Wednesday, April 30, 2014

వనరుహ గర్భునకు భార్య పార్వతి యెగదా

వినుమా చదువుల దల్లియె
వనరుహ గర్భునకు భార్య, పార్వతి యెగదా
యనుగుం బుత్రిక హిమవం
తునకు న్నని జెప్పె గదర ధూర్జటి మనకున్ 

పద్యరచన -కూతునకు సైకిలు నేర్పుట

నేర్పు చుండెను సైకిలు నెమ్మి తోడ
తనదు దుహితకు నోర్పుతో  దండ్రి యచట
రక్త సంబంధ మన యిట్లు రక్తి గలుగు
చిత్ర మండున  జూడుము శేష సాయి !

Tuesday, April 29, 2014

పంది కొక్కుల వలనలా భంబు గలదు

పుడమి బెల్ల గిం  చుచుదమ  ముట్టి తోడ
గుల్ల చేయును భూమిని గోప్యముగను
దాని మూలాన పంటలు దండిగాను
పండు నిజమిది కావున ప్రజలు లార !
పంది కొక్కుల వలనలా భంబు గలదు 

పద్య రచన -పనస పండ్లు

పనస చెట్టును  గా సెను  బనస కాయ
లార్య !చూడుడు  పండ్లుగ నైన పిదప
తొనలు తొనలుగా విడదీసి తోటి కవివ
రులకు బెట్టుదు తీయటి ఫ లపు తొనలు


 

Sunday, April 27, 2014

పద్య రచన -తల్లి -కూతురు

నీటి తూర లోన నివసించు  చుంటిమి
యుండ యిల్లు మఱియు నొడల బట్ట
సరిగ లేదు , బాగ చదువుకొ నుముబాల !
యనుచు దల్లి కూతు ననున యించె 

గాయత్రి

గాయత్రి నుపాసించిన
గాయత్రియె మనకు నిచ్చు ఘన సంపదలన్
గాయత్రి మంత్ర మయ్యది
పాయక పారాయణ మ్ము  వలయును నరుడా !

శో భనం పు రాత్రి, సుతుడు పుట్టె

ఆలు మగలిరువురు హాయి కులుకుదురు
శో భనం పు  రాత్రి,  సుతుడు పుట్టె
నెట్టకేలకు మఱి యేసు దాసునకట
చూచి వత్త మార్య సూతు రండి 

Saturday, April 26, 2014

సారము లేనట్టి వాడు శైలము నెత్తెన్

నీ రసము నొందు నిరతము
సారము లేనట్టి వాడు శైలము నెత్తె
న్నారని జోతుల రూపుడు
పారంగతు జేయు సకల ప్రాణుల  దయతోన్


 

పద్య రచన -కుంభ కర్ణుని నిద్ర

కుంభ కర్ణుని లేపుట కునసు  రులట
కష్ట పడుచుం డి  రైనను గదల కుండె
నేమి నిద్రయో యే రికి నెఱు క  బడదు
పండు కొనుట యే ,వేరేమి  పనియు లేద ?

Friday, April 25, 2014

జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ

సీతారాములకును మఱి
చేతో మోదంబు గలుగ జేయగ బెండ్లి
న్నాతరి భక్తులు ముదమున
జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ
 

బాలికకళ్ళు మూసి కొనుచు .........

మెట్లు దిగుచుండి యా గెను మెట్టు మీద
కళ్ళు మూ సికొనుచు  మఱి  కాలు జారి
క్రింద పడుదువో బాలిక !క్రింద జూసి
మెల్ల మెల్లగ దిగుమిక మెట్ల నుండి

 

Thursday, April 24, 2014

నరసింహావతారము

తప్పు లెంచక గృపజూడు  తండ్రి వీవ
నిన్ను భజియింతు సేవింతు నిరత మార్య !
రక్షసేయుము మమ్ముల లక్షణముగ
నార సింహుడ! మఱి నీ కు  నతులు సేతు . 

