Friday, January 31, 2020

అమ్మనుబెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్

నెమ్మినిమేనకాదుహితనేరుగశంకరుబూజజేయయా
యమ్మనుబెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్
నమ్మలగన్నయమ్మయగునాగిరిజమ్మనుబెండ్లియాడిమా
కిమ్ముగనిచ్చుగావుతనభీష్టపుసిద్ధికిశక్తియుక్తులన్

మంచివారికిరాదులేమంచిరోజు

మంచివారికిరాదులేమంచిరోజు
నెంచిచూడగసత్యమే యిప్పుడమిని
చెడ్డవారలుబొంకుచు నడ్డముగను
రాజ్యమేలుదురప్పటిరావణునిగ

Thursday, January 30, 2020

పగవానింగనిదాసుడైమనుటె,శుంభత్పౌరుషంబౌగదా

ఙే
విగతంబౌమనుజుండుతోసమమునెవ్విధంబుచింతించినన్
పగవానింగనిదాసుడైమనుటె,శుంభత్పౌరుషంబౌగదా
జగతిన్ బీదలయాశలన్ మదినిసుసంభావించిచేదోడుగా
సుగమంజేయుచునుండునోనెచటయచ్చోటన్ శుభంబేయగున్

పగవానికిదాసుడగుటె,పౌరుషముగదా

మగతనములేకయుండుట
పగవానికిదాసుడగుటె,పౌరుషముగదా
పగవానిగర్వమణచగ
విగతుడునౌవరకుపోరిపీడించంగాన్

Wednesday, January 29, 2020

వాగ్దేవింగడుభక్తిగొల్చిననెటుల్ పాండిత్యమబ్బున్ సఖా!

వాగ్దేవింగడుభక్తిగొల్చిననెటుల్ పాండీత్యమబ్బున్ సఖా!
వాగ్దేవేగడురక్తినిచ్చునుదగన్ బాండిత్యమున్ దానుగా
వాగ్ధాటిన్ గడునేర్పుమీరగవచోపాండిత్యమున్ జూపుచో
దుగ్ధన్ నొందుచునేర్చుకుండినవహాదానంతరాకుండునా!

వాగ్దేవినిగొల్చువాడు,పండితుడగునా

స్నిగ్ధతనువ్రాయురచనలు
వాగ్దేవినిగొల్చువాడు,పండితుడగునా?
వాగ్ధాటి లేనిమనుజుడు
వాగ్దేవియుసంతసిలదుపాండిత్యమునున్

సవతులుగల్గినన్ ,సతికిసౌఖ్యముదక్కునటన్నసత్యమే

భవములునాశనంబగునుభావితరాలునుగేలిసేయునే
సవతులుగల్గినన్ ,సతికిసౌఖ్యముదక్కునటన్నసత్యమే
ధవుడనునాతడెప్పుడునుదానపురూపముగాగజూచుచో
భవితనుగూర్చిబెంగయునుబాధనుగానికలేకయుండుటన్

Tuesday, January 28, 2020

సరస్వతీస్తుతి

ఘొ
జననీ! భారతి! బ్రహ్మ వక్త్రములలోఁ జైతన్య చిద్రూపివై
యనయంబున్ వసియించి సృష్టి కరణవ్యాపారతన్ నిల్పి నా
థుని, సద్విద్యల నెల్ల నేర్చు పథ నిర్దుష్టమ్మునున్ జూపు నీ
ఘన విద్వత్ప్రభలన్ మనోంబుజమునన్ గాంచంగ నేనెంచెదన్.

నిరతము నీ పదాబ్జముల నిల్పి మనమ్ములలోఁ గవీశ్వరుల్
సరస వచో విలాస పరిసర్పిత ‌మంజుల సత్కవిత్వమున్
స్ఫురదవధారణా సహిత ముగ్ధ మనోహర కావ్య దీప్తి సం
భరిత రసజ్ఞ మానస విభాసిత శేముషితో రచింతురే.

పలుకుల వెలఁది వగుచు మా
తలవాకిటఁ బొల్చుచున్ సతము లచ్చికిఁ గో
డలివై చదువుల సిరులిడు
తలఁపు గలుగు తల్లివని ముదంబునఁ గొలుతున్.

