Thursday, November 28, 2013

యముని సదనంబు గలదట యవని యందు

ఎన్ని చోటులు వెదకిన  నన్ని చోట్ల
యముని సదనంబు గలదట యవని యందు
రక్షకులము గా  బఱగుచు  శిక్ష వేయు
గీ ములే యా య  మునిసద  నమ్ము లండ్రు 

Wednesday, November 27, 2013

ఫల శతము నొసంగె జీ ర్ణ పాదప మౌరా !

పలవలు గలిగిన మామిడి
ఫల శతము నొసంగె జీ ర్ణ పాదప మౌరా !
బల హీ న మగుట   వలనన
జలమును సరి బీ ల్చలేక  చావగ నుండెన్
 

గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదుల ట

గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదుల ట
వింటి రేయిది  యెచ టను ? వింత గొలిపె
గొడ్డు రాలికి పుడమిని బిడ్డ లుంట
యరయ కలికాల మాహాత్మ్య మగును సుమ్ము 

Tuesday, November 26, 2013

తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

తాతల తరములు గడిచెను
మాతరములు గూడ  గడువ మార్పులు గలుగన్
ఈ తరపు  కుటిల జగమున
తాతకు నేర్పును మనుమడు  దగ్గెడి  విధమున్
 

Sunday, November 24, 2013

తనివి గల్గించె రాముడు దానవులకు

యాగ రక్షణ  గావించి యా మునులకు
తనివి గల్గించె రాముడు , దానవులకు
మోక్ష మిచ్చెను సంహారము జరిపి మఱి
దైవ మెప్పుడు భక్తుల గావ యుండు 

Saturday, November 23, 2013

కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత

కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
యగుపడును మఱి  భూతద్ద మందు జూడ
ఒక్క కడపయే కాకుండ   యెక్క డైన
నటులె  గన్పడు నిజమిది  యార్య ! యౌన ?

Friday, November 22, 2013

పూలవా నకు శిరమున బుండ్లు రేగె

పూలవా నకు శిరమున బుండ్లు రేగె
నెంత చిత్రము ? మీ పలుకెంత గానొ
నవ్వు దెప్పించె  నోసామి ! నాకు మిగుల
రాళ్ళ వానకు శిరములు  రగులు గొనును


పూల  వానకు శిరమున బుండ్లు రేగె
పూల వానకు మఱియును  పూల రహిత
వాన పడినను రేగును వరుస పుండ్లు
వాన దెబ్బకు నటులగు వారి జాక్షి !

Thursday, November 21, 2013

గాంగేయుడు పెండ్లి యాడి కనె సత్సుతులన్

రంగాచారికి గల దొక
మంగా యను బేర నొప్పు  మంచి దుహితయున్
అంగన  యందము మెచ్చీ
గాంగేయుడు పెండ్లి యాడి కనె  సత్సుతులన్ 

Wednesday, November 20, 2013

చెంప మీద గొట్ట సిరులు గురియు

పళ్ళు రాలిపోవు  పటపట యనుచును
చెంప మీద గొట్ట , సిరులు గురియు
శ్ర ధ్ధ  భక్తి గలిగి  శంభుని బూజించ
 మారు మాట లేదు  మాధవుండ !

Monday, November 18, 2013

పాపాలను జేయునతడు పరమేశ్వరుడే

పాపిగ బిలువబడును మఱి
పాపాలను  జేయునతడు ,పరమేశ్వరుడే
పాపుల రక్షణ జూచును
పాపియె  మఱి  భక్తుడయిన  పట్టున నెలమిన్ 

విప్ర వరుడు మాంసమ్ము తో విందొ సంగె

సంధ్య వార్చును మానక  శ్ర ధ్ధ తోడ
విప్ర   వరుడు ,మాంసమ్ము తో  విందొ సంగె
పెండ్లి రోజున సోముడు ప్రియము గలుగ
మేలు మేలనుచు దినిరి  పాళె గాండ్రు

 

Sunday, November 17, 2013

బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి !

కోప గించుకొనక  కూరిమి దోడన
పూరణలను సరిగ బూర్తి జేయు
శంక రార్య ! నిన్ను శంకించ దగు జెడు
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి !

Saturday, November 16, 2013

ఆ శీ స్సులు(చి .  ప్రవీణ్ -శ్వేతల  వివాహము సందర్భముగా )

1. రాపాక వంశ భూషణ !
   యే పుణ్యము జేసినావొ  యే జన్మలలోన్
   ఈ పావన వంశం బున 
   నేపారుగ  బుట్టు కతన  నీవు ప్రవీణా !


