Tuesday, December 31, 2019

వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్

సుంతయుదెలివిగ మసలక
నెంతయొమూర్ఖమ్ముతోడనిలచరియించన్
సంతులకోపానలములు
వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్ 

Monday, December 30, 2019

కాంతకువీడుకోలువలుకందగునేడుహితమ్ముగోరుచున్

సాంతముమంచిజేసియునుసంతసమొందగనేగుచున్ననా
కాంతకువీడుకోలువలుకందగునేడుహితమ్ముగోరుచున్
శాంతముసౌఖ్యమున్నిడుచుసర్వజనంబులమెప్పుపొందుటన్
శాంతికిపాతవత్సరముస్వాగతమీయగనొప్పుగ్రొత్తకున్ 

కాంతకువీడ్కోలువలుకగాదగునేడే

సాంతముసుఖమయమగుచును
జింతనలేలేకయుండిసేమమునిడుచున్
శాంతముగాజనువర్షపు
కాంతకువీడ్కోలువలుకగాదగునేడే

Sunday, December 29, 2019

అవధానంబటరాణ్మహేంద్రవరమందయ్యోభయంబయ్యెడిన్

అవధానంబుననారితేరినమహామేధావులచ్చోటనే
నవధానంబులుసేయనేర్వగనుబాహాటమ్ముముందుండగా
నవధానంబటరాణ్మహేంద్రవరమందయ్యోభయంబయ్యెడిన్
గవిశార్దూలురుభీతిలింగరికనెక్కాలంబునైనన్సుమీ

అవధానినిరాజమండ్రియడలంజేసెన్

అవిరళభాషాసంపద
కవనపురూపంబునిచ్చుగవులుండియునున్
స్తవనీయుండగుమాయీ
యవధానినిరాజమండ్రియడలంజేసెన్

Saturday, December 28, 2019

పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్

పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్
పడతులెగాకపూరుషులుభక్తిపఠించినగల్గుబుణ్యముల్
విడువకనిష్ఠతోడగడుపేర్మినిజేయగబూజలాదులన్
వడిగనెనిచ్చుమోక్షమునవారితభక్తికిమెచ్చికృష్ణుడున్

పాశురమ్ములజదివినపాపమబ్బు

పాశురమ్ములజదివినపాపమబ్బు
నేమి గురువర!భావ్యమె యిట్లుపలుక
పాశురమ్ములజదివిన బడయగలము
పుణ్యలోకాలుదప్పకపుడమివీడ

Friday, December 27, 2019

దానముజేసినగలుగునుదారుణబాధల్

దానముజేయుటసరి,యా
దానముమితిమీరియుండదౌష్ట్యముసుమ్మీ
పానముకొఱకైపరునకు
దానముజేసినగలుగునుదారుణబాధల్

బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మునవ్యర్ధుడైచెడున్ 

విడువడుపుస్తకంబులనువీడడుశ్రద్ధనునెట్టివేళలన్
బడికిజనంగనిష్టపడువాడు,జగమ్మునవ్యర్ధుడైచెడున్
చెడుపనులెన్నియోదఱచుచేయుచుశిష్టులబాధవెట్టుచో
బుడమినినట్టిపూరుషునిబుట్టుకచచ్చినవానితోడిదే

Thursday, December 26, 2019

బడికిపోవు,వాడుపనికిరాడు

అయ్య!నాదుకొడుకుహర్షవర్ధనుడిక
బడికిపోవు,వాడుపనికిరాడు
వేరుకుఱ్ఱవాని పిలుచుకొనుడుమీరు
వేరుదలచవలదువేణుసామి!

సూర్యగ్రహణము


బుద్ధిమంతుల కోపమ్ము శుద్ధ హిమము
చెడ్డ వారి యలుక యుండు చివరి వఱకు
వేలవేల యుగము లైన వీడ కలుక
భానుఁ గబలించి పట్టె స్వర్భానుఁ డకట

ఖతలం బెల్లయు దుఃఖ సాగర చలత్కల్లోల సందోహ మ
గ్నత నాదిత్య రుచి ప్రభా రహితమై కన్పట్టె భూలోక సం
తతి నిత్యోచిత కార్య భగ్న భవ సంతప్తాంత రంగంబునన్
నత శీర్ష స్తితి నిల్చె నింపుగను బ్రాణాయామముం జల్పుచున్
by
kameswararao

చెడుమతమున్నలోకమునశ్రేయమునెక్కొనుసుస్ధిరమ్ముగన్

ఎడదనుబ్రేమనొందుచునునేరికినైననుమేలుసేసికా
చెడుమతమున్నలోకమునశ్రేయమునెక్కొనుసుస్ధిరమ్ముగన్
విడువకనార్తిజీవులనుబ్రేమనుజూపుచునెల్లవేళలన్
గడుగొనిసాయమిచ్చుచునుగాంక్షలుదీర్చగనొప్పునేసుమా

Wednesday, December 25, 2019

చెడుమతమున్నపుడెశాంతిచెలగునుభువిలో

ఎడపెడముఖములతోడను
నడయాడుచునుండకుండనాత్మీయతతో
నెడదనునితరులనిలగా
చెడుమతమున్నపుడెశాంతిచెలగునుభువిలో

చీకటియేవెలుంగునిడుజీవితమిద్దియటంచునెంచుమా

వ్యాకులబాటునొందునెడబంధుజనంబులయండనుండుచో
చీకటియేవెలుంగునిడుజీవితమిద్దియటంచునెంచుమా
శోకముగల్గుచోహరినిశుద్ధమనస్సునవేడుకొన్నచో
జీకటియేవెలుంగినిడిజీవితచక్రముమారజేయునే

Tuesday, December 24, 2019

చీకటియేవెలుగునిచ్చుజీవితమిదియే

చీకాకులెన్నియున్నను
నేకాంతముభగ్నమైన నిరువురునొకటై
మైకములోబడిదేలగ
చీకటియేవెలుగునిచ్చుజీవితమిదియే

Monday, December 23, 2019

పూవులవల్లరూపుసెడెపుష్పవనాంతరరమ్యదృశ్యముల్

పూవులుగోయగావెడలిపూవులతోటకుదుష్టభామినుల్
గావరమొందుచున్మదినికర్కశబుద్ధులుగల్గియున్నదై
యావనమంతటన్దిరిగియందినపూలనుజింపివేయగా
పూవులవల్లరూపుసెడెపుష్పవనాంతరరమ్యదృశ్యముల్

వానలులేకమెట్టవరిబాగుగబండెనువైపరీత్యమే

వానలులేకమెట్టవరిబాగుగబండెనువైపరీత్యమే
వానలులేకపోయిననుబాగుగపండెవిమెట్టపంటలే
మానకరెండుమూడుకొకమారుననీటినిముంపుజేయుచో
క్షోణినిబుష్కలంబుగనుగోరినపంటలుపండునేగదా

Sunday, December 22, 2019

వానలులేకుండమెట్టవరిఫలియించెన్ 

కానగదెలిసెనునిప్పుడు
వానలులేకుండమెట్టవరిఫలియించెన్
వానలకుమెట్టవరికిని
నేనాడునులేదుబంధమించుకయునిలన్

బంగ్లాపైకొలనున్నదేగెదమటన్ బట్టంగమత్స్యంబులన్ 

బంగ్లాపైకొలనున్నదేగెదమటన్ బట్టంగమత్స్యంబులన్
బంగ్లావారలుగట్టిరచ్చటసుమాపద్శాకరంబొక్కటిన్
నింగ్లీకంబులతోడజక్కగనటన్ నిబ్బందిలేకుండగా
బంగ్లాదేశపువాసులందఱుదగన్ భాగ్యమ్ములన్దూగుగా

Saturday, December 21, 2019

బంగ్లాపైకలదుకొలనుపట్టుడుచేపల్

బంగ్లావారలుతమతమ
బంగ్లాపైకట్టుచుండ్రుపద్మినులదగన్
నింగ్లీకంబులువేయగ
బంగ్లాపైకలదుకొలనుపట్టుడుచేపల్

చలిపులిగనె,వేవెలుంగుచయ్యనబాఱెన్ 

అలికులవేణియెభీతిలె
చలిపులిగనె,వేవెలుంగుచయ్యనబాఱెన్
వెలుగులఱేనింగనుగొని
నిలనరయుముసూర్యచంద్రులిరువురుసఖులే

Thursday, December 19, 2019

నారీమణియొకతెచూపె నాలుగుకుచముల్ 

నారాయణ నారాయణ!
నారీమణియొకతెచూపె నాలుగుకుచముల్
యార్యా యేమీవింతలు
పోరాములుగలుగునపుడుపుట్టునునవియే

కలువలువిచ్చెభాస్కరునిగాంచినవెంటనెమోదమందుచున్ 


కలువలువిచ్చెభాస్కరునిగాంచినవెంటనెమోదమందుచున్
కలువలువిచ్చవెన్నటికిఖాంకునిజూడగనెట్టిచోటులన్
గలువలువిచ్చురేవెలుగుగాంచినవెంటనెసంతసంబునన్
నలికులవేణి!నీమదినినాయతరీతినినెంచుమాయిదిన్

కలువలువికసించె,రవినిగాంచిముదమునన్ 

కళకళలసోముగనుగొని
కలువలువికసించె,రవినిగాంచిముదమునన్
నిలమసలుప్రాణులన్నియు
కలకాలముబ్రదుకదలచెగలియుగమందున్

Wednesday, December 18, 2019

ర్దూలముపెచ్చురేగియొకదూడనుమ్రింగెదయావిహీనయై

లాలనజేయుచున్మిగులలాస్యములొందుచుగోవులొండొరుల్
మేలములాడుచున్బసిరిమేయుచునుండగనంతలోపుశా
ర్దూలముపెచ్చురేగియొకదూడనుమ్రింగెదయావిహీనయై
కాలముదీరెనేయికనుగాలుడుమ్రింగెనువ్యాఘ్రమైధరన్

Tuesday, December 17, 2019

ర్దూలముసెలరేగియొక్కదూడనుమ్రింగెన్

బాలుడు గోవులమేపుచు
లీలగదాదిరుగుచుండ లేకిడితనమున్
నాలపుమందనుగనిశా
ర్దూలముసెలరేగియొక్కదూడనుమ్రింగెన్

మితమేలేకభుజించినన్ జనులకున్ మేలౌగదాచూడగన్ 

మితమేలేకభుజించినన్ జనులకున్ మేలౌగదాచూడగన్
మతమా?మీకుసామియదినమ్మంబుద్ధిగాదాయెనే
జతనంబంతయుజూడగాదెలిసెనాజన్మాంతమున్ మేలొకో
మితిమీరంగనుదిన్నచోజనులకున్ మేలెప్పుడున్ గల్గదే

Monday, December 16, 2019

మితముగానితిండి,మేలు

రోగములుగలుగును రోజులతరబడి
మితముగానితిండి,మేలుసేయు
నండ్రుతల్లికంటె నధికముగనునుల్లి
మితపుతిండిమనకుమేలుసుమ్ము

తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా

తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా
తలకుంగర్ణములుండకుండిననుజిత్రంబందజూచున్గదా
యిలలోనుండెడుపాములన్నియునుదావీక్షించునేత్రంబులన్
లలనా!శ్రద్ధనుజక్కగావినునునాలాపంబులన్నింటినీ

Sunday, December 15, 2019

తలకుచెవులెయుండవువిచిత్రంబుగాదె

పాముజాతినిజూడగ బ్రముఖముగను
దలకుచెవులెయుండవువిచిత్రంబుగాదె
మాటవినబడితిరుగుచుమనలజూచు
బ్రహ్మసృష్టియేచిత్రము,ప్రణతులిడుదు

పాయసమన్నచోనెవడువల్లెయటంచునుగ్రోలునిద్ధరన్ 

పాయసమన్నచోనెవడువల్లెయటంచునుగ్రోలునిద్ధరన్
బాయసమన్నచోధరనుబండితలోకముగాకపామరు
ల్లాయతరీతినిన్మిగులనాతృతతోడనునీచ్చగించుట
ల్తీయగనుండుకారణముదేవర!రామయ!నిక్కమేగదా

పాయసమననెవ్వడిష్టపడునీజగమున

పాయసమననెవ్వడిష్టపడునీజగమున
ననుటసరికాదుపాయసమనగనిష్ట
పడుదురుజనులందఱునిలబాగుగాను
దీపిగలిగెడుచక్కటిదినుసుకతన

చలిపులిపల్కరించగనె,చయ్యనపారెసహస్రరస్మియున్

అలికులవేణిచింతిలెనవారితశీతమువ్యాప్తిచెందెనే
చలిపులిపల్కరించగనె,చయ్యనపారెసహస్రరస్మియున్
దెలతెలమబ్బుదొరలుదివ్యమునందుననోలలాడుచున్
విలసిలుగాంతిపుంజములువేలకువేలుగనింగిచుట్టలై
---
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

Friday, December 13, 2019

పగనుమున్గనడగు పాపచయము

పరులహింసవలన బరగెడుపాపమా
పగనుమున్గనడగు పాపచయము
పగనుబెంచునెడల బ్రాణమునకుముప్పు
కలసిమెలసియుండ కలదుసుఖము

Thursday, December 12, 2019

మానములేనివానికి,నమస్క్రుతులంబొనరింతుభక్తితో

కానవుమంచిచెడ్డలిలగానవుబంధుగణంబులనార్తినాదముల్
మానములేనివానికి,నమస్క్రుతులంబొనరింతుభక్తితో
మానవసేవయేధరనుమాధవసేవగనెంచువానికిన్
మానకయాదిదేవునిలమానసమందుననిల్పువానికిన్ 

మానహీనునకు,నమస్కరింతు

సిగ్గులెగ్గులవియచీమంతయుండవు
మానహీనునకు,నమస్కరింతు
బరులసేవయందు భక్తిశ్రద్ధలుగల
వానికెపుడునేనువంగివంగి

కలహమురేపగాదగునుగాలికిలేచెడుగడ్డిపోచయే

బిలబిలమాటలాడుచునుబెద్దలుమంత్రులుమంచిచెడ్డలన్
దలచకనోటిదూలగనుదప్పుడుమాటలుబల్కన్యాయమే
యిలనవిరాష్ట్రగౌరవపుబెంపునుగడ్డిగజేయుటొప్పునే
కలహమురేపగాదగునుగాలికిలేచెడుగడ్డిపోచయే

Wednesday, December 11, 2019

గడ్డిపోచచాలుకలహమునకు

అడ్డదిడ్డముగను నపవాదుపలుకుచు
నొకరికొకరుగోపమొందుచుండి
గడ్డిపోచచూపి కాచుకొనుమయన
గడ్డిపోచచాలుకలహమునకు

Tuesday, December 10, 2019

దాతగబిల్వగాబడెడిదాత నిజంబుగదాతగాడుబో

దాతగబిల్వగాబడెడిదాత నిజంబుగదాతగాడుబో
దాతలుదాముగాననరుదాతలుమేమని నెట్టివేళలన్
జేతులనిండుగాదనరజేసిననైనను నెంతమాత్రమున్
జేతనమందుదామననజేయరుదాతగజింతజేయగాాా

దాతయనబడు,

ప్రతిఫలమ్ముపై యాశనుబడనినతడు
దాతయనబడు,దాతతాన్ దాతగాడు
తనర'దాదాత' యందునదాతయుండి
నప్పటికినిదా తయనగనొప్పదిలను

మేడనుజేరరెండునొకమెట్లుదిగందగు,మోక్షగామికిన్

బాడుగనీయరాదలచభాస్కర!చూడుమురంగురంగులా
మేడనుజేరరెండునొకమెట్లుదిగందగు,మోక్షగామికిన్
వవేడుటయొక్కటేశరణువేంకటనాధునినెల్లవేళలన్
వీడకనెప్పుడున్ భజనవీవనపూజలుభక్తితోడుతన్

Sunday, December 8, 2019

న్గాముడుదున్నపోతుగణనాధుడుమర్కటమూర్తియౌగనన్

నీమములేకయుండగను నెమ్మినిభోగములందుమెల్గగా
న్గాముడుదున్నపోతుగణనాధుడుమర్కటమూర్తియౌగనన్
గోమలిమానసంబెఱిగికోరికదీర్చుటయొప్పుగావునన్
నేమరుపాటులేకనిక,నవ్విధినుండుమశ్రీనివాసుడా!

కాముండేదున్నపోతుగణపతికపియౌ

నీమము,సమయములేకను
గామముతోమెలగుచుండి కలకాలమునున్
నేమియుపనియునుజేయని
కాముండేదున్నపోతుగణపతికపియౌ

యమునకుదప్పడెన్నడుహుతాసనకీలల బూదియైచెడన్

మమతలతోడదేహమునుమానినులెంతగశుద్ధిజేయ,కా
యమునకుదప్పడెన్నడుహుతాసనకీలల బూదియైచెడన్
విమలమనస్కుడౌచునిల వేంకటనాధునిసేవజేయుచో
నమలమునైనమోక్షమునునాహరియేగదయిచ్చునెప్పుడున్

Saturday, December 7, 2019

యమునకగునుబూదియగుటయెపుడొ

మరణమొందుపిదప మంటలగాలికా
యమునకగునుబూదియగుటయెపుడొ
కానబ్రదుకునంతకాలము పరమాత్ము
సేవజేయవలయుశివముకొఱకు

పగలోమున్గినవారిపాపచయముల్భస్మంబులౌనెప్పుడున్

సుగుణాచెప్పెడునాదుమాటలనుదుస్సుంజేయజూతె?సురా
పగలోమున్గినవారిపాపచయముల్భస్మంబులౌనెప్పుడున్ 
సుగమంబిచ్చునునన్యప్రాణులకుదాసుస్నానమాడంగగా
విగతుల్సైతములేచివత్తురుగనావిన్నేఱులోమున్గుచో

Friday, December 6, 2019

శంకరుడంబకై,యరిగిచప్పునదెచ్చెనుపారిజాతమున్

అంకము నిచ్చెనేగదిల నాయతప్రేమనుశాశ్వతంబుగన్
శంకరుడంబకై,యరిగిచప్పునదెచ్చెనుపారిజాతమున్
బంకజనాభుడయ్యెడనుపావనప్రోలగు దేవభూమికిన్
శాంకరికోరగాదననుసంతసమొందినమానసంబుతో

Thursday, December 5, 2019

గోడినిగోడిమ్రింగె గనుగొన్ననుజనుల్ వడిగోపగింపగన్


వాడిగవేడిగా బ్రజలవాదనలన్నియు విన్నమీదటన్
గోడినిగోడిమ్రింగె గనుగొన్నజనుల్ వడిగోపగింపగన్
బాడియగాదునాదెలిసెబల్కుటయిట్లని గోడీయేవెసన్
గోడీనిమ్రింగుటేలయగు గోరుదుమిమ్ములజింతజేయుడీ

కోడిని మ్రింగినదికోడికోపింపజనుల్

అడవిని దిరిగెడు కక్కర
కోడిని మ్రింగినదికోడి,కోపింపజనుల్
మాడునకొట్టెను నొజ్జను
గీడునుదాజేసెననుచుగేకల తోడన్

బ్రతుకిది

అతుకులబొంతయాయెనుగనారమపాలనమానవాళికిన్
పతియనగౌరవంబుమగవారికిలేకనువింతపద్ధతే
సతతముసేవజేయుచునుసజ్జనువోలెనునుండగోరినన్
బ్రతుకిదిరాాాాామరాాాజ్యమునభద్రతకోల్పడెదుర్భరంబుగన్ 

రామరాజ్యానబ్రతుకుదుర్భరముగాాాాదె

ప్రజలుహాయిగ జీవించెభరణియందు
రామరాజ్యాన,బ్రతుకుదుర్భరముగాదె
వలయురూకలులేనిచోబ్రజలకకట
రామరాజ్యముమనకింకరాదుతలప

Tuesday, December 3, 2019

కవి నాాలుగుపాాాదాాలఆదిని భాారతాాాార్ధము

కవిదలు మానుట యొప్పగు
గవిదలునేజేయునెడలకౌరవశతమున్
గవిదలలోమరణింతురు
కవితిక్కనవ్రాసెనటులకవివరులారా!

Monday, December 2, 2019

సానినిముద్దుపెట్టుకొనె సంయమిసద్గతిబొందగోరుచున్

పానముజేయుటన్ సురనుమానసరోగిగమారగాఖురా
సానినిముద్దుపెట్టుకొనె సంయమిసద్గతిబొందగోరుచున్
బానముజేయునాతడిలభ్రష్టుడు,మూర్ఖుడు,త్రాగుబోతునై
గానడుమన్నుమిన్నునికకాంతలజోలికిబోవుచుండునే

సానిన్ ముద్దాడెయోగిసద్గతిబొందన్

పానముజేయుతమద్యము
మానసమేవికలమగుచుమందుడెయగుచున్
మేనునుదాకుచునాాాదొర
సానిన్ ముద్దాడెయోగి సద్గతిబొందన్

Sunday, December 1, 2019

కుండనుగొండసొచ్చెనిదిగోకనులారగజూచినమ్ముమా

మొండిగవాదులాడకను మోమునుద్రిప్పకచూడుమాయిటన్
కుండనుగొండసొచ్చెనిదిగోకనులారగజూచినమ్ముమా
కుండనునీళ్ళుపోసి యికకొండకుదగ్గరగాగనుంచుచో
గండరగండడా!వినుముగానగవచ్చునుగొండనందులో

కుండలోనజొచ్చె గొండ గనుడు

కుండలోన నీరునిండబోసితనదు
కూతుబిల్చి చూడు కొండనిందు
కుండలోనజొచ్చె గొండ గనుడుతేరి
పార,గాననగునుస్పష్పముగను

Saturday, November 30, 2019

శోధనజేయుచున్రుచులుజూడగజాడయొకండెమిత్రమా!

సాధననెంతజేసినను సత్కవులెల్లరిపద్యమాలికల్
బోధనజేయునట్లుగను బోడిమితోడనునుంటచే యవిన్
శోధనజేయుచున్రుచులుజూడగజాడయొకండెమిత్రమా!
యీధరణిన్ జనించుకవులెవ్వరెయైననునిట్లనేసుమా

చూడచూడరుచుల జాడయొకటె

చూడచూడరుచుల జాడయొకటెకాదు
చూడచూడరుచుల జాడవేరె
యనుచుజెప్పెవేమ నార్యుడుతనదుశ
తకమునందు వినరె?తనయులార!

