Saturday, November 22, 2025

Sankatsm

[13/11, 11:25 am] subbarao pochiraju: లేవు సోదర  ఇకమాకు   లేవు నీవు 
కానరానట్టి దూరంబు  గడచినావు 
విడిచి యిచ్చట  మమ్ముల వెళ్ళ దగునె 
రమ్ము  వేగమె మముజూడ యిమ్ముగాను
[13/11, 12:52 pm] subbarao pochiraju: క్రొత్త భవనాలు కొంటివి  కోటి తోడ 
నుండ భాగ్యమ్ము  లేదాయె నొక్క ఐదు 
రోజు లైననకటహో త ఱు ముచు వచ్చి
మృత్యు పాశము  చుట్టెను మెడకు నీకు
[13/11, 2:20 pm] subbarao pochiraju: అమ్మ నాన్ననక్కయ్యలం తె గాక
బావ మువ్వురు  మము వీడి  దివము జేరె 
వారి మార్గమ్ము  నీవును బడ సి తీవ 
దై వ నిర్ణయ మ య్య ది తప్పదు గద
[15/11, 9:03 am] subbarao pochiraju: సమయ పాలన త త్ప ర! సత్వ గు ణు డ! 
దివికి  నేగిన నినుఁజూచి దేవగురువు 
సంత సంబున  నిచ్చును సేమ ము లను
సంది యం బిసు మంతయునిందు లేదు
[15/11, 9:05 am] subbarao pochiraju: సకల శుభములు గలిగించు శంకరుండు 
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాల  ప్రాప్తినిబడయు నట్లు 
చేయు గావుత య
య ని స ము చిత్స్వ రూప!
[15/11, 8:01 pm] subbarao pochiraju: నీ వు లేనట్టి  లోటును  మేము దీ ర్ప
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమ శ్రద్ధాంజ లి నం దు కొనుమ
[17/11, 9:49 am] subbarao pochiraju: ఏమి  పాపము జేసితి  మింత లోన
విడిచి పోతివి మమ్ముల విడిచి యిచట
నీదు రాకకు మేమిట యెదురు చూతు
మయ్య !రాగదే వేవేగ యర య మమ్ము