ఏడడుగులు -వివరణ

మొదటి అడుగు ; జీవితాంతము స్నేహపుర్వకముగా నుండుట
రెండవ అడుగు ; కలిసి మెలిసి ధైర్యముగా నుండుట కొఱకు
మూడవ అడుగు ; పరస్పరాభి వృద్ది కొఱకు
నాల్గవ అడుగు ; ఎల్లప్పటికి ఒకరి కొఱకు నొకరు  జీవించుట కై
ఐదవ అడుగు ; మాన ప్రాణ ధనములను రక్షించుట కొఱకు
ఆరవ అడుగు ; మన పిల్లల భవిష్యత్తు కొఱకు
ఏడవ అడుగు ; సుఖ దుఃఖములను పంచు  కొనుట కొఱకు
---------------
వరుని జేబట్టి నడచును వధువు నిచట
యడుగు లేడును వరుసగ నరయ దాని
యర్ధ మేమన వివరింతు నార్య !నిపుడు
సావధానముగ వినుడు శ్రద్ద్ష గాను

మొదటి యడుగున కర్ధమ్ము  ముదిత ! వినుము
జివితాంతము  మెలగుము స్నేహ పూర్వ
కంబుగను మఱి  నీభర్త కనుల యెదుట
కనులు మీయవి నాలుగు  కలిసి కొనగ

రెండవ యడుగున కర్దము
మెండుగ నిక కలిసి మెలిసి మెలగుట  మేలౌ
నిండగు ధైర్యము కలిగియు
నుండంగా మేలు గలుగు నుర్వి జనులకున్

ఒకరి యభివృద్ధి కొఱకునై నొకరు పూను
ట యది మూడవ యడుగున డచుట యగును
నాలుగవదియ దెలుపును నయము గాను
నొకరి కొఱకునై మఱియొక  రుండ వలయు
జీ వితాంతము  వరకుగా జీవ నంబు

ప్రాణ మాన ధనము పరిరక్ష ణమునిక
అయిదవ యడుగున కర్ధ మబల !
ఆరవది యగు నడుగును నరయ తెలియు
సంతు భావి జీవితమును జక్క దిద్ద

సుఖము మఱియును దుఃఖము జూర గొనుట
కొఱకు గానేడ వయడుగు గూర్చు నుగద
యేడడుగుల బంధమిదియ ,యీ వ చనము
లాల కించుచు వర్తిలు డార్యు లార !

Wednesday, April 23, 2014

కాళీ యుడు సంహరించె గంగా తనయున్

కాళముల యందు ఘనుడట
కాళీ యుడు సంహరించె, గంగా తనయున్
వేళా కోళ ము పలుకే
వేళను దను కో  రుకొనిన విడివడు బ్రాణాల్ 

ఖల సంబంధమ్ము క్షేమ కారణ మయ్యెన్

జలగల వలె పీ డించును
ఖల సంబంధమ్ము, క్షేమ కారణ మయ్యె
న్నల రాముని సహవాసము
నిల సుగ్రీ వునకు గలిగె నిధ్ధర లోనన్
 

పద్య రచన -కథల పుస్తకములు

చిన్న పిల్లల కొఱకునై చిన్ని చిన్ని
కథల పుస్తక ములచట గలవు చాల
నీతి బోధించు కథలవి నిరతి తోడ
చదువ దగునార్య ! ప్రతియొక్క  చదువ రియును 

ఓటు వేసిన నీ కిత్తు నూటి ఫలము

ఓయి బాపడ ! నీ వోటు నిమ్ము నాకు
 సకల సంపద లొనగూ ర్తు సవిన యముగ
అదియు గాకుండ నిక నెన్నొ  నంద జేతు
నో టు వేసిన నీ కిత్తు నూటి ఫలము 

భ్రూ ణ హత్యలజేసిన బుణ్య మబ్బు

పుట్ట గొడుగుల మాదిరి పుట్టు చుండె
వేల కొలదిగ శిశువులు  విశ్వ మందు
భరత మాతకు మోయని భార మగుట
భ్రూ ణ హత్యలజేసిన బుణ్య మబ్బు


చుట్టు కొనునార్య ! పాపము చుట్టుకొనును
భ్రూ ణ హత్యల జేసిన,బుణ్య మబ్బు
పేదవారికి న న్నము బెట్టు నెడల
కల్లకాదిది నిజమునే బల్కు  చుంటి

  

Tuesday, April 22, 2014

పద్య రచన -ముసుగులో ముద్దులు

ముద్దు లాడుచు నుండెను  ముసుగు లోన
నేమి చిత్రము రాయది ? యిటుల జేయ
పిల్లి మాదిరి వర్తిల్ల  చెల్లు బాటె ?
సంఘ మర్యాద లను మ ఱి  సలుప వలదె ?

