skip to main
|
skip to sidebar
subbarao
Friday, April 28, 2017
వడగాలుల జల్లదనము వర్ణింతు నెటుల్
అడపా తడపా వానలు
పడుటన నీపుడమి యంత పచ్చగ మార
న్నెడదకు హాయిని గొలుపగ
వడగాలుల జల్లదనము వర్ణింతు నెటుల్
Wednesday, April 26, 2017
అన్నమ లేని పేద పరమాన్నము బంచెను గ్రామ మంతటన్
మన్నున నెంతగా వెదుక మాన్యుడ కానడు గాక కానడు
న్న న్నమ లేని పేద, పరమాన్నము బంచెను గ్రామ మంతటన్
మిన్నగు సంతసంబొలుక ,మేయరు పో స్ట ది దా వరించుట
నున్నవ రామశంకరుడు దోసిలి పట్టిన వెండి నాణెముల్
అన్నమె లేనినరుడు పరమాన్నము బంచెన్
మన్నున నుండడు సామీ !
య న్నమె లేనినరుడు, పరమాన్నము బంచె
న్ను న్నవ శేషాచలపతి
సన్నుతి దా బొందువలన సత్కవు లె దుటన్
Tuesday, April 25, 2017
కో రిజనార్దనుండపుడు కోటర మందున దాగె భీతుడై
ఆరవి యస్తమించుతరి యాయమ దూతలు రాగనప్పుడున్
కో రిజనార్దనుండపుడు కోటర మందున దాగె భీతుడై
యారయ నేర్వరా యతని నాకృతి జూచిన వారలప్పుడున్
మారునుమాటలాడక నమాంతముబ్రాణముదీతురేకదా
కోరి దాగెను ,విష్ణువు కోటరమున
శనికి భయపడి గుహలోన శంభు డార్య!
కోరి దాగెను ,విష్ణువు కోటరమున
వెలసె నండ్రుగ రికపాటి వేంక టేశు
బొలము దగ్గర గలయట్టి భూజమునకు
Sunday, April 23, 2017
నల్లని మల్లెలంగొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తి తోన్
నల్లని మల్లెలంగొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తి తోన్
జల్లగ జెప్పితీవ సుమ ! జాజులు దెల్లని మల్లె పూలతో
నల్లన జేతురే గదిల హర్షము నొందగ శంభు డెప్పుడున్
నల్లని మల్లె పూల కట నవ్విరి పోదురు విన్న వారలున్
నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్
అల్లదె యేమని యంటివి
నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్
నల్లని మల్లియ లుండునె ?
కల్లల నిట బలుకనేల కాంతా ! చెపుమా
Saturday, April 22, 2017
మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్
మగువకు బుట్టిన నైనను
మగవానికి బుట్టెనండ్రు మహిలో జనము
'ల్దగునుంగద యీ పాదము
మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్
వానలేక సస్యముల్ ,పండెమెండు
ఎండి పోయిన వ క్కట యిప్పుడమిని
వానలేక సస్యముల్ ,పండెమెండు
వలయు నంతగ వర్షాలు బడుట వలన
పప్పు ధాన్యాలు బాగైన ఫలము తోడ
వానలు లేక యీపుడమి వర్ధిలె పంటలుపండ మెండుగన్
వానలు లేక యీపుడమి వర్ధిలె పంటలుపండ మెండుగన్
వానలు లేకయీ పుడమి వారును బీటలు,గానిగాదుగా
దానుగ వృధ్ధిచెం దు నన ద ప్పను భావము నాకుదోచెగా
వానలు మెండుగా గురియ పంటలు పండును బాగుగాకదా
Friday, April 21, 2017
గరుడుడు భీతినొందెను రగమ్మును జూచు తక్షణంబునన్
గరుడుడు భీతినొందెను రగమ్మును జూచు తక్షణంబునన్
గరుడుడు భీతినొందుటకు గారణ మయ్యది కాదుగాసుమా
యురగము పారిపోయెను గ వ్యోమతలంబున గ్రద్దజూచిదా
న రయగ రెండును న్గదిల నాయెను శత్రులుగాగనిధ్ధరన్
Thursday, April 20, 2017
పాముకనిపించ గరుడుడు ,భయము నొందె
నేలవాలి గభాలున నెమకి పట్టె
పాముకనిపించ గరుడుడు ,భయము నొందె
గరుడు రాకను గమనించి కాళమపుడు
ప్రాణ భీతిని సర్పము బరగె నటుల
అక్షర సత్యమ యయ్యది
అక్షర సత్యమ యయ్యది
లక్షణముగ బలికితీవలక్షలవిలువే
రక్షణయిచ్చును మనకది
తక్షణమేయట్లయుందు తప్పను మాటన్
అక్షర లక్షల విలువగు,
నక్షరముల జిల్కె ఘనత నబ్దుల్ కలమే.
