Saturday, January 30, 2010

అవధానము

రావూరి వంశ మండన !
కోవూ రున బుట్టి నీవు కోరిక లలరన్
ఏవూ రి వాడవైనను
మావూ రికి రండి స్వామి! మన్నన లొందన్.

అవధానము లన్నిట నీ
య వ దాన మె గొప్ప దండ్రు ఆర్యా రాధ్యా !
అవధానం బొ న రిం పుము
అవధానపు చక్రవర్తి ఆశువు గాగన్



ధన్యుడు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వా మీ !

Friday, January 29, 2010

డొంకరాయి

ఇల డొంకరాయి పురమున
వెలసిన యా రామ చంద్రు వేడుక మీ రన్
కొలిచిన నిచ్చును శుభములు
కొలువగ వే రండు మీరు కొలుతును నేనున్ .

అప్పనపల్లి

అప్పనపల్లి పురంబున
నొప్పుగ వేంచేసి నట్టియప్పరమాత్మున్
మెప్పు తొ కొలిచిన వారికి
నప్పతియే తప్పకిచ్చు నాయువు సిరులున్ .

మంగళము

మంగళ యోగి హ్రుద యాబ్జ మందిరమునకు
మంగళము సచ్చిదా నంద మయున కెపుడు
మంగళము చిత్క లా పూ ర్ణ మహిత కాంతి
మండనునకు సదా జయ మంగళంబు .

జయ శ్రీ రమణ జయ భవ హరణ
జయ జయ సన్ముని సేవిత చరణ
జ్ఞానామృతమున దీనుల దనుప గ
పూ ని నరాకృతి బొందిన పరుడవు
శాంతి భూ ములను చరియించేడు నిను
చేరి భజించెద చిన్మయ రమన .
పాద కమల మధు పానము సేయుచు
పాడేద మదుపము భంగిని రమణము
తను వాగ్మనముల నిను సేవింపుచు
ఘనతర శాంతిని గనియె ద రమణ
సుందర నందన సూ రి జనావన
వందన శతముల నందవె రమణ
కై మోడ్చుచు నా గతి నీ వను నా
గాంబను కరుణ తొ నరయవే రమణ
జయ సుఖ రూపా జయ పర మేశా
జయ జయ అరు ణాచల శ్రీ రమణ !

Thursday, January 28, 2010

గురు వర రమణ !

శాంతిం నేతుం మునింద్రా న్నిజ పద శర ణా దక్షి ణా మూర్తి రూపో
మౌనం భావం ప్రది స్య స్వ కమ థ జగత శ్చాపి జీ వా భి ద స్య
ఉక్త్వా తాదా త్మ్య భావం గురు నుతి వచసా శంకరా చార్య రూ పో
ప్యా స్తే శో ణా ద్రి మూలో గురువర ర మ ణో యః పరస్తం నమామి .

తా .జీ వ రూ ప మున నున్న జగత్తుకు త న మౌనమును జూ పి తన పాదముల నా శ్ర యించిన మునులకు
శాంతిని కలిగించుటకు దక్షి ణా మూ ర్తి రూ పమున నున్న వాడును ,గురు స్తోత్రముచే ఐ క్య భా వమును
శంకరా చార్య రూ పమున నున్న వాడును ,అరు ణా చల మూ లమున నున్న పరమ గురు వర్యుడగు
రమ ణు ని నమస్క రింతును.

Sunday, January 24, 2010

భీష్మునకు తర్ప ణము

వైయ్యాఘ్ర పద్య గోత్రాయ
సాం కృత్య ప్రవరాయచ
గంగా పుత్రాయ భీ ష్మాయ
ఆ జన్మ బ్రహ్మ చారి ణే
అ పుత్రాయ దదా మ్యే తత్
ఉదకం భీష్మ వర్మ ణే.