శంకరుడుమకొఱకుపారిజాతముదెచ్చెన్

అంకమునే యిచ్చెనుగద
శంకరుడుమకొఱకు,పారిజాతముదెచ్చెన్ 
పంకజనాభుడుసత్యకు
సుంకముగా నిచ్చుకొఱకుసౌరికపువిరిన్ 

Friday, November 29, 2019

వడ్డించువాడుశత్రువా?తిననొప్పున్

లడ్డులు గారెలు బూరెలు
వడ్డించువాడుశత్రువా?తిననొప్పున్
వడ్డననుజేయు మనుజులు
బిడ్డలతోసము లెయండ్రు పెద్దలువినవే?

Thursday, November 28, 2019

నీహారాద్రినినిప్పుకొండయని వర్ణింపంగనొప్పున్గృతిన్

నీహారాద్రినినిప్పుకొండయని వర్ణింపంగనొప్పున్గృతిన్
నాహాయేమని జెప్పనోపుదు నిటన్ యాయద్రిన్ వర్ణింపగా
బాహాటంబుగనిప్పుకొండయని దాబల్కంగన్యాయంబెరో
నీహారాద్రినిమంచుకొండగనెవర్ణింపంగనొప్పున్ సుమీ

నిప్పులకొండయనదగును,నీహారాద్రిన్

అప్పా,యరుణాచలగిరి
నిప్పులకొండయనదగును,నీహారాద్రిన్
నప్పరమాత్ముండగు భవు
డప్పార్వతితోడనుండు నార్తులగావన్

మంచముక్రిందజొచ్చెనభిమానధనుండు సభీతచిత్తుడై

ఇంచుకనీయగాచనవు నేకమయౌటకుసిద్ధమౌయెడన్
బంచనలీలగాగనగ బాహుబలాఢ్యునినొక్కనిన్వెసన్
మంచముక్రిందజొచ్చెనభిమానధనుండు సభీతచిత్తుడై
మంచిగనుండగోరుదును మానినులయ్యెడ నెల్లవారునున్ 


Wednesday, November 27, 2019

మంచముక్రిందన్జొరబడె మానధనుండే

ఇంచుక చనువునునీయగ
గంచుకమునుదాకుచుండ కాలునివోలెన్
బంచన గనిపించగబతి
మంచముక్రిందన్జొరబడె మానధనుండే

షట్పదమెప్పుడేనియునుఝంకృతిజేయునెపుష్పవాటికన్

షట్పదమెప్పుడేనియునుఝంకృతిజేయునెపుష్పవాటికన్
షట్పదిగూరిచిన్బలుకశాస్త్రపుసమ్మతమౌనెయద్దియున్
షట్పదమెప్పుడున్నలరిఝమ్మనురావముజేయునేగదా
తత్పటుపాటులేకయిక,తర్కములాడకయుండుమారమా!

Tuesday, November 26, 2019

షట్పదమొనరించునొక్కొఝంకారమ్మున్

పట్పటలాడుచుబలికితె?
షట్పదమొనరించునొక్కొఝంకారమ్మున్
షట్పదమేయొనరించును
దత్పటయే యేలమీకు తర్కములేలా?

రాతిరియందు,భాస్కరుడుప్రాగ్గిరిపైబొడసూపెజూడగన్ 

ప్రాతమునందుగన్పడుచుభాలువుడొయ్యన మాయమౌగదా
రాతిరియందు,భాస్కరుడుప్రాగ్గిరిపైబొడసూపెజూడగన్
జేతనరూపుడైమిగుల చిత్రవిచిత్రపు కాంతిపుంజమున్
భూతలమంతటన్విసరి భూప్రజకెల్లనుమోదమీయగా

Monday, November 25, 2019

రాతిరిభాస్కరుడువొడమెప్రాక్శైలముపై

భూతల మమెరిక యందున
రాతిరియటమారుకతన ప్రాతమువోలెన్
రాతిరె పగలుగ గానగ
రాతిరిభాస్కరుడువొడమెప్రాక్శైలముపై

కరములులేనివాడుచురకత్తులదూసెనుయుద్ధభూమిలో

తిరముగజేయజాలడుతదేకపుదృష్టిని నేపనిన్సుమా
కరములులేనివాడు,చురకత్తులదూసెనుయుద్ధభూమిలో
గరమగుసాహసంబుననుగాంతయొకర్తె శత్రుమూకలున్
జెరియొకవైపుపర్వులిడజేసెనుభీకరరూపమొందుచున్

Sunday, November 24, 2019

కరములులేనట్టివాడు కత్తులుదూసెన్

కరమును నెయ్యముజూపుచు
సరసములేనాడుచుండ చతురతతోడ
న్నరసితె చిత్రము నేయా
కరములులేనట్టివాడు కత్తులుదూసెన్

కుత్సితుడైనవ్యక్తియె,తగున్గురువైజనసంస్తుతుల్గునన్

మత్సరమొందుచున్ప్రజలమధ్యన నుంటకుభీతినొందుగా
కుత్సితుడైనవ్యక్తియె,తగున్గురువైజనసంస్తుతుల్గునన్
మత్సరమెచ్చటన్గనకమాన్యతగల్గుచుమెల్గువాడునై
నుత్సుకగల్గగాభువినినోపికతోడనువిద్యనేర్పుచో

గుత్సితుడైనట్టివాడె,గురువననొప్పున్

మాత్సర్యంబుననుండును
గుత్సితుడైనట్టివాడె,గురువననొప్పున్
దాత్సారమదియలేకను
నుత్సాహముతోడవిద్యనుడివెడునతడే

Friday, November 22, 2019

కలికి! శివపూజజేయకు కార్తికమున

కలికి! శివపూజజేయకు కార్తికమున
గలనుగంటిరి కాబోలు ఖచ్చితముగ
లేనియెడలను నిట్లుగ లేమకెపుడు
చెప్పనోపరు గురువులు దప్పుగాను

Thursday, November 21, 2019

పుస్తకచౌర్యమే యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్ 

పుస్తకచౌర్యమే యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్
బుస్తకచౌర్యమున్వలన బొందరుకీర్తిని నెవ్వరీభువిన్
బుస్తకధారణంబొకనపూర్వపుభాగ్యముగా దలంచుడీ
యాస్తులగంటెమిన్నసుమి యారనిజోతులుబుస్తకంబులే

పుస్తకచౌర్యమునగలుగుబుధులకు కీర్తుల్

ప్రస్తుతపు కవులు కొందరు
మస్తిష్కపుగుంజులేక మాన్యతరహిమిన్
పుస్తకపుట హరియించుత
పుస్తకచౌర్యమునగలుగుబుధులకు కీర్తుల్

ఘనవిఙ్ఙుండుగగీర్తిదెచ్చునుగదాగర్తవ్యవైముఖ్యమే

ఘనమౌ కార్యములెన్నియో భువినిసాకారంబుజేయంగసూ
ఘనవిఙ్ఙుండుగగీర్తిదెచ్చునుగదాగర్తవ్యవైముఖ్యమే
యనుమానంబిసుమంతయున్వలదు తాదాత్శ్యంబునొందంగనో
యనసూయావినువిఙ్ఞుడేధరనుదాధర్మంబుగాపాడుగా

Wednesday, November 20, 2019

విఙ్ఞుడననొప్పు,గర్తవ్యవిముఖుడెపుడు

విఙ్ఞతగలిగి వర్తించువినయమతిని
విఙ్ఞుడననొప్పు,గర్తవ్యవిముఖుడెపుడు
దిరుగుచుండును బనిపాటులరయకుండ
పూటకొకయూరుసోమరిపోతువోలె

Tuesday, November 19, 2019

హితబోధలవినెడివారికే,కీడొదవున్ 

సతతము శుభములు గలుగును
హితబోధలవినెడివారికే,కీడొదవున్
మతిహీనులపలుకులువిని
యతిగావర్తించునెడల నదియేమనకున్

Monday, November 18, 2019

రాజ్యమురాజధాని గనరానిదిరాజెటనుండియేలునో

రాజ్యమురాజధాని గనరానిదిరాజెటనుండియేలునో
రాజ్యముభోజ్యమౌవిధము రాజులపాలననుండుచోభువిన్
రాజ్యమురాజధానిగనరావుగరాజులకేరికిన్సుమా
భోజ్యముజేయువారలకు పుట్టదురాజ్యపువృద్ధిజేయగన్

రాజధాని లేనిరాాజ్యమయ్యె


ఆంధ్రరాష్ట్రమిపుడ యరయగ బ్రజలార!
రాజధాని లేనిరాష్ట్రమయ్యె
నరకొరగను గట్టియాపివేయుఘనత
చంద్రబాబునకిల సార్ధమయ్యె

Sunday, November 17, 2019

వ్యాధిని న్యాయవాదియెనయంబొనరించును.....గ్బలంబునన్

మేధనుసానబెట్టియునుమీరకహద్దులనెల్లవేళలన్
శోధనజేసిన్యాయమగుసూత్రములన్నియు జెప్పువారునున్
బాధలుదీర్చువారనుచువ్యాజ్యము జెప్పినచోదగన్
వ్యాధిని న్యాయవాదియెనయంబొనరించునువాగ్బలంబునన్

వ్యాధినయమొనర్చు న్యాయవాది

వాదనలను జేసి పలువిధమ్ములుగను
బ్రజలమనసుమిగుల రంజిలునటు
మంచితీర్పునిచ్చి మానసికంబగు
వ్యాధినయమొనర్చు న్యాయవాది

గనుగొనిభార్యనంతవడకెందొడగెంబతిభీతచిత్తుడై

అనయముజిందులాడుచునునారడివెట్టుచునుండుదావెసన్
గనుగొనిభార్యనంతవడకెందొడగెంబతిభీతచిత్తుడై
కొరకొరలాడుచుండుచునుగోపముతోడనునూగుచుండగా
వెరవదిలేకచిత్తమున వేంకటనాధునినాశ్రయించెనే

Saturday, November 16, 2019

భార్యనుగనినంత భర్తవడవడవడకెన్



భార్యనుదక్కువజేసియు
నార్యా!పలుకంగనిట్లు న్యాయమె మీకున్
గర్యలలోజూచితె?యే
భార్యనుగనినంత భర్తవడవడవడకెన్

కొల్వగాదగదు కార్తికమాసమునందు శంకరున్

ఇలనరయంగనేర్వుమిక నీశుని కిష్టపుమాసమౌటచే మలినముతోడనుండునెడమానినులెవ్వరుబూలతోడయో కలికిరొ!కొల్వగాదగదు కార్తికమాసమునందు శంకరున్ గలిములునీయునాతడును,గైటభదైత్యునివైరి మిత్రునిన్ 

Friday, November 15, 2019

ధర్మచ్యుతులకెశుభములు తప్పక గలుగున్

కర్మలు సేయుచు శుద్ధిగ
ధర్మమునేవిడువకుండ దానాదులనున్
నిర్మల మనసున జేయున
ధర్మచ్యుతులకెశుభములు తప్పక గలుగున్

Thursday, November 14, 2019

వస్తాలే వినిపిస్త పద్యశతకంబస్తాడుపేలాలకున్


ముస్తాఫా!యిటకెప్డువస్తవు భయా!మూర్తంబుజూసిండువా?
వస్తాలే వినిపిస్త పద్యశతకంబస్తాడుపేలాలకున్
బస్తాల్ గొద్దిని నుండెనిచ్చటసుమావస్తావ?పేలాలువే
యిస్తా రమ్మికవేగమేయిటకుఱేయింబ్రొద్దు నేజూతుగా

బస్తెడుపేలాల నిస్తె పద్యంచెప్తా

ఇస్తా యడుగుము నాయన
బస్తెడుపేలాల నిస్తె పద్యంచెప్తా
మస్తుగ నాహ్లాదించుము
ముస్తాఫా! శ్రద్ధవినిన మోదముగలుగున్

Wednesday, November 13, 2019

జదువనిబాలబాలికలె జాతికికీర్తిగడింతురెల్లెడన్ 

చదువగరానివాటికినిశ్రద్ధనుబెట్టుచు నెల్లవేళలన్
జదువనిబాలబాలికలె జాతికికీర్తిగడింతురెల్లెడన్
జదువదియుండ నొప్పునిక సారమునంతయునొప్పుకోలుగా
మదికినిజేరునట్లుగను మాన్యతనొందగ నుంటమేలుగాఖీ

చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

చదువున కర్హతమైనవి
చదువుచుదగుశ్రద్ధతోడసత్పురుషుండై
చదువగరానివి యెప్పుడు
చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

శుభములుగల్గుగాక!

అభయమునిచ్చురామునకునన్నిప్రదేశములందుదప్పకన్
శుభములుగల్గుగాక!ఖలచోరవిటాళికిశిష్టులౌననన్
నభవునిశాపముండుటను నార్తినిగ్రుంగుచు నంత్యమందునన్
విభవములన్నినూడ్చుకొనివేగతిబోవునుసోమశంకరా!

శుభములులభియించుగాక చోరవిటులకున్ 

విభవములు గలుగు చోటున
శుభములులభియించుగాక చోరవిటులకున్
నభములు శుభములు దెలియని
ప్రభులనుదాదోచుకొండ్రు పగలును ఱేయిన్

Monday, November 11, 2019

మనబడులందికన్జదువుమానుటెయొప్పగుమాతృభాషలో

మనబడులందికన్జదువుమానుటెయొప్పగుమాతృభాషలో
ననుటనునొప్పుగాదిలనుహర్షముజెందరులోకులెవ్వరున్
వినుమది నేనుజెప్పుదునుబేర్మినినేర్వగమాతృభాషలో
ననువుగనర్ధమౌచునటయడ్డులులేకనుసాగిపోవుగా

మాతృభాషలోజదువుటమాాాానుటొప్పు

ఉండగోరిన నమెరికా ఖండమందు
మాతృభాషలో జదువుటమానుటొప్పు
మాతృభాషకు బదులుగ మాండలికపు
నాంగ్లభాషను జదువుట యరయమేలు

ప్రతిభలేనివాడె పండితుండు

ప్రతిభలేనివాడె పండితుండనుటను
నిజముకాదుసుమ్ము నీరజాక్షి!
పండితుండు సతముబ్రతిభావంతుడై
గారవింపబడును గవులజేత

Sunday, November 10, 2019

ప్రజలెల్లరురోసిరయ్యొ పద్యమ్ములనే

గజిబిజి భావమ్ములతో
ఋజుమార్గములేకయుండ యిప్పటికవులే
కుజనులుగావ్రాయుచుండ
ప్రజలెల్లరురోసిరయ్యొ పద్యమ్ములనే

ధర్మమువీడువారలకు,తప్పకగల్గునుశాంతిసౌఖ్యముల్

కర్మలు చాలచేసినను గానగరావుగబుణ్యకార్యముల్
ధర్మమువీడువారలకు,తప్పకగల్గునుశాంతిసౌఖ్యముల్
ధర్మము దప్పకుండగను దాచరియించుచు నెల్లవారినిన్
ధర్మమువైపుద్రిప్పుచును ధార్మికబోధన జేయువానికిన్
----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

Saturday, November 9, 2019

Nagaraju

చిన్మయాకారుడైనట్టిచిన్నబావ నెల్లవేళలధ్యానించియుల్లమలర మాసమాసమ్ము విడువకభక్తితోడ చేయదగునట్టి సేవనుజేసినావు తగినపుత్రుడవైతివాతండ్రికిలను జెప్పుచేతలమెలగుచునెప్పుడునుసు వలయుసేవలుమఱువకప్రమదమలర చేసితివిగదశ్రధ్ధనుశీఘ్రముగను ఎన్నిసేవలుసేసిన నెంతయీయ తల్లిదండ్రులఋణములుదనయులకట తీర్చనేర్తురె జీవమ్ము దీరులోపు కనుమునిస్స్వార్ధసేవయే కదతలపను భర్తకుదగినభార్యయీపార్వతమ్మ యతని యడుగుజా డలనుదాననుసరించి నడచుకొనియెడునుత్తమనారియామె పిల్లలిద్దరుచక్కటివినయవతులు సకల శుభములుగలిగించు శంకరుడు నాయురారోగ్యసంపదలన్నియిచ్చి కంటికినిఱెప్పయట్లయికాచుగాత! యెల్లవేళల మిమ్ములజల్లగాను

Sunday, November 3, 2019

అన్నప్రాసన మాచరింప హితమౌ,నాఱేండ్లకున్ సద్విధిన్ 

అన్నా!యెప్పుడుగూడమూడవనెలన్ హర్షంబులింపారగా
నన్నప్రాసన మాచరింప హితమౌ,నాఱేండ్లకున్ సద్విధిన్
మిన్నున్నంటగ సంతసంబులుగడున్ మీరంగ జేర్పించుచో
జిన్నిన్ ,బాఠమునేర్వగాబడినిదా నేర్చున్ సువిద్యాదులన్

Saturday, November 2, 2019

అన్నప్రాసనముజేయు డాఱవయేటన్

అన్నా!మూడవనెలలో
నన్నప్రాసనముజేయు డాఱవయేటన్
జెన్నుగ బడిలో వేసిన
మిన్నంటును జదువులందు మీకంటెనుసూ

కలువ కత్తి దండ కార్ముకములు

కలువ దండ కత్తి కార్ముకములనుట
బదులుబలికెనిట్లు భరణి!వినుము
కలువ కత్తి దండ కార్ముకములనుచు
దికమకగను దెలిసిదెలియకమ్మ!

Friday, November 1, 2019

చలికాలమునవడదెబ్బచప్పునతగిలెన్

లలనా!వినుమీపలుకులు
చలికాలమునవడదెబ్బచప్పునతగిలె
న్నిలనెన్నివింతలింకను
గలియుగమునజూడవలయుగలిప్రభుచేష్టల్

Thursday, October 31, 2019

గార్తికమాసమందుజొరగందగదేశివమందిరమ్మునన్

ఆర్తినిబూజజేయుచునునాశివపార్వతిపాదపద్మముల్
పూర్తిగబ్రేమతోడుతనబూరెలుగారెలునారగించగా
గీర్తనలెన్నియోదనరగేలునుమోడ్చుచుబాడుచుండుచో
గార్తికమాసమందుజొరగందగదేశివమందిరమ్మునన్

కార్తికమునశివునిగుడినిగాలిడదగునే

ఆర్తినిఱేయింబగలును
కీర్తించుచుసోమనాధుగీర్తనతోడన్
బూర్తిగమైమఱచినయెడ
కార్తికమునశివునిగుడినిగాలిడదగునే

Wednesday, October 30, 2019

తామసచిత్తుడేజనులదైవముగాప్రణతుల్గొనెంగదా

రామునిగాధలన్మిగులరమ్యపుపోకడలన్రచించియా
తామసచిత్తుడేజనులదైవముగాప్రణతుల్గొనెంగదా
తామసుడైననున్వినుముతాలిమిగల్గియునెల్లవేళలన్
బ్రేముడిజూచువారలనుబ్రీతినిదైవముగాదలంతురే

తామసచిత్తుండెజనులదైవంబయ్యెన్

పామరుడౌవాల్మీకియ
తామసియైరచనజేసిధారుణియందున్
రామునిగాధనునీయగ
తామసచిత్తుండెజనులదైవంబయ్యెన్

Tuesday, October 29, 2019

దత్తపది

కోరికయనెడుగుర్రమ్ముకోరునెడల
పొసగనోపమైలవరపుపుత్రివినుము
వానిగుండాటనాడింతునీనిమిసము
చీరరావెలతాంగికజేరనన్ను

అడరన్సోదరుడాాా

అడరన్గోపముసోదరీమణికినాయాసంబుతోనుండగాన్
నడరెన్సోదరుడారగింపభగినీహస్తాన్నమ్మున్భీతుడై
కడునాలోచనజేయగాదెలియునెక్కాంతల్సరేతాముగా
బుడమిన్గోరుదురెల్లవేళలనుదాపుట్టింటీసౌభాగ్యమున్

Monday, October 28, 2019

భగినీహస్తాన్నమనినవడకెననుజుడే

వగలాడిదనముదోడను
బగలనునికబెంచుచుంటపబ్బముగాగన్
భగభగలతోడగన్పడు
భగినీహస్తాన్నమనినవడకెననుజుడే

గేదారేశువ్రతమ్ముజేసిన

ఆదాయమ్మదివృద్ధిగానగునికన్నారోగ్యమున్బెంపగున్
గేదారేశువ్రతమ్ముజేసిన,జనుల్ గీడొందిదుఃఖింపరా
కేదారేశువ్రతమ్ముజేయకనికన్గేదారునిందించుచో
నాదైవమ్మునుగోపగించిననికన్నైరాశతోనుండుచున్ 

Sunday, October 27, 2019

కేదారేశ్వరునినోమ,గీడొనగూడున్

ఆదాయముపెరుగునుసుమ
కేదారేశ్వరునినోమ,గీడొనగూడున్
కేదారవ్రతముజేయక
యాదినమున్బీరుద్రాగియటునిటుదిరుగన్

శంకరుడుగ్రుడైనరకుజంపెనులోకహితైకకాాంక్షియై

శంకరుడుగ్రుడైనరకుజంపెనులోకహితైకకాంక్షియై
పంకజనాభుడేశివుడుమారునిశత్రువయుమాకాంతుడే
శంకయలేదుగానికనుసారసలోచనుడేగదా ధరన్
సంకటబెట్టలోకులనుజంపెనుసత్యయెలోకకంటకున్

Saturday, October 26, 2019

శంకరుండునరకుజంపెనలిగి

అరయకేశవుండు నభవులొకరగుట
శంకరుండునరకుజంపెనలిగీ
ననుటదప్పుకాదుహర్షవర్ధన!నాదు
భావమదియయనుచువ్రాసియుంటి

Friday, October 25, 2019

నవ్యదీపముల్ గృహవితాానముననేల

నవ్యదీపముల్ గృహవితానముననేల
యనగగృహములుకళకళలాడుచుండు
బెరుగునాయువుగలుగునుసిరులుభువిని
నవ్యదీపాలవెలుగులునావరించ

వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో

వాసిగసంస్కృతంబునిలభాగవతమ్మునుగృష్ణలీలగా
వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో
భాసురమైనరీతినికబమ్మెరపోతనదేటతెల్లమౌ
బాసనుదియ్యగుండునటువ్రాసినమేటికవీంద్రుడేగదా

వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో

వాసిగసంస్కృతంబునిలభాగవతమ్మునుగృష్ణలీలగా
వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో
భాసురమైనరీతినికబమ్మెరపోతనదేటతెల్లమౌ
బాసనుదియ్యగుండునటువ్రాసినమేటికవీంద్రుడేగదా

వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో

వాసిగసంస్కృతంబునిలభాగవతమ్మునుగృష్ణలీలగా
వ్యాసమహర్షివ్రాసెనట,భాగవతమ్మునుదెన్గుబాసలో
భాసురమైనరీతినికబమ్మెరపోతనదేటతెల్లమౌ
బాసనుదియ్యగుండునటువ్రాసినమేటికవీంద్రుడేగదా

Thursday, October 24, 2019

వ్యాసుడుదెనుగునరచించెభాగవతమ్మున్

వ్యాసునిభాగవతంబును
భాసురముగదెలుగునందుబమ్మెరవ్రాయన్
వ్యాసుడు ననుటనున్యాయమె
వ్యాసుడుదెనుగునరచించెభాగవతమ్మున్ ?

Wednesday, October 23, 2019

జనహననైకతత్పరుడెసజ్జనుడైయశమందునిద్ధరన్

నయముబొందుదుర్గతులనంతముగానిహలోకమందునన్
జనహననైకతత్పరుడె,సజ్జనుడైయశమందునిధ్ధరన్
వినయముతోడబెద్దలకువేయివిధంబులసేవజేయుచో
వినుమురమానవాళికిలబేర్మినిజేసిన బుణ్యమబ్బుసూ
ప్రత్యుత్తరంతొలగించు

జనహననాసక్తుడేయశంబుగనుధరన్

కనికరములేకజనులను
ననయముహింసించునతడు నాత్ముడెయైనన్
మనుగడనీయకయాదు
ర్జనహననాసక్తుడేయశంబుగనుధరన్

Tuesday, October 22, 2019

దత్తపది

చిన్నచూపుగ మమునేల జేయుటేమి
యాలకించియుమన్నుతుల నందరెదుట
బేర్మిజూపుడమితముగ బెద్దనాన్న!
పెంచుకొనుమట్టికీర్తినిబెద్ద కతన

వినుశ్రీరామకధామృతంబువిన,నిర్వేదమ్ముహెచ్చున్గదా


కనగన్రానిదియైన మోక్షమదిదాగానంగజేయున్సుమా
వినుశ్రీరామకధామృతంబువిన,నిర్వేదమ్ముహెచ్చున్గదా
కనగాబాధలనొందువారలను దుంఖంబందుదీనావళిన్
మనసేబిత్తరవోయెనాక్షణమలేమా!నిర్వేదమేకదా

Monday, October 21, 2019

శ్రీరామకధామృతంబు,చింతలగూర్చున్ 

ఆరాటంబులదీర్చును
శ్రీరామకధామృతంబు,చింతలగూర్చున్
పోరాములెయిలజనులకు
నారామునిగొల్వకుండియలుసునిజేయన్

కలంంగాంచిముదంబునందిననెసంకల్పంబుసిద్ధీంచులే

కలలంగాంచిముదంబునందిననెసంకల్పంబుసిద్ధించులే
కలలేవచ్చునురాత్రిపూటయవియెక్కాలంబునందైనసూ
పలుమారెయ్యదిదాదలంచుచునునెవ్వారల్ సునేత్రాలనన్
నలమూయంగనెభీకకరాకృతినిహాహాయంచువిన్పించుగా

సంకల్పముసిద్ధిగాంచుస్వప్నములగనన్

జంకక ముందుకు సాగిన
సంకల్పము సిద్ధిగాంచు,స్వప్నములగనన్
శంకలుగలుగును నిరతము
సంకటములుగలుగునేమొస్వప్నమువలనన్

Sunday, October 20, 2019

విషమగునమ్మపాలనుచుబిల్లలుగ్రోలనిచ్చగింపరే

విషమగునమ్మపాలనుచుబిల్లలుగ్రోలగనిచ్చగింపరే
మృషయగుమాటలెందులకుమీరుటహద్దులుదాటన్యాయమే?
విషముగనెట్లుమారునవివెర్రినిజేసియుబల్కనొప్పునే
శషభిషలేలమీకిపుడుశాస్త్రులుసెప్పెనుశ్రేష్ఠమైనవే

ఆకాశవాణి

నవదీపమ్ములవేలకోగృహవితా
నమ్మందు నీవేళలో
భవముల్సేమములుండగోరుచునునాఫాలేక్షుబ్రార్ధించుచు
న్నవదీపంబులనిచ్చగించిరటనానాదేశమేధావులే
భువికిన్మేలుగదీపకాంతులవియావ్యోమంబుకాంతీయగాన్
----

Saturday, October 19, 2019

అమ్మపాాలువిషమ్మగునర్భకులకు

చంటిపిల్లలకుమిగుల శక్తినిచ్చు
నమ్మపాలు,విషమ్మగునర్భకులకు
నరయకుంకుడుకాయలనరగదీసి
చన్నుమొనలకువ్రాయగసన్నుతాంగి!

Friday, October 18, 2019

అల్లుడురాకున్నమురిసిరత్తయుమామల్

పల్లెకుబోవలెనటబడి
పిల్లలకున్వేయవలయువేషములచటన్
మరినేరాననిజెప్పగ
నల్లుడురాకున్నమురిసిరత్తయుమామల్

Thursday, October 17, 2019

పాపమెదక్కుసుమ్ముపదవందనముల్వొనరించువారికిన్

ఆపదనొందువారలనునాదుకొనంగకగీడుసేయుచో
బాపమెదక్కుసుమ్ము,పదవందనముల్వొనరించువారికిన్
బాపమెగల్గునెప్పుడునుబాధలనొందుచువేడుకుండినన్
బ్రాపుగరాకయుండుచును,వారినిబ్రేమగజూడకుండుచో

పాపమేదక్కుపాదాభివందనమున

గురువునెగతాళి జేయుచు గులుకునెడల
పాపమేదక్కు,పాదాభివందనమున
నాయురారోగ్యసంపద లన్నియిలను
బొందవచ్చునునింకను బుణ్యతతిని

Wednesday, October 16, 2019

కారాగారమునుండివచ్చెనిపుడేకాబోవురాజీతడే

ఓౌరా!యేమనిజెప్పనోపుదుమఱిన్ మౌనంబుగానుండుచున్
గారాగారమునుండివచ్చెనిపుడేకాబోవురాజీతడే
యారాజేంద్రునిబుత్రుడైనజగనేనయ్యెన్గదాముఖ్యుడున్
ధీరోదాత్తులలక్షణంబులటులేదీపించునెల్లప్పుడున్

కాారాగృహముక్తుడితడెకాగలరాజౌ

ఓౌరాయాజగనన్నను
నేరములేజూపియిడిరి నిర్బంధమునన్
నేరములేమిని విడువగ
కారాగృహముక్తుడితడెకాగలరాజౌ

నిద్దురపోవువాాాాడుధరణీన్ ఘనకీర్తివహించిమీంచెడున్

మొద్దనిబేరుగాంచునిలబూటయుమొత్తములేవకుండగన్
నిద్దురపోవువాడు,ధరణిన్ ఘనకీర్తివహించిమించెడున్
దద్దయుగారవంబడరధార్మికబోధనజేయుచుండుచో
నద్దివికేగియచ్చటనుహాయినిసౌఖ్యములందవచ్చునూ

Tuesday, October 15, 2019

నిదురించెడువాడెధారుణిన్ యశమందున్

మదమున మెలగుచు జనులను
వదలక హింసించునతడు బంధువెయైనన్
చిదుమను నాతని నెదపై
నిదురించువాడెధారుణిన్ యశమందున్

Monday, October 14, 2019

శ్రీరఘురాముపెద్దసతిసీతకుమ్రొక్కెనుభక్తిమీరగన్

శ్రీరఘురాముపెద్దసతిసీతకుమ్రొక్కెను భక్తిమీఱగన్ఠీ
శ్రీరఘురాముడెన్నగనుసీతనుమాత్రమునాలిగాగొనెన్
మీరుచుహద్దులన్దమినిబెద్దయుభార్యయమ్రొక్కెనేయటన్
నేరముగాదలంచుచునునెమ్మదిరామునివేడుకొందుమా

శ్రీరామునిపెద్దభార్య సీతకుమ్రొక్కెన్

శ్రీరాముడనెడునతనికి
దారలలేగలరుమువురుతాయారాదుల్
వారలలో దాయారే
శ్రీరామునిపెద్దభార్య,సీతకుమ్రొక్కెన్

తనయునిదౌతలన్నరుకుతల్లికివందనమాచరించెదన్

అనయముహింసబెట్టుచునుహర్షముతోడనుసంచరించునా
తనయునిదౌతలన్నరుకుతల్లికివందనమాచరించెదన్
వినుమురహింసజేయుటనుభీకరమైనదిగాదె నేర్వుమా
కనుకనెయమ్మచంపెసుతుగ్రౌర్యముజెందుచునాక్షణంబునన్

Sunday, October 13, 2019

తనయునితలనరికినట్టితల్లికిజేజే

వినగను ఛీయనిపించెను
తనయునితలనరికినట్టితల్లికిజేజే
యనుచున్నీయగపాదము
తనయునితలనరుకునట్టితల్లులుగలరే?

Saturday, October 12, 2019

రంగమునందునోడియొకరాణినిగెల్చెగవీంద్రుడొక్కడున్

రంగమునందునోడియొకరాణినిగెల్చెగవీంద్రుడొక్కడున్
ఖంగుతినంగనిచ్చెనిదికందివరేణ్యులువ్రాయలేనిచో
భంగముగల్గునంచిపుడువ్రాయగబూనితినిట్లుగాదగన్
బొంగినసంతసంబుననపూర్వపురీతినినాదరింతురే?

రంగమ్ముననోడినకవిరాణినిగెలిచెన్

రంగనితోనాడుచుచద
రంగమ్ముననోడినకవిరాణినిగెలిచెన్
సంగమమందున రకరక
భంగిమలన్ దృప్తిపఱచిప్రమదముగలుగన్

Friday, October 11, 2019

గుర్రం సీతాాాదేవి


లలితపేరున శతకము రచనజేసి
కవివరేణ్యులసాక్షిగా గవనమచట
చదువుచుండెడుసమయాన శర్వసుతుడు
శుభములీయగగోరుదు శుద్ధమతిని

దుర్గానీవలనజగముదుఃఖమ్మందెన్

స్వర్గపు సుఖములనుంటిమి
దుర్గా!నీవలన,జగముదుఃఖమ్మందెన్
భర్గుని వరమునుబొందిన
దుర్గుణుడారాక్షసుండుతొగలేయిడగన్ 

మోదీపెండ్లికిపోయినారుగదరాముక్కోటిదేవుళ్ళహో

దాదాసాహెబు చెప్పెనిట్లనిభళామోదంబునొందంగగా
మోదీపెండ్లికిపోయినారుగదరాముక్కోటిదేవుళ్ళహో
మోదంబందుచుజూడశూన్యమెకటాభోస్వప్నమందుండెగా
దాదాసాహెబుమాటలన్నియుకలన్దధ్యంబులేయౌనుసూ

మోదిపెండ్లికిజనిరటముక్కోటిసురల్

దీదీకలగనిజెప్పెను
మోదీపెండ్లికిజనిరట ముక్కోటిసురల్
సౌదామినివధువటయిక
మోదీజీయగుటవరుడుమోదముగలిగెన్

Wednesday, October 9, 2019

కోతినిబెండ్లాాడుమింకకూటికిలోటాాాాా

భీతినిజెందకవినుమా
నాతియమారాముపట్టి నర్మచరితయున్
వీతభయంబునుగలయా
కోతినిబెండ్లాడుమింక గూటికిలోటా?

కోతినిబెండ్లియాాాడుమిక


కోతిని బెండ్లియాడుమికగూటికిగుడ్డకు లోటులేదుపో
రోతలుగల్గునట్లుగనురూమరులాడుచునుండభావ్యమే!
కోతికి గూటికిన్వెరసికూర్చుటబంధము నొప్పునేయిలన్
గోతులుదేవతాసములుకూర్మినిజూచిన బుణ్యమబ్బుసూ

Tuesday, October 8, 2019

ప్రాగ్దిగ్గ్రావమునందుగ్రుంకెరవియున్బ్రత్యూషకాలంబునన్

బాగ్దానామకపట్టణంబునగనన్బ్రాభాతవేళంబునన్
బ్రాగ్దిగ్గ్రావమునందుగ్రుంకెరవియున్బ్రత్యూషకాలంబునన్
బ్రాగ్దిగ్గ్రావపుకోనలందునదగన్భానుండుగన్పించలేకుండుట
న్హెగ్దేవాయనెనిట్లుభాస్కరుడుదాబ్రాగ్దిక్కునన్ గ్రుంకెనో

ప్రాగ్దిగ్గ్రావమునగ్రుంకెరవియుదయమునన్

బాగ్దాదుపట్టణంబున
ప్రాగ్దిగ్గ్రావమునగ్రుంకెరవియుదయమునన్
బ్రాగ్దిశకవివరుడగునా
హెగ్దేవాయట్టులనియెయినుడున్ లేమిన్

ఆయుధపూజసేయుటయనర్ధకమేకదపర్వమందునన్

పాయనిభక్తినిన్ దనరివర్షమువర్షమునానమాయితే
నాయుధపూజసేయుట,యనర్ధకమేకద పర్వమందునన్
మాయలుసేయుచున్మిగుల,మాంత్రికువోలెనుమంత్రదండమున్
వేయగభావ్యమేయరయ భీతినిగొల్పగనుండజేయగా

Monday, October 7, 2019

ఆయుధమ్ములపూజలనర్ధకములు

ఆయుధమ్ములపూజలనర్ధకములు
నిజముబల్కితివిట్లని నీరజాక్షి!
పూజజేసినజేయక పోయిననుసు
తప్పవుప్రమాదములుప్రజ కప్పుడపుడు

Sunday, October 6, 2019

భారతమున్బఠింపఘనవైభవముల్నశియించునందురే

భారతమున్బఠింపఘనవైభవముల్నశియించునందురే
భీరునిమాటలేయవియప్రీతినిగల్గుగధామృతంబునై
బారమునిచ్చునున్దుదిని,పాఠకలోకముసంతసించుచున్
భారతమున్బఠింపగనుబాడియుపంటలువృద్ధిపొందిలన్

భారతమ్మునుజదువ వైభవములడగు

జీవనవిధానమలవడు జీవికిటను
భారతమ్మునుజదువ,వైభవములడగు
ననుటసరికాదు పెరుగున యాచితముగ
నాయురారోగ్యసంపద లన్నిభువిని

Saturday, October 5, 2019

శతకములన్ రచించుటాాాాాాప్రశస్తముగాాాాాాాదది

కృతకములైన భావములగూర్చుచువేలకువేలుగానికన్
శతకములన్ రచించుట ప్రశస్తముగాదది నిష్ఫలమ్మెపో
శతకములన్నియున్ జనుల సమ్మతమైనవిధంబునుండుచో
నతులితభక్తిభావముననందరుమోదముతోబఠింతురే

శతకములరచనమ్ము నిష్ఫలమెసుమ్ము

సకల జనులకుశ్రేయమ్ముశతముకొలది
శతకములరచనమ్ము,నిష్ఫలమెసుమ్ము
శతకపఠనముజేయకముద్రజేయ
మూలవేతురుకట్టల పొత్తములను

రేడియో

దుర్గానీవలనన్జగద్వలయమెంతోదుఃఖమందెన్గదా
దుర్గాదేవినిబూజజేసినగడున్దోషంబుతోడన్నికన్
దుర్గంబైననునిచ్చుమోక్షముసుమాదుఃఖంబులేకుండగా
దుర్గాదేవిల గ్రామదేవతగదాదోర్దండమున్ గల్గెడిన్

Friday, October 4, 2019

మనుజునకుబ్రమోదమిడుసమస్యలుసతమున్

వినుటకు సొంపుగ లేదిది
మనుజునకుబ్రమోదమిడు సమస్యలు సతమున్
మనుజునకరయసమస్యలె
యనుదినముందుఃఖమిచ్చునవునా కాదా?

Thursday, October 3, 2019

రాతినిగన నాతికిననురాగముపుట్టెన్

ప్రీతినిదలచుచునామము
రాతిరివేజామువరకుప్రార్ధనజేయన్
ద్రాతగ వచ్చిన కంసా
రాతినిగననాతికి ననురాగము పుట్టెన్

Wednesday, October 2, 2019

నరకమునందుజూచెనొకనవ్వులస్వర్గముమోదమందుచున్

నిరతముగాయకష్టములునెవ్వగలొందుచుజేయుచుండగా
భరణముజాలకుండగ నుభారమునొందుచుబొట్టకూటికై
యిరవుగజేయుచుండియునుయిక్కటులన్నియునోర్చుచుండుచున్
నరకమునందుజూచెనొకనవ్వులస్వర్గముమోదమందుచున్

నవ్వులస్వర్గమునుజూచె నరకమునందున్

పువ్వులబోణియ యొకపరి
నొవ్వగదాభర్తవలన నోవగలేకన్
జువ్వనుబోలిన యాయమ
నవ్వులస్వర్గమునుజూచె నరకమునందున్

Tuesday, October 1, 2019

కలనైనన్

కలనైనన్ దలపోయరే జరుపగన్ గాంధీజయంతిన్ జనుల్
డేగలలోసైతము దాదలంపగను నాగాంధీజినామంబునున్
నిలలోజీవనమొందగాసబబెయాయీగాంధియేశాంతితో
నలనాడేమఱిదెచ్చెగామనకునాద్యంతంబుస్వారాజ్యమున్ 

దేశజనులకువలదు గాాాాంధీజయంతి

మాయమర్మపుటార్జన నేహ్హ్యమగుట
దేశజనులకువలదు,గాంధీజయంతి
జరుపుకొందుము ప్రతియేట సంతసముగ
రెండుతేదీన యీనెల రండిసామి!

నన్నయభట్టువాాసము

నన్నయభట్టువాసముతెనాలియటండ్రుచరిత్రశోధకుల్
బన్నపుమాటలాడుటనుభావ్యమెచెప్పుడు,నన్నయార్యుడున్
నెన్నగ నుండెనే,యెపుడయైనదెనాలిన?నేర్వకుండగా
గ్రన్నననట్లుగా బలుకగామితలోకము సంతసించునే!

Monday, September 30, 2019

నన్నయకవివరుండు

నన్నయకవి వరుండుతెనాలివాడు
నాబ లికిరార్యులు నిజమ?నమ్మబుద్ధి
యగుటలేదునాకామాటరాజమండ్రి
పురని వాసుడై గణుతినిబొందెగవిగ

Saturday, September 28, 2019

ఏడ్పేయిష్టమటంచు

ఏడ్పున్నేడ్చెడువారుచెప్పుదురహోయీమాటలన్దాగా
నేడ్పేయిష్టమటంచుజెప్పెదనదేయెంతేనిమోదంబిడున్
నేడ్పుల్గూడనునొక్కవిద్యయెసుమాయీలోకమందున్గనన్
నేడ్పుల్నేడ్చుచసాజమేకద యిలన్నింతుల్ గృహంబందునన్

రేడియో

వినుమురచేతినిండుగను వేలకువేలుగసొమ్ములుండుచో
మనిషికిమోదమిచ్చును,సమస్యలునిత్యముజీవితంబులో
చెనకుచునుండుగావునసజీవనదృష్టినిబారద్రోలగా
ననిశముబాటునొందుచునుహర్షముగల్గెడుమార్గమెన్నుమా
,----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

రేడియో

వినుమురచేతినిండుగను వేలకువేలుగసొమ్ములుండుచో
మనిషికిమోదమిచ్చును,సమస్యలునిత్యముజీవితంబులో
చెనకుచునుండుగావునసజీవనదృష్టినిబారద్రోలగా
ననిశముబాటునొందుచునుహర్షముగల్గెడుమార్గమెన్నుమా
,----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

చుక్కలుభువిపైనవెల్గెజోద్యంబయ్యెన్

చుక్కలె సినిమా తారలు
మక్కువతోవారువచ్చిమాలును దెఱువన్
చక్కటి సొగసులు గలయా
చుక్కలు భువిపైన వెల్గె జోద్యంబయ్యెన్ 

ఏడ్పేయిష్టమ్మునాకదేమోదమిడున్

ఏడ్పును గూడను నొకకళ
యేడ్పేయిష్టమ్ము నాకదేమోదమిడున్
నేడ్పును వినినటకుంజని
యేడ్పునకున్దీటునటుల నేయుదుజిందుల్

Friday, September 27, 2019

వినుమురచేతినిండుగను

వినుమురచేతినిండుగను వేలకువేలుగసొమ్ములుండుచో
మనిషికిమోదమిచ్చును,సమస్యలునిత్యముజీవితంబులో
చెనకుచునుండుగావునసజీవనదృష్టినిబారద్రోలగా
ననిశముబాటునొందుచునుహర్షముగల్గెడుమార్గమెన్నుమా

Thursday, September 26, 2019

ఏనుగుచంపనోపునొకొ

ఏనుగుచంపనోపునొకొయెల్కగడుంగడు విక్రమించినన్
వీనులవిందుగాగనముద్విరదమయ్యదిమూషకాదులన్
బూనికతోడజంపుటకుపోడిమిలేదను నార్యుపల్కులన్
గానము,మూషకంబునదికాలనుద్రొక్కుచుజంపునేసుమా

చంపగలదెయేనుంగు మూషకమునైన

చంపగలదె యేనుంగుమూషకమునైన
జంపగలదయ్య చిటికలోజంతువులను
కాళ్ళతోడను ద్రొక్కుచు గరముతోడ
గిరగిరగ ద్రిప్పిచంపును హరినిదప్ప

ఎంతటిపండీతుండయిన

పుంతలదారినన్నడచిపోవుచునుండగ మార్గమందున
న్నింతలుగన్నులున్గలిగియింద్రునిబోలుచునుండగామఱి
న్నెంతటి పండీతుండయిననేర్పడదానెఱుగంగ శక్యమే
వింతటిరూపమున్నడరిభీకరశబ్దముగల్గువానినిన్ 

వాన రాాాాకడ

వానరాకడ ప్రాణమువదలుటార్య!
యెంతపండితుండైనదా నెఱుగగలడె
జీవమున్నత వరకును జీవియికను
మోక్షకామియై మెలగుట ముఖ్యమిలను

