Monday, July 31, 2017

కాంతకై త పింతురు వార్ధకమున మిగుల

కాంతకై త పింతురు వార్ధకమున మిగుల
యక్షరాల ని జముసామి !యామె లేని
యిల్లు కాంతివిహీనమై యుల్లమునకు
బాధ కలిగించు దప్పక భవ్య చరిత !

Sunday, July 30, 2017

శంకర శతకము

శంకరశతకపు పొత్తము
బింకముగా వ్రాసినట్టి పెద్దలకీయీ
లెంకను జేయుదు నతులను
శంకలు లేకుండగొనుడు సాదర మొప్పన్

Saturday, July 29, 2017

భక్ష్యముల నాముదము తోడ వండ దగును

భక్ష్యముల నాముదము తోడ వండ దగును
బలుకు మీయది  సత్యము, వండుదురట
నారి కేళపు తైలాన నాణ్యముగను
గొన్ని ప్రాంతాల యందున  మిన్నగాను

Friday, July 28, 2017

ముని గన్గొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్

వినయపు నతులను నిత్తును
ముని గన్గొన, ముదిత వలపు ముమ్మర మయ్యెన్
గని నంతనె తన భర్తను
వనజా ! విను సహజ మదియ వనితల కెల్లన్

Wednesday, July 26, 2017

దత్తపది

జయమునుబలుకగసురలట
రయమునబాణంబువేయరాముడుమిగులన్
 భయమునబంగరుమృగమది
నయముగవేగంతుతోడ నర్తిలి పారెన్

Monday, July 24, 2017

ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్

ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్
గామము హెచ్చుగా గలుగ కామిని మానస మందునన్భళా
రాముని మందిరంబు గని రాముని వేడిరి సామి ! మమ్ముల
న్నేమిగ జేతురో యికను నిట్లుగ మేమిట కల్సుకొందుకై

Sunday, July 23, 2017

ఆగష్టు 15

ugust 10, 2015

ఆగష్టు 15

ఈ రోజే మన పండుగ
మీరందరు వచ్చిరిటకు మీరని భక్తిన్ 
గారవపు నతుల నిడుదును 
వీరుల మది దలచు చుండి వీడని భక్తిన్ 
ఆంగ్ల పాలకు లవశమై యష్ట కష్ట 
ములను  భరియించు బ్రజలకు ముక్తి కొరకు 
గాంధి  మొదలగు వారలు గలసి గట్టు 
తనము తోడన పోరాడి తనర దెచ్చె 
దేశ మునకు స్వరాజ్యము దేజరిలగ 
ఖైదు  లోపల మ్రగ్గియు కఠిన మైన 
దెబ్బ లెన్నియో భరియించి ,తెలివి పోయి 
బ్రతికి రార్యులు  జీ వ చ్ఛ వంబు వోలె 
చెప్ప  లేమయ్య  వారల చిప్ప కూడు 
అట్టి  మహితాత్ము  లగురిచి గట్టి గాను 
నెంత జెప్పిన మఱి యది  సుంతె  యగును
వంద నంబులు వారికి వంద లాది
చేయుటే మన  కర్తవ్య మార్య !యికను

భరత మాతకు పలుకుడు భవ్యు లార !
జైభ  రతమాత !యిక నీకు  జయము జయము
సేవ జేతును నిరతము శిరము  వంచి
దయను జూడుమా నాపైన ధాత్రి  జనని !

దేశ  మునకునై ప్రాణాలు దీ సికొనిన
నాయ  కులయాత్మ శాంతికై నలువ గురిచి
చేయ బ్రార్ధన నేనును  జేతు నార్య !
సెల  వొ  సంగుడు నాకిక  సేతు నతులు

ప్రేమ పొంగి పొరలె వీధులందు నిజము

ఉత్స వి గ్ర హమ్ము లూరేగు చుండగ
భక్తి రసము లచట రక్తి గొలుప
ప్రేమ పొంగి పొరలె వీధులందు నిజము
కనగ లేవు వేయి కన్ను లైన

యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్

అమలపుజరితుడునగుచును
మమతల వెల్లువలుగలిగి మాన్యతతోడన్
  మమకారమ్ములుగలకా
యమునకె తప్పదుగ భస్మమగుటెపుడైనన్

Saturday, July 22, 2017

పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్

సతులందరు పిలుతురు పర
పతిని సహోదర యనుచు భవానియె పిలిచె
న్నితరులతోబాటుగ దన
పతి నిన్  దా బిలిచె నట్లు  పరిహాసమునన్

Saturday, July 15, 2017

ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్

అదిరెను సామీ  చెప్పుడు
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
జదువగ నబ్బుర మగుచు
న్నెద యంతయు జలదరించె నీక్షణ మునన్

Sunday, July 9, 2017

భాగవతమ్మునున్జ దువపాపమపారము చేకురున్ జుమీ

భాగవతమ్మునున్జ దువపాపమపారము చేకురున్ జుమీ
భోగుల మాటయే యదియ ,పోకిరి గా నటు పల్కుచుందురే
భాగవతమ్మనన్నిలను బావన మైనది గాదలంతుమే
వాగుడు కాయలే యవియ వాటిని లెక్కకు వద్దులే సుమా

భాగవతమ్మును జదువుట పాపముసుమ్మీ

భోగులు బలుకుదు రిట్లని
భాగవతమ్మును జదువుట పాపముసుమ్మీ
భాగవత మెది యొ తెలియక
వాగుదురే యిట్లువారు వసుధను సామీ !

Saturday, July 8, 2017

విరసంబగు రచన యొప్పె వీనుల విందై

విరసము సరసపు ట ర్ధము
లెరుగని నొక పామరుండు  నేర్వక చదువు
న్నరకొ ర తెలివిని నిట్లనె
విరసంబగు రచన యొప్పె వీనుల విందై

గురుపూర్ణిమ

గురుపూర్ణిమ శుభదినమున
గురువులకుంజేతునతులుగూరిమితోడన్
 గురువన శంకరుడేగద
విరులంబూజించయిచ్చువేలుగసిరులన్

Friday, July 7, 2017

అష్టమి నాడు జేయఁదగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే

అష్టమి నాడు జేయఁదగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే
యష్టమి మంచిదే యనుట నయ్యది విజ్ఞుల మాటగా వున
న్నిష్టము గల్గి మామదికి నేపని నైనను జేతు మప్పుడు న్
శిష్టుల మాటలే మనకు శీఘ్రము మంచిని జేయు నెప్పుడున్

అకలంకుండగు వ్యాసరా డ్విభుడు

అకలంకుండగు వ్యాసరా డ్విభుడు నౌన్గదా తండ్రియు
న్శుకయోగీంద్రునకల్లుడయ్యెగదభీష్ముండందరుప్పొంగగ
న్నకటా భీష్ముడు భీకరముగా హా దాను నుద్వాహము
న్నికజే బూననిబల్కగా నగునె నోయీ భీ ష్మకుం డల్లుగాన్

శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే

అకటా యేమని వ్రాయుదు
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే
తికమక గా నుండెను మరి
శుక భీష్ముల కిడుదు నతులు సుమ్మీ యిపుడున్

అష్టమ తిధి శుభకరమని యందురు విజ్ఞుల్

అ ష్టమిని  బుట్ట కృష్ణుడు
అష్టమ తిధి శుభకరమని యందురు విజ్ఞుల్
శి ష్టుల మాటల మృతములె
యిష్టమె యా తిది య మాకు నేపని కైనన్

Thursday, July 6, 2017

మద్యమె మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా

మద్యమె  మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా
మద్యము నిచ్చు మత్తు గద మానవ జాతికి నెల్ల వేళలన్
మద్యము జోలిపోవకను మాన్యుని వోలెను జీవితంబుసూ
హృద్యముగా జరుంగుటకు హేవళి నాముడు రక్ష సేయుతన్

Wednesday, July 5, 2017

మద్యమె బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్

విద్యా ! హానిని జేయును
మద్యమె, బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్
విద్యాభ్యాసము జగతిని
విద్యకు నిల సాటిరావు వేయియు వృత్తుల్

Monday, July 3, 2017

ఛందస్సు- తేటగీతి నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.

ఏరు వాకను సాగించి నారు పోయు
కాల మీ దినమ్మె ,రైతులు కాడి పట్టి
దరులు దున్నుచు భూమిని చాలు మధ్య
శి వుని దలచుచు విత్తులు  శీఘ్ర మేయు

కట్ల పాము చేరి కౌగి లించె

పాము బట్టు నతడు భయమను నదిలేక
కట్ల పాము చేరి కౌగి లించె
నవ్వి యేక దమరి యాదు కొనుచు నుండి
భుక్తి గలుగ జేయు భువన !తెలియు

Sunday, July 2, 2017

శంకరార్యుల సలహా

శంకరార్యుల సలహాను సాదరముగ
నొప్పు కొనుచును నిత్తును దప్ప కమరి
వలయు సొమ్మును నావంతు పంపుడా ర్య !
"బ్యాంకు అక్కౌంటు " నెంబరు మఱువ కుండ

Saturday, July 1, 2017

ఇతడితడే యితడె యితడె యితడీ తండే

మితముగ మాటలు బలుకుచు
సతతము నర్చించి శివుని సవిమల భక్తిన్
వితరణమును  గలుగు నతడు
ని తడితడే యితడె యితడె యితడీ తండే