నీ కమనీయ రూపము పునీతము సచ్చిదనూనదీప్తమౌ
నీ కరుణాకటాక్షము జనింపఁగఁ జేయును పాండితీప్రభల్
నీకయి చేయు సన్నుతులు నిక్కముగాఁ దొలఁగించు నజ్ఞతన్
నీ కొమరుండ నేనని గణించి సుశబ్దము లిచ్చి ప్రోవుమా!

భక్తిన్ త్వచ్ఛుభ దివ్య నామమును సంభావించుచున్ సత్క్రియా
సక్తిన్ విద్య గడింపఁ జూచు నను శశ్వద్ జ్ఞాన సందీప్త వా
గ్యుక్తున్ జేసెడి తల్లి వీవనుచు సద్యోభక్తిభావంబునన్
రక్తిం బూజలు సేయుదున్ విబుధహృద్రమ్యాకృతీ! భారతీ!

శంకరయ్యగురువులు

సవతియున్నసతికి,సౌఖ్యమబ్బు

రామరావణజగడమ్ముగలుగుసుమ్ము
సవతియున్నసతికి,సౌఖ్యమబ్బు
వేరుకాపురమ్ముబెట్టుసతికిగద
చిలుకగోరువంకవలెనునుండ్రు

వందనమమ్మరోయనగృపామతిజూడకచంపగాదగున్

అందరియాడవారలనునాలిగభావనజేయుచున్దుదిన్
వందనమమ్మరోయనగృపామతిజూడకచంపగాదగున్
బందములన్నియున్విడగభామినులందఱుజేసియాతనిన్
బందువులందఱువెలినిబాఱగజేయుటనొప్పునిద్ధరన్

Monday, January 27, 2020

వందనమోతల్లియనినవధియింపదగున్

డెందముపొందునుగోరుచు
వందనమోతల్లియనినవధియింపదగున్
బందముబరిమార్చుచునిక
మందునివెలివేయవలయుమానినులతనిన్

జారకళావతంసులకు,స్వాగతమిచ్చిరిశిష్టులెల్లరున్

ఏరునునీయరెన్నడునునెంతటివారికినైనమన్ననన్
జారకళావతంసులకు,స్వాగతమిచ్చిరిశిష్టులెల్లరున్
వీరజవానుధైర్యమునుబెక్కురుజూడగసంతసంబుతో
బౌరజనంబులెప్పుడునుబూర్వపుగౌరవమిత్తురేసుమాడూ

చి.సౌ.సాయిలక్ష్మి,పాపారావుల వివాహమహోత్సవ శుభాకాంక్షలు

శ్రీలుపొంగెడుకళ్యాణసీమయందు
వివిధరకములవాద్యాలువీనులలరి
వేదమంత్రాలుచదువగవిబుధులచట
శ్రీనివాసునిసాక్షిగాజేయికలుపు

ఈనవవధూవరులకిడునీశుడెపుడు
సకలసంపదలెన్నియోసతినిగూడి
సందియంబిసుమంతయునిందువలదు
సకలసద్గుణశోభిత!సాయిలక్ష్మి!

అమ్మా ,సాయిలక్ష్మి !

అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
నరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
యట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల

తనర వేంకటరావయే తగిన భర్త
యెదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు

మాన వత్త్వంబు తోడను మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున

ఒకరి కోసము మఱియొకరుద్భవించి
యగ్ని సాక్షిగ బరిణయ మాడదలచి
యేకమగుటకు సిధ్ధమె యైన మీర
లందు కొనుడునా జోహార్ల నందుకొనుడు

అమ్మనాన్నలవిడిచియునరుగుదేర
బెంగయుండునునిజమది బేల!నీకు
అత్తలోనన జూచినయమ్మనికను
బాధయుండదుగదనీకుపచ్చినిజము

పుట్టినింటనుమెలగిననట్లుగానె
మెట్టినింటనుగూడనుమెలగుమమ్మ
యాదిదంపతిసములగునత్తమామ
లాదరించుమునిరతముహర్షమొదవ

వైద్యశాస్త్రపుచదువులోబట్టభద్రు
లైనమీరలుపేదలనాదుకొనుచు
సేవజేయుడునిరతముసిరులుగలుగు
నేమికావలెమీకింకనింతకంటె!

