skip to main
|
skip to sidebar
subbarao
Monday, September 30, 2013
అనువుగానిచోట యధికులమేయను
అనువుగానిచోట యధికులమేయను
ననుట నొప్పు గాదువినయము మఱి
యార్య! బ్రదుకుదెఱువుమార్గమదియగును
నెల్లవారలునిక చల్లగుండ్రు
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్
వడివడిగా గుడికేగెను
మడిగట్టిన పండితుండు, మద్యము గ్రోలెన్
దుడుకుదనంబులు గలిగియు
చెడు వర్తన గలిగియుండు చెనటులు మిగులన్
Sunday, September 29, 2013
ముంచినట్టివాడె పూజ్యుడయ్య!
హరుని దినము దినము నభిషేకజలమున
ముంచినట్టివాడె పూజ్యుడయ్య!
వాని
దరికిజేర్చు పార్వతీ నాధుడు
సత్య మిదియ నమ్ము శంకరార్య!
గ్రామ దేవతలు
గ్రామదేవతలనువారు గ్రామగ్రామ
మునకునూరిచివరనుండి మనకు నెల్ల
వేళలను రక్షణగ నుంద్రు వేయి నతుల
నిడుదు నిరతమా తల్లికి నిమ్ముగాను
Saturday, September 28, 2013
కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్
శైలాద్రి దనయ గోరగ
కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్
ఈలయకారుని పొగడిన
కైలాసము దరికిజేర్చి కైవల్యమిడున్
పరనింద
పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్
జారుల కృత్యములు మనకు సంతోషమిడున్
గౌరవహీనములగునుగ
జారుల కృత్యములు,మనకు సంతోషమిడున్
జారులు మంచిగమారుచు
వారందరు కలిసి మెలసి వర్తిలి యుండన్
శివ కుటుంబము
అర్ధనారీశ్వరుండయి యచట శివుడు
కొమరు లిద్దరు నిరువైపు లిమ్ము గాను
తల్లి దండ్రుల ముద్దుల తనయ్తు లగుచు
శివకుటుంబమునొప్పెను చిత్రమందు
Friday, September 27, 2013
కోడిపందెములు
పల్లెటూరున సంక్రాంతి పండుగలకు
కోడి పందెముల్ జరిపింత్రు వేడుకనుచు
పదును గత్తుల తోడన బలము జూప
వెఱ్ఱి కేకలు వేతురు వెఱ్ఱి జనము
శివపార్వతులు
వింటిరె మీరీ సంగతి
కంటిని నొక యద్భుతమ్ము కనలేదెపుడున్
మింటను శివపార్వతులే
కంటికి కనుపించిరార్య! కలయో,నిజమో?
Thursday, September 26, 2013
అప్పు లేనివాడె యధము డుగద
అప్పు లేనివాడె యధము డుగదయన
కప్పు లున్న యెడల నతిగ ఖర్చు
పెట్టకుండ కూడబెట్టును ధనమును
అప్పు భయము తోడ నార్య! వినుము
దొంగల ముఠా
దొంగలందఱు నొకటయి మంగపతిని
నిలువునా దోచుకొనియును నిలువ నీడ
లేక గావించిరా దొంగలే ముఠాగ
వచ్చి మఱి యేది లేదిక పస్తులు గతి.
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
రోకటి పోటున నలుగును
షీకాయలు నంతెకాని శిరమున కదియా!
ఈకలికాలపు మాటలు
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
పోస్టు కార్డు
ఒకరి వార్తలింకొకరికిని తెలుపను
పోస్టుకార్డు పైన వ్రాసెడిరిగ
మృగ్యమయ్యె యిపుడు పోస్టుకార్డులుమఱి
సెల్లు ఫోను వచ్చె క్షేమములకు
Tuesday, September 24, 2013
gati లేని మనుష్యుడే సుగతు డనదగున్
అతిగనునున్నను మఱిదు
ర్గతి లేని మనుష్యుడే సుగతు డనదగున్
మితిమీరి పొగరుగలిగిన
పతితునిగా ననగదగును బశుపతి నాధా!
