Thursday, August 31, 2017

తరువులన్ రక్ష సేయుట తగని చర్

తరువు మూలాన లాభాలు  దండి గలుగ
తరువులన్ రక్ష సేయుట తగని   చర్య
యనుట నుచితమే ?మీకునో యమ్మ ! యరయ
పెంచ వలయును వాటిని నంచితముగ


ఆడ మగ,పిన్న పెద్దల యంద రిపని
తరువులన్ రక్షసేయుట ,తగనిచర్య
యాకు పిందెలు గాయలయలరినట్టి
కొమ్మ నరకుట యేరికి సుమ్ము సామి!

Wednesday, August 30, 2017

గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్

గురువారంబును బిలుతురు
గురువారమె యనుచు జనులు కోమలి ! యవునా ?
నరయగ నేలకొ  మిత్రుడు
గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్

 గురువారంబునసాయిని
గురుతరమగుభక్తితోడ గొలుతురు జనముల
ల్లిరవుగ మనమును బోదమ?
గురువా! రమ్మనిపిలువగ గుపితుండయ్యెన్

 నరకాసురసంహారము
కరమునుసంతసముతోడ గావించిరట
న్నరయుదముమనము సైతము
గురువా!రమ్మనిపిలువగ గుపితుండయ్యెన్

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి




 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వసైన్యాధిపత్యంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!




[

Tuesday, August 29, 2017

సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా

సరసుండగు నొక పెనిమిటి
కరమున నొక చన్ను దాచి కాంతను బలికె
న్నరసితె  భామా ! యిపుడీ
సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా

Monday, August 28, 2017

గాజులు గల్లుగల్లనగ గవ్వడి గాండివ మెత్తె గృద్దుడై

ఆజిని శత్రు సైన్యములనందరి పీకలు గత్తిరించగా
రాజుల భార్యలున్స మర ప్రాంగణ మందున నేడ్వ నత్తఱిన్
గాజులు గల్లుగల్లనగ గవ్వడి గాండివ మెత్తె గృద్దుడై
వాజిని వేగవంతముగ బర్వులు బెట్టగ జేసె నయ్యెడన్

గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్

ఆజిని నుత్సాహంబున
రాజుల గర్వo బు  లుడుగ రహితో జెలగన్
రాజుల పత్నుల హస్తపు
గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్

Sunday, August 27, 2017

ద్రౌపది మెడలో గృష్ణుఁడు తాళి గట్టె

తాళి గట్టిరి  పాండవుల్దల్లి చెప్ప
ద్రౌపది మెడలో, గృష్ణుఁడు తాళి గట్టె
సత్య భామమొద లుగాగ సతుల కార్య !
యష్ట మహిషుల బేరన నాఖ్యు లైరి

Saturday, August 26, 2017

వరమే పదితలలవాని ప్రాణము దీ సెన్

వరములు శివుడే  యీయగ
గరువముతో సురల మునుల గాసిలి వెటుచున్
పరకాంతా మోహపు కా
వరమే పదితలలవాని ప్రాణము దీ సెన్

Friday, August 25, 2017

పార్ధ సారధి పరిమార్చె బాండవులను

శి ష్ట రక్షణ కొఱకునై దుష్ట జనుల
బా ర్ధ సారధి పరిమార్చె  బాండవులను
గంటికిని ఱెప్పయటు లను  గాచి యెపుడు
పక్ష పాతిగ బే రొం దె బాండ వులకు


ఎలుక వడకెవి నాయకు డెక్కుననుచు

ఎలుక వడకెవి నాయకు డెక్కుననుచు
మూషికపువడ కుసహజ ముగద యరయ
యంట బరువుగ ల్గునతని  వింతగాదె?
మోయ నేరికై ననుధర మురళి! చెపుమ!

సూర్యా!

కెరటాలవోలె సాగెను
కరమునుసౌందర్యమొప్ప కవనము సూర్యా!
యరసితి మాశుభవాక్యము
మురిపెముతో మీకునిత్తు మోదక శతముల్

Wednesday, August 23, 2017

రామ భద్రునకు న్ ధర్మ రాజు సుతుడు

రామ భద్రునకు న్  ధర్మ రాజు సుతుడు
పొసగునే యిది పుడమిని పుణ్య చరిత !
వేరు  వేరైన యుగములు  వారివికద
చింత జేయగ  మనకిది వింత గొలుపు

Tuesday, August 22, 2017

పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

పాలన భాగము తెనుగున
పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్
బా లీయని  తన జనకుని
చాలరు పోషింప భువిని సంతృప్తిగగన్

Monday, August 21, 2017

హింసకు బాల్పడెడివాడె హితమును గూర్చున్

కంసుని సోదర తుల్యుడు
హింసకు బాల్పడెడివాడె, హితమును గూర్చున్
గం సారి నెల్లవేళల
శం సనమున్ జేయు నెడల సాత్విక బుధ్ధిన్

మానవుడే దానవుడు నుమాధవుడయ్యెన్

కానని దౌష్ట్యము జేసెడు
 మానవుడే  దానవుడు, నుమాధవుడయ్యె
న్నానగరాజు దుహిత నట 
గానగనే మరులు గొనగ గా రణ మగుటన్

Friday, August 18, 2017

మత్తు మందు సేవించుట మంచిదె కద

మత్తు మందు సేవించుట మంచిదె కద
మంచి దెన్నటికినిగాదు మత్తు మందు
హేయమైనది సేవన మార్య ! నిజము
దాని జోలికి బోయిన దారితప్పు

Thursday, August 17, 2017

గురువుల పదసేవ జేయ గూడదు శిష్యా !

