Thursday, October 31, 2013

క్రోధమే మేలు గద సర్వ గుణము లందు

కష్టములు  గలుగుటకును  గార ణంబు
క్రోధమే,  మేలు గద సర్వ గుణము లందు
దాన మయ్యది గలిగించు ధర్మ పధ ము
దాన ధర్మము లీ రెండు   మాన వలదు 

అతిశ యోక్తులు

అతిశ యోక్తులు పలికెడి య య్య వారు
తారసిల్లెను నాకట  తణుకు నందు
సుత్తి వారిది వినలేక సొమ్మ సిల్లి
నేల బడితిని నా క్షణమో  లతాంగి 

బంధములు

బంధములే  శృం ఖలములు
బంధములను బెంచు కొనకు పడతుల యెడ లన్
బంధు వని  వచ్చు వానిని
అంధు డ వై  నమ్మ కునికి  హర్షము మనకున్ 

పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్

మద్యము ద్రాగిన మత్తున
విద్యాధరుడనియె  నిట్లు  వీనుల విందౌ
పద్యము గణములు దెలియక
పద్యమ్ముల వ్రాయునట్టి  వాడల్పు డగున్
 

నిధి చాల సుఖమా

అరయ  నిధి చాల సుఖమా !యార్య మఱి ని
దైవ సన్నిధి సుఖమా దయను దెల్పి
మమ్ము సంతోష పఱు చుడు  మాననీయ !
వందనంబులు సేతును వంద లాది 

రాచి ఱo పానపెట్టు

రాచి ఱo పానపెట్టు ను రమ్య తనదు
కోడలి నెపుడు చూచితె  ? కూ రుచుండ
నీయ దొక నిమిషమయిన ,నేర ములను
జెప్పు కొడుకున కెన్నియో  మెప్పునొంద 

కలము -కత్తి

కలము చేబూని  మొదలిడ  కావ్యమగును
ఖండి తంబగు  కం ఠాలు  కత్తి వలన
శుభము కలిగించు  కలమున   శుభము  కత్తి
కలము  కత్తులు  రెండును  కరము పదును 

కలిమి లేములు

కలిమి  గల చోట నుండదు కఱు వు  నిజము
లేమి యుండదు సంపద లీ ను  చోట
కలిమి లేములు రెండును కలిసి కొనవు
కలిమి లేములు కావడి  ఘటము లుగద 

కలిమి గల గృహిణి కంట కన్నీ రొలుకన్

అల కాపురంబు నందున
కలిమి గల గృహిణి కంట కన్నీ రొలుకన్
విలవిల లాడుదు రబలలు
సలిలంబును మ్రింగు పగిది సంద్రము లోనన్ 

Wednesday, October 30, 2013

పచ్చికను దిననొల్లదు పాడి యావు

చూ లు కలిగిన యాయావు చొప్ప మఱియు
పచ్చికను దిననొల్లదు పాడి యావు
మంచి పచ్చికను దినుచు నం చి త ముగ
పాల నిచ్చును జనులకు భవ్య చరిత !  

కలి కలిగిన వాని యింట కలవే సు ఖ ముల్

కలిపురుషుని  కారణ మున
నలు డప్పుడు విడిచి యే గ  నల దమ   యంతిన్
గల గల  యే   డ్చెను  నాస   తి
 కలి కలిగిన  వాని  యింట  కలవే  సు ఖ ముల్ 

Tuesday, October 29, 2013

అడ్డంకులు

అడ్డంకు లెన్ని యున్నను
నొడ్డా ణ ము కొందు నీకు నోపిక పడుమా
బిడ్డల  గుడ్డల  సంగతి
దొడ్డకు నే జెప్పి యుంటి దునిలో కొనునున్


 

అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు

అత్రి మునికి  నహల్యయే పుత్రిక యగు
ననుచు రూడి గ బలుకుట యక్రమమ్ము
బ్రహ్మ  చేతను   సృ జియింప  బడిన సా ధ్వి
గౌ తమ  మహర్షి భార్య యే , సేతు నతులు 

Monday, October 28, 2013

పతితల ఖండించె నం ట పార్వతి గినుకన్

పతియగు  శివుడా బులి గణ
పతితల ఖండించె   నం ట  పార్వతి గినుకన్
బ్రతికించి  యాతని ప్పుడు
వెతలంబోగొట్టు మదిని  భిక్షుక శ్రేష్టా !