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
-------
స్థలము :: తిరుమల
తేది ::30-01-2020         రచన ::పెద్ద తెలుగు మే స్టా రు






Sunday, January 26, 2020

జారులకున్ శిష్టులెల్లస్వాగతమనిరే

ఆరామపూజసేతకు
శ్రీరంగపుటర్చకులనుజీరన్ వారల్
చీరినతడవుజనగబూ
జారులకున్ శిష్టులెల్లస్వాగతమనిరే

Saturday, January 25, 2020

గలతలురేగునెల్లెడగనన్ గణతంత్రదినోత్సవమ్మునన్

కలిబులిమాటలాడుచునుగానిదియౌననిజెప్పుచోసభన్
గలతలురేగునెల్లెడగనన్ గణతంత్రదినోత్సవమ్మునన్
బలుకగనొప్పునెప్పుడునుభవ్యపుమాటలుకచ్చితంబుగా
కలతలుగల్గవప్పుడుసుఖంబుగనుండుదేశమెల్లెడన్

గణతంత్రదినోత్సవమునగలతలురేగున్

గణగణశబ్దముతోడను
రణభూమినినాక్రమించరధగజబలముల్
రణరంగమస్రమౌటను
గణతంత్రదినోత్సవమునగలతలురేగున్ 

Friday, January 24, 2020

నాయుర్వృద్ధికిరోగికీయగదగున్ హాలాహలంబున్ వడిన్

మాయారోగముసోకగాహృదినిదామానంగనప్పట్టునన్
నాయుర్వృద్ధికిరోగికీయగదగున్ హాలాహలంబున్ వడిన్
శ్రేయోదాయకమెల్లవేళలసుమాజీరంపుసారమ్మునున్
బీయూషంబుగద్రాగుచుండినబలోపేతమ్మునౌయాయువున్ 

Thursday, January 23, 2020

పండుగనాడువండననిభామవచించెనుకచ్చితమ్ముగాాాాాా

చండికమాతకున్నిపుడుచక్కెరపొంగలివండుచుండగా
కొండొకకోడికూరపతికోరగవెంటనెబల్కెబత్నిదా
పండుగనాడువండననిభామవచించెనుకచ్చితమ్ముగా
బండుగలైనపిమ్మటనువండుదుగోడినికూరగాప్రియా

పండుగనాడుపలికెసతివండనటంచున్

పండుగపనులెన్నియొయిట
నుండగదెచ్చితె?పతివర!పృధురోమమునున్
చెండికిమడిగా కావున
పండుగనాడుపలికెసతివండనటంచున్

Wednesday, January 22, 2020

సంస్కారంబిసుమంతలేనినరుడే,సత్పూరుషుండైమనున్

సంస్కారంబునుద్రోసిపుచ్చునుగదాసాకారమున్ జూడకే
సంస్కారంబిసుమంతలేనినరుడే,సత్పూరుషుండైమనున్
సంస్కారంబునదామెలంగుచుభువిన్ సామాజీకోల్లాసుడై
సంస్కారంబునువీడకెన్నడు నికన్ చామర్తివంశోద్భవా!

సంస్కారములేనినరుడె,సత్పురుషుడగున్

సంస్కరణలనగనెఱుగడు
సంస్కారములేనినరుడె,సత్పురుషుడగున్
సంస్కారయుతుడెపుడమిని
సంస్కారముగలుగునరుడుచరితార్ధుడగున్ 

Tuesday, January 21, 2020

బతియననర్ధముందెలిపెవ్యర్ధుడటంచునుధర్మపత్నియే

పతియనునాతడెప్పుడునుభార్యకురక్షణనీయలేనిచో
బతియననర్ధముందెలిపెవ్యర్ధుడటంచునుధర్మపత్నియే
పతులనురక్తిగోరుదురుబ్రాపునునిమ్మనిధర్మపత్నులుల్
బతినెడబాయయింతులిలభద్రతతోడనునుండలేరుగా

బతియనగనర్ధమిడెసతి,వ్యర్ధుడనుచు


జీవితాంతము భరియించు చేవయుతుగ
బతియనగనర్ధమిడెసతి,వ్యర్ధుడనుచు
బలికె,గాపాడలేనట్టి భర్త యుయుంట
భార్యకోరునురక్షణ భర్తనుండి

Monday, January 20, 2020

పసికందుల్ విలపింపగన్ గలగిరేభామామణుల్

విసమున్గ్రక్కుచునాగుపామటనునావేశంబుతోగొట్టగా
బుసలన్ భీతినిబాఱ,భామినులునమ్మోయేమిసేతుమా
పసికందుల్ విలపింపగన్ గలగిరేభామామణుల్ వేదనన్
మసకంబాఱెనునాదుజీవితమునిమ్మాశాంతినోభారతీ!

