Wednesday, March 21, 2018

దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"

దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"
స్నిగ్ధమ నంబుతో నరయనేదియు గాదుగనబ్బురమ్మహో
దుగ్ధము జిల్కగా వెడలె దోరము గామృత జీవరాసులే
దగ్ధము లైపయో ధినట తోరముగాగను రేగెదు మ్ములున్

ఏమి పాపము జేసితి నేమొ కాని

ఏమి పాపము జేసితి నేమొ కాని
యాసు పత్రిబా లయితిని నక్క టకట
యెన్ని మందులు ,సూదుల నెన్నతరమె!
వేడు కొందును గావంగ విశ్వ విభుని

"దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ

దేవ దానవు లిరువురు దీక్షతోడ
నమృత ముకొరకు పాలసం ద్రమును జిలుక
"దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ
కల్ప వృక్షము లాదిగా గాకయికను

Tuesday, March 20, 2018

కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"

కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
వేడుక యాయెగా నదియవేవురి నోటను ,పాడియే వినన్
 కోడియ మాంసహా రముగ,కూడుగ జేయుట  ధర్మమా ? కనన్
 కోడిని  బ్రాహ్మణే తరులు గోరుచు తిందురు సత్యమే గదా!

కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

మాడునకేదోలోపము
వాడుకలోమిగులరాగవైద్యులు సెప్పన్
 జేడియతావండీ యగ
కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"

Monday, March 19, 2018

దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"

కావలిలో నుద్యోగము
పావనుడారంగనాధుభజియించుటకున్
దేవుళ్ళమ్మా! నాపతి
దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"

Sunday, March 18, 2018

dhk

అర్ధ సహితపు పద్యమ్ము జదువ దెలిసె
తెలియ నటువంటి పదములుచాలయుండె
మారు మూలనగలయట్టి మాండలికపు
పదముల నేనేరితెచ్చు మహితుడవుగదా

టడఝణ

పతియగు రాఘవ నాయుడు
ప్రతిదినమును మందు కొట్టి పరుషము లాడ
న్సతియగు లక్ష్మీకాంతము
పతినే మనసారనమ్మి  బాధలనొందెన్

జఝణుణధ

ఓవి ళంబి వత్స రంబ!జయ మునీకు
మనువునొందుదిలను మనుజులైన
మాక ష్టముల లెల్లపరిమార్చి ్మేలు నిమ్ము
మాడి సెంబరుండు మమతపంచి
వంద నంబు లిచ్చు వందలాది

ఛజీణూవ

ఓవి ళంబి వత్స రంబ!జయ మగుగాక
మాక ష్టముల లెల్లపరిమార్చి మేలు నిమ్ము
మాడి సెంబరుండు మమత పంచి
వంద నంబు లిచ్చు వందలాది

Wednesday, March 14, 2018

ఠఝీనుై

బంభర వేణియున్మరియుబాదపపుష్పపు సౌకుమార్యమున్
దంభము లేశమాత్రమయినదానొడగూడకయుండునా
రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్
శంభుని జాపమున్విరుగసారెనులాగ ఫెళ్ళనంగగన్

fjkk

డింభక! నలకూబరుడే
రంభనుబెండ్లాడెను,రఘురాముఁడు ప్రీతిన్"
శంభుని ధనువును విరిచియు
రంభయు,సీతమ్మసతిని రహిచే పట్టెన్

Tuesday, March 13, 2018

చడుముశ

సుందరియేడ్వసాగెనటజోరుగవచ్చినశీతలంబుచే
నందమునాశనమ్మయినదంచు,గడున్ముదమందెనాతియే
యందముదానుగాదనకుసంభవమౌటకునెంతయోమది
న్నందమె కాదెయింతులకునాహ్లదమొందగ జేయునీనిలన్

తదీముక్షళ



మంచుపడుటవలనమామిడికాయలు
రాల,వండిపెట్టెరమణిరుచిగ
పప్పు చేసి పతికి పరమసం తసముగ
బేవుమనగ తినెను బ్రీతితోడ

చఝీనశళ

సుందరిమిగులన్వగచెను
నందముచెడిపోయెననుచు,నతివయెమురిసె
న్నందముగలదాననగుచు
నందమెకదమనిషిమిగులనాకర్షింపన్

Monday, March 12, 2018

చఝుమూళ

పావనియైనసీతనటపాపుడుక్రూరుడునెత్తుబోయెనా
రావణుడంతరాముడయిరావణుజంపెరణమ్మునందునన్
 బావనమైనవంశమునబ్రాభవమొందియుమేరువీరుగన్
 బేర్వడిభూతలంబునలవేయివిధంబుల గీర్తినొందెగా

ఠఢఞశ

ఆవనవాసికిశత్రువు
రావణుడే,రాముడగుచు రావణుజంపెన్
 శ్రీవిభుడేనరుడైభువి
బావని యాసీతకొరకు ప్రమదులు మెచ్చన్

Saturday, March 10, 2018

టజీణువూహ

ఆజిని కౌరవుల్మరియుపాండవులెల్లరు మార్కొనంగగా
రాజుగనొప్పుదుష్టకురురాజు రణంబునజంపె భీమునిన్
 మాజవరాలులేపగ నుమాపటివేళనుగన్నయీకలన్
 శ్రీజకుజెప్పగావినుచుజెప్పుమ యింకను వింతలన్ననెన్

ఠఢీనుశ

తోయజాక్షి!వినుము దుష్టుడా కురురాజు
భీకరముగజంపెభీమసేను
ననుచుగలను గంటి యచ్చెరు వాయెను
నెట్లువచ్చెనట్లు నిద్దినమున

Friday, March 9, 2018

జూదమాడువారు సుజనవరులనుచు

జూదమాడువారు సుజనవరులనుచు
గవివరేణ్యులిడుటకాదుమంచి
జూదమాడువారుశుంఠలు,వారిని
దరికిజేరనీయుతలపు వలదు

జూదమునాడువారుసరసుల్ సుజనుల్ గదలోకమందునన్

జూదమునాడువారుసరసుల్ సుజనుల్ గదలోకమందునన్
 జూదమునాడువారలిలసౌమ్యులవోలెను నుందురేయిలన్ ?
మోదమునీయరెన్నటికిని ముఖ్యజనంబులు,దోటివారికిన్
 జూదమునాడువారలనుజొప్పడనీయకదూరముంచుమా

Thursday, March 8, 2018

రవిచెప్పెను విష్ణుకధలు రంజిల్లజనుల్

భవబంధము విడనాడిన
దివిజస్థానంబుగలుగు దిరముగననుచు
న్నవిరళపదజాలముతో
రవిచెప్పెను విష్ణుకధలు రంజిల్లజనుల్

Wednesday, March 7, 2018

హనుమంతుడు లంకకేగి యసువులబాసెన్

వినుటకు బాధగ నుండెను
హనుమంతుడు లంకకేగి యసువులబాసెన్
 హనుమంతుడుచంపెనుగద
కనుచుండగరాక్షసాదిఖలులనుననిలోన్

Tuesday, March 6, 2018

చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని జిత్ర మయ్యెడిన్

ఏమని జెప్ప నోపునిక నీకలి కాలమునందు జూ డగా
చీమయె ముద్దులాడె నల శీతమయూఖుని జిత్ర మయ్యెడిన్
భామరొ  దీనిఁజూడగను బాపు య గీచె ను  నట్లుగా జుమీ
చీమల రూపమున్దనరె శీత మయూఖుడు  రోహిణుల్ నటన్

చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను

చీమ ముద్దాడె జంద్రుని జిత్రముగను
బాపు గీచిన చిత్రము భళిర యనుచు
దేలియాడిరి సంతోష ధేనయందు
చూచు వారలా చిత్రంపు చోద్యమునకు

Monday, March 5, 2018

వాసిగ గౌరికాత్మజుడుబ్రహ్మయనంగుడుశౌరికల్లుడౌ

శ్రీసతి లచ్చిమాతకునుశ్రీకరధాముడు విష్ణుమూర్తికిన్
 భాసురమౌ విధానమున బ్రాహ్మణవర్యులుబెండ్లిజేయగా
వాసిగ గౌరికాత్మజుడుబ్రహ్మయనంగుడుశౌరికల్లుడౌ
యాసమవర్తియున్మిగులనార్ద్రతభావమువిల్లసిల్లగన్
   సేసనబ్రాలనన్నిడగశీర్షముపైననువచ్చియుండిరే

గౌరికాత్మజుండు,కమలభవుడు



స్కంద నామ కుండు శతపత్ర శకటుండు
గౌరికాత్మజుండు,కమలభవుడు
జగపు సృష్టి కర్త,శారదాదేవికి
భర్త,పరమ పూజ్యు డార్య! మనకు

Sunday, March 4, 2018

dolm



వీతభయంబుతోడరవి వేవురి సాయముబొందకుండగన్
మాతకుతమ్ముడైనరఘు మామయపంచగనత్తరిన్గన
న్నాతని పంపకాలు కడుయాతన బెట్టెను గ్రామవాసులన్
బాతగ నుండుచిహ్నములుమారుచు గ్రొత్తవికన్పడచ్చటన్

కాలు,కష్ట పెట్టె గ్రామజనుల



చెప్పినట్లుచేయడెప్పుడు మాపాన
కాలు,కష్ట పెట్టె గ్రామజనుల
జిలిపితనము బాటు చేష్టల తోడను
నొకరి పైననొకరి నుసిరి గొల్పి
ప్రత్యుత్తరంతొలగించు

Saturday, March 3, 2018

వచ్చె నుగాదిపర్వమిల, భాద్రపదాన చిగుళ్ళు వేయగన్

అచ్చపు జీకటిన్ బడిన నార్తుల బాధలు దీర్ వచ్చె
నుగాదిపర్వమిల, భాద్రపదాన చిగుళ్ళు వేయగన్చగా ననన్
జెచ్చెర బాలికామణులు శీఘ్రము గాదమ పుస్తకంబుల
న్నిచ్చలు దైవసన్నిధిని నెమ్మిని బెట్టుచు బూజసేతురే

fkl.


నిజమిది నమ్ముడు మీరలు
గజవరదుని బురము నందు గనబడె నిటుల
న్బజరంగ బలుని గృహమున
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

భారతాజిలోగర్ణుండు పార్ధు జంపె

కర్ణుడెవరిని జంపెను గమల!యనుచు
బాఠశాలలో ప్రశ్నించ బదులు సెప్పె
భారతాజిలోగర్ణుండు పార్ధు జంపె
గాదు  పార్ధుడు చంపెను కర్ణు డనిని
దెలిసి కొనుమమ్మ యియ్యది బేల!నీవు

Friday, March 2, 2018

మేమియు నిక జాలి లేద ?యీనా పైన

ప్రేమను గట్టితి నాలయ
మేమియు నిక జాలి లేద ?యీనా పైన
న్నేమీ యిడుమలు సెప్పుమ !
రామా ! నీచే  ఘటిల్లె ప్రార భ్ధమ్ముల్

న్నల్లుడు పుత్రుడున్మగడు నయ్యెను దానొకరుండె చిత్రమే

అల్లదె సోమరాజుగృహమందునబంధముజూడరాశికి
న్నల్లుడు పుత్రుడున్మగడు నయ్యెను దానొకరుండె చిత్రమే
యుల్లము సంతసం బడగ నూరునువాడయు దద్దరిల్లగా
నెల్లరుజూచుచుండగనునిద్దరునొక్కటి యయ్యెరేసుమా

Thursday, March 1, 2018

నల్లుడుమగడయ్యె, నొకడె యది చిత్రంబే

ఉల్లము నందుండిన మే
నల్లుడుమగడయ్యె, నొకడె యది చిత్రంబే
యల్లా యాశిసు లిచ్చెను
నల్లరి మల్లరిగదిరుగు నామనిచెలికిన్