Monday, April 21, 2014

అ శ్వ ముఖు డాం జనేయు డబ్జాసనుండు

గిరిజ కుద్వాహ తంతులు జరుగు చుండ
న శ్వ ముఖు డాం జనేయు డబ్జాసనుండు
నాదిగా గల  దేవత లంద ఱచట
చూచు చుండిరి కళ్యాణ  చోద్య ములను 

పద్యరచన -నృత్యము

 ముద్దు గుమ్మలు గుమిగూడి ముచ్చటగను
జేయు చుండిరి నృత్యము చిత్ర మందు
నాట్య తీ రును  జూడగ నాట్య మదియ
కూచి పూడిగ భావింతు గోమలాంగి !

కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

హిమకరు డుదయించ గనే
కమలము ముకుళించె, సూర్య కరములు సోకన్ 
కమలములు విచ్చు కొను గద
కమలముతో బూజసేయ  గా లుడు మెచ్చున్ 

హనుమంతుని బూజ సేయ యాపద లొనరున్

ఇనుమడిగ సిరులు గలుగును
హనుమంతుని బూజ సేయ యాపద లొనరున్
పనిగొని గోడలు దూకిన
మనుగడకే ముప్పు వచ్చు మహిలో నరుడా !

Sunday, April 20, 2014

కలియుగంబు నందు కఱవు లేదు

చచ్చు రాజ కీ య  మెచ్చట జూచిన
కలియుగంబు నందు, కఱవు లేదు
రామ రాజ్య మందు  రవ్వంత యైనను
హాయి గుండ్రి  జనము లంద రపుడు


 

పద్య రచన -కాళియ మర్దనము

పుడమి జనులను రక్షింప బూనుకొ నుచు
పాము పడగల మీదను పాద ముంచి
యణ గ ద్రొక్కగ కా ళీయు  ఫ ణ ములన్ని
 ఆర్తి బ్రార్ధించె నా గృష్ణు నపుడు మిగుల
 

Saturday, April 19, 2014

ఎన్ని కలలోగ నుదునునే నెన్నిక లన

సాధు శీ లుని గుణవంతు సదయ యుతుని
సాటి వానిని నిరతము సాకు నతని
నెన్ను కోవలయునని నే  మిన్న వాని
నెన్ని కలలోగ నుదును నే  నెన్నిక లన
 

డొంకరాయి యందు టంక శాల గలదు

నీ టినుండి వచ్చు నీ లి  రంగులతోడ
మెరుపు  నిచ్చి వెలుగు వెలుగు చుండు
డొంకరాయి యం,టంక శాల గలదు
భాగ్య నగర మందు భవ్యముగను 

మారణ హోమంబు జరుగు మతముల మధ్యన్

ఆరని జోతుల వలె మఱి
మారణ హోమంబు జరుగు మతముల మధ్యన్
వీరా  వేశము తోడన
పోరాటము సాగునె డల పౌరుల మధ్యన్ 

కుటిలత్వము జూపగా దగున్ గవులారా !

నటనలు జేయుచు నిరతము
పటుతరమగు గవిని నేను బస గల వారౌ
యిట నాతో దలబడుడ న
కుటిలత్వము జూపగా దగున్  గవులారా !

పద్యరచన -నిమ్మ తొనలు

తీయ తీయని దొనలను దెఱచి పెట్ట
నూరు చుండెను నానోరు నొక్క యుదుట
పోయి తిందును మఱి మీరు  వాయి తోడ
తిట్ట కుండగ నుండుడు   చట్టు  లార !

