Monday, April 30, 2018

wtuk

పెద్ద చదువుల కొఱకునై  పేరి శాస్త్రి
పితరు డాదిగా గలయట్టి ,పెద్దలైన
తండ్రులకు మ్రొక్కెను  పతివ్రతా సుతుండు
దాను బోవుచు నమెరికా తదియ నాడు

Sunday, April 29, 2018

దత్తపది

వినుము మామాయ్య! కాదుత్త వియవి కావు
నాదు మాటలు,రణమున నరుడు విల్లు
నెత్తకుండగ జేయంగ నీశు తరమె?
తేరు గరి టెక్కెములగని శత్రువులట
నారి కొంచెంబు సారించ నభము జేరు

Saturday, April 28, 2018

ఆకాాాశవాాాణి

తలపువ్వుల్వికసించి నప్పుడెగదా ధన్యత్వమీజన్మకు
న్నలయాపార్వతి శంకరున్నెపుడు బాహాటంబుగాప్రేముడి
న్భలపుష్పాదులతోడ నిత్యమునుదాబ్రార్ధించగా నాతడు
న్భలమున్నీయగదానుగాసతికి నాప్రాంతంబుదర్శించెగా
-------
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

శ్రీరాాాము

ఒౌరా! యేమని నుడివిరి?
శ్రీరాముడు శివునిజంపెసీతకు సుతుడై
శ్రీరాముడుమాశివుడును
గారే? యిలనేకరూపుగలిగిన వారల్

Friday, April 27, 2018

dhkll

అతివలు దాముమారగ సహాయక ద్రవ్య పదార్ధసంపదన్
 బతులుగభామలయ్యెడనభర్తలుగాగనుమారగోరగన్
 సతిసతి క్రీడసల్పగ మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
 పతిసతులిట్లుమార్పులను భావనజేయుట వింతయేగదా

సతిసతిక్రీడింప పురుష సంతతి గల్గెన్

ప్రతిదినము వీలుకుదరక
సతమతమగుచుండ నిన్న సమయము దొరకన్
 బతినామంబున  బరగెడు
సతి,సతిక్రీడింపబురుష సంతతి గల్గెన్

న్దల్లికి దాళిగట్టిన నుదారుని దాశరధిన్దలంచెదన్

అల్లదె యామహామహుని నాత్మదలంచెదనెల్లవేళల
న్దల్లికి దాళిగట్టిన నుదారుని దాశరధిన్దలంచెదన్
 విల్లునుజేతబూనుచును వైరిజనంబుల మీదకేగగా
నెల్లరు భీతినొం దుచును నిండ్లను వీడుచుబాఱి పోదురే

Thursday, April 26, 2018

తల్లికిందాళి గట్టెను దాశరధియె

శివుని వింటిని విఱిచియ శేష సభికు
లచ్చె రువునొంద జేసెను నాక్షణమున
పూల హారము తోడను  చెలులు రాగ
దివ్య వేదిక సాక్షిగ భవ్య సీత
తల్లికిందాళి గట్టెను దాశరధియె

Tuesday, April 24, 2018

పొలమును దున్నగనె,పుత్రిపుట్టుటయెటులో

ఇలజానకి పుట్టెనుగద
పొలమును దున్నగనె,పుత్రిపుట్టుటయెటులో
యలయా బ్రహ్మయె యెఱుగును
దెలియంగా రాదుసుమ్మి తిరుమలరాయా!

పెండ్లి శుభాకాంక్షలు

పెండ్లి దినమౌట యీరోజు భీష్ము డిచ్చు
నాయురారోగ్య సంపద లమిత ముగను
జిరము వర్ధిల్లు గావుత! సిరులతోడ
నందు కొనుచునా దీవన లార్యులార!


Monday, April 23, 2018

రమ! కౌపీనము ధరించువాడె ధనికుడౌ

మమకారంబును వదలుచు
రమ! కౌపీనము ధరించువాడె ధనికుడౌ
నమలినమనసున వేమన
కుమతులదాజేరకుండ గోచిని బెట్టెన్

పుట్టజొచ్చె గరుడుడు,పాములకు జడిసి

సర్పములనెల్ల దినుటకు సమయ మెఱిగి
పుట్టజొచ్చె గరుడుడు,పాములకు జడిసి
పారివచ్చితిమటనుండి పరుగు లిడుచు
పాములనగను నేరికి భయముగాదె!

