Friday, June 18, 2010

ఆ  పస్తంబ కల్ప వృక్షము

విద్యా వాచస్పతి ,వేద శ్రీ ,విద్వత్ శిరోమణి
బ్రహ్మ శ్రీ తెలకపల్లె విశ్వనాధ శర్మ
-----------------------------------------------------------------------------------------

శకారాతి శాలి వాహనుని శకము ప్రారంభ మగుటకు పూ ర్వమే విక్రమార్కుడు తన సంవత్సరమును ప్రవర్తింప చేసెను .ఆయన తమ్ముడు భర్తృహరి నీతి, శృంగార ,వైరాగ్య శతకములు అని ప్రపంచ ప్రఖ్యాతములైన ౩ శతక సాహిత్యములను అద్భుతముగా సృష్టించెను . ఆయనకు పూర్వము ౧౫౦౦ సంవత్సరముల నాడు కాత్యాయన మహర్షి శివ మహిమ్న స్తోత్రమును రచించెను .ఇది కవుల పరంపర .ఈ నీ తి, శతక స్తోత్రములు పురాణము లలో అనాదిగా ఉన్నట్టు కనపడు చున్నవి . తెలుగు భాష లో ప్రఖ్యాత మైన సుమతి శతకము అను నీ తి శతకము శాశ్వత మైన గరుడ పురాణము లోని బృహస్పతి ప్రవచించిన సంస్కృత నీ తి శతకమునకు తూ చ తప్పని అనువాదమే . ఇట్లు ఈ నీ తి ,స్తోత్ర శతక సంప్రదాయ ము మన దేశములో అనాదిగా కొనసాగుచు వచ్చు చున్నది .

మహారాజ శ్రీ సుబ్బారావు మహా కవి కలము నుండి జాలు వారినవే ఈ రెండు విధముల కవనములు . ఇంతటి పాశ్చాత్య ప్రభావోపేతమైన ఘోర కలిలో కూడ ఈ పరంపర అవిచ్చిన్నముగా సాగిపోవు చుండుట ఆనంద దాయక మైన విషయము . భవిష్యత్తు లో కూడ దీనిని బట్టి ఈ విధమైన కవితా ప్రవాహములు ఆగవని అని పించు చున్నవి .

ఈ కవి ప్రధానముగా హనుమద్భ క్తు డైనను ఆ హనుమంతుడు రామ భక్తుడు కనుక సర్వ జన వంద నీ యుడు అను భావమును బలముగా ధ్వనింప జేయుచు రామ భక్త అను మకుటమును తన పద్యములకు ఒసంగెను .శీ ఘ్రముగా ప్రసన్ను డయ్యె ఆంజనేయ స్వామికి ఎన్నో నామములున్నను హనుమంతుడు అను పదము ముఖ్య మైనది . హనుమంతుడు అనగా హనువు = దవడ కలవాడు =హనుమంతుడు . మన అందరికి దవడ ఉన్నది కదా .మనము హనుమంతులమేనా ? కాము . సంస్కృత శబ్దముల సంప్రదాయములో ఒక అద్భుత విలాసము లుండును . స్త్రీని అంగన అందురు .అంగన అనగా అంగములు కలది అని అర్ధము . మఱి పురుషుడు కూడ అంగములు ఉండును కనుక అంగనులు అందురా ? కారు .ప్రశస్తములైన అంగములు కలవి అని అర్ధము . అట్లే హనువు (దవడ ) కలవాడు . అనగా వజ్రాయుధ ఘాతముచే దవడ వాచిన వాడు అని అర్ధము కాదు . ప్రశస్తమైన హనువు కలవాడు అని భావము . ఆయన హనువుకు ప్రాశస్త్యము ఎట్లు వచ్చెను అనగా వైకుంతు పొగడని వక్త్రంబు వక్త్రమే ,డమ డమ ధ్వని తోడి డక్క కాక అన్నట్లు ఆ మహాను భావుడు తన హనువును అవిచ్చిన్న రామ నామ జపమునకై వినియోగించు చున్నాడు . అందువలన రామ భక్తుని హనువు ప్రశస్తమైనది . కనుక ఆయన ప్రశస్త హనుమంతుడు అని భావము .

మనము మన హనువును పర దూష ణము ,గురు దూ ష ణముకో, అసత్యములు చెప్పుటకో, చాడీలు చెప్పుటకో ఉపయోగించు చున్నాము . అందువలన మన హనువు అప్రశ స్తమైనది . కనుక మనము హనుమంతులము కాము ఈ విషయము లన్నియు వారు తమ కవిత్వములో ధ్వనింప జేసిరి .కనుక ధ్వనించే అర్ధమునకు బలము ఎక్కువ . కనుక వీ రు కవితా సిద్దులని అనుకో వలసి వచ్చును .

తర్వాత నీ తి శతకమును సుమతి శతకము యొక్క ఒరవడి పై కందములలో నరుడా ! అను మకుటముతో రచించిరి .ఇది కూడ గొప్ప సుగుణమే.నీవు నరుడవు .ఈ నీ తులకు తప్పినచో నరకుడ వగుదువు .నరకుడవు అయన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు కొన్నట్లు ఈ నీ తులు ఏమియు ఉపయోగించవని భావము .

ఈ కవి లేఖిని నుండి ఇతోదికముగా పుంఖాను పుంఖములుగా నీ తి ,భక్తి పద్యములు వెలువడ గలవని ఆశించు చున్నాను .

(సం )
తె.వి.శర్మ
(తెలకపల్లె విశ్వనాధ శర్మ )
ఫోన్ .౦౪౦౨౪౦౩౩౩౨౬

కలియుగాబ్దములు ౫౧౧౧
వికృతి జ్యేష్ట శుద్ధ తదియ
౧౫-౬-౨౦౧౦

No comments:

Post a Comment