Saturday, May 31, 2014

పరిహాసము చేయువాడె ప్రాజ్ఞుడు జగతిన్

శరణము గోరును దప్పక
పరిహాసము చేయువాడె , ప్రాజ్ఞుడు జగతిన్
నిరతము భగవత్సేవను
నరుసముతో జేయునతడె యందరి లోనన్

Friday, May 30, 2014

పద్య రచన -భూమి బీటలు వారుట

ఎండ ధాటికి భూములు మండి పోయి
భీ ట వారుట జూచుచు బెంగ తోడ
దడుము  చుండెను నేలను దనివి దీ ర
చేయునది లేక రైతన్న చివరకు నిక

గుండు బాలుడు

చెన్ను మీరి యుండె నున్నని యాగుండు
పిల్లవానికి ,మఱి చల్ల ద  నము
కొఱకు గంధమతని  గుండు మీదన బూయ
కనులు  మూసి కొనుచు దనరు చుండె

Thursday, May 29, 2014

పద్య రచన =బొమ్మల పెండ్లి

వేద మంత్రాలు జదువంగ విబుధ వరులు
జరుగు చుండెను బొమ్మల జంటల కట
వైభవంబుగ  పెండ్లిండ్లు వైజ యంతి !
చూడు మచట యా చిత్రము చూడ్కు లలర

గుణ హీ నం డ య్యె నతడు గురు కృప చేతన్

గుణ రహితుని చెలిమి కతన
గుణ హీ నం డ య్యె నతడు, గురు కృప చేతన్
పణ మున నెగ్గిన యువకుడు
ఫణి నా  గేం ద్రుం  డనంగ బరగును బుడమిన్

Wednesday, May 28, 2014

పెద్ద ముత్తైదువ

పెద్ద ముత్తైదువ ను జూడు పెద్ద గంప
నిండ బంతి పూవులు ,మల్లె లుండు నటుల
అమ్మ కానికి గొనివచ్చె నతివ లార !
వెళ్లి వేవేగ గొనుడిక విరులు మీరు

Tuesday, May 27, 2014

పెళ్లి కూతురు

పెళ్లి కూతురు గాబోలు పే రటాండ్రు
తెచ్చి యిచ్చిన గాజుల నిచ్చ తోడ
తొడుగు  కొనుచుండి చేతికి విడివి డిగను
మదన మోహన మూ ర్తి తో  మరులు గొలిపె

Sunday, May 25, 2014

తారలు మధ్యాహ్న వేళ తళు కున మెరసెన్

ఆరని జోతులు గదమఱి
తారలు మధ్యాహ్న వేళ తళు కున మెరసెన్
బారులొ నొక భామా మణి
పేరడుగగ జెప్పె యామె వీ ణ యటంచున్ 

ఊ హా లోకములో ;;;

పెంపుడు నెమలుల జూడగ
నింపుగ మఱి యుండె నచట యింతుల యొద్దన్
సొంపైన ముఖము తోడన
నొంపులతో దేలుచుండ్రి యూహల లోనన్

Saturday, May 24, 2014

పద్య రచన -పెండ్లి మండపము

పెండ్లి మండపమయ్యది పండ్ల తోడ
కాయ లాకులు రెమ్మలు కలిపి వారు
చురుకు గా నలం కరణపు సొంపు జూడ
బళిర యనిపించు నిజమది భామ !చూడు

పాపము చే యంగవలెను భాగ్యము నందన్

పాపపు బనులను జేయుట
పాపము, చే యంగవలెను భాగ్యము నంద
న్నీ పొ ద్దా పొద్దనకను
నేపొద్దున నైన శివుని నింపుగ సేవన్

Friday, May 23, 2014

ఆంద్ర రాష్ట్రము విడిపోయె నైతికముగ

రెండు రాష్ట్రము లుగ నిపు డుండు నటుల
ఆంద్ర రాష్ట్రము విడిపోయె, నైతికముగ
 కాక గాం గ్రెసు స్వార్ధము కారణముగ
దాని ఫలితము గనబడె దక్ష ణం బె

