Monday, November 30, 2020

నాకర్తవ్యమెఱుంగజెప్పెదబ్రజానాశమ్మెసంక్షోభమే

 రాకన్ మానను వచ్చిమీకునునికన్ రాబందులౌవారికిన్ 

నాకర్తవ్యమెఱుంగజెప్పెదబ్రజానాశమ్మెసంక్షోభమే
మీకున్ ధైర్యముసాహసంబులిట యేమేరంగబ్రాప్తించునో
నాకున్ జెప్పిన నేనుబొందుదిపుడేనావారిసామీప్యమున్ 

నాకర్తవ్యమ్ము,జనవినాశనమెకదా

 ఆకొన్నవారిబ్రోచుట

నాకర్తవ్యమ్ము,జనవినాశనమెకదా
రాకయకరోనవైరసు
మూకుమ్మడిచావులవియమొదలిడెజగతిన్ 

Sunday, November 29, 2020

తనయుండేతనతమ్ముడయ్యెననగాదప్పౌనయొప్పేయగున్

 తనయుండేతనతమ్ముడయ్యెననగాదప్పౌనయొప్పేయగున్

గనుడో మీరలుసూక్ష్శదర్శనముమీకైతెల్పనౌనిచ్చటన్

తనయుండేతనతమ్ముడౌనునిటులే,దాజేయనుద్వాహమున్

దనదౌభార్యకుచెల్లెలౌవరుసయాతారన్ ముదంబొప్పగా

తనయుడెతనతమ్ముడయ్యెదప్పెట్టులగున్ 

 కనుడీ సూక్ష్మపువిషయము

మనువాడకొడుకు,వరుసకుమఱదలుదనకున్
వినసొంపుగనుండెనుగద
తనయుడెతనతమ్ముడయ్యెదప్పెట్టులగున్ 

Saturday, November 28, 2020

కైలాసమ్మున శేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే

 కైలాసమ్మున శేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే

మేలంబుల్బలుకంగబాడియె సఖా!మీరీవిధంబొప్పగా
కైలాసమ్మునుశేషతల్పమునునాకైలాసనాధున్ నజున్
వాలాయంబుగనేకమౌనటుదగన్భాగమ్ముజేయంగనౌ

కైలాసముననహిపైనకంజుడుపండెన్ 

 మేలములాడగసబబే?

కాలునినానాగరాజు గంజునిగురిచిన్
గాలపు మార్పుల ఫలితము
కైలాసముననహిపైనకంజుడుపండెన్ 

Friday, November 27, 2020

రామునిభక్తులె,వ్వరనగక్రైస్తవులేకదయెంచిచూచినన్


రామునికందఱున్ ననగరామలు,బిల్లలుబెద్దవారలున్
రామునిభక్తులె,వ్వరనగక్రైస్తవులేకదయెంచిచూచినన్
గోమలిమేరిమాతకును,గూరిమిపట్టికిభక్తులందఱున్
నీమముతోడనున్మెలగినెయ్యముగూర్చుచునుండుటొప్పగున్ రా

క్రైస్తవులకెకద్దు రామభక్తి

 భక్తియనగనుండు బ్రతియొక్కరికిని

వీరువారుననగ వేరులేక
దైవమనగ నొక్కడేవసుధకుగద
క్రైస్తవులకెకద్దు రామభక్తి

Thursday, November 26, 2020

తలగడతోగొట్టగనె దైవమహాతలబ్రద్దలయ్యెనే

 తలగడతోగొట్టగనె దైవమహాతలబ్రద్దలయ్యెనే

తలగడతోగొట్టగనుదాపడమౌనె?నదేమిచిత్రమో
కలనునుగంటిరే?చెపుడుకాలపురీతియ?యేమియాయెనో?
తలపునకంతుబట్టగ నుదద్దయునేర్వకయుంటినేసుమా

తలగడతోగొట్టినంతదలయేపగిలెన్

 కలలోజూచితివింతను

నలికులవేణియొకతెదనయార్యునిశిరమున్
గలిగినగోపంబునహో
తలగడతోగొట్టినంతదలయేపగిలెన్


పుస్తకముల్ పఠించిననెపొందెదరెల్లరు,పాపభారమున్ 

 మస్తకమందునన్ మిగుల మాన్యతనొందెడుసంతసంబులన్ 

పుస్తకముల్ పఠించిననెపొందెదరెల్లరు,పాపభారమున్
న్యస్తముజేయుదుష్టులకునాశ్రయమిచ్చిన సత్యమేగదా
పుస్తకపాఠనంబుననెమూర్ఖుడుసైతముసజ్జనుండు నౌ

Wednesday, November 25, 2020

పుస్తకపఠనమ్ము,పాపమునుగల్గించున్ 

 మస్తముబదునుగజేయును

పుస్తకపఠనమ్ము,పాపమునుగల్గించున్
పుస్తకములనపహరణము
పుస్తకమునుదెలియుడార్య!ముఖవాసినిగా

Tuesday, November 24, 2020


బాలుడొకండుగానచట పాటలుబాడుచునుండగాగనెన్

తేలును,ముద్దులాడిసుదతీమణిబల్కెనుతీయతీయగన్

బాలికయంగసౌష్ఠవము,పాటలుబాడెడురీతినిన్ గనిన్

లాలనతోడగౌగిలిని,లాస్యములారగబందిజేయుచున్ 


తేలును,ముద్దాడికాంతతీయగబలికెన్

 మాలతిభయపడె జూడగ

దేలును,ముద్దాడికాంతతీయగబలికెన్

బాలికదరికిన్వడిజని

లాలనగాగౌగిలించి,లాస్యములొలుకన్

Monday, November 23, 2020

కార్తికదీపముం గనులగాంచగభీతిజనించె మెండుగన్ 

 కార్తికదీపముం గనులగాంచగభీతిజనించె మెండుగన్ 

నార్తినిశంభునామమునునాయువుపట్టుగజేయుచున్భువిన్
గార్తికదీపమందుననె గాలునిరూపముజూడగల్గుచో
బూర్తిగమాయమైభయము మోదముగూర్చునుదప్పకుండగన్ 

గార్తికదీపమునుగాంచగా,భయమయ్యెన్

 ఆర్తినిదండముబెట్టితి

గార్తికదీపమునుగాంచగా,భయమయ్యెన్

గార్తికదీపముకాలిన

మూర్తినిజూడంగబెద్దపుండుగనౌటన్ 

Sunday, November 22, 2020

ఎలుకలుమత్తవారణమునీడ్చె గనుండు కలుంగులోనికిన్

 అలుకనుజెందగాసరళ యప్పటికప్పుడు జేయచక్కెరన్

నెలుకలుబాములన్ దనరయేనుగులాదిగబొమ్మలత్తరిన్

లలితమనోహరంబగుట లాస్యముతోడన,సంతసంబునన్

నెలుకలుమత్తవారణమునీడ్చె గనుండు కలుంగులోనికిన్

ఎలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్

 చిలుకలబలుకులవోలెను

బలుకుచుదాదోచుకొనుచుపడతులమనముల్

నెలమినివశపరమగుటను

నెలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్ 

Saturday, November 21, 2020

నాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై

 దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో

నాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై

నాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగా

జీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్ 

నాకసమునందుదోచెశశాంకశతము

పీకలవరకు ద్రాగినవెంకికపుడు

నాకసమునందుదోచెశశాంకశతము

మత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టు

చంద్రుడొక్కడేగదయుండు చదలునందు

Friday, November 20, 2020

వాగ్దేవీపదపూజ జేసినపుడే వర్ధిల్లుగాసంపదల్ 

 వాగ్దేవీపదపూజ జేసినపుడే వర్ధిల్లుగాసంపదల్ 

వాగ్ధారంబునుగల్గునిక్కముగ దాబ్రాపున్సమీక్షించుచో
వాగ్దేవీపదమాశ్రయించినగడున్ బ్రాప్తించునైశ్వర్యముల్
వాగ్దేవీ!ననుగావుమా దయనుసాఫల్యంబునొందంగగా

వాగ్దేవీపూజజేయవర్ధిలుసిరుల్ 

 వాగ్దేవియనగశారద

వాగ్దేవీపూజజేయవర్ధిలుసిరుల్
వాగ్దత్తమునెరవేర్చును
వాగ్దేవియెయిచ్చుమనకువాక్సంపదలన్ 

Thursday, November 19, 2020

శంకరుడేల మాకిపుడు శంతియెకావలె నెవ్విధిన్ గనన్ 

 శంకరుడేల మాకిపుడు శంతియెకావలె నెవ్విధిన్ గనన్ 

వంకరమాటలెందులకు భవ్యుడులేకనుశాంతియుండునే?
శంకరునామమున్ లలిత! సన్మతితోడను నాలపించుచో
శంకలులేనిసంపదలు,సౌఖ్యములిచ్చును దప్పకుండగన్ 

శంకరుండువలదు శాంతివలయు

 శంకరుండువలదు శాంతివలయునట

పిచ్చివానిపలుకు లిచ్చగించ
రాదు,శంకరుండె రత్నసువునకుదై
వమని,యరయుమమ్మ పార్వతమ్మ!

ప్రాంణాపాయముదెచ్చె బావురముశర్వా!యేమికానున్నదో

 దాణాగైకొనడేగపావురమునే వెంటాడబోవంగగా

బ్రాణాపాయముదప్పిబోవుటకునైరక్షించుడంచున్ శిబిన్
దీనాలాపముజేయపావురమయో ధైర్యంబుగోల్పోవగా
ప్రాంణాపాయముదెచ్చె బావురముశర్వా!యేమికానున్నదో

Wednesday, November 18, 2020

ప్రాణగండముదెచ్చెనుపావురమ్ము

 డేగబారినిపడినట్టి కూకియపుడు

దానశీలియౌయాశిబిదరికిజేరి
రక్షగోరగమాఃసపురవలుగోయ
ప్రాణగండముదెచ్చెనుపావురమ్ము

Tuesday, November 17, 2020

టపటపధన్ ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతున్

 కుపితమనస్కుడెప్పుడునుగోపముతోడనబళ్ళుకొర్కగా

టపటపధన్ ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతున్

టపటపయంచుబేలెడుపటాసునువోలెనురావమొందుచున్

నెపుడునుమంచికాదుగదయీవిధమైనదురావమీయగా

టపటపధన్ ధన్ చిటపటఢంఢంఢడతుస్

 టపటపశబ్దముగలుగుచు

విపరీతపుసద్దుతోడభీతినిగలుగన్

చపలతగాల్చగవినబడె

టపటపధన్ ధన్ చిటపటఢంఢంఢడతుస్ 

 *నాగుల చవితి* https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు,వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దొషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా :- ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం : పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. . పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

Monday, November 16, 2020

నన్నయటంచుబిల్వగనెయయ్యొభయంబునుబొందిపాఱితిన్ 

 మిన్నగనిష్టమౌ సఖికిమెండగుబ్రేమనుభూరిదెల్పగా

నన్నయటంచుబిల్వగనెయయ్యొభయంబునుబొందిపాఱితిన్
ఎన్నడునిట్లుగాదలప యిష్టములేదనిచెప్పగాననెన్
బన్నముజెందబోకుమ,వివాహముజర్గునునాకుమాపునన్

అన్నాయనుపిలుపునువినియడలితినయ్యో

 ఎన్నకహృదయము భ్రమతను

చిన్నగనేజేరిదరికి చిలిపిగదనకున్

మిన్నగుబ్రేమనుదెలుపగ

అన్నాయనుపిలుపునువినియడలితినయ్యో

Sunday, November 15, 2020

ననుదయమాలిచంపదగునాతగవాపగబూనిమిత్రమా!

 వినుమురమానవుండ!యిదివేయివిధంబులవృత్తులీభువిన్ 

మనుగడయందుభాసిలగమమ్ములయేలనొ?నొప్పిజేయుచున్
ననుదయమాలిచంపదగునాతగవాపగబూనిమిత్రమా!
యనుచునువేడెదోమయటనారడినొందుచుశోకతప్తయై

నన్నుదయమాలిచంపుటన్యాయమగునె

 చెట్టుచాటున నిలబడిబిట్టుగాను

నన్నుదయమాలిచంపుటన్యాయమగునె

ననుచువాలివేడుకొనెనునజునిపౌత్రు

యుద్ధరంగమునందునబద్ధుడౌట

మతసామరస్యం--సామాజికాంశం. ------------------------?