2. వరుడు పుట్టెను  రాపాక వారి యింట
    వధువు జన్మించె  నంగు లూర్వారి యింట
    వరుని పేరు మఱి ప్రవీణు  వధువు శ్వేత
    అంద చందాల సరి వోయి రాలు మగలు


3. ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
    అగ్ని సాక్షిగ నొకటిగ  నగుట కొఱకు
   వేచి యుండిరి యిరువురు వినయముగను
   వరలు  కళ్యాణ ఘడియలు  వచ్చు వరకు


4. కల కాలము మీ రిద్దరు
   కలసి మెలసి జీ వితమును గడుపుచు పతి ప
   త్నులు మిత్రులు గా కష్టం
   బుల సుఖముల  దోడ యి  శుభముల  నంద వలెన్

అమ్మా ! శ్వేతా !


5. ధరణి  యీ ప్రవీ ణే నీ కు   దగిన  భర్త
    ఎదురు  చెప్పక వానికి నెపుడు నీ వు
    పాలు నీరును  బోలుచు బ్రదుకు చుండి
   మంచి గృహిణిగ   బేరొం దు  మనుజు లందు


6. అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగి !


7.  సకల  శుభములు గలిగించు  శంక రుండు
     ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
     కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత
    ఎల్ల  వేళల మిమ్ముల  చల్ల గాను
   

రచన ; పోచిరాజు సుబ్బారావు

 

కార్తికమ్మున వచ్చు నుగాది మనకు

కలుగు పుణ్యము మునుగంగ  గంగ లోన
కార్తికమ్మున , వచ్చు నుగాది మనకు
చైత్ర మాసాన పాడ్యమి  సై యనంగ
మాసముల కెల్ల  ముఖ్యము  మార్గ శిరము 

Sunday, November 10, 2013

సత్య దూరము గద హరి శ్చంద్రు గాధ

మిన్ను నేకమౌటను మఱి  మన్ను తోడ
సత్య దూరము గద, హరి శ్చంద్రు గాధ
సత్య వంతుల కయ్యది సాటి యగును
జయము సాధించు నెప్పుడు సత్య మార్య !

Friday, November 8, 2013

వెన్నతో బెట్టిన విద్య

దొంగ తనములు సేయుట  దొంగకు మఱి
వెన్నతో బెట్టి నటువంటి విద్య యౌను
గట్టి శిక్షకు గురియౌను బట్టు వడిన
దొరక కుండిన నికయగు దొరయె సుమ్ము 

సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్

ఆ హా ! యేమని జెప్పుదు
నా హిమగిరిసుత గరుణన నారంభించిన్
బీహారు నగర మందలి
సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్ 

Thursday, November 7, 2013

కర్ణుడు సుయోధనుని జంపె గదన మందు

కుంతి  సూర్యుల  పుత్రుడు  కువలయాక్షి !
కర్ణుడు, సుయోధనుని జంపె గదన మందు
భీమసేనుడు గదతోడ భీకరముగ
కొట్టి  దొడ మీద  గిలగిల గొట్టు కొనగ 

Monday, November 4, 2013

దీపము నార్పగ గృహమున దేజమ్మెసగన్

పాపము  గదమఱి  గుడిలో
 దీపము  నార్పగ, గృహమున దేజమ్మెసగన్
దీపాల వెలుగు లీ నెను
దీపావళి నాడు మిగుల దేదీ ప్యముగాన్

Sunday, November 3, 2013

కందు కూరి వీ రేశ లింగము ఖలుండు

సంఘ సంస్కర్త గా నెఱు గంగ వలయు
కందు కూరి వీ రేశ లింగము , ఖలుండు
దుష్ట బుద్ధిని  మెలగుచు  దురితములను
చేయు చుండును నిర తము  చెప్ప లేని

Saturday, November 2, 2013

ఆ శీ స్సులు

పుసులూరి వంశ  మండన !
పసగల మొనగాడ  వార్య ! పావన కృష్ణా !
మిసమిస లాడుచు నుంటివి
వెసనౌ ప్రశ్నార్ధ కంబు  విరమణ  మాటల్ .


తనర హనుమాయి నీకిల  దగిన  భార్య
యగుచు  కంటికినే  రెప్ప  యైన విధము
ఎల్ల  వేళల మీ బాగు నినుమ డించ
శ్రధ్ధ జూపును నిజమిది సజ్జ నుండ !


నీ దు  మాటయే ప్రజలకు వేద వాక్కు
నిన్ను నమ్మిన వారికి నీడ నిచ్చి
యాదు కొందువు  నిక్కము  సాదరముగ i
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?
  

పదవి విరమణ తప్పదు  ప్రతి యొకరికి
చింత గూడదు దానికై  సుంత యైన
చీకు   చింతలు  లేకుండ  శేష జీవి
తంబు సాగించు   కృష్ణయ్య ! తనర   యీవు


పదవి విరమణ యీ రోజు పరమ పురుష !
చింత నొందక మఱి నీవు  శివుని మదిని
స్మరణ జేయుచు గడుపుము జరము దనుక
ముక్తి  గలుగును దప్పక  ముదము గలుగ సకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య  సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

( ది  .30-11-2013 తేదీ న   కృ ష్ణయ్య గారి పదవీ  విరమణ  సందర్భము గా }

రచన ; పోచి రాజు   సుబ్బారావు