Sunday, May 6, 2012

శ్ర ద్దాంజలి

౧. లేవు లేవ మ్మ !యి కమాకు లేవు నీవు
ఎచటి  కేగితి వోయమ్మ ! యి పుడు నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

౨. చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు
తల్లి నీవయ, మరియును దండ్రి వీ వ
మరువ జాలము నెన్నడు మరువ లేము

౩. జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి
యు న్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ !! చూతుమ యొ కపరి  యైన రమ్ము
పున్నె యింతి గ నీ రాక ముదము మాకు .

౪. ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు
నాన్న  కూడను  నిందుకై  నగవు తోడ
సాయ బడుదురు కదయమ్మ  శ్రద్ధ కలిగి



5. అమ్మ ప్రేమను బంచిన యమ్మ  యీవు
మరువ జాలము నిన్ను మే  మరువ లేము
మాయ రోగము వచ్చి నిన్మడియ జేసె
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

6. ఆశ లేదమ్మ ! నీ కిల యాశ లేదు
ఉన్న దానితొ సంతృప్తి నొంది తీవు
సాటి రారమ్మ యె వరును సాటి రారు
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .


నీవు కూడను వారికి నేస్త మైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు సాయి .

8 అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
ఆదు కొందురు నమరులు హాయి గుండు .

9, చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయను సమ్మతించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీదు నాత్మకు శాంతిని నించు  గాక !

10. మగని సేవకు నంకిత మైతి వీవు
బ్రతికి నన్నాళ్ళు , సంసార బంధ మౌర
గుండె పీ డించి యెముకల గూడు చేసె
అందుకొను మమ్మ ! శ్రద్ధాంజ లందు కొనుము .

అశ్రు పూర్వక నయనాలతో ...........
రాజా
బిందు
సౌజి





No comments:

Post a Comment