నిరతము జేయుటవ శ్యము
గురువుల పదసేవ, జేయ గూడదు శిష్యా !
గురుపత్నిని మోహించుట
నెరపుమ యీరెండు నీవు నిరతము భువినిన్

Wednesday, August 16, 2017

విజయ సారధి జన్మించె విపిన మందు

కటిక చీకటి గలయట్టి ఖైదు లోన
విజయ సారధి జన్మించె, విపిన మందు
జంతు జాలము వసియించు వింత గొలుపు
రకరకంబుల గూతల  రవళి తోడ

Tuesday, August 15, 2017

కాముడు వెన్నెనలు గురిసె గంతుడు మెచ్చన్

కాముడుగంతుడు నొకరే
కాముడు వెన్నెనలు గురిసె గంతుడు మెచ్చన్
 గాముడు వెన్నెల గురియగ
నేమీ కంతుండు మెచ్చె నెట్లుగ సామీ!

అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఛందస్సు- తేటగీతి స్యస్తాక్షరములు... మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ' రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం' మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర' నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'ము'

స్వర్ణ మయముగ జేయంగ సాహసించి
యరుల తంత్రాలు పసిగట్టి యడ్డువైచి
వాహబహువిచి త్ర ముగను  వరములిచ్చి
మోడి వర్యులు  బ్రజలకు ముదము గూర్చెg

Sunday, August 13, 2017

కుంతీ పుత్రుడు ,వినాయకుడు గద శిష్యా !

వింతగ బుట్టిన కొమరుడె
కుంతీ పుత్రుడు ,వినాయకుడు గద శిష్యా !
కంతుని శత్రువు కొడుకే
వింతేమీ లేదురమ్య! వివరణగోరన్

Saturday, August 12, 2017

ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే

ద్రోహులు భువి శిక్షార్హులు
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే
బాహాటముగా జెప్పుదు
దోషుల శిక్షించుట దియ తోరము మేలే


Friday, August 11, 2017

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
నెందు లకుదగ  దు చనగ ? నెప్పు డైన
మిమ్ముల  నవ మానించె నా ? మిక్కిలిగను
గాని యెడల నే గుట బాగు  గాదలంతు

దత్తపది ;;;వడ -పూరి -గా రె -అరసె రామాయణార్ధము

వడవడ రాళ్ళను వేయగ
గడునరసెనుగపులుగారెగణగణమనుచున్
 వడిజలములుబూరించుచు
వడివడిగాగోతులన్నివారధిగట్టెన్

Wednesday, August 9, 2017

జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో

జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
జారులలో గనంబడెను శారద మాతయె వారికప్పుడున్
బారము పొందగోరి యట భక్త జనంబులు మ్రొక్కి రయ్యెడన్
గోరిన వాంఛలన్  భువిని గూరిమి దోడన దీర్చు నామెయే

Tuesday, August 8, 2017

రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె

రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె
రూపసిని జూచినట్టి కురూపి యేడ్చె
రూపసికి యందము దనకు రూపులేమి
తనరు గుణము ప్రధానమందమును గంటె

Monday, August 7, 2017

భారతమువ్రాసి,వాల్మీకివాసికెక్కె

వాసికెక్కిరిముగ్గురుపండితులిల
భారతమువ్రాసి,వాల్మీకివాసికెక్కె
రామచరితమురచియించి రమ్యముగను
సంస్క్రుతంబున జక్కటి శబ్దతతిని

Sunday, August 6, 2017

నవమి నాడు ర క్షా బంధనమ్ము వచ్చు

వచ్చు రాముడు పుట్టినబ్రముఖ దినము
నవమి నాడు ,ర క్షా బంధనమ్ము వచ్చు
తిథియ శ్రావణ పూర్ణిమ దినము నాడు
ముఖ్య మైనట్టివే యవి మురళి !మనకు

Wednesday, August 2, 2017

మాధ వుడే కీర్తి నందె మదనాంతకుడై

బాధితుల కండ నగుచును
మాధ వుడే కీర్తి నందె , మదనాంతకుడై
గాధల యందున మిగులను
మాధవుగావాసికెక్కె  మనకందఱకున్

Tuesday, August 1, 2017

కాంతుడులేనివేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో

కాంతుడులేనివేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో
కాంతుని చేష్టలే మనసు గ్రమ్మగ మాటికి నవ్వెనేమొసూ
కాంతునిధ్యాసయే గలుగు కాంతుడుదూరమ యైనచోగదా
కాంతలకెప్పుడున్మదిని కాంతుడె యుండును దండ్రిగంటెనే