పద్య రచన -చాముండేశ్వరి

భీ క  రంబగు మోమున భీ తిగొలుప
అమ్మ చిత్రము గన్బడె  యార్య !కనుము
వందనబులు మాయవి  వంద లాది
అందు కొనుమమ్మ ! చాముండ ! యమ్మ  దయను 

Friday, April 18, 2014

పద్య రచన -పొడుగాటి జడ

చిత్ర మయ్యది జూడుడు  చిత్రముగను
భామ చూపించు చుండెను బల్ల యెక్కి
తనదు పొడుగాటి కురులను తమము తోడ
మెచ్చు కొనదగు విషయము మేదిని యది 

వరున కిత్తురు కాషాయ వస్త్రములను

  పెండ్లి దినమున బహుమతు ల్పేర్మి తోడ
వరున కిత్తురు , కాషాయ వస్త్రములను
నిత్తు రవధూ తి  కాదర  మింపు గొలుప
పూజ నీయులు సర్వదా  పుణ్య మతులు 

Thursday, April 17, 2014

తరువున వెల్గొందు చుండె తారా గణముల్

అరిగెల వారింటను గల
తరువది శోభించు నటుల దళుకుల వలతోన్
విరివిగ నలం క  రించగ
తరువున వెల్గొందు  చుండె తారా గణముల్ 

పద్యరచన -బాలిక మారాము

మొండి పట్టును బట్టిన మోము జూడ
నిష్ట పడనట్లు దోచెను నేగ బడికి
ఎంత లాగిన చేతిని నించు కైన
కదల కుండెను బాలిక కనుడు  సామి !

Wednesday, April 16, 2014

భగవంతుని సేవజేయ బాపము దగులున్

సుగమంబగు మఱి మోక్షము
భగవంతుని సేవజేయ బాపము దగులున్
భగవంతుని నిందించిన
భగవంతుడె  మనకు దిక్కు భవమును దాటన్




 

భాగవతుని గొలువ బ్రాప్తించు నరకము

ఆగమంబున గల యతి ముఖ్య విషయము
యాగ ఫలము వచ్చు ననుట మనకు
భాగవతుని గొలువ , బ్రాప్తించు నరకము
నాగ పాము జంపు నరున కీలను 

Tuesday, April 15, 2014

మధు పానము జేయు నతడు మాన్యుడు జగతిన్

అధముండ నగను బరగును
మధు పానము జేయు నతడు, మాన్యుడు జగతిన్
వధియింప దగినదైనను
వధి యింపక విడిచి పెట్ట బామును దయతోన్ 

పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయున్ ?

ఎవరీ ప్రశ్నను వేసిరి ?
పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయు
న్నె వరైనను సరి ,చెప్పుదు
నవనిం గలయట్టి మేటి హనుమద్భక్తుల్ 

పద్య రచన -బావిలోనికి ......

ఏమి దురవస్థ వాటిల్లె నీ ప్ర  జలకు
త్రాగు నీటికి కొఱకునై తాడి లోతు
గలుగు బావిలో నికిదిగి కాంత యచట
యందు కొనుచుండె  బిందెను  నక్క టకట 

మందాకిని బర్వు లెత్తె మైసూరు దెసన్

  మందపు  గమనము గలనా
మందాకిని బర్వు లెత్తె మైసూరు దెస
న్నందము జిందుచు నడకల
సుందర మగు రూపు తోడ సొగసులు విరియన్
 

Monday, April 14, 2014

పాప హేతు వగును భాగవతము

కోప మూని పరుని కుపితుని జేయగ
పాప హేతు వగును ,భాగవతము
భక్తి తోడ జదువ పరమప దము గల్గు
సంశయంబు లేదు సజ్జ నుండ !

తార లన్నియు గుమి గూడి తరణి జొచ్చె

కాంతి పుంజము లా యనగ వెలు  గునిడె
తార లన్నియు గుమి గూడి, తరణి జొచ్చె
దినక రుండును జగమంత దిరిగి దిరిగి
సహజ మేగద యీ యది సంతు లకును 

పద్య రచన -రామాయణపు చిత్రములు

చిత్ర కారుడు గీ చిన చిత్రములవి
చూడ మురిపించు చుండెను చూడ్కులనిల
ఓయి ! నంద్యాల కోటేషు ! బాయ కిడుదు
నతుల శతములు మఱి నీకు  నమ్రతగను 

నాగ దోషము గలిగించు నాగ పూజ

నాగపామును జంపిన నరునకునిల
నాగ దోషము గలిగించు నాగ పూజ
 జేయువారల ననిశము బాయు చుండు
నాన గము కల్ల కాదిది  యార్య !నిజము

 

ముసలి దనము రాగ ముదము గలుగు

మేను గ్రుంగి వోవు మిడి గుడ్లు గనిపించు
ముసలి దనము రాగ, ముదము గలుగు
పసిడి వర్ణ ముగల బాలిక యుదయించ
దల్లి కెంత గానొ దరమె వ్రాయ 