 మతసామరస్యం--సామాజికాంశం. ------------------------??------------------ మతములెన్నైనా జాతియొక్కటే మతములలోనిసారాంశమునూ ఒకటే అన్నిమతాలలోను ఉన్నదిమానవత్వముఒక్కటే ఏసు అల్లా సాయి అందరూ దైవాంశసంభూతులే మతాలన్ని ఒక్కటైతేనే మనుగడ బాగుంటుంది విభిన్నమతాలనేభావన రానీయకూడదుమన మనస్సులకు అదే అసూయాద్వేషాలకు దారితీస్తుంది మతసామరస్యమే కొండంతబలం మంచి-చెడు రెండేమతాలు,అవితెలిసినమానవత్వమేమనమతం మతసామరస్యం అనేదిఒకసామాజికాంశముగాపరిగణలోకితీసుకోవాలి ఓర్పు,శాంతి,దయ,ఉపకృతులుమతసామరస్యానికి ప్రతీకలు కొట్లాటలు,ఛీత్కారాలు,అసహనాలు,ద్వేషాలులేకపోవడమే మతసామరస్యం మతంకారణంగా మారణహోమంజరుగకూడదు మతాన్నిదైవంగాపూజించి ఆరాధించాలి భిన్నంలోఏకాభిప్రాయమేమతం మతసామరస్యానికై మనజీవనవిధానంలోమార్పుతెచ్చుకోవాలి హిందూ,జైన,ఇస్లాం,సిక్కు,క్రిష్టియను,బౌద్ధమొదలగు ప్రసిద్ధమతాలకలగలుపేఈమనభారతదేశం మతంమార్పిడులుకలిగినా,సోదరభావంతోనేసహజీవనంసాగించడంమనదేశవైశిష్ట్యం ఈమతసామరస్యానికిఆదర్శపురుషుడుగా మనమాజీప్రెసిడెంటుఅబ్దుల్ కలాంగారుఅగ్రగణ్యులు మతసామరస్యాన్నిసామాజికాంశముగాభావించి దేశాభివృద్ధికిమనవంతుబాధ్యతను నిర్వర్తించాలి అప్పుడేదేశమాతముద్దుబిడ్డగాగుర్తింపబడతాము మతాభిమానంతోఇతరమతాలఔన్నత్యానికి భంగంకలుగజేయరాదు మతాలసాధికారతపెంపొందేలామనవంతు కృషిచేయాలి శాంతియుతసహజీవనమే మతాలపరమావధిగాభావించి అందుకుతగినట్లుమనంమెలగాలి చివరిగామానవత్వమేమనమతంగాభావించిపరస్పరావగాహనతోమెలగుటమనకర్తవ్యము జైహింద్ ఈకవిత ,ఈకవితాసంకలనముకొఱకేవ్రాయబడినదని లోగడ యెక్కడవ్రాయుటగాని,అచ్చువేయుటగానిజరుగలేదనిధృవీకరించడమైనది. రచన:పోచిరాజుసుబ్బారావు హైదరాబాదు.mobileno.9866283384

Saturday, November 14, 2020

దీపములెల్లవెల్గినవి దీప్తియెసుంతయుగానరాదిటన్ 

 పాపముపెచ్చుపెర్గుటన భారతమంతయుశోకతప్తయై

పాపపురోగమియ్యదియభావితరాలకుసోకుచుండగా
దాపముజెందుచున్భువినిదాళగలేకయుండనౌ
దీపములెల్లవెల్గినవి దీప్తియెసుంతయుగానరాదిటన్ 

దీపములువెల్గెనన్నియు దీప్తిలేదు

 నిన్నమధ్యాహ్న సమయాన గన్నులలర

దీపములువెల్గెనన్నియు దీప్తిలేదు

పెద్దతేజస్సుగలిగినబితువువలన

నల్పములుగదయన్నియుయర్కుముందు

నరకునిజంపెసీతసురనాధుడుదైత్యులువానరుల్ గనన్

 అరకొరతెల్వియుండియునునాద్యుడువోలెనుసంచరించునా

విరసునిమాటలిట్లుగనువెర్రిదనంబునుజూపుజూడుడీ
నరకునిజంపెసీతసురనాధుడుదైత్యులువానరుల్ గనన్
నరకునిజంపెసత్యయనినమ్ముడుగాదనిసీతయెప్పుడున్ 

Friday, November 13, 2020

నరకునిజంపె,సీతవానరులుగనగ

 సాయుధయయయికోపానసత్యభామ

నరకునిజంపె,సీతవానరులుగనగ

జేరెహస్తిపురికివెనుకనరాముసేనరాగ

సుఖమయంబాయెరామునిసుచరితంబు

Thursday, November 12, 2020

త్రామునిమానసంబు గడురంజిలెమేనకగాంచినంతనే

 

