(చి . ప్రవీణ్ -శ్వేతల వివాహము సందర్భముగా )
1. రాపాక వంశ భూషణ !
యే పుణ్యము జేసినావొ యే జన్మలలోన్
ఈ పావన వంశం బున
నేపారుగ బుట్టు కతన నీవు ప్రవీణా !
2. వరుడు పుట్టెను రాపాక వారి యింట
వధువు జన్మించె నంగు లూర్వారి యింట
వరుని పేరు మఱి ప్రవీణు వధువు శ్వేత
అంద చందాల సరి వోయి రాలు మగలు
3. ఒకరి కొఱకునై మఱి యొక రుద్భ వించి
అగ్ని సాక్షిగ నొకటిగ నగుట కొఱకు
వేచి యుండిరి యిరువురు వినయముగను
వరలు కళ్యాణ ఘడియలు వచ్చు వరకు
4. కల కాలము మీ రిద్దరు
కలసి మెలసి జీ వితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులు గా కష్టం
బుల సుఖముల దోడ యి శుభముల నంద వలెన్
అమ్మా ! శ్వేతా !
5. ధరణి యీ ప్రవీ ణే నీ కు దగిన భర్త
ఎదురు చెప్పక వానికి నెపుడు నీ వు
పాలు నీరును బోలుచు బ్రదుకు చుండి
మంచి గృహిణిగ బేరొం దు మనుజు లందు
6. అమ్మ నాన్నల విడిచియు నరుగు దేర
బెంగ యుండును నిజమిది బేల ! నీ కు
అత్త లోనన జూడుమ యమ్మ నికను
కుదుట పడునమ్మ మనసునీ కోమ లాంగి !
7. సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను
రచన ; పోచిరాజు సుబ్బారావు
No comments:
Post a Comment