Sunday, April 22, 2018

వరకౌపీనముదాల్చువాడుకద,సంపన్నుండు దర్కించినన్

అరయన్వేమనయోగి దానెపుడుబాహాటంబుగా గోచినే
ధరియించున్గద మానవా! తెలియుమో ధాత్రిన్సదా యాతడే
వరకౌపీనముదాల్చువాడుకద,సంపన్నుండు దర్కించిన
న్నిరవు న్నొప్పగ నెప్పుడున్ధనము వర్షించున్నతండే యిలన్

Friday, April 20, 2018

రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

రాక్షస వంశపు శత్రువు
రాక్షసుడగు రావణుండ లంకేశుండే
రక్షకుడే రాము డనుచు
రాక్షసులెల్లరు  జదివిరి రామాయణమున్

శివపుత్రుడు,మఱది యగును శ్రీనాధునకున్

కవివర! వినుమా ,గణపతి
శివపుత్రుడు,మఱది యగును శ్రీనాధునకు
న్బవమానసుతుడు వలలుడె
యవనిన్దానిష్టుడగుచునాప్తుడునగుచున్

Thursday, April 19, 2018

తారాధిపుభీతి,నబ్ధిదాగెనణువునన్

కారడవుల దాగెనుగపి
తారాధిపుభీతి,నబ్ధిదాగెనణువునన్
న్నౌరా దుర్యోధనుడే
పారుచువడి భీతినొంది వలలుని వలనన్

Wednesday, April 18, 2018

రంభనుగూడిసుతనుగనెరాజర్షి వెసన్

జంభారి యాఙ్ఞ మేరకు
దంభముతోమేనకమ్మ తాఋషి జేరన్
రంభోరురువులుగలయా
రంభనుగూడిసుతనుగనెరాజర్షి వెసన్

Monday, April 16, 2018

భార మంతయు నతనిపై వైచి యుంటి

మాట యింకను రాలేదు నోటి  నుండి
యెపుడు వచ్చునో దెలియదు నించు కైన
నేమి జేయగ నెంచెనో నీశు నన్ను
భార మంతయు నతనిపై వైచి యుంటి

పూలధరింప నిష్టపడు ముగ్ధలులోకమునందు నుండురే

పూలధరింప నిష్టపడు ముగ్ధలులోకమునందు నుండురే
మాలలుగ్రుచ్చియున్మగువ మాడున నందుననలంకరించుగా
బూలను జాలమందిలను బ్రోగుగ జేసియు నమ్ముకొందురే
పూలల బంధమున్నరయ పూర్వసు భాషిణు లాకళింతురే

Sunday, April 15, 2018

పూలను ధరియింపగోరు పొలతులు గలరే

బాలా! సందియ మీయది
పూలను ధరియింపగోరు పొలతులు గలరే
పూలన నిష్టము కాదా?
మాలలుగా గ్రుచ్చ శిరపు మండన మౌనున్

ఆకాాశవాణి

అతిసా రంబులు వచ్చునా నరుని యాయాసంబువోలెన్సముల్
 యతిసాంగత్యములేని పద్యములె,విద్యాదేవి వాద్యశ్రుతుల్
 సతమున్వీణలు మ్రోగగా గరము నాశాపూరితంబయ్యుదా
శ్రుతిగా నొందుచు నెల్లవేళలిల దాసోహమ్మనంగావలెన్

Saturday, April 14, 2018

కాంతకు మ్రొక్కినన్గలుగు గామిత సంపద లెల్ల శీఘ్రమే

సాంతము భక్తితోడ నిల సద్గుణ భూషితు ,భక్తపాలుశ్రీ
కాంతకు మ్రొక్కినన్గలుగు గామిత సంపద లెల్ల శీఘ్రమే
చింతల దీర్చువాడుభువి శ్రీకర ధాముడు సత్యదేవునే
స్వాంతము నందునన్నిలిపి సాదర మొప్పగ బూజజేయుమా

కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్

శాంతము సహనము గలుగుచు
సాంతము గడు భక్తితోడ శంభుని గొలువ
న్గ్రాంతులు వెదజల్లెడుశ్రీ
కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్

