Tuesday, July 3, 2012

గురు పూ ర్ణిమ వచ్చు నెపుడు గురు వారమునన్


అరయగ  నాషాఢంబున
గురు పూ ర్ణిమ   వచ్చు  నెపుడు, గురు వారమునన్
గరిమతొ  సాయిని  గొలిచిన
వరములనే గాక యిచ్చు  వైభవము లునున్

Monday, July 2, 2012

పద్య రచన -

సంస్కృతం బును  జక్కగ  సంస్క రించి
వివిధ  కావ్యముల్  విర చించి  యవని  లోన 
పేరు  ప్రఖ్యాతు  లొం దిన   మేరు  శిఖర !
వంద వంద  నంబులు  నీ కు  వ్యాస  మౌని 

గురు పత్నిని గోరు వా డె గుణ వంతు డ గు న్

నరకము  లోనికి  బోవును
గురు  పత్నిని  గోరు వా డె,  గుణ  వంతు  డ గు న్
నిరతము  మంచిని  జేసిన
నర యం గా  శివుని  గొల్వ  యబ్బును  శుభముల్ 

Sunday, July 1, 2012

కోటప్ప గిరి

కాకులు  చేరని  గిరిపై 
చీ  కాకులు  లేక  యుండ  చిన్మయ  రూపున్ 
నా  కోటప్ప గి రీ శు ని 
నా  కాలము  సేవ  జేయ నాశ లు  దీ ర్చున్ 

బాల్య దశ యన్న బహు మూ ల్య ఫలము గాదె !

బరువు  బాధ్యత లేవియు  బట్ట  వె పుడు
చదువు  మీ దన  శ్రద్ధను  జక్క  నిలిపి
మొదటి  శ్రేణిన  నుత్తీ ర్ణ   మౌట ను మ ఱి
బాల్య  దశ యన్న బహు మూ ల్య  ఫలము  గాదె !

పద్య రచన -39

ఏమి  పాపము  చేసిరి  యే మొ  కాని 
చదువ  వలసిన  సమయాన  సాగి  పనికి 
మోయు  చుండిరి  రాళ్ళను  మోయ లేక 
బ్రతుకు  సాగింతు  రక్కట ! భార ముగను 

శ స్త్ర సన్యాసమే మేలు క్షత్రి యులకు

శత్రు  సంహార మేనాడు  జరుగ దేని
శ స్త్ర  సన్యాసమే  మేలు,  క్షత్రి యులకు
ప్రజల  రక్షణ  బాధ్యత   వ ర లు  చుండు
రాజు  సేతను  బట్టియె   రాజ్య  మలరు .