లక్ష పత్రుల తోడన లక్షణముగ
పూజ సేయంగ సమకట్టు పుణ్య పురుష !
గన్నవరపు నా గేం ద్రుడ ! మిన్న చరిత !
యందు కొనుమయ్య ! యాశీ స్సు లందు కొనుము .
-
తల్లి దండ్రులు దమ్ముల నుల్ల మలర
చేయు చుండిరి పూజను జెలియ తోడ
నాలి పురమున దనరగ నా శివునకు
నేమి భాగ్యము ? పొగడగ నెవరి తరము ?
-
జరుపు కొనుమయ్య ! పూజను జరుపు కొనుము
బంధు మిత్రుల మధ్యను బాగు గాను
సకల శుభములు గలిగించు శంక రుండు
అన్ని విధముల మిమ్ముల నాదు కొనును .
-
ఇల దొడ్డ వరము నందున
వెలసిన యా సాంబ శివుని వేడుక మీర
న్నలరులు పత్రుల తోడను
చెలువుగ నాగేంద్ర ! నీ వు చేయుము పూజల్
-
అత్త మామలు మ ఱదల యండ గొనుచు
నూరి పెద్దలు నీవెంట యుండ గాను
వేద మంత్రాలు గట్టిగ విన బడంగ
సాదరంబుగ జేయుము శంభు పూజ .