ప్రేమనుజూపెడున్వలువ పేర్మినిదాధరియించియుండసు

త్రామునిమానసంబు గడురంజిలెమేనకగాంచినంతనే

భామలవేషధారణలుభావితరాలకుచేటుజేయుచో

బ్రేమనుజెప్పగాదగునురెట్టునుధారణజేయుమాయనిన్ 

త్రామునియెదమేనకగనిరంజిల్లెగడున్

 కామునిబ్రేరణమునసు

త్రామునియెదమేనకగనిరంజిల్లెగడున్

భామలజోలికినేగక

నీమముతోనుండదగును నిశ్చలబుద్ధిన్ 

Tuesday, November 10, 2020

భయపడిఋష్యమూకమునవాలియెదాగెనుప్రాణరక్షకై

 భయపడిఋష్యమూకమునవాలియెదాగెనుప్రాణరక్షకై

భయపడివాలికాదుగదభానునిసూతుడుసౌరియేసుమా
నయమగురీతినేనతడుపోరునుసల్పగవాలితోదగన్
జయమునుగల్గెరాముడటసంగరమొప్పుగజేయుటన్భళా

ఋష్యమూకమ్మునకువాలి,యేగిదాగె ఋష్యశృంగమునకుదనసేమమరసి సౌరిపరివారసహితుడైయార్యయపుడు

 శాపకారణముననేగడెపుడునద్రి

ఋష్యమూకమ్మునకువాలి,యేగిదాగె
ఋష్యశృంగమునకుదనసేమమరసి
సౌరిపరివారసహితుడైయార్యయపుడు

పలుకరుసత్యమెన్నడును బాడిదలంపరున్యాయవాదులే

 పలుకరుసత్యమెన్నడును బాడిదలంపరున్యాయవాదులే

పలికిరిసత్యభాషణము,బాడినిజూడకయార్జనంబయే
విలువనునిచ్చుమార్గమును,బేర్మినిజూపుటకారణంబునన్
బలుకరుసత్యమెన్నడునుపాపపువాదనజేయుచుందురే

Monday, November 9, 2020

బలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్ 

 పలుకుట సబబే యిటులుగ

బలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్
నిలలోనుందురుకొందరు
పలువురునింగురిచిపలుకభావ్యమె మనకున్

Sunday, November 8, 2020

భౌతికశాస్త్రముంజదివిపద్యకవిత్వమువ్రాసెమేలుగన్ 

 

భౌతికశాస్త్రముంజదివిపద్యకవిత్వమువ్రాసెమేలుగన్
నాతడయెవ్వరాయనగనార్యుడుగుర్రపువంశధీరుడే
కైతలువ్రాయగానగునుకబ్బముతల్లిదయారసంబునన్
భౌతికశాస్త్రముంజదివిపద్యమువ్రాయుటగొప్పయేగదా


భౌతికశాస్త్రమ్ముచదివివ్రాసెనుకవితల్

 ప్రీతినిపద్యమునెడలను

గౌతుకముగనేర్చుకొనియుగుముదముతోడన్

జేతములలరగగ్రహపతి

భౌతికశాస్త్రమ్ముచదివివ్రాసెనుకవితల్

Saturday, November 7, 2020

నిద్రాసక్తుడవైననీకుజయమౌ? నిక్కంబిదేనమ్ముమా

 భద్రా!యేమియుజేయకుంటివిగయేపాత్రంబుజూడంగనౌ

నిద్రాసక్తుడవైననీకుజయమౌ? నిక్కంబిదేనమ్ముమా
భద్రంబయ్యదిలేనిచోటునసిరుల్ఋబాఱంగనీనోపునే?
ఛిద్రంబౌనుగజీవితమ్ములుభువిన్ ఛీత్కారమొందగగా

నిద్రాసక్తుండవైననీకుజయమ్మౌ?

 భద్రా!యిట్టులనుండిన

ఛిద్రంబగునీదుబ్రదుకుచింతలతోడన్

భద్రంబుగమసలుగొనక

నిద్రాసక్తుండవైననీకుజయమ్మౌ?

సత్యధర్మేశ్వరాాాా

రాకాచంద్రునిఁ గాచి నట్టి శివునిన్ రాకేందుమౌళిన్ సతం బేకాంతంబుగ సేవఁ జేయ నిడు నా యీశుండు భాగ్యమ్ములన్ నాకుం జెప్పిరి పండితోత్తములు గానం బ్రీతి సేవింతు ని న్నో కామేశ్వర! రక్షణంబు నిడుమా యో సత్యధర్మేశ్వరాాాా

