Sunday, October 16, 2011

యాపిలు తోటలు

15-10-౨౦౧౧ తేది శనివారము ఉదయము ౧౦ గంటలకు బయలుదేరి హార్వర్డ్
అను పల్లెటూరికి ౧౨ గంటలకు వెళ్ళాము .అక్కడ యాపిలు తోటలు చూడ ముచ్చటగా
ఉన్నవి.అక్కడ ఉన్న సిబ్బంది మమ్ములను ట్రాక్టరు మీద తోటల దగ్గరకు తీసుకొని
వెళ్ళిరి . మేము ట్రాక్టరు దిగి తోటలోనికి వెళ్లి చెట్ల నుండి యాపిలు కాయలు
కోసుకొని తిన్నన్నితిని వాళ్ళు అమ్మిన కవరు నిండా వేసుకొని తిరిగి వచ్చితిమి .
అక్కడ పిల్లలు ట్రైను , గుర్రాల మీద తిరగడము లాంటి కొన్ని ఆటలలో పాల్గొని
ఉల్లాసముగా కనిపించిరి . తరువాత మేము పట్టుకొని వెళ్ళిన లంచిని తిని
తిరుగు ప్రయాణము అయి దారి లో లేక్ జెనేవా చూసి ,తర్వాత ఒక హోటలు కి
వెళ్లి కాఫీ త్రాగి ఇంటికి బయలుదేరి సాయంత్రము గంటలకు వచ్చితిమి .

Friday, October 7, 2011

గీత

గీతా పారాయణమును
ప్రత్యేకందావు లందు ప్రత్యేకముగా
ప్రతి దినమును నొనరించిన
గీతా నాధుండు నుదుట గీతను మార్చున్ .

Thursday, October 6, 2011

అవధానము

అవధానము లన్నిట నీ
యవధాన మె గొప్ప దండ్రు ఆర్యారాధ్యా !
అవధానంబొన రింపుము
రావూ రీ వేంకటేశ ! రసికుల సభలోన్ .

కలకాలము

కాలము విలువను నెరుగుము
కాలము నిల సాగుచుండు కాలుని వలనన్
కాలమును వమ్ము సేయక
కలకాలము హాయి గుండు పిల్లల తోడన్

Tuesday, October 4, 2011

సెవెన్ వండర్స్ ఆఫ్ హైదరాబాద్

బిర్లా మందిర్
చార్మినార్
గోల్కొండ ఫోర్ట్
హుస్సేన్ సాగర్
రామోజీ ఫిలిం సిటి
సాలార్ జంగ్ మ్యూజియం
శిల్పారామం

Sunday, October 2, 2011

గృహస్థ ధర్మములు

దేవతార్చన
మాతా పిత సేవ
మానవ సేవ
అతిధి సేవ
పశు పక్ష్యాదులను ,వృక్షములను కాపాడడము
స్వాధ్యాయము
శాస్త్రములు ,పురాణములు చదవడము
ఋషులకు కృతజ్ఞత చూపడము

Saturday, October 1, 2011

అష్ట మహిషులు

రుక్మిణి
సత్యభామ
జాంబవతి
కాళింది
మిత్ర వృంద
నాగ్నజితి