ వారలున్ నమృతమున్ జుఱ్ఱంగవేడెన్ వెసన్

    Monday, June 14, 2021

    హరిని శరణమ్ము వేడిరసురగణమ్ము

    అసుర బాధలు పడలేక భూసురులట
    హరిని శరణమ్ము వేడిర, సురగణమ్ము
    దేవలోకమ్ము పైబడి దేవతలను
    బంది జేయగ విడిపించె భవుని హితుడు

    జపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్

    కుపితుడు గాక యెప్పుడును గూర్మిని నెల్లరి మానసంబులన్
    గపటము లేని పద్ధతిని గర్మఠు వోలెను జూరగొన్నచో
    నపగత మత్సరంబునన నందఱి సేమముజూడగల్గునా
    జపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్

    Sunday, June 13, 2021

    జపతపములు విడుచువాడు,సద్గతినందున్

     అపవిత్రు డగును బృధివికి

    జపతపములు విడుచువాడు,సద్గతినందున్

    చపలత భావము వీడుచు

    జపతపములు సేయునతడు శంకరు కృపచేన్

    Saturday, June 12, 2021

    హైదరాబాదు గలదు,సింహళములోన

     అవిడి కల్లంత దూరాన నాదిలక్ష్మి!

    హైదరాబాదు గలదు,సింహళములోన

    నమ్మ శాకంబరీదేవి యాశ్రితులకు

    రక్షగా నుండె గొలువయి రమ్యముగను

    Friday, June 11, 2021

    రుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమా

     భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్

    రుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమా

    రుద్రుడు నాబరంగుచును రౌద్రముతోడను నుండునట్టియా

    భద్రపు రూపుడేసరగు వంధ్యుని జేసెను ధార్తరాష్ట్రునిన్

    రుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగను

     నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగ

    గారణంబగు దుష్టుని కసిని,కాల

    రుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగను

    సబబ యయ్యది భార్యను సముదయింప

    Thursday, June 10, 2021

    బడిలేదని పంతులయ్య వలవల యేడ్చెన్

     విడువకనుకరో నపుడమి

    నడయాడుచు నొకరియొకరి నాహారించన్

    గడపనువదలిచనకరా

    బడిలేదని పంతులయ్య వలవల యేడ్చెన్

    బడియే లేదని పంతులయ్య గడుదౌర్భాగ్యుండు నై యేడ్చెరా

     గడవం జాలక రోజులొక్కపరి యాకామారి బ్రార్ధించుచున్

    బడియే లేదని పంతులయ్య గడుదౌర్భాగ్యుండు నై యేడ్చెరా

    గడపన్ దాటగ వీలులేకయిక సాగన్ మార్గమేలేకనే

    గడుసంసారమునీదగా నెఱుక లేకన్బాధనొందెన్ సుమా

    యౌరాసత్కవి!యింతగా సులభమా యష్టావధానంబనన్

     కారాగారము నుండి వచ్చిన రమాకాతుండు సంతోషియై

    యౌరాసత్కవి!యింతగా సులభమా యష్టావధానంబనన్

    మీరల్ చూచుచు నుండ యిప్పుడ మఱిన్మేధావు లుప్పొంగగా

    నారాకాధిపు పంచజేతును ననెన్ నష్టావ ధానమ్మునున్

    Wednesday, June 9, 2021

    కవి యవధానమ్ము లింతగా సులభములా?

     రవి!విను బ్రతివారునునిల

    నవధానంబును గఱపుట యచ్చెరువాయెన్

    నవలో కించగ దెలిసెను

    కవి యవధానమ్ము లింతగా సులభములా?

    మాహేశ్వర దండకము

    మాహేశ్వర దండకము.
    (ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)


     శ్రీకాళహస్తిత్రయోద్ధర్త!  కాశీపురాధీశ! కైలాస సంవాస! శ్రీశైల సంచార! శ్రీకంఠ చిద్రూప!  గౌరీమనోనాథ! గంగాధరా! చంద్ర మౌలీశ్వరా!  శుద్ధ భస్మాంగ! కామారి!  నాగేంద్ర హారా! త్రినేత్రా! మహాదేవ! దేవాలి సంభావ్య! నాట్యానురక్తా! హరా! నీ పదాబ్జమ్ము లెన్నండు నే వీడ నిత్యమ్ము నిన్నుంచి డెందమ్మునం దేను బూజింతు సద్భక్తిఁ బాపమ్ములం బాపి దేవేశ రక్షింపు నేత్రమ్ము లీయంగఁ గన్నప్పనుం బ్రోచితే ప్రీతి దక్షాధ్వరం బెల్లఁ గోపించి ధ్వంసమ్ము గావించితే పూని శాంతమ్ము రక్షించి తే పిమ్మటం బ్రీతి వేఁడంగ బ్రహ్మాదు లేతెంచి కారుణ్య మేపార లోకాలఁ బీడింపఁగా నప్పురామ్నాయముం గూల్చితే శంకరా యొక్క బాణమ్మునం బానముం జేసి హాలాహలం బెల్ల ముల్లోకముల్ గాచితే నీదు నామాలి నెన్నంగ శక్యంబె సౌరాష్ట్ర సోమేశ శ్రీశైల సన్మల్లికా ద్యర్జునా యయ్యవంతిన్ మహాకాళ నామేశ పుణ్యామరేశాన నోంకార నామేశ కేదార కేదార నామేశ యా ఢాకినిన్ భీమ నామేశ కాశీ పురం బందు విశ్వేశ మున్నీట నా నాశికన్ గౌత మేశా మహద్వైద్య నాథంపు విద్యా మహానాథ తద్ద్వారకన్ నాగ నామేశ రామేశ్వరం బందు రామేశ భాస్వద్ఘ నేలా పురం బందు  ఘృష్ణేశ్వరా భక్త నందీశ్వరుం డింక భృంగీశ్వరుండుం ద్వదీ యాంఘ్రి యుగ్మంబు నిత్యంబు సేవించు భాగ్యంబునుం బొంది ధన్యాత్ములై రెంచ ఫాలమ్ముపైఁ గన్ను కంఠంబునం బాము గాత్రంబు నందెల్ల భస్మం బహో పుఱ్ఱెలే నీకు ముత్యాలు చిత్రాతి చిత్రంబు వేషంబు గాచంగ నాద్యంత హీనుండ వత్యంత కారుణ్య చిత్తుండవే నీకటాక్షంబుఁ దానొంది పేట్రేగి వే కాలె భస్మాఖ్య దైత్యుం డహో ద్రౌణినిం గాచితే నర్జునిం గాచితే ప్రీతి సర్వజ్ఞ శశ్వద్ద యాంభోధివే పంచవక్త్రా భవానీధవా విశ్వనాథా విరూపాక్ష విశ్వాత్మ భూతేశ రుద్రా విశాలాక్ష పింగాక్ష నిత్యమ్ము సద్భక్తి నిం గొల్చెదం గొల్చెదం గొల్చెదన్.

    దినమణి,యేడుగుఱ్ఱములు దిక్కునకొక్కటి పాఱె భీతితోన్

     అనయము దౌడుతీయుచును నచ్చెరువందగ వెల్గునిచ్చుగా

    దినమణి,యేడుగుఱ్ఱములు దిక్కునకొక్కటి పాఱె భీతితోన్

    వనమున సింహమున్ గనగ బచ్చికమేయుచునొక్కసారిగా

    దనువులు జల్దరించగను దద్దరివోవుచుభీషణాకృతిన్

    Tuesday, June 8, 2021

    దినమణి, గుఱ్ఱములు బాఱె దిక్కునకొకటై

     దినమును నిచ్చును మనకిల

    దినమణి, గుఱ్ఱములు బాఱె దిక్కునకొకటై

    యనిలో శరముల ధాటికి

    మనగం గాభయము గలిగి మలములు పారన్

    భార్యను బ్రేమతోడగనువాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్

     ఆర్యులు నెంతజెప్పినను హద్దులు దాటుచు సంచరించి,నీ

    భార్యను బ్రేమతోడగనువాడు నిజమ్ముగ భ్రష్టుడే యగున్

    ధైర్యము గూడగట్టుకొని దేవరకొండ రమాపతీ!యికన్

    క్రౌర్యుని శిక్షగూరిచిని గొందలమందక జింతజేయుమా

    Monday, June 7, 2021

    భార్యను బ్రేమించువాడు భ్రష్టుండెయగున్

     ఆర్యుల మాటవినక పర

    భార్యను బ్రేమించువాడు భ్రష్టుండెయగున్

    గ్రౌర్యమునిలవిడ నాడుచు

    మర్యాదగ నుండునతడు మాన్యుడు పుడమిన్

    Sunday, June 6, 2021

    కల్లల్ వల్కెడు వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువాడాప్తుడౌ


    అల్లా! యేమని జెప్పనోపుదును మాయాజాలమేయౌటయా

    కల్లల్ వల్కెడు వాడె బల్లిదుడు వెన్కన్ నవ్వువాడాప్తుడౌ

    కుళ్ళాయించక మంచిజేయుచు నికన్ గూర్పాసమేగానకన్

    నుల్లంబంతట మంచి నింపుచు మఱిన్ నోర్పుంద గన్ జూడుమా

    కల్ల లాడు వాడె బల్లిదుండు నిజము

     కల్ల లాడు వాడె బల్లిదుండు నిజము

    మోసగాడె ముఖ్యు డీసు రభికి

    కాల మహిమ యిదియ కలికాల మగుటన

    వీరబ్రహ్మ ముడివె వివిధ గతులు

    రాముని తండ్రి భీష్ముడనీ వ్రాసెనుధూర్జటి భారతమ్మునన్

    ఏమని జెప్పనొప్పుదును నిప్పటి పిల్లల మొండివైఖరుల్

    దాముగ మార్పుజేయగను దల్లియుదండ్రియు నెంతజెప్పినన్

    రాముని తండ్రి భీష్ముడనీ వ్రాసెనుధూర్జటి భారతమ్మునన్

    సోముడు వ్రాసె పైవిధము చొప్పుననందఱు ఛీత్కరించగా

    Saturday, June 5, 2021

    రాముడు భీష్ముని కొడుకని వ్రాసెగవి దగన్

     భామా! మతిచెడె? చెప్పుమ

    రాముడు భీష్ముని కొడుకని వ్రాసెగవి దగన్

    రాముని గూరిచి వ్రాసిన

    నామహితాత్ముని సుమధుర యాఖ్య ను జెపుమా!


    పదుగురు మెచ్చు పద్యములవ్రాసిన,నేమి ఫలమ్ము సత్కవీ! పదముల సొంపునుండకను బద్యములెన్నియు వ్రాయుచుండినన్

    ముదములు గల్గు నెల్లరకు ,ముచ్చత గూర్చును మోము దమ్మిపై
    పదుగురు మెచ్చు పద్యములవ్రాసిన,నేమి ఫలమ్ము సత్కవీ!
    పదముల సొంపునుండకను బద్యములెన్నియు వ్రాయుచుండినన్
    సదమల బుద్ధి నిచ్చెడుసుశబ్దపు పద్యమువ్రాయనొప్పగున్

    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ!

     ముదమును శాంతిని దృప్తిని

    మృదువగు పదకో శములను మేదికి యీయన్

    పదములు న్యాయమె యిటులన

    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ!

    Thursday, June 3, 2021

    సాకులు జెప్పి తప్పుకొనుసజ్జనుడెల్లరు మెచ్చురీతిగన్

     పోకిరి వాండ్రు కొందఱట భూమియె దద్దరి లంగగానొగిన్

    గేకలు వేయుచున్ గీరుచు ఱక్కుచు నుండయత్తఱిన్

    సాకులు జెప్పి తప్పుకొనుసజ్జనుడెల్లరు మెచ్చురీతిగన్

    శోకిల డెంద మప్పుడు,నుసూరన బ్రాణము నొక్కమాటుగన్

    సాకుల్ వచియించి తొలగు సజ్జను డెపుడున్

     మూకలు మూకలుగను దా

    పేకాటను నాడుచుండీ భీకరముంగాన్

    గేకలు వేయగ నేవో

    సాకుల్ వచియించి తొలగు సజ్జను డెపుడున్

    కడుగాఠిన్యమనస్కులౌదురుతెలంగాణా ప్రజల్ సూడగన్

     పడిగాపుల్ బడి రోడ్లమీదననె సంభావ్యంపు టుద్యోగమున్

    నెడదన్ భక్తిని రక్తినిన్ నిలుపు నాయింపారు పోలీసులే

    విడువండెవ్వరినైనగానిమఱి వేవేలంగ బ్రార్ధించనౌ

    గడుగాఠిన్యమనస్కులౌదురుతెలంగాణా ప్రజల్ సూడగన్

    కఠిన చిత్తులుగద తెలంగాణ ప్రజలు

     దారి దోపిడి జేసెడువారి గురిచి

    యక్కడక్కడ నిఘాల నందుబాటు

    ననునిచితగుశిక్షవలన నయముజేయ

    కఠిన చిత్తులుగద తెలంగాణ ప్రజలు

    Wednesday, June 2, 2021

    తగునని రాక్షసాధముడు ధారుణినంతయు జాపచుట్టి యా సగరుల తోయమందుననె జయ్యన వేయ గబందిరూపునన్ జగములు సంతసించగను శ్యామను నుద్ధతి బైకితీయుటన్ సొగసున సాటిరావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

    తగునని రాక్షసాధముడు ధారుణినంతయు జాపచుట్టి యా
    సగరుల తోయమందుననె జయ్యన వేయ గబందిరూపునన్
    జగములు సంతసించగను శ్యామను నుద్ధతి బైకితీయుటన్
    సొగసున సాటిరావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

    Tuesday, June 1, 2021

    సొగసునన్ మేటి వందురు సూకరమును

     పంది రూపము నెత్తుచు నందసుతుడు

    వసుధ నెత్తిన కతనాన వార్ధి నుండి

    సొగసునన్ మేటి వందురు సూకరమును

    నంద గాడగును గదయా యాదవపతి

    తల నఱుకంగ గాంచి బహుధా స్తుతకార్యమటంచు మెచ్చిరే

     కలిగిన కోపభారమున గన్నులు నెఱ్ఱవియై కనంగ నా

    కలియుగ దైవరూపుడగుగృష్ణుడు,రాజగు నాశిశుపాలు

    తల నఱుకంగ గాంచి బహుధా స్తుతకార్యమటంచు మెచ్చిరే

    యిలనున రాజులందఱును నెంతయొ సంతస మొంది రయ్యెడన్

    Monday, May 31, 2021

     వంద తప్పులు సేయగ చేదివిభుడు

    క్రుద్ధ మనసున గృష్ణుండు గ్రూరుడగుచు

    మేన యత్తకు నిచ్చిన మనసు గడువ

    శిరము ఖండించ ముదమొంది రుర్విజనులు

    తలనఱుక గాంచి మెచ్చిరి తగిన పనిగ

    దున్నను గాంచి దోచితివెయుల్లములంచు వచించి రెల్లరున్

     సన్నని దేహముంగలిగి చక్కటి రూపున లేవయస్సునం

    దున్నను గాంచి దోచితివెయుల్లములంచు వచించి రెల్లరున్

    నన్నువ గల్గియుండునెడ నాదరమొప్పగ స్నేహభావమున్

    మిన్నగ జూపునందరును మేదిని సాజముచింతజేయగన్

    Sunday, May 30, 2021

    దున్నను గని దోచితివనిరుల్లం బులనే

     సన్నని కాకర కాయలు

    నున్నగ పైదొక్కదీసి నూనెను వేచిన్

    చెన్నున వండగ చిరుచే

    దున్నను గని దోచితివనిరుల్లం బులనే

    Saturday, May 29, 2021

    రోహిణి వచ్చుటను గాంచిరోసెను శశియే


    ఆహా! యేమని జెప్పుదు

    నూహకు నందకను వచ్చె నుస్సురు గొలుపన్

    బాహాటమ్ముగ వెంటనె

    రోహిణి వచ్చుటను గాంచిరోసెను శశియే

    Friday, May 28, 2021

    గడుహితమబ్బులే,గ్రహణ కాలమునన్ భుజీయించు వానికిన్

     బడుగు జనంబు లందఱునుభద్రత గోరుచు దూరముండుచో

    గడుహితమబ్బులే,గ్రహణ కాలమునన్ భుజీయించు వానికిన్

    గడుపున నొప్పి వచ్చుచును గానగ రానిది రోగమేదియో

    మడియగ జేయునంచు ననెమంతెన రామయ వెజ్జు వింటిరే

    హితముగను గ్రహణమున,భుజించువాడు

     మంత్ర పారాయణ ముజేయ మదిని నిలిపి

    హితముగను గ్రహణమున,భుజించువాడు

    కడుపు సంబంధ రోగముల్ గనుచు,బాధ

    నొందు నుగలగా లమతడు విందు లేమి

    భోగా సక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్

     భోగా సక్తుడు రాగబద్ధుడు గనున్ మోక్షమ్ము వేగమ్మునన్

    భోగాసక్తుడు బోవు రౌరవము దాభోగమ్ములన్ మున్గుటన్

    రాగాసక్తుడు దాగనున్ దివి హృదిన్ రాగమ్ము నాలాపనన్

    వేగంసంతస మొంది దేవతలొగిన్ వేదీవనల్ నీయుటన్ 

    Thursday, May 27, 2021

    భోగాసక్తుండె,మోక్షమును బొందుగదా

    రోగాల బారి పడునట
    భోగాసక్తుండె,మోక్షమును బొందుగదా
    భోగంబులు విడనాడుచు
    నంగజహరు సేవనమున నార్తింగల్గన్

    విరహము బాపుమని గౌరి వెన్నుని వేడెన్

     కరమును మోహము గలుగగ

    గిరిజే దాజేరి కృష్ణు గిరిధర!వినుమా

    హరుని నొడబరచి యేనా

    విరహము బాపుమని గౌరి వెన్నుని వేడెన్


    విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

     నిరతము రాజశేఖరుని నెమ్మది భావనజేయు గౌరి దా

    హరునికి భార్య,యౌ టకునె నార్తిని ఘోరపపంబు జేసియున్

    హరికిని బల్కె నిట్లుగను నాభవుతోడను జెప్పి యిప్పుడే

    విరహము బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై

    Tuesday, May 25, 2021

    పాా రాాాా వాాా రం యతిగాాాాా

     వాసుకి త్రాడుగా నునిచి పాలసముద్రము జిల్గగా సురల్

    లాసము రీతినిన్ మిగుల రావము జేయుచు గాలకూటమే

    భాసిల,యంతటన్ వెఱచి వాసవు డాదిగ సర్వులున్ గనన్

    రాసుధ యంచునా యజుడు రంజిలు నట్లుగ బంచెవారికిన్


    అన్నమయ్య జయంతి

     అన్నమయ్య జయంతి పద్యములు. 

    (రచన: పోచిరాజు సుబ్బారావు.) 



    పదములు పాట లింకఁ బలు  బద్యము లన్నియు శ్రీనివాసుపై

    ముదిరిన భక్తి తోడ నిల మోదము తోడను వ్రాయ నందుకే 

    పద కవితా పితామహుఁడు  భవ్యుఁడు నాయెను లోక మంతటన్  

    ముదము సెలంగెఁ  జేయఁగను పుట్టిన యట్టి దినోత్సవమ్మునున్ 1. 


    వేంకటేశుని నరసింహు వేలుపులను

    సన్ను తించుచు భక్తిని  శ్రద్ధ తోడ 

    వేల కొలఁదిగఁ గీర్తనల్  బ్రియము తోడ

    నలరి పాడెను రచియించి యన్నమయ్య 2. 


    చంద మామ రావె జాబిల్లి రావె నా 

    బంతి పూలు దేవె  పాట లిట్టు 

    లన్ని యు మన భాష కమిత గౌరవ మిచ్చెఁ 

    దెలుఁగు పదము లలరి తీయ నగుచు 3. 


    రాగి ఱేకుల మీదను రమ్యముగను

    జెక్కి యుంచిరి భద్రమ్ము సేయఁ దలఁచి 

    యన్న మాచార్యులకు  నరయంగ సాటి 

    జగము నందుఁ గన్పట్టరు సత్య మెంచ 4.

    సతతము భార్యతో గొడవ,సంతస మిచ్చును భర్తకెప్పుడున్

    మతులను బోవదోచునట మాన్యులకైనను జేయు గీడునున్
    సతతము భార్యతో గొడవ,సంతస మిచ్చును భర్తకెప్పుడున్
    వితరణ బుద్ధి గల్గుచును బేదల జీరుచు నన్నమిచ్చుచో
    గతమును మర్చిపోవుచును గారవ మొప్పగ నుండ మేలగున్

    సతతము సంతస మొసంగు,సతితో గొడవల్

    అతులిత ధన సంపాదన
    సతతము సంతస మొసంగు,సతితో గొడవల్
    సతమున్ జరుగుచు నుండును
    మతములు భిన్నం బులైన మామూలేగా

    Sunday, May 23, 2021

    కోడలి వంచు నొక్కరుడు గూతురి తోడ వచించె నెమ్మదిన్

    వేడుక నొందునట్లుగను బెండ్లిని జేయుదు నీకుబావతోన్
    వీడుము శోకమున్ నికను వెళ్ళి బజారున పట్టుబట్టలన్
    వేడుకమీరగా గొనుము బ్రేమగ నౌదువు నాదు చెల్లికిన్
    కోడలి వంచు నొక్కరుడు గూతురి తోడ వచించె నెమ్మదిన్

    కోడలివని పల్కె నొకడు గూతురి తోడన్

    ఏడవకుము నాసోదరి
    కోడలివని పల్కె నొకడు గూతురి తోడన్
    వేడుకగ బెండ్లి జేసెద
    వీడుమ యాబెంగ నికను బ్రియతమ పుత్రీ!

    Saturday, May 22, 2021

    విటులకు తావళంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్

     విటులకు తావళంబులుగ బేర్మి గనెన్ బడులెల్ల తావులన్

    నటనట యుండవచ్చు నెమొ,యంతట యుండవు నిశ్చయంబుగా

    కుటిలపు టొజ్జలుందురుగ గొందఱు వారలు గారణంబుగా

    నిటులుగ జర్గుచున్నవని యెంతయొ నమ్మకముండె గాద?భో!

