Monday, December 31, 2018

జనవరి26

మూడు రంగుల  జెండాను  ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది   నేత లపుడు
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును  బంచిరి  జనవ రి యిరు
వదియ   యారు తే దియుదయా న దిశ లెల్ల
మారు మ్రోగంగ రవములు  మదిని  నిండ

ప్రజల కొరకును నింకను బ్రజల చేత
బ్రజల వలనను మఱియును బ్రజల గూర్చి
యేర్ప డెను నీగ ణ న తంత్ర మప్పు డచట
సాటి నాయక గణముల సమ్ము ఖమున


 ప్రణతి ప్రణతి శ్రీ భారత
గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

రణములు సేసిరి పెద్దలు
గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రము చిక్కి వోయె గణ నీ  యముగాన్

 గణనీయుల త్యాగముల
న్గు ణహీనులు ప్రభువు లగుచు  కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ! నీకు నతులు కాదన కమ్మా !


తృణభుక్కులు, స్వార్ధపరులు,
గుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయిన  భరతమాతకు
ననయము నిక యిచ్చు మోడి యా నందంబున్


 గణతంత్ర శుభాకాంక్షలు
వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గుణవంతుల నెన్ను కొనుడు కూరిమి తోడన్

సకల శుభములు గలిగించు శంకరుండు
గణన తంత్రపు దివసాన గుణము లాఱు
కలుగు నటులుగ దీవించి కరుణ తోడ
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళలీ వృద్ధుల చల్ల గాను .

( ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఇవి షడ్గుణములు.)
రచన = పోచిరాజు సుబ్బారావు

శ్రేయము

శ్రేయముగూర్చుచున్నెపుడుశ్రీకరకార్యముగల్గజేయునే
సాయినినమ్మికొల్చిన,గసాయిగమారునునిక్కమేకదా
పాయుచుసాయినామమునుబామరువోలెనుదిర్గుచుండియున్
నేయుపకారమున్ బ్రజకునెప్పుడుజేయకనుండువాడహో

Sunday, December 30, 2018

సాాాాాాాయిని

శ్రేయములెన్నియొకలుగును
సాయినినమ్మికొలిచిన,గసాయిగమారున్
మాయలు నేర్చిన మనుజుడు
హేయంబగుబ్రదుకుగలిగి యిధ్ధరనెపుడున్

బంధువులు

బంధపుబ్రీతిచే బ్రభువుభాగమునీయకమిన్నకుండగా
సంధినిజేయగోరిజనచక్రధరుండునిద్రాటకట్టగా
బంధురదేహుడాహరియుబంధములూడ్చియువిశ్వరూపుడౌ
యంధుడుగాంచెనచ్చటమహాద్భుతమైవెలుగొం

Saturday, December 29, 2018

అంధుడుకనులారగనె మహాద్భుతమూర్తిన్

బంధురమగుదనరూపము
సంధించగనిండుసభనుజక్రధరుండు
న్బంధంబులువిడివడియా
యంధుడుకనులారగనెమహాద్భుతమూర్తిన్

Friday, December 28, 2018

దొండతీగకు

వేలవేలుగగాయలు విరగగాసె
దొండతీగకు,గాసెను బెండకాయ
లెన్ని యోమాపె రటిలోని చిన్నిమొక్క
లకును రండిజూ డగమీరు లలన లార

Thursday, December 27, 2018

కన్నులనీరునింపుకొని

చెన్నగు వేదమంత్రములు జెవ్వులజేరగవాటియర్ధము
న్మిన్నగుభావమున్నెఱిగిమేదినిదానొకదైవతుల్యుగా
కన్నులనీరునింపుకొనికట్టెనుదాళినివధూగళమ్మున
న్నెన్నగబెండ్లినాబరగునెంతయొముఖ్యమువంశవృధ్ధికిన్

కనుల నీరు నింపి కట్టె దాళి

మొదటి భార్య పోవ మోడుగా మారిన
రవికి మరల పెండ్లి  రమను దోడ
జేయ  నిశ్చ యించి చెప్పగ మూర్తము
కనుల నీరు నింపి కట్టె దాళి

kaaramu

కారముబాయసంబునందుననుగల్పినచోరుచిమిక్కుటమ్మగు
న్గారముగల్పుచోమిగులగారముహెచ్చునుబాయసంబున
న్నేరవమాత్రముందరుగదియ్యెడయారయసామిమీరుసూ
కారమువేయకుండగనుగమ్మగద్రాగుడుతియ్యగుండునే