క్షీరాబ్ధి శయను డనంగ శివుడే గదరా

తారక రాముడు మఱియును
క్షీరాబ్ధి శయను డనంగ శివుడే గదరా
ఆరాముడు మఱి శివుడును
వీరిరువురు నొక్క రార్య ! వీ క్షింపంగాన్ 

కాలితో దన్నుటే మేటి కనికరమ్ము

కాలితో  దన్నుటే  మేటి కనికరమ్ము
అటుల జరిగెనునలనాడ యామృకండు
తనయు పట్లన  కాలుని దరికి పోవు
తఱి ని  గాపాడె  శం భుడు  తనర భక్తి 

Saturday, October 26, 2013

మామా ! యని భావమఱది మాటలు గలిపెన్

రా ,మాయింటికి నిప్పుడు
మామా !, యని భావమఱది మాటలు గలిపెన్
కామాక్షి కగును సోదరు
డా మోహనరావు కూ డ  హర్షము తోడన్ 

Wednesday, October 16, 2013

ఇత్తడి కఱిగి యగునార్య! పుత్తడిగను


ఇత్తడి కఱిగి యగునార్య! పుత్తడిగను
చోద్యమీమాట వింటిమె? చూచితెక్క
డైన,నట్లగునెడలను నైహికమున
లేమియనునది మనకిక లేదు సామి!

కోదండ రాముడందురు

కోదండ రాముడందురు
కోదండము చేతబూనికువలయమందున్
ఛేదించి శత్రుమూకల
వేదన మాన్ పించెకతన వేల్పులబ్రజకున్

నందివర్ధనపూవది

నందివర్ధనపూవది యందగించె
శంభుశిరసుపై దెల్లగ చంద్రు బోలి
గగనమంతయువెలుతురు గానిపించె
చోద్యమాయెను మఱియది చూపరులకు

జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్


తాతలసేవలనరయగ
జీతములేనట్టి కొలువె, శ్రేష్ఠము జగతిన్
మాతాపితరులసేవలు
నేతావాతా  యె రుం గు  మెప్పటి  కైనన్ 

Tuesday, October 15, 2013

అప్పుచేసి పప్పు కూడు

అప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదార్య!వినుము

జగడము

జగడము లాడుట మానుడు
జగడములేదారితీయుజావులకు నిలన్
జగడము ధర్మ విరుధ్ధము
సుగమమునగు జీవితంబు జగడము లేమిన్

Monday, October 14, 2013

గవాక్షము

సూర్యకిరణాలు వచ్చును చూరుపైన
గలుగునా గవాక్షమునుండి కాంతితోడ
సూర్య బింబముపగిదినిసుడులు దిరిగి
కనుల మిరుమిట్లు గొలుపుచు గానిపించు

శూర్పణఖ రామచంద్రుని సోదరియట


పెండ్లియాడుమ యనికోరె బ్రియము గలిగి
శూర్పణఖ రామచంద్రుని సోదరియట
చుప్పనాతి రావణునకు చోద్యమాయె
రావణారిని గోరుట రామ మఱిని

Sunday, October 13, 2013

బూడిదలోపోసిన పన్నీరు

అడవి కాచిన వెన్నెల యటులవలెను
సంద్రమందున జేరెడు సలిలమువలె
బూడిదందలి పన్నీరు కూడ వమ్ము
లార్య! నిజమిది నమ్ముడు నౌను ననుచు

తొమ్మిదిలోనొకటిదీయ తొయ్యలి పదియౌ

ఇమ్ముగ నెనిమిది యగుగద
తొమ్మిదిలోనొకటిదీయ తొయ్యలి పదియౌ
తొమ్మిదికి నొకటి గలిపిన
నెమ్మదిగను నేర్చుకొనుమునిరతము లెక్కల్

విజయ దశమి

విజయ దశమి నాడు విష్ణు బూజనుసేయ
సకల సంపదలును,సంతునిచ్చు
రాముడటులజేసి రావణువధియించె
అర్జునుండు గెలిచె నరి గణమును

Friday, October 11, 2013

ప్రకృతి వైపరీత్యములు

వాయుగుండములీమధ్య వరుసవరుస
వచ్చుచుండెను గప్రకృతి వైపరీత్య
ములివియెగమఱివాటిల్లు ముప్పులు, పలు
విధములగునష్టములుగల్గు వేంకటేశ!