    విటులకు దావలము లయ్యె విద్యాశాలల్

     కుటిలపు టొజ్జలు గలుగుత

    విటులకు దావలము లయ్యె విద్యాశాలల్

    నటియించి ప్రేమ తోడుత

    దిటముగ దావలపు రేపి తీయగ పలికిన్

    క్రూరుండై శిబి ఖడ్గమున్ గొని వడిం గోసె గపోతమ్మునే ప్

    చేరందీసిన యాకపోతమును దా శీర్షంబు నూరార్చి యున్

    ధీరత్వంబును జెప్పి నభయం ధీరుండవై యుండుమా
    హారం బిత్తును డేగ కియ్యెడను నాయంగంపు మాంసమ్మునాన్
    క్రూరుండై శిబి ఖడ్గమున్ గొని వడిం గోసె గపోతమ్మునే

    ప్రత్యుత్తరంతొలగించు

     

    Friday, May 21, 2021

    క్రూరుండై శిబి ఖండించె బారువమును

     క్రూరుండై శిబి ఖండించె బారువమును

    ననగ బాడియే యిచ్చట యార్య! మీరు

    చేర దీసి యభయమీయ శిబిని మెచ్చు

    కొనిరి యింద్రాగ్ను లాతని దాన గుణము

    సమరముమాని రాజ్యమున శాంతిని గోరె, సుయోధనుండహో

     ప్రమద మనంబు నొందుచును బార్ధునితోడ ను

    ధర్మరాజనెన్

    విమలపు మానసంబున నబేర్మిని నాదగు మాట చెప్పుమా

    సమరముమాని రాజ్యమున శాంతిని గోరె, సుయోధనుండహో

    కుమతిని నీచ్చగించడెమొ కూర్మిని నచ్చువిధంబు జేయుమా

    Thursday, May 20, 2021

    సమరమును మాని కురురాజు శాంతి గోరె

     సమరమును మాని కురురాజు శాంతి గోరె

    ననుట చిత్రము దుర్బుద్ధి యైన వారు

    శాంతి గోరరు గోరు నశాంతి నెపుడు

    వంశ నాశమ్ము జరుగును వారి వలన

    గాలులు తీవ్రమై విసరె గాని చలింపవు వృక్షశాఖలే

     బాలురు వీవ యిర్వురును వీవన తోడను శక్తి మించియున్

    గాలులు తీవ్రమై విసరె గాని చలింపవు వృక్షశాఖలే

    బాలుర శక్తి చాలకను బాదప శాఖలు నూగకుండెనే

    గాలులు తీవ్రమై నయెడ గాలికి వంగును శాఖలన్నియున్

    గాలి విసరెను ,వృక్షశాఖలు గదలవు

     చిన్న చిన్నగా మొదలయి చెట్లు పడెడు

    గాలి  విసరెను ,వృక్షశాఖలు గదలవు

    పిల్ల గాలుల కెచటను బెద్దగాను

    బెద్ద గాలులు వీచిన విరిగి పడును

    Tuesday, May 18, 2021

    గానము సేయు నిన్ను గనగానగునే పికమా!కలధ్వనీ!

     తేనెల తీపిబో లుచును దీయటి రాగము లాలపించుమో

    గానశి ఖామణీ! యునికి కానగ నిమ్ముమ,చెట్ల చాటులన్ గానము సేయు నిన్ను గనగానగునే పికమా!కలధ్వనీ!

    వీనుల విందుజే యుమము బ్రీతిగ గానము నాలపించుచున్

    గాన మొనరించు పికమ!నిన్గాన నగునె

    మధుర మోహన రీతిని బధిరులకును
    హృదయ ముప్పొంగ జేయునీ హ్లాద గొంతు
    తీయ తీయని రాగాలు దీయు చుండి
    గాన మొనరించు పికమ!నిన్గాన నగునె

    దత్తపది

    సంద్ర లంఘనము నొనర సల్పి హనుమ
    లంక జేరగ నతనిని రక్కసు లట
    నిప్పు వెట్టగ దోకకు భవనములను
    సంయ మనమును గోల్పోయి సరగు గాల్చి
    మాన ధనమున నున్నట్టి మైధిలి గనె

    Monday, May 17, 2021

    జనకుని జంపినట్టి గుణశాలికీ మ్రొక్కెదరెల్ల సజ్జనుల్

     జనకుని జంపినట్టి గుణశాలికీ మ్రొక్కెదరెల్ల సజ్జనుల్

    కనుమరు గాయెనే భువిని గావగ దండ్రిని ధైర్య శాలురల్

    జనకుని జంపు వాని గుణశాలిగ బల్కుట చిత్రమే గదా

    వినగను రోత పుట్టె నిది పేలగ మాాారెను లోకమే సుమా

    Sunday, May 16, 2021

    జనకు జంపిన వానికి,జనుల నతులు

     మరణ శిక్షను విధింత్రు దొరలు సుమ్ము

    జనకు జంపిన వానికి,జనుల నతులు

    శాశ్వ తంబుగ నుండును సజ్జనులకు

    వారి మంచియే వారిని బ్రస్తుతించు

    వైశాాఖపురాాణం

    : రాజగు గీర్తిమంతుడట రక్తిని వేటను జంతుజాలమున్ 

    నైజపు వృత్తినిందునిమి నారముగ్రోలగ మౌనిశాలకున్ 

    రాజసమొప్పగా జనగ రమ్యులు శిష్యుల ధర్మవృత్తికిన్ 

    రాజుముదంబునొందుచు ను లాస్యముఖంబున మౌనికిట్లనెన్

     ఓముని వర్యుడా!నతులు నుత్సుకమాయెను ,దృప్తినొందితిన్ 

    నీమము దెల్పుడీ యనివి నీతుల గోరగ నిట్లు బల్కిరే 

    మేమవి చెప్పలేమిపుడు మీరలునేరుగ దెల్సికోదగున్ 

    మామక వృత్తి మాగురువు మాటను దప్పక యాచరించుటే


     అనవిని  కీర్తిమంతుడును నాదరమొప్పగమౌనితోననెన్ 

    మునివర!చెప్పుధర్మములుమోదమునొందగనాదునుల్లమున్ 

    వినగను వేగిరంబడెనువీనులురెండునునొక్కసారిగా

    ననితరధర్మముల్ మఱిమహామహోజ్వలపుసూక్తిరత్నముల్


     అనవిని యావశిష్టుడును హర్షము నొందుచు బల్కె రాజుతో

    వినుమిది కీర్తిమంతుడిక వేకువ జామున తాన మాడుచో 

    ఘనముగ బ్రీతినొందు నట కంసవిరోధియె గల్ల గాదు సూ

    ననయము దానముల్ నిడిన హర్షము నొందడు స్నాన మాడకన్


     అంతట యామునీశ్వరుడు హర్షము నొందుచు రాజుతోననెన్ 

    నెంతయొఙ్ఞానవంతుడవె యిందులకీ పరిప్రశ్ననీ మనో

    చింతనకాలవాలములు ,చిన్మయుడా హరిగాధలన్ నికన్ 

    అంతముకానివైయలరునాశ్రమ ధర్మము లిచ్చగించుమా


     ఆనందించితి కీర్తి మంతుడ!యికన్ హ్లాదంబునొందంగగా

    నేనున్ జెప్పెద సావధానపుమతిన్ నేర్వంగ యత్నించుమా

    వెన్నుంగాధలు,ధర్మసూక్ష్శములు వేవేలంగబోనాడుదున్ 

    విన్నన్ బుణ్యములబ్బు,గల్గును సుఖంబెంతేని నిక్కంబుగా


    అనయము భక్తినెప్పుడిల నచ్యుతు బూజను జేయు వానికిన్

    ఘనముగ సర్వ సంపదలు గట్టలు గట్టలు గాగ నిచ్చుసూ

    పనిగొని దాన ధర్మములు చాలగ జేసిన నైన నీయడా

    మునిగిన గాని వేకువన ముక్తిని  గోరుచు నీటియందునన్


     మాధవ మాసమం డవని  మాధవ పూజను జేయువానికా

    మాధవుడెంద మందలరి  మాపును బాపము లెన్ని యుండినన్ 

    గాధలు భక్తి తోడుతను గానము జేసిన దీర్చు కోరికల్ 

    భూధవుడా! యెఱుంగుమిక పుష్కర నాభుని సాక తత్వమున్


     చెప్పుదు నిప్పుడే వినుముచేసినపాపము ,భోగలాలసల్ 

    దప్పకదీర్చుధర్మములు దానుగ నాచరణంబుజేయుచో

    నిప్పగిదిన్ జరించ హరి యిచ్చును దప్పక శాంతిసౌఖ్యముల్ 

    చెప్పగవిని యాప్రభువు చెప్పగగోరుదు నోమునీశ్వరా!


     దానము ధర్మముల్ మిగుల దానెని జేసిన నైన గానిసూ

    స్ధానము నందునన్ నతడు సంభవ మందును నంటరానిగా

    నేనను మాట గాదిదియ నీరజ నాభుని నోటి మాటయే

    స్నానము జేయగా దగువి శాఖపు  రిక్కయె యుండు గావుతన్


    వైశా ఖంబున జేయు ధర్మములు దా వేగంబుగాజేయుచున్ 

    నీశున్ సేవను నెవ్వ డెప్పుడు దగన్ నీడేర్చినన్ వానికిన్  

    నీశానాధిపు మిత్రు డిచ్చునునేలాలవంగాదులన్ 

    నాశల్ దీర్చును ధర్మమాచరణ ధీమంతుండు నౌవానికిన్:

     తప్పక భక్తినిన్ నెపుడు ధార్మిక వృత్తిని బూజ జేయుచున్ 

    దప్పికగొన్నవానికిల దాహము దీర్చగ నీర మిచ్చుచో

    నప్పరమాత్ముడే మిగుల హర్షము నొందుచు నెల్లవేళలన్ 

    దప్పక నిచ్చుగాఫలము దద్దయు దృప్తిని బొందువాడునై

    [13/05, 4:39 p.m.] pochiraju subbarao: కర్మలు గొప్పగా నయిన గానదు లబ్ధిని భక్తిలేనిచో

    గర్మల తోడుగా నికను గావలె భక్తియు నప్పుడే సుమా 

    కర్మఫలాలు చెందు భువి కన్నడు సంతస మొందుగావునన్ 

    గర్మలు గావు ముఖ్య మిక కన్నని భక్తియె మానసంబునన్


     మాధవ మాసమౌ విధులు మానక రాజ్యపు మానవాళియున్ 

    భూధరుడా!చలించగను బుచ్చుము కానిచొ శిక్ష వేయుమా 

    సాధువు జెప్పగా నటుల సన్నతి మిక్కిలి జేసి నేగెనా

    భూధవు డింటికిన్ నపుడు పూతమ నస్కుడు నైసుఖంబుగన్ 

    ఏగిన వెంటనే నతడు నెన్మిది వత్సరమాదిగా జనుల్ 

    నేగుచు జేయగా వలెను నేఱున దానము దప్పకుండగన్ 

    లాగున నశ్వమం దలరి బ్రాకటమున్ నిడె రాజు దానుగా

    నేగిరి సర్వులున్ నదికి యీతలు గొట్టుచు  జేసె దానమున్

    [14/05, 3:45 p.m.] pochiraju subbarao: చేయగ స్నానముల్ నదిని చేరిరి వారలు విష్ణు లోకమున్ 

    నాయమ లోక మంతయును నచ్చెరు వాయెను లేమి కెవ్వరున్ 

    చేయుట స్నానముల్  మఱియు  జెప్పుట ధర్మము మాధవంబునన్ 

    నాయువు వృద్ధియై చిరము హత్తును దప్పక విష్ణు లోకమున్


    ధర్మము బోధజేయుటకు ధార్మిక వృత్తిని నాచరించనౌ

    శర్మను బేరునంబరగు శాస్త్రము దెల్సిన బ్రాహ్మణోత్తమున్ 

    గర్మకు సాక్షిగా నునిచె గ్రామము గ్రామము నందునన్ నికన్ 

    ధర్మ విహీనులన్  నణచ ధాత్రిని నుంచెను బాలికాపుగా


    : పదియును సంఖ్యగాగలుగు బ్రధ్నము లిచ్చుచు బంచగ్రామముల్ 

    కదియగ నొక్క పాలకకు గారవ మొందగ నాధి పత్యమున్ ,

    దదనుగుణంబుగా నిడుచు ధర్మము జేయని వారికయ్యెడన్ 

    పదునగు శిక్ష వేయునటు పంపును నిచ్చెను ధర్మ రక్షకున్


    ధర్మము నాచరించుచును ధాత్రిని గర్మను జేయగా మఱిన్ 

    ధర్మము దప్ప కుండగను తానము జేసిన వారలెల్లరున్ 

    నిర్మల మానసంబుననె నేరుగ జేరిరి విష్ణు లోకమున్ 

    ధర్మజు లోకమంతయును దైన్యము నొందెను లేమి యొక్కరున్


     మాధవ మాసపుంమహిమ మాటల చెప్పగరాదు గాని నా

    మాధవ మౌనియేనుడివె  మైనపు ముద్దను బోలు నట్లుగా

    మాధవ మాస మందెవడు మారణ హోమము జేయకుంటచే

    నాధవు చిత్రగుప్తు డట హాయిగ నుండెను వ్రాత లేమికిన్

    గర్భా దానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా

    గర్భా దానము నాడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా
    దర్భా జానకి కూతురొక్కతె గనన్ దారాలసోమేశునిన్
    నిర్భీతిన్ జని వాని తోడనె నటన్ నెల్లాళ్ళు జీవించుటన్
    గర్భం దాల్చెనె?నేమొ యప్పుడె మఱిన్ గానంగ నట్లాయె నో

    Saturday, May 15, 2021

    గర్భా దానమ్ము నాడె కల్గిరి పుత్రుల్

    గర్భము దాల్చక పోయిన
    దౌర్భాగ్యము వెంటబడగ ద్రోవది చెలికిన్
    నర్భకు రాలగు నామెకు
    గర్భా దానమ్ము నాడె కల్గిరి పుత్రుల్

     

    వెలయాలే మన వంశ వృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

     వెలయాలే మన వంశ వృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదించులే

    వెలయాలందున మంచివారలును దావేవేలుగా నిద్ధరన్

    బలుచోట్లం గలరే గదా విమల! యవ్వారిన్ దురాలాపముల్

    బలుకం న్యాయమె చెప్పుమా యికను నోభామా!ముదంబే యిటన్ 

    వెలయాలొనరించు,వంశవృద్ధిని బ్రేమన్

     ఇలబి చ్చకునిగ మనలను

    వెలయాలొనరించు,వంశవృద్ధిని బ్రేమన్

    గలకాల మటుల గఱపుచు

    వలపులలో మునుగు చుండ్రు భార్యలు బుడమిన్

    Thursday, May 13, 2021

    కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

     మారెమ దేవళంబున సమాగతులైన నవీనులందఱున్

    హారతి ధూపముల్ గనుచు హాశివ! శాంకరి! యోంయనంగ నోం

    కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్

    నారయ యంతెగా మదికి హాయిని గూర్చెడుమంత్రమే సుమా

    కారము భక్తులను దీయగా మురిపించెన్

     మారెమ గుడి పూజారిణి

    హారతి దానిచ్చు చుండి యమ్మను ఓంయన

    నారాధన మధ్యను నోం

    కారము భక్తులను దీయగా మురిపించెన్

    Wednesday, May 12, 2021

    రవయుత మౌనమూని త్రిపుర ద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్

     కవనము లెస్స వచ్చుట కుగాగల కార్యము బొందగోరి గౌ

    రవయుత మౌనమూని త్రిపుర ద్విషు శంకరు బ్రీతి గొల్చెదన్

    ప్రవిమల భక్తి తోడనిల భవ్యుని పూజను జేయుచో దయన్

    నవిరళ భోగభాగ్యములు నాయువు,గీర్తిని గల్గజేయుగా

    రవయుత మౌనమున శంకరు ప్రభు గొల్తున్

     కవితల రచనకు నేగౌ

    రవయుత మౌనమున శంకరు ప్రభు గొల్తున్

    శివనామ జపము వలననె

    భవబంధము లుడిగి మనకు పరముంగలుగున్

    Tuesday, May 11, 2021

    కలుగలవాడె రాజు కలికాలము నందు దలంచి చూచినన్

     కలిబొలి మాట లాడుచును గర్మలు సేయక యుండి యైనరూ

    కలుగలవాడె రాజు కలికాలము నందు దలంచి చూచినన్

    బలుచన జేయుచుందురిక బండితు లైనను చూడకుండగన్

    గలియుగ ధర్మమే యిదియ గర్వము నొందుచు విర్రవీగుటల్

    కలు గలిగిన వాడె రాజు కలి కాలమునన్

     పలుకుచు దీయగ నెదుటన

    చులకనగా బరుల యెదుట జూచుచు నెపుడున్

    బలుచన జేయు నల్లరి మూ

    కలు గలిగిన వాడె రాజు కలి కాలమునన్

    కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్

     అడిగితివౌట చెప్పుదును రాముని పాదము సోకుట కారణంబుగా

    నడవిని రాయి రూపమున హత్తుకు నుండియు నాతి రూపమున్ఋ

    నడరుట చేత నిప్పుడిక హర్షకుమార! కడున్ భ యార్తియై

    కడుగగ రాడులే గుహుడు కాతరుడై రఘురామ పాదముల్ 

    Monday, May 10, 2021

    రామపదములు గడుగంగ రాడు గుహుడు

     రాయి నాతిగ మారుట భ్రమను నుండి

    తేరు కొనగ లేకుండుట ధ్రువుడు మదిని

    రామపదములు గడుగంగ రాడు గుహుడు

    ప్రాణ భయములు గలిగించు భవ్యులకును

    రతిగని బ్రహ్మదేవుడనురక్తిని బొందెను వేల్పులౌననన్

    అతులిత రామణుయతన హ్లాదముగూర్చెడి యాలలామ,భా
    రతిగని బ్రహ్మదేవుడనురక్తిని బొందెను వేల్పులౌననన్
    శ్రుతిమయ రూపమందుటను జూచెడువారలు భక్తితోదగన్
    నతులను నిచ్చుచుదిరటనవ్యతరీతిని నొందునామెకున్ 

    Sunday, May 9, 2021

    రతినిగాంచి బ్రహ్మ రక్తుడయ్యె

     చేతి వీణతోడ చిన్మయరూపుభా

    రతినిగాంచి బ్రహ్మ రక్తుడయ్యె

    సహజ మదియ యందచందము లెప్పుడు

    రక్తి గలుగ జేయు భక్తులకును

    రాముని రామునిన్మఱియురామునిజానకిగాంచెమువ్వురన్

     రాముని జూచెదాకలను రమ్యశరీరుని,నద్దమందునన్

    భామలు మోహమందగను బాఱెడు నీటను దీర్ఘబాహుతో

    రామల మానసంబులను బ్రాకటమౌనటుచేయువాడునౌ

    రాముని రామునిన్మఱియురామునిజానకిగాంచెమువ్వురన్

    Saturday, May 8, 2021

    రామురామురాము రమణిగాంచె

     అద్దమందు నెదుట పెద్దమడుగులోన

    రామురామురాము రమణిగాంచె

    భర్త యందు సీత వలపుగొన్నకతన

    చోటుచోటులందు చూచె విభుని

    Friday, May 7, 2021

    ముక్తికి మూలకారణముపో,విషయాదుల భుక్తినిచ్చలున్

     భక్తిని నెల్లవేళలను భవ్యునిబూజనుజేయుచుండుచో

    ముక్తికి మూలకారణముపో,విషయాదుల భుక్తినిచ్చలున్

    శక్తివిహీనుజేయునిల సర్వమునాశనమొందజేయుటన్

    రక్తిని మానకుండగను రాముని ధ్యానము జేయగావలెన్

    ముక్తికి కారణము,విషయభుక్తియె తలపన్

     భక్తిని బూజించుటయే

    ముక్తికి కారణము,విషయభుక్తియె తలపన్

    శక్తిని నశింప జేయును

    రక్తిని బూజింప మేలు రాముని పదముల్

    Thursday, May 6, 2021

    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్

     తెలతెలవారుచుండగనె దీప్తులు వోవుచు రాహుపట్టగన్

    వెలవెలబోయె భాస్కరుడు,వెన్నెలరాజునుగాంచినంతటన్

    కళకళలాడె నాముఖము గాంతులు జిమ్ముచు నొక్కసారిగన్

    గలువల రాజుపొంకములు గాంచెడు వారలుమోదమందురే

    విధునిగని,భాస్కరుడువెల వెలనవోయె

     సంతసించిరి జనములు సంతుతోడ

    చాల దినముల తదుపరితెల్లనైన

    విధునిగని,భాస్కరుడువెల వెలనవోయె

    రాహు వుచెఱకు జిక్కగ రహిని జెడగ

    నగరాడ్ధారి యనుంగుద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

     ఖగమే వాహనమైనయా యజుడువిఖ్యాతుండు లోకోద్ధరౌ

    నగరాడ్ధారి యనుంగుద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే

    నగజారాతుని సంహరించుటను నానారీతి దుఃఖించియా

    నగజానాధుని బ్రాణభిక్షమిడ విన్నాణంబుగావించెగా

    న్నగధారి యనుంగుద్రుంచి నాతిని బ్రోచెన్

    చిగురువి లుకాని రిపు,ప
    న్నగధారి యనుంగుద్రుంచి నాతిని బ్రోచెన్
    మగువర తీదే విమొఱను
    సుగతులు బ్రాప్తించు నటుల సూ,వర మిచ్చెన్

    Wednesday, May 5, 2021

    యవలీలగ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్

     అవిడి యనుగ్రామ మందున

    జవరాండ్రలు బొమ్మకొలువు జక్కగబెట్టన్

    వివిధములగు బొమ్మలు గని

    యవలీలగ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్ 

    నవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్వడిన్

     అవరోధంబులు లేకపోవుటన నాయాచోటగానంబడన్

    నవలీలన్ సుకుమారి బాలికయె తానశ్వంబు నెత్తెన్వడిన్

    నవరాత్రుల్ సమయాన భామినులు నవ్యంబైన బొమ్మల్ దగన్

    భవముల్గల్గగ గొల్వుదీరుదురు సౌభాగ్యంబు వెల్గొందనౌ

    Tuesday, May 4, 2021

    గాంతకు పారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్

    కాంతుని రూపమున్ మదిని కాంచుచు నేగగ తోటలోనికిన్
    గాంతకు పారిజాతసుమ గంధము దుర్భరమయ్యె దోటలోన్
    జెంతను నేమియున్ననిక చేష్టలులేకను మానసంబుగా
    శాంతికి దూరమయ్యి తమి చర్వితచర్వణ మౌటచేన్

    పారిజాత గంధమ్ము,దుర్భరముసతికి

     నలుదెసల వ్యాప్తియగునుగ బొలుపుగాను

    పారిజాత గంధమ్ము,దుర్భరముసతికి

    సవతిపోరుండునెడలనుసంతతమ్ము

    భార్య కోరును బ్రేమను భర్తనుండి

    Monday, May 3, 2021

    సిరియే మోక్షము నందసాధనమగున్ జింతించి సాధింపుమా

     వరమౌ భక్తిని బూజజేయగను నాబాబాకటాక్షంబనే

    సిరియే మోక్షము నందసాధనమగున్ జింతించి సాధింపుమా

    పరముంబొందగ నేర్చుచో సతముగుర్వాదేశ మూలంబునన్

    బరగంవచ్చును రాధికా!వినుమయాఫాలాక్షునాశీసులన్

    Sunday, May 2, 2021

    సిరియెమోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

     భక్తిశ్రద్ధల తోడను రక్తితోడ

    దైవనామంబు బలుకుచు దినముదినము

    భజన జేయుచు మెలగెడు భక్తవరుని

    సిరియెమోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ

    Saturday, May 1, 2021

    పుత్రులుగారు పోకుశలవుల్ రఘురామునకంద్రు సజ్జనుల్

     పుత్రులుగారు పోకుశలవుల్ రఘురామునకంద్రు సజ్జనుల్

    చిత్రముగాదె యీపలుకు శీర్షములోపల గుంజుగల్గునే

    మిత్రుడు బల్కడిట్లుగను మేదిని సజ్జనులైనవారలే

    పాత్రతలేక పల్కనిక బంధములుండునె?జిత్తగించుమా

    కుశలవుల్ గారు,రామునికొడుకులంద్రు

     ఆది దంపతు లకొమరు లరయ వినుము

    కుశలవుల్ గారు,రామునికొడుకులంద్రు

    కుశలవులనిల నిజమది కుమతు లగరు

    వమ్ము నణచువీ రులువారు సుమ్ము బాల!

    జింకలు మాంసముందినెను సింహము గడ్డినిమేసె బ్రీతిగన్

     జింకలు మాంసముందినెను సింహము గడ్డినిమేసె బ్రీతిగన్

    వంకర మాటలాడగను భావ్యమె నీకిది పాడియే రమా!

    జింకలు గడ్డినిన్ దినును సింహము మాంసము నారగించుగా

    బొంకులు బల్కగాదగునె? బుద్ధిగ దెల్విగ మాటలాడుమా

    Friday, April 30, 2021

    జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్

     వెంకాయమ్మయె యిట్లనె

    జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్

    వంకర నోరును గలుగుట

    జంకనునదిలేక పలికె జతురత లేమిన్

     అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా

    చనువునునుండు వానివలె శారదచేతిని ముద్దువెట్టగా

    దనదగు భార్య హస్తమును సోకుట కోర్చుకొనంగ లేకనే

    దనయుడు చెప్పుతీసికొని తండ్రిని కొట్టెను దప్పుగాదులే

    Thursday, April 29, 2021

    కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె

     ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!

    కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె

    తనదు భార్యజో లికివచ్చు దమ్మునపుడు

    స్వార్ధమనునది వదలదు బంధువులను

    ఏడవ,భర్తకలిగినపుడేకద సాధ్వికిగౌరవంబిలన్

     వీడక యాకరోన నిల వేలకొలందిజ నంబులే జనన్

    బాడుకరోన వచ్చి మాబ్రదుకు బాధలొనర్చెను నంచు భామినుల్

    యేడవ,భర్తకలిగినపుడేకద సాధ్వికిగౌరవంబిలన్

    వేడుకొనంగమేలు బ్రజ వీడగ బాధలురామునిన్ నికన్

    ఏడవ పతియున్నసాధ్వికేగౌరవమౌ

     వీడక కరోన జనులను

    నేడును నాడును బ్రబలుచు నెఱి బాధించన్

    వేడుచు రాముని నాసతి

    యేడవ పతియున్నసాధ్వికేగౌరవమౌ

    Tuesday, April 27, 2021

    సైంధవుడు,గౌరవరాజ సైన్యమడచె

    సింధు దేశపు రాజుగా శ్రేణికెక్కె
    సైంధవుడు,గౌరవరాజ సైన్యమడచె
    యుద్ధరంగాన ఫల్గుణు డొక్కగుణిని
    పాఱి పోవగ జేసెను భయముతోడ

    జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్సైన్యాతకుండైచనెన్

    జననింద్యుండగు వానినెట్లిటనగనీచౌమాట సాకారమే
    జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్సైన్యాతకుండైచనెన్
    గనుడో ఫల్గుణుడాయనిన్ నొకడ దాగాలించి యాచోటులన్
    మనమున్ బొంగగ దీర్గుచున్ గనీయె సన్మానంబు జేయంగగా

    Monday, April 26, 2021

    జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్

     కనుమా రాఘవ!నీదురూపమును దాకళ్ళారజూడంగనౌ

    జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్

    మననన్ జేయగ నీదునామమును బల్మాఱుల్ దమిన్ శ్రద్ధతో

    మనగన్ జక్కటి యాయువున్ నిడుట రామానీ కుసింగారమే

    జనన మరణమ్ము లల్ప వి షయము లగును

     ఆత్మ పరమాత్మ లొకటిగ నగుట వలన

    నేను నేనను భావమ్ము దానువీడి

    మోక్షధామము నేగిన మౌనికియిల

    జనన మరణమ్ము లల్ప వి షయము లగును

    Sunday, April 25, 2021

    వాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై

    పాడుచు రామకీర్తనలు వక్త్రము నిండుగ నార్తినొందుచున్
    వాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై
    వాడును వీడునున్ ననక వాలినభక్తిని నెందఱేనియున్
    వాడలవాడలం దిరిగి భక్తజ నాళిని బ్రోత్సహించనౌ

    వాడవాడల దిరిగెడు వాడె సుగుణి

    మాయదారి కరోనను మట్టి గఱుప
    రామ భజనను జేయుచు రహిజెలంగ
    వాడవాడల దిరిగెడు వాడె సుగుణి
    పాలు బంచుకొనుడు మీరు భజనయందు

    షోడశ సత్కళల్ గలుగుసూర్యునకేనొనరింతు సంస్తుతుల్

     వీడని శ్రద్ధతో విభుడు పేర్మినివిద్యల నభ్యసించ నా

    షోడశ సత్కళల్ గలుగుసూర్యునకేనొనరింతు సంస్తుతుల్

    గూడును బట్టలన్ సతము గోరినవారికి యిచ్చువాడునున్ బోడిమి రూపుగల్గు వరభూపతి,రాముని కౌదలించెదన్ 

    Saturday, April 24, 2021

    షోడశ కళ లున్న,రవికి స్తుతులొన రింతున్

    పోడిమితో వెలుగొందును
    షోడశ కళ లున్న,రవికి స్తుతులొన రింతున్
    నాడుచు బాడుచు చదువుచు
    వీడక నామంబు లెపుడు వేడుకజేతున్

    రాాఘవోదాాాహరణము

     డొంకరాయి రాఘవోదాహరణము 

    ప్రణీతము: పోచిరాజు సుబ్బారావు. 



    ప్రథమా విభక్తి:

    ఉ.

    రాముఁడు డొంకరాయి యను గ్రామపు సాధుజ నావన వ్రతో

    ద్దాముఁడు ఘోర పాతక విదారుఁడు సద్గుణ భూషితుండు దా

    నీ మహి రక్షకుండు పరమేశుఁడు కాచును జీవ రాశినిం 

    బ్రేమ మయూఖుఁడై ప్రజల బిడ్డల వోలెను జూచు నిత్యమున్ 1.

    కళిక. (తురగవల్గన రగడ)

    కొండ కొండ నడుమ గలుగు గుంట లోన నుండు వాఁడు

    నండ పిండములను దాను నిండి మిగుల నలరు వాఁడు

    తల్లిదండ్రుల యెడ భక్తిఁ దద్ద నిల్పి మెలఁగు వాఁడు

    నెల్ల జనులఁ బ్రేమ తోడ నుల్ల మలర జూచువాఁడు

    తనదు తమ్ము లనినఁ బ్రేమ  దర్పములను నొందు వాఁడు

    వినయ గౌరవముల  నాభరణము లనఁగఁ  బఱఁగు వాఁడు

    శత్రువులకు జడల మెకపు  స్వప్నమై చెలంగు వాఁడు

    మిత్ర బృందములకు నభయ పత్ర మిచ్చి సాఁకువాఁడు 2.

    ఉత్కళిక.

    సత్య వాక్కె యెల్లరకును  

    నిత్య భూషణం బనుచును 

    బలుక కుండ దా ననృతము  

    కలను సైత ముంచి నిజము

    మనుజ జన్మ మెత్తి ప్రజకు  

    మనుగడ యవగతము కొఱకు

    శిష్ట రక్షకుండు వాఁడు 

    దుష్ట శిక్ష కుండు ఱేఁడు 3.

    ద్వితీయా విభక్తి:

    ఉ.

    రాముని రావణాంతకుని రమ్య శరీరుని దీర్ఘ బాహునిన్ 

    మామక పాతకంబులను మాన్చెడు వానిని ,భద్రరూపునిన్ 

    దామర తంపరల్ సిరుల ధార్మిక వృత్తిని నిచ్చు వానినిన్ 

    బ్రేమను గొల్వఁగా నగును భీకర యుద్ధ విశారదున్ హరిన్ 4.

    కళిక. (తురగవల్గన రగడ)

    కొండ శిఖర మందుఁ దనర గుట్టు గాను వెలయు వాని 

    భండనంబు నందుఁ దలల  ఖండనమ్ము సేయువాని

    జాన కమ్మ తోడఁ బెండ్లి జరుపు కొన్న యట్టి వాని

    వేనవేలు రక్కసులను బీనుగులుగ జేయు వాని

    శరణు సొచ్చువారి నెపుడు జక్కఁ జేసి పంపు వాని

    నరుల మధ్య నొకఁడె దాన యై పరులను జంపు వాని

    తల్లిదండ్రుల నెపుడు దన  యుల్ల మలర చూచు వాని

    నెల్ల వేళల భజి యింతు  నుల్ల మలర నేను వాని 5.

    ఉత్కళిక.

    ఊరు వారి కీయ సిరులు

    వారి నడతకు ఫలితములు

    కార్య దక్షత గల వాఁడు

    నార్యు లనిన బేర్మి వాఁడు 

    భక్త జనులఁ బ్రోచు వాఁడు

    రక్తి గలుగు నెడఁద వాఁడు

    సేవ జేయుదుఁ దమి వాని 

    పావ నుండు హనుమ ఱేని 6.

    తృతీయా విభక్తి:

    ఉ.

    ఎవ్వని చేత నీ పుడమి యింతగ నాయెను బాడి పంటచే 

    నెవ్వని చేత రావణుఁడె యీల్గెను ఘోర రణాంగణమ్ములో

    నెవ్వని చేత రాయి యిల నింతిగ మారెనొ నట్టి వానిచే 

    నవ్వర డొంకరాయి దగు నాదర మందెను గీర్తి రాముచే 7.

    కళిక. (ద్విరదగతి రగడ)

    శిల మారె నెవరిచే సేతు వట నెవరిచేఁ 

    గలిగె భద్రమ్ముగా  విలు విఱిఁగె నెవరిచే 

    రఘుకులం బెవనిచే రంజిల్లె నతనిచే 

    నఘము లెవ్వానిచే నంతమగు వానిచే

    భిక్షపతి నెవ్వాఁడు బ్రేమించు వానిచే 

    రక్షణమ వానిచే శిక్షణమ యతనిచే 

    డొంకరాయి శుభమ్ము బింకమౌ ఱేనిచే 

    వంక గాదులె నిజము భద్రేశు రాముచే 8.

    ఉత్కళిక.

    మూల మూలల గుడులఁ  

    గోలాహలము జనుల 

    సిరు లీయ సతతమ్ము 

    విరివిగా నటఁ జుమ్ము  

    సెలయేరు ఫణి పాఱ 

    శిల వెంబడినిఁ బాఱ 

    వంక గన దతనిచే 

    డొంక రాయి హరిచే 9.

    చతుర్థీ విభక్తి:

    ఉ.

    రాముఁడు లోక పావనుఁడు రాక్షస మూకల దీర్ఘనిద్రకై  

    నీమము దప్పకుండు గుణ నేతగ భక్తులు నమ్ము కొంటకై 

    బాములు దీర్చు నేతగను భావి తరాలకు నుండు కోర్కికై 

    రాముడు డొంకరాయి నిలఁ బ్రాభవ మందెను భక్త కోటికై 10.

    కళిక. (వృషభగతి రగడ)

    లక్ష తులసి దళముల నర్చనల నొనరింపఁగ రాఘవునకై 

    భక్షణంబులు జనుల కీయఁగ శిక్షకులు గలరు రఘుపతికై 

    యేట యేటను బెండ్లి సేయఁగ మేటి పౌరులు సీత పతికై

    మూట మూటల నీయగ జనులు సాటి వారలు మెచ్చఁ బతికై

    చైత్ర మాసము నందు పండుగ  చిత్ర రీతి జరుగ నతనికై 

    చిత్ర మైనవి పిండి వంటలు  సేసి యీయగఁ బ్రీతి హరికై

    డొంకరాయి విభుఁ గొని యాడుదు రంకిత హృదుల దాశరథికై 

    బొంకు లాడరు రాఘవునకై పూర్ణ దృష్టి నునుతు రతనికై 11.

    ఉత్కళిక.

    చేర రమ్మని యీయఁ దనకై

    నార బట్టలు గట్టి సతి కై

    క నుడువంగ విని త్వరితము కై

    కొని వ్రతము నేగంగ వని కై 

    తవ మెఱుంగని సీత వనికే

    కవియ ననుజుఁడు రాఁగ  జతకే

    డొంక రాయి వెలసెను హరికై

    కంకణమ్ములిడు రఘుపతికై 12.

    పంచమీ విభక్తి:

    ఉ.

    దశరధ సూను కంటె నిల ధార్మికుఁ డెవ్వడు గాన రాఁడుగా

    దశ దిశ లెన్ని జూచినను దద్దయు నీవల నావలన్ ధరన్ 

    దశరధ రామునిం గొలువఁ దారక రాముఁ డొసంగు సంపదల్  

    దిశ లవి మ్రోగు మావలన దేవుని డొంకశిలేశు పాటలన్ 13.

    కళిక. (హంసగతి రగడ)

    కలుగు సౌఖ్యమ్ము లే కాంతు వలన

    నిలను మోదమ్ములే యీశు వలన

    బరఁగు మోక్షమ్ము నెవ్వానివలన

    వర భోగ రాశు లెవ్వానివలన

    పరభక్తి కలుగు నెవ్వానివలన

    వరముక్తి వచ్చు నెవ్వానివలన

    శంక లే కడరు నా స్వామి వలన 

    డొంకరాయి హరిప్రియాంకు వలన    14.

    ఉత్కళిక.

    బద్ధ హృదయమ్ము । శుద్ధ భావమ్ము  

    నిద్ధ చరితమ్ము । విద్ధ తేజమ్ము

    భక్తి గరిమమ్ము । రక్తి నాశమ్ము

    డొంకశిల వలన । సంకువహుని వలన 15.

    షష్ఠీ విభక్తి:

    ఉ.

    రాముఁడు జానకీ విభుఁడు రమ్య గుణుండును శ్యామలాంగుఁడున్ 

    దామస దూరుఁడై పుడమిఁ దద్దయు వెల్గిన వానికిన్ మహా

    ధామము తోడ భాసిలుచు ధార్మిక చింతన గల్గు వానికిన్ 

    వేమఱు నిత్తు నే నతులు పెన్నిధి డొంక శిలాధి నేతకున్ 16.

    కళిక. (ద్విరదగతి రగడ)

    భక్తియే ముఖ్యమ్ము ముక్తి నిడ  రామునకు

    శక్తి యత్యంతమ్ము చాపమున వీరునకు  

    పాలాభిషేకమ్ము భావ్యమ్ము  రఘుపతికి 

    నీలాలు ముఖ్యమ్ము నెఱరూపు మానిసికి 

    సంగీత సాహిత్య సంయుక్త విజ్ఞునకు

    నంగీకృ తంబగు రసానందము విభునకు

    బొంకు లన రోషమ్ము డొంకరాయి ధవునకు 

    వంక లేవియుఁ జెప్ప డొంకశిల రామునకు 17.

    ఉత్కళిక.

    కొంగ్రొత్త కీర్తనలు గొంగ్రొత్త గానములు

    నల రామచంద్రునకు  నలరారు  నధిపునకు  

    నృత్య నాట్యాదులే  నిత్యంపు టాటలే     

    పంకేజ నేత్రునకు డొంకరాయి ప్రభునకు 18.

    సప్తమీ విభక్తి:

    ఉ.

    ఎవ్వని యందు భక్తి నిడ నిమ్ముగ మోక్షము గల్గ నోపునో

    యెవ్వని యందు చిత్త మిడ నింపుగ సౌఖ్యము నంద వచ్చునో

    యెవ్వని యందు నమ్మకము నింతయు నుంచిన మేలు గూర్చునో

    యవ్వర రామునం దిడుదు రాశలు డొంకశి లంబులో జనుల్ 19.

    కళిక.(హంసగతి రగడ)

    చిత్తమ్ముఁ బోనీరు చెడ్డ యందు

    విత్తమ్ము పోనీదు మత్తు నందు 

    నగ్ని వడి జేయుదురు యజ్ఞ మందు 

    లగ్నమ్ము గానీరు రాశు లందు 

    భక్త జనులే యుంద్రు ముక్తి యందు 

    శక్తి వంతులు మిగుల భక్తి యందు

    బొంక రిట మన ముంచి శంక యందు 

    డొంకశిలఁ గను రాము నంక మందు    20.

    ఉత్కళిక.

    పద మందు రక్తి 

    యెద యందు శక్తి 

    జనులందు యుక్తి  

    ఘనమైన భక్తి 

    సీతాపతి ప్రేమ 

    యాతతము రాము  

    నంకమ్ము నందు 

    డొంకశిల యందు 21.

    సంబోధన ప్రథమా విభక్తి:

    ఉ.

    అంకము సేరి నింగొలుతు నాశ్రిత రక్షక! లోకబాంధవా! 

    బొంకఁ దలంప నెన్నఁడును భూమిజ నాథుఁడ! పూతదేహుఁడా! 

    వంకను బెట్ట నోర్వ హరి! పంకజ నాభుఁడ!లక్ష్మణాగ్రజా! 

    డొంకల కేను భీతిలను డొంకశిలాధిప! రామభద్రుఁడా! 22.

    కళిక. (హంసగతి రగడ)

    దైనందినమ్ము  కోదండ రామ! 

    మానికంబుల తోడ మహిని రామ!

    పూజ నేఁ జేయుదును బూజ్య రామ!

    జాజి పూలను దెచ్చి  చక్క రామ! 

    యాయురారోగ్యాలు యశము రామ! 

    యీయుమా మా కింక నీశ! రామ! 

    బొంకు లేఁ బల్క నో భువన ధామ! 

    డొంకరాయి ప్రభు! నే లెంక రామ! 23.

    ఉత్కళిక.

    కీర్తింతు రామ!

    యార్తితో రామ!

    పోఁగొట్టు రామ!

    మా గోడు రామ!

    యాదుకొను  రామ!

    కోదండ రామ!

    శంక విడు రామ! 

    డొంకశిల రామ! 24.

    సార్వ విభక్తికము:

    శా.

    రావా కావఁగ రామ, బ్రీతిగ నినున్ రంజిల్లఁగాఁ జేయ,మా

    సేవల్ నిత్యము పొంది హర్షమున! మాచే నీయు సత్కారముల్ 

    నీవే నీ కయి పొంది మా వలన నే నేరమ్ములం జూడకే 

    రావే డెందము నందు మ్రొక్కుదుఁ దమిన్  రక్షింప సీతాపతీ!    25.

    అంకితాంకము:   

    శా.

    వరదా! రాఘవ! పోచిరాజు కుల సుబ్బారావు నామంబునం  

    బర మార్తిం దగ నీ యుదాహరణముం బద్యమ్ము లర్పింపఁగాఁ  

    గరముం బ్రీతిని సంగ్రహించు మిఁక నో కాకుత్స్థ! కాపాడుచుం 

    బరమౌ దారినిఁ జూపుమా దయను నా భాగ్యంబు జెల్వొందఁగా    26.

    పోచిరాజు సుబ్బా రావు నామ ప్రణీత డొంకరాయి రాఘవోదాహరణ  కావ్యము సమాప్తము.

    Friday, April 23, 2021

    కోడల!నాసుతున్ విడిచి,కూడగనొప్పును నేడునా పతిన్

     ఏడుదినంబు లాయెగద యిప్పుడులెక్కనుజూడగాసుమా

    కోడల!నాసుతున్ విడిచి,కూడగనొప్పును నేడునా పతిన్

    బాడుకరోనకుందగిలి భద్రతదృష్టిని దూరముండుచున్

    నేడిక గీము జేరుటన నిర్మొహమాటుగనెవ్వరేనియున్

    కోడలా నాపతిని నేడు గూడవలెను

     కోడలా నాపతిని నేడు గూడవలెను

    నెంతదౌర్భాగ్య మీయది యిటుల నడుగ

    స్వంత భర్తను గూడుట సబబు,కాని

    కోడలిని యడుగ భువిని క్రూరమగును

    స్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్

    మీరక హద్దులెన్నడు మమేకపుభావన గల్గునట్టిసం
    స్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్
    గోరినవాడు భర్తగనుగూర్మి లభీంచుట యోగమేకదా
    పారమునొందవీలగును భవ్యతరాలకు వీరిసర్గముల్

    Thursday, April 22, 2021

    కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా

     మారుని ప్రేరణ చేతను

    జేరగ దాభర్తదరికిచిత్తమునలరన్

    తోరమువశమైమన,మమ

    కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా

    పండుగజేయగ దగును,-బంధువు సచ్చిన వార్తవచ్చినన్

     నిండుమనంబునందలరి నెమ్మినిఋరాముని బెండ్లివేడుకన్

    బండుగజేయగ దగును,-బంధువు సచ్చిన వార్తవచ్చినన్

    గుండెను నిబ్బరంబునిచి ఘోరముజర్గుట నెంచుచున్ మదిన్

    నండగనుండగాదగును నన్నివిధంబుల సేవజేయుచున్

    Wednesday, April 21, 2021

    బంధుమరణ వార్త,మనకు పండుగెకద

     దుఃఖకరము మిగుల దుర్భరంబగునార్య!

    బంధుమరణ వార్త,మనకు పండుగెకద

    యింటినిండ జనము వంటిల్లుసందడి

    రకరకంపు తిండ్లు లభ్యమగుట

    Tuesday, April 20, 2021

     పసివాని తోడ దాటెడు

    వసుదేవుని గాంచివాలీ ఫక్కున నవ్వెన్

    రసమయ ఘట్టమ ని సురలు

    దెసలన్నియు మారుమ్రోగ దీవనలొసగెన్

    Monday, April 19, 2021

    నమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్

    మమతను దేవదానవులు మర్దన జేయగ బాలసంద్రమున్
    నమృతముబాటుగాగనట హాలలంబును గామధేనువున్
    దమకము గల్గు నాశివుడు దద్దయుపార్వతి బ్రోత్సహించగా
    నమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్

    అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము

    అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము
    నిట్టి పూరణ కష్టమే యీశునకును
    శివుడు మ్రింగెను విషమును భవ్య వలన
    సైంహికుడు మ్రింగె నమృతము దేవతగను

    Sunday, April 18, 2021

    కాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్

    కూలి జనంబులెప్పుడును గోలను జేయక తీసికొందురే
    కాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్
    కాలము వమ్ముసేయకను గాలుని సేవయె నిత్యకృత్యమై
    మేలగు రీతినిన్ భువిని మిక్కిలి శ్రద్ధగ జేయువారికిన్

    కాలికిన్ ముల్లుగ్రుచ్చ,సుఖంబు గలుగు

     బాధ గలిగించు నిరతము వచ్చువరకు

    కాలికిన్ ముల్లుగ్రుచ్చ,సుఖంబు గలుగు

    ముల్లు దీసిన దదుపరి యుల్లమలరి

    దాని బాధను వర్ణించ దరమె మనకు?

    Saturday, April 17, 2021

    దత్తపది

     ముద్దుగుమ్మ! ముదము,గోడ దద్దరిల్లు

    నట్ల యరుగు దమికరమ్ము తలుపు

    తీయి సైరంధ్రి యనుచును దీయపలికె

    కీచ కుండప్డు కలుగగ నీచబుద్ధి

    Friday, April 16, 2021

    పరమాత్ము భజనసేయ బాధలు గల్గున్

    తిరుపతి కేగిన వారికి
    నరగంటయె కాక మునుపు టలసట కలుగన్
    పరమాత్ము భజన యాగుట
    పరమాత్ము భజనసేయ బాధలు గల్గున్

    Thursday, April 15, 2021

    ఎలుకలనంగ నీవెఱుగవే గగనమ్మున నీదునట్టివౌ

     ఎలుకలనంగ నీవెఱుగవే గగనమ్మున నీదునట్టివౌ

    యెలుకలవోలె గన్పడును నెచ్చటనుండ విమానమంతటన్

    గలిబొలి మాటలాడగను గాలమె యీయది?కాంత చెప్పుమా

    యెలుకలు నీటనీదునని నెంచుచు జెప్పుదుబాల! యిప్పుడున్

    ఎలుకలన,నాకసమ్మున నీదునవియె

     చుంచు రూపమునుగలిగి సంచరించు

    నెలుకలన,నాకసమ్మున నీదునవియె

    ఫ్లైటులనబడి తిరుగుచు బాటసారి

    నిలను జేరవేయును వారి నిలయములకు

    Wednesday, April 14, 2021

    కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్

    చురచుర యనుచును బేలును
    కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్
    నిరతము శీతలమగుటన
    నరయుమ యాక్షీరమంత యట్లుగమారెన్

    గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్

    చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్
    గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్
    నిరతము చల్లజేయుటన నేయియుమారెనుపూర్వరూపమై
    యరయుము పండితోత్తముడ! యందలిమార్పుల చిత్రమంతయున్

    Tuesday, April 13, 2021

    జనమునెల్లమ్రింగె శ్వాన మొకటి

    ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనో
    క్షణము లోన జరిగె సరిత!కంటె?
    తినుట కొఱకు నిన్న తేబడినట్టిభో
    జనమునెల్లమ్రింగె శ్వాన మొకటి

    ప్లవనామాబ్దమ!రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్

     భవముల్ నీయగ వేగమేయిటకు సంభావ్యంబునొప్పంగ నో

    ప్లవనామాబ్దమ!రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్

    వివరంబొప్పగజెప్పు నీమదిని నేభేదంబు లేకుండగా

    భువికిన్ రక్షణ జేయగా మనుమయోపూతాత్మ! యోరక్షకా!

    ప్లవసంవత్సరమ!తెత్తువా సేమమ్ముల్

     శవముల జేయుచు మమ్ముల

    భువిలో లేకుండజేయ పుట్టితివేమో

    వివరముగ జెపుమనీవో

    ప్లవసంవత్సరమ!తెత్తువా సేమమ్ముల్

    Sunday, April 11, 2021

    ఇంతలుగన్నులున్న దెరువేకననైతి నిదేమిచోద్యమో

     గంతలుగట్టినట్లుగను గన్నులుగల్గుట యోవరూధినీ!

    యింతలుగన్నులున్న దెరువేకననైతి నిదేమిచోద్యమో

    యంతయునుండెగానరయనంతముజిక్కనిమార్గమిచ్చటన్

    నింతివరూధినీ!చెపుమ యిచ్చటి మార్గము బోవ యింటికిన్

    కింతలు గన్నులున్నను దెరువే కననైతిన్

    ఇంతీవరూధినీ!నా
    కింతలు గన్నులున్నను దెరువే కననైతిన్
    నంతయు నయోమయమయే
    చింతలు లేకుండ నేగ చెప్పుమ దారిన్

    Saturday, April 10, 2021

    అలుకంజెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే

     కలలో సైతముదూషణంబుగను వాగ్ఢారన్ బ్రదర్శించున్

    నలుకంజెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే

    లలనాశ్రేష్ఠుల జూడగాదెలియు వాలాయంపు టౌన్నత్యమున్

    వలపుల్ గుప్పుచు జేరవత్తురుగ దావాల్లభ్యమున్ జూపుచున్

    అలిగిన సతులుడుగరు,దగువ్యాపారములన్

     కలనైన మొఱకుదనమును

    నలిగిన సతులుడుగరు,దగువ్యాపారములన్

    లలనలు సేతురు చక్కగ

    విలసితమగు నేర్పుతోడ పెద్దలు మెచ్చన్

    Friday, April 9, 2021

    పురుషవరుడు సీరగట్టిపూవులముడిచెన్

     తరతమభేదము జూడక

    సరసికుడై మనుటవలన సరసతలొలకన్

    మరియును బిచ్చియె ముదరగ

    పురుషవరుడు సీరగట్టిపూవులముడిచెన్

    Thursday, April 8, 2021

    తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ముదమ్మునన్

     తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ముదమ్మునన్

    బాలక! యేమినీపలుకుభావ్యమె నీకిది?ముద్దులాడుటల్

    మేలము లాడగన్ సమయమేయిది కుట్టునుగాపుటుక్కునన్

    కాలము వమ్ముగాగనక గాలుని పూజను జేయుమెప్పుడున్

    తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్

     కాలుని గెలిచిన దగుటన

    తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్

    మేలములాడుచు నుంటివె?

    బాలిక! యికజెప్పకిటుల బరిహాసముగా

    దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్

    గట్టువ రాజశేఖరుడ!గారవమొప్పగ నెల్లవేళలన్
    దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్
    బిట్టున వారిమానసముబేర్మిని మారుచు మంచివారునై
    నిట్టటుచేయుచుందురిక యీప్సిత కార్యమునర్హులైనచో

    తిట్టువారికిడుము దీవెనలను!

    తిట్టువారికిడుము దీవెనలనుతాత!
    బుద్ధివచ్చి యుండ్రు బుద్ధిగాను
    నీతిమంతు డగుచు నిరతము మంచినే
    చేయుచుండు బ్రజకు చిరము సుమ్ము

    Wednesday, April 7, 2021

    సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ

     ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలన

    పగలు గడుచుటబహుభార మగుట,సరిగ

    సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ

    తల్లిదండ్రుల బాధలు దరమె చెప్ప

    సాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?

     ఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనే

    సాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?

    సాకగ దప్పదేరికిని సంతును గాయముకష్ట మైననున్

    నీకలికాలమంతయును నిట్లుగనుండును జెప్పనేటికిన్ 

    Tuesday, April 6, 2021

    జమునను జూడగావిజయ! శాంతిలభించె జయప్రదమ్ముగన్

    విమలపు మానసంబునను వేయిరకంబగు చిత్స్వరూపమౌ
    జమునను జూడగావిజయ! శాంతిలభించె జయప్రదమ్ముగన్
    నమలిన రక్తిగల్గుచును నాదరమొందగ జిత్రప్రక్రియన్
    బ్రమదము తోడచేయుచును రాణకునెక్కినభామయామెయే

    Sunday, April 4, 2021

    గరములనెల్లవేళ గడుగన్ వలె దైలముతోడ మేల్గనన్

    అరయుము నేటిలోకమును నంతటనుండెను నాకరోనయే
    నిరతము జాగరూకతన నెమ్మదినుండగ మంచిగావునన్
    గరములతోడ దాకగనుగట్టిగ జేతులు శుభ్రబర్చనౌ
    గరములనెల్లవేళ గడుగన్ వలె దైలముతోడ మేల్గనన్

    కడుగ వలయు దైలంబున కరయుగమును


    ఏది ముట్టిన వెంటనే యీశ్వరార్య!
    కడుగవలయు దైలంబున కరయుగమును
    లేనియెడలను నంటుక రోనమనకు
    గాన జాగ్రత్త బాటించ కరము మేలు

     

    మనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరే

    జనముల్ మెచ్చగ పాండితీగరిమ,సచ్ఛైలిన్ బ్రదర్శించుభవే
    మనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరే
    జనసామాన్యుల కర్ధమౌనటుల స్వచ్ఛంబైన బద్యాలతో
    వినగానింపుగనుండు నట్లుగను దావేలాదిగావ్రాసెగా

    Saturday, April 3, 2021

    మనపద్యములు బఠించి మాన్యతగనరే

     మనములు రంజిలగావే

    మనపద్యములు బఠించి మాన్యతగనరే

    కనివిని యెఱుగని రీతిని

    మనకిచ్చెను సూక్తులెన్నొ మాన్యులు మెచ్చన్

    Friday, April 2, 2021

    నీశు గల్గునరుల మెచ్చు నీశ్వరుండు-

     పరుల కీడును దలపెట్టు వానిగాంచి

    దైవదూషణ జేయుమానవునిఋజూడ

    నెయ్యమును మోసగించెడునయ్య యెడల

    నీశు గల్గునరుల మెచ్చు నీశ్వరుండు-

    వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై

    మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియా
    వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై
    వెధవనుబేర వ్రాసిరట పేర్మిని జూడగ నూఱుపద్యముల్
    వెధవలయందు వారికిల బ్రేమనుజెప్పగశక్యమే హరా!

    Thursday, April 1, 2021

    వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్

     మిధిలాపురమున గొందఱు

    వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్

    బధికుల వెంటనుబడుచు వి

    విధములుగ బాధపెట్టు వెధవలు వారే

    Wednesday, March 31, 2021

    వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టెదాళినిన్

     వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టెదాళినిన్

    వరుడును గట్టెదాళినిక వైభవమొప్పగ దాళినామెకున్

    నరయగ మంగళంపునును హారము పచ్చటి పావడంబును

    నిరువురు నొక్కసారిగను నింపొనరించగగట్టిరయ్యెడన్

    వధుని మెడలోన దాళిని వరుడు గట్టె

     కలియుగపు మహిమవలన కామినేని!

    వధుని మెడలోన దాళిని వరుడు గట్టె

    నెవరు కట్టిన సరియెనౌ నింక వారు

    చిలుక గోరింక వోలెను మెలగు టొప్పు

    Tuesday, March 30, 2021

    గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యముజూపె దయావిహీనుడై

     భీముని సూనుడున్ మిగుల భీకర రూపము దాల్చిదానుసం

    గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యముజూపె దయావిహీనుడై

    సామముజేయ నొప్పుకొన సైనీకులెవ్వరు నిచ్చగింపనౌ

    భీమరమయ్యెగా నచట భీకరమైన వీధంబుగారవీ!

    Monday, March 29, 2021

    గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముజూపెన్

     

    భీముని తోబాటుగసం

    గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముజూపెన్

    సామీరినిమించువిధము

    నీమముతోజేసెరణము నిర్జరులలరన్

    శునకమ్మున్ గడుభక్తిగొల్చిన లభించుభో శుభమ్ముల్ గడున్ ?

     కనగన్ తట్టెను యిట్లు వ్రాయగను నోకామాక్షి యేమంటివే

    శునకమ్మున్ గడుభక్తిగొల్చిన లభించుభో శుభమ్ముల్ గడున్ ?

    వినుమా శంకరు గోల్వగానగును నెవ్వాడెంత భక్తిన్ దగన్

    గనిపించుండతడేయిలన్ గదిక దాగైకొండు మోక్షంబికన్

    Sunday, March 28, 2021

    శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్గున్

     కనగనె ఛీఛీ యనవలె

    శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్గున్

    వినగను సంతస మొందగ

    ననవరతము గీ ర్తనలను నార్తిని బాడన్ 

    Saturday, March 27, 2021

    అన్నమయ్యెసున్నము,ముదమందితినిరి

     గారడి యొకని కనికట్టు బరగు కతన

    అన్నమయ్యెసున్నము,ముదమందితినిరి

    భక్తులందఱు దృప్తిగ రక్తితోడ

    దైవనామము బలుకుచు దనివితీర


    అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధురెల్లరున్

    భిన్నపు మాటలన్ బలుక,పేలవమౌదువు గాదెయోరవీ!

    యన్నము సున్నమెట్లగును నారసి చెప్పుమ వింతయేగదా

    యన్నముగళ్ళకున్నదిమి హాయీగ తిందురు బంధురెల్లరున్

    Friday, March 26, 2021

    వాసన లేనిపువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

    పైసలు లేకపోయినను పామరు వోలెను నుండకుండగా
    వీసము మాత్రమున్ జలము వీడక ధైర్యము తోడనుండుచున్
    మాసము మాసమున్ ధనము మందులు,బీదలకున్ నియోగించుటన్
    వాసన లేనిపువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

    వాసన లేనట్టి పువ్వు వాసినిగాంచెన్

     కాసులు గొరవడి యైనను

    వీసమునున్ జంకకుండ పేదలకొఱకై

    పైసలు పంపుట గనగను

    వాసన లేనట్టి పువ్వు వాసినిగాంచెన్

    పగవానిన్ మనచిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్

    పగవానిన్ మనచిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్
    పగవానికిన్ సరి,కానివానినిల నాప్యాయంబుగా జూచుచున్
    బగలేకుండగ నుండుచో నెపుడు పాపంబబ్బదే వేళయున్
    జగదాధారుడు నెల్లవేళలను దాసంరక్షణంబున్ గొనున్

    Thursday, March 25, 2021

    బగవానికి సేవజేయ వలెమేల్గలుగున్

    పగవాడేతర వానికి

    బగవానికి సేవజేయ వలెమేల్గలుగున్
    జగమున గలదొక సామెత
    తగువిధపుంమనుజ సేవ తార్ష్యుని సేవౌ

     

    Wednesday, March 24, 2021

    దత్తపది బండి--రధము--ఓడ--విమానము

    బ్రదుకు బండిని నీడ్చగ శక్తిలేక
    తనమ నోరధము నునోడ గొనగజేసి
    వేడుకొనె బరమాత్ముని విపులముగను
    భక్తరక్షణ శీలివి మానముడుగ
    జేసికాపాడు మమ్ముల జేరదీసి

    మోదీ!నిన్గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో

     మోదంబందుచు మానసంబున దగన్ ముమ్మూర్తులానీవెగా

    మోదీ!నిన్గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో

    దాదీ చెప్పిన మాతలన్ వినగనే దాదాత్మ్యమున్ బొందితిన్

    మోదీపై మనసుండి యిట్లుగను దా మోదంబుతోనుంటకున్

    మోదీ! నిన్ గాంచినంత మోహించునొ

     హోదా గలదని దలచుచు

    మోదీ! నిన్ గాంచినంత మోహించునొకో

    దాదీ పలుకుచు నాతో

    మోదముతోనుండెమిగుల మొన్నటినుండిన్ 

    Monday, March 22, 2021

    నష్టము లేదులేదు మననాయకులెల్లరు నీతిమాలినన్

     నష్టము లేదులేదు మననాయకులెల్లరు నీతిమాలినన్

    నష్టము లేదులేదనగ నాయము కాదుగ జింతజేయగా

    భ్రష్టతనొందు దేశము నపారముగాసిరులన్నిపోవవా?

    యిష్టులగాక సజ్జనుల నెన్నుకొనంగసు నెల్లవేళలన్

    నాయకుల్ నీతిమాలిన నష్టమగున

     నాయకుల్ నీతిమాలిన నష్టమగున

    చెప్ప నగునేని దాముగా జిప్పకూడు

    తినెడు రోజులు వచ్చును ననయమునిక

    జీవితాంతము నుందురు చెఱను సుమ్ము

    Sunday, March 21, 2021

    కోతినటంచు నర్జునుడు గొండలనెక్కుచు వేసెగంతులన్

     నాతియ చెఱలో నుండగ

    గోతినని ధనంజయుండు కొండలనెక్కెన్

    మాతను వెదకుట కొఱకై

    నైతిక మౌయనుచునెక్కె నాటక మందునన్


    రాతిరి యాటలాడుచును రాహువు భీముడు జేరగాదనున్

    కోతినటంచు నర్జునుడు గొండలనెక్కుచు వేసెగంతులన్

    గాతరమేమియున్గనక గంతులు వేయుట యబ్బురంబునౌ

    కోతికిచేయనోపునిల గూర్మిని బూజలు దైవమౌటగా

    Saturday, March 20, 2021

    కూడునుబెట్టునా యిడున గూడును పద్యము లెన్నడేనియున్

     కూడునుబెట్టునా యిడున గూడును పద్యము లెన్నడేనియున్

    వీడుడు సంశయంబునిక బేర్మిని నాయమ యిచ్చువాటినిన్

    నేడిద రామచంద్రకవి!యీభువనంబున దప్పకుండగన్

    బాడగనుండు దీయగను బద్యములెప్పుడు దేనెవోలెసూ

    కూడుబెట్టునా పద్యముల్ గూడునిడున

     కూడుబెట్టునా పద్యముల్ గూడునిడున

    సందియంబును వీడుము శర్మ!నీవు

    రెండునిచ్చును బద్యముల్ మెండుగాను

    శారదామాత దయనవి సంభవించు

    Friday, March 19, 2021

    ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకోయటంచు దాన్

     ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకోయటంచు దాన్
    నుదయము లేచునంతనెనయోమయ వార్తను దెల్పిరేగదే
    సదయను జూడుమమ్ములను శంకర! యేమని వ్రాయగల్లుదున్
    నుదయము లేపు గోడియ మయూరముగాదుగ జింతజేయగన్

    యుదయమె కొక్కొరొకొ య

     మదనాల! లేపు కోడియె

    యుదయమె కొక్కొరొకొ యని,మయూరములేపున్

    హృదయము సంతో షించగ

    విదలించుచు నొక్కసారి పింఛము వడిగాన్

    వనితారత్నము పెండ్లినాడు కనగా ,బాలెంతరాలొప్పుగన్

    కనసొంపై యలరారెగా కమల! యాకంజాస్య క్రీగంటి యా
    వనితారత్నము పెండ్లినాడు కనగా ,బాలెంతరాలొప్పుగన్
    వినయంబొందుచు చూచువారలకు దేవేరిన్ గనంగాయెడిన్
    గనుడీలోకము పోకడన్ ,గనుచునేకాంతంబుబాటించుమా

    Thursday, March 18, 2021

    ఇంతి తనపెండ్లినాడు బాలెంతరాలు

     ఇంతి తనపెండ్లినాడు బాలెంతరాలు

    జరుగు చున్నవి యీనాడు శంకవలదు

    జరుగునింకను వింతలు జగమునందు

    చూచు చుండుట మనపని సుజనులార!

    పొమ్మనిపెట్టినం బొగను ,బోమనువారెకదాసుబాంధవుల్

    కమ్మని వార్తనున్ నుడువ గంపెడునాశనువచ్చువారినిన్
    పొమ్మనిపెట్టినం బొగను ,బోమనువారెకదాసుబాంధవుల్
    నిమ్ముగ వచ్చునాపగకునేరికి నష్టము గల్గకుండగా
    నమ్మరొ చక్కజేసిరిమ హాత్ములరీతిని గాదెవారలున్

    Wednesday, March 17, 2021

    బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్

     పగగొని చెడుభాగముగా

    బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్

    సుగమంబగురీతిని,హిత

    మగుపలు కున్బలికిపగను నంతముగాగన్

    లోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?

     చీకును జింతయున్ వదలి సిగ్గును గల్గగ బల్కుచుంటె?యే

    లోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?

    లోకులు గాకులందురిల లోకులమాటలు గడ్డిపోచలే

    యీకలి పూరుషున్ మహిమ లేయివి వీటిని నమ్మబోకుడీ

    Tuesday, March 16, 2021

    పంచవటిలో వసించిరి,పాండుసుతులు

    రామ లక్ష్మణులును సీత రమ్యమలర
    పంచవటిలో వసించిరి,పాండుసుతులు
    మీదుమిక్కిలి తేజస్సు నొదవి భువిని
    పాలనంబును జేసిరి బాహుబలిని

    పాతివ్రత్యము మంటగల్పెనుగదా పాపిష్ఠ సావిత్రియే

     పాతివ్రత్యము మంటగల్పెనుగదా పాపిష్ఠ సావిత్రియే

    పాతివ్యత్యము రక్ష సేయుటకునై భారంపు కార్యంబయౌ

    ప్రేతేశుం దగనొప్పుకోలుగను దాబ్రీతిన్ వి భుంబ్రాణిగా

    బంతంబొప్పగ జేసెనప్పుడు గదాప్రాణాల నర్ధించియే

    Monday, March 15, 2021

    పాతివ్రత్యముజెఱచితివా సావిత్రీ!

     ఓతల్లీ యేమాయెను

    పాతివ్రత్యముజెఱచితివా సావిత్రీ!

    నీతినిమాలిన యీపని

    కాతరమే లేద నీకు కాంతా!చెపుమా

    కోవ్యాక్సిన్ గని గోల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

     సవ్యంబైనది యౌషధంబని యికన్ సాహాయ మున్జేయగా

    కోవ్యాక్సిన్ గని గోల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

    నవ్యంబై ముఖమంతయున్ బరగగా నైరాశ్య మొందన్ వెతన్

    భవ్యుండేయికదిక్కు నాకనుచు వే ప్రార్ధించె దీనమ్ముగా

    Sunday, March 14, 2021

    కోవ్యాక్సిన్ గని కరోనగొల్లున నవ్వెన్

     దివ్యంబైనదియీయది

    నవ్యతగా గానిపించె,నయమున్ జేయున్

    సవ్యమగు రీతి వాడిన

    కోవ్యాక్సిన్ గని కరోనగొల్లున నవ్వెన్

    Saturday, March 13, 2021

    గగనము ముష్టిమాత్రము ,నగమ్ములు దేలును దూదిపింజలై

     అగణిత తేజవంతులకు నద్భుతరీతిని నౌను దప్పకన్

    గగనము ముష్టిమాత్రము ,నగమ్ములు దేలును దూదిపింజలై

    భగభగమండు మంటలును వారల దేజపుధాటి కత్తఱిన్

    నెగడుచు నుండిచల్లనయి నీలుగుగోల్పడి యుండునేసుమా

    కాకసమ్ము పిడికిలంత సుమ్ము

     ప్రేరణంబు గలుగ భీతియు లేనట్టి

    యాంజనేయు డుదధి నడ్డువచ్చు

    వారినధిగ మించి చేరలంక నతని

    కాకసమ్ము పిడికిలంత సుమ్ము

    హరునిదురూహలే,వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    అరయుమ యెందుశోధనను నద్భుత రీతినిజేయగానవా
    హరునిదురూహలే,వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్
    హరుని మనంబునందుననె!ధ్యానముజేయునొ,వానికీభువిన్
    గరమును నిచ్చునాయువును గామితవాంఛలునిశ్చయంబుగన్

    హరునిదురూహలె,సుఖమిడునట్టి వరములౌ

    అరయగ గనబడవుగద యా
    హరునిదురూహలె,సుఖమిడునట్టి వరములౌ
    హరుడొసగును భక్తులకిల
    హరునిన్ సేవించునెడల నాయువు సిరులన్
     

    Thursday, March 11, 2021

    గోరిసుయోధనుండు,గడకున్ బ్రణమిల్లెను యాఙ్ఞసేనికిన్

     శూరులునైన రాజులట జోరుగ గానుక లెన్నియో ,యికన్

    హారములింపుగొల్పెడు నయాభరణంబుల నీయగా

    వారల రాజసూయపు ప్రాభవమంతయు జూసి యంతటన్

    గోరిసుయోధనుండు,గడకున్ బ్రణమిల్లెను యాఙ్ఞసేనికిన్