Wednesday, December 26, 2018

క్ారముబ్ా

కారంబు గానెనుండును
గారము బాయసమునందు కలిపిన ,రుచియౌ
బీరున జక్కెర గలిపిన
వారెవరోచెప్పవింటివాస్తవమెఱుగన్

వనమున

వనమునలభ్యమౌనఖిలభాగ్యసుఖంబులుమానవాళికిన్
ననునదియక్షరాలనిజమార్య!సుఖంబులభించునేగదా
వనముననుండుసంపదయపారమునైదగుబ్రాణవాయువు
న్మనగనుజీవులిధ్ధరనుమానితరీతినినెల్లకాలమున్

Tuesday, December 25, 2018

వనమునన్ లభించుఘనసుఖంబు

వనముజీవముగదబ్రదుకుదెరువునిచ్చు
రోగమడచుమందులుండునునట
సకలసంపదలకుసాకేతమదియౌట
వనమునన్ లభించుఘనసుఖంబు

Monday, December 24, 2018

ఏలుకొనంగ


ఏలుకొనంగరమ్ముమఱియీశుడ!కృష్ణుడ!నిన్నెనమ్మితి
న్బాలనునీరువోలెధరబార్ధుడునీవునునేకమేగదా
బాలశశాంకచంద్రునకుబాల్యపుక్రీడలనారితేరుని
న్మేలుగలుంగజేయగనుమేదురభక్తినిబ్రస్తుతించెదన్

ఏ-సు-క్రీ-స్తు

ఏలుకొనగరావ!యినకులచంద్రుడ!
సురుచిరంబురూపుతరమెపొగడ
క్రీడనీకుజగముక్లీంకారరూపుడ!
స్తుతులనందుకొనుముసోమగర్భ,

Sunday, December 23, 2018

ఆకాశవాణి

అండమందలిజీవరాశికియండలోపముగల్గుచే
దొండతీగకుబెండకాయలు,దుర్లభంబెటులౌనురా
కండకావరమొందువానికికర్కశంబులుగల్గుటౌ
మండనంబురమంచిమాటలుమాటలాడుటయెప్పుడున్

చీమలకేనుగుల్గలిగె

చీమలకేనుగుల్గలిగెజిత్రమదెట్టులొవిప్పిచెప్పుమా
యేమనిజెప్పనోపుదునునీకలికాలపువింతలేగదా
కామునిచర్యలేయరయకంపముగల్లువిధంబునయ్యెడు
న్గోమలి!విప్పుమాయిపుడగూఢమయైనదిదీనియర్ధమున్

చీమలకేనుగులుపుట్టెజిత్రంబగునాాాాా

దోమలకుత్తుకదూరెను
భామలుపదియారువేలమందియుననుచు
న్వేమనచెప్పగనిజమై
చీమలకేనుగులుపుట్టెజిత్రంబగునా

నెలజూపిలతాాాాాాంగి

పొలముననొకధూర్తునిపని
విలవిలలాడించమిగుల,వేదనతోడన్
వలవలయేడ్చెడుదనక
న్నెలజూపిలతాంగికంటనీరునుగార్చెన్

Friday, December 21, 2018

చాాాాాారున్దూరముననుంచసౌఖ్యంబబ్బున్

కిరుకిరుచప్పులతోడను
గురఖావలెదిరుగుచుండిగుట్టుగఱేయిన్
నరకొరగాదోచుదురా
చారున్దూరముననుంచసౌఖ్యంబబ్బున్

ఒకడాయిద్దరముగురానలువురాయీహింపనింకెందరో

అకలంకంబుగసాగుచుండెనుగనేయడ్డంకిలేకుండగా
నొకడాయిద్దరముగురానలువురాయూహింపనింకెందఱో
యికమాశంకరపాశురంబులనునేనిప్డే రచించన్దగున్
నొకనిన్నేనగుటటెంతభాగ్యమయ!నాయోపిన్సదావ్రాతునే

Thursday, December 20, 2018

aakasavani


ఆరయనాకుగాదెలిసెనష్టదరిద్రుడు,దుష్టుడామతా
చారునుదూరముంచిననెసాగునుజీవితమద్భుతంబుగా
వారలుమోసగాండ్రుదమవాక్కులచేతనుమభ్యవెట్టుచున్ 
భూరిగసంపదల్గొనుచుబూర్తివిరాగిగజేతురేసుమా

ఒకడయిద్దరాాాాాయెందరోయూహసేయ

శంకరాభరణమునందుచక్కగాను
బూరణలుసేయుసత్కవిపుంంజమందు
నొకడయిద్దరాయెందఱోయూహసేయ
గణుతికెక్కినవారలుగలరుసుమ్ము