కందులురోదింపమిగులగలగిరిపడతుల్

విందునదల్లులుమునగగ
గుందుచుక్రిమిబాధవలన గురగురయనగా
నందముజిందెడునాపసి
కందులురోదింపమిగులగలగిరిపడతుల్

Sunday, January 19, 2020

ధార్మికరీతులన్విడిచిధన్యతనందినవారమైతిమే

నిర్మలమార్గమున్గనుచునీమముదప్పకవేడికంటికిన్
బేర్మినిమానసంబునెని వేదనజేయుచునెల్లవేళలన్
మర్మపుమార్గమున్జనకమంచినిజేయుచునీతిదూరమౌ
ధార్మికరీతులన్విడిచిధన్యతనందినవారమైతిమే

ధార్మికరీతులనెఱుగని ధన్యులముగదాాాా

మర్మములనెఱుగకెప్పుడు
నిర్మలమగుమనసుతోడనియతినిశివునిన్
బేర్మిని మ్రొక్కెడివారమ
ధార్మికరీతులనెఱుగని ధన్యులముగదా

Saturday, January 18, 2020

పలుకరురాణ్మహేంద్రపురవాసులుసత్యమునెన్నడేనియున్

అలమనశంకరార్యులిటయానతినిచ్చిరియిట్లుగాసుమీ
పలుకరురాణ్మహేంద్రపురవాసులుసత్యమునెన్నడేనియున్
దలచగవారలందఱునుధార్మికవేత్తలుగాదెచూడగన్
బలుకుదురెల్లవేళలనువారలుసత్యమునే నెఱుంగుమా

యెడపక బొంకెదరురాణ్మహేంద్రపురజనుల్

చెడునలవాట్లకులోబడి
యెడపక బొంకెదరురాణ్మహేంద్రపురజనుల్
విడువకమద్యమునెప్పుడు
గొడవలతోనుండ్రుమిగులకొందఱుకుజనుల్

Friday, January 17, 2020

యాయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్

పాయనిరోగమువారల
యాయుర్వృద్ధికినిడదగుహాలాహలమున్
నాయువువృద్ధినిగోరెడు
దాయెవరైనబడయనగుదగుమోతాదున్

నిద్రాసక్తులకుదక్కు,నిఖిలవిభవముల్

ముద్రారాక్షసమనునవి
నిద్రాసక్తులకుదక్కు,నిఖీలవిభవముల్
భద్రాచలేశుగొలువగ
భద్రముగాగలుగుమనకుభవ్యపురీతిన్

Thursday, January 16, 2020

వంకాయన్ గడుబ్రీతిదిన్ననరుడేభ్రష్టుండగున్ వేగమే

వంకాయన్ గడుబ్రీతిదిన్ననరుడేభ్రష్టుండగున్ వేగమే
బొంకుల్ గల్గెడుమాటలట్లుగదగన్ మూర్ఖుండువోలెన్ భళా
జంకున్ బొందకమాటలాడగరమా!స్థైర్యంబు,ధైర్యమ్మునే?
శంకన్నొందకకూరవండుముసుమీసాయంత్ర భోజ్యమ్ముకై

వంకాయనుదిన్ననరుడుభ్రష్టుడగుగదా

వంకరటింకరపలుకిది
వంకాయనుదిన్ననరుడుభ్రష్టుడగుగదా
శంకనువీడుముశంకర!
బొంకులుబలుకంగదగునె?బుడ్డడువోలెన్

Wednesday, January 15, 2020

గనుమా నీకనుమానమాకనుమునన్గాంచంగజాగేలనో

వనితా!తెచ్చితినీకుగానొకటినవ్యంబౌదుకూలంబునున్
గనుమా నీకనుమానమాకనుమునన్గాంచంగజాగేలనో
గనుచోనేత్రముచాలదేయొకటిముక్కంటిన్నుతింజేయుచున్
దనువన్ ధారణజేయుమాయికనుతాదాత్మ్యంబుచెల్వొందగన్ఖఖీ