కడుపు నొప్పియనుచుకరము మురిసె

ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
కడుపు నొప్పియనుచుకరము మురిసె
కనకదుర్గ తాను కనినకలనుగూర్చి
అభయ హస్త మిచ్చె నంబ కలను

తలదొలగించిననిడుములుదప్పు జనులకున్


ఇల గజముఖుడౌ గణపతి
తలదొలగించిన,నిడుములుదప్పు జనులకున్
తలుపులయమ్మను గొలిచిన
ఇలవేలుపుమాకుగాన నిచ్చునుశుభముల్

సరస్వతీ ప్రార్ధన


శారద మాతా! నతులివె
శారదమా! గృపను జూడు శరణము నీవే
యారయ,చదువుల తల్లివి
పారంగతు జేయుమమ్మ! పరిపూర్ణముగాన్

Thursday, October 10, 2013

సరస్వతీ పూజ


భక్తి శ్రధ్ధలతోడన పరమ శివుని
సోద రిసరస్వతి నిపుడు నాదరమున
పూజచేసిననిచ్చును బుణ్య మార్య!
కల్లకాదిది నిజమునే పల్కు చుంటి

Wednesday, October 9, 2013

ధవునకపుడుగర్భమయ్యె దనయుడు పుట్టెన్

అవునట వింటిరెమీరు మా
ధవునకపుడుగర్భమయ్యె దనయుడు పుట్టెన్
ఎవరెవరికెవరు పుట్టిరొ
వివరముగా దెలుపుడార్య! వీనుల విందున్

విద్యుద్విపత్తు


ఆంధ్రరాష్ట్రమందంతయునంధకార
మగుట,విద్యుద్విపత్తులేయగునుమఱిని
కారణంబులుసిబ్బందిగైరు హాజ
రగుట , వెలుగులు సూతుమయార్య!మనము?

Tuesday, October 8, 2013

కనులవినవచ్చువీనుల గాంచవచ్చు

భక్తి శ్రధ్ధల శంకరు భజనజేయు
పరమ పురుషుండుతనదగు వరముతోడ
కనులవినవచ్చువీనుల గాంచవచ్చు
తారతమ్యము లెఱుగనియార్యుడతడు

కంచిగరుడసేవ

కంచికేగిన ప్రతియొక్కడంచితముగ
గరుడసేవనుగావించికాంచు విష్ణు
నదియయిచ్చునుఫలితము నార్య! నిజము
వరల కామాక్షి మాతకు వందనములు

Monday, October 7, 2013

వేపపుల్ల

వేపపుల్ల నమల వెగటుగా నుండును
పండ్లుతోమ తెల్లబడును మిగుల
పిప్పి పన్నులుండవెప్పటికినిమఱి
వేపపుల్ల మేలు వేనవేలు

చి.సౌ.హిరణ్మయి-హర్షలకు ఆశీస్సులు



1.వధువు పుట్టెను బెహరాల వారి యింట
వరుడు జన్మించెపోతరాజుల కులమున
హర్షవర్ధనుడాతడు నామెదుర్గ
జోడుకుదురగ మూర్తము  జూసి నారు.

2.ఒకరి కొఱకునై మఱియొక రుద్భవించి
అగ్ని సా క్షి గ   పరిణయ  మగుట కొఱకు
వేచి యుం డిరి  పెద్దల  యా  శి సులకు
అనుమతీయగ  నీరోజు  నగును  బెండ్లి

3. రామ చం ద్రుడు నీ తండ్రి రామ యైన
త్రిపుర సుందరి నీ తల్లి తెలియు మమ్మ !
యేమిభాగ్యము నీ యది యెంచ దుర్గ !
భర్త పేరును  గలిసెను ఫ ణి యనంగ

4.తనర  మణి కం ఠు డనబడు తనయు డితడు
 తగిన  భర్తయే మఱి నీకు తార తమ్య
ములను నెంచక సంతోష ముండునటుల
మెలగు మోదుర్గ ! యదినీకుమేలునిచ్చు

అమ్మనాన్నలవిడిచియు నరుగుదేర
బెంగయుండును నిజమిది బేలనీకు
అత్తలోననజూడుమ యమ్మనికను
బాధయుండదు యికనీకు పచ్చినిజము

6.అత్తమామలు మఱియును నాడు బిడ్డ
మిగుల సౌమ్యులువారిని మీఱకుండ
అధిక భక్తిని  మెలగితి  వైన నిన్ను
రక్ష సేయును నిరతము రాము డబల !

7.పుట్టి నింటను మెలగిననట్లు గానె
మెట్టినింటనుగూడను మెలగుమమ్మ!
ఆది దంపతిసములగు నత్తమామ
లాదరించుమునిరతము హర్షమునన

8.మానవత్వంబుతోడన మసలుకొనుచు
మానినులయందగుమతలమానికముగ
పిల్ల పాపల తో డన  చల్లగాను
నిండు నూ రే ళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


9.మాస్టరీకెయం   యన్నులు  మమతతోడ
మిమ్ము నాశీర్వదింతురుమింట నుండి
కల్లకాదిది నిజమునే పల్కు చుంటి
నోహిర ణ్మయి! సీవీవి పాహి మిమ్ము.