Wednesday, December 19, 2018

కవియొక్కండు

కవియొక్కండునుగానరాడుగదయాకర్నూలు
నన్జూడగన్
నవునా!వారలువెళ్ళిరేమొమఱియాయాదాద్రిసాన్నిధ్యము
న్గవనంబల్లగనొక్కరొకరుగసత్కావ్యములింపొందగా
స్తవనీయంబయిపల్గురిన్మీగులయాశాజ్యోతివెల్గించెసూ

కవియొక్కడు

కవులెందఱొయుండగనట
కవియొక్కడుగానరాడుకర్నూలుపురిన్
నవమానంబుగదలతురు
కవిపుంగవులెల్లదీనికర్నూలుపురిన్

Tuesday, December 18, 2018

బకమెచాాాలుగొనగబ్రాాణములను

మడుగునందయుండుమత్స్యములకునొక్క
బకమెచాలుగొనగబ్రాణములను
కొక్కరాయినకవికూర్మిభోజ్యములట
దైవదత్తమదియదేవయాని!

హనుమద్వసలము

అనలంబొందుచుగాల్చెలంకనటబాహాటంబుగానత్తఱిన్
హనుమద్వాలము,ద్రొక్కెనర్జునుడుదానత్యంతరౌద్రమ్మునన్
వినుమాశంకర!నాదువాక్యమును,నావేశంబునొందన్భళా
యనిలోశాత్రవులందఱిన్దునిమెహాహాకారముల్బల్కగా

Monday, December 17, 2018

హనుమంతునితోక ,ద్రొక్కె నర్జునుఁడలుకన్

అనలమున లంక గాల్చెను
హనుమంతునితోక ,ద్రొక్కె నర్జునుఁడలుకన్
ననిలో శాత్రవ మూకను
గనుమరు గగు నటుల జేసె గాండీవ ముతోన్


Saturday, December 15, 2018

రమణి

ఎంతభక్తురాలవయిననిప్పుడిచట
రమణి! పాపమ్ముగదపాశురములజదువ
నిండుమనమునుగలుగుచునియమముగను
జదువవలయుబాశురములుశ్రధ్ధతోడ

Friday, December 14, 2018

కొట్టెడు

కొట్టకయెప్పుడున్మిగులగూర్మినిజూచుచునెల్లవేళజో
కొట్టెడుభర్తనేసతముగోమలులిష్టపడంగనేర్తురే
యట్టులువారలున్సుఖమునందుచుజీవితంబునున్
రట్టుగజేయకుండగనురమ్యపుమార్గమునొందురేగదా

Monday, December 10, 2018

చెడుగుణమున్నచో

విడువకనెల్లవేళలనుబీదలకంచితరీతిదానమి
చ్చెడుగుణమున్నచోయశముచేకురుధారుణినెల్లభంగులన్
నడగకపోయినప్పటికిహర్షముతోడనునీయగోరుచో
నెడపకయాజనార్దనుడెయిమ్ముగసంపదలెన్నియోయిడున్

Sunday, December 9, 2018

చెడుగుణమున్నపుడెయశముచేకురుజగతిన్

గడగడవణకెడుచలిలో
గడపగడపకునుజనుచునుగరుణతతోడన్
నడుగకయేబీదలకి
చ్చెడుగుణమున్నపుడెయశముచేకుఱుజగతిన్

పవనసుతుండు

పవనసుతుండునాబరగిబావనభక్తినిరామనామము
న్నవిరళధారతోడనునవామృతధారలుచిల్కుచుండగా
బవనసుతుండురామునిసభాస్ధలిబరిహాసమాడెగా
గవనముజేయగానిటులగానిదీచెప్పుటనాయమేయిటన్

Saturday, December 8, 2018

పవనతనయుండురామునిబరిహసించె

నమ్మినటువంటిబంటుసీతమ్మ!మీకు
పవనతనయుండు,రామునిబరిహసించె
యుధ్ధరంగాననడగింతునుక్కునీది
రమ్మువేవేగనిటువైపురామ!యనుచు

Friday, December 7, 2018

ఆకాాాశవాాాాాాణి

అరయుముగద్యపద్యములనద్భుతరీతినివ్రాయవీలు, వ్యా
కరణమునమ్మువారలకు,గలుగుశుభంబులునిశ్చయంబుగన్
గరముననాసదాశివునిగారవమొప్పగబూజజేయుచు
న్నురమునుసాక్షిగామనమునొక్కటిజేయుచుమౌనముండుచో