కనుమనీకనుమానమాకనుమకనుమ

పట్టుచీరనుదెచ్చితిచిట్టి!నీకు
కనుమ,నీకనుమానమా?కనుమకనుమ
యెర్రయంచునదళతళ లీనుచుండె
గట్టుకొనుమమ్మయిప్పుడుకాంతునేను

Tuesday, January 14, 2020

బ్రారంభంబగుదక్షిణాయనము,సంక్రాతిన్ ముదంబొప్పగన్

చేరన్ భానుడుకర్కటంబునకుదాశీఘ్రంబుగానప్పుడున్
బ్రారంభంబగుదక్షిణాయనము,సంక్రాతిన్ ముదంబొప్పగన్
వీరున్ వారలుగాకనందఱుదగన్ బేకాటలాడంగ దా
బారంబొందగజూతురయ్యెడసుమావాత్సల్యమింపారగన్

మకరసంక్రమణము

మకరరాశికిభానుడుమారుకతన
నుత్తరాయణమనబడుపుణ్యదినము
క్రాంతిగలిగించబ్రజలకుకరముభువిని
వచ్చెనీరోజుశుభములబడయుకొఱకు

Monday, January 13, 2020

భోగీయనంగనేభయముబొందివడంకెదరెల్లభూజనుల్ 

రాగమునుల్లసిల్లగసరాగముతోడనుబెద్దపెద్దగా
భోగిదినంబునన్ నెగయుభూరిగమంటలుమిన్నునంటగా
భోగీయనంగనేభయముబొందివడంకెదరెల్లభూజనుల్
యాగనిమంటలన్ గనుచునాతృతనొందుచువారలయ్యెడన్ 

భోగియనినంతజనులకుబుట్టుభయము

చిన్నపెద్దలు మోదానమిన్నుదాకు
పెద్దపెద్దగమంటలువేయుకతన
భోగియనినంతజనులకుబుట్టుభయము
నిల్లుభవనాలభద్రతనెంచిమదిని

About father

జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
 మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణించ నే
 రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే

 కౌశిక గోత్రమున మంచి బ్రాహ్మణుఁ డను వెన్నెలతో పుట్టి జ్ఞానము ధనములతో వెలుఁగు కపిలేశ్వరపురమున విద్యతో పరిశుద్ధమైన మనస్సు కలవాఁడై మనస్సులో ఏ మాత్రము విష్ణు జపము తగ్గని నడత తో గ్రామ కరణమై పేర్రాజను పేరుతో జీవించెను.
by
kameswararao

పురుషుల్ పొందెదరెప్పుడున్ ,పురుటినొప్పుల్ దప్పదీభూమిపై

తరుణుల్ నీరముబోసికొందిరనువార్తన్ ,మోదమున్ దాముగా
పురుషుల్ పొందెదరెప్పుడున్ ,పురుటినొప్పుల్ దప్పదీభూమిపై
యరయన్ స్త్రీలకుగర్భమున్గలుగ,నిందాశ్చర్యమేలేదుగా
వరదామోదర!వింటివాయిదియయప్పారావుజెప్పెన్సుమా

Sunday, January 12, 2020

నిదురనుమున్గువారలకునిశ్చలసంపదలబ్బినెన్నగాాాాాన్

మదములుగల్గునెప్పుడునుమాంద్యముగూడనునబ్బునేసుమా
నిదురనుమున్గువారలకు,నిశ్చలసంపదలబ్బునెన్నగాన్
సదయనుమెల్గువారలకుశంభునివీక్షణమెల్లవేళలన్
నిదుగులులేకయేవఱలియేవురుసంతసమొందురీతిగా
--

పురిటినొప్పులు తప్పవుపూరుషులకు

కావ్య రచనకు బూనిన గలుగుసుమ్ము
భావసంపద గణములబంధమనెడు
పురిటినొప్పులు తప్పవుపూరుషులకు
నటుల యింతులకునుధర నార్య గాదె!