కారాగారము
కారాగారములయ్యవి
యారామములయ్యె యిపుడ యదికారులకున్
పోరాములైనవారికి
నీరకముల శిక్షలుండు నిష్టతగలుగన్
Sunday, September 22, 2013
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
కట్టుంగ నగర మందున
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
అట్లని యంటిర ! చిత్రము
ఇట్లయె కలికాల మౌర ! యేమని జెపుదున్ ?
హనుమానంద లహరి
రామ నామము బలుకుదు రమ్య మలర
రామ భజనలు సేతును రాగ మొప్ప
నీకు కైదండ లిడుదును నీవ దిక్కు
నా మనంబున నుండుమా రామ భక్త !
దోమ
దోమ లు దోమలుదోమలు
దోమలతో నిండి యుండె దుహినము కంటే ?
దోమల జంపుట కొఱకై
ధూ మము మఱి యింటి నిండ దూ రగ జేతున్
ముద్దబంతి పూలు
ముద్దబంతి పూలు ముచ్చట గానుండు
దండ గ్రుచ్చి కట్ట దండి గాను
అంద గించు దార బంధములు మిగుల
పూల లోన బంతి పూలు మిన్న
విశ్వాస ఘాతకుడు
లేదు లేదని వచ్చిన బీద వాని
చేర దీ సియు మఱియును జిదిమి పండ్లు
కోసి యిచ్చెను దినుమని , క్రూరు డతడు
కత్తి ఝ ళిపించె విశ్వాస ఘాత కుండు
జింకను గని బెదరి పారె చిరుత పులి వడిన్
డొంకల మాటున నొదిగిన
జింకను గని బెదరి పారె చిరుత పులి వడిన్
బింకమగు సింహ మనుకొని
అంకము పై నున్న పిల్ల యదురుచు నుండన్
Friday, September 20, 2013
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
వినుమిది యగ్రజ ! !కుంతీ
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
అనవరతము కృష్ణు మనన
మెనరంగా జేతు రార్య ! యె ప్పు డు మదిలోన్
జూదము
వ్యసనము లన్నిటి కంటెను
వ్యసనము మఱి జూద మరయ వ్యధలను గూర్చున్
వ్యసనంబు లేడు రకములు
వ్యసనంబుల దరికి బోక వర్తిలు మెపుడున్
Thursday, September 19, 2013
ఋ ణాను బంధము
పశు గణంబులు సుతులును పత్ని యరయ
ఋణమున కనుబంధములుగ బృధివి యందు
కలుగు చుందురు మఱి ఋణ ములుము గియగ
పోవు చుందురు నిజమిది పూవు బోడి !
Wednesday, September 18, 2013
దురాశ
ఆశ యుండ దగు మఱి దురాశ యుండ
కూడ దెప్పుడు , మనముగా గోరి కలను
నణచి పెట్టుకొ నవలెను నపుడు గలుగు
మనసునకు హాయి , సత్యము మనుజు లార !