Sunday, April 13, 2014

భాగవతము జదువ పాప మబ్బు

బాల కృష్ణు దయలు బ్రసరించు మనపైన
భాగవతము జదువ, పాప మబ్బు
భాగవతుని నింద పరిపరి విధముల
చేయు వాని కీలను బాయ కుండ 

కలువ పూవులోన గరళ ముండు

స్వచ్ఛ మైన తేనె చవులూరు చుండును
కలువ పూవులోన  గరళ ముండు
ఖలునకు నిలువెల్ల గాక యుండు నికను
స్నేహితులకు గీడు జేయు బుద్ధి 

పద్య రచన -ముని భక్తునకు నమస్కారము

చిత్ర మందున నొకముని చేతులెత్తి
నతులు గావించు చుండెను నమ్ర త గను
నేమి యపచార మొనరించె నేమొ యతడు
అడిగి జెప్పుదు మఱి మీ కు  నార్యు లార !

Saturday, April 12, 2014

పద్యరచన -సీతా కోక చిలుకల పడవ ప్రయాణము

ఏమి చిత్రము! వాహ్యాళి కేగు చుండె
కడలి మీదన గుంపుగ పడవ లోన
చిత్ర వర్ణము గలిగిన చిలుక లెన్నొ
చూడ ముచ్చట గొలుపును జూప రులకు
 

యోగి వాం ఛిం చె వెలయాలి కౌగిలింత

అక్షయంబగు మోక్షము దక్ష ణం బె
యోగి వాం ఛిం చె,  వెలయాలి కౌగిలింత
సదృశ మగునార్య !పొరలుట శవము మీ ద
ఆదరించగ నర్హులు నాడు వారు 

(ఛి . సౌ . తన్మయి -తేజ ల వివాహము సందర్భముగా ఆశీ ర్వచనములు )

ఓయి ! తన్మయి !వినుమిది యొక్క మాట
జోడు కుదిరిన నాతడు  సుందరుండు
ఈ డు జోడును సరివోయె నిద్దరకును
కలిసి బ్రదుకుడు  పాలును జలము వోలె

అన్నపూర్ణకు బుట్టిన ననుగు పట్టి
చదువు సంధ్యలు బాగుగ సలిపి మరిని
రామ లందున నన్నిట రాణ కెక్కి
తనది యగు వృత్తి  యందున తనరెమిగుల

తల్లి దండ్రుల ననుమతి దనదు భర్త
నెన్నుకొనియెను జక్కటి వన్నె గాని
నేమి యెన్నిక యీ యది యింత నేర్పు
నెటుల  వచ్చెనో నడుగుడో యింతు లార !

వరుడు పుట్టెను మఱి సాగి వారి యింట
వధువు జక్క రాజుల యింట వరము  గాను
చూడ చక్కని జంటయై  చూపరులకు
సంత సంబును  గలిగించు  సంతతమును

అమ్మ నాన్నల విడిచియు నరుగు దేర
బెంగ యుండును నిజముగ బేల !నీకు
అత్తలోనన జూడుమా యమ్మ నికను
కుదుట పడునమ్మ మనసు నీ కొంత వరకు


కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

 
ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

 
సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను


రచన ; పోచిరాజు సుబ్బారావు 

 

గడియారము గంట కొట్టు గడియ గడియకున్

నడకుదితి  వారి యింటను
గడియారము గంట కొట్టు గడియ గడియకున్
కడుగొని నట్లుగ యంత్రము
బడయగ నేర్పాటు వారు బడయుట కతనన్ 

Friday, April 11, 2014

ఊ ర్ధ్వ పుం డ్రముల్ ధరియించె నుమ పెనిమిటి

విష్ణు భక్తుడు నౌటను వేంక టేశు
ఊ ర్ధ్వ పుం డ్రముల్  ధరియించె  నుమ పెనిమిటి
శివుని భక్తుడు కతనన  శివుని భజన
జేయుచుండును నిత్యము  శివశివ యని 