పతన మయ్యెను గాం గ్రెస్సు భర్గు వలన

తాము చేసిన తప్పుల తడక వలన
పతన మయ్యెను గాం గ్రెస్సు భర్గు వలన
శాంతి సౌభాగ్యములుగల్గు జగతి యందు
శం కరోతీ తి శంకరః  సార్ధ కుండు

పద్యరచన -పచ్చబొట్టు

పచ్చ బొట్టును బొ డి పింత్రు  పడతు లకట
యొకరు నొకరును బ్రేమగా నుండు కొఱకు
పల్లె టూ ళ్ళలో నిప్పటి కెల్లవారు
పొడుచు కొందు రీ పచ్చని బొట్టు గనుము

Thursday, May 22, 2014

పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

మునుల యాశ్రమ పరిసర మున ని  వాస
మగుట కారణము వలన  నన్ని జంతు
వులట స్నేహ  భావంబు తో మెలగు కతన 
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

గాయత్రి

అమ్మ ! గాయత్రి ! మముజూడు నెమ్మనమున
నిన్ను బూజింతు నిరతము నిన్ను దలతు
నీదు సేవయే ముఖ్యము నీరజాక్షి !
వందనంబులు గైకొను మమ్మ !దయను

Wednesday, May 21, 2014

బహు పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్

ఆహాహా చక్కగ బలికిరి
బహు పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్
బహు భార్యలు గలరుగ మఱి
మహినేలినరా  జులకును మఱచితి రార్యా !

పద్యరచన -చిన్న పిల్లలు భార్యా భర్తలు

చిన్న పిల్లల జూడుడు  చిలిపిగాను
మొగుడు పెళ్ళాల మాదిరి మోహనముగ
నుండి ముద్దులు గలిగించు  చుండి  వారు
మనకు నాదర్శ దంపతు లనగ నొప్పు

Tuesday, May 20, 2014

పద్య రచన -ప్రేమ లేఖ

ప్రేమ లేఖను వ్రాయను బ్రియము తోడ
నెటుల వ్రాసిన సంతోష మినుమ డించు
దనదు భర్తకు ననుచును దలిరు బోడి
చేయ సాగుచు చింతన చివర కామె
వ్రాయుచుండెను జూడుడు భామ యచట

Monday, May 19, 2014

పద్యరచన -ఎన్నికల గుర్తులు

ఎన్నికల గుర్తులే యవి ,యెన్ను కొనగ
సిద్ధ పరచిరి బాక్సును బెద్ద లచట
యోటు వేయగ గెలిచిరి దీ టు గాను
చంద్ర బాబును మోడియు చంద్రు లుగద .

నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

ఇలగొప్ప నేత యయ్యెను
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కలలో గూడను నితరుల
తలచదు మఱి తనదు మదిని దనపని తనదే

పద్యరచన -అభిషేకము

పంచామృతముల జేతను
మంచిగ నభిషేక మచట  మంత్రము తోడ
న్నంచిత భక్తిని జేయగ
సంచితమగు బుణ్య తతులు శర్వుని గరుణన్

అన్నపు రెడ్డి వారు

సత్య నారాయ  ణా ! నీదు  శస్త్ర వైద్య
మీయు చక్కని ఫలితమ్ము నీశు కరుణ
సందియంబును నిసుమంత యిందు లేదు
సంతసంబున నేగుమా స్టారు నకును

Saturday, May 17, 2014

కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్

చంపను గుక్కను నక్కెను
కుంపటిలో నక్క, కుక్క కూనల నీనెన్
పెంపుడు కుక్కయ మాయది
యింపుగ మఱి యుండె కూన లేడును  జూడన్

పద్యరచన -వర్షం లోపిల్లలు

వర్షము వర్షము వర్షము
వర్షములో పిల్లలచట పాటల తోడన్
హర్షము నొందుచు గంతులు
వర్షములో వేయుచుంట బాగున్నది గా !

Friday, May 16, 2014

పద్య రచన -సగర పుత్రులు

సగర పుత్రులు దెచ్చిన సలిలములకు
సాగరంబని నుడివిరి సకల జనులు
సలిల మందున నిత్యము స్నాన మాడ
పుణ్య లోకాల గమనము బొంద వచ్చు


చేప చన్నులలో బాలు చెంబె డన్ని

ఆవు యొద్దకు మఱి వచ్చి యావు దూడ
చేప, చన్నులలో బాలు చెంబె డన్ని
పిదుక వచ్చెను మృదువైన పొదుగు నుండి
మంచి బలమును గలిగించు మామ !యవియ

Thursday, May 15, 2014

నీతుల బోధించు వారె నీచులు ధాత్రిన్

నీ తులు  బాటించరు మఱి
నీతుల బోధించు వారె, నీచులు ధాత్రిన్
నీతియు నియమము లేకయ
నేతలు గానుండువారు నిక్కము గాగన్

పద్యరచన -దూ ర్వాసుని శాపము

మనసు దుష్యంతు మీదన మరల బడుట
మౌని దూ ర్వాసు రాకను గాన నందు
వలన ,మఱచి పో  వునుగాక !వాడు నిన్ను
ననుచు  పలికెను దూ ర్వాసు డా శ  కుంత
లగురి చి తెలియ రాగను  లజ్జ తోడ
వేడు కొనియెను  మౌనిని వినయ ముగను

Wednesday, May 14, 2014

పద్య రచన -దధీచి

తనువును మునులకు ముదమున 
మునియౌ మఱి యా  దధీచి మునులకు  నీ యన్
నెనరుగ నెముకల తోడను
ననువుగ వజ్ర్రా యుధంబు నమరెను మిగులన్ 

హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

బలరామ !చంపు రిపులను
హలమున, రాఘవుడు రాక్షసాధిపు జంపెన్
బలమగు కోదండం బున
బలమదమున నెగయు నట్టి రావణు దనుజున్

Tuesday, May 13, 2014

ప్రభల తీర్ధము

కనుమ దినమున నొకచోట కలిపి ప్రభల
ప్రభల మూర్తికి శ్రద్ధతో భక్ష్య భోజ్య
ములను నైవేద్య మర్పించి ముదము తోడ
వివిధ రకముల వస్తువుల్ విక్ర యింత్రు
దీని నందురట ప్రభల తీ ర్ధ మనియు

అంతర్వేది పఱ్ఱ

అంతర్వేదిన గలయా
జంతర మంతరపు పఱ్ఱ సైకతము పయి
న్నంతరము లేక యుండగ
తంతులు మఱి జరుపు కుండ్రు తమలో తామున్

పద్య రచన -పిల్లలతో రైలు ప్రయాణము

పయన మయ్యెను రైలుపై పగటి పూట
కాకి నాడకు సోమయ్య కాంత తోడ
పిల్ల లిద్దరు తోడైరి పేచి పెట్టి
తిరిగి వత్తురు మఱి రెండు  దినము లకట

కుంతికి విఘ్నే శ్వరుండు కొడుకన జెల్లున్

 శం తనుడే గద మామయ
కుంతికి, విఘ్నే శ్వరుండు కొడుకన జెల్లున్
కంతుని శత్రువు శివునకు
నంతే మఱి యా తడౌను  హరునకు పుడమిన్

శంక రార్యుడ !

శంక రార్యుడ !మీకుగా శంకరుండు
రుగ్మతను దరిమి యిక యా రోగ్యవంతు
 జేయు గావుత !మిమ్ముల , యీ య దనున
వేడు కొం దును నేనును విశ్వవిభుని

Monday, May 12, 2014

పద్య రచన -పేను

అక్క శిరము నందు లెక్కలే నన్ని పే
నులు గలవట యెట్లు దొలగు ననిన
శిరము లోని పేను జితుకును గోటితో
కనుక చంపుము మఱి కనిన తోడ

Sunday, May 11, 2014

పద్యరచన -కన్నె కలలు

అందమైనట్టి మఱియును నాద రించు
నతడు చక్కని యు ద్యోగి యైన వాడు
తనకు భర్తగా నుంటను మనసు నందు
కన్నె పిల్లలు కందురు  కలలు భువిని

తమిళ కవి యల్లసాని పెద్దనకు నతులు

పెద్ద నామాత్యు నల్లిక బిగువ త నము
మరియు జిగిబిగి నుంట కు మదిని బొంగి
వినయ ముట్టిప డునటుల  నొనర జేసె
ద మిళ కవి యల్లసాని పెద్దనకు నతులు

Saturday, May 10, 2014

పద్య రచన -జోల పాట

జోల పాటను బాడుదు జోజొ యనుచు
నిదుర పొమ్మిక హాయిగ నీవు బిడ్డ !
యింటి పనులను జూసుకు నిత్తు నీకు
వేడి వేడిగ బాలను వెఱ్రి కుంక !

పండు మంచిది తిన బనికి రాదు

మేలి రంగు తోడ మేలిమి గల మేడి
పండు మంచిది తిన బనికి రాదు
పొట్ట విచ్చి చూడ పురుగు లుం  డునుమఱి
పండు నైజ మదియ పవన పుత్ర !

గురు తుల్యులు శ్రీ నేమానివారికి నమస్కారములు


సకల శుభములు గలిగించు శంకరుండు
 ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను

మీ కు వచ్చిన రుగ్మత నాకు కలుగ
మందులను వాడ  తగ్గెను . మందు పేర్లు
మీకు వ్రాయుదు వాడుడు మీరు కూడ
తరలి పోవును రుగ్మత తనువు నుండి

మందులను వాడుచు మరియు  మరువ కుండ
భుజమునకు ఫిజియో తెర్ఫి పూట పూట
వైద్యు చేతను చేయించ వలయు నార్య !
యొక్క ముప్పది దినములు చక్క  గాను    

మందులు ;;;
medrol(8)
liryca(75)
gemcal
razo(20)
flcxabanz  Gel 

(డాక్టరు సలహా మేరకు  వాడ గోర్తాను )



రామాయణ మున్ జదివి భార తార్ధము జెప్పెన్

మాయన్న రాము డారా
మాయణ మున్ జదివి భార తార్ధము జెప్పె
న్నాయది సూరన రచితము
శ్రేయం బొనగూర్చు గాత 1సీతా దేవిన్

Friday, May 9, 2014

పద్య రచన -పేదవాని కోపము

పేదవాని కోప మేదయ్యు పెదవికి
చేటు గా ప లుకుట శేఖరయ్య !
నిజము గాదు ,ప్రభుత నిలువెల్ల కూలును
ఓటు  వలన, దెలియు నోయి మనకు 

పావన కీ లికలు చల్ల బడె నాజ్యముతోన్

పావన జలములు వోయగ
పావన కీ లికలు చల్ల బడె నాజ్యముతో
న్నావహ కీలిక లెగసెను
లావుగ మఱి మింటి వరకు లైలా !కనుమీ

 

పద్య రచన -పిచ్చుక

పిచ్చుక చిత్రము జూడుము
మచ్చుకకికకానరావు మరి మన కికయున్
పిచ్చుక లవి నశియించెను
హెచ్చుగ వేటాడు కతన నెందరొ  వాటిన్ 

Wednesday, May 7, 2014

పద్యరచన -మోదుగ పూలు

మోదుగ పూలవి జూడుడు
మోదము గలిగించు చుండె మోహన రీతిన్
యాదగిరి గురువు పొలమున
పాదపమును జూడ నేను బ్రమదము గలిగెన్ 

పద్య రచన -వరి పంట

పంట చేలలో బండిన పంట జూడ
కళ్ళు మిరుమిట్లు గొలిపెను కంకె లవియ
రైతు లప్పుడు చేలను గోత గోసి
తెత్తు రిండ్లకు మనసులు దేట బడగ



 

కడుపాయెను గొడుకు చేత కాంతా మణికిన్

అడపా తడపా జరుగును
కడుమదమున నుండి మఱియు  కామము పెచ్చౌ
నడరెడు తల్లులు గలచో
కడుపాయెను గొడుకు చేత కాంతా మణికిన్ 

Monday, May 5, 2014

పద్య రచన -ప్రభుత్వ వ్యవహారములు తెలుగులో వ్రాయుట

అన్నవరపు దే వేందర  యన్న పలుకు
లక్షరాల నిజ ము మఱి  యాంగ్ల మందు
కాక తెలుగుభా షను వ్రాయ  కద్దు మనకు
తెలుగు వారము కతనన  తేజ ! వినుము 

రెక్క లాడని యె డలను డొక్క లాడు

 రెక్క లాడని యె డలను డొక్క లాడు
నిజము నాపట్ల యీయది నెలకు నెలకు
భృత్య మాయది వచ్చును బ్రదుకు టకును
కూడు గుడ్డకు నాకిట  కొదవ లేదు 

వానపాము కాటు ప్రాణ హతము

భూమి పెల్ల గించు బోర్ల, వే యదెపుడు
వానపాము కాటు ప్రాణ హతము
త్రాచు పాము కాటు తలిరు బోడి కనుము
విషము కలుగు నోటి  వెనుక వైపు 

Sunday, May 4, 2014

పద్యరచన - నాన్నా -పులి

వ్యాఘ్రమును జూచి బాలుడు వ్యాకు లతను
దరువు నెక్కియు పిలిచెను దండ్రి నపుడు
వాని పలుకులు వినియును రాని కతన
పులికి నాహార మయ్యెను సులువు గాను 

ఓ డిన వాడలర గెలిచి యొక్కం డే డ్చెన్


ఓ డుట గెలుచుట కతమని
నో  డిన వాడలర గెలిచి యొక్కం డే డ్చె
న్నో డిన య తడే తనచెలి
కాడౌ టౌ ట యెరింగి  గెలుపు కాకూ డనుచున్

 
 

Saturday, May 3, 2014

పద్య రచన -కుకవి

పుట్ట గొడుగుల వలెనను బుట్టుదు రట
కుకవు లెందరో పుడమిని  కోరి వారు
తప్పు భావాలు బోధింతు రిప్పుడమి జ
నులకు ,నమ్మ వలదు వారి నోటి మాట 

Friday, May 2, 2014

కుల తత్త్వమెరింగి యున్న గూడును సుఖముల్

కలతలు రావుగ యెప్పుడు
కుల తత్త్వమెరింగి యున్న, గూడును సుఖము
ల్గలుగును శివు నర్చించిన
మెలకువగా నుండు మెపుడు మేదిని యందున్
 

పద్యరచన -మద్యపానము

మద్య పానము చేయకు మామ ! నీవు
మద్య పానము వలనన మతియ  చెడును
చిల్లు పడునయ్య ! నీ గుండె చివర కికను
విగత జీవులు నగుదురు వేగముగను
 

Thursday, May 1, 2014

రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె

రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె
నిజము , నిద్ర లే కపవలు  నిదుర వోవ
పవలు మెలకువ మఱి రాత్రి పడక మంచి
దెల్ల వారల కునుమరి  యింతు లార !
 

పద్య రచన -పిల్లలు -ఆటలు

ఆట లాడుచు నుండిరి యచట చూడు
చిన్న పిల్లలు చక్కగ చెన్ను మీ ర
ముద్దు లొలికించు మోముతో మురియు చుండె
పిల్ల లనగను నిట్లుండ  నుల్ల మలరు



 

పద్య రచన -నూతన దంపతులు

క్రొత్త దంపతు లక్కడ కుతుక మొప్ప
నొకరు నొకరిని జూచుచు నుక్క డించు
కొనుచు నవ్వులు చిందించు కొనగ జూడ
నంద మొలికించె నాజంట యిందు వదన !