కుక్షిని జ్ఞానము నింపుచు
నక్షయమగు రిక్కయైన నాతని గొలుతున్.
ఆముదాల మురళి
ఆముదాల మురళి యనగనే నానంద
ముగలు గునట కవుల ముఖము నందు
కారణంబ యిదియ కవివరేణ్య! కవిత
మృదుమ ధురము ,మదికిమోదమిచ్చు
పార్వ తీశ్వర శర్మ
పార్వ తీశ్వర శర్మనా బరగి ధరను
వేల కొలదిగ బద్యాల విందు నిచ్చి
కడుపు నింపుదు వయ్యయో కవివ రేణ్య!
సాటి యెవరయ్య నీకిల సాటి యెవరు?
రాముని రాజ్యమందు గనరావుగదా శ్రుతి ధర్మ పధ్ధతుల్
రాముని రాజ్యమందు గనరావుగదా శ్రుతి ధర్మ పధ్ధతుల్
యేమని మాటలా డితిరి!యీశుడు రాముని రాజ్యమందు నన్
సేమము నుండిరే కదిల చిన్నలు పెద్దలు ధర్మ పధ్ధతి
న్నేమరు లేదుగా నపుడ యీశ్రుతి,ధర్మము లెన్నడున్ధగన్
రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి
ప్రజలు సుఖముగ నుండిరి రాగమలర
రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి
నేటి పాలన యందున నిజము గాను
బాలకులుబాలితుల బంధ మలర వలయు
Wednesday, April 19, 2017
కారమె వారి పెండ్లి కొకకారణ మయ్యెను వింటివే చెలీ!
వారపు సంతకున్వెడలి భారతి మోహనుజూచి ,తోడనే
మారుని బాణమున్బడగ మాటలు చేష్టలు లేకయుండినన్
వారల రూపు రేఖలును వారల జాలితనంబు మో హనా
కారమె వారి పెండ్లి కొకకారణ మయ్యెను వింటివే చెలీ!
కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్
నారాయణమ్మ యొకపరి
దారినిదాబోవుచుండి ధర్మునిజూడ
న్నిరువురి చూపులగలమమ
కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్
Monday, April 17, 2017
పాత కమున కవియ హేతువ గునుగద
తాను బొగడు కొనుటదానితరులనింద
జేయు టనిల రెండు జేయ రాదు
పాత కమున కవియ హేతువ గునుగద
రెంటి వలన గీడు మింటి కెగయు
Sunday, April 16, 2017
పగలె శోభించె జంద్రు డంబరము పైన
సూర్య గ్రహణపు దినముననార్య!పగలె
యంధకారమౌటవలన నయ్యదునన
పగలె శోభించె జంద్రు డంబరము పైన
సూర్య చంద్రులి రువురును జోతులెగద
కన్నె బంగార పురచన
కన్నె బంగార పురచన కనగ నయ్యె
సంత సంబును మిన్నగా సామి! మదికి
కవిత వైఖరి జూడగ గాంతు లీనె
నందు కొనుమార్య!జోహార్ల నందు కొనుము
దారము లేని హారము దరుణిదాల్చె
దారము లేని హారము దరుణిదాల్చె
దాల్చ వచ్చును హారము దరుణి యార్య!