Saturday, January 11, 2020

సుఖసంపదలందెనంచు,శోకింపదగున్ఖి

శిఖరములకుబోబోకుమ
 సుఖసంపదలందెనంచు,శోకింపదగున్
 సుఖములుగలుగుటలేదని
 శిఖరేశుడునిచ్చుగాతసిరిసంపదలన్

Friday, January 10, 2020

నిందారోపణలుహితమునేయొసగుజెలీ!

సందులుగొందులుదిరిగిన
నందరునినుజూతురెపుడుననుమానముతో
సందులుదిరుగుటవలదను
నిందారోపణలుహితమునేయొసగుజెలీ!

దుఃఖముగాదెచక్కనివధూటిరతంబువిదగ్ధకోటికిన్

దుఃఖముగాదెచక్కనివధూటిరతంబువిదగ్ధకోటికిన్
దుఃఖముగాదెనాయనగదోచదుమాకికమాటలాడగన్
దుంఖమెయౌనుగారతముదుర్జనుదోడనుగల్గుచోధరన్
దుఃఖముగాదులేసుజనుదోడనుచక్కగజర్గుచోరతిన్

Thursday, January 9, 2020

దుఃఖమేకూర్చుగాదెవధూటిరతము

పూలుకోయగవచ్చినబోటిజూచి
గోడచాటునగలయట్టికొంటెవాడు
మీదబడగనుబాదెను నదయతోడ
దుఃఖమేకూర్చుగాదెవధూటిరతము

సమ్మెలె,సాధనమ్ములునిజమ్ముగదేశపురోభివృద్ధికిన్

నమ్ముముసోదరా!ప్రగతినంజువడంగనుగారణంబులుల్
సమ్మెలె,సాధనమ్ములునిజమ్ముగదేశపురోభివృద్ధీకిన్
నెమ్మిగదోడుగామసలినేతలుపౌరులున్యాయబద్ధత
న్నిమ్ముగసేవజేయగనునైచ్ఛికబుద్ధినినుండగాదగున్

Wednesday, January 8, 2020

సమ్మెలెదేశప్రగతికిసాధనములగున్

షమ్మీ!యెఱుగుమయీయది
సమ్మెలెదేశప్రగతికిసాధనములగున్
సమ్మెలు సేయుచునుండిన
నిమ్ముగబనిజేయుబ్రభుతయెక్కాలమునన్

Tuesday, January 7, 2020

బూరణమన్నసత్కవులుభూరిభయమ్మునబారిరంతటన్

పూరణమన్ననర్ధమునుబూర్తిగనేరనిగారణంబునన్
బూరణమన్నసత్కవులుభూరిభయమ్మునబారిరంతటన్
బూరణజేయరాదుపరిపూర్ణపుఛందమునేర్వకుండుచో
బూరణజేయగల్గుదురుపూర్వసువాసననుండుచోధరన్

పారిరిగదపూరణమునవరకవులెల్లన్

పూరణదెలియనివారలు
నేరరుపూరించువిధము నియమముతోడన్
గోరికగలవారైనను
పారిరిగదపూరణమునవరకవులెల్లన్

పరకాంతారతులైనవారలకుసంపత్సిద్ధిగాకుండునే

కరుడుంగట్టినదుష్టబుద్ధులవియెక్కాలంబునందుందగున్
బరకాంతారతులైనవారలకు,సంపత్సిద్ధిగాకుండునే
నిరతంబచ్యుతుగొల్చుచోభువినినానీరేజభవ్యుండుతో
వరలున్ దప్పక,సందియంబునికవేపారంగబోద్రోచుమా

పరకాంతారతులైనవారలకుసంపత్సిద్ధిగాకుండునే

కరుడుంగట్టినదుష్టబుద్ధులవియెక్కాలంబునందుందగున్
బరకాంతారతులైనవారలకు,సంపత్సిద్ధిగాకుండునే
నిరతంబచ్యుతుగొల్చుచోభువినినానీరేజభవ్యుండుతో
వరలున్ దప్పక,సందియంబునికవేపారంగబోద్రోచుమా

పరకాంతారతులైనవారలకుసంపత్సిద్ధిగాకుండునే

కరుడుంగట్టినదుష్టబుద్ధులవియెక్కాలంబునందుందగున్
బరకాంతారతులైనవారలకు,సంపత్సిద్ధిగాకుండునే
నిరతంబచ్యుతుగొల్చుచోభువినినానీరేజభవ్యుండుతో
వరలున్ దప్పక,సందియంబునికవేపారంగబోద్రోచుమా