శబ్ద కాలుష్యము
కాలుష్యము లన్నిటిలో
కాలుష్యము శబ్ద మరయ క లుషితు జేయున్
మేలివియు లేని చోటులు
బాలలు కడు దూరముంట పఱగును నెపుడున్
పుస్తకముల జదువువాని బుద్ధి నశించున్
మస్తకము నిండి యుండును
పుస్తకముల జదువువాని , బుద్ధి నశించున్
సుస్థిరత లేని కవితల
పుస్తకములు చదువు నెడల పొరలు పొరలుగాన్
Tuesday, September 17, 2013
సంప్రదాయము లు
సంప్రదాయము ల ను పేర జగము నందు
ఇచ్చి పుచ్చుకోవడ ములే యిచ్ఛ తోడ
జరుగు చుండును నెన్నియో ,సరకు గొనక
న్యాయ మార్గాన నడువుము నరుడ ! నీవు
మూఢ మతులాదరింత్రు ముముక్షువులను
మొండి వాదన జేతురు ముఖ్యముగను
మూఢ మతులా,దరింత్రు ముముక్షువులను
దేవతా గణ మనిశము దైవ మనుచు
స్వాగ తింతురు కూడను స్వర్గ మునకు
గణేశ నిమజ్జనము
తొమ్మి దిదినంబు లియ్యెడ నెమ్మనమున
భక్తి శ్రధ్ధల బూజించి భర్గు సుతుని
భక్ష్య భోజ్యముల్ సరగున భక్తి నిడుచు
చేతురు నిమజ్జనము నిక చెరువు నందు
Monday, September 16, 2013
తాతను వివాహ మాడెను తరుణీ మెచ్చి
పావని తనకు బంధువు , వరుసకైన
తాతను వివాహ మాడెను , తరుణీ మెచ్చి
వేయి రూప్యము లిచ్చెను వికట కవికి
నాత నికధలు జదువగ హర్ష మొంది
జోల పాట
జోల పాటను బాడుదు నోలలామ !
నిదుర పొమ్ముమ యికనైన నిశ్చలముగ
చాల పనియుండె నికనాకు ,చాలు కినుక
పండు కొనుమమ్మ బాలిక ! పండు కొనుము
Sunday, September 15, 2013
తన్మయత్వము
మంగ ళం పల్లి గానము మధుర మగుచు
నోల లాడించి హృదయాల నుత్స హించు
తన్మ యత్వము పొందించు తట్టు మదిని
మంగ ళం బును గలిగించు మనుజ తతికి
బలరాముడు లంక జేర వారధి గట్టెన్
అల కృష్ణున కన్నయె యీ
బలరాముడు , లంక జేర వారధి గట్టెన్
జలధిం బెను రాళ్ళు బఱచి
బలములనే జూపు కొనుచు వానర సేనల్
Saturday, September 14, 2013
పగటికలలు
రాజు నగుదును బాలింతు రాజ్యము నిల
మీ రు బానిసలుగ నుండి మేము పంపు
నాజ్ఞలను నెర వేర్చుడ ననగ
పగటి కలలను గంటివా / పార్ధ ! నీవు
గంగడోలు
ఆవు మెడకు క్రింద యరుదైన చర్మము
వ్రేలు చుండు నార్య ! వింతగాను
గంగడోలు గ బరగంగు నదియ సుమ్ము
దాని దువ్వ యావు దరికి వచ్చు
అమృతము సేవించి సురలు హతు లైరి గదా !
అమరత్వము నొందిరి మఱి
అమృతము సేవించి సురలు, హతు లైరి గదా !
సమరంబున రాక్షసులా
కమలాక్షుని జూచు తోడ కలవర బడుచున్
గుడి గంటలు -బడిగంటలు
గుడి గంటలు బడిగంటలు
వడివడిగా మ్రోగుచుండు బడిలో గుడిలోన్
బడిలో పిల్లల కొఱకవి
గుడిలో నవి భక్తతతులు కోరిక లడుగన్
Friday, September 13, 2013
భాషకేలనయ్య వ్యాకరణము
భాషకేలనయ్య వ్యాకరణమనుట
నొప్పు దార్య ! వినుము తప్పని సరి
భాషకు మఱి తగిన వ్యాకరణ మవస
రమ్ము నా పలుకు నిజము సుమ్ము
గుణ త్రయము
సత్త్వ గుణమున కర్ధము సాధుతనము
చూడ రాజస మొసగు రజో గుణంబు
తామసము నొనగూ ర్చు నధమ గతినిల
ఈ గుణములే గుణ త్రయ మిందు వదన !
దుర్దినము
సూర్య దర్శన భాగ్యంబు జూర గొనిన
దినము నండ్రు నిపుణులు దుర్దినము నాగ
భోజనంబులు సేయరు భువిని వారు
సూర్య భగవాను కిరణాలు సూచు వరకు
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్
అంజీ ! యెక్కడ నుం టివి ?
ముంజులు మఱి వేగ దెమ్ము మూ షికమునకున్
నంజుగ బెట్టుద మనగను
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్
తులసి కోట
తులసి కోట లోని తులసి మొక్కను జూడ
మనసు పొంగు చుండు ననవ రతము
పచ్చదనము గలిగి బహు ళ శాఖల నొప్పు
అమ్మ ! తులసి ! నతుల నందు కొనుము
Wednesday, September 11, 2013
స్వర్గము -నరకము
పుణ్య కార్యము లొనగూర్చు పురుషు డిలను
సకల సుఖములు నొందును జక్క గాను
స్వర్గమే యది వారికి ,దుర్గమ మగు
పాప కర్మలు సేసెడి పాపు లకును
నరకము విషయము నరయగ
నరకము నా వేరు లేదు నరులకు నెపుడున్
నిరతము గనబడు చుండును
తరుణులు సరి లేని యెడల దారగ నిలలోన్
బూర్లు- పులిహోర
బూర్లు పులిహోర చేయను బోటి పడుచు
నొకరు మించిన మరియొక రుత్సహించి
అమ్మలక్కలు మూవురు కమ్మగాను
చేయ మొదలిడి రిచ్చట చేత లిపుడు
బానిస బ్రతుకే నయమని పలికెను గాం ధీ
మానమునే య మ్ముకొనుట
బానిస బ్రతుకే నయమని పలికెను గాం ధీ
పూ నికతో ప్రాణము లిడి
మానక స్వాతంత్ర్య మిపుడు మనకు లభింపన్
Tuesday, September 10, 2013
వేట పాలెము
విజయ దశమి పర్వ దినాన విజయ ముగను
వేట పాలెము నందున మెప్పు నొందు
సంస్థ నెలకొల్ప బడెను సా రస్వత పర
మైన విద్యాలయం బట యార్య గనుడు .
పాయసమ్మున గారమ్ము వేయదగును
వేడి యుండగ చక్కెర వేయదగును
పాయసమ్మున , గారమ్ము వేయనొప్పు
నాలు వేపుడు రుచిగను నాహ రించ
ఉప్పు కారాల వలననే నొప్పు కూర .
Monday, September 9, 2013
కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్
తలపగ రాయలు మించిన
కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్
పలు దుర్మార్గపు పనులను
అలవోకగ జేయువాడు నవనిని గలడే !
పునర్జన్మ
పుట్టి మరణించి మరల ను బు ట్టుట ,యను
దాని నండ్రు పునర్జన్మ యైన యట్లు
ప్రాణి జేసిన కర్మల బట్టి మరల
జన్మ లెత్తును బుడమిని సత్య మిదియ
Sunday, September 8, 2013
గరళ కం ఠు ని శత్రువు గజ ముఖుండు
మానినులకు మరులు గొల్పు మన్మ ధుండు
గరళ కం ఠు ని శత్రువు , గజ ముఖుండు
పార్వతీ పరమ శివుల ప్రధమ సుతుడు
పూజ జేయగ వారిలో మొదటి వేల్పు
Saturday, September 7, 2013
ది . 22-10-2013 తేదీన శుభాష్ ,జ్యోతిల వివాహము సందర్భముగా సమర్పించు పద్యాంజలి పూర్వక ఆశీ స్సులు
హాయ్ ! సుభాష్ !
తల్లి దండ్రుల కేకైక తనయు డీవు
అక్క లిద్దరి గారాబు "అనుజు " డీవు
బావ లిద్దరి ముద్దుల బావ వీవు
అందు కొను ముర! యా శీ స్సు లందు కొనుము
పెండ్లి యీ డు రాగ పెండ్లి సేయుట గూర్చి
తల్లి దండ్రులు మఱి యెల్ల వారు
వెదుక మొదలిడ నిక వధువు కొ ఱకు వారు
కాను పించె యీ మె కన్ను గవకు
ఊరి పెద్దలు మోదాన నోల లాడ
తల్లి దండ్రులు ననుమతి దనకు నీయ
చూడ చక్కని మూ ర్తము సొంపు లలర
అయ్య వారలు బెట్టిరి యంచితముగ
ఒకరికొఱకునై మఱి యొక రుద్భ వించి
అగ్ని సాక్షిగ నొకటిగ నగుట కొఱకు
వేచి యుండిరి యిరువురు వినయముగను
వరలు కళ్యాణ ఘడియలు వచ్చు వరకు
జ్యోతి నీ పట్ల నిజముగ జోతి యగును
సంది యంబిసు మంతయు నిందు లేదు
కాన నొకరికి నొకరుగా గలిసి యుండి
జీ వ యాత్రను సాగించు సేమ మలర
అమ్మా ! జ్యోతీ !
అత్త మామలు మఱి యును నాడు బిడ్డ
లరయ మంచి వా రలు మఱి యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ వలయు నమ్మ !
అట్లు జేసిన సంతోష మమ్మ ! మిగుల
తనర యీ సుభాషును నీకు తగిన భర్త
ఎదురు చెప్పక వానికి నెపుడు నీవు
పాలు నీ రును బోలుచు బ్రదుకు చుండి
మంచి గృహిణిగ బేరొం దు మనుజు లందు
మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు దల మానికముగ
పిల్ల పాపల తోడన చల్ల గాను
నిండు నూరేళ్ళు బ్రదుకుమా నెమ్మనమున
సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
రచన : పోచిరాజు సుబ్బారావు
(పెద్ద మామయ్య)
ప్ర పత్తి
భక్తి మఱియు ప్ర పత్తుల భరిత మగుచు
శివుని పూజించు మనుజుడు శీ ఘ్ర ముగను
మోక్ష పదమును జేరును ముక్తు డగుచు
సంది యంబును నిసుమంత పొంద వలదు
వాసవునకు మయూ రమ్ము వాహనమ్ము
పరగ నైరావతము కద వాహనమ్ము
వాసవునకు , మయూ రమ్ము వాహనమ్ము
శంక రాత్మజు డైనట్టి షణ్ము ఖు నకు
వాహనమ్ములు వేరైన దయ్య మొకటె .
(దై వము ప్ర కృ తి ,దయ్యము వికృ తి )
Friday, September 6, 2013
నాధ ! ఓం నమో నారాయణాయ ! యనకు
పలుకు మిట్లని బలికె భర్త తోడ
నాధ ! ఓం నమో నారాయణాయ !, యనకు
మెప్పు డెవరిని నేమియు నిచ్ఛ తోడ
మంచి వారల లక్షణ మదియ సుమ్ము
రోదనము
ఆదరువు లేని చోటన
వేదనములు గలిగి మనసు వివశత నొందున్
బాధలు పెరిగిన యెడ ల ను
రోదనమే చివరి మెట్టు ఋ షులకు నైనన్
Thursday, September 5, 2013
సర్వదా చింతయే గాదె సంతు వలన
గంప గయ్యాళి యౌ భార్య గలుగు నెడల
సర్వదా చింతయే గాదె , సంతు వలన
వంశ మభి వృ ధ్ధి మార్గాన బచ్చ గాను
ఉడు పతిని వోలె కాంతులు నొందు చుండు
పిల్లి
ఓగిరమ్ము కొఱకు వేగిరమ్ము పడునా
గోడ మీది పిల్లి చూడు డార్య !
నలుపు రంగు తోడ మిలమిల లాడుచు
మూషి కమ్ము కొఱకు వేచు చుండె .
సర్వేపల్లి రాధా కృష్ణన్
రాధా కృష్ణున కిడుదును
పాదాలకు వందనంబు వరమగు భక్తిన్
ఆదిని గురువే యాయన
మీదన నధ్యక్షు డయ్యె మేదిని మనకున్
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయులిలన్
కాపురుషు లనెడి వారలు
పాపాత్ములె , పూజ్యులగు నుపాధ్యాయులిలన్
పాపాలు సేయ కుండగ
ప్రాపుగ మన వెంట నుండి రక్షణ సేయున్
Tuesday, September 3, 2013
శివ గంగ
చిత్ర మందు జూడ శివుడు గంగ నడుమ
నుండి జంతు వొకటి యురము నందు
పెట్టు కొనిన యట్లయె ట్టు లుం డె నొగద !
ఏది యే మయినను నీ శు గొలుతు
Monday, September 2, 2013
శూలి తనయ గంగ సోదరి యుమ
విఘ్న నాయకుడగు విఘ్నేశ్వరుడు మఱి
శూలి తనయ, గంగ సోదరి యుమ
జగము నకు ను నిదియ సత్యము మఱియును
గంగ యుమలి రువురు కంతు చెలులు
బావ
అక్క భర్త బావ యగును గదా మఱి
అత్త కొడుకు బావ యగును నిలను
మామ కొడుకు బావమరది య గును గద
వరుస లిటులె యుండు బంధు వు లలొ
Sunday, September 1, 2013
హంతకునకు వర మొసంగె నలర జగము
రాము డ వతార పురుషుడై రావణున్ని
జంపి హంతకు డయ్యును సకల జనులు
సంత సంబును బొందుచు సాదరముగ
హంతకునకు వర మొసంగె నలర జగము
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
▼
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
▼
September
(65)
అనువుగానిచోట యధికులమేయను
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్
ముంచినట్టివాడె పూజ్యుడయ్య!
గ్రామ దేవతలు
కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్
పరనింద
జారుల కృత్యములు మనకు సంతోషమిడున్
శివ కుటుంబము
కోడిపందెములు
శివపార్వతులు
అప్పు లేనివాడె యధము డుగద
దొంగల ముఠా
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
పోస్టు కార్డు
gati లేని మనుష్యుడే సుగతు డనదగున్
కారాగారము
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
హనుమానంద లహరి
దోమ
ముద్దబంతి పూలు
విశ్వాస ఘాతకుడు
జింకను గని బెదరి పారె చిరుత పులి వడిన్
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
జూదము
ఋ ణాను బంధము
దురాశ
శబ్ద కాలుష్యము
పుస్తకముల జదువువాని బుద్ధి నశించున్
సంప్రదాయము లు
మూఢ మతులాదరింత్రు ముముక్షువులను
గణేశ నిమజ్జనము
తాతను వివాహ మాడెను తరుణీ మెచ్చి
జోల పాట
తన్మయత్వము
బలరాముడు లంక జేర వారధి గట్టెన్
పగటికలలు
గంగడోలు
అమృతము సేవించి సురలు హతు లైరి గదా !
గుడి గంటలు -బడిగంటలు
భాషకేలనయ్య వ్యాకరణము
గుణ త్రయము
దుర్దినము
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్
తులసి కోట
స్వర్గము -నరకము
బూర్లు- పులిహోర
బానిస బ్రతుకే నయమని పలికెను గాం ధీ
వేట పాలెము
పాయసమ్మున గారమ్ము వేయదగును
కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్
పునర్జన్మ
గరళ కం ఠు ని శత్రువు గజ ముఖుండు
ది . 22-10-2013 తేదీన శుభాష్ ,జ్యోతిల వివాహము స...
ప్ర పత్తి
వాసవునకు మయూ రమ్ము వాహనమ్ము
నాధ ! ఓం నమో నారాయణాయ ! యనకు
రోదనము
సర్వదా చింతయే గాదె సంతు వలన
పిల్లి
సర్వేపల్లి రాధా కృష్ణన్
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయులిలన్
శివ గంగ
శూలి తనయ గంగ సోదరి యుమ
బావ
హంతకునకు వర మొసంగె నలర జగము
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)