Tuesday, September 24, 2019

నకులునీతో

తికమకగలిగినదీయది
నకులునితో రాఘవుండు రణంబొనరించెన్
సకలము నెఱిగిన మీరే
పకపక పదిమంది నవ్వభావ్యమె? యీయన్

పాాటలగంధి

చాటునమాటునన్ దఱచుచావడియందునబాటబాడునా
పాటలగంధియింపుగనుబాడెను,మాటలురాకపోయినన్
దేటమనంబుతోడనికదిట్టతనంబునమెల్గుచుండుచున్
బాటలగంధి యాసరళమానసమందునబాడుచుండెడున్ 

Monday, September 23, 2019

మాటలేరాాానిమగువయే

అందచందాల తోడను నడరిమిగుల
నాటపాటలయందుననారితేరి
కన్నుమిరు మిట్లుగొలిపెడు కాంతిగలుగు
మాటలేరానిమగువయే పాటపాడె

కులమున్ గాాంచుచు

కులమున్గాంచియుబోధసేయుగురువేక్షోణిన్గడుమన్బూజ్యుడౌ
లలనా!యేమనియంటివీ?గురువుదాపాఠంబుబోధించునా?
కులమున్గాంచుచుచూసితేయచటయేకోణంబునైనన్మఱిన్
బలుకన్నేర్వుముమంచిగాసరళ!వాక్ప్రాధాన్యమింపారగన్ 

Sunday, September 22, 2019

కులమునుగుర్తించు

కలకలము రేపుప్రజలకు
కులమును గుర్తించువాడె,గురువన నొప్పున్
బలురకములసూక్ష్మములను
కులభేదములరయకుండ కూర్చెడునతడే

తమిళులకు

తమిళులకున్దెనుంగనిన దద్దయుప్రీతియటన్ననమ్ముమా
తమిళులు వారిభాషనుదదాత్మనుబొందుచుబల్కుచుండియీ
సుమధురభాషనెప్పుడును జూడరుప్రీతిగ దెల్గునెప్పుడున్ భ్రమలనుబొందకుండుడిక భాషలువేరుగ రెండుచోటులన్ 

Saturday, September 21, 2019

తమిళులకు

తమిళులకు తెలుగుబాసపై తగనిప్రీతి
యాంగ్ల భాషలవారలు నమితముగను
నిష్టపడుదురు తెలుగును నెందుకతన
దేశభాషల యందున దెలుగు లెస్స

Friday, September 20, 2019

మాార్గశిరమున వచ్చెనాాాాాాామని పుడమికి

వాన లధికముకుర్వగ బంటచేలు
పచ్చ దనమును గలుగుచు వరలుచుండ
మార్గశిరమందు వచ్చెనామని పుడమికి
నాయ నునటుల దోచెను నాకనులకు

రేడియో

అక్కటయేమిచిత్రమదియంబరమందునవెల్గునట్టియా చుక్కలుభూమిపైవెలిగె,సూర్యుడు చంద్రుడుచోద్యమందగన్ జీక్కెనుజంద్రయానమటశీతమయూఖునిపార్శ్వమందున న్నక్కట శాస్త్రవేత్తలికయాయతరీతినినేమిజేతురో -

స్తంభంమందునబుట్టి

అంభోజాక్షుడు దానుగోపముదనన్ హర్యక్షరూపంబుతో
స్తంభంమందున బుట్టిచంపెనసురున్,స్కందుండు సంరంభియై
శంభున్నాఙ్ఞకు మోద మందుచువెసన్ జాపంబుజేబూని యా
డంభంబొందిన తారకాసురుననిన్ ఢంకాలుగొట్టెంచెగా

Thursday, September 19, 2019

స్తంభంబున

డంభుడు రాక్షస రాజును
స్తంభంబున బుట్టిచంపె,స్కందుండసురున్
శంభునీ యాఙ్ఙను జంపగ
రంభాదులుమెచ్చి పూలురయమున జల్లెన్ 

జలమునుదెచ్చిచల్లగనె

సలసలకాగి పైకుబుక చల్లబడున్ దనంతనెబాలుసూ
జలమునుదెచ్చిచల్లగనె,జ్వాలలురేగెనిదేమిచిత్రమో
లలనలు మేడపైన గడులాస్యములాడుచు నుండనత్తరిన్
విలవిలలాడుచుండిరటభీతీనిజెందుచు నెల్లవారలున్

Wednesday, September 18, 2019

జలము జల్లినంత జ్వాాాలలెగసె

మంటలారెజూడు మందిరాగ్రమ్మున
జలముజల్లినంత,జ్వాలలెగసె
మండుచున్నతెరకు మరుత్తుతోడురా
భయముగొల్పెజూడ వహ్నికీల

Tuesday, September 17, 2019

మత్స్యా హాారమె

మత్స్యాహారమెమేలుమౌనులకుధర్మఙ్ఞోక్తియౌనిద్దియే
మత్స్యంబన్నియు ప్రాణులేగదరమా! మాన్యంబె భక్షించగా
మత్స్యాహారమె మేలు మౌనులకనన్ భావ్యంబె చింతించగన్
మత్స్యంబుల్గన దూరమేగునుగదా మౌనుల్ విరాగంబుతో

మత్స్యమునొక

మత్స్యము నొకప్రాణియెకద
మత్స్యముహారమ్ముజేయ మాన్యతయౌనే?
మత్స్యము నిటులన సబబే?
మత్స్యాహారమ్ముమేలు మౌనివరులకున్ 

Monday, September 16, 2019

కుజనుల్ క్రూరమన

కుజనుల్క్రూరమనస్కులె ల్లరుగదాగుంటూరువాసుల్ గనన్
నిజమే యంతటివారలే మునుపు నన్నేవారుబాధించిరే
సుజనాచౌదరి దర్శనంబునకు మాసూనుండుబోబోవగా
గుజనుల్ వారలునడ్డగించిరపుడీ గుంటూరువాసుల్ సుమా

కుజనులుక్రూరాాాత్ములుగదగుంటూరుజనుల్


నిజమే మీరుడివెడునిది
కుజనులు,క్రూరాత్ములుగద గుంటూరుజనుల్
గజగజ వణికింతురనుచు
బ్రజ జెప్పగ వింటినేను బండితవర్యా!

వినుమాాాా

వినుమా వ్యర్ధమెసుమ్ము పుస్తకమునావిష్కారమున్జేయగన్
వినువాడుండడు నొక్కడచ్చటను వేవేలంజనంబుండినన్
జనువన్బల్కితి నిట్లుగా నిచట యీశానేవాచాలనే
గనుచోనట్లనిగోపమున్గొనుచు బక్కాగానుశిక్షించుమా

Sunday, September 15, 2019

శుష్కకాాార్యము

శుష్క కార్యము పుస్తకావిష్కరణము
చక్క జెప్పిరి యార్యులు శంకరయ్య
చదువు వారలు లేరుగ జగమునందు
నాకుదోచినదిద్దియ మీకు? చెపుడు

Saturday, September 14, 2019

శ్రీనాధుడు రోసెనంటశ్రీకాాకుళమున్

నానీ! యేమని యంటివి!
శ్రీనాధుడు రోసెనంట శ్రీకాకుళమున్
శ్రీనాధు డనెన నటులని
నేనాడును జరుగదటుల యీజగమందున్

Friday, September 13, 2019

రేడియో

పచ్చటియాకుతోమిగులభాసిలువృక్షపుటాకురాలగా
వచ్చెను మార్గశీర్షమున,భవ్యవసంతముధాత్రినిండుగ
న్నచ్చపుజీకటిన్దొలగి హారతిబట్టిన గోమలాంగియే
యచ్చుగ నుండెనాయనగ  నందెలు మ్రోయగ నేగుదెంచెసూ
----

పడమటి దిక్కులోబొడిచెభాాాాాాాానుడు గ్రుంకెనుదూర్పుదిక్కులో

పడమటిదేశమేగినప్రభాకరశాస్త్రులుభార్యతోననెన్ 
బడమటిదిక్కులోపొడిచెభానుడు గ్రుంగెనుదూర్పుదిక్కులో
పడమరతూర్పుదూర్పునగుబశ్చిమదిక్కుగమారునచ్చటన్ 
గడిబిడయైతివేలలన,గాలముమార్పులు సాజమేగదా
-----

పడమట నుదయించెనినుడుప్రాగ్దిశగ్రుంకెన్

వడివడిగ మాటలాడుచు
నడపా సుబ్బన్న శాస్త్రి యందరి యెదుటన్
గుడియెడమగ నిటు పలికెను
బడమట నుదయించెనినుడుప్రాగ్దిశ గ్రుంకెన్ 

Thursday, September 12, 2019

జనకుని సేవ

వినుముర పొందుపుణ్యమును వేయివిధంబులుగాగ నీభువిన్
జనకునిసేవజేయుతనుజాతుడు,రౌరవమందిచింతిలు
న్ననయము మాతృదూషణము నచ్చతెనుంగున జేయునాతడున్
వినయముతోడ మాతృపిత భేదములేకను గౌరవించమేల్

జనకునిసేవించునతడుచనుయమపురికీన్

వినువీడునకే తప్పక
జనకుని సేవించుసుతుడు చను, యమపురికీన్
జనుమాతాపితలనునిల
ననయము బాధించునతడు నార్యా!వింటే?

Wednesday, September 11, 2019

దైవమ్మున్

దైవమ్మున్గొలువంగ రాదనిరయో ధర్మఙ్ఞులున్యోగులున్
దైవమ్మేగద రక్షజేయునుమహిన్ ధర్మంబె యట్లంటిరే
దైవమ్మున్గొలువంగవచ్చునుసదాధ్యానంబుపూజాదులన్
గావన్ బృధ్విని జంతుజాలమునీలన్గారుణ్యమొప్పారగన్

దైవమును గొల్వ

తల్లిదండ్రుల విడనాడుతనయు లికను
దైవమును గొల్వరాదండ్రు ధర్మవిదులు
వారి పిదపనే దైవము బరగు గాన
తల్లిదండ్రుల పూజయే దైవపూజ

Monday, September 9, 2019

అల్లదెచూడుమాాాాాాా

అల్లదె చూడుమాభరణి! యాయతరీతిని జంద్రయానమే
నల్లనియుత్పలమ్ము,గగనమ్మునదోచె శశాంకబింబమై
తెల్లటిమబ్బులాదరిని దేరువులోపలనుండునట్లుగా
నుల్లమునుల్లసిల్లుగద యుత్పలబాంధవుజేరగల్గుతన్

నల్లనియుత్పలము

అల్లదె చూడుమ నింగిని
నల్లనియుత్పలముదోచెనభమున శశియై
మెల్గగ జంద్రుని జేరెను
దెల్లటియాచంద్రయాన తేరువు వోలెన్

వనములలో వసించినఋశుభంబు

వనములలో వసించినశుభంబు ధనంబుయశంబుదక్కురా
వినుమురబాబి!నాపలుకు వీనులవిందగునట్లుగా నికన్
వనముననేవసించితి నిబంగరుభూమగు డొంకరాయిలో
ననువగుగ్రామమద్దియ మహర్షులువాసముజేయగోరుచో

Sunday, September 8, 2019

వనవాాాాసమె సంపదనుశుభంబునొసంగున్

మనుజున కెట్లయిననునా
వనవాసమె సంపదనుశుభంబునొసంగున్
మనుగడకిచ్చును శాతిని
ననవరతముహాయినిచ్చి యాయువుపెంచున్

తల్లికి బ్రీతి సూత్రమును

అల్లదె యాదిశంకరులు హర్షముగల్గను,నొప్పుకోలుకున్
దల్లికిబ్రీతి సూత్రమునుధారణజేసెనుబుత్రుడంతటన్
దల్లియుసంతసంబునను దానొడబాటునుజెప్పనాతడున్
వెల్లువగాగ మానసమువెళ్ళెబ్రచారముజేయుగోరికన్

Saturday, September 7, 2019

తల్లికికొమరుండు సూత్రధాాాాాారణ జేసెన్

కల్లలు సెప్పుట నేరము
తల్లికికొమరుండు,సూత్రధారణ జేసె
న్నుల్లమునలరగ రాముడు
నల్లదెసీతమ్మమెడకు నందరు మెచ్చన్

Friday, September 6, 2019

రేడియో

పడమటిదేశమేగినప్రభాకరశాస్త్రులుభార్యతోననెన్ 
బడమటిదిక్కులోపొడిచెభానుడు గ్రుంగెనుదూర్పుదిక్కులో
పడమరతూర్పుదూర్పునగుబశ్చిమదిక్కుగమారునచ్చటన్ 
గడిబిడయైతివేలలన,గాలముమార్పులు సాజమేగదా
-

అఙ్ఞాాాానము

అఙ్ఞానాంబుధిలోనమున్గిననరుండాలాపమట్లుండెబో
యఙ్ఞానంబువికాసదాయకమ,హోహ్లాదంబుపండించెడిన్
సుఙ్ఞానుల్దమపాండితీగరిమచేసౌగంధిపుష్పంబులే
ప్రఙ్ఞాపాటవమొప్పుసజ్జనుడుదాభాసిల్లునెచ్చోటనన్యయి

అఙ్ఞాాాాాానము

విఙ్ఞులపలుకులుగావివి
యఙ్ఞానమువికసమునుహ్లాదమొసంగున్
నఙ్ఞానమొసగుజీకటి
సుఙ్ఞానమ యిచ్చుమనకుశోభనుహృదికిన్

కాాాాాాారముజూచి

దారినిబోవుచున్ సరళదైవమువోలెనునుండునట్టియా
కారముజూచిదేవుడనిగట్టిన నమ్మెనుచిత్రమెట్టులౌ
యేరకమైన భావనలునీశుని గల్గునోదగన్
నారకమైన బోలికలెయచ్చువడంగనుగానిపించుగా

Thursday, September 5, 2019

కాాారముగనిదేవుడనుచు గట్టిగనమ్మెన్

ఆరాయుడుదా నొకపరి
యారామము జూడగోరి యాత్రుతతోడన్
దారినిబోవుచు వలయా
కారముగని దేవుడనుచు గట్టిగనమ్మెన్ 

Wednesday, September 4, 2019

బడికేగనీపంతులె

బడిచదువులు లేవిప్పుడు
కడుశ్రద్ధను నెట్టుజూసి గానగజగమున్
బడిపంతులు నెట్టేయయి
బడికేగనిపంతులె కడుప్రాభవమొందున్ 

బడికిజనంగలేననెడిపంతులె

బడికిజనంగ లేననెడిపంతులెప్రాభవమొందు మెండుగన్
బడికినిబ్రాభవంబునకుబద్ధతలేదుగదా మహాశయా
బడులకునేగుటయ్యదిలప్రాభవమొందగ కాక విద్యనున్
బుడతకునేర్పగాదలచిపోడిమితోడుతనుండునెప్పుడున్

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు
-----
గురునిపూజజేయగుణవంతుజేయును
రుజయుతొలగుగురునిరూపుజూడ
దేశికుండునగుచుదేశాలుదిరిగెడు
వరలుమేటిగురువ!వందనములు

Tuesday, September 3, 2019

దత్తపది

కురువర!వికలముగ జేయకు మనమిపుడు
శాంతినెరపయిట కుజేరిచర్చజేసి
చీరవలయును దుష్టులక్రూరములను
గాచుకొనగనిక బదిలం గాహృ దినిట

Monday, September 2, 2019

మకరము

మకరము బారినంబడిన మత్తగజేంద్రుని రక్షజేసెగా
మకరినిజంపి సత్కృపను మాపతి, గాచెగరీంద్రుప్రాణమున్
వికలమునైన గాయమును,వేదనతోడనువిశ్వనాయకున్
మకరము బారినంబడిన మత్తగజేంద్రునివేడుకోలుచే

కరుణతోనుగాాాాాాాచెనుమాాాాాపతి


భక్తులెల్లర గాచును బరమశివుడు
కరుణతోను,మాపతిగాచెగరివరేణ్యు
మకరి నోటికీ చిక్కుచుమరణ మునకు
సిద్ధమగుదరి వేడగ శీఘ్రమేగి

Sunday, September 1, 2019

వినుముర

వినుమురదేవా!యీయవి
ఘనమగు మావినతులివియగజకరివదనా!
వినతులువినియిక మాభయ
మునుమఱిబోగొట్టుమయ్య పుత్రిక కొడుకా!

Saturday, August 31, 2019

గాాాాాడిద


గాడిదకర్ణపేయముగ గానముసేయగమెచ్చిరెల్లరున్
బాడియె యట్లనంగను రమ!పండితులెవ్వరునొప్పుకోరుగా
గాడిదపాటపాడగనుగాయనివోలెనునింపుగుండెనో
గాడిదపాటపాడుటయుకర్ణములింపుగ నుంటయాభళా

కర్ణపేయంబుగాాా


పాడుతా తీయగానందు భానుమతియె
కర్ణపేయమ్ముగాబాడె,గార్దభమ్ము
మోయునెంతటి బరువైన మూపుమీద
వేయ,శ్రమకునమ్మినబంటు పృధివియందు

రేడియో

అఙ్ఞానాంబుధిలోనమున్గిననరుండాలాపమట్లుండెబో
యఙ్ఞానంబువికాసదాయకమ,హోహ్లాదంబుపండించెడిన్
సుఙ్ఞానుల్దమపాండితీగరిమచేసౌగంధిపుష్పంబులే
ప్రఙ్ఞాపాటవమొప్పుసజ్జనుడుదాభాసిల్లునెచ్చోటనన్
----

Friday, August 30, 2019

నరులకొప్పును ప్రకృతివినాాాశనంబు


చీకుచింతలు లేకయే చెలిమినుంట
నరులకొప్పును,ప్రకృతివినాశనంబు
ముప్పుదెచ్చును నరులకుమొదటి కెసుమి
కాన రక్షించ బ్రకృతిని గద్దుమనకు

Thursday, August 29, 2019

ఏనుగుచంపజాాాాాాాలదుగదే


ఏనుగుచంపజాలదుగదే యెలుకన్ గడు విక్రమించినన్
గాననమందునన్మసలు గంజరమెక్కడ కన్నమందునన్
బూనికతోవసించునల మూషికమెక్కడ చింతజేయగన్
గానగరాదుగాబుడమిగాయలుగాచువీధంబుగాగనన్

ఏన్గు చంపనోపదెలుకనైన


దేహబలము గంటెదీటైన బలమును
గాన రామనుచును గర్వపడకు
బుద్ధి బలము ముందు భుజబల మేపాటి
యేన్గు చంపనోప దెలుకనైన

Wednesday, August 28, 2019

కోరికలన్ని


కోరికలన్నిటిన్దునిమి కోవెలయందున భక్తకోటికి
న్బారునగూరుచున్న,వరభక్తుడుగా గణియింత్రుసజ్జనుల్
పారమునందగోరునెడ బావనమైనమనంబు తోడుతన్
జేరువనుండగావలెను శీతనగేంద్రుని సూతుభర్తకున్

కోరికలు వెల్లువిరిసిన


కోరికలు వెల్లువిరిసిన
మీరక తనహద్దునెపుడు మెదలకగుడిలో
దీరుగనట యాభక్తుల
బారునగూర్చున్నవాడె భక్తవరుడగున్

Tuesday, August 27, 2019

నడకువ

నడకువమంచియుండిననున్యాయముబొందగవంగియుండుటన్
విడుచుటె యెగ్గుసిగ్గులను,విఙ్ఞులకున్హితమిచ్చు నిచ్చలు
న్నడకువతోడ బీదలకు నార్ధికసాయము జేయగోరుచో
బడుగులపాలిటయ్యది యపారపుగారవమౌనునేసుమా

ఎగ్గుసిగ్గుల విడుచుటెహితమొసంగు

చీదరించిన గొలదిని సిగ్గుబడక
తనయు నికినిదా మఱచియుతగ్గియుంట
యెగ్గుసిగ్గులువిడుచుటె,హితమొసంగు
నవిరళంబగు దానమ్ము లర్హులకిల

Monday, August 26, 2019

ఎక్కడిమేధపొత్తముల

ఎక్కడిమేధ పొత్తములనెన్నడు జూడనివానికివ్విధిన్
నక్కజమాయెనేనదియ?యాపరమేశ్వరు సేవజేయుచో
జక్కటిమేధగల్గునిల,శాస్త్రములేవియుజూడకుండనే
నిక్కముబల్కుచుంటిమరి నేర్పునమీరలుపూజజేయుడీ

ఎక్కడదీమేథ సుంతయెరుగడు


అక్కట!యేమీ ప్రవచన
మెక్కడదీమేధ? సుంతయెఱుగడు శాస్త్రాల్
నిక్కముగదైవకృపయే
తక్కువగా జూడరాదు తత్త్వంఙ్ఞుండే

Sunday, August 25, 2019

దుర్వినయమ్ముతో


దుర్వినయమ్ముతో మనసుదోచెడువారుహితైషులేకదా
దుర్వినయమ్ముతోనయిన దోచుటయౌటను గారణంబుగా
సర్వుల గౌరవించగను జక్కగనొప్పు హితైషులేయనన్
గర్వవిహీనులై భువినిగాచుచునుందురుమంచివారలే

దుర్వినయమ్ముననుమనసుదోచెదరుహితుల్

సర్వముగోల్పోవుదురుగ
దుర్వినయమ్మునను,మనసుదోచెదరుహితుల్
సర్వఙ్ఞుడవీవనుచును
నుర్వినిదాబొగడుచుండియుత్సుకతలతోన్

Saturday, August 24, 2019

దీపములాాార్పుచో

దీపములార్పుచో గనలిదేవళమందున గల్గునెప్పుడున్
బాపమె,దక్కునెల్లెడలశివస్తుతిజేసిన భక్తకోటికిన్
బాపముబోయికల్గునిల బ్రాపును,పుణ్యము దప్పకుండగన్
నాపరమేశుడేజగతి కంతటికీశుడు చింతజేయగన్

పాపము దక్కుజనులకుశివస్తుతిజేయన్


దీపములార్పుటగుడిలో
పాపము,దక్కుజనులకుశివస్తుతిజేయన్
బాపములుబోయి పుణ్యము
లేపారగవచ్చియార్య!యీశునిగరుణన్

Friday, August 23, 2019

ప్రకృతివినాశనంబె


వికృతపుచేష్టలన్జనినవేయివిధంబులుగానగున్సుమా
ప్రకృతివినాశనంబె,కడుపావనకార్యము మానవాళికిన్
సుకృతంబులేగడుంగడుగసొంపుగజేయుటనెల్లవారికిన్
బ్రకృతియనంగనేర్వుమికపార్వతిదేవిగభూతలంబునన్

వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే

పారముబొందుకోరికనుభవ్యునిగూరిచి దండకంబునున్
వారము వారమున్జదివి వారిజపత్రముతోడశంభుపై
నీరముజల్లగానపుడు నెమ్మదిసంతసమొందనత్తఱిన్
వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే

వారిజపత్రమ్ముసోకి వజ్రముచీలెన్


మారుడు శరములు వేయగ
మారణహోమంబుజేయ మాహేశ్వరుడున్
మారుని జూడగ నత్తఱి
వారిజపత్రమ్ముసోకి వజ్రముచీలెన్

Thursday, August 22, 2019

అభయమునిచ్చిబ్రోచెడి



ఉభయులురామలక్ష్శణులుపోరునభీతిని గొల్పువారయున్
నభయమునిచ్చిబ్రోచెడిమహాత్ములు,రావణకుంభకర్ణులే
యిభమునుబోలిగర్వముననీశుడురాముని ధిక్కరించగా
నభయమునిచ్చురాముడనినంతముజేసెనునొక్కవేటునన్





















అభయమొసగిబ్రోచును రాాాాావణాాాాాసురుండు


కష్టమందున వేడగ కాలుడార్య!
యభయ మొసగిబ్రోచును,రావణాసురుండు
నసురుడైనను,శైవుడునమితభక్తి
నిగొలుచుదినముదినమునునియమముగను

Wednesday, August 21, 2019

కాాాలము


ఫాలపునేత్రునిన్గొలిచి పాయసమాదిగ బిండివంటల
న్జాలముజేయకన్నిడగ భాలశశాంకుడుమోదమందిదా
కాలముదాటిపోయినను గాంచనమాదిగ సంపదల్వెస
న్గాలము మించిపోయిననుగాంచునుమందుడుసత్ఫలమ్ములన్

ఆలయములు

ఆలయములు మూయుదురయ
కాలాతీతమున,గలుగుగదసత్ఫలముల్
ఫాలునిదలచుచు భక్తిని
బాలన్నైవేద్యమిడగబ్రాతఃసంధ్యల్

Tuesday, August 20, 2019

సకలకళలకు


సకలకళలకు నిరవుగా ఛాత్రులకది
వెలుగుచుండగ దెలిసియుదెలియ కిటుల
మిత్తికిన్ముఖద్వారమమీరుపేట
యనుట పాడియే గురువర!మననజేయ

అంఘ్రిద్వంద్వము

అంఘ్రి ద్వంద్వములేకయుండిన సహాయంబౌట దివ్యాాంఘ్రమే
యంఘ్రిద్వంద్వములేని భామ వెసనాట్యంబాడెజిత్రమ్ముగన్
నంఘ్రిన్బుట్టిన గంగకూడను మహాహర్షంపు వేగంబుతో
నంఘ్రుల్దాటుచు బర్వులెత్తును గదాయాాాాాానందముప్పొంగగన్

Monday, August 19, 2019

అంఘ్రిద్వంద్వంబు


అంఘ్రిద్వంద్వము లేకను
నంఘ్రిద్వంద్వంబునునుచ,నసలుకుసరిది
వ్యాంఘ్రముదాగలుగుకతన
నంఘ్రిద్వంద్వంబులేని యాడదియాడెన్

Sunday, August 18, 2019

దండిగ

పండితు లందఱున్గలిసి భవ్యునిగూరిచిబూజజేయగా
దండిగవానలేగురిసె,దప్పికదీరదిదేమిచిత్రమో
కొండలనుండిదామిగులగ్రౌర్యపురావముగల్గుచున్వెసన్
దండిగ వర్షమున్బడగధారుణియంతయుమున్గిపోయినన్

దప్పిదీరును


వానదేవుని గరుణన వసుధయందు
వానలెన్నియోకురిసె,పిపాసపోదు
త్రాగనుప్పునీటినిసరిత!తెలియుమిది
దప్పిదీరును మజ్జీగ ద్రాగునెడల

రేడియో


పారముబొందుకోరికనుభవ్యునిగూరిచి దండకంబునున్
వారము వారమున్జదివి వారిజపత్రముతోడశంభుపై
నీరముజల్లగానపుడు నెమ్మదిసంతసమొందనత్తఱిన్
వారిజపత్రమేతగిలివజ్రమురెండుగజీలెజిత్రమే
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

Saturday, August 17, 2019

భద్రగిరీశుని


భద్రగిరీశునిన్గొలుచు భక్తులకున్చెఱసాలదక్కురా
నిద్రనుమున్గుచున్నిటుల నేరముగోచరమౌవిధంబుగా
క్షుద్రపుమాటలన్బలుక చోద్యముగాదెదలంచగానిటన్
భద్రమెయౌను రామునిల భక్తినిగొల్వగ నెల్లవారికిన్

భద్రగిరీశుడు

భద్రాచల రామునినిటు
భద్రగిరీశుండొసగునుభక్తులకు చెరన్
చిద్రూపుని భగవంతుని
క్షుద్రముగా బలుకనిటుల చోద్యముగాదే?

Thursday, August 15, 2019

గాాాధీసూ






















మేలుగ గాధిసూనునకు మేనకతల్లియగున్నిజంబుగన్
చాలును సామి!మీపలుకుసైయననొప్పదుగాధీసూనుకున్
మేలుగదల్లియౌననుట ,మేదినిప్రేయసియౌనుగానికన్
భాలపు నేత్రునత్తయగుభామయెమేనకనామధేయుగాన్

గాాాాాాాధిసూనునకు


ప్రేయసిగనాయె బుడమిని బ్రేమజూపి
గాధిసూనునకుమేనక,కన్నతల్లి
మిన్నదైవముగంటెను నెన్నగాను
దల్లిదండ్రుల సేవించనుల్లమలరు

Wednesday, August 14, 2019

స్వాాాాతంత్ర్యదినోత్సవము

భరత మాతకు బంధముల్దొరగుకతన
మూడురంగుల జెండాలు ముచ్చటగను
నెగురు చుండును నీరోజు నెల్లదిశల
దనివి దీరగ జేతుబ తాకములకు
వందనమ్ములు భక్తిని వందలాది

Tuesday, August 13, 2019

అల్లదె


అల్లదె చక్కగానమరె నల్లికపూవులుగుంఫనంబుగా
మల్లెలలోన,రేగినవిమంటలుబొబ్బలుపుట్టెనయ్యయో
కల్లుదుకాణపుందరినికాసులమంజులయింటిదూలము
న్గాలగనంతముట్టుకొనగందుచునెర్రగ నుండెనక్కటా

దివ్వెలపండుగ


దివ్వెలపండుగ రోజున
జువ్వలుగాల్చంగనవియ చురచురయెగరన్
రవ్వలుగలిగిన కాకర
పువ్వులలోజ్వాలలెగసిబొబ్బలుపుట్టెన్

మాాాాాాామకె


భామిని పార్వతీసతికిభర్తగు ధూర్జటిమామకున్దగన్
మామగుమేరుపర్వతుడు మాన్యుడునౌటనునెల్లవేళలన్
వేమరుసారులున్మదినివీడక నెప్పుడుసాదరంబుగా
మామకెమామగానిలిచిమాన్యతగన్నఘనున్ స్తుతించెదన్

మాాాామకు


భామిని గిరిజను గైకొన
మామగ దాబేరునొందె మాహేశునకున్
మామకుమామగుమేరుని
మామకెమామగనునిల్చుమాన్యునిగొలుతున్

Friday, August 9, 2019

కలిమిదొలగినపుడెకలుగుసుఖము


కాంక్షలెక్కువగునుగనకము మీదన
కలిమిదొలగినపుడె,కలుగుసుఖము
దైవచింతవలనదేదీప్యముగనిల
వాంఛలేకయుంట వరముమనకు

ఆకాశవాణి

పాపకర్మలుసేయకపరమపదము
జేరుకొఱకునైనిత్యము శివునిగురిచి
పూజజేయగ శ్రద్ధను బొసగుముక్తి
కాంతనువలచియోగిగాగణనకెక్కె
--

స్త్రీలెవ్వారలు

స్త్రీలెవ్వారలు భక్తితోడవరలక్ష్శిన్ గోల్వరాదెన్నడున్
షీలా!యేమిదివైపరీత్యమయొకో శ్రేయంబయౌనేనికన్
స్త్రీలేపూజకునర్హులౌటనుభువిన్ శ్రీకారమున్జుట్టుమా
మేలంబాడుటనీకుధర్మమె?యయో!!మేధావియౌనీకిటన్

Thursday, August 8, 2019

లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్


కలతల నిద్రను నిట్లనె
లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్
మెలకువరాబలికెనిటుల
లలనలుసేయంగవలయు లక్ష్శీ పూజన్

Wednesday, August 7, 2019

మాతనుభర్తగాగొని

మాతనివారణన్మదిని మాన్యతజేయక దీక్షతోడనన్
భూతలనాధునిన్గురిచిపోడిమితోడన జేసిసంయతిన్
బూతమనస్కుడున్నగపుభూపతి,హైమవతేశుమామజా
మాతనుభర్తగాగొనియుమాసతిగాంచెనుకార్తికేయునిన్
కల్లోలమ్మునిరంతరాయమగుతన్గాశ్మీరదేశమ్మున
న్బల్లాలమ్మనుగోరుకొందునిపుడేభారమ్మునీదేసుమా
కల్లోలమ్ములులేకనుండగమమున్ఖండాంతరాళంబున
న్నెల్లన్నుండెడువారలందఱినిసూయీసారిగాపాడుమా

మాాాాతనుతనపతిగగొనియుమాాాాాాాసతిమురిసెన్


చేతనరూపుడు సదయుడు
భూతములకుబతియునైన బూతచరిత్రున్
శీతల నాగపుప్రభు,జా
మాతనుతనపతిగగొనియుమాసతి మురిసెన్

Tuesday, August 6, 2019

మూడేడుల్ గలపిల్లగర్భవతియైబుత్రున్ గనెన్ బ్రీతిమై


మూడేడుల్గుణియించగానగుగదామోదంబుగానిర్వయొ
క్కండున్లెక్కనగానసంభవమగున్గాంతాలలామిట్లవన్
మూడేడుల్గలపిల్లగర్భవతియైబుత్రున్గనెన్బ్రీతిమై
చూడన్న్యాయమెయౌనుగానదిరమా!సోత్కర్షమొప్పారగన్

మూడేడులపిల్లకొక్కపుత్రుడుగలిగెన్


మూడేడులు గుణియించగ
వాడుకలోనగునదియిరు వదియొక టిగదా
వేడుకను బెండ్లిజేయగ
మూడేడుల పిల్లకొక్కపుత్రుడుగలిగెన్

కల్లోలమ్మునిరంతరాయమగుతన్ గాశ్మీరదేశమ్మునన్

కల్లోలమ్మునిరంతరాయమగుతన్గాశ్మీరదేశమ్మున
న్బల్లాలమ్మనుగోరుకొందునిపుడేభారమ్మునీదేసుమా
కల్లోలమ్ములులేకనుండగమమున్ఖండాంతరాళంబున
న్నెల్లన్నుండెడువారలందఱినిసూయీసారిగాపాడుమా

Monday, August 5, 2019

కల్లోలముసాాాాాగుటొప్పుకాాాాాాశ్మీరమునన్


కల్లగ నెంతును దీనిని
కల్లోలము సాగుటొప్పుకాశ్మీరమునన్
మల్లియతీగను వోలెను
నల్లుకొ నుచునొక రికొకరుహాయి మనవలెన్

కష్టము లెల్లదీరెనని

సుష్టుగ వర్షముల్ గురువ సౌరభమొప్పగ జేలుపండగన్
గష్టములెల్లదీరెనని గార్చిరిగంటనునీరుబ్రీతితోన్
బుష్టియెతిండిగింజలకు,భుక్తికిలోటదిగల్గరాదనే
స్పష్టత వారిలో గలిగి సౌఖ్యపుజీవనమిచ్చగించిరే

కష్టములదీరగన్నీరుగార్చిరడలి

కఱవురాక్షసి జగమంత కదలియాడ
ప్రభుత గమనించి ధనమీయ వలసినంత
కష్టములదీర గన్నీరు గార్చిరడలి
పుడమి జనులార్య!సంతసపుబొంగుతోడ

Saturday, August 3, 2019

కలము


కలముద్యజించి మేటికవిగా యశమందెనొకండుధాత్రిపై
యలరుచు నాశువున్ భువినినందముగల్గుసుపద్యమాలలన్
బలువిధపోకడల్ సదువ పాఠకలోకముసంతసిల్లగా
బలిబలియంచునచ్చటిసుపండితులందఱుమెచ్చిరేసుమా

కలమువిడిచిమేటికవిగవెలిగె


గరిక పాటి వారిగళము నుండిసుధలు
జాలువాఱుచుండి జనముమెచ్చ
కలమువిడిచి మేటికవిగ వెలిగెనార్య!
గరికపాటివంశ కవితిలకుడు

ఆకాశవాణి

కలిములుదండిగుండిననకారణవైరముపొర్గువారితో
గలుగుచుమానసంబునుజికాకుమయంబుగజేయుచుండుచున్
దలపగనీదుదైవమును,ధార్మికదృష్టినిడొల్లజేయుటన్
గలిమిదొలంగినప్పుడెసుఖంబులభించును మానవాళికిన్
-----

Friday, August 2, 2019

కవినాశముగోరివ్రాయుగావ్యములెలమిన్

కవియన ఋషిసంభూతుడు
కవిరచనలుశుభములీయ ఖగవతిప్రజకున్
గవినిన్ న్యాయమె యిటులన
కవినాశము గోరివ్రాయు గావ్యములెలమిన్

Thursday, August 1, 2019

ఔనా గల్లలె జెప్పునందురుగదా యాకాశవాణిన్ జనుల్

ఙ్ఞానంబిచ్చును వార్తదెల్పునునికన్ గైతల్ సరాగంబుతో
నానందంబును బొందునట్లుగ దగన్నాలాపముంజేయగా
నౌనా గల్లలెచెప్పునందురుగదాయాకాశవాణిన్జనుల్
వీనుల్సోకగరానిమాటలుసుమావిన్పించెగానిత్తఱిన్

కల్లలేచెప్పుచుండునాకాశవాణి

కల్ల లేచెప్పు చుండునా కాశవాణి
యనెడుపలుకులు నిజములే యక్షరాల
వచ్చుననుజెప్పు వర్షమ్ముపడదు మనకు
రాదనినుడువు తోడన రాళ్ళుపడును
(రాళ్ళవర్షము)

Wednesday, July 31, 2019

తొందరపడి కైతపిట్ట తుర్రున నేగెన్

అందరి కంటెను మొదటగ
నందంబుగ బద్యరచన నాహ్లాదముగన్
విందునుజేయుచునుండక
తొందరపడి కైతపిట్ట తుర్రున నేగెన్

Tuesday, July 30, 2019

పడమట నుద్భవించిరవిప్రాగ్దిశజేరగ సాగెముందుకున్

పడమరదేశమందుననుభానుసమానుడు రామకృష్ణుడున్
బుడమిని జన్మనొందిదగుబోడిమితోడను హైందవాళికిన్
దడబడకుండబోధనలుదానుగజేయునిమిత్తమైదగన్
బడమట నుద్భవించిరవిప్రాగ్దిశజేరగసాగెముందుకున్

పడమట నుదయించితరణి ప్రాగ్దిశకేగెన్

పడమట రవియుదయించడు
కుడియెడమగనిడితిరిచట కుశలత లేమిన్
గడబిడ జేసెనునీయది
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశకేగెన్

శవమాాాా!సంతస


అవనిన్ లేదుగనీకుమించినది యీయాంధ్రంబునందున్సు శై
శవమా! సంతసమొప్ప రమ్మువడిగన్ శశ్వద్యశశ్శాలివై
భువనంబంతకుమేలుసేయగను సంపూర్ణంబ నీయున్కియే
శవమేయీశ్వరరూపమౌననుచునాశాజీవులెంచన్ శుభమ్

Monday, July 29, 2019

శవమలేచిరమ్ముసంతసమున

బాల్య దశను నుండిబంధువర్గమునకు
సేవజేయుకతన శీఘ్రముగను
బడుగు బ్రజల సేమ మడుగవ లయునుశై
శవమ! లేచిరమ్ముసంతసమున

దివ్వెవెలుంగుచున్నను

దివ్వెనుజూడగానసలుదీప్తులుగాననిగారణంబుగా
దివ్వెవెలుంగుచున్ననుగదిన్ నలువంకలగ్రమ్మెజీకటుల్
దివ్వెలకాంతులెక్కువగుతేజముతోడనువెల్గుచుండుచో
దవ్వులబోయిచీకటులుతళ్కులుసిమ్మునులోననంతటన్

Sunday, July 28, 2019

దివ్వెవెలుగెడి గదిలోనతిమిరముండె

దివ్వెచిన్నదిమూలాన దీప్తిలేమి
దివ్వెవెలుగెడిగదిలోన తిమిరముండె
దిమిర ముండెడిచోటనే భ్రమలుదొలగి
చిత్తమేకాగ్రమయిదైవ చింతజేయు

Saturday, July 27, 2019

కరుణాాాాత్ముండు



కరుణాత్ముండు విశాఖపట్టణములోగన్పట్టడొక్కండయో
కరుణాత్ముండనునేనటంచునటయొక్కండైన గన్పించునా?
నరయన్ వెర్రితనంబుతోదమరునూహాలోకమందుంటిరే
కరుణాత్ముండనువాడునెప్పుడునుదాగర్వంబుజూపించడే

సదయుడు గంటంబజడు విశాఖ నగరిలోన్

ఎదనిండవెదకిజూచిన
సదయుడుగంటంబడడు విశాఖనగరిలోన్
వదరుంబోతుగ నుండుచు
దిరుగుదు రుమొఱటు లటనుచు దేవకి చెప్పెన్

Friday, July 26, 2019

ఆకాశవాణి

కవినాశంబునుగోరివ్రాయునటసత్కావ్యంబుసంప్రీతుడై
కవిసేమంబునుగోరివ్రాయునిలసత్కావ్యంబులింపారగా
గవనంబన్నదిదైవరూపమయియెక్కాలంబుజీవంబుతో
నవకంబొందుచునుండగా,బలుకనన్యాయంబుగాదారమా!
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాద

తొమ్మిదిలోనొకండుడుగదొయ్యలిరోపదియౌనుసత్యమే


అమ్మరొ యెన్మిదేయగునునార్యులుజూడుడులెక్కమీరునున్
దొమ్మిదిలోనొకండుడుగ,దొయ్యలిరోపదియౌనుసత్యమే
తొమ్మిదికొక్కటిన్గలుప తోరపుసంఖ్యయెయద్దియేగదా
యిమ్ముగనేర్వగావలెనునిట్లుగలెక్కలు సర్వమున్సుమా

Thursday, July 25, 2019

తొమ్మిదిలోనొకటిదీయదొయ్యలిపదియౌ


అమ్మా!యెనిమిది యేకద
తొమ్మిదిలోనొకటిదీయ,దొయ్యలిపదియౌ
దొమ్మిదికినొకటిగలిపిన
నిమ్ముగ నికదెలిసికొందు నిట్లనెలెక్కల్

గరళమ్మింతలభించదేయకటఖడ్గంబైనజేజిక్కదే

కరమున్బాధనునొందునాయువతిదాకైదండలన్జేయుచున్
గరళమ్మింతలభించదేయకట ఖడ్గంబైనజేజిక్కదే
మరణంబొందగ వీలులేదకట హేమాతా దయంజూపవా?
దరికిన్వత్తునునేను,రాయనుమ యోతల్లీ!రమాదేవి!నన్

Wednesday, July 24, 2019

గరళము లభియించదకట కత్తియులేదే

కఱకఱలాడుచునున్నది
యిరవుగ నొకముద్దగూడ నెవ్వరునిడరే
మరణమె గతియిక యనుకొన
గరళములభియించదకట కత్తియులేదే

Tuesday, July 23, 2019

పరమత దూషణమ్ముసలుపన్ వలెనెప్పుడుసద్గుణోత్తముల్


పరమత దూషణమ్ముసలుపన్ వలెనెప్పుడుసద్గుణోత్తముల్
పరమతదూషణమ్ములెయెవారికిమంచిదికాదుభూతలి
న్నరయబ్రజాళి చక్కగనునైక్యముతోడననుండుచోదగన్
ధరణికిమేలుగల్గుటనధార్మిక లోకముమెచ్చునెప్పుడున్

పరమతమ్ముల దూషింపవలెనుసతము


పరమతమ్ములదూషింపవలెనుసతము
దప్పు దూషింపరాదార్య!యెప్పటికిని
నెఱుగు డన్నిమ తంబుల సారమొకటె
చూడ మనవిధి సమదృష్టి తోడ భువిని

అప్పులులేని


అప్పులులేని మానవునివ్యర్ధుడుగాగణియింత్రుసజ్జనుల్
నప్పులులేనివారలనువ్యర్ధులుగాగణియించభావ్యమే
యప్పులులేకయుండగనునందినసొమ్మునుమంచిజేయుచో
నప్పర మేశ్వరుండిడునునాయువుసంపద భోగభాగ్యముల్

Monday, July 22, 2019

అప్పులేనినరుడువ్యర్ధుడుగద

ఎప్పటికిని నరయ గొప్పవాడె భువిని
నప్పులేనినరుడు,వ్యర్ధుడుగద
యప్పుజేసిమిగుల పప్పుగూడుదినెడు
మనుజుడిలకుమఱియు మరణ సముడు

మీసంబుల్


కాసింబెట్టక నాదుమాటవినుమాకాత్యాయనీమాతభో
మీసంబుల్గడుదెల్లనయ్యెనుగదామీనాక్షికిన్వింతగన్
వాసూ!నేకలగంటినిట్లుగసుమాప్రారబ్ధమున్వెంటరా
మీసాలుండెడుభామలుండుటకటామేమెచ్చటన్ జూడలే

మీసంబులుదెల్లనయ్యెమీనాాాాాాక్షికహో


bbaraoజులై 22, 2019 2:33 PM

వాసునకప్పుడెచూడుడు
మీసంబులుదెల్లనయ్యె,మీనాక్షికహో
రోసముమిక్కీలి యయ్యెను
బాసలనెటుదీర్చునేమొ.భవ్యునికెఱుకే?

Sunday, July 21, 2019

తప్పులుజూపనాకెపుదుదక్కుచునుండునుసంతసంబిటన్

తప్పులు జేయగా సదరుతప్పులు వారలుదిద్దుకున్నచో
తప్పులుజూపనాకెపుడుదక్కుచునుండును సంతసంబిటన్
దప్పులు జేసియుంజనులు దప్పనిజెప్పిన గ్రోధయుక్తులై
యుప్పెనవోలె మింటికినినొయ్యనలేతురుగొందరిద్ధరన్

తప్పులు జూపంగ ముదము దక్కును నాాాాకున్


తప్పులుజేయనివారలె
యిప్పుడమిని గలరె?యెంచనెక్కడనైనన్
దప్పులుదిద్దుకొ నినదఱి
తప్పులుజూపంగముదమెదక్కును నాకున్

దత్తపది


స్వచ్ఛ భారత మునకునై సాదరముగ
తట్ట జేబూని గుట్టలుపుట్ట గమిని
చట్ట పరముగ జేసిరి చదునుగాను
భక్తి శ్రద్ధలుగలుగుమా బడిపిడుగులు
దేశ సంపద నభి వృద్ధి దెచ్చుకొఱకు
-----

Thursday, July 18, 2019

చెలివొ

ఒక్క సారిగ దివినుండి యొక్కుదుటన
నూడిపడినట్లు గలగంటి నోకుమారి!
చెలివొ తల్లివొ వదినవో జేజెమ్మవొకొ
చెప్పుమమ్మరొ లేకున్న నొప్పుకోను

చెలివో చెల్లివో


కలలోజూచితి నిన్నునే నకట మాకాలమ్ముబాగుండెగా
జెలివోచెల్లివొ తల్లివోవదినెవో జేజెమ్మవో యత్తవో
వొలకంబోయక సిగ్గునెచ్చటనునీయొయ్యారపుంజేష్టతో
నకలంకంబుగ నీదుసంగతినినాహారీతివాక్రువ్వుమా

ఇల్లరికంపు టల్లుడుగ నేగుటయెట్లగుదోషమిధ్ధరన్

పిల్లడు లేనివారలిక పిల్లకు బెండ్లినిజేయనాతడే
యిల్లరికంపు టల్లుడుగనేగుట యెట్లగుదోషమిధ్ధరన్
నల్లదెవ్యర్ధపుంబలుకులల్లుచునందరి మానసంబులన్
డొల్లగజేయగాసబబె?డోకపుబల్కులుబల్కన్యాయమే!

Wednesday, July 17, 2019

ఇల్లరికమ్మేగ దోషమెట్లగు జగతిన్


అల్లుని గొడుకుగజూచెడు
నిల్లాలునుదన మనమున నిట్లుగ దలచెన్
బిల్లను నిచ్చిన నింటికి
యిల్లరికమ్మేగదోష మెట్లగు జగతిన్

Tuesday, July 16, 2019

పొరిపొరియేడ్చిరెల్లరునుబుట్టినప్రొద్దనిలోకులయ్యయో


వరమగుగార్తికంబుననవచ్చెడుశుధ్ధమినాడుపుట్టగన్
బొరిపొరియేడ్చిరెల్లరునుబుట్టినప్రొద్దనిలోకులయ్యయో
కరివరదుండుజల్లగనుగానగభీతినీనొందయేలకో
సరకునుజేయరాదొకొబ్రజాళినినెన్నటికెట్టివారలున్

పుట్టిన దినమంచునుబొరిపొరిరేడ్చిరయో


కిట్టని మనుజులు మఱినా
పుట్టిన దినమం చునుబొరి పొరియే డ్చిరయో
కిట్టని వారల యేడ్పులు
పట్టులె నాకగునునవియ పండుగవోలెన్

Monday, July 15, 2019

మేఘములేక వర్షములమేయముగా గురిసెన్విచిత్రమే

మేఘములుండుచో గురియుమిన్నును మన్నునునేకధారగా
మేఘములేక వర్షములమేయముగా గురిసెన్విచిత్రమే
మేఘవినీలదేహునినమేయ కృపారసవీక్షణంబుచే
మేఘముదానుగాగురియమెండుగపండునుబంటలెన్నియో

మేఘమేలేక వర్షము మిగుల కురిసె


నిర్మలముతోడ గనిపించెనింగియంత
యెక్కసారిగ పుడమిని మిక్కుటముగ
మేఘమే లేకవర్షముమిగులకురిసె
నేమి చిత్రమో యూహించలేముమేము

షష్టిపూర్తి

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
------- ------ -----
శ్రీకోటేశ్వరరావుగారి షష్టిపూర్తి సందర్భముగా
శుభాశీస్సులు
------ ------- ---------
అరువది వచ్చిన నింకొక
యరువది యైదేండ్లవరకుహర్షముతోడన్
నరమరలు లేకయుండగ
నిరువురు జీవింపుడార్య!యీశునిగరుణన్

కలకాలము మీరిద్దరు
కలసిమెలసిజీవితమునుగడుపుచు పతిప
త్నులుమిత్రులుగాగష్టం
బులసుఖములదోడయిశుభములనందవలెన్

బ్రదుకునన్నాళ్ళుమఱువక భవుని స్మరణ
చేయుచుండుమ,కోటేశ! చివరికదియ
ముక్తినిచ్చును దప్పక రక్తితోడ
గల్లగాదిది నిజమునే బల్కుచుంటి

బంధు ప్రీతిని గలిగిన భవ్యచరిత!
కాయకష్టము దెలిసిన కార్మికుండ!
దానధర్మముల్ సేయగ తపన గలుగు
నీకు జోహార్లు సోదర! స్వికరించు

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయురారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని ఱెప్ప యట్లయి కాచుగాత!
యెల్లవేళల మిమ్ముల చల్లగాను
-------
రచన=పోచిరాజు సుబ్బారావు

Sunday, July 14, 2019

మారణహోమంబుశాంతిమంత్రంబయ్యెన్


శ్రీరామునిబాణమునకు
నారాక్షసుడసురప్రభువుహాహాయనుచున్
బోరానిచెంతకేగగ
మారణహోమంబుశాంతిమంత్రంబయ్యెన్

Saturday, July 13, 2019

హంపీక్షేత్రమువీడిపాాాాారెనువిరూపాాాక్షుండుభీతాాాాాాత్ముడై


హంపీనామకపుణ్యధామమువిరూపాక్షుండుక్షేత్రంబుగా
సొంపున్జెందుచుజూచువారలకుసూసౌందర్యమింపారగా
గంపంబొందుచుశత్రుసైన్యమువడిన్ ఖండించరాగాదమిన్
హంపీక్షేత్రమువీడిపారెనువిరూపాక్షుండుభీతాత్ముడై

హంపివిడిచిపారెనువిరూపాక్షుడడలి

కందిశంకరురాకనుగనులగాంచి
హంపివిడిచిపాఱెనువిరూపాక్షుడడలి
తనదుశతకమ్ముదనకంకి తమిడునేమొ
యనుచు,గలనుగంటినినేనునర్ధరాత్రి

కవియొక్కడుకానరాడువెదుకంగర్ణాటదేశమ్మునన్

కవిగాశంకరుబెంగుళూరునకునొక్కండేప్రయాణించగా
భవుడెవ్వాడునురాకపోతిరిగనీభవ్యాత్ముగొంపోవగన్
గవియొక్కండునుగానరాడువెదుకంగర్ణాటదేశమ్మునన్
నవనిన్జీకటిముంచుకారణమెయట్లైయుండునాపట్టునన్

Friday, July 12, 2019

కందిగురువులశతకము

కందిగురువులశతకముగవులుమెచ్చ
విడుదలగుచుండుసమయాననెడదయందు
వేడుకొందునుభవ్యునిబ్రీతితోడ
పూర్ణమాయువునిమ్మనినార్యులకని

కవియొక్కడు

కవులసభజరుగుచుండగ
గవియొకడునుగానరాడుకర్ణాటమునన్
గవికులతిలకులెయిటులన
నవసరమా చెప్పుడార్య,యౌచిత్యంబే?

ఆకాాశవాాాణి


నిరతము బుణ్యముగలుగును
పరమాత్మునిసేవజేయ,పాపమెగలుగున్
బరమాత్ముని దూషించిన
భరణినిగలమనుజులెల్లపరమాత్ములులే

కలువలుపూసె


కలికి సరంబులోగనగగాంతులనొప్పుచుచంద్రురాకతో
కలుiవలుపూసెనల్లనివి,కాకరతీగలకున్భళీభళీ
చెలువదనంబుతోదనరిచిందులువేయువిధంబుగాదగన్
దలపులలోనగల్గెనికదామమువోలెనునుండెబాగుగా

Thursday, July 11, 2019

కాకరతీగలకు,నల్లకలువలుపూసెన్


కాకరకాయలుకాసెను కాకరతీగలకు,నల్లకలువలుపూసెన్ మాకనపాలెపుచెఱువున నాకలువలుజూడనాకుహర్షముగలిగెన్

మాఘముసంక్రమించినదిమార్గశిరంబునగార్తికంబనన్

మాఘముసంక్రమించినదిమార్గశిరంబునగార్తికంబనన్
మాఘముసంక్రమించునిలమాసముపుష్యముపూర్తియైనచో
మేఘములెన్నియోదిరిగిమిన్నునకార్తికమాసమందునన్
దాఘముదీర్చుగాబ్రజకుతద్దయువర్షమునిచ్చుచున్భువిన్

Wednesday, July 10, 2019

మార్గశీర్షమందుమాఘమలరె


మార్గశీర్షమందుమాఘమలరె,కాదు
పుష్యమాసమలరుపోడిమగను
మాఘమదియవచ్చుఫాల్గుణమునకుముం
దుగనునిదియ వరుస తోయజాక్షి!

Tuesday, July 9, 2019

కవివర్యున్ బిలిపీంచియిచ్చెడిపురస్కారమ్ము వ్యర్ధంబగున్


కవివర్యున్ బిలిపీంచియిచ్చెడిపురస్కారమ్ము వ్యర్ధంబగున్
గవికిన్ వ్యర్ధము గాదుగాసకృతియెక్కాలంబునందైనసూ
కవికిన్ గౌరవమీయగా దగునుసత్కావ్యంబువ్రాయంగగా
గవియేనేర్వుముమౌనిగాధరనుదాకావ్యాభిలాషిండుచోu

కవినిబురస్కృతినిజేయగావ్యర్ధమగున్


అవమానించుచుగవులను
నవుబాలుగవ్రాయుచుండి నవ్వులబాలై
కవనము జేయగరానికు
కవినిబురస్కృతినిజేయగావ్యర్ధమగున్

Monday, July 8, 2019

మచ్చికమీఱతియ్యనగుమాటలెదంగన గాలకూటమే


అచ్చపునెయ్యమున్గలుగు నార్యులదూషణముల్బ్రియంబుగా
నెచ్చెలులందఱున్మిగుల నేరముదోపక నుందురేగదా
చెచ్చెరయొండొరుల్గసిగ ఛీయనిచిందులాడినన్
మచ్చికమీఱతియ్యనగుమాటలెదంగన గాలకూటమే

మాట తీపి కాలకూట మెడద


మాట తీపి కాలకూట మెడదకగు
మాట కలుపు భువిని మనిషిమనము
మాటకటుకు వలన మారణహోమము
జరుగు టనెడు మాట సత్యమార్య!

Sunday, July 7, 2019

వేయంచుల్ గలకైదువున్ గొనిమహావిష్ణుండురేగెన్ వడిన్


కాయంబంతయునీరసించెనిపుడున్ గావంగరారమ్ముభో
మాయానాటకసూత్రధారివిగదేమాంధాతృసంధాయకా!
నాయీప్రాణమురక్షజేయగదమిన్ నారాయణారాయనన్
వేయంచుల్ గలకైదువున్ గొనిమహావిష్ణుండురేగెన్

వేయంచులకైదువుగొనివిష్ణువవుసెలగెన్


పాయనిభక్తినియేనుగు
కాయమునికనీరసింపకరివరదునిపై
భారమువేయుచుగోరగ
వేయంచులకైదువుగొనివిష్ణువవుసెలగెన్

శ్రీరాాాాాాాామున్

పారంబిమ్మనిగోరుమార్యునిసదాభాగ్యంబుతోడన్సుమా
శ్రీరామున్ ,జనులెల్లరోసిరికదారేపల్లెలోజూడగన్
గోరల్గల్గినరాక్షసాంగనదమిన్ గ్రూరంబుగాగోరగన్
నారాముండపుడామెముక్కుచెవులన్

Saturday, July 6, 2019

శ్రీరాాాాాాముని


పారమునిమ్మనిగోరుము
శ్రీరాముని,రోసిరెల్లరేపల్లెజనుల్
కోరలుగలపూతనగని
శ్రీరామునిగోరువలనఛీఛీయనుచున్

నయదూరుండగు

దయనుంజూపకక్రౌర్యమున్గలిగియాదారిన్జరించెల్లరని
ర్దయనున్జూపుచుమాంసమున్దినుచునారాకాసురుడొయ్యనన్
నయగారంబులవిద్యలన్గఱపివిన్నాణంబుతోనుండగాన్
నయదూరుండగుపాపియొక్కరుడుసన్మానంబుబొందెన్సభన్

Friday, July 5, 2019

ఆకాశవాణి

అరయన్గామములోభమున్మదములాయాఱున్దగన్ నౌనుగా
యరిషడ్వర్గము,ముక్తిగొల్పునిలనాత్మానందమున్ గూర్చుతన్
నరిషడ్వర్గమువీడుచోమదికానాహ్లాదంబుజేకూర్చుగా
వరమౌభవ్యునినామమున్ మనన నెవ్వాడైనదాజేయగన్
---

పాపియొక్కడుసన్మానపాత్రుడయ్యె

పాపియైననువాల్మీకివాణిదయను
కవివరేణ్యుడైయెన్నియోకావ్యములను
వ్రాయుకతనానగవులలోప్రముఖుడగుట
పాపియొక్కడుసన్మానపాత్రుడయ్యె

Thursday, July 4, 2019

పూరణజేయగా

పూరణజేయగానగునుపూర్ణమనస్కులునైనవారికిన్
వారలుజాగరూకతనభావనజేసియువ్రాయుచోదగన్
నేరికినైనసాధ్యమదియీపుడమిన్ మఱియీవిధంబుగా
బూరణజేయగాబలుకుబోడికిబ్రహ్మకునైనసాధ్యమే

పూరణ

పూరణయనునదియొకకళ
పూరణదాజేయువారుబుధవరులగుచున్
మీరకఛందమునెపుడును
బూరణజేయంగబలుకుబోడికితరమే.

శంకరయ్యగాాాాారిశతకము


ఒక్కరోజునశతకముజక్కగాను
వ్రాయుమీచతురతకునావందనములు
శతసహస్రములనిడుదుశంకరార్య!
యందుకొనుమయ్యదయతోడహర్షమొదవ
ప్రత్యుత్తరంతొలగించు

పుస్తకము



కోరికపెంపుమీరగనుగూరిమితోడనుగ్రంధముల్సదా
పేరిమి గల్గగాజదువవిస్తరమౌనుగదెల్వితేటలు
న్గూరిమిగల్గునొండొరులకూర్పునునేకముజేయునెప్పుడు
న్వేరుగనుండువారలకుప్రేమనుగూర్చుచుగోమునింపుగా

Wednesday, July 3, 2019

పుస్తకము


పుస్తకమ్ముజదువపుష్టియగుగదమ
స్తకము,గలుగుప్రేమ సర్వులకును
కధలుమనలబెట్టిగాడియందుననిల
ముదము దృప్తినిచ్చుముఖ్యముగను

నగములువాాాాాా


నగరములెన్నియోమునుగనాట్యముజేయుచుగాలి,వానయున్
గనగనుబాధగల్గెనికగాగలవారలందరుదూరమై
గునగునబోవదలతునుగూర్మినిసాకినవృక్షసంపదల్
నగములువార్ధిలోగునగున్ నడచెనుగడుసుందరమ్ముగన్

గుట్టలుమున్నీటిలోనగునగుననడచెన్

బిట్టుగ వరదలురాకను
గట్టునగలపేడగుట్టగడగడయనిము
న్నీటన్దేలుచుజనగా
గుట్టలుమున్నీటిలోనగునగుననడచెన్

Monday, July 1, 2019

చార్వాకుండాస్తికుండుసద్భక్తుడెపో

ఖర్వులవాదనయిదియే
చార్వాకుండాస్తికుండుసద్భక్తుడెపో
యర్వాచీనులుసహితము
సర్వేశునిభక్తుడనిరిచార్వాకుమునిన్

Sunday, June 30, 2019

దత్తపది--హరి-మాధవ-కేశవ-అచ్యుత.శివస్తుతి

పురహరివియోయుమాధవ!
వరమగులోకేశ!వరద!పావనచరితా!
నిరతమునచ్యుతదేహుడ!
పరమునునాకిమ్ముదయనుబశుపతినాధా!

కలువలసం

కలనునగానిపించెనటకాటమరాయనిరామశాస్త్రికిన్
గలువలసంగడీడెసగికాకవెలుంగునుమ్రింగెనల్కమై
కలవరమందియాక్షణముకల్వలసామినిజూడనాతురన్
దెలిసెనుదానుచూచినదిదీటుగరాదనిమ్రింగరశ్మినిన్

Saturday, June 29, 2019

కలువలచెలికాడుమ్రింగె

కలగంటిరె యిట్లంటిరి
కలువలచెలికాడుమ్రింగెకాకవెలుంగున్
గలువలఱేడగుచంద్రుడు
నలమ్రింగెనె?గాకవెలుగునబ్బురమొందన్ !

మోసగాండ్రకెలభియించుపుణ్యఫలము


పాపులనుముద్రజగతినిబాతకులగు
మోసగాండ్రకెలభియించు,పుణ్యఫలము
భాగవతులనుసేవింపవచ్చుసుమ్ము
ప్రత్యగాత్మునిసరిగదభాగవతులు

Friday, June 28, 2019

అఆకాశవాణి

వ్యసనములేడునుంగలవుపానములాదిగబేరనొప్పుచున్
మసనముజేయుగొంపలను,మారణహోమముగల్గజేయునే
వ్యసనముసత్యపాలనయు,పామరరంజకమైనచోనిలన్
వ్యసనమువేయిరీతులశుభప్రదమైయశమొందజేయునే
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ , హైదరాబాదు

Thursday, June 27, 2019

ఈప్సిత

ప్రేప్సనుజేయగాదెలిసెబ్రీతినినుండుచునెల్లవారికిన్
నీప్సితదాతలెహితమునెంతయొకూర్తురు,చోరులెప్పుడున్
లిప్సనుదాజొరంబడుచులిప్తపుకాలమునందుపూర్తిగా
నీప్సితవస్తువుల్ సదిరియెంతయొనెమ్మదిబారిపోదురే

ఈప్సితములుదీర్చువారలెకదచోరుల్

లప్సీయందున గొమరులె
యీప్సితములదీర్చువారలెకద,చోరుల్
లిప్సంజొరబడియింటిని
ప్రేప్సకులేనంతసరుకువేలుగదోచెన్

Wednesday, June 26, 2019

జీవాకాంక్షలుపరమునుజేకూర్చునులే

ఏవారుచెప్పిరిటులుగ
జీవాకాంక్షలుపరమునుజేకూర్చునులే
జీవాకాంక్షలుపరమును
దావేరునుజేయుసుమ్ముదాపసికైనన్

అంబనుబెండ్లియాడె

అంబరవాసులున్దనిసియగ్గిరిజాపతిబ్రీతిగోరగా
నంబనుబెండ్లియాడెజనులందఱుమెచ్చగభీష్ముడయ్యెడన్
నంబరమంటగాజనులునద్భుతరీతినిజేసిరంతటన్
తంబురసంబరాలొగినిచాలినభక్తినియాదిదేవుకున్

Tuesday, June 25, 2019

కాాారాాా

ఆరాటబడుటయుండదు
తీరికగాజీవనమ్ముదీరునునిరతం
బోరాజానుడువుమయీ
కారాగృహసుఖముదక్కగలదేబయటన్

అంబనుబెండ్లాాాడెభీష్ముడంద

అంబరవాసులుగోరగ
నంబనుబెండ్లాడెభీష్ముడందఱుమెచ్చన్
సంబరమొందుచుబ్రజలును
సంబరములుసేసికొనిరిసఖ్యతతోడన్

Monday, June 24, 2019

వరగుణవండైన

వరగుణవంతుడైనశిశుపాలునిగృష్ణుడుసంపుటొప్పునే
వరగుణవంతుడాయతడుపాపపుపుట్టయగృష్ణునిందనున్
నిరతముజేయుచుండుటనునిక్కముసంపనొప్పగున్
గరమునుహింసజేయదగుఖచ్చితమియ్యదిలోకరక్షకున్

Sunday, June 23, 2019

శిశుపాాాలుని

శిశుపాలుగుఱిచిపలికిరి
శిశుపాలునిజంపదగునెశ్రీకృష్ణునకున్
శిశుపాలుజంపసబబే
నిశితపుశతదూషణంపునేరముజేతన్ 

ఫుల్లసరోజనేత్రలకు

అల్లదెమోడిపాలనకుహారతినీయనిముఖ్యమంత్రులా
ఫుల్లసరోజనేత్రలకుపూర్తిగచీకటిలయ్యెవెన్నెలల్
చల్లగరాజ్యమున్బరగజాలినశక్తినిగూడగట్టుచు
న్నుల్లముసంతసించగనునోర్పునుగల్గెడురాజ్యమేదగున్

ఇంతులకుచీకటులుగరేయెండలయ్యె

కంతుబారినిబడినట్టికాంతలెపుడు
మోహసంద్రానమునుగుచుముదములేమి
భర్తరాకనుజూచుటవాస్తవమిది
యింతులకుచీకటులుగరేయెండలయ్యె

Friday, June 21, 2019

కలమునుగాంచినంత

కలతలుమానిపద్యములుగట్టిగవ్రాయుదలంపుగల్గెనా?
కలమునుగాంచినంత,గలగంబడెసత్కవివర్యుడయ్యయో
యలుసుగజూడనాతనినినందఱిముందటసిగ్గునొందుచున్
గలతలుగల్గజేయుటదిగాదుగమంచిదియేరికైననున్

ఆకాాాాశవాాాాాాణి

ఆసలుబోవవెన్నటికినాయువుగల్గెడునంతకాలమున్
మోసముజేయువారలకె,పుణ్యఫలంబులభించునెల్లెడన్
నాసలజోలికిన్జనకయాపరమేశ్వరుపాదపద్మముల్
దోసిలబట్టివేడగనుదోరపుభక్తినిదప్పకుండగన్
-----
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

శునకమ్మున్

కనకాచార్యులుదారినిన్జనుచుదాకామాఖ్యజూడన్నటన్
శునకమ్మున్గనిభీతుడైపరచె,రక్షోనాధుడాలమ్మునన్
గనగారామునిభీతుడైచనియెనేకాంతంబుగానుంటకై
ననుచున్వచ్చెనునాకునొక్కకలయార్యామీకువాక్రుచ్చితిన్

శునకమ్మునుగనిపరుగిడెనసురపతిభీతిన్

అనిలుడుతనతోవచ్చెడు
శునకమ్ముగనిపరుగిడె,నసురపతిభీతిన్
జనియెనుగదనముజేయక
వినువీధినిమ్రోగునట్లువింతరవముతోన్

Thursday, June 20, 2019

స్తనములు

స్తనములునాల్గుగల్గునొకచాననుగాంచితినయ్యమిత్రమా!
స్తనములునాల్లుగల్లుటనుషండునిలక్షణమందురే
పనిగొనునట్లువారలిలభామలవోలెను,బుంస్త్వరూపులై
కనబడుచుంద్రునెప్పుడునుగాసులగోరుచునెల్లవారలన్

Wednesday, June 19, 2019

స్తనములునాాాాాాలుగుగలిగానచాాాాాాననుగంటిన్

కనులవిబైరులుగ్రమ్మ
స్తనములునాలుగుగలిగినచాననుగంటిన్
గనుగొనపిమ్మటరెండే
కనిపించెనుదేఱిచూడగంటికినపుడున్

షధరమెటుల్

అధరమెటుల్ సుధామధురమౌనుసరోజమఖీవచింపవే
యధరపువంచలొక్కటిగనానుచుముద్దులుసేయగానగున్
మధురసుధారసంబులుగమారుచుమత్తునునిచ్చునత్తఱిన్
బుధజనులందరిచ్చటనపూర్వపులౌల్యముజెందురేగదా

అధరము

సాధనయధరముమధురమె
యధరముమధురంబెటులగునంబుజవదనా!
యధరమునధరముకలిసిన
మధువునునేబోలునండ్రుపండితవర్యుల్

Tuesday, June 18, 2019

ప్రాణములేకపోయినను

ప్రాణములేనివస్తువులుపర్విడుచున్నవిచిత్రమేసుమీ
ప్రాణములేకపోయిననుబ్రాణపుటింధనబోయగాదగన్
జాణతనంబునన్మిగులసవ్వడిజేయుచునుర్కలెత్తుచున్
బాణినిజక్రముండగనుబర్వులుసాగునుగాదుచిత్రమున్

ప్రణమేలేని

ఎంతదూరమునకునైనవింతగాను
ప్రాణమేలేనివస్తువుల్ పరుగులెత్తె
రయ్యుమనుచునురహదారిరగులునట్లు
కారుబస్సులుమోటారుకారులెన్నొ

Sunday, June 16, 2019

నీతులుజెప్పంగరాదునిరవధికముగన్

చేతలనుపకృతిలేకను
యాతనలేదీర్తుమనుచునడుగుచునోట్లన్
బూతులయొద్దనునేతలు
నీతులుజెప్పంగరాదునిరవధికముగన్

జాాాాషువ

లాలన భావముదెలుపుచు
లీలగగావ్యమ్మువ్రాయలేలిహ్యముగన్
భాలమువంచుచుభక్తిని
జాలిగగబ్బిలమువెదకెజాషువకొఱకై

Saturday, June 15, 2019

ఆకాాాాాాశవాాాణి

అలకలబాన్పునుజేరిన
నలివేలునుముదముజేయహారముకొఱకై
విలువనునడుగగ,వణిజుని
కలముంగనికవివరుండుకలవరమందెన్
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

జలజలజాలువారు

తళతళలాడునీరమునతామరతూడులగట్టకైవడిన్
మిలమిలలాడుచేపలకుమీసములుంటకుగారణంబహో
కళకళలాడుపైరులకుకైపదమీయగగోరుచుండగా
జలజలజాలువారు జలజంబులుచాలునుజాతులేలకో

Friday, June 14, 2019

జలజములుచాలునుమనకుజాతులేల

పద్యరచనకుననువగువృత్తములగు
జలజములుచాలునుమనకుజాతులేల
చంపకోత్పలములనునవియింపుగూర్చు
గందములకంటెభావానకవివరేణ్య!

Thursday, June 13, 2019

వాాాాాాాలమ్మేతక్కువకదవసుధాాాాాాసుతకున్

బాలిశుడొకడిట్లనియెను
వాలమ్మేతక్కువకదవసుధాసుతకున్
కాలముచెల్లెనొ?యతనికి
పేలాపనమంచికాదువేదవతిపయిన్ 

Wednesday, June 12, 2019

మాధుర్యముతగ్గెనేమిమద్దూరికవీ,

బాధలపడితిరె?యార్యులు
సాధనలోపించెనేమి?సత్కవివర్యా!
గాధలరచనలయందున
మాధుర్యముతగ్గెనేమిమద్దూరికవీ!

Tuesday, June 11, 2019

ఆకాాాాాాాాాాశవాాాణి

లలనలుగోరగాననువిలాసముతోడనుబల్కగానె,నే
పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుడున్
బలుకుదునెల్లవేళలనుబద్యమురూపునబల్కులన్ నికన్
ఫలకములమీదవ్రాయుడికపారమునొందగసత్కధావళుల్
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

కారణమేమిలేనిదగుకార్యమదేఘనతంగనుంగదా

కారణమేమిలేనిదగుకార్యమదేఘనతంగనుంగదా
కారణమేమియుంగనకకార్యములెప్పుడుగానరావుగా
కారణకార్యపుంఘటనగాగలజేయునుశర్వపుత్రుడే
కారణభూతుడేయతడుకార్యములన్నియుజక్కజేయగన్

కారణములేనికార్యమెఘనతగాంచు

కారణములేనికార్యమెఘనతగాంచు
గార్యకారణఘటనలకర్తభవుడె
కారణములేనికార్యముగానబడదు
జగతినెచ్చటనెఱుగుమా శర్వపుత్ర!

కోపగించిన

పాపచింతనలేశమైననుబాడిజేయకనుండుచో
కోపగించినరాముడప్పుడుకోలసేసెనుసీతపై
పాపపంకిలమౌజగమ్మునబాపపుణ్యములేవియున్
గాపురమ్ములుసేయవెన్నడుకామితార్ధప్రదాయినీ!

Monday, June 10, 2019

కుపితరాాాాాముడుసీతపైగోలసేసె

సంహరించెనురావణుసైన్యమునని
కుపితరాముడు,సీతపైగోలసేసె
దననుబెండ్లియాడుమనుచుననిశమాధ
రణిసుతనురాాాాాాావణుడుభీకరపురవమున

wtil n

కంతునిబారినిన్బడునుగామముతోడనుగూడియుండుచో
చింతనసుంతలేనియతి,సిధ్ధినిబొందెనుజనుల్ నుతింపగన్
వంతలబారిజేయకనువైష్ణవిమాతనునమ్ముకుంటచే
పంతమురాజశేఖరుడుమాంత్రీకుడైననుభక్తియుక్తుడై

Sunday, June 9, 2019

చింతనలోపించినయతిసిధ్ధినిబొందెన్

సుంతయుబనిజేనేరడు
చింతనలోపించిన,యతిసిధ్ధినిబొందెన్
గంతునిదరిజేరకమన
సంతయుదాగృష్ణు నిలిపిసాకారుండై

Saturday, June 8, 2019

syn xduopl

హారములెన్నియోనునిచియాశివపార్వతికంఠమందునన్
నారనిభక్తితోడముదమారగబూజనుజేసినట్టిపూ
జారిణిపంచిపెట్టినప్రసాదముదిన్నమహోదయంబగున్
బారమునొందుటేపరమభక్తికిగారణమిధ్ధరన్ సూ

జారిణిపంచగదినిరిప్రసాదమీౌభక్తిన్

ఆరమణుబూజజేయగ
హారములమెఱపులతోడనచ్చపుభక్తిన్
హారతిపిదపనునాపూ
జారిణిపంచగదినిరిప్రసాదముభక్తిన్

Wednesday, June 5, 2019

slyom

హరుడేసంతతలోకవిత్తహరుడైయన్యాయముంజేసెడిన్
సరిగాజెప్పిరిసాధుపుంగవులెయాజంభాసురవైరియే
భరణంబేరునవేంకటేశుడిలదాభక్తాళిబీడించిసూ
కరమున్భక్తులవిత్తమున్బొదిలియేకాకిన్సదాజేయుగా

Tuesday, June 4, 2019

హరుడెలోకవిత్తహరుడుసుమ్ము

అసలుకంటెమిన్నయాయకారపువడ్డి
జమగ గట్టుచుండెసత్యవిభుడు
సార్ధకంబునయ్యెశంకరుపలుకులు
హరుడెలోకవిత్తహరుడుసుమ్ము

Monday, June 3, 2019

eyikmm

ఏమనిబల్కుచుంటిరిటయీపదమిచ్చటవ్రాయుచుంటినీ
చీమపరాకునన్గఱచెసింహబలుండుగతించెవింతగన్
చీమయకారణంబహహసింహబలుండటచావునొంటకున్
నేమనిజెప్పవచ్చునిక?నీశుడెకాచునురంగనాధుడా!

చీమకరచి

విషముగలదియగుటవిసవిసలాడుచు
చీమకఱచిచచ్చెసింహబలుడు
విషముముందుబలమువెలవెలలాడును
సత్యమిదియవలదుసందియంబు

Friday, May 31, 2019

eul bi

రామునిబొగడగ నేర్వను
రామునిమదిదలచిసేతురామునిభజనల్
రామునినిటులనన్యాయమె?
రామునిరాఘవునిబొగడరాదనిలసుతా!

Thursday, May 30, 2019

dhk

ఆయమలక్ష్మీదేవికి
సాయంత్రముబూజజేయజనుదముసరియా?
కాయలుబూవులుతెత్తును
నోయుత్పలగ్రంధి!యిప్పుడూహుయనకే

డబపఢువ

దంష్ట్రలనంగనేరుమువదాన్యుడ!కోరపుపల్లుగాననా
దంష్ట్రలమీదశంకరుడుదాండవమాడెనురాముకైవడిన్
దంష్ట్రలమీదవెట్టుచునుబాదముదాండవమాడెనేగదా
దంష్ట్రిమదంబునున్ గరిమద్రచ్చిననాతడుగృష్ణుడేగదా

Wednesday, May 29, 2019

డబపభధ

దంష్ట్రలుగలకాళీయుని
దంష్ట్రలపైగృష్ణుడయ్యుదాండవశివుగా
దంష్ట్రలద్రొక్కుచుపదముల
దంష్ట్రలపైశంకరుండుతాండవమాడెన్

Tuesday, May 28, 2019

తాబేలునుజెవులపిల్లిదవిలిగెలుచునా

ఆబాబువరములీయగ
నేబామయునిష్టపడకయిసుమంతయునున్
డాబులబలుకులెయవియని
తాబేలునుజెవులపిల్లిదవిలిగెలుచునా?

Monday, May 27, 2019

అన్నమేతరబ్రహ్మనౌననుటతప్పు



త్రాగుబోతులమాటలుదలపయిదియ
యన్నమేపరబ్రహ్మమౌననుటతప్పు
మిన్నదేదియులేదిలనన్నమునకు
గాన పరబ్రహ్మ యేయనికవులుసెప్పె

Saturday, May 25, 2019

ఉష్ణీషముతోడగట్టనొప్పునుగజమున్

కృష్ణునిబదఘట్టనముల
యుష్ఞమునకుకోరలుడిగియురగముభీతిన్
గృష్ణునివేడగనంతన్
నుష్ణీషముతోడగట్టనొప్పునుగజమున్


Friday, May 24, 2019

కలహములు

కలహములీభువిన్గలుగగాంతలెగారణమౌదురెప్పుడున్
బలికిరిమీరుసత్యమగుభాషణమియ్యదిగానెఱుంగుమా
యలికులవేణిద్రౌపదియునారమసీతయుకారణంబయే
కలియుగమందున్గలరుకాంతలుకారణభూతులందుకున్

కలహమ్ములుగల్గుభువినికాంతలచేతన్

పలుకులుచేష్టలులేకను
నలుకలతోనిండియుండియఱుపులతోడన్
గలకలముగల్గజేయుత
కలహమ్ములుగల్గుభువిని గాంతలచేతన్

చిజీఞుశూ

కామినిపాదనూపురముఖంగునమ్రోగెనుహేతువేమొకో
యామినిబూర్తికాకయెనెనాలియుభర్తయురాసలీలలన్
వామనగుంటలాడగనుబాదపుఘట్టనదాడనంబులున్
వేమరునుంటకారణమెపీడననొందెనునూపురంబులున్
ప్రత్యుత్తరంతొలగించు

ఠఢుమౌశ



అనఘా,చెపుమయిపుడుఖం
గుననూపురమేలమ్రోగెగోప్యతగలదా
ఘనమగుపాదపతాకిడి
నెనరంగాదగులవలననెయ్యముగలిగెన్

Thursday, May 23, 2019

ఖగఝఞూవఋ

కలలనుగందురందఱునుగాఢపునిద్రనుభీతిగొల్పువై
కలలవికల్లలైనపుడుకల్గెడిమోదమదెంతగొప్పదో
కలలులనుండుమంచివియుగంటికినింపునుగొల్పునట్టియౌ
తలపులలోనదాగుచునుదద్దయుహర్షముగల్గజేయుగా

Wednesday, May 22, 2019

కలనుగంటి

కలనుగంటినిన్నకాడుజూచినటుల
కలలుకల్లలైనగల్గెముదము
కలలుకలలుగానెగాంచుచోగలుగును
సుఖముమనకునిజముసూర్య!వినుముb

Tuesday, May 21, 2019

దత్తపది

జడతాభావమునొందుచు
దడదడనికవడకుచుండ్రితద్దయుసభ్యుల్
కడకేమిజరుగుననుచును
విడివిడిగానొక్కరొకరుభీతియుగలుగన్

Monday, May 20, 2019

మీర్జాగారడిజేయగ

మీర్జా గారడిజేయగ
మార్జాలముసింహమయ్యెమర్మంబేమో
యర్జునుడుగృష్ణుడగుటను
పర్జన్యముమనిషియగుట మంత్రపుఫలమే

Sunday, May 19, 2019

ఞంశజంైశ

భవ్యతలేకయుండగనుభావమునింపుగలేనియట్టియా
కావ్యమువ్రాసితీయనగుగాదెరసఙ్ఞులప్రాణముల్కవీ!
శ్రావ్యపుకావ్యముల్రచనసర్వులుగోరుదురెల్లవేళలన్
గావ్యములెప్పుడున్దనరుగాదెరసఙ్ఞులచేతనొప్పుచున్

కఘఃక్షఐ

అవ్యాజకరుణజూపుచు
నవ్యతదాగోచరించునాణ్యతకరువై
భవ్యతలేనివిధంబుగ
కావ్యమ్మునువ్రాసితీయగానగునుసురుల్

ఆకాశవాణి

వర్మావినుమీమాటను
గర్మలదాననుసరించిగడచునుబుద్ధుల్
మర్మపుటాలోచనయున
ధర్మాచరణముజనులకుదైత్యముజెందున్
---
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

Saturday, May 18, 2019

డుష్కర

దుష్కరప్రాసయున్గలిగిదుష్టసమాసములుండుపుస్తకా
విష్కరణోత్సవములనువేడ్కనొనర్పగనేలవెఱౢివే
పుష్కలమౌగదానరయపోడిమిపద్యములందుబాటులో
దుష్కలయత్నమున్సలిపిదుఃఖమునొందకురాజశేఖరా!

పుష్కలముగ

దుష్కరప్రాసలరచనలు
పుష్కలముగనుండిమనకుముచ్చట గొలుపన్
దుష్కరమగునీగ్రంధా
విష్కరణోత్సవమునేలవెఱ్ఱివెసుమ్మీ

Friday, May 17, 2019

wyjb

అర్కునిబోలికనుండగ
నర్కునిసాక్షిగబరిణయమాడగనతడున్
మర్కటపుజేష్టలొదవగ
శర్కరచేదగునుమఱివిషమ్ముమధురమౌ

Thursday, May 16, 2019

టఞంక్షఔక్ష

హింసయెలేనిచోహితమునెట్టులబొందగవచ్చునీధరన్
హింసకులేనివస్తువులునెందునుగానముగాదెనెచ్చటన్
కంసునిమేనమామయగుగృష్ణుడుహింసనుజేసియేగదా
కంసునిజంపెభీకరముగానని,బొందదెమేలులోకమున్

హింస లేనిచోట హితము లేదు

ఆకతా యి పనుల నాచ రించెడు వాని 
హింస లేనిచోట హితము లేదు 
హితము గోరు వారి కెప్పుడు కలుగును 
మంచి భువిని నిజము మాన్య చరిత !

Wednesday, May 15, 2019

మూఢమె

మూఢమెశ్రేష్ఠమౌచుశుభముల్వొనరించునుగార్యసిద్ధికిన్
రూఢిగజెప్పుచుంటిరె?యపురూపపుపల్కులుమాటలాడగా
మూఢులుగారుగాతమరుమూఢపునమ్మకమేలగల్గెనే
ప్రౌఢతనంబుదోడనిలబూర్వపురీతినినుంటయొప్పగున్

మూఢమి

మూఢులమాటలెయీయవి
మూఢమెశుభకార్యములకుముద్దనిరిజనుల్
మూఢమిత్యాజ్యమెయనుచును
రూఢిగనేజెప్పుచుంటిరూపా!వినుమా

Tuesday, May 14, 2019

గాడిద

గాడిడకాలుబట్టుకొనకల్గునుమోక్షముతన్నకుండినన్
వీడకయున్నచోపదమువెన్కకుబోర్లగనౌనునట్లుగా
మాడుననొక్కతాపునిడిమంచిగమోక్షముగల్గజేయుసూ
వేడుడుమోక్షమున్వలయుపెద్దలుపట్టుడుగార్దభంబునున్

టదీనుమ

మాడుగుల!గురువుపలుకులు
గాడిదకాల్పట్టమోక్షగతిలభ్యమగున్
వీడకపట్టుమునీవును
గాడిదపాదాలనిపుడగలుగునుశమమున్ 

షర్రులు



అర్రులుసాచుచున్మిగులనాఱడివెట్టుచునుండగాదమిన్
జర్రునసాంబమూర్తిగనిసాదరమొప్పగబ్రాణమీయగా
బుర్రెలుమాటలాడెదమపూర్వపురీతిసజీవులోయనన్
బుర్రెలుమాటలాడుటనుబూర్తిగగల్కిమహాత్మ్యమేసుమా

చడణంక్ష

అఱ్రులుసాచుచుశంకరు
జర్రునబ్రాణంబులీయసాదరమొప్పన్
వెర్రివీసంతసమొందుచు
పుర్రెలవియమాటలాడెబూర్వపురీతిన్

Sunday, May 12, 2019

దేవుడే

ఉండదెక్కడగ్రామముపుడమినరయ
దేవుడేలేని,గుడికడుదివ్యమయ్యె
భక్తజనములరాకతోబ్రభవమొంది
మూడురెట్లగువృద్ధితోబుంజుకొనుచు

పారావారము

పారావారముదాటగ
నీరాళ్ళనుదోడజేయనింపుగదారిన్
మీరందరుశిలలనుమన
సారాతెమ్మనెనురామచంద్రుడుహనుమన్

Wednesday, May 8, 2019

eykn



ఆరయసబబేజగతిని
దారాసంగమము,మిగులదౌష్ష్యముసుమ్మీ
కూరిమిపరకాంతలదరి
జేరుచునిజభార్యకడకుచేరకయుంటన్

ఆరయభావ్యమేయగునునార్యులుగూడనుగోరుకొందురే
దారనుసంగమించుటయె,దౌష్ష్యమగున్ గృహమేధి కెప్పుడున్
గూరిమిగల్గుచున్సతముకోరుటదేహపువాంఛనున్మదిన్ ,
మీరకహద్దునెప్పుడునుమేళములాడకయుంటలెస్సగున్ 

కుంజర

అంజనవింటివేయిదియయార్యులుసెప్పిరినిశ్చయంబుగ
న్గుంజరయూధమొక్కటిగగూడియుజొచ్చెనుదోమకుత్తుక
న్గుంజరయూధమా?యకటకూరిమిదూరుటదోమకుత్తుక
న్రంజిలజేయునేవినగరాగలభావితరంబులన్దగన్

శంకరయ్యగాాాాాారు

అనుసరించుచుగురువర!యదనుజూచి
కొల్లగొట్టెనుమీఫోనుగుజనుడొకడ
యేమిలాభమోవానికినేమొకాని
మనకుకష్టముపేర్లనుమరలవ్రాయ

కుంజరయూధంబుదోమకుత్తుకజొచ్చెన్

రంజిలగమామనంబులె
యంజయగురుసెప్పగవితనాశువుగాగన్
నంజయధారణకటకవి
కుంజరయూధంబుదోమకుత్తుకజొచ్చెన్

Saturday, May 4, 2019

ఛఝమూఔఐ

పాపముగల్గునిట్లనగబావసమైనదెయెంచిచూడయ
ధ్యాపకవృత్తికంటెనధమాధమమైనదిగల్గడెద్దియున్
బాపులతోడిబంధములు,బాధలుగూర్చునుగాననెచ్చటన్
బాపులజోలికిన్జనకభర్గునినామమునుచ్చరించుడీ

Friday, May 3, 2019

ఫనజలుక్షశ

అధ్యాపకులనదైవమె
యధ్యాపకవృత్తికంటెనధమముగలదె
బుద్ధినిగలిగెడువారలు
బాధ్యతలేకుండపలుకభావ్యమెజగతిన్

Thursday, May 2, 2019

సత్కృతి

సత్కృతులన్నవారికిలసవ్యపుభావనలేదుచేతనే
సత్కృతినంకితమ్ముగొనజంకెదరెల్లజనుల్విరక్తులై
సత్కృతులెప్పుడున్మనకుజక్కనిమార్గముజూపుగావుతన్
సత్కృతిజేయగాదగునుశక్తికొలందినిమానవాళికిన్

Wednesday, May 1, 2019

ఛక్షఐమ

మత్కృతినరుడాశతకము
సత్కృతిగాదలచమీరుజంకుటయేలా?
సత్కృతులబాపమయ్యది
సత్కృతినంకితముగొనగజంకెదరుజనుల్

వనితాాాాా

వినయంబొప్పగశేముషీరచనవేవేలంగదాజేయగా
వినువారయ్యెడబాగుబాగనుచువావేనోళ్ళచాటన్సుమీ
యనయంబాతనిపుస్తకంబులుసదాహస్తంబులైసాహితీ
వనితాలోలుడెరాజపూజ్యుడునువిద్వద్వ్యంద్యుడైవెల్గెలే

Tuesday, April 30, 2019

వనీతాాాాలోలుండువెలిగెబండితనుతుడై

ధనమునుగోల్పోవునుగద
వనితాలోలుండు,వెలిగెపండితనుతుడై
వినసొంపురచనజేసియు
వినయముతోనుండుకతనవేవురియెదుటన్

లోతునెరుంగసాధ్య

మాతయెశారదాంబనుచుమాతనుగొల్చిననాకృపామతిన్
లోతునెఱుంగసాధ్యమొకొలోకులకున్బలుకాకి మూకకున్
నీతసరంబుతోడుతను నీరజనాభునిగొల్వుచోనిడున్
చేతమునొందగాముదముచేటలనిండుగగాంచనంబులన్

Monday, April 29, 2019

లోతుదెలియలేరులోకులెపుడు

నిండుమనసుతోడనెలవంకధారిని
బూజజేసిననిలపురహరుమది
లోతుదెలియలేరులోకులెపుడుసుమ్ము
భవునకిడుదునతులువందలాది

తాాాళమువేయగాాాాా

కూళులదుష్టచేష్టలకు గూరిమితోడనశాశ్వతంబుగా
దాళమువేయగావలెనుధర్మమునిల్పగ,బుద్ధిజీవికిన్
వేళయుబాళయున్ననకభీతినిగొల్పుచునుందురీధరన్
బాళెపుగాండ్రునాబడెడుబద్ధవిరోధులెయెల్లవేళలన్

Sunday, April 28, 2019

తాాళమువేయంగనొప్పు

గోళమునందవినీతికి
తాళమువేయంగనొప్పుధర్మమునిల్పన్
గూళులయాగడములకును
దాళమునేవేయవలయుధరణినినెపుడున్

Saturday, April 27, 2019

చాాలునుకందిశంకరయచాాాాలికనీగుణదోషచర్చలున్

చాలును కందిశంకరయచాలునునీగుణదోషచర్చలు
జాలముమేముసామియిటచాలనిబల్కగనీదుసత్కృతి
న్వేలకువేలుగా,బడీనివీడకపద్యసుమాలజల్లుమా
మాలగజేసిమేమపుడుమంచిగనర్పణజేతుమీకుసూ

చాలునింకకందిశంకరయ్య

కొడిమికట్టుతెలుగుగూరిమితోడను
పద్యరూపమిచ్చిబ్రదుకునీయ
చాలునింకకందిశంకరయ్యయనగ
భావ్యమగునెమీకుభవ్యులార,

కాంక్షలు

ఆంక్షలువెట్టుచున్మదినినారడివెట్టినమానసంబున
న్గాంక్షలెయుండవీకలియుగంబునమానవజాతికీన్గన
న్గాంక్షలులేకయుండగనుగారవమొప్పగగృష్ణువేడుచో
గాంక్షలుదీర్చునాప్రభువుకాంక్షలుదీర్చెడుదైవమౌటయున్

Friday, April 26, 2019

కాంక్షలెయుండవుజనులకుగలియుగమందున్

ఆంక్షలుబెరిగినగొలదిని
గాంక్షలెయుండవుజనులకు,గలియుగమందున్
నాంక్షలుబెట్టకవెంకన
కాంక్షలనేదీర్చుచుండుగరుణనునెపుడున్

Thursday, April 25, 2019

రవికయె

రవికయెచాలునొక్కటికురంగవిలోచనకేలచీరయున్
పవనుడ!లెస్సజెప్పితివివారలుచీరనుద్రోసిపుచ్చిరే
రవికయుజీరనున్వలదు,రామకునైటినివేయనిష్టమే
భువనమునందుజూడగనునైటిలుతోడనునాతులుండీరే

పరులకుమేలుజేయకుముపాాాాాాప

అరయుమయొక్కసంగతినియాచితులైననుమోసగాండ్రు,దెం
పరులకుమేలుజేయకుముపాపమహాబ్ధినిమున్గబోకుమా
యిరవుగబుణ్యకార్యములనెవ్వరికైననుజేయుచోధరన్
దిరమగుమోక్షమార్గమునుదేహయుతంబుగబొందురేగదా

రవికయేచాాాాాలుగదచీరరమణికేల

రవికయేచాలుగదచీరరమణికేల
బాగుచెప్పిరిసెహబాసుభవ్యచరిత!
రవికయుననవసరముగరమణికిపుడు
నైటుడ్రెస్సులెయున్నవినాతికిగద

Wednesday, April 24, 2019

పరులకున్ మేలుజేసిన బాాాాపమబ్బు

పుణ్యమబ్బునుసందియంబువలదురమ!
పరులకున్మేలుజేసిన,బాపమబ్బు
కీడుజేయనెట్టివారికినిపుడమిని
బాపపుణ్యములబ్బునుబనినిబట్టి

Tuesday, April 23, 2019

ఠజణీముృ

ఈవసంతసమాగమమ్ముననేలబాడవుకోకిలా!
చూచిదొంగనునేమికుర్కుర!చూసిచూడనియట్లుగా
మోయనంటివిభారివస్తువుమోయకుంటకుగాడిదా!
కారణంబునువేగజెప్పుముకప్పెకన్నులుబూర్తిగా

ఈవసంతమునన్బాడవేలపికమ

ఈవసంతమునన్బాడవేలపికమ!
చూచిదొంగనుమొఱగవేశునకరాజ!
చదువవలసినసమయానజదువవరమ!
కాలచక్రముగాబోలుమారెనేమొ!

తిఢీమూక్ష

కుక్కకుకొమ్ములున్నవనికోవిదులెల్లరుజెప్పిరేకమై
యక్కటవింటిమిట్టివియయబ్బురమొందితిమొక్కసారిగా
నిక్కలికాలమందునికనెన్నివిధంబులుసూతుమోగదా
యక్కలిపూరుషుండికనునద్భుతప్రక్రియలేమిజేయునో

కుక్కకుగొమ్ములుగలవనికోవిదులనిరే

అక్కటయేమనియంటిరి
కుక్కకుగొమ్ములుగలవనిగోవిదులనిరే
నిక్కముకలియుగమహిమలు
కుక్కకునికమొలచునేమొకొమ్ములుభావిన్

Monday, April 22, 2019

ఛఝీనుశక్ష

కందమునందుబ్రాసనీడగన్ వలదప్పకవీ,యెఱుంగుమా
యందముగొల్పుచున్మదికిహాయినిగూర్చగనుండగోరుచో
డెందముసంతసించువినుడీయదిమీరలుశంకదీరగన్
కందమునందుబ్రాసనిడిగానముజేసిననద్భుతంబుగా

Sunday, April 21, 2019

కందమ్మునబ్రాసవలదుగదయప్పకవీ,

కందపుబ్రాసనునడుగుట
కందమ్మునబ్రాసవలదుగదయప్పకవీ!
ఛందోబద్ధమయగుటకు
కందమునకుబ్రాసమొగముకవివర!వినుమా!

థధనశక్షక్ష

చినవాడేయొనరించెనాయిటులఛీఛీపెక్కుదుష్కృతముల్
చినవాడైననుబుద్ధిలోఘనుడుఛీఛీఛాలుజూడకెప్పుడున్
మొనగాడౌచునునన్నివేళలనుదామూర్ఖంబుగానుండుచున్
వినయంబించుకలేకయేమసలిదాపీడించునెల్లప్పుడున్

Saturday, April 20, 2019

చినవాాాాడొనరించెనాాాాాాయిసీదు

వినుడీకలియుగమందున
చినవాడొనరించెనాయిసీదుష్కృతముల్
ననుదినమిటులేయుండును
చినపెదయననేమిలేదుచెడ్డలుసేయన్

Friday, April 19, 2019

రమ్ముజగమ్మునందునగరమ్మువరమ్నునిజమ్మునమ్ముమా

అమ్మయునీవునున్గలసిహాయినిగూర్చగ శంకరా!దయన్
రమ్ము,జగమ్మునందునగరమ్మువరమ్మునిజమ్మునమ్ముమా
వమ్మగుమాటగాదలచవద్దుర!బార్వతియర్ధభాగుడా,
యిమ్మగునీదురాకకునునెంతయొవేడ్కనునుంటిమీసుమా

రమ్ముజగమ్మునగరమువరమ్మగునుసుమా



ఇమ్మహికీయగశోభను
రమ్ము,జగమ్మునగరమువరమ్మగునుసుమా
యమ్మయునీవునువచ్చి,క
రమ్ముగమాచేయుపూజత్ర్యంబక!గొనుమా

Thursday, April 18, 2019

థఢమఐఐఔ

అవిరళప్రేమదేవతకునార్షవిభాగపునగ్రదేవతా
భవునిముఖమ్మునన్వెలుగువాణికివందనమాచరింపుమా
పవలునురేయియున్దనరుభక్తినిబూజనుజేయుచోనిల
న్గవనమునందుజేయునినుగాకలుదీరినమేటివానిగా

భవునిముఖమ్ముననువెలుగువాణిగొలువుమా

భవుడన నర్ధము బ్రహ్మయ
భవుని ముఖమ్ముననువెలుగువాణిగొలువుమా
పవలునుఱేయియునాకను
సవినయముగగొలుచునెడలసత్కవిజేయున్

flkhjj



అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా"
యరిషడ్వర్గముపుట్టుకన్గలుగునాయాజాతివంశాళికిన్
బరగన్బ్రార్ధనజేయగావలదునెవ్వారున్జగంబందునన్
నరిషడ్వర్గమునెప్పుడున్మనకునన్యాయంబుజేకూర్చుగా

Wednesday, April 17, 2019

షరిషడ్వర్గమ్మునొసగుమనివేడదగున్

సరగొనిపలుకుటనిట్లుగ
నరిషడ్వర్గమ్మునొసగుమనివేడదగున్
నరిషడ్వర్గములనునవి
నరులకుపుట్టుకనవచ్చునరములుసిట్లన్

Monday, April 15, 2019

చితిలోజంద్రకళావతంసుడిడునిశ్శేషంబుగాసౌఖ్యమున్

గతమున్జెందినవారలన్బొసగనాకారంబుబోగాల్తురే
చితిలో,జంద్రకళావతంసుడిడునిశ్శేషంబుగాసౌఖ్యమున్
మతినెవ్వండిలసాదరంబుగనునమ్మాహాత్ముబూజించునో
సతతంబాతనిమెచ్చుచున్దయనుదాసంతోషమున్బొందుచున్

చితిలోబరమేశుడిచ్చుజిరసౌఖ్యంబున్

మతిలేనిరమణదూకెను
చితిలో,బరమేశుడిచ్చుజిరసౌఖ్యంబున్
సతతము భక్తినిబూజలు
సతితోడనుజేయునెడల సానందితుడై

రామదాసు చూర్ఞిక

రామదాసు భక్తి పూర్వకంగా రామునిపై 24 కేశవనామాలు కలసి వచ్చేలా ఒక చూర్ణిక రాశారు. చూర్ణిక అంటేనే సరళంగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. సరళ సంస్కృతంలో ఉన్న ఈ చూర్ణికలో విశేషం ఏమిటంటే ముకుందం, రఘువీర నామాల తర్వాత ప్రతి శ్లోకం చివర కేశవాది 24 విష్ణు నామాలు వస్తాయి.
శ్రీరాముడు పురుషోత్తముడు. ఆయనను అర్చించి ఆయన భక్తిలో మునిగితేలిన ఎందరో భక్తు ల్లో తెలుగు వారిలో రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచెర్ల గోపన్న ఒకరు. ఆయన భద్రాచలంలో రామాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయన భక్తి పూర్వకంగా రాముని పై 24 కేశవనామాలు కలసి వచ్చేలా ఒక చూర్ణిక రాశారు. చూర్ణిక అంటేనే సర ళంగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. సరళ సంస్కృ తంలో ఉన్న ఈ చూర్ణికలో విశేషం ఏమిటంటే ముకుందం, రఘువీర నామాల తర్వాత ప్రతి శ్లోకం చివర కేశవాది 24 విష్ణు నామాలు వస్తాయి. ఈ చూర్ణిక రామదాస విరచితమైనా దీని గురించి అంతగా ప్రజలకు తెలియదు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ చూర్ణికను స్మరించుకుందాం. దీనిని కేశవాది చతుర్వింశతి నామ ప్రతిపాదక చూర్ణికగా పేర్కొంటారు. అది
బాలకాండ :
అథ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ భాండ తండోప తండ కరండ మండల శాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారక బ్రహ్మాహ్వయ దశ దిశా ప్రకాశం, సకల చరాచరాధీశం, కమల సంభవ భవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారక బృంద వందమాన సందీప్త దివ్య చరణారవిందం – శ్రీముకుందం
దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనోత్కట కపట నాటక సూత్ర చరిత్రాంచిత బహు విధావతారం – రఘువీరం
కౌసల్యా దశరథ మనోరథామందానంద కందళిత హృదయార వింద నిరూఢక్రీడావిలోలన శైశవం – శ్రీకేశవం
విశ్వామిత్ర యజ్ఞ విఘ్న కారణోత్కట తాటకా సుబాహు మారీచ బాహు బల విదళన బాణప్రవీణ కోప పరాయణం- శ్రీమన్నారాయణం
నిజపాద రజ:కణ స్పర్శనీయ శిలారూప అహల్యా శాప విమోచన గౌతమ సతీ వినుత మహీధవం – శ్రీ మాధవం
ఖండేందుధర ప్రచండకోదండ ఖండనోద్దండదోర్దండ కౌశిక లోచనోత్సవ జనక చక్రేశ్వర సమర్పిత సీతా కళ్యాణోత్సవానందం – శ్రీ గోవిందం
పరశురామ భుజా ఖర్వ గర్వ నిర్వాపణతానుగత రణ విజయ వర్ధిష్ణుం – శ్రీమహావిష్ణుం
అయోధ్యకాండ:
పితృవాక్య పరిపాలనోత్కట జటా వల్కలోపేత సీతా లక్ష్మణ సహిత రాజ్యాభిమత దృఢ వ్రత కలిత ప్రయాణ రంగద్గంగావతరణ సాధనం
– శ్రీ మధుసూదనం
భరద్వాజోపచార నివారిత క్రమ క్రమ నిరాఘాట చిత్రకూట ప్రవేశ క్రమం – శ్రీత్రివిక్రమం
జనక వియోగ శోకాకులిత భరత శత్రుఘ్న లాలనానుకూల బంధు పాదుకా ప్రదాన పట్టాభి షేక సుధా నిర్మితాంత కరణ దష్టచేష్టాయమాన క్రూర కాకాసుర గర్వోపశమనం – శ్రీవామనం
అరణ్యకాండ:
చతుర్దశ వర్ష దండకారణ్య ప్రవేశ నిరోధ విరాధనల జ్వాలానిర్వాపణ జలధరం–శ్రీధరం
శరభంగ సుతీక్ష్ణా త్రిదర్శనాశీర్వాద నిర్వ్యాజ కుంభ సంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముదాయార్చిత ప్రకాశం – శ్రీహృషీకేశం
పంచవటీతటీ సంఘటిత విశాల పర్ణశాల గత శూర్పనఖా నాసికాఖరచ్చేదనావబోధన మహా హవారంభణ విజృంభణ రావణ నియోగ మాయా మృగ మారీచ సంహార కార్యార్థ లాభం – శ్రీపద్మనాభం


రాత్రించర వంచనాపహృత సీతాన్వేషణ పథపంక్తిముఖ క్షోభ శిథిలీకృత పక్ష జటాయు మోక్ష బంధు ప్రియావసాన నిర్బంధన కబంధ వక్త్రోదర శరీర నిరోదరం – శ్రీ దామోదరం
కిష్కంధ కాండ :
శబర్యుపదేశ శబరీ సమర్పిత బదరీఫల భక్షణ పంపాతట హనుమత్‌ సుగ్రీవ సంభాషిత బంధురోర్బంధుర  దుందుభి కళేబరో త్పతన సప్త తాళచ్ఛేదన వాలి నిగ్రహణ ప్రసన్న సుగ్రీవ సామ్రాజ్య పట్టాభిషేక సుఖ మర్షణం–శ్రీసంకర్షణం
సుగ్రీవాంగదనీల జాంబవాశ్చ నలకేసరి ప్రముఖ నిఖిల కపి నాయక సేనా సముదయార్చిత దేవం – శ్రీ వాసుదేవం.
సుందరకాండ:
నిజదత్త ముద్రికా జాగ్రత్సమగ్రాంజనేయ వినయ వచన రచనాంబుధి లంఘనోల్లంఘిత లంకిణీ ప్రాణోల్లంఘన, జానకీ దర్శన అక్ష కుమార మారణ ఇంద్ర జిత్‌ బ్రహ్మాస్త్ర బంధన లంకాపురీ దహన తత్ప్రతిష్ఠిత సుఖ ప్రసంగ ధృష్టద్యుమ్నం – శ్రీప్రద్యుమ్నం


యుద్ధకాండ:
అగ్రజోదగ్ర మహోగ్ర నిగ్రహ పలాయమానాపమానీయ నిజ శరణ్యాగణ్య ప్రణ్యానయ విభీష శరణాగతి, అభయ ప్రదానానిరుద్ధం – శ్రీమదనిరుద్ధం
అపార లవణ పారావార సముజృంభితోత్కరణ గర్వ నిర్వాపణ దీక్షా సమర్థ సేతు నిర్మాణ ప్రవీణాఖిల తరు చరోత్తమం – శ్రీపురుషోత్తమం
నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్రజిత్‌ కుంభ నికుంభ అగ్నివర్ణాతికాయ మహాకాయ,  మహోదర మహా పార్శ్వ ఇంద్రాంతక దేవాంతక, నరాంతకాది దనుజ తను ఖండనాయమాన కోదంద గుణ శ్రవణ శోషణ హత శేష రాక్షస వ్రజం – శ్రీ అధోక్షజం
అకుంఠిత రణోత్కంఠ దశకంఠ దనుజ కంఠీరవ కంఠ లుంఠనాయ మాన జయా వహం – శ్రీ నారసింహం
దశగ్రీవానుజ పట్టభద్ర త్వాసక్త విభవ లంకాపురీ స్ఫురణ సకల సామ్రాజ్య సుఖాచ్యుతం – శ్రీమదచ్యుతం
సకల చరాచర సురాసురాద్భుత ప్రజ్వలిత పావక ముఖ పూతాయమాన సీతా లక్ష్మణానుగత మహనీయ పుష్పక విమానాధిరోహణ నందిగ్రామ స్థిత భరత శత్రుఘ్న భ్రాతృభిర్యుత జటా వల్కల విసర్జనాంబర భూషణాలంకృత  శ్రేయో వివర్ధనం – శ్రీజనార్దనం

అయోధ్యానగర శ్రీసీతారామ చంద్ర మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ నిరంతర దిగంత విశ్రాంత హార హీర కర్పూర పయః పారావార పారద వాణీ కుందేందు మందాకినీ చందన సురధేను శరదంబుదాళీ, దర రంభోళీ శత ధార ధావళ్య శుభ కీర్తిచ్ఛటాంతర పాండురీభూత సభా విభ్రాజమాన నిఖిల భువనైక యశస్సాంద్రం
– శ్రీమదుపేంద్రం
భక్త జన సంరక్షణ దీక్షా కటాక్ష విజృంభమాణ శుభోదయ సముజ్ఝరిం
–శ్రీహరిం
కేశవాది చతుర్వింశతి నామగర్భ సందర్భిత నికథాంగీకృత మేధావర్ధిష్ణుం –శ్రీమహావిష్ణుం
సర్వ సుపర్వ పార్వతీ పరమేశ్వర హృదయ కమల తారక బ్రహ్మనామ సంపూర్ణ కామం – శ్రీరామం
భవ తారణాను గుణ సాంద్రం, భవ జనిత భయోచ్ఛేద చిద్రమచ్చిద్రం భక్త మనోరథోన్నిద్రం శ్రీమద్భద్రాచల రామ భద్రం భక్త రామ దాస సుప్రసన్నం

భజే~హం, భజే~హం, భజే~హం, భజే~హం, భజే~హం.
ఇతి శ్రీరామదాస విరచిత చూర్ణికా రూప సంక్షిప్త రామాయణం సమాప్తం.

Sunday, April 14, 2019

శ్రీనాాాాాాధుడు

కాణాచియసీసములకు
శ్రీనాథుడు,భారతకృతిజేసెఘనుండై
వీనులవిందుగనన్నయ
పూనికతోదనదుశైలిమురిపెముగలుగన్

ఛజణనౌక్షశ

subbaraoఏప్రిల్ 14, 2019 1:06 PM

సాదరమొప్పగారమణశర్మకుదగ్గరచుట్టమౌయుమా
సోదరిబెండ్లియాడె,నిజసోదరుడాగమశాస్త్రపధ్ధతిన్
ఖాదరువల్లికిన్దనయఖాదరుబీబినిబెండ్లియాడెదా
మోదముతోడనేవలచిముగ్ధమనోహరరూపిగావుతన్

చఝణూక్షూ



సాదరమొప్పగారమణశర్మకుదగ్గరచుట్టమౌయుమా
సోదరిబెండ్లియాడె,నిజసోదరుడాగమశాస్త్రపధ్ధతిన్
ఖాదరువల్లికిన్దనయఖాదరుబీబినిబెండ్లియాడెదా
మోదముతోడనేవలచిముగ్ధమనోహరరూపిగావుతన్