Monday, January 6, 2020

పరకాంతాసక్తులకగువరసంపత్తుల్

పరకాంతలగూడినచో
విరివిగనొడలెల్లబెచ్చులుగలుగన్
నెఱుగనిజబ్బులెయనునవి
పరకాంతాసక్తులకగువరసంపత్తుల్

ముదితా!పాడ్యమినాడెచేయదగున్ ముక్కోటియేకాాాాదశిన్

ముదితా!పాడ్యమినాడెచేయదగున్ ముక్కోటియేకాదశిన్
బదలాయింపులుసేయగాదగునెయమ్మాయేమియిట్లంటిరే
విదితంబేగదమీకునున్ దనరవేవేలంబ్రజానీకముల్
ముదమారంగనుసేవజేతురిలనావైకుంఠవాసున్ రతిన్

Sunday, January 5, 2020

నాకిదియాదివారమయినన్ సెలవేలభియింపదెందుకో

నాకిదియాదివారమయినన్ సెలవేలభియింపదెందుకో
మీకదిశాపమోయరయమీరనిభక్తియొచింతజేయుమా
చాకిరిజేయుచుందువుగసంధ్యనుజూచెడువేళయంతకున్
దేకువతోడనీమనసుతీరునుమార్చుములభ్ధిపొందగన్ 

ఆదివారమెసెలవందదేల

ఆదివారమెసెలవందదేలననగ
సెలవునీయయాగుశీఘ్రముగను
జేయవలసిననిక వ్రాయవలసినవి
యందువలననెసెలవందదార్య!

Saturday, January 4, 2020

నిందారోపణముల్ ,హితమ్ములొసగున్ నీరేజపత్రేక్షణాాాా

బంధంబుల్దెగనాడునట్లుగనికన్ భావ్యంబెజేయంగనా
నిందారోపణముల్ ,హితమ్ములొసగున్ నీరేజపత్రేక్షణా!
బంధంబుల్ గొనసాగనిచ్చునుధరన్ వైరంబులేకుండగా
నందంజిందెడుపార్వతీపతిదగన్ నర్ధించగానెప్పుడున్
----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

Friday, January 3, 2020

నూతనసంవత్సరపువినోదములేలా

మాతనువీడినమనలకు
నూతనసంవత్సరపువినోదములేలా
భూతేశునినేవేడెద
మాతకుమోక్షమ్మునిమ్ముమాపైదయతోన్

విలువలుమృగ్యమ్ములయ్యె,విఙ్ఞులుమెచ్చన్

కులములచిచ్చులురగులగ
విలువలుమృగ్యమ్ములయ్యె,విఙ్ఞులుమెచ్చన్
కలతలనొందెడువారిని
కలియుచుమేల్సేయదగునుకసుబుసులేమిన్

Wednesday, January 1, 2020

కలిమిఘనంబుగాగలుగు,గానలకేగివసించువారికిన్

కలకలరావముల్గలిగికాననమంతయునందగించగా
సలిలపుధారలోమునుగసామజశ్రేణులునుత్సహించగా
లలితమనోహరంబగుచులాలనజేయుచునాసువాసన
ల్గలిమిఘనంబుగాగలుగు,గానలకేగివసించువారికిన్

కలిమిగలుగువసించినగాననమున

విలువకలిగిన గంధపువిటపులనెడు
కలిమి,గలుగువసించినగాననమున
లభ్యమగునార్య!యచ్చటలలితములగు
నన్నిరకములవనరులుమిన్నగాను

వంతలనిచ్చుగాత!నవవత్సరమెల్లబ్రజాాళిమెచ్చగన్

సుంతయుబుద్ధిలేకయునుసోమరిపోతుగదిర్గుచున్నచో
సంతులక్రోధవహ్నికికసాహుతులౌచుతదప్పకుండగన్
వంతలనిచ్చుగాత!నవవత్సరమెల్లబ్రజాళిమెచ్చగన్
శాంతినిసౌఖ్యమున్భువికిశంకరుడిచ్చునుగ్రొత్తసాలునన్