పసిడి హారము నకదియ వసరముగలు
గదుక దయికయా దారము కనుగొనంగ
దారము లేనిహారము నితంబిని దాల్చెను సంతసంబునన్
దారము లేనిహారము నితంబిని దాల్చెను సంతసంబునన్
హారము కాదుగా నదియ హారము నాబడు దారముండినన్
దారము దోడగూడగను దానిని నందురు హారమున్నిలన్
హారము జేతురే కదిక యభ్రము జేతను హేమకారుడున్
Friday, April 14, 2017
భుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్
ముక్తిని గోరువారుభువి మోదము నొందుచు జింతనొందరే
భుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్
రక్తిని గామభోగముల రాటునుదేలుచు వన్నెకెక్కెగా
ముక్తియు భక్తియున్నికను మోదము గూర్చునురక్తిగల్గుచో
Thursday, April 13, 2017
భుక్తికి లేనట్టి పరమ భోగి యతండే
భక్తిని ఫలమును నీయగ
భుక్తికి లేనట్టి పరమ భోగి యతండే
రక్తిని.సిరులను నింకను
భుక్తిని మనకి చ్చునతడు భువనమునందున్
తలతునునేసాంబశివుని దలతును రాము
తలతును మదిలోనిరతము
తలతునునేసాంబశివుని దలతును రామున్
దలచిన లీలగ నిత్తురు
తలపులలో వారి రూపు తన్మయమొందన్
Wednesday, April 12, 2017
శ్రీనాధునికృతిగ. మనుచరిత్రయె యొప్పున్
వినబడు కాశీఖండము
శ్రీనాధునికృతిగ. మనుచరిత్రయె యొప్పున్
వినసొంపగుకధలుగలిగి
మనుగడ నేనేర్పెనార్య! మనుసంతతికిన్
Monday, April 10, 2017
బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడతులకును
విరహ వేదన తోడన భీకరముగ
బాధ పడుచుండు భారతి భర్త రాగ
ముదము కలుగుచు నొడలెల్ల ముడువ, పుష్ప
బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడతులకును
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్
శకునికిదమ్ముడుండుట యు సాత్యకి పుత్రుడు గల్గుటొప్పునే
తికమకగాను దోచును జితేంద్రుని కైనను సత్యమేకదా
యకటకటా యిదేమిది? యరాచక పల్కులు వింటివే శివా!
Sunday, April 9, 2017
శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్
అకటా యేమంటిరి దొర
శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్
శకునియు కృపుడును సాత్యకు
లొకరికి నొక రేమికారె యూహించంగన్
తప్పక సేయునట్టివగు తప్పులగున్ గనధర్మబధ్ధముల్
తప్పక సేయునట్టివగు తప్పులగున్ గనధర్మబధ్ధముల్
దప్పవు గొన్ని తప్పులను దద్దయు జేయగ గొన్నివేళల
న్నప్పులు సేయునప్పుడునునద్దిర పెండ్లిని జేయునప్పుడున్
దప్పదసత్యమున్బలుక ధర్మమె యౌనది శాస్త్రపధ్ధతి