కరణమ్మునునమ్ముకొనినగలుగుశుభంబుల్

నిరతముభజనలుసేయుచు
బరమాత్మునిగొల్చుకొఱకుభక్తియుతముగ
న్సరళమగుమౌనమనునుప
కరణమ్మునునమ్ముకొనినగలుగుశుభంబుల్

కొట్టెడుపతినిష్టపడరెకోమలులెల్లన్

ఎట్టులజేసిననొవ్వక
కట్టడియున్జేయకెపుడుగరుణతతోడ
న్బట్టపురాణిగగనిజే
కొట్టెడుపతినిష్టపడరెకోమలులెల్లన్
-

Thursday, December 6, 2018

ఎన్నుకొనంగ

దున్ననునెన్నుకుంటకునుదున్నలరూపమునెత్తగావలెన్
మన్నునరామదాసునకుమాన్యతగాగనుదున్నపోతును
న్నెన్నికయౌటకున్గురుతునిచ్చుటవల్లనమాన్యులందఱు
న్నెన్నుకొనంగనొప్పుమనకేలికగానొకదున్నపోతునే
ప్రత్యుత్తరంతొలగించు

ఎన్నుకొనుడుదున్నపోతునేయేలికగన్

qఅన్నయ్యనిన్నుగోరుదు
సన్నయుడారామసత్యసాయివరునకే
మిన్నగునోటునగుర్తును
నెన్నుకొనుడుదున్నపోతునేయేలికగన్

Wednesday, December 5, 2018

ఆగమశాః


ఆగమశాస్త్రమేమిగులయాద్యమమంచునుగీతసారము
న్ద్రాగినమానవోత్తములుధన్యతగాంతురులోకమందున
న్ద్రాగినదాపసోత్తములుదాముగబొందిరిమోక్షమప్పుడు
న్యాగముజేసినన్గలుగుయాగపుధన్యతయెల్లవారికిన్

త్రాగినమానవులుధన్యతన్గాంతురిలన్

తూగుచువాగుచునుందురు
త్రాగినమానవులు,ధన్యతన్గాంతురిలన్
నాగమవిధినర్చించిన
నాగీతాకారునెపుడునధికపుభక్తిన్

పసివాని

పసివానినగవుబోలును
రసమయకావ్యము,జనులవిరక్తులజేయున్
రసహీనకవితలన్నియు
మసనపువైరాగ్యపగిదిమదికిన్బోకన్

Monday, December 3, 2018

రమ్మనుచు

క్షత్రియతిలకా!మామకు
పుత్రా!
 రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
సత్రములోపల జరుగును
మిత్రుడుమనసాంబశివునిపెండ్లియెసుమ్మీ

Sunday, December 2, 2018

జింగల

జింగ్లావ్రాసెనుగధలను
నాంగ్లంబున,వ్రాసెబోతనార్యుండుకృతిన్
నాంగ్లులుమెచ్చగ దానిని
బంగ్లాకవియనువదించెభాగవతమ్మున్

Saturday, December 1, 2018

భయమున

భయమునబాఱదేమదనపల్లెప్రజాళివధానమన్నచో
భయమునుబొందదెన్నటికిబాఱదుచూడుడుమీరలందఱున్
రయమునవచ్చిచేరుదురురండనిబిల్తురురానివారలన్
భయమనుశంకకూడదుసభాస్ధలియంతయునిండువారిచే

వధానమనమదనపల్లెప్రజలకుభయమౌ

మిధిలానగరపుబాలుడు
కధలనుగాదాజెప్పెనిటులగారవమొప్పన్
నవధానవిధినిజెప్పి,య
వధానమనమదనపల్లెప్రజలకుభయమౌ

వినయ్ ---శైలుల వివాహమహోత్సవశుభాకాంక్షలు

వినయ్ ---శైలుల వివాహమహోత్సవశుభాకాంక్షలు
----------?---------------?----------
చిరంజీవి వినయ్ !

తల్లిదండ్రులకేకైకతనయుడుగను
బుట్టినటువంటియోసత్య!పుణ్యపురుష!
సకలసద్గుణరాశి విసత్యమదియ
సందియంబిసుమంతయునిందులేదు

వరుడుపుట్టెపఠానేనివంశమందు
వధువుబుట్టెనువాడ్రేవువంగడమున
సత్యనారాయణాఖ్యగసాయిలతగ
బేర్లువడసిరిముచ్చటగొలిపెసుమ్ము

కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.

అమ్మా !  శైలు!

అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
లరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
అట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల

తనర యీ సత్యయేనీకు తగిన భర్త
యెదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు

మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .