Friday, March 30, 2012

మంచు గని తరించిరెల్ల రా పర్వంబున్

త్రెంచుము భవబంధంబులు
పెంచుము మఱి మోక్ష గతులు పెద్దమ తల్లీ !
మంచిగ సేవలు సేసెద
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్ .

Saturday, March 24, 2012

మోహ పా శ మ్మె మేలు సన్మునుల కెల్ల

ఆలు బిడ్డల యెడ ప్రేమ మధిక మగుట
మోహ పాశ మ్మె , మేలు సన్మునుల కెల్ల
నియమ నిష్ఠలు సన్మతి నియతి కలిగి
మఖ మొనర్చుట జనుల క్షేమమును గోరి .

Friday, March 23, 2012

నందనా నీ కు వేవేల నతు లొ నర్తు

శంక రార్యుని రోగము శమయ జేసి
యాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
పూర్వ స్వాస్థ్యము చేకూర్చు శర్వ ! శంభు
నందనా నీ కు వేవేల నతు లొ నర్తు .

చిరు లత యె రావి చెట్టును చీ రి యణ చె

చిరు లత యె రావి చెట్టును చీ రి యణ చె
కలి యు గంబున నయ్యది కలుగ వచ్చు
పుట్ట చీ మలు బారినై గిట్టు పాము
ఇంత నింతలు జరుగును వింత లెన్నొ .

Thursday, March 22, 2012

ఉత్తరమున భాను బింబ ముదయం బాయెన్

చిత్తుగ మేఘము వీడెను
ఉత్తరమున , భాను బింబ ముదయం బాయెన్
నత్త రి తెల తెల వారగ
దుత్తను జేబూని వెడలె దుగ్ధము దేవన్ .

Wednesday, March 21, 2012

నందన సంవత్స రమ్మ ! నవ్యత నిమ్మా !

నందుని నందను సోదరి !
చిందర గా నుండు నాదు జీ వితము నకున్
సుందర సొబగులు దోపగ
నందన సంవ త్సరమ్మ ! నవ్యత నిమ్మా !

Tuesday, March 20, 2012

పట్టు లక న్నిటికి పెద్ద పరమా త్ముండౌ

పట్టులు పరి పరి విధములు
పట్టులె యన యాయు పట్టు పరి కింపంగా
పట్టులు విడుపులు సహజము
పట్టుల కన్నిటికి పెద్ద పరమా త్ముండౌ .

Monday, March 19, 2012

పండు వెన్నెల లివె యమావాస్య గురిసె

పెద్ద వారిండ్ల జరిగెడు పెండ్లి కొఱకు
వీధివీధుల దీ పాలు వెలుగు లీన
కళ్ళు మిరిమిట్లు గొలుపంగ కాంతులొదవ
పండు వెన్నెల లివె యమావాస్య గురిసె .

Sunday, March 18, 2012

కలను దలచి హృదయ కమల మల రె

చిత్ర సీమ కేగి చిత్రంబు నొకదాని
చూడ ముచ్చ టుం డె చూచు కొలది
రేయి నిదుర వోవ తీ యని కల గాంచి
కలను దలచి హృదయ కమల మల రె .

రాజి తమ్ము రాజ పూజి తమ్ము

కాల నేత్రు విల్లు కనక మణిమయ వి
రాజి తమ్ము , రాజ పూజి తమ్ము
జనకు నింట నుండు జగదీ శు హరివిల్లు
ఎక్కు పెట్టె రాము డొక్క డేను.

పుండు సతిని గాంచి మోద మొందె

శశి ధరుండు భవుడు సాంబుడు మదన రి
పుండు సతిని గాంచి మోద మొందె
దక్ష య జ్ఞ లయము దాక్షా య ణి కతన
వంద నీయు డెపుడు భవుడు మనకు .

Friday, March 16, 2012

పాడు లోకము రాముని ప్రస్తు తించు

రామ నామము రమ్యము రక్తి యుతము
నామనంబున నుండుమా రామ యనుచు
భక్తి మీరగ నొడలెల్ల పరవశించి
పాడు లోకము రాముని ప్రస్తు తించు

Thursday, March 15, 2012

పాపులు దివి కేగి రయ్య ! భర్గుని గరుణన్

శాపంబుల బాలగు దురు
పాపులు , దివి కేగి రయ్య ! భర్గుని గరుణన్
తాపస వర్యుల శ్రేణులు
పాపంబులు సేయ కునికి వరమది ప్రజకున్.

అర్ధ నారీ శ్వ రుండ య్యె యాఛ కుండు

అర్ధ భాగంబు నందున నాలి యుంట
అర్ధ నారీ శ్వ రుండ య్యె , యాచ కుండు
దినము దినమును బలు మార్లు దిరుగు చుండి
భిక్ష మెత్తుకు బోషించు బిడ్డ నవని .

Wednesday, March 14, 2012

వనితలకు భూష ణంబు వయ్యంది యగున్

సిగ్గు వినయంబు నడకువ చిలిపి తనము
వనితలకు భూష ణంబు , వయ్యంది యగును
పెండ్లి వయసులు గల యట్టి బిడ్డ లౌర
యింటనుండిన నెత్తిన నెంతొ బరువు .

Tuesday, March 13, 2012

భారతంబును బొంకని బలుక దగును

సకల శాస్త్రము లొ డ బోయుసార మండ్రు
భార తంబును , బొంకని బలుక దగును
ననెడుమాటలు బూటక మగును సుమ్ము
వేద భగవాని పంచమ వేద మదియ .