న్వినుమా యయ్యది వారికి న్నగును నెవ్వేళన్బటాపంచలే

వినయంబొప్పుచు నింతులన్గనగ నెవ్వేళన్బ్రవర్తించుమా
మునికిన్నేర్వగనొప్పురాజవదనా! మోహంపు బధ్ధుల్దమిన్
 దనివిందీరగ జూతురేసతతమెత్తరిన్సుఖంబున్దగ
న్వినుమా యయ్యది వారికి న్నగును నెవ్వేళన్బటాపంచలే

Friday, April 13, 2018

మిన్నునకున్రాకుండజేయ మేనకనంపెన్

పనిగొని విశ్వామిత్రుని
మునికిన్నేర్పంగనొప్పుమోహపు బుధ్ధు
ల్నొనరెడు నాతని తపమును
మిన్నునకున్రాకుండజేయ  మేనకనంపెన్

Thursday, April 12, 2018

రణముజేయనికవికె పరాభవమ్ము

పద్య మయ్యది వ్రాసియు భావమువివ
రణముజేయనికవికె పరాభవమ్ము
ప్రాస,యతులును,గణములు భావములవి
సరిగ యుండుచో మెత్తురు సత్కవులిల

Wednesday, April 11, 2018

సరస మాడగ తగవు కృష్ణా! ముకుందా!

కన్నె పిల్లల తోడను  గలను నైన
సరస మాడగ తగవు కృష్ణా! ముకుందా!
వారి గాపాడు దుష్టుల బారి నుండి
యార్త రక్షకు డవుగాన  నడుగు చుంటి

Tuesday, April 10, 2018

పండుగ నాడుకూడ గనబ్రాతమగండెలభించెనయ్యయో

పండుగ నాడుకూడ గనబ్రాతమగండెలభించెనయ్యయో
పండుగ నాటికో మగడు పండుగకానిది నమ్ములందున
న్నండకుగానొకండు ధర నాయతరీతిని నుండయిష్టమో
రండల కిష్టమో యటుల ,రాక్షస జాతికి జెంది యుందురే

పండుగ నాడును లభించెబ్రాతమగండే

అండగ నుండుట కొరకై
పండునునే బోలినట్టి పతియే దొరకన్
 మొండిగ బలుకుట న్యాయమె?
పండుగ నాడును లభించెబ్రాతమగండే

న్నొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే

అక్కట యేమనంగనగు నాస్తులనన్నియు గూడబెట్టిన
న్నొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే
యెక్కుచుబోవుగా నపుడ యేడగు కట్లును నుండగా దగన్
 లెక్కలు సూచి యాయముడు లెంకను జేయును నుంట పాపమున్

Monday, April 9, 2018

డొక్కడొక్కడెమరియొక్కడొక్కడొకడె

రావణాదుల దునుమాడె రహిని రాము
డొక్కడొక్కడెమరియొక్కడొక్కడొకడె
సత్యమిద్దియ వలదింక సందియంబు
పేరు గాంచెను జగదేక వీరు డనుచు

ఆకాశవాణి

తెగువన్జూపుచుక్రొత్తనాయకులకేయో టిచ్చిగెల్పించగ
 న్నగుబాటంబుగ బాలనన్గడుపుచున్నాశంబె ధ్యేయంబుగా
మగువల్బాధను నొందుచుండ భువిలో మానమ్ముగోల్పోవగ
న్బగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్బర్వమ్ము లెన్నో మహిన్


Sunday, April 8, 2018

కోతులు కవులెల్లరనుచు గోకిల కూసెన్

కోతులు గుంపుగ నేర్పడి
ప్రీతిని శ్రీరామ యనుచు బ్రేమగ బలుకన్
 గోతుల పధ్ధతి జూచియు
కోతులు కవులెల్లరనుచు గోకిల కూసెన్

Saturday, April 7, 2018

బయట పడితిని నాస్పిట ల్బారి నుండి

పూర్వ జన్మపు సుకృతముల్వరలు కతన
బయట పడితిని నాస్పిట ల్బారి నుండి
కాలు డీయగ బ్రాణముల్గనిక రించి
చూడ గలిగితి జగమును సుజను లార!