పద్య రచన .... కాకి ,మంచుగడ్డ

 పాత్ర యందున్న జలమున వాయస మట
మంచు గడ్డను బడ వేయ ,యంచు వరకు
వారి వచ్చుట గమనించి వాయసంబు
తీ యతీయగ  దాహము దీ ర్చు కొనెను 

Thursday, April 10, 2014

అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము

కల్పవృక్షము పేరన కవి వరుండు
రామ చరితము వ్రాయగ రమ్యముగను
విషపు వృక్షము పేరన వెకిలి గాను
వ్రాయ బడుట ను  నందురు వక్ర గతిని
అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము 

సావిత్రి భర్త ప్రాణములను వేడుట

యముని నెటులనో నొప్పించి యాయమ తన
భర్త ప్రాణములిప్పించె  భవ్యముగను
వరల సావిత్రి వంటి పావనుల కుమఱి
సాధ్యమే గద  జగతిని  సర్వ ము నిక 

తాళి కట్టిన మఱునాడు తాత యయ్యె

శోభనంబును జేసిరి సుజనపతికి
తాళి కట్టిన మఱునాడు, తాత యయ్యె
కొడుకు నకుమఱి  పుట్టగ కొడుకు మరల
తండ్రి తండ్రిని నందురు తాత యనియు 

శిశుపాలుడు చంపె కృష్ణు శిరమున గొట్టీ

పశుతుల్యుల మాటలె యివి
శిశుపాలుడు చంపె కృష్ణు శిరమున గొట్టీ
శిశు పాలుని జంపెను గద
నిశితంబగు చక్ర మొదిలి నీ లాపతియున్ 

Wednesday, April 9, 2014

పద్య రచన -శిశుపాలుని వధ

ధర్మ మార్గంబు జొప్పున  ధర్మ రాజు
అర్ఘ్య పాద్యాదు లీయగ యాదవునకు
గేలి చేయగ నట శిశు పాలు డకట
సంహరించెను నాతని జక్రి యపుడు 

Tuesday, April 8, 2014

పద్య రచన -విక్రమార్కుడు -భేతాలుడు

విక్ర మార్కుడు మోసిన విగత జీవి
విక్రమార్కుని యామాట వినగ లేక
చెట్టు నొ ద్దకు చేరగ  బిట్టు గాను
మోయు చుండెను జూడుము  మోహ నాంగి !

 

సజ్జనులకు ప్రీతికరము సారా కొట్టే

సజ్జన సాంగత్యమె యిల
సజ్జనులకు ప్రీతికరము సారా కొట్టే
నుజ్జుగ జేయును బ్రదు కని
యొ జ్జలు మఱి చెప్పి రార్య ! యుద యంబు ననే 

శంకరా........

శంకర శంకర శంకర
యింకను నను జూడ వేమి యిట్లుగ నుంటిన్
వంకలు బెట్టక యిప్పుడె
యంకంబున జేర్చు కొనుమ యార్తుని నన్నున్  

పొట్ట మీ ద ....

కొట్టు చేతి మీద కొట్టు మ తలమీ ద
కొట్టు కాలు మీద కొట్టు పాద
ములను గొట్టు మింక ముంగురుల చివర
పొట్ట మీద నెపుడు గొట్ట వద్దు 

పాండు రంగని గొలిచిన పాప మబ్బు

భుక్తి కలుగును మఱియును పుణ్య మబ్బు
పాండు రంగని గొలిచిన, పాప మబ్బు
నాలు బిడ్డల విడదీ యు నతని కిలను
దిక్కు లేనట్టి వారికి దిక్కు శివుడు 

Monday, April 7, 2014

లంకేశుడు రాము జంపె లలనేచ్ఛ మెయిన్


శ్రీ రామనవమి  శుభా కాంక్షలతో ...

వంకర బుద్ధుల మాటలు
లంకేశుడు రాము జంపె లలనేచ్ఛ  మెయిన్
పంకజ నయనుడు జంపెను
బింకము గల రావణున్నె  భీకర మొందన్ 

పద్యరచన -శ్రీ రామ నవమి

ఈ రోజు నవమి కావున
శ్రీ రాముల పెండ్లి జరుగు సీ తమ తోడ
న్నారాముడు సంతసమున
భూరిని నిక యిచ్చు గాక !భూతిని మనకున్
 

Sunday, April 6, 2014

ముండను జేరిన నరునకు పుణ్యము గలుగున్

ముండ నమే బ్రాప్తించును
ముండను జేరిన నరునకు పుణ్యము గలుగున్
మెండుగ పూజలు మఱి చా
ముండకు జేయుసుజనులకు ముక్తి లభించున్ 

పద్యరచన -మానవుని దశలు

జనన మరణము లయ్యవి జరుగు చుండు
పుణ్య పాపము లనుబట్టి పురుషున కిల
పిండముగ మొద లగుచునై పెద్ద వయసు
వచ్చు పిమ్మట మరణము వచ్చు వరుస 

పదవి విరమణ యొక గొప్ప వరము గాదె!