10.సకలశుభములుగలిగించు శంకరుండు
ఆయురారోగ్య సంపదలన్నియిచ్చి
కంటికిని  ఱెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల  మిమ్ముల  చల్ల గాను



ది.23-10-2013తేదీనహిరణ్మయి-హర్షల  వివాహము  సందర్భముగా
రచన--పోచిరాజుసుబ్బారావు
















 

Sunday, October 6, 2013

ప్రణయ కలహము

ప్రణయకలహములనునవిపడతులందు
విరివిగాకాని పించును తరచి చూడ
ప్రేమతోడన దరిజేరి ప్రియము పలుక
తొలగిపోవును గోపము తోయజాక్షి!

ఆనపపాదునకుజూడ ననుములు పండెన్

నానాజీ తోటనగల
ఆనపపాదునకుజూడ ననుములు పండెన్
గా ననుచుండిరిజనములు
వీనులకది బాగులేదు వినుటకు సామీ!

త్ర్యయంబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్

లంబోదరుడగు గణపతి
త్ర్యoబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్
బింబానన! కుంతిసుతుడు
అంబుధిశయనునకినిడుదు  నంజలి యెపుడున్

Saturday, October 5, 2013

ఓమనగుంటలు

ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమన గుంటలలనాటను
ప్రేమను మఱి  యొకరికొకరుప్రియములు గలుగన్

aasiissulu--sekarana



కంటి కింపగు కళ్యాణ మంటపమున

హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి

శుభ సుఖంబుల జీవన శోభ నంద

దీవెనల నీయ మీ జంట దీప్తినందు.



కలకాలము మీ రిద్దరు

కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప

త్నులు మిత్రులుగా కష్టం

బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.



ఎల్లప్పుడు మీ జంటకు

నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్

కొల్లలుగ నందవలెనని

యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.



సరిలేని శుభ సుఖంబుల

సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు

స్థిర దాంపత్యముతో మీ

రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.


దేవి అవతారములు--నైవేద్యములు

పాడ్యమి---బాలాత్రిపురసుందరి---పులగము
విదియ---గాయత్రి---పులిహోర
తదియ---మహాలక్ష్మి---కొబ్బరి అన్నము
చవితి---అన్నపూర్ణ----చిల్లులేని గారెలు
పంచమి---లలిత---పెరుగు గారెలు
షష్టి---- సరస్వతి --- రవ్వకేసరి
సప్తమి --- దుర్గా దేవి --- కలగలుపు కూ రల  అన్నము
అష్టమి --- మహిషాసుర  మర్దిని --- చక్కెర పొం గలి
నవమి --- రాజ  రాజేశ్వరి  --- క్షీరాన్నము
దశమి ---పులిహోర,లడ్లు

తాళము

తాళము వేయుట మఱువకు
తాళములేరక్ష మఱిని తలిరుల సిరికిన్
తాళములు బెక్కు రకములు
తాళము గాడ్రేజు మిన్న తలిరుల బోడీ!

రాము నోడించె వాలి సంగ్రామమందు

కలనుగంటిని రాతిరి కల్ల కాదు
రాము నోడించె వాలి సంగ్రామమందు
అనుచు,వెఱగంది,లేచితి హర్షమొదవె
రాముడోడించెననితెల్సి రణమునందు

Thursday, October 3, 2013

పిత్రమావాస్య


పిత్రమావాస్య దినమునపెద్దలకిల
పిండముల నిత్తురందఱు పేర్మితోడ
సంతసించుచు పెద్దలుసకల శుభము
లుగలి గింతురు నిజమిది లోకనాధ!

Wednesday, October 2, 2013

యజ్ఞవాటిక


యజ్ఞవాటిక జూడగ హర్షమయ్యె
బ్రహ్మ మొదలగు దేవతల ర్హు డౌ,ను
మాపతినినిశ్చలముగనుమదిని నిల్పి
చేయుచుండిరి యజ్ఞము చిత్రమందు

Tuesday, October 1, 2013

గడ్డిమేయు జనులకెల్లకలుగుసుఖము

ఆవుదూడలు గేదెలు నావు లార్య!
గడ్డిమేయు జనులకెల్లకలుగుసుఖము
రామరాజ్యముపగిదిని రాజ్యమొదవ
పిల్లపాపలతోడన చల్ల గుండ్రు

జాతిపిత

జాతిపిత

జాతిపితగనుబేరొంది జగమునందు
సత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె స్వరాజ్య ముమనకు దెగువతోడ