Saturday, April 8, 2017
ధర్మబధ్ధము లట తప్పు లెల్ల
చెట్టు చాటు నుండి మట్టుజేసిననైన
ధర్మజుండు బొంకు దాప లుకను
పాండు వంశ మదియ బహువిచిత్రముగద
ధర్మబధ్ధము లట తప్పు లెల్ల
Friday, April 7, 2017
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పును లేనిచో నిక
న్నడుగును వేయలేముగ నవారిత యెండను బాదరక్షలున్
గొడుగును లేనిచో ధరను గోడలిపిల్ల!నెరుంగుమా యిదిన్
గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే
బడుగా 1 యేమని యంటివి
గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే
గొడుగది లేబోజాలవు
నడచుచు మధ్యాహ్న వేళ నడిరోడ్డు న నన్
వీచిన మంద వాతమున , వీగెను శైలము దూది భంగినిన్
చూచుచు నుండగా బుడమి శోభిలె జక్కగ రెమ్మలా ర్చుచున్
వీచిన మంద వాతమున , వీగెను శైలము దూది భంగినిన్
వీచగ నంజనా సుతుని వేగపు ధాటికి వాయు వీచికల్
పోచనపెద్ది! ముఖ్యమిల భూతము లందున వాయువేకదా
Thursday, April 6, 2017
వీచె మందమారుతము .క్ష్మాభృత్తు వీగె
మనసు రంజిల్ల చక్కటి మమత లొలుక
వీచె మందమారుతము .క్ష్మాభృత్తు వీగె
క్ష్మాజ ములుపెద్ద యెత్తున గదలి కూల
పెను తుఫానులు రాకను భీకరముగ
Wednesday, April 5, 2017
జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్
అనువున రామ చంద్రుడు మహా మహు డౌచు భయంకరా స్త్రమున్
దునుకలు జేసి సీతకు నితోధిక సంతసమొప్ప జేయగా
వినుము సహోదరా యిది వివేకము తోడన భూ ప్రజాళికిన్
జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్
జనకుండని పెండ్లి యాడె జానకి రామున్
వినుమా జగమున కంతకు
జనకుండని పెండ్లి యాడె జానకి రామున్
గ న గ ను సత్యమె గద యది
ధనువును నతడె క్కువెట్టి దా నయె బతిగా
రామునకున్సహోదరి ,ధరాసుత సీతగదా తలంపగన్
ఆముని రోమపాదుని నాశలు దీరగ బుట్టు శాంతయే
రామునకున్సహోదరి ,ధరాసుత సీతగదా తలంపగన్
రామునకెయ్యెడన్గనిన రమ్యత గల్గుట భార్యయే యగున్
రాముని సేవజేయుదును రాముని బ్రాపును నొంద గోరికన్
దండక మయ్యది
దండక మయ్యది చదువగ
దండమునే బెట్టవలయు దాదృశ కవికిన్
దండము బెట్టుదు నేమరి
పండితుడవు రచనయందు బాలా! నీవున్
రామునకు సహోదరి గదా .రమణి సీత
శాంత యనబడు భామిని సరళ యువతి
రామునకు సహోదరి గదా .రమణి సీత
రామచంద్రుని పత్నియే భామ! వినుము
దున్ను చుండగ భూమిని దొరకె జనకు
నకట యతనిభా గ్యమునేమ నగ గ లము!