పదవి యున్నంత కాలము పట్టు మనుచు
నొక్క రోజైన సరిగ నే నుండ లేదు
ఇంటి పట్టున నిజమిది యీశ ! మఱి
యుంటి  నిప్పుడు హాయిగా నింటి యందు
పదవి విరమణ యొక గొప్ప వరము గాదె!

Saturday, April 5, 2014

మగవానికి గర్భమాయె మానిని గూడన్

యుగముల లక్ష ణ మరయుము
జగమున మఱి వింత లెన్నొ జరుగును జూడన్
నగుబాటు గలుగు విధముగ
మగవానికి గర్భ మాయె మానిని గూడన్ 

పద్యరచన -చిన్న పాప -కన్నీరు

ముద్దు లొలికించు బాలిక మొగము జూడ
కంటి నుండియు కన్నీరు కారి నట్లు
కాన వచ్చెను మఱి యేమి కారణం బొ ?
యడిగి జెప్పుదు మీకును నార్యు లార !

మార్జాలము సింహమయ్యె మర్మంబే మో

దర్జా యొకడ ట బ్రీతిని
మార్జాలపు బొమ్మ గీయ మఱి యది చూడన్
నిర్జీవపు రూపంబున
మార్జాలము సింహమయ్యె మర్మంబే మో 

భామ గె డ్డ ము గీయుట

గీ యుచుండెను నొక్కతె గె డ్డ మచట
తనదు మృదువైన కరముల దనరు నట్లు
అమెరి కా యందు  భామలే  యందముగను
చేయు చుందురు క్షవరము సీ త ! వినుము


 

Friday, April 4, 2014

అం తర్జాలమ్ము, నిచ్చునధికపు సిరులన్

వింతగ దెల్పును నన్నిటి
నం తర్జాలమ్ము, నిచ్చునధికపు సిరులన్
సంతుల సహవాసంబును
కంతుని వధి యించినట్టి  కాలుని గొలువన్
 

సతిని జంపె రామ చంద్ర మూర్తి

వెంట బెట్టుకు నడవికి నేగె రాముడు
సతిని, జంపె రామ చంద్ర మూర్తి
రావణాది దుష్ట రక్కసి  మూకను
హర్ష మొందె లోక మతని జూచి 

పద్యరచన -బాల కృష్ణుడు కోతులకు వెన్నబెట్టుట

బాల కృష్ణుడు వెన్నను వానరముల
కచట పెట్టుట జూడగ నంద గించె
జగము నాడించు నాస్వామి నగవు తోడ
నాడు చుండుట కపులతో నబ్బురంబె 

Thursday, April 3, 2014

పద్య రచన -పొగ త్రాగుట

పొగను ద్రాగుట మానుడు పురుషు లార !
గొంతు కేన్సరు మఱి యును  గుండె జబ్బు
లాది గాగల రోగము లావహించు
గాన దానిజోలికి బోక కనుడు సుఖము 

Wednesday, April 2, 2014

పద్యరచన -పరిక్షిత్తు ముని మేడలో చచ్చిన పాము ను వేయుట

తనర యా శమీ క మహర్షి దరికి  రాజు
వచ్చి యడుగంగ నీటిని   బడయ లేక
చచ్చి పడియున్న పామును నిచ్చతోడ
వేసె నాతని మేడలోన వెఱ్ఱి రాజు

నట్టింటను దళుక్కు మనెను నక్షత్రములే

నిట్టాల వారి యింటికి
చుట్టాలుగ వచ్చి వారు చూసియు దేవిన్
బెట్టగ వజ్రపు గాజులు
నట్టింటను  దళుక్కు మనెను నక్షత్రములే