Monday, March 12, 2012

కంచి గరుడ సేవ మంచి దగును

నిరుప యోగ మైన నేతల సేవించ
కంచి గరుడ సేవ , మంచి దగును
భక్తి శ్రద్ధ గలిగి పరమేశు సేవించ
భుక్తి ముక్తి దొరకు భువన మందు .

Sunday, March 11, 2012

ధార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పధము

ధర్మ హీనులై యుండిరి ధరణి లోన
ధార్త రాష్త్రులు , నడచిరి ధర్మ పధము
పాండు సూనులు తమకెన్ని బాధ లొదవ
నంద నందను ననిశంబు నమ్ము కొనిరి .

Friday, March 9, 2012

రాముడిచ్చెను సీతను రావణు నకు

రాము డిచ్చెను సీతను రావణు నకు
ననగ నేటికి ? రావణు డ పహ రించె
మాయ వేషంబు దాల్చియు మాయ జేసి
మాయ లెం త యొ కాలంబు మనగ లేవు .

దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు

దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు
ఆహ ! యేమి యీ బలుకుల నాల కించ
చెవుల బూ వులు వరుసంగ చిదుముకొనగ
నవస రంబగు నియ్యె డ యయ్య ! మనకు

కన్న వారలు క్రూరులు కటినులు గద

శాంత రూపులు సౌమ్యులు సద్గు ణు లును
కన్న వారలు , క్రూరులు క టినులు గద
అత్త మామయు మరిదియు నాడబడుచు
మూర్ఖ చిత్తులు క్రూరులు మొండి వారు

Thursday, March 8, 2012

మహిళను దూషించు వాడు మాన్యుడు జగతిన్

మహిలో నాశన మొం దును
మహిళను దూషించు వాడు , మాన్యుడు జగతిన్
మహిళల యున్నతి గోరుచు
మహిళల బ్రేమించు వాడు మదిలో నెపుడున్ .

హీ నునకు నమస్క రింతు నెపుడు

ఊ త నిత్తు నెపుడు చేత నైనంత లో
హీ నునకు , నమస్క రింతు నెపుడు
పారి జాత ప్రభుని పాద పద్మములకు
మలిన రహిత మైన మనసు తోడ .

Wednesday, March 7, 2012

వనితకు వందనము సేయవలె సద్భ క్తిన్

వనితే జాతికి రత్నము
వనితే కద! మూల మసలు వంశము కొరకున్
వనితే ముఖ్యము సృష్టికి
వనితకు వందనము సేయవలె సద్భ క్తిన్ .

Tuesday, March 6, 2012

నీతి లేని వారె నేత లైరి

నీతి లేని వారె నేత లైరి యనుట
మంచి గాదు నెపుడు మనకు నరయ
నీతి మంతు లైన నేతలుం గలరయా
వల్ల భాయి నేత వంటి వారు

చోరుని గని సంత సించి సుందరి పిలిచెన్

చౌర్యము సేయుట తప్పని
చోరుండే జెప్ప నమ్మె సూనృత మనియున్
చౌర్యము చేయగ వచ్చిన
చోరుని గని సంత సించి సుందరి పిలిచెన్

Monday, March 5, 2012

నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

తడబడు నడకలు గలిగిన
బుడతడు వేవేగ నడువ బోర్లా పడగన్
గడు సంతస మొప్పారగ
నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ .

తొండ పలక రించె తుండంబు పైకెత్తి

మూగ జీవి నోరు పెగలక పోయిన
బావి లోన నుండు మనుజు జూచి
తొండ పలక రించె , తుండంబు పైకెత్తి
గజము ఘీంక రించె గడగడంగ

Sunday, March 4, 2012

కమల బాంధవు డే తేర గలువ విచ్చె

పుచ్చ వెన్నెల మఱి పించె పుడమి మీద
కమల బాంధవు డే తేర , గలువ విచ్చె
చంద మామను గనుగొని సంత సమున
ప్రీతి పాత్రుల కలయిక ప్రీతి గాదె !

Saturday, March 3, 2012

కోతి కూత కూసె గోడి వలెనె

కోడి కూత కూసె గోడి వలెనె నట
కాల మహిమ లయ్య! కాద యిదియ ?
ఒకరి మాట లొకర యోలి పలుకు చుంటి
రికద! వింత లేదు నికను మనకు .

తల్లి మాట వినుట తప్పు గాదె .

తల్లి మొదటి గురువు తల్లి దైవంబును
తల్లి మాట వినుట తప్పు గాదె
తల్లి దండ్రి యెడల దయ తోడ మసలుచు
తల్లి సేవ చేసి తరియు మన్న !

Thursday, March 1, 2012

పార్ధ సారధి రణమున పరుగు లిడెను

కదన రంగాన దానయై కాను పించ
పార్ధ సారధి ,రణమున పరుగు లిడెను
శత్రు సేనలు నందరు చకితు లగుచు
దైవ లీలలు దెలియగ దరమె మనకు ?

శివుని పూజ సేయ పోవు సిరులు

మోక్ష మొందు నరుడు మూర్ఖుడు నయ్యును
శివుని పూజ సేయ , పోవు సిరులు
భక్తి , శ్రద్ధ లేక భజనలు సేసిన
పరమ పదము నొంద భక్తి మేటి .

కలుషముల బాపు గంగయే గరళ మయ్యె

ప్రాణ హానిని జేయును వడిని మునుగ
కలుషముల బాపు గంగయే , గరళ మయ్యె
మత్తుమందును గలిపిన బర్రి పాలు
పాలు త్రాగెడు పిల్లల పాట్లు గనుము .