Monday, April 3, 2017
నీచ దశనంది సజ్జనుల్, నీల్గు చుంద్రు
ధర్మ మార్గము దప్పరు దాము గాను
నీచ దశనంది సజ్జనుల్, నీల్గు చుంద్రు
బువ్వ దినుటకు రమ్మని పూర్ణ పిలువ
రాను రానని మారాము శ్రీను జేసె
తల్లికిదాళి కట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
అల్లదె పిల్లవా డొకడు హర్షము తోడన వప్పజెప్పుచున్
గల్లయుకాదు నా పలుకు కాంచుడు మీరలు దీనిభావము
న్నుల్లము సంతసించగను నూర్మిళ సోదరి సీతనాగ మా
తల్లికిదాళి కట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
తల్లి బెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
ఆమె జనకుని పుత్రిక యాస తీమ
తల్లి బెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
రాము నెరుగుమా సాక్షాత్తు రహిని మహికి
మానవా కారమెత్తిన మహితుడతడు
Sunday, April 2, 2017
అవగాహన లోపంబున
అవగాహన లోపంబున
నవకతవక వ్రాసియుంటి నార్యా! నేనున్
వివరముగ మరల వ్రాయుదు
గవనము బాగుండునటుల కాలుని గరుణన్
తల్లి పెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
బాల్య మందున వాల్మీకి ప్రాపు నొందు
కతన మేటివీరులుగను గణన కెక్కి
లలిత మనోహ రులునైన లవుడు కుశుల
తల్లి పెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
భీ మ శం క ర
భీమ శంకర! కవివర! ప్రియము తోడ
నాదు వందన శతముల నందు కొనుచు
బాల కాండను బ్రచురించ వలయు నిచట
చదువ గోరుదు నేనిట సాంత ముగను
Saturday, April 1, 2017
పార్ధు డర్జునునకు బావ మరది
పార్ధు డర్జునునకు బావ మరది యట
పార్థు డర్జు నులన నర్ధ మొకటె
పృధకు కొమరు డగుట పార్ధుడు గ బిలువ
బరగె నిలను సామి !వేరు కాదు
నారద మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతి ప్రసన్నులున్
నారద మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతి ప్రసన్నులు
న్నూరక మాటలా విధము నోటిని బల్కగ నాయమేన? యో
వీరయ శాస్త్రి !నీ విపుడు వేమఱు బల్కుట , దెల్సుకో సుమీ
నారద మౌని సత్తముడు నాకము నందున వాసముండుగా
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
About Me
subbarao
View my complete profile
Blog Archive
►
2024
(3)
►
December
(1)
►
July
(1)
►
February
(1)
►
2023
(1)
►
November
(1)
►
2022
(70)
►
December
(1)
►
September
(1)
►
August
(2)
►
July
(14)
►
June
(44)
►
March
(3)
►
February
(4)
►
January
(1)
►
2021
(480)
►
December
(3)
►
November
(3)
►
September
(31)
►
August
(57)
►
July
(54)
►
June
(61)
►
May
(61)
►
April
(53)
►
March
(56)
►
February
(53)
►
January
(48)
►
2020
(740)
►
December
(58)
►
November
(60)
►
October
(58)
►
September
(66)
►
August
(58)
►
July
(62)
►
June
(61)
►
May
(64)
►
April
(66)
►
March
(65)
►
February
(58)
►
January
(64)
►
2019
(676)
►
December
(57)
►
November
(47)
►
October
(61)
►
September
(56)
►
August
(57)
►
July
(62)
►
June
(45)
►
May
(40)
►
April
(62)
►
March
(76)
►
February
(53)
►
January
(60)
►
2018
(659)
►
December
(46)
►
November
(62)
►
October
(56)
►
September
(68)
►
August
(58)
►
July
(62)
►
June
(57)
►
May
(54)
►
April
(34)
►
March
(35)
►
February
(65)
►
January
(62)
▼
2017
(525)
►
December
(21)
►
November
(53)
►
October
(44)
►
September
(61)
►
August
(30)
►
July
(25)
►
June
(31)
►
May
(16)
▼
April
(50)
వడగాలుల జల్లదనము వర్ణింతు నెటుల్
అన్నమ లేని పేద పరమాన్నము బంచెను గ్రామ మంతటన్
అన్నమె లేనినరుడు పరమాన్నము బంచెన్
కో రిజనార్దనుండపుడు కోటర మందున దాగె భీతుడై
కోరి దాగెను ,విష్ణువు కోటరమున
నల్లని మల్లెలంగొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తి తోన్
నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్
మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్
వానలేక సస్యముల్ ,పండెమెండు
వానలు లేక యీపుడమి వర్ధిలె పంటలుపండ మెండుగన్
గరుడుడు భీతినొందెను రగమ్మును జూచు తక్షణంబునన్
పాముకనిపించ గరుడుడు ,భయము నొందె
అక్షర సత్యమ యయ్యది
ఆముదాల మురళి
పార్వ తీశ్వర శర్మ
రాముని రాజ్యమందు గనరావుగదా శ్రుతి ధర్మ పధ్ధతుల్
రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి
కారమె వారి పెండ్లి కొకకారణ మయ్యెను వింటివే చెలీ!