Friday, November 6, 2020

రక్షకుడంచుజేరగనెప్రాణముదీసెదయావిదూరుడై

 అక్షయనామకంబలరుయౌవనకాంతయనొక్కవేకువన్ 

రక్షణగోరిజేరగనురక్షణసేవకనాలయంబునున్
రక్షణసేవకుండొకడురాక్షసరీతినిబాడుచేయగా
రక్షకుడంచుజేరగనెప్రాణముదీసెదయావిదూరుడై

గాజులుగల్లుగల్లన!గాండివమెత్తెధనంజయుండనిన్ 

 ఆజినిసత్యభామనరకాసురుజంపెనుగోపచిత్తయై

గాజులుగల్లుగల్లన!గాండివమెత్తెధనంజయుండనిన్
వాజులుగూడినట్టిబలుపారెడుదేరునువాహనంబునై
తేజమునొప్పగామిగులదీవ్రపుగార్యమునొందగోరియే

Thursday, November 5, 2020

గాజులుగల్లనగ,నరుడుగాండివమెత్తెన్ 

 శ్రీజయె నాట్యము జేసెను

గాజులుగల్లనగ,నరుడుగాండివమెత్తెన్
నాజినిరిపులనుదునుమను
రాజులకర్తవ్యమదియరంజితవదనా!

శ్రవణానందముగాఖరమ్ముసభలోరాగమ్ముదీసెన్ సఖా!

 కవియేవ్రాసినపాటలన్దనర దాగానంబుజేయంగగా

నవహేళంబునుజేయుచున్ నొకడుయాహాహామదీయంబిదిన్
రవముల్జేయుచుబాడగావినుమయాావంబుమూలంబునన్
శ్రవణానందముగాఖరమ్ముసభలోరాగమ్ముదీసెన్ సఖా!

Tuesday, November 3, 2020

కుకవులువారలెల్ల,మనకున్ గురుదేవులెపూజ్యులేకదా

 నికరముగాని పద్ధతినినీచపుభావనతోడవ్రాయుచో

కుకవులువారలెల్ల,మనకున్ గురుదేవులెపూజ్యులేకదా
సకలముశాస్త్రరీతినిరసామయకావ్యమువ్రాయునందరున్
ముకుళితహస్తముందనరమోదముతోడనవందనంబులౌ


కుకవులెల్లమనకుగురువులెకద

 కుకవులెల్లమనకుగురువులెకదయార్య!

కుకవులనగనెవరుసుకవులెవరొ

మొదటతెలిసికొనుచుపూజ్యులగునెడల

చూడవచ్చుగురువుచోటునందు

Monday, November 2, 2020

అతివలుమెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే

 అతివలుమెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే

మతిగలవారలెవ్వరునుమాటలనిట్లుగబల్కరెప్పుడున్

నతివలపండుగేయిదినిహారిక!నేర్వుమతప్పకుండగన్

బతులకుమంచిగల్గుటకుభామలుసేతురుగాదెనోములన్

నతివలెల్లరురోసెదరట్లతదియ

 తెల్లవారంగముందుగాచల్లయట్ల

నమ్మవారికినైవేద్యమారగింప
జేసియుయ్యాలలూగుచుచిన్మనమున
సంతసంబునునొందుచుజరుపుకొనగ
నతివలెల్లరురోసెదరట్లతదియ
యనుటపాడిగదోచెనే యార్య!మీకు

మట్టినిబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్

 పుట్టనుద్రవ్వగానగముబుస్సలుగొట్టుచుబారిపోవగా

మట్టినిబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్

గట్టడిజేయగావలెనుగాంతలుబిల్లలుబెద్దవారలన్

బుట్టలయొద్దకున్ నెపుడుబోవకజేయుడునెట్టివేళలన్

Sunday, November 1, 2020

మట్టిబోసెమరదిమామమురిసె





వానపడుటవలనబాడిబాడిగమారి
రొచ్చురొచ్చునగుచుగచ్చయయ్యి
యింటిముందుగుంతకంటికగుబడగ
మట్టిబోసెమరదిమామమురిసె

స్త్రీలకుమ్రొక్కినన్ ధనముశ్రేయముగల్గిసుఖాంతురెల్లరున్

 వీలగునంతకాలమునువేదనలన్నియుద్రోసిబుచ్చుచున్ 

నాలయకారురూపమునునౌదలదాల్చుచునెల్లవేళలన్
చాలినభక్తితోడభవుసాదరమొప్పగబూజజేయునా
స్త్రీలకుమ్రొక్కినన్ ధనముశ్రేయముగల్గిసుఖాంతురెల్లరున్