skip to main
|
skip to sidebar
subbarao
Saturday, November 28, 2015
సిరియు వాణియునొక్కచో జేరరెపుడు
సిరియు వాణియునొక్కచో జేరరెపుడు
నటుల ననవల దు నెపుడునార్య! మీరు
నాదు గ్రామపు యాసామినమ్ముడు మరి
సిరియు వాణియు రెండునుజేరె నతని
కార్తిక పూర్ణిమ
కార్తిక పూర్ణిమ రోజున
నా ర్తిని శ్రీసాంబశివుని నారాధించన్
పూర్తిగ నిచ్చును శుభములు
కార్తీకా,నీవుకూడ కాలుని కనుమా
గఠిన చిత్తులుగద కన్న వారు
ఆడ పిల్ల యనుచు నాయా తెలుపగానె
యింటి దగ్గరగల యేరు లోన
పారవైచెను మరి పాపనునిర్దయ
గఠిన చిత్తులుగద కన్న వారు
Friday, November 20, 2015
పద్య రచన -నమ్మితి ని నామనమున సనా తనులగు
నమ్మితి ని నామనమున సనా తనులగు
పార్వ తీ పర మేశ్వరు పాద పద్మ
ములను గడు గాఢ మగు బ్రేమ ముట్టి వడగ
నాది దంపతు లేగద, యార్య !వారు
Thursday, November 19, 2015
కావ్య మునులి ఖించె గత్తి తోడ
నవర సముల తోడ నన్నెచోడు డిల ను
కావ్య మునులి ఖించె, గత్తి తోడ
పనస పండు కోసి పంచుము తొనలను
దినగ నవియ యుండు దీ య గాను
Wednesday, November 18, 2015
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్
బంగరు వన్నెల గూడిన
రంగని సతియైన యా మె రక్తిని గనగా
నంగనల మనమ్ములు విమ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్
పద్య రచన -పరి పరి విధముల ...
పరి పరి విధముల జెప్పితి
నరుడా ! యది వినని యెడల నరకమె గలుగున్
నరుడ నుకొని రాముని మఱి
పరునిం గా జూడ కెపుడు ,పరమా త్ముండే
మానము పోవలె నటంచు మానిని తలచెన్
మానినుల కెపుడు ముఖ్యము
మానము, పోవలె నటంచు మానిని తలచెన్
మానిను లసత్య వాదులు
గాననుట ను బుడమి యందు కలకా లంబున్
Tuesday, November 17, 2015
పద్య రచన -బాలుడు -మూడు నామాలు
విష్ణు బూజించు వారిని వైష్ణవులుగ
బరిగ ణిo తురు గద మఱి బాలు డచట
మూడు నామాల తోడన ముద్దు లొలుకు
చుండె జూ డుడా చిత్రము సూరి !మఱియు
వార్చు చుండెను సంధ్యను బాగు గాను
పద్య రచన ---నేనొక పూలమొక్క కడ ...
నేనొక పూలమొక్క కడ నిల్చి సుమమ్ములు గోసి యీ శు ని
న్వేనకు వేలు మంత్రములు వేగము తోడను నుచ్చ రించుచు
న్నానన మందు సంతసము నా రడి గొల్పగ బూజ జేయగా
మానస మందు గల్గె మఱి మాయని దృప్తియు గారవంబులున్
కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్
ధరనుండు ప్రజలు నిరతము
విరసముగా నుండ బోక బ్రియమును దోడ
న్నొకరికి మఱి యొక రిడుసహ
కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్
వీరావేశముజెందుచు
నేరినిమరి తూలనాడకెప్పుడుగూడన్
వీరా! యెరుగుము నీసహ
కారమ్శే భూజనులకుగడుహితమొసగున్
Sunday, November 15, 2015
జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్
ఇలమంచు మిగుల గలుగుత
జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్
మలమలమాడుచుదరువులు
పలుమారులుధగ్ధమయ్యె బగలునురేయున్
పద్య రచన -వరవీణామృదుపాణీ
వరవీణామృదుపాణీ
సరసిజములబోలునయన చదువుతల్లీ
మరినానాలుకమీదన
నిరతము వసియించుమమ్శ నెయ్యము దనరన్
పద్య రచన బాలల దినో త్సవము
చాచా పుట్టిన రోజును
నాచారముగా జరుపుకొందుమానంద ముగాన్
చాచాకు జయముబలుకగ
నాచావడి మారుమ్రోగి యంబరమంటున్
పద్య రచన -ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు ననుచు ...
ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు ననుచు
గలలు గనకుమ యెన్నడు కాంత ! నీవు
కీడు చేయువాం డ్రే గాని గేలు నీయ
రుగద యెవరును నోయమ్మ ! యుర్వి యందు
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
భీకరముగ నుడి వితిరే
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
కాకర చేదుగ నుండక
యేకర ణి ని దీయ నుండు నీ శా ! చెపుమా .
Friday, November 13, 2015
నేటి బాలలే రేపటి నేర గాండ్రు
చదువు సంధ్యలు లేకుండ చవట లవలె
గ్రామగ్రామాలు దిరుగుచు గనక దారి
జీవ నోపాధి కొఱకు నై చేయ దొంగ
తనము ,నగుదురు కదమఱి తప్ప కుండ
నేటి బాలలే రేపటి నేర గాండ్రు
పద్య రచన -బాలల దినోత్సవము
పుట్టితి వట యీ రోజున
బుట్టిన యో నెహ్రు !నీవు పూర్ణిమ చంద్రు
న్చట్టున వెలిగితి విప్పుడ
య ట్టులె యొకసారి రమ్ము హర్షము గలుగన్
నీదు పుట్టిన రోజును నేడు మేము
జరుపు కొనుచుంటిమి మఱి బా సు రముగాను
బం డు గనువోలె ,మనసార పంచి పెట్టి
చాకు లైట్లను బాలలు సంతసించ
Thursday, November 12, 2015
పద్య రచన -ఐసు ఫ్రూ టు లు
ఐసు ఫ్రూ టు లు గలవట యార్య !చూడు
మెంత చక్కగ నున్నవో యంత చెడును
జేయు మనకవి నిజముగ చీక వలదు
సంత సంబును నొందుట సరియ చూసి
ముద్దు మగని ప్రాణముల హరించె
ముద్దు లధికము గను ముదిత యొ కతెతన
భర్త కీయ న తడు వాయి చొంగ
నోప కపుడు నయ్యె నుక్కిరి బిక్కిరి
ముద్దు మగని ప్రాణముల హరించె
Wednesday, November 11, 2015
శివుని జంపె భీమ సేను డలిగి
భక్తి తోడ నెపుడు బ్రార్ధించ వలయును
శివుని, జంపె భీమ సేను డలిగి
యుద్ధ రంగ మందు బద్ధ శ త్రువులను
ధర్మ యుద్ధ మెయది వర్మ ! తెలియు
పద్య రచన -అట జని కాం చెను .......
అట జని కాం చెను ప్రవరుడు
నిట లాక్షుని మామ నగము ,నిర్మల ఝరులన్
కుటజపు మెలికల సొగసులు
నటనల తోనింపు గొలుపు నడవి నెమళ్ళ న్
పద్య రచన -తిమిరము బా ఱద్రోలుటకు దీ పము ....
తిమిరము బా ఱద్రోలుటకు దీ పము లెల్లెడ దేజ రిల్లగా
ప్రమిద లలోన దైలము ను బాగుగ ,నిండుగ బోయు చుందురే
ప్రమదు లు నింట ,,చక్కగను భావము నింపెసలార పాడుచున్
తిమిరము నందు,, వెల్తు రది తెల్లటి కాంతిని నింపుచు న్నదే
Tuesday, November 10, 2015
దత్త పది --తాప -పాప -దీ ప -రూప (దీ పావళి )
తాప మణ గను బుడమికి దనరు నట్లు
పాప కర్ముడు నరకుని బ్రతిమ జేసి
దగ్ధ పఱతురు ,రూపము దహన మగుట
గనెఱి గి ముదము తోడన గ్రామ ప్రజలు
దీప ములవెలి గింతురు దీ ప్తు లొలుక
Monday, November 9, 2015
ఒక మంచి మాటె చాలును
ఒక మంచి మాటె చాలును
నొకరిని నిల బాగుజేయ నో గురు వర్యా !