కారమె వారలకు పెండ్లి కారణ మయ్యెన్
పాత కమున కవియ హేతువ గునుగద
పగలె శోభించె జంద్రు డంబరము పైన
కన్నె బంగార పురచన
దారము లేని హారము దరుణిదాల్చె
దారము లేనిహారము నితంబిని దాల్చెను సంతసంబునన్
భుక్తి హుళక్కియౌ .పరమ భోగి యతండు ధరాతలంబునన్
భుక్తికి లేనట్టి పరమ భోగి యతండే
తలతునునేసాంబశివుని దలతును రాము
శ్రీనాధునికృతిగ. మనుచరిత్రయె యొప్పున్
బాణ ఘాతముల్ సుఖమిచ్చు పడతులకును
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్న...
శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్
తప్పక సేయునట్టివగు తప్పులగున్ గనధర్మబధ్ధముల్
ధర్మబధ్ధము లట తప్పు లెల్ల
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో
గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే
వీచిన మంద వాతమున , వీగెను శైలము దూది భంగినిన్
వీచె మందమారుతము .క్ష్మాభృత్తు వీగె
జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్
జనకుండని పెండ్లి యాడె జానకి రామున్
రామునకున్సహోదరి ,ధరాసుత సీతగదా తలంపగన్
దండక మయ్యది
రామునకు సహోదరి గదా .రమణి సీత
నీచ దశనంది సజ్జనుల్, నీల్గు చుంద్రు
తల్లికిదాళి కట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
తల్లి బెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
అవగాహన లోపంబున
తల్లి పెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
భీ మ శం క ర
పార్ధు డర్జునునకు బావ మరది
నారద మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతి ప్రసన్నులున్
►
March
(71)
►
February
(56)
►
January
(67)
►
2016
(773)
►
December
(70)
►
November
(52)
►
October
(77)
►
September
(65)
►
August
(46)
►
July
(54)
►
June
(58)
►
May
(77)
►
April
(78)
►
March
(59)
►
February
(82)
►
January
(55)
►
2015
(743)
►
December
(53)
►
November
(44)
►
October
(72)
►
September
(62)
►
August
(75)
►
July
(50)
►
June
(55)
►
May
(54)
►
April
(62)
►
March
(64)
►
February
(71)
►
January
(81)
►
2014
(781)
►
December
(73)
►
November
(80)
►
October
(74)
►
September
(64)
►
August
(61)
►
July
(50)
►
June
(61)
►
May
(60)
►
April
(80)
►
March
(90)
►
February
(45)
►
January
(43)
►
2013
(795)
►
December
(32)
►
November
(21)
►
October
(51)
►
September
(65)
►
August
(88)
►
July
(76)
►
June
(48)
►
May
(61)
►
April
(83)
►
March
(119)
►
February
(94)
►
January
(57)
►
2012
(621)
►
December
(46)
►
November
(35)
►
October
(53)
►
September
(63)
►
August
(65)
►
July
(70)
►
June
(74)
►
May
(55)
►
April
(56)
►
March
(34)
►
February
(32)
►
January
(38)
►
2011
(202)
►
December
(72)
►
November
(43)
►
October
(13)
►
September
(25)
►
August
(22)
►
July
(10)
►
June
(17)
►
2010
(64)
►
June
(2)
►
May
(1)
►
March
(10)
►
February
(36)
►
January
(15)
►
2009
(9)
►
November
(1)
►
July
(6)
►
March
(2)
►
2008
(5)
►
November
(5)