Sunday, February 26, 2012

వర్ణములను వదలి వేయ వైభవ మగునే

వర్ణములు వేద విహితము
వర్ణము లేలేని నాడు వరుసలు మారున్
వర్ణము లుండుట ముఖ్యము
వర్ణములను వదలి వేయ వైభవ మగునే .

Monday, February 20, 2012

శివ రాత్రి

మహా శివ రాత్రి శుభా కాంక్షలతో
------
శివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని బలికి నంత శివ సాయుజ్యం
భవ! యని బలుకును భవు డును
శివ శివ యని బలుక రాదె ?శీఘ్రము గాగన్

Sunday, February 19, 2012

రాముని భజన లలరు శివ రాత్రికి గనుమా

రాముడు శివుడును నొకరే
రాముని భజన లలరు శివ రాత్రికి గనుమా
రాముని ప్రతిష్ఠ వలన నె
రామేశ్వర మిలను లోక రంజిత మయ్యెన్ .

వ్యాకరణ మెరుం గ నట్టి వారె కవి వరుల్

శ్లోకములు వ్రాయు చుండిరి
వ్యాకరణ మెరుం గ నట్టి వారె , కవి వరుల్
లోకము మెప్పును బొందను
శ్రీ కరముగ రచన లెన్నొచేయుదు రిలలోన్ .

Friday, February 17, 2012

కల్ల లాడు వారె కవులు గాదె

నిజము నొప్పు కొనరు నీతి మంతులు గారు
కల్ల లాడు వారె , కవులు గాదె
తేనెలొలుకు నట్లు తీ యంగ గవనంబు
వ్రాయు మనుజు లిలను వాసి గాను .

బెదరు చున్నాడు తిండికై భీము డిపుడు

బండ్ల కొలదిని నన్నంబు బకుని కంప
నతని బదులుగ భీముండు నాహ రించె
వృకము బోలిన నుదరంబు నుండి యైన
బెదరు చున్నాడు తిండికై భీము డిపుడు

శాంత చిత్తుడు కుపితుడై శాప మొసగె

కోడి కూయ గౌతము డిలు వీడి యేగ
మారు వేషంబు నొందియు మరుత విభుడు
పొంద కామమున నహల్య బొందు చేర
శాంత చిత్తుడు కుపితుడై శాప మొసగె .

జగను కాప్త మిత్రుడు గదా చంద్ర బాబు

రైతు బిడ్డడు నంబటి రామ శాస్త్రి
జగను కాప్త మిత్రుడు , గదా చంద్ర బాబు
అసలు సిసలైన శత్రువు నయ్యె నిపుడు
రాజ కీ యాల బంధంబు లట్లె యుండు .

Thursday, February 16, 2012

నిషిద్ధాక్షరి , శష స హ మినహా శివ స్తోత్రము

మూడు కన్నులు గలిగిన మూర్తి వాని
గొలువ భక్తిని , భూతిని గూర్చు మనకు
ఫాల నేత్రుని గొలువంగ ఫలము మెండు
భజన జేయుడు నిరతము భక్తు లార!

Wednesday, February 15, 2012

కోడిని దినువా డె మేటి గుణ వంతు డగున్

వాడిగ చురుకుగ నుండును
కోడిని దినువా డె , మేటి గుణ వంతు డగున్
కోడికి బదులుగ మేకను
వేడింగా దిన్న యెడల విజ్ఞుడు నౌనున్

మూ షికముల దిన్న యెడల మోక్షము వచ్చున్

శోషన్నొందు దురిలపై
మూ షికముల దిన్న యెడల , మోక్షము వచ్చున్
మూ షిక వాహను మ్రొక్కిన
శేషంబగు జీవితంబు శివ పర మొప్పున్.

Tuesday, February 14, 2012

పేదలు నిరు పేద లగుట ప్రియ మొన రించున్

వేదన కలిగెడివిషయము
పేదలు నిరు పేద లగుట , ప్రియ మొనరించున్
పేదలకు సాయ పడిన చొ
పేదలు లేకుండ జేయ మెచ్చును శివుడున్ .

Monday, February 13, 2012

Happy Valentines Day

1. Live for the person who dies for you.
2.Smile for the person who cries for you.
3.Love the person who loves you more than you .

సురభులకు బుట్టు చుండెను ఖరము లకట

ఏటి కేడాది పొడుగున నీ తలయ్యి
సురభులకు బుట్టు చుండెను , ఖరము లకట
మోయ లేనంత బరువును మోయు కతన
నలసి నిదురించె నియ్యె డ యాహరించి

దత్త పది ,ఈగ-దోమ -పేను-నల్లి

పేను ,నల్లుల మాదిరి పీల్చు కొనుచు
దోమ నటులన రక్తము దోచు కొనుచు
నిలను శవముపై వాలిన ఈ గ వోలె
పాలకు లవి నీతి పరులై పంచు కొనిరి
బడుగు జీవుల ధనములు మానములును

Sunday, February 12, 2012

కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు

కపిని పేరున గలదిల కన్య కొక తె
గౌరి కొడుకు తొ రైలు లొ పరిచ యంబై
ప్రేమ సంగతి నతనికి వెల్లడించ
కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు

Friday, February 10, 2012

ముక్తేశ్వరుడు

భక్తియె పూజకు మూలము
భక్తిని నిల బూజ సేయు భక్తుల నెపుడున్
రక్తిని ననుగ్ర హించుచు
ముక్తేశ్వర నాధు డయ్యి మొక్కులు దీర్చున్.

కపట యతుల గనిన గలుగు ముదము .

చీ దరించు కొందు జిటపట లాడుదు
గపట యతుల గనిన , గలుగు ముదము
మంచి నడవ డికయు మంచి బుద్ది గలుగు
ననవ రతము సాధు యతుల జూడ .

పశ్చాత్తా పంబు నొంద పాపము వోవున్ ?

దుశ్చర్య లు గావించుచు
పశ్చాత్తా పంబు నొంద పాపము వోవున్ ?
నాశ్చరంబ ది యటులౌ
నిశ్చింతన వేడుకొనుము నీ శ్వరు నెపుడున్ .

Thursday, February 9, 2012

రావణుడా సీత మగడు రక్షించు మిమున్

దేవతలం నిర్జించిన
రావణుడా , సీత మగడు రక్షించు మిమున్
నీ వెఱుగవె యా రాముడు
శ్రీ వరదుడు శరణ మొసగు రిపులకు నేనిన్

కని నంతనె మాయ మయ్యె కాంతియు కూడన్

కనుటకు నుబలా టంబడి
విను వీ ధిం జూడ జోతి వేకువ జామున్
కనిపించె కాంతి పుంజము
కని నంతనె మాయ మయ్యె కాంతియు కూడన్ .

Wednesday, February 8, 2012

తోటి కోడలు తమ్ముడు తుంట రయ్యె

చెడ్డ వారల నెయ్యము చేయు చుండి
తాగు బోతును,తిరుగు బోతయ్యి ,సరిత
తోటి కోడలు తమ్ముడు తుంట రయ్యె
పాప కర్మల సేతకు ఫలము నిదియె.

పూజ సేయ సిరులు పూజ్యము లగు

వృద్ది నొందు నయ్య ! వృషభాధి వాహను
పూజ సేయ సిరులు , పూజ్యము లగు
భక్తి లేమి జేయు బహు పూజ లన్నియు
శివుని పూజ సేయ శ్రీలు నొసగు .

బిడ్డ జూచి కప్ప బెక బెక మనె

శేషమాంబ వగచె చిక్కి శిధిల మైన
బిడ్డ జూచి , కప్ప బెక బెక మనె
పాము నోట జిక్కి పరుగిడ నేరక
శక్తి హీను కకట చావు శరణు .

Tuesday, February 7, 2012

పూజ్యులు ,పార్వతీ శ్వర శర్మ గారి కి పాదాభి వందనములతో ..

అవధానము లన్నిట నీ
యవధానమె గొప్ప దందురార్యా ,శర్మా !
అవధానం బొనరింపుము
అవధానపు జక్రవర్తి ! యాశువు తోడన్ .

రెండు రెండులు నాలుగు రెండు లౌను

నరుడ! గ ణి తంబు నందున నాలు గగును
రెండు రెండులు , నాలుగు రెండు లౌను
గుణిజ మెనిమిది నియ్యెడ గుంఫనము గ
లెక్క లన్నియు నిట్ల నె లెక్క జూడు .

గణ యతి ప్రాసలే లేని కైత మేలు

గణము ప్రాసలు గలయట్టి కావ్యములను
చదువు రానట్టి పెద్దలు సదువ లేరు
వ్రాయ బలుకని చదువని వారి కొఱకు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు .

Monday, February 6, 2012

బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు

బలము లేనట్టి వాడె నిర్భయుడు ఘనుడు
కలి యుగంబున సాధ్యమై కాన వచ్చు
బలము కలిగియు పాండవు ల్పరుల పంచ
వెతల నొందుచు భీతిని బ్రతుక లేదె?

పాండు రాజుకు పుత్రులు వంద మంది

పుణ్య మూర్తులు పాండవు ల్బుట్టి రయ్య !
పాండు రాజుకు , పుత్రులు వంద మంది
పుట్టి యప కీర్తి దెచ్చిరి పృధివి పతికి
చేటు కాలంబు నేరును దాట లేరు .

Sunday, February 5, 2012

శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా !

శాసనము సేయ సులభము
శాసనముల మంచి చెడ్డ సారూ ప్యము లో
శాసనములు సరి కాని చొ
శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా !

పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు

పరమ సంతస మొం దెను వైరి గణము
పర్వ దినమని , యేడ్చిరి సర్వ జనులు
రాజ శేఖరు మరణంబు రగిలి మనసు
పెద్ద వారల యెడబాటు ప్రీతి యగునె?

Saturday, February 4, 2012

దత్త పది .ధృతి -మృతి -కృతి -శృతి

ధృ తులు బ్రతికించు మనుజుని మృ తుల నుండి
కృ తులు సంతోష బరచును శృ తుల నెల్ల
దైవ నిర్ణయ మీ యది తరచి చూడ
రామ మోహన నెరుగుము రక్తి తోడ .