యకళం క మనసు గలిగిన
నొక నేస్తమె చాలు వాని నూరడి జేయన్
కల్లు పాకలో పురుష సూక్తము పఠిం చె
తప్ప త్రాగును నిత్యము తంగ వేలు
కల్లు పాకలో, ,పురుష సూక్తము పఠిం చె
గర్భ గుడిలోన రమభావ గర్భి తముగ
భక్తు లందఱు మెచ్చగ రక్తి గాను
పద్య రచన -పూ మాలల్ గడు భక్తి .......
పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూ జార్ధినై దేవరా !
యీ మాలల్ యి క నీకు సాదరముగా యీ నీ శిరంబందు నే
బ్రేమంబొ ప్పగ వైతు నో శివ ! మరిన్బ్రీ తిన్ ననున్ గావుమా
నామాట ల్ సరియౌను గా దలచి నా కోరికన్ మన్నించవే ?
Sunday, November 8, 2015
శవ పూజల వలన జన్మ సార్ధక మగురా
శవ మనగ నండ్రు శివుడని
శివు డెప్పుడు దప్పకుండ సేమము గూర్చున్
శివ శవములు నొక్క ట గుట
శవ పూజల వలన జన్మ సార్ధక మగురా
నీతుల్ జెప్పెడి వారలు
నీతుల్ జెప్పెడి వారలు
జేతలలో జూపరార్య! చెప్పుటవరకే
నీతులనుపయో గింతురు
నీతినిబాటించకున్న నేరముగాదే?
కష్టముకద గవితలల్ల గందమునందున్
శిష్టులు కొందరు పలికిరి
కష్టముకద గవితలల్ల గందమునందున్
కష్టముకాదుగ నాకది
యిష్టముగావ్రాయుచుందునెప్పుడునేనున్
భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్
అరకొర సంసారంబది
భరణమ్శునునీయలేని బ్రదుకులె యగుటన్
భరమైనను నీయగమరి
భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్
కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన
కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన దాని యర్థమే
కాలము దాపురించెనని , కాలయముండును బంపుచుండునా
గేలమువంటి రజ్జునును.కాలముదీరెను నీకునింకనో
బాలుడ! రమ్ముమా యిటకుపాపము బుణ్యము లెక్కజూతునే
ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
అండాళూ ! వింటివ యిది
ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
ముండాపదమదిపలుకుట
రండలకేజెల్లుగాని రాదది మనకున్
పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా
పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా
గద్యము గూడనావిధము హృద్యముగా మరియుండినొప్పినన్
అద్దిర యంచు నెప్పుడును నందరు మెత్తురుగాదెయయ్యదిన్
పద్యము లన్నియున్ మరియుగద్యములున్ జదువంగనేర్తురే
రామయననిననోరు రాతిరోలు
పావనంబు నగును బ్రత్యహమునునిల
రామయననిననోరు రాతిరోలు
బొత్ర ముండెనుగద పూర్వకాలమునందు
గృహము గృహమునందు కృష్ణ ! వింటె?
వనితయు గవితయు రెండును
వనితయు గవితయు రెండును
నెవరికినిన్ బోధపడవు నిసుమంతయును
న్నవగత మగుటకు గావలె
నవిరళమగు నోర్పు మనకునార్యా గురువా
పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్
పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్
ఎన్నడువింటిమేయిదియ పిన్నలు పెద్దలునేగిరా మరిన్
పిన్నలునెట్లుగానపుడు వెళ్లిరి యెన్నడులేనిపెండ్లికిన్
అన్నదయాకరా చెపుమ యాతృతగామదియుండెనిప్పుడున్
చుక్కలు మిలమిలమెరిసెను
చుక్కలు మిలమిలమెరిసెను
చక్కగనాకాశమందు చంద్రుని తోడన్
చిక్కటి రాతిరి యగుటన
అక్కాయది సహజమమ్శ యాలోచింపన్
Tuesday, November 3, 2015
పద్య రచన -దైవము పై ........
దైవము పై న భారమిడి ధర్మము దప్పక జీవనం బును
న్నెవ్వడు జేయునో నతని నేడు తరంబుల వారికి న్దగన్
లావుగ సర్వ సంపదలు లాస్యము గామఱి యీ శు డి చ్చుత
న్వేవురు సంతసంబడగ,వీడని బ్రేమను గల్గి యుంట చే
Monday, November 2, 2015
అంగదుని జంపె నర్జును డా హ వమున
రాయ బారిగ పంపెను రాము డా ర్య !
యం గదుని, జంపె నర్జును డా హ వమున
వేల కొలదిగ రిపులను వేటు వ ఱఛి
యుద్ధములు లేక యుండుట యొప్పు ధరను
Sunday, November 1, 2015
పద్య రచన ---- విసమును మ్రింగి నట్లు ....
విసమును మ్రింగి నట్లు కడు వేదన బొందగ నేలభా మినీ !
రుస రుస లాడు చుండు నుగ రోజును నీపతి దప్ప ద్రాగుచు
న్వ్య సనపు మైకమే యది యు బాధలు దప్ప వుగాక !నీ కుపా
యసమును దెత్తు నే దిన ప్రియంబని నీకు లలామ !యిప్పుడున్
ధనమే మోక్షము గడించు దారిని జూపున్
కనుమా చెడుకున్మూ లము
ధనమే, మోక్షము గడించు దారిని జూపు
న్ననయము శంభుని ధ్యానము
విను మఱి యీ నాదు మాట వేంకట రమణా !
భరతభూమిరక్షబడులుగుడులు
భరతభూమిరక్షబడులుగుడులుగాదు
మంచిశిక్షణగల మాన్యు డైన
సైనికుండునగును శర్మ తెలియు
బడులు గుడులు బుధ్ది వడయు మిగుల
బ్రాహ్మణుండు మాంస భక్ష కుండు
యజ్ఞ యాగ ములను విజ్ఞత గా జేయు
బ్రాహ్మణుండు ,మాంస భక్ష కుండు
బ్రాహ్మ ణే త రుడగు పార్ధ సారధి గారు
మాంస భక్ష ణ మ్ము మంచి గాదు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
►
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
►
April
(50)
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
▼
2015
(743)
►
December
(53)
▼
November
(44)
సిరియు వాణియునొక్కచో జేరరెపుడు
కార్తిక పూర్ణిమ
గఠిన చిత్తులుగద కన్న వారు
పద్య రచన -నమ్మితి ని నామనమున సనా తనులగు
కావ్య మునులి ఖించె గత్తి తోడ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్
పద్య రచన -పరి పరి విధముల ...
మానము పోవలె నటంచు మానిని తలచెన్
పద్య రచన -బాలుడు -మూడు నామాలు
పద్య రచన ---నేనొక పూలమొక్క కడ ...
కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్
జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్
పద్య రచన -వరవీణామృదుపాణీ
పద్య రచన బాలల దినో త్సవము
పద్య రచన -ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు ననుచు ...
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
నేటి బాలలే రేపటి నేర గాండ్రు
పద్య రచన -బాలల దినోత్సవము
పద్య రచన -ఐసు ఫ్రూ టు లు
ముద్దు మగని ప్రాణముల హరించె
శివుని జంపె భీమ సేను డలిగి
పద్య రచన -అట జని కాం చెను .......
పద్య రచన -తిమిరము బా ఱద్రోలుటకు దీ పము ....
దత్త పది --తాప -పాప -దీ ప -రూప (దీ పావళి )
ఒక మంచి మాటె చాలును
కల్లు పాకలో పురుష సూక్తము పఠిం చె
పద్య రచన -పూ మాలల్ గడు భక్తి .......
శవ పూజల వలన జన్మ సార్ధక మగురా
నీతుల్ జెప్పెడి వారలు
కష్టముకద గవితలల్ల గందమునందున్
భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్
కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన
ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా
రామయననిననోరు రాతిరోలు
వనితయు గవితయు రెండును
పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్
చుక్కలు మిలమిలమెరిసెను
పద్య రచన -దైవము పై ........
అంగదుని జంపె నర్జును డా హ వమున
పద్య రచన ---- విసమును మ్రింగి నట్లు ....
ధనమే మోక్షము గడించు దారిని జూపున్
భరతభూమిరక్షబడులుగుడులు
బ్రాహ్మణుండు మాంస భక్ష కుండు
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)
నేరినిమరి తూలనాడకెప్పుడుగూడన్
వీరా! యెరుగుము నీసహ
కారమ్శే